ec serious on pinnelli

పిన్నెల్లి పిల్లి మీద అనర్హత వేటు?

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంత దుర్మార్గ, దుష్ట, నీచ, నికృష్ణ, కమీనేనా అని ఎన్నికల కమిషన్ అధికారులు నోళ్ళు తెరిచారట. ఇలా నోళ్ళు తెరిచింది ఎప్పుడూ.... పోలింగ్ బూత్‌లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు, వీవీ ప్యాట్లు నేలకేసి కొట్టడం, పోలింగ్ బూత్‌ల దగ్గర మహిళల మీద విరుచుకుపడటం.. ఇలాంటి వీడియో ఆధారాలు చూశాకగానీ ఈసీకి అసలు విషయం అర్థం కాలేదు. కెమెరాల దయవల్ల ఈ వీడియోలు ఉన్నాయిగానీ, లేకపోతే ఎన్నికల కమిషన్ కూడా పిన్నెల్లి పిల్లి కాదు పులి అని అనుకుంటూ వుండేదేమో. పిన్నెల్లి పోలింగ్ స్టేషన్లో దూరి అంత రచ్చ చేస్తుంటే గాడిదల్లాగా చూస్తూ నిల్చున్న పోలీసులు, పిన్నెల్లి రాగానే దణ్ణాలు పెట్టేసిన అధికారులు, జరిగిన తతంగాన్నంతా వీడియో తీసిన ఉద్యోగులు ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ని చెప్పాలి కదా.. అలా చెప్పలేదు. పిన్నెల్లి టైమ్ బాగాలేక సీసీ టీవీ ఫుటేజ్ చూడాలని అనుకోవడం వల్ల పిన్నెల్లి దారుణాలు బయటపడ్డాయి. పిన్నెల్లి విషయంలో ఈసీ చాలా సీరియస్‌గా వుందన్న వార్తలు వస్తున్నాయి. అరెస్టుకు ఆదేశాలు ఇవ్వబోతున్నట్టుగా సమాచారం వస్తోంది. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, పిన్నెల్లిని ఎమ్మెల్యే పదవికి, ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించే అవకాశాలను కూడా ఈసీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసీ ఏ నిర్ణయమైనా లాగకుండా త్వరగా తీసుకుంటే మంచిది.

will ec open eyes after seeing pinnely anarchy

పిన్నెల్లి విధ్వంసం చూసిన తరువాతా ఈసీ కళ్లు తెరవదా?

మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్రిమినల్ కేసు నమోదైంది. పోలింగ్ సందర్భంగా ఆయన ఒక పోలింగ్ బూత్ లో ఈవీఎమ్ ధ్వంసం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయిన తరువాత మాత్రమే ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. పూర్తి స్థాయి వెబ్ కాస్టింగ్ అమలు చేసిన నియోజకవర్గాలలో పిన్నెల్లి పోటీ చేసిన మాచర్ల నియోజకవర్గం కూడా ఒకటి. అయినా ఆయన ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై పోలింగ్ ముగిసిన పది రోజులకు గానీ, అదీ కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సిట్ నివేదిక తరువాత మాత్రమే ఆయనపై కేసు బుక్కైంది. చర్యలు తీసుకోవాలన్న ఈసీ ఆదేశాలపై పోలీసులు ఎలా ముందుకు కదులుతారో చూడాలి. హౌస్ అరెస్టు నుంచి సునాయాసంగా పరారైపోయిన పిన్నెళ్లి.. హైదరాబాద్ లో ఉన్నట్లు తెలియసేసినా పోలీసులు ఆయనను తిరిగి తీసుకువచ్చి హౌస్ అరెస్టులో ఉంచే దిశగా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు.  మాచర్లలో పోలీసులు, అధికారయంత్రాంగం అంతగా  పిన్నెల్లితో అంటకాగి విధ్వంసం ద్వారా ఓటింగ్ ప్రక్రియకు ఆటంకాలు కలిగించి, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునే పరిస్థితి లేకుండా చేయడానికి ఎంత చేయాలో అంత చేసినా.. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే.. నియోజకవర్గంలో ఆయన ఎంత వ్యతిరేకత మూటగట్టుకున్నారో ఇట్టే అర్ధం అవుతుంది.   అయినా పోలింగ్ బూత్ లోకి చొరబడి, అక్కడి సిబ్బందిని బెదరించి ఈవీఎంను ధ్వంసం చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఈసీ ఇప్పటి వరకూ చర్య ఎందుకు తీసుకోలేదో అర్ధం కాదు. వాస్తవానికి ఆయనపై అనర్హత వేటు వేయాల్సి ఉంటుంది. తమ వైఫల్యానికి సిగ్గుపడి పోలీసు వ్యవస్థ సిగ్గుతో తలవంచుకోవాలి.    ఇక్కడ ఈసీ వైఫల్యాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ కు ముందు నుంచీ కూడా విపక్ష కూటమి నేతలు ఏపీలో శాంతి భద్రతల గురించి ఫిర్యాదులు చేసినప్పటికీ తక్షణ  చర్యలు తీసుకోకుండా పోలింగ్ తేదీకి కొద్ది రోజుల ముందు ఇన్  చార్జి డీజీపీని బదిలీ చేసి ఈసీ సాధించింది శూన్యమని పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం ఘటనతో తేలిపోయింది. ఇప్పటికీ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను సైతం బుట్టదాఖలు చేసిన సీఎస్పై చర్యలే లేవు. పోలింగ్ రోజున భారీ హింస ఒకెత్తయితే.. కౌంటింగ్ రోజు అంతకు మించి హింస ప్రజ్వరిల్లే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా భద్రత పెంపునకు, అదనపు బలగాల మోహరింపునకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే సీఎస్ ను మార్చకుండా భద్రతా ఏర్పాట్లు చేసినా పెద్దగా ఫలితం ఉండదని, కొత్త డీజీపీ వచ్చిన తరువాత కూడా అధికార పార్టీకి అనుకూలంగా పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరు చూసిన ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. మరి ఈ విషయంలో ఈసీ ఎందుకు స్పందించడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది.  

yammineni defeat confirm says ycp cadre

తమ్మినేని తట్టాబుట్టా సర్దేసుకోవలసిందేనా?

తమ్మినేని సీతారాం.. జగన్ హయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు. స్పీకర్ గా ఆయన వ్యవహారశైలి ఎంత వివాదాస్పందంగా ఉందో అందరికీ తెలిసిందే. అసెంబ్లీ లోపలా, బయటా కూడా ఆయన తీరు, భాష అనుచితంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే ఆయన విద్యార్హతలకు సంబంధించి వివాదం కూడా పెద్ద ఎత్తున రచ్చరచ్చ అయ్యింది. ఇక ఆయన సొంత నియోజకవర్గం అయిన ఆముదాలవలసలో కూడా జనం ఆయన తీరు పట్ల వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి కూడా తమ్మినేని సీతారాం వ్యవహారశైలి ఆ స్థాయికి తగ్గట్టుగా లేదని విమర్శలూ వెల్లువెత్తాయి. ఇక ఆముదాల వలస నియోజకవర్గాన్ని తమ్మినేని ఏ మాత్రం పట్టించుకోలేదని అక్కడి జనం గట్టిగా చెబుతున్నారు. ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చిన పాపాన పోలేదని అంటున్నారు. తమ్మినేని సీతారాంపై ఆ ఆగ్రహం, ఆ అసంతృప్తే ఎన్నికలలో  ప్రతిఫలించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయన తీరు, పొగరు, అహంభావం ఆయన ప్రకటనలలో ప్రతిఫలించేది. ఇదే ఆయనకు పూడ్చకోలేని నష్టాన్ని చేకూర్చింది. ఆముదాల వలసలో  తమ్మినేని ఓటమి ఖాయమని  తెలుగుదేశం శ్రేణులు ధీమాగా ఉంటే.. పరిశీలకులు సైతం తమ్మినేని ఆగ్రహం, అనుచిత భాష, అహంభావం ఆయనను ప్రజలకు దూరం చేసిందని విశ్లేషిస్తున్నారు.   ఇక సమస్యల పరిష్కారం విషయంలో తమ్మినేని ఆముదాలవలసను అస్సలు పట్టించుకోలేదని అంటున్నారు. రాష్ట్రంలో అత్యంత అధ్వానంగా ఉన్న రోడ్డు ఏది అంటే ఎవరైనా ఆముదాలవలస, శ్రీకాకుళం హైవే అని ఠక్కున చెప్పేస్తారు. ఆ రోడ్డు మరమ్మతుల కోసం ప్రజల నుంచి ఎన్ని విజ్ణప్తులు వచ్చినా తమ్మినేని పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ రహదారి ప్రమాదాలకు నెలవుగా మారిపోయినా తమ్మినేని పట్టించుకోలేదు. దీంతో ఆ రోడ్డుపై ప్రయాణించిన ప్రతి ఒక్కరూ ఎట్టిపరిస్థితుల్లోనూ తమ్మినేనికి ఓటు వేయకూడదని నిర్ణయించేసుకున్నారు.  ఇక ఆముదాలవలసలో చక్కెరకర్మాగారం వాగ్దానం కూడా నీటిమూటగానే మిగిలిపోయింది.  వీటన్నిటికీ తోడు ఆముదాలవలస నియోజకవర్గంలో వైసీపీ నాలుగు గ్రూపులుగా చీలిపోయింది. వైసీసీ స్వయంగా నిర్వహించుకున్న సర్వేలోనే నియోజకవర్గ ప్రజలలో తమ్మినేని పట్ల తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత ఉందని తేలింది. అలాగే నియోజకవర్గంలో అధికారపార్టీ అవినీతి పెచ్చరిల్లిందని కూడా ఆ సర్వే పేర్కొంది. అయినప్పటికీ జగన్ తమ్మినేనికే మరో సారి ఆముదాల వలస టికెట్ కేటాయించారు.    ఎన్నికలకు ముందే తమ్మినేని ఓటమి ఖరారైపోయిందని వైసీపీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి.   ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్న సెంటిమెంట్ ప్రకారం అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన ఎవరూ కూడా ఆ తరువాతి ఎన్నికలలో విజయం సాధించలేరు. అయితే తమ్మినేనికి ఆ సెంటిమెంట్ మాత్రమే కాకుండా  నియోజకవర్గ వైసీపీలో గ్రూపు తగాదాలూ కూడా స్పీకర్ తమ్మినేని ఓటమిని ఖాయం చేసేశాయి.  గత ఎన్నికలలో తమ్మినేని  విజయం కోసం సర్వం తానై పని చేసిన వైసీపీ నేత సువ్వారి గాంధీ.. ఇప్పుడు తమ్మినేనికే కాకుండా ఆయన కారణంగా వైసీపీకి కూడా దూరమయ్యారు.  దీంతో ఆముదాలవలస నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ  చేసిన  కూన రవికుమార్  విజయం నల్లేరుమీద బండి నడకేనని అంటున్నారు. 

ec serious on pinnelli atrocities

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచ‌కంపై ఈసీ సీరియ‌స్‌

పిల్లి పాలు తాగుతూ  తననెవరూ చూడడం లేద‌ని అనుకున్న‌ట్లుగా ఉంది వైసీపీ నేత‌ల తీరు. ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ రోజు, ఆ త‌రువాత వైసీపీ నేత‌ల అరాచ‌కం అంతాఇంతా కాదు. పోలింగ్ స‌జావుగా జ‌ర‌గ‌కుండా ఉండేందుకు వారు చేయాల్సిన ప్ర‌య‌త్నాల‌న్నీ చేశారు. అయితే పైకి మాత్రం తమ‌కేమీ తెలియ‌దనీ, తాము సుద్దపూసలమనీ,   కూట‌మి నేత‌లే ఈసీతో కుమ్మ‌క్కై అధి కారుల‌ను మార్చుకొని ఏక‌ప‌క్షంగా పోలింగ్ నిర్వ‌హించుకున్నారంటూ   నాట‌కాలాడారు. ఆడుతున్నారు. కానీ పోలింగ్ రోజు, ఆ త‌రువాత ఏపీలో వైసీపీ గూండాలు సృష్టించిన అరాచ‌కం అంతా ఇంతా కాదు. ఓట‌ర్ల‌ను బెదిరించ‌డం, దాడులు చేయ‌డం ద‌గ్గ‌ర నుంచి పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల‌ను ధ్వంసం చేయడం వరకూ చేయగలిగినదంతా చేశారు.  పోలింగ్ త‌రువాత క‌త్తులు, రాడ్ల‌తో టీడీపీ నేత‌ల‌పై దాడులు చేశారు. స్ట్రాంగ్ రూంల వ‌ద్ద‌కు కూట‌మి నేత‌లు రాకుండా దాడుల‌కు దిగారు.  ఇప్పుడు  వైసీపీ నేత‌ల అరాచ‌కాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. వీడియోల‌తో స‌హా పోలింగ్ రోజు వైసీపీ నేత‌లు సృష్టించిన బీభ‌త్సం బ‌య‌ట‌కు వ‌స్తుండ‌టంతో ప్ర‌జ‌లు వారిని చీద‌రించుకుంటున్నారు.  మాచర్ల  వైసీపీ అభ్య‌ర్థి పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి పోలింగ్ రోజు పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంను ప‌గ‌ల‌గొట్టిన వీడియో తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. పోలింగ్‌ రోజు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో   వైసీపీ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే అభ్య‌ర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వర్గీయులు తెలుగుదేశం నేత‌ల‌పై దాడులు చేశారు. ముఖ్యంగా కారంపూడిలో  కర్రలు, రాడ్లతో చెలరేగిపోయారు. తెలుగుదేశం కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. స్థానిక తెలుగుదేశం నాయకుడి కారును, కొన్ని టూ వీలర్లను  తగులబెట్టారు. నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా వైసీపీ గూండాలు పోలింగ్ కేంద్రాల వ‌ద్ద రెచ్చిపోయారు. వీరికి ప‌లువురు పోలీసు అధికారులు అండ‌గా నిల‌వ‌డంతో వారి ఆగ‌డాల‌కు హ‌ద్దు లేకుండా పోయింది. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద‌కు వెళ్లి ఓట‌ర్లను  వైసీపీ నేత‌లు బెదిరించారు. మ‌రోవైపు  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంత గ్రామంలో తెలుగుదేశం త‌ర‌పున పోలింగ్ ఏజెంట్ లేకుండా చేశారు. పిన్నెల్లిది మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కళ్లకుంట గ్రామం. ఆ గ్రామంలో తెలుగుదేశం ఏజెంట్‌గా దళితవర్గానికి చెందిన నోముల మాణిక్యం కూర్చుంటే వైసీపీ నేత‌లు మాణిక్యం ఇంటిని చుట్టుముట్టి పోలింగ్‌ బూత్‌ నుంచి బయటకు రాకపోతే చంపేస్తామని వీడియో కాల్‌లో బెదిరించారు. అదే విధంగా నియోజకవర్గంలోని కేపీగూడెం పోలింగ్‌ బూత్‌లో కూడా ఇదే విధంగా పైశాచికత్వాన్ని వైసీపీ గూండాలు ప్రదర్శించారు. పోలింగ్ రోజు వైసీపీ నేత‌ల అరాచ‌కాల‌కు అద్దంప‌డుతూ ఓ వీడియో వెలుగులోకి వ‌చ్చింది. పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డే ఏకంగా పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంను ప‌గ‌ల‌గొట్టిన వీడియో వైర‌ల్ అయింది.  మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలోని రెంట‌చింత‌ల మండ‌లం పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202)లోకి పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి వెళ్లారు. పోలింగ్ బూత్ లోని సిబ్బందిని బెదిరిస్తూ ఈవీఎంను ద్వంసం చేశాగ‌డు. అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించిన పోలింగ్ ఏజెంట్‌పై ఎమ్మెల్యే అనుచ‌రులు దాడి చేశారు. ఈ దృశ్యాలు వెబ్ క్యామ్ లో రికార్డ‌య్యాయి. అయితే, ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని తెలుస్తోంది. ఎన్నిక‌ల సిబ్బంది సైతం ఈ ఘ‌ట‌న‌ను చూసీచూడ‌న‌ట్లు వ‌దిలేశారు. ఏపీలో పోలింగ్, ఆ త‌రువాత జ‌రిగిన అల్ల‌ర్ల‌పై ఎన్నిక‌ల సంఘం సిట్ విచార‌ణ‌కు ఆదేశించింది. సిట్ బృందం మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలోనూ ప‌ర్య‌టించి ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగిన పోలింగ్ కేంద్రాలు, గ్రామాల‌ను సంద‌ర్శించి వివ‌రాల‌ను సేక‌రించింది. సిట్ ద‌ర్యాప్తుతో వైసీపీ అరాచ‌కాల్లో కొన్ని ఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌చ్చాయి. నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో మొత్తం ఏడు చోట్ల ఈవీఎంలు ధ్వంసం దృశ్యాలు సీసీ కెమెరాల్లో న‌మోద‌య్యాయి. ఈవీఎంల‌ను ద్వంసం చేయ‌డాన్ని ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్ గా తీసుకుంది. బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీజీపీని ఆదేశించ‌డంతో.. ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి పేరును నిందితుడిగా చేర్చిన‌ట్లు పోలీసులు ఈసీకి తెలియ‌జేశారు. ఏపీ వ్యాప్తంగా పోలింగ్ రోజు, ఆ త‌రువాత వైసీపీ నేత‌లు బీభ‌త్సం సృష్టించారు. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద కావాల‌నే ఘ‌ర్ష‌ణ‌ల‌కుదిగి ఓట‌ర్ల‌ను భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. సిట్ బృందం ఈసీకి అందించిన త‌మ నివేదిక‌లో వైసీపీ నేత‌లు అరాచ‌కాల‌ను పొందుప‌ర్చిన‌ట్లు తెలుస్తోంది. పోలింగ్ స‌జావుగా జ‌ర‌గ‌కుండా దాడులు చేసిన వైసీపీ నేత‌లు.. ఆ దాడులు విధ్వంసాలకు తెలుగుదేశం నేతలే కారణమని ఎదురు ఆరోపణలు చేశారు.  ఆల‌స్యంగానైనా  వైసీపీ అరాచ‌కాలకు సంబంధించిన వీడియో ఒక్కొక్క‌టి బ‌య‌ట‌కు వ‌స్తుండ‌టంతో ప్ర‌జ‌లు నివ్వెర‌పోతున్నారు. జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌జ‌లు ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉంటూ వ‌చ్చారు. పోలింగ్ రోజు భారీ ఎత్తున  ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వ‌ద్ద బారులు తీరారు. భారీగా పోలింగ్ న‌మోదైతే వైసీపీ ఓట‌మికి కార‌ణ‌మ‌వుతుంద‌ని భావించిన ఆ పార్టీ అభ్య‌ర్థులు, నేత‌లు పోలింగ్ స‌జావుగా జ‌ర‌గ‌కుండా ఉండేందుకు దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. దీంతో పోలింగ్ రోజు ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకున్నాయి. అయితే, తాజాగా సిట్ బృందం ఈసీకి అందించిన నివేదిక‌లో వైసీపీ నేత‌ల అరాచ‌కాలను పొందుప‌ర్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఈసీ వారిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందోన‌న్న అంశం వైసీపీ నేత‌ల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తుంది. మ‌రోవైపు కౌంటింగ్ రోజు కూడా వైసీపీ నేత‌లు దాడుల‌కు పాల్ప‌డ‌వ‌చ్చున‌న్న ఇంటెలిజెన్స్ స‌మాచారంతో.. కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద ప‌టిష్ఠ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసేప‌నిలో పోలీసులు నిమ‌గ్న‌మ‌య్యారు.

devotees rush continue  in tirumala

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవలు కావడంతో భక్తుల రద్దీ పెరుగుతోంది. సాధారణంగా వారాంతాలతో పోలిస్తే మిగిలిన రోజులలో భక్తుల రద్దీ ఒకింత తక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు మాత్రం వేసవి సెలవులు కారణంగా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తున్నారు. బుధవారం(మే22) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ టీబీసీ వరకూ  సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.  ఇక మంగళవారం (మే21) శ్రీవారిని మొత్తం 80వేల774 మంది దర్శించుకున్నారు.   వారిలో 35వేల726 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 76 వేల రూపాయలు వచ్చింది.   

bhuton chief budhacharya praises

బుద్ధవనం ప్రత్యేకతలను ప్రశంసించిన రాయల్ భూటాన్ ప్రధాన బౌద్ధాచార్యుడు

 రాయల్ భూటాన్ మొనాస్టరీ ప్రధాన బౌద్ధాచార్యులు ఖెన్ పొ ఉగేన్ నాంగెల్, బుద్ధవనం బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్ ప్రత్యేకతలను ప్రశంసించినట్లు బుద్ధవనం కన్సల్టెంట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. భూటాన్ ప్రస్తుత రాజధాని ధింపూ నగరంలో క్రీ.శ. 1629లో నిర్మించిన మొదటి చారిత్రక బౌద్ధారామంలో సోమవారం నాడు బౌద్ధాచార్యుని కలిసి, తెలంగాణ బౌద్ధ వారసత్వ స్థలాలు, నాగార్జునసాగర్ లో పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మించిన బుద్ధవనంలోని వివిధ విభాగాల్లో తీర్చిదిద్దిన బౌద్ధ శిలాఫలకాలు, స్తూపాలు, మహా స్తూపం, బుద్ధుని మరియు ఎనిమిది మంది అర్హతుల పవిత్ర ధాతువులు, ఆచార్య నాగార్జునుని  విగ్రహం, బౌద్ధ మ్యూజియం, అశోకుని ధర్మ చక్రం గురించి శివనాగిరెడ్డి వివరించారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న బుద్ధవనాన్ని త్వరలో తాను సందర్శిస్తానని ఆయన చెప్పారు. ఆ సందర్భంగా శివనాగిరెడ్డికి బౌద్ధాచార్యులు పట్టు శేష వస్త్రాన్ని బహుకరించారు. శివనాగిరెడ్డి ఆచార్యులకు బుద్ధవనం బ్రోచర్ ను అందజేశారు

modi another promise

విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం అయిపోయింది.. పేదల ఖాతాల్లోకి సొమ్ముపై మోడీ మరో హామీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ మరోసారి పేదల ఖాతాల్లోకి సొమ్ము అంటూ హామీ ఇచ్చారు. దీంతో గతంలో కూడా విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని దేశానికి రప్పించి పేదల ఖాతాల్లో జమ చేస్తానంటూ ఇచ్చిన హామీ గురించి జనం గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికల ముందే పేదల ఖాతాలు, వాటిలోకి సొమ్ము జమ విషయం గుర్తుకు వస్తుందా అంటూ నిలదీస్తున్నారు.   అవినీతి అధికారులు,నాయకులవద్ద పట్టు పడ్డ సంపద బీద ప్రజలకు పంచుతామని   మోడీ హామీ ఇవ్వడమ కాకుండా, ఆ విషయంపై ఇప్పటికే న్యాయసలహా తీసుకున్నామని చెప్పారు. ఇందుకోసం అవసరమైతే   చట్టం సవరణకు కూడా వెనుకాడబోమని అన్నారు.    ఈడి స్వాధీనం చేసుకున్న సంపద రూ. 1.25 లక్షల కోట్లుగా చెప్పిన మోడీ.. ఆ సొమ్మును పేదల ఖాతాల్లో జమ చేయడానికి కసరత్తు చేఃస్తున్నామన్నారు.  2014 ఎన్నికల సమయంలో కూడా మోడీ తాము   అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాల్లో మన వారు దాచిన నల్లధనాన్నిస్వదేశానికి  తీసుకువచ్చి పంచుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. అయితే నల్లధనాన్ని పేదలకు పంచే పని మాత్రం చేయలేదు. అసలా హామీ ఇచ్చిన విషయాన్నే ఆయన ఎన్నడూ ప్రస్తావించలేదు.  అందుకు భిన్నంగా పెద్ద నోట్లు రద్దు నిర్ణయం తీసుకుని జనాలు అన్ని విధాలుగా ఇబ్బందులు పడేలా చేశారు.  ఇప్పుడు తాజాగా   దేశంలో  పట్టుబడ్డ నల్లధనం పంచేస్తానని మరోసారి హామీ ఇచ్చారు. ఈ ఒక్క హామీతో మోడీ మరోసారి ప్రజల విశ్వాసం పొందే అవకాశాలు ఉన్నాయని బీజేపీ గట్టిగా నమ్ముతోంది. అయితే విశ్లేషకులు మాత్రం సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఇప్పటి వరకూ జరిగిన ఐదు విడతల ఎన్నికలలో ఇండియా కూటమి బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిందని విశ్లేషిస్తున్నారు.  ఇండియా కూటమితో విభేదించిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఎన్నికల సరళిని గమనించి అవసరమైతే కాంగ్రెస్ నేతృత్వంలోని  ఇండియా కూటమికి  మద్దతు ఇస్తామని ప్రకటించడాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.   మొత్తం మీద పేదల ఖాతాలలో జప్తు చేసిన సొత్తు జమ చేస్తానంటూ మోడీ చేసిన ప్రకటన, ఇచ్చిన హామీ ఎన్నికల సందర్భంగా ప్రజలను ఆకర్షించేందుకు చేసిన ఉత్తుత్తి హామీగానే పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా విదేశాలలో మూలుగుతున్న నల్లధనాన్ని స్వదేశానికి రప్పించి పేదల ఖాతాల్లో జమ చేస్తానంటే చేసి విస్మరించిన వాగ్దానాన్ని చూపుతున్నారు. 

land market price hike

అశాస్త్రీయంగా భూముల విలువ పెంపు

భూమి అనేది పెరగదు.. కానీ భూమి విలువ మాత్రం పెరుగుతూనే వుంటుంది. ఒక్కోసారి భూమి విలువ ఆకాశంలోకి కూడా దూసుకెళ్తూ వుంటుంది. ఈ ఇంట్రడక్షన్ సంగతి అలా వుంచితే, ఈ రాష్ట్రం అని కాదు.. ఆ రాష్ట్రం అని కాదు... ఏ రాష్ట్రంలో అయినా భూముల విలువ పెంపు అనేది శాస్త్రీయంగా జరగడం లేదన్న అభిప్రాయాలున్నాయి. భూముల విలువ అవసరం అయినప్పుడు పెంచడం కాకుండా, ప్రభుత్వానికి డబ్బు అవసరం అయినప్పుడు పెంచుకుంటూ వెళ్ళడం అనే సంప్రదాయం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొనసాగుతూ వస్తోంది. తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల విలువను పెంచారు. ఉదాహరణగా చెప్పాలంటే, పదేళ్ళ క్రితం ఎకరం రెండు లక్షల వరకు వున్న భూమి విలువ ఇప్పుడు పది లక్షలు దాటిపోయింది. ఇలా భూమి విలువ పెంచడం వల్ల ప్రజలకు  కలిగే మేలు ఏమిటనే విషయం అలా వుంచితే, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగడం వల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెంచుకోవడం కోసం తప్ప ప్రభుత్వాలకు భూముల విలువ పెంచడం వెనుక మరో ఉద్దేశమేమీ కనిపించడం లేదు.  ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీలు తీర్చడానికి ప్రభుత్వానికి డబ్బు కావాలి. దానికి రేవంత్ రెడ్డికి కనిపించిన మొదటి మార్గం భూముల విలువ పెంచడం.. తద్వారా రిజిస్ట్రేషన్ రాబడిని పెంచుకోవడం. ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూముల విలువ పెంచే విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న విలువను ఏక్‌దమ్ రెడింతలు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా ఇష్టం వచ్చినప్పుడల్లా భూముల విలువ పెంచుకుంటూ వెళ్ళడం, భూముల విలువను పెంచడంతో శాస్త్రీయ విధానాన్ని అనుసరించకపోవడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతదేమోగానీ, సామాన్యుడికి భూమి అందుబాటులో లేకుండా పోతోంది.

Shock in Singapore Airlines plane...one dead

సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో కుదుపు...ఒకరు మృతి 30 మందికి గాయాలు 

సింగపూర్ ఎయిర్​లైన్స్​కు చెందిన ఓ విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనవ్వడం వల్ల ఓ వ్యక్తి మరణించారు. మరో 30 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం. లండన్​ నుంచి సింగపూర్ వెళ్తున్న  విమానంలో మంగళవారం ఈ ఘటన జరిగినట్లు సింగపూర్ ఎయిర్​లైన్స్ సంస్థ వెల్లడించింది. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం  మే 20న మొత్తం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో బ్రిటన్‌ రాజధాని లండన్‌ నుంచి సింగపూర్‌కు బయల్దేరింది. మార్గమధ్యలో ఫ్లైట్‌ తీవ్ర కుదుపులకు లోనుకావడం వల్ల దాన్ని థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయానికి మళ్లించారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారని సంస్థ వెల్లడించింది. మరో 30 మందికి గాయాలైనట్లు సమాచారం.ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. ప్రయాణికులకు అవసరమైన వైద్య సాయం అందించేందుకు థాయ్‌లాండ్‌ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఓ బృందాన్ని బ్యాంకాక్‌కు పంపుతున్నట్లు తెలిపింది.

shit on jagan face

పిడకలతో జగన్ పీడకలకి ముగింపు!

ఈ ప్రశాంత్ కిషోర్ ఒకడు.. పోలింగ్ ముందు రోజు జర్నలిస్టు రవిప్రకాష్‌తో  కలసి జగన్‌ని ఉతికి ఆరేశాడు. జగన్ గెలిచే అవకాశం లేదని చెప్పాడు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇదే మాట చెప్పాడు. ‘‘నేను చాలా ఆలోచించి చెబుతున్నాను. నేను చెప్పింది జరగకపోతే ఎదురయ్యే పర్యవసానాల గురించి కూడా ఆలోచించి చెబుతున్నాను. నేను చెప్పింది జరగకపోతే జనం నా ముఖం మీద పేడ కొడతారు. అదే, నేను చెప్పింది జరిగితే ఆ పేడ జగన్ ముఖాన పడుతుంది’ అన్నారు. అంతే, ఆంధ్రా జనం.. ముఖ్యంగా రైతులు ఆ పాయింట్ గట్టిగా పట్టుకున్నారు. జగన్ ముఖం, పేడ అనే రెండు పదాలు వాళ్ళ మనసులలో ఫిక్స్ అయిపోయాయి. రేపు జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడి జగన్ ప్రభుత్వం తుడిచిపెట్టుకుని పోగానే ప్రశాంత్ కిషోర్ ఏదైతే చెప్పాడో ఆ పని చేయడానికి రైతులు రెడీ అవుతున్నారు.  ఐదేళ్ళ పదవీకాలంలో రైతుల్ని జగన్ పెట్టిన హింస అంతా ఇంతా కాదు. రైతులకు ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదు. రైతులకు వారసత్వంగా వచ్చిన భూములు, కష్లపడి సంపదించుకున్న భూముల పట్టాదార్ పాస్ పుస్తకాల మీద జగన్ ఫొటో ప్రింట్ చేయడం, భూముల సర్వే పేరుతో సరిహద్దు రాళ్ళ మీద జగన్ పొటో ప్రింట్ చేయడం.. అనేక రైతు వ్యతిరేక విధానాలను అవలంబించడం, ముఖ్యంగా అమరావతి రైతులను దారుణంగా అవమానించడం లాంటి కారణాలతో జగన్ మీద రైతులు చాలా గుర్రుగా వున్నారు. ఇప్పటి వరకూ అధికారంలో వున్నాడు కాబట్టి రైతులు ఎందుకొచ్చిన గొడవ అని ఊరుకున్నారు. జూన్ 4న జగన్ ప్రభుత్వం ఖతమ్ అయిపోయిన తర్వాత రైతులు తమ కార్యాచరణను మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ చూసినా జగన్ ఫొటోనే ఆ ఫొటోలన్నిటి మీదా పేడ కొట్టాలని రైతులు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఐదేళ్ళపాటు పీడకలగా దాపురించిన జగన్‌కి పిడకలతో వీడ్కోలు చెప్పాలని కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. తన పొలాలకు సరిహద్దులుగా నాటిన రాళ్ళమీద వున్న జగన్ ముఖం మీద పిడకలు కొట్టడంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ రైతులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. పిడకల సంగతి అలా వుంచితే, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేస్తే, జగన్ ఫొటో వున్న పాస్ పుస్తకాలను కసిదీరా చించేయడానికి కూడా రైతులు ఎదురుచూస్తున్నారు. 

Who killed ebrahim raisi

ఒక మరణం.. ఎన్నో సందేహాలు!

ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడం మీద అనేక సందేహాలు ముసురుకుంటున్నాయి. రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కి ప్రమాదం జరిగిందని తెలియగానే, ఇది ఇజ్రాయిల్ పనే అనే అనుమానాలు చాలామందిలో కలిగాయి. గాజా మీద ఇజ్రాయిల్ దాడులు జరిగిన నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య విభేదాలు తలెత్తాయి. రెండు పరస్పరం దాడులు చేసుకునే వరకూ పరిస్థితి వెళ్ళింది. ఇరు దేశాల మధ్య ఏర్పడిన విభేదాలు అంతకంతకూ పెరిగే పరిస్థితులు కనిపించాయి. ఇజ్రాయిల్ విషయంలో తమ దేశానికి మద్దతుగా నిలవాలన్న ఉద్దేశంతో ఎప్పటి నుంచో శత్రుత్వం వున్న పాకిస్తాన్‌తో కూడా ఇబ్రహీం రైసీ స్నేహం ప్రారంభించారు. మొన్నామధ్యే ఆయనే స్వయంగా పాకిస్తాన్ వెళ్ళారు. అంతర్జాతీయ అంశాల మీద రెండు దేశాలూ కలసి పనిచేస్తాయని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ రైసీ హత్యకు పథకం పన్ని హెలికాప్టర్ని కూల్చి వుండొచ్చన్న అనుమానాలు తలెత్తాయి. అయితే ఇజ్రాయిల్ వెంటనే స్పందించింది. హెలికాప్టర్ ప్రమాదం విషయంలో తమ ప్రమేయం ఏమీ లేదని ప్రకటించింది. అయినప్పటికీ ఇజ్రాయిల్ మీద అనుమానాలు పోలేదు. హెలికాప్టర్ ప్రమాదం విషయంలో తమకేమీ ప్రమేయం లేదని ప్రకటించిన ఇజ్రాయిల్ అక్కడతో ఆగలేదు. ఈ ప్రమాదానికి కారణం అమెరికా అని, అమెరికా వల్లే రైసీ చనిపోయారని బాంబు పేల్చింది. హెలికాప్టర్ విడిభాగాల సరఫరా విషయంలో అమెరికా కొన్ని దేశాల మీద ఆంక్షలు విధించింది. ఆ దేశాల్లో ఇరాన్ కూడా వుంది. హెలికాప్టర్ విడిభాగాల దిగుమతికి అవకాశం లేకపోవడంతో ఇరాన్ స్థానికంగా తయారుచేసుకున్న, అంతగా నాణ్యత లేని విడిభాగాలనే ఉపయోగించాల్సి వస్తోంది. దీనివల్లే హెలికాప్టర్ ప్రమాదం జరిగింది అంటూ ఇజ్రాయిల్ ఈ ప్రమాదాన్ని అమెరికా అకౌంట్లో వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇబ్రహీం రైసీ మరణం విషయంలో మరో కొత్త కోణం బయటకి వచ్చింది. ఇరాక్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కుమారుడు ముజ్తబా అంతరిక్ష లేజర్ ఆయుధాన్ని ఉపయోగించి రైసీ హెలికాప్టర్ని కూల్చివేయించి వుంటాడని వదంతులు వినిపిస్తున్నాయి. అలీ ఖమేనీ వయసు ప్రస్తుతం 85 సంవత్సరాలు. ఆయన తదనంతరం ఇరాన్ సుప్రీమ్‌గా ఇబ్రహీం రైసీ అయ్యే అవకాశం వుందని పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తండ్రి తర్వాత ఇరాన్ సుప్రీం పీఠాన్ని ఎక్కాలని కోరుకుంటున్న ముజ్తబా, తనకు పోటీగా వున్న ఇబ్రహీం రైసీని అంతం చేసి వుండవచ్చని వదంతులు వినిపిస్తున్నాయి. 

The term of vice chancellors of 10 universities has ended!

నేటితో ముగియనున్న వైస్ ఛాన్సలర్స్ పదవి కాలం!

తెలంగాణా రాష్ట్రంలో ఉన్న 10 విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్ల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. అయితే, పారిపాలనా సౌలభ్యం కోసం ఉన్న వారికే ఇంచార్జీలుగా బాధ్యతలు ఆప్పగిస్తారా ? లేదా ఐఎఎస్‌లను ఇంచార్జీలుగా నియమిస్తారా ? అనే విషయం ఆసక్తికరంగా మారింది.  వీసీల నియామకాలకు ఎన్నికల కమిషన్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో కొత్త వీసీల నియామకానికై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే , ఒక్క కాకతీయ విశ్వవిద్యాలయం తప్ప మిగతా 9 విశ్వవిద్యాలయాల ఉప కులపతుల నియామకాల కోసం సెర్చ్ కమిటీని ప్రభుత్వం నియమించింది.  కొత్త వీసీల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచే కసరత్తు చేపట్టింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.  బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి 208 దరఖాస్తులు, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 193, పాలమూరుకు 159, శాతవాహనకు 158, మహాత్మా గాంధీకి 157, కాకతీయకు 149, తెలంగాణ వర్సిటీకి 135, జేఎన్‌టీయూహెచ్‌కు 106, తెలుగు విశ్వవిద్యాలయానికి 66, జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌, ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయానికి 51 దరఖాస్తులు వచ్చాయి.  ఉస్మానియా విశ్వవిద్యాలయం, జేఎన్జీయూ హెచ్‌ విశ్వవిద్యాలయాల వీసీలుగా పని చేసేందుకు ఎక్కువ మంది అసక్తి చూపుతున్నారు. వీసీల నియామకానికి ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ మేరకు సిట్టింగ్‌ వీసీలతో పాటు కొత్త వారు కూడా మొత్తం 312 మంది ప్రొఫెసర్లు తమ దరఖాస్తులను ప్రభుత్వానికి సమర్పించారు. అంతేగాక, తమ పేర్లను సిఫార్సు చేయాలని అభ్యర్థిస్తూ మంత్రులు, అధికార పార్టీకి చెందిన నేతలపై ఒత్తిడి తెస్తున్నారు.  తమ జిల్లాల పరిధిలో ఉన్న విశ్వవిద్యాలయాల పరిధిలో తమ వారినే నియమించుకోవాలనే ఆసక్తితో పలువురు కాంగ్రెస్‌ ముఖ్యులు, మంత్రులు సీఎం దృషికి తెచ్చారు. కొత్త వీసీల నియామకం కోసం ప్రభుత్వం నియమించిన సెర్చ్‌ కమిటీలు కసరత్తు మొదలుబెట్టాయి. దరఖాస్తుల స్వీకరణ అనంతరం అభ్యర్థుల గురించి ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా ప్రభుత్వం సమాచారం సేకరించింది. మార్చిలో కోడ్‌ అమల్లోకి రావడంతో ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. వీసీల పదవీకాలం మే 21తో ముగుస్తున్నందువల్ల.. కొత్త వారి నియామకాలకు అనుమతించాలని కోరుతూ ఈనెల ఆరంభంలో ఈసీకి ప్రభుత్వం దరఖాస్తు చేసుకోగా అనుమతి ఇచ్చింది. వీసీ పదవికి 70 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితి ఉంటుందని, ఇప్పటికే ఈ పదవిని రెండు దఫాలు నిర్వహించినవారు మూడోసారి ఎంపికకు అనర్హులవుతారు.  వీసీలుగా నియమితులు కావాలంటే కనీసం పదేళ్లు ప్రొఫెసర్‌గా పనిచేసి ఉండాలి. లేదా పరిశోధన, అకడమిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పదేళ్ల అనుభవం ఉండాలి. వీసీలను మూడేళ్ల కాలపరిమితికి నియమిస్తారు. ఈ వారంలోనే సెర్చ్‌ కమిటీ సమావేశాలు నిర్వహించి, వీసీల ఎంపికకు సిఫారసులు అందించనున్నాయి.  గత ప్రభుత్వం సామాజిక న్యాయానికి తిలోదకాలు ఇచ్చిందనీ, తమ ప్రభుత్వం మాత్రం సామాజిక న్యాయం నేపథ్యంగా నియామకాలు చేపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇప్పటికే ప్రకటించినందున ఆ దిశలోనే కొత్త వీసీల నియామకం కోసం చర్యలు మొదలయ్యాయి. ఈ నెలాఖరుకు నియామక ప్రక్రియ పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది.  ఈ నెలాఖరులోగా కొత్త వీసీల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి.. నియామక ఉత్తర్వులు జారీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. - ఎం.కె. ఫ‌జ‌ల్‌

Former MLA of East Godavari district Kovvur and YCP leader Pendyala Venkata Krishna Rao (Krishna Babu) passed away due to illness

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యేపెండ్యాల మృతి

ఏపీలోని తూర్పు గోదావ‌రి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండ్యాల వెంక‌ట కృష్ణారావు (కృష్ణ‌బాబు) అనారోగ్యంతో మృతిచెందారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న హైద‌రాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఇవాళ తెల్లవారుజామున కృష్ణ‌బాబు చనిపోయినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.  కృష్ణబాబు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామం దొమ్మేరుకు తరలించారు. బుధవారం నాడు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా, కృష్ణారావు టీడీపీ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా, టీడీపీకి కంచుకోట అయిన కొవ్వూరు నియోజకవర్గంలో ఆంధ్రా షుగర్స్ అధినేత ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ మేనల్లుడు అయిన పెండ్యాల కృష్ణబాబు ఇక్కడి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, నియోజకవర్గాల పునర్విభజనలో కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గంగా మారడంతో కృష్ణబాబు తెరపై నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత టీడీపీ నుంచి టీవీ రామారావు ఎమ్మెల్యే అయ్యారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన జవహార్ మంత్రి కూడా అయ్యారు. అయితే, నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైనా.. పెండ్యాల కుటుంబానిదే ఈ నియోజకవర్గంలో పైచేయి. ముఖ్యంగా కృష్ణబాబు సోదరుడు అచ్చిబాబు చెప్పినట్లే అక్కడ వినాల్సిన పరిస్థితి ఉంటుంది.  

Continuation of traffic in Tirumala... VIP break Darshan tickets are restored

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ... విఐపి బ్రేక్ దర్శన టికెట్ల పునరుద్దరణ

ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయిన వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను టీటీటీ తిరిగి ప్రారంభించింది. సోమవారం నుంచి సిఫార్సు లేఖల మీద వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు జారీ చేస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో గత నాలుగు రోజుల నుంచి భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారి ద‌ర్శ‌నం కోసం క్యూక‌డుతున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు కిలో మీటర్ల మేర బారులు తీరుతున్నారు. ఇలా భ‌క్తుల తాకిడి పెర‌గడంతో టీటీడీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల జారీని తిరిగి ప్రారంభించాల‌ని నిర్ణ‌యించింది. ఈ నిర్ణయంతో భక్తుల రద్దీ ఉన్నాస‌రే.. శ్రీవారిని దర్శించుకునే సమయం తగ్గనుంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏపీలో ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో మార్చిలో వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లను టీటీడీ రద్దు చేసిన విష‌యం తెలిసిందే. అయితే, రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల జారీకి అనుమతించాలని ఈసీకి టీటీడీ అభ్య‌ర్థించింది. దీంతో టీటీడీ అభ్యర్థ‌న‌పై సానుకూలంగా స్పందించింది.  దీంతో మంగళవారం నుంచి వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల సిఫార్సు లేఖలను అనుమతిస్తున్నారు. టీటీడీ బోర్డు సభ్యులకు గతంలో తరహాలోనే రోజుకు పది వీఐపీ బ్రేక్, పది రూ. 300 ఎస్‌ఈడీ టికెట్లు జారీ చేస్తున్నారు. అలాగే ఎంపీలకు 12, ఎమ్మెల్యేలకు ఆరు చొప్పున వీఐపీ బ్రేక్‌ టికెట్లను సిఫార్సు లేఖలను జారీ చేస్తున్నారు. ఈ సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనానికి తక్కువ సమయం పట్టనుంది. అలిపిరి మెట్ల మార్గంలో చిరుతల కలకలం అలిపిరి మెట్ల మార్గంలో సోమవారం రెండు చిరుతలు భక్తులు చూసి కేకలు వేశారు. దీంతో చిరుతలు అటవీ ప్రాంతంలోకి పారిపోయాయి. టీటీడీ విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తిరుమల శ్రీవారిని సోమవారం 85,825 మంది భక్తులు దర్శించుకున్నారు. సర్వదర్శనానికి సోమవారం దాదాపు 16 గంటలు పట్టింది. 36,146 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమల హుండీ ఆదాయం రూ.4.40 కోట్లు. భక్తులు వెయిటింగ్ కంపార్ట్‌మెంట్‌లు నిడిపోయి ఏటీసీ వద్ద వరకూ క్యూలైన్ లో వేచిఉన్నారు.

 మనీష్ సిసోడియాకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు 

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆర్థిక, విద్య, ప్రణాళిక, పట్టణాభివృద్ధి, రెవెన్యూ, సేవలు, స్థానిక సంస్థలు, భూమి & భవనాలు, ఉన్నత విద్య, శిక్షణ & సాంకేతిక విద్య, విజిలెన్స్, సహకార సంఘాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ & పబ్లిసిటీ వంటి అనేక ముఖ్యమైన విభాగాలకు సిసోడియా ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ముఖ్యముగా, ఏ ఇతర మంత్రికి కేటాయించబడని అన్ని శాఖలను ఆయన పర్యవేక్షించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ లభిస్తే సిసోడియాకు ఇంతవరకు బెయిల్ లభించడం లేదు. ఈ కేసులో అందరికంటే ముందే అరెస్ట్ అయిన సిసోడియాకు ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశాలు లేవు.  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ హైకోర్టు ఈ నెల 31 వరకు పొడిగించింది. మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ, సీబీఐ దాఖలు చేసిన మనీలాండరింగ్, అవినీతి కేసుల్లో ఆప్ నేత‌ జ్యుడీషియల్ కస్టడీని మే 31 వరకు పొడిగిస్తూ ఢిల్లీ హైకోర్టు మంగ‌ళ‌వారం తీర్పును వెల్ల‌డించింది. మ‌నీశ్ సిసోడియా, సీబీఐ, ఈడీ తరఫున వాదనలు విన్న హైకోర్టు మే 14న పిటిషన్లపై తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసిన విష‌యం తెలిసిందే. రెండు బెయిల్‌ పిటిషన్లపైనా న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ ఈ మేర‌కు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈడీ, సీబీఐ మనీశ్ సిసోడియాను బెయిల్ పై విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కాగా, సిసోడియా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో 2023 ఫిబ్రవరి నుంచి జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న విష‌యం తెలిసిందే.

లోకేష్‌కి మంగళగిరిలో 60 వేల మెజారిటీ ఖాయం!

మంగళగిరిలో నారా లోకేష్ విక్టరీ పక్కా.. ఈ విషయంలో వైసీపీ వాళ్ళకి కూడా ఎలాంటి డౌట్ లేదు. ఈ ఎలక్షన్స్లో లోకేష్ మీద లావణ్య సంగతి అలా వుంచితే, మంగళగిరి స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా సాక్షాత్తూ జగన్ పోటీ చేసినా ఓడిపోవడం పక్కా. ఇక్కడ లోకేష్ విక్టరీ ఆ రేంజ్‌లో కన్ఫమ్ అయిందిమరి. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి కావచ్చు.. బెట్టింగ్ రాయుళ్ళకి కావచ్చు.. వీళ్ళందరూ లోకేష్ గెలుస్తాడా.. లేదా అనే విషయాన్ని ఆలోచించడం లేదు.. లోకేష్ మెజారిటీ ఎంత వుండవచ్చు అనే దగ్గరే డిస్కషన్ మొదలవుతోంది. ఈసారి లోకేష్‌కి 60 వేల ఓట్ల మెజారిటీ పక్కా అని తెలుగు తమ్ముళ్ళు ఢంకా బజాయించి చెబుతుంటే, వైసీపీ సానుభూతిపరులు మాత్రం తమ అభ్యర్థి లావణ్య మీద సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ గెలుస్తాడుగానీ, పాతికవేలకంటే ఎక్కువ మెజారిటీ రాదు అని ఉక్రోషంగా అంటున్నారు. ఇప్పుడు మంగళగిరిలో వైసీపీ వర్గాలందరూ లోకేష్‌కి ఎక్కువ మెజారిటీ రాదు అనే పాయింట్ దగ్గరే ఫిక్సయిపోయారు తప్ప.. లోకేష్ గెలవడు అనే మాట జోలికి మాత్రం వాళ్ళు వెళ్ళడం లేదు. గతంలో లావణ్య గెలుస్తుందని బెట్టింగ్‌లోకి దిగిన వాళ్ళు ప్రస్తుతం బెట్టింగ్ డబ్బు వెనక్కి తీసుకునే తంటాలు పడుతున్నారు. ఇప్పటి వరకు బెట్టింగ్ కట్టనివాళ్ళు బతుకుజీవుడా అని ఊపిరి పీల్చుకుంటున్నారు. గత ఎలక్షన్లలో ఇదే మంగళగిరి నుంచి ఓడిపోయిన లోకేష్, పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని బాగా నమ్మారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గ ప్రజలతో మమేకం అయ్యారు. వాళ్ళ అభిమానానికి పాత్రుడు అయ్యారు. అందుకే మంగళగిరి నియోజకవర్గం ఓటర్ల మీద నమ్మకంతోనే లోకేష్ మూడు నెలల క్రితమే తాను మంగళగిరి నుంచి 53 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని  ప్రకటించారు. అయితే, పోలింగ్ రోజు పోటెత్తిన ఓటర్లను చూసిన తర్వాత రాజకీయ పరిశీలకులు లోకేష్ మెజారిటీని 60 వేల ఓట్లకు పెంచేశారు. వైసీపీ వర్గాల మైండ్‌సెట్‌ని లోకేష్ మెజారిటీ గురించి మాత్రమే ఆలోచించేలా ఫిక్స్ చేశారు.

ఆత్మహత్యా సదృశ్యం జగన్ రెడ్డి పరిపాలన...

రాజకీయాల్లో హత్యలు ఉండవు. ఆత్మహత్యలే,  ఆత్మహత్య సదృశ్యం జగన్ రెడ్డి పరిపాలనాని అంటారు  సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాదం.  తిరుపతి, అనంతపురం, మాచర్లలో జరిగిన అల్లర్ల, విధ్వంసం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇళ్లు ధ్వంసం చేసిన ఘటనలో వైసిపి పాత్ర వుంది. వీటన్నింటిపై సిట్ దర్యాప్తు జరుగుతుంది. కారకులైన వారు న్యాయస్థానంలో దోషిగా నిలబడక తప్పదని ఆయ‌న హెచ్చరించారు.  ఈ ఎన్నికల్లో ఓటమి చెందుతున్నామని గ్రహించి జగన్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. 50 మంది ఎమ్మెల్యేలను మార్చినప్పుడే ఓడిపోయాడని, డీజీపీని మార్చినప్పుడు తనంతట తానే ఎన్నికలు అనుకూలంగా జరగవేమో అని జగన్ రెడ్డి ఓటమికి అంగీకరించాడు అన్నారు. లాండ్ టైటిలింగ్ యాక్ట్ తో జగన్ రెడ్డి డిఫెన్స్ లోకి వెళ్లిపోయాడు అన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల ద్వారా పూర్తిగా జగన్ రెడ్డి కి అష్టదిగ్బంధనం జరిగింది. జగన్ రెడ్డి అధికారం అంటే పెట్టుకొని పోల్ మేనేజ్మెంట్ చేద్దామనుకున్నాడని, కానీ ప్రజల తీర్పుతో తోక ముడిచాడు.  మూడు రాజధానుల ఉద్యమం, ఒక రాజధాని ఉద్యమం రెండు ఉద్యమకారులను మోసం చేసి వారి ఉసురు తగిలి జగన్ రెడ్డి కాలగర్భంలో కలిసిపోతున్నాడు.  పేద, పెత్తందారుల తేడా లేకుండా జగన్ రెడ్డి పరిపాలన వల్ల అయిదు కోట్ల మంది బాధితులైయ్యారు.  డిబిటి కింద రెండు లక్షల 75 వేల కోట్లు, నాన్ dbt కింద 1,25,000 కోట్లు ఈ ఐదు సంవత్సరాలలో  50 లక్షల మంది లబ్ధిదారులకు అందించానని అబద్ధాలు చెబుతూ, దారి మళ్లించిన నొక్కేసిన 8 లక్షల కోట్ల రూపాయల లెక్కలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలకు 1,25,000 కోట్లు అవుతాయని జగన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం. - ఎం.కె. ఫ‌జ‌ల్‌

కల్వకుంట్ల కవితకి ఈడీ బర్త్ డే గిఫ్ట్!

బిఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ముద్దుల కుమార్తె కల్వకుంట్ల కవిత జూన్ 3 వరకు తీహార్ జైలులో ఆతిథ్యం తీసుకోక తప్పదన్నదనేది అందరికీ తెలిసిన విషయం. కానీ, చాలామందికి తెలియని విషయం ఒకటి బయటకి వచ్చింది. అందేంటంటే, కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగడానికి ఎన్‌ఫోర్స్.మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అవకాశం కల్పించిది. తద్వారా ఈడీ ద్వారా కవితకి బర్త్ డే గిఫ్ట్ అందించింది. ఇదేంటి చెప్మా? కవిత బర్త్ డే మార్చి 13వ తేదీ కదా? అప్పటికి కవిత ఇంకా అరెస్టు కాలేదు కదా.. మరి కవిత బర్త్ డే వేడుకలు ఘనంగా జరడానికి ఈడీ అవకాశం ఇవ్వడం ఏమిటా? పైగా బర్త్ డే గిఫ్ట్ కూడా ఇవ్వడం ఏమిటా ఏమిటా అనే సందేహం ఇప్పటికే కొంతమందికి వచ్చి వుండొచ్చు. ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి... మార్చి 13, 2024వ తేదీకి వెళ్దాం. అప్పటికి రెండు నెలల మూడు నెలల క్రితమే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగి, బీఆర్ఎస్ పార్టీ తుక్కుగా ఓడిపోయి, పార్టీ శ్రేణులు దిక్కుతోచని స్థితిలో వున్నాయి. అలాంటి సందర్భంలో వేసవిలో వర్షంలాగా కవితమ్మ బర్త్ డే వచ్చింది. ఈ సందర్భాన్ని కార్యకర్తల్లో ఉత్సాహం నింపే సందర్భంగా మలచాలని కవిత ఫిక్సయ్యారు. తన నివాసంలో భారీ స్థాయిలో తన బర్త్ డే వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు వేలాదిమంది కార్యకర్తలు వచ్చారు. డప్పుల చప్పుడుతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. కుటుంబ సభ్యులు, భర్త, పిల్లల సమక్షంలో కల్వకుంట్ల కవిత తన బర్త్ డే కేక్స్ కట్ చేశారు. అందరూ ఆనందోత్సాహాలతో చప్పట్లు చరిచారు. అలా ఆరోజు కవిత బర్త్ డే వేడుకలు అద్భుతంగా జరిగాయి. సరే, వర్తమానంలోకి వద్దాం. కవిత బర్త్ డే ఆ రేంజ్‌లో జరగడానికి, ఈడీకి సంబంధం ఏంటనే సందేహం రావడం సహజం. అయితే, కవితని మార్చి 13వ తేదీకంటే చాలా ముందే ఈడీ అరెస్టు చేయాల్సి వుంది. కానీ, 13 తర్వాతే ఆ పుణ్యకార్యం చేయాలని ఈడీ గ్యాప్ తీసుకుంది. అందుకే, పుట్టినరోజు నాడు కవిత జైల్లో లేకుండా ఇంట్లోనే బర్త్ డే వేడుకలు చేసుకోగలిగింది. మరి ఇది జరిగింది ఈడీ నిర్ణయం వల్లే కదా.. కవితకి ఈడీ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చినట్టే కదా! కవిత బర్త్ డే వేడుకలు ముగిసిన రెండ్రోజుల తర్వాత, మార్చి 15న కవిత ఇంటికి వెళ్ళి ఈడీ అరెస్టు చేసింది. కవిత తన బర్త్ డే చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం వెనుక ఈడీ స్వప్రయోజనం కూడా లేకపోలేదు. బర్త్ డే ముందే అరెస్టు చేస్తే, బీఆర్ఎస్ వర్గాలు ‘తెలంగాణ బిడ్డని బర్త్ డే కూడా చేసుకోనివ్వలేదు’ అని సానుభూతి కోసం పాకులాడే అవకాశం వుండేది. అలాగే బర్త్ డే రో్జున బీఆర్ఎస్ వర్గాలు భారీ స్థాయిలో సీన్ క్రియేట్ చేసి వుండేవి. ఈ గోలంతా ఎందుకని, కవితని ఎంచక్కా బర్త్ డే  వేడుకలు చేసుకోనిచ్చి ఆ తర్వాతే ఈడీ అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.