నల్లగొండ బిఆర్ఎస్  రైతు మహాధర్నాకు హైకోర్టు పచ్చజెండా 

నల్లగొండ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్  రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మహా ధర్నా చేపట్టడానికి కోర్టు పచ్చ జెండా ఊపింది. బిఆర్ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్ కెటీఆర్ తో బాటు పలువురు ముఖ్య నాయకులు ఈ మహాధర్నాలో పాల్గొననున్నారు. రైతు మహాధర్నాకు రేవంత్ సర్కార్ అనుమతి ఇవ్వకపోవడంతో బిఆర్ఎస్ హైకోర్టునాశ్రయించింది.  ఆఖరినిమిషంలో అనుమతి ఇవ్వలేమని జిల్లా ఎస్పీ తేల్చి చెప్పడంతో బిఆర్ఎస్ కోర్టు తలుపులు తట్టింది.  పద్నాలుగు నెలల కాంగ్రెస్ హాయంలో ప్రజా సమస్యల పరిష్కారం కాకపోవడంతో బిఆర్ ఎస్ పోరు బాట పట్టింది.   

తెలంగాణలో  కొనసాగుతున్నరెండో రోజు గ్రామసభలు... రెస్పాన్స్ ఇదే

తెలంగాణలో రెండో రోజు గ్రామసభలు కొనసాగుతున్నాయి.  ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడానికి అర్హులైన లబ్దిదారుల కోసం రేవంత్ సర్కారు కసరత్తు ప్రారంభించింది. గ్రామ సభలు నిర్వహిస్తోంది.  బుధవారం రెండో రోజు గ్రామ సభలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నాలుగు పథకాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.  గ్రామ సభల్లో లబ్దిదారుల ఎంపిక జరుగనుంది. ఈ నెల 24 వతేదీ డెడ్ లైన్ గా నిర్ణయించారు.  అయితే గ్రేటర్ హైద్రాబాద్ లో ఇంకా వార్డు సభలు మొదలు కాలేదు. సర్వే పూర్తయిన తర్వాత  వార్డు సభలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి వార్డు సభలు ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉంది. 

అత్యుత్సాహంతో వైసీపీ బొక్క‌బోర్లా.. పాయె..ప‌రువు మొత్తం పాయే!

దొర‌క్క దొర‌క్క కోతికి కొబ్బ‌రి చిప్ప దొరికితే ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అదే త‌ర‌హాలో గ‌త నాలుగు రోజులుగా వైసీపీ నేత‌లు నానా హ‌డావుడి చేస్తున్నారు. ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌రువాత వైసీపీ నేత‌లు పెద్ద‌గా బ‌య‌ట‌కు రావ‌డం లేదు.. సోష‌ల్ మీడియాలో మాత్రం తెగ‌ హ‌డావుడి చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలో ఏడు నెల‌ల కాలంలో కూట‌మి పార్టీల మ‌ధ్య ఎక్క‌డా విబేధాలు పొడ‌ చూప‌లేదు. ఐక‌మ‌త్యంగా క‌లిసి రాష్ట్రం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. దీంతో వైసీపీ నేత‌ల‌కు కూట‌మి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డానికి కూడా ఎలాంటి అంశం, అవకాశం దొర‌క‌డం లేదు. అయితే, గ‌త నాలుగు రోజులుగా ఏపీ డిప్యూటీ సీఎంగా లోకేశ్ ను నియ‌మించాలంటూ తెలుగుదేశం శ్రేణుల నుంచి డిమాండ్ వస్తోంది. ప‌లువురు తెలుగుదేశం నేత‌లు బ‌హిరంగంగానే లోకేశ్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌ని చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేశారు. దీంతో కూట‌మి నేత‌ల మ‌ధ్య ఎలా అగ్గిరాజేయాలా అని  గోతికాడ  న‌క్క‌లా ఎదురుచూస్తున్న వైసీపీ సోష‌ల్ మీడియా విభాగం అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించింది. కూట‌మి ప్ర‌భుత్వంలో చీలిక రాబోతోంది.. ప్ర‌భుత్వం కూల‌బోతోంది అంటూ తెగ హ‌డావుడి చేశారు. అంతే కాదు.. కూట‌మి నేత‌లు మాట్లాడ‌ని మాట‌ల‌ను జోడించి తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య గొడ‌వ‌ పెట్టేలా వైసీపీ నేత‌లు, ఆ పార్టీ సోష‌ల్ మీడియా తీవ్రంగా శ్ర‌మించింది. కానీ, చివ‌ర‌కు బొక్క‌బోర్లా ప‌డింది.  కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో ఏపీలో అభివృద్ధి ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. చంద్ర‌బాబు అడుగుజాడ‌ల్లో న‌డుస్తూ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అభివృద్ధిలో భాగ‌స్వామి అవుతున్నారు. దీంతో కూట‌మిలోని బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీల నేత‌లు ఒకే పార్టీ నేత‌ల త‌ర‌హాలో గ్రామ‌స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు క‌లిసి మెలిసి పని చేస్తున్నారు. అయితే, కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి టీడీపీ నేత‌లు, ఆ పార్టీ శ్రేణుల్లో ఓ ఆశ ఉంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను కొన‌సాగిస్తూనే మంత్రి నారా లోకేశ్ కు కూడా డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌ని ఆ పార్టీ నేత‌లు సీఎం చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ప‌లువురు నేత‌లు త‌మ అభిప్రాయాన్ని బ‌హిరంగంగానే వ్య‌క్త‌ం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేత‌ల నుంచి లోకేశ్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి క‌ట్ట‌బెట్టాల‌న్న డిమాండ్ తీవ్ర‌మైంది. ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన పార్టీకి చెందిన కొంద‌రు నేత‌లు తెలుగుదేశం వాద‌న‌ను స‌మ‌ర్ధించ‌గా.. మ‌రికొంద‌రు ఖండించారు. ఇదే అదునుగా తీసుకొని వైసీపీ సోష‌ల్ మీడియా రంగంలోకి దిగింది. కూట‌మి ప్ర‌భుత్వంలో చీలిక వ‌చ్చిందంటూ అస‌త్య ప్ర‌చారం చేస్తూనే.. మ‌రోప‌క్క‌ లోకేశ్ ను తిట్టిన‌ట్లు జ‌న‌సేన పేరుతో పోస్టులు పెట్ట‌డం, ప‌వ‌న్ ను విమ‌ర్శిస్తూ తెలుగుదేశం నేత‌ల పేరుతో పోస్టులు పెట్ట‌డం వంటి చ‌ర్య‌ల‌కు వైసీపీ సోష‌ల్ మీడియా పాల్ప‌డింది. లోకేశ్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి అప్ప‌గించాల‌ని తెలుగుదేశం నేత‌ల నుంచి డిమాండ్ పెరుగుతుండ‌టంతో పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. డిప్యూటీ సీఎం విష‌యంపై ఎవ‌రూ ఎలాంటి వ్యాఖ్య‌లు చేయొద్ద‌ని అధిష్టానం పార్టీ క్యాడ‌ర్ కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది.    కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత లోకేశ్ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ప్ర‌భుత్వంలోనూ, పార్టీ బ‌లోపేతంలోనూ లోకేశ్ కీల‌క భూమిక పోషిస్తున్నారు. ఇటీవ‌లే టీడీపీ స‌భ్య‌త్వాలు తొలిసారి కోటి దాటాయి. భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు పార్టీ స‌భ్య‌త్వాలు  తీసుకోవ‌డానికి ప్ర‌ధాన‌ కార‌ణం లోకేశ్ అని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.  కార్య‌క‌ర్త‌ల‌కు అనునిత్యం అందుబాటులో ఉంటూనే మ‌రో ప‌క్క‌ రాష్ట్రం అభివృద్ధిలో లోకేశ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.  లోకేశ్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌ని తెలుగుదేశం నేత‌లు కోర‌డంలో త‌ప్పులేదు. ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో ప్ర‌జ‌ల్లోకి మ‌రింత చొచ్చుకొని వెళ్లొచ్చు.. అదే స‌మ‌యంలో తెలుగుదేశం బ‌లోపేతానికి మ‌రింత‌గా కృషిచేసే అవ‌కాశం ఉంటుంది. అయితే, లోకేశ్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌న్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతుండ‌టంతో టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ అంశంపై ఎవ‌రూ మాట్లాడొద్ద‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చింది. జ‌న‌సేన పార్టీ అధిష్టానం సైతం ఆ పార్టీ శ్రేణులకు కీల‌క సూచ‌న‌లు చేసింది. ఎవ‌రూ ఈ అంశంపై మాట్లాడొద్ద‌ని సూచించింది. దీంతో గ‌త నాలుగు రోజులుగా కూట‌మిప్ర‌భుత్వంలో చీల‌క తేవాల‌ని ప్ర‌య‌త్నించిన వైసీపీ సోష‌ల్ మీడియా ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి.  గ‌త నాలుగు రోజులుగా వైసీపీ నేత‌లు, ఆ పార్టీ సోష‌ల్ మీడియా చేస్తున్న ఓవ‌రాక్ష‌న్ ప‌ట్ల ప్ర‌జ‌ల‌తో పాటు వైసీపీ శ్రేణులుసైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కూట‌మి పార్టీల మ‌ధ్య చిన్న‌పాటి విబేధాలు రావ‌డం స‌హ‌జ‌మే. అవి టీ క‌ప్పులో తుఫాను లాంటివి. ఈ విష‌యాన్ని గ్ర‌హించ‌కుండా వైసీపీ నేత‌లు లోకేశ్ డిప్యూటీ సీఎం విష‌యంపై తెగ హ‌డావుడి చేశారు. రాష్ట్రంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఫోక‌స్ చేయాల్సిన వైసీపీ.. కేవ‌లం కూట‌మి పార్టీల మ‌ధ్య విబేధాలు సృష్టించేందుకు, లేనిపోని అస‌త్యాల‌తో జ‌న‌సేన‌, టీడీపీ నేత‌ల మ‌ధ్య గొడ‌వ పెట్టేందుకు మాత్ర‌మే ప్రాధాన్య‌త ఇవ్వ‌డం ప‌ట్ల ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తానికి లోకేశ్ డిప్యూటీ సీఎం ఎపిషోడ్‌లో చివ‌రికి వైసీపీ పెద్ద ఫూల్ అయింద‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయాల్లో జ‌రుగుతుంది. ఇప్ప‌టికైనా వైసీపీ నేత‌లు, ఆ పార్టీ సోష‌ల్ మీడియా ఏపీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై  ఫోక‌స్ చేస్తారా.. కూట‌మి పార్టీల నేత‌ల మ‌ధ్య ఎప్పుడు విబేధాలు త‌లెత్తుతాయా అని గోతికాడ గుంట‌న‌క్క‌లా ఎదురు చూస్తుందా అనేది వేచి చూడాల్సిందే.

అలిపిరి దాడి సూత్రధారి.. మావోయిస్టు అగ్రనేత చలపతి హతం

మావోయిస్టులను భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్ ఒడిశా సరిహద్దుల్లో సోమవారం నుంచి మంగళవారం వరకూ రెండు రోజుల పాటు జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో పాతిక మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.   ఇక ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత రామచంద్రారెడ్డిగారి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి మరణించారు.  చలపతి అనగానే ఎవరికైనా ఠక్కున 2003లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై అలిపిరిలో జరిగిన క్లెమోర్ మైన్ దాడి గుర్తుకు వస్తుంది. ఆ దాడి సూత్రధాని, కీలక పాత్రధారి ఈ చలపతే. అప్పటి నుంచీ అజ్ణాతంలో ఉన్న చలపతి తలపై కోటి రూపాయల రివార్డ్ ఉంది. అప్పటి నుంచీ ఎక్కడా కనిపించని చలపతి ఇప్పుడు ఛత్తీస్ గఢ్, ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన వారిలో ఈ ఎదురుకాల్పుల్లో మృతి చెందిన వారిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిశా రాష్ట్ర కార్యదర్శి రామచంద్రారెడ్డి గారి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతిలో పాటు మావోయిస్టు కేంద్ర కమిటీ   సభ్యుడు మనోజ్ అలియాస్ మోడం బాలకృష్ణ, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డూ కూడా ఉన్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి. 

తెలంగాణ మహిళా  కమిషన్ కు క్షమాపణలు చెప్పిన వేణుస్వామి 

చట్టానికి అతీతులు ఎవరూ  కాదు అని  ఈ కేసు మరో మారు నిరూపణ అయ్యింది. నాగచైతన్య, శోభితల విషయమై ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై ఫిలింజర్నలిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు తెలంగాణ మహిళా కమిషన్  నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. తనను విచారణ నుంచి మినహాయించాలని  వేణుస్వామి హైకోర్టునాశ్రయించారు. అయితే వేణుస్వామికి  హైకోర్టు ఎలాంటి     మినహాయింపు ఇవ్వలేదు. మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేయడంతో వేణుస్వామికి మహిళా కమిషన్  మరో మారు  నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందుకున్న వేణుస్వామి ఇవ్వాళ విచారణకు హాజరై నాగచైతన్య దంపతులపై తాను చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు.  వ్యక్తి గత జీవితాల్లో    ఇకముందు జోక్యం చేసుకోనని  వేణుస్వామి మహిళా కమిషన్ కు వివరణ ఇచ్చారు.   వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవద్దని చట్టాలు చెబుతున్నాయి. అంతకుముందు క్రింది కోర్టు ఇదే విషయం చెప్పినప్పటికీ వేణుస్వామి హైకోర్టునాశ్రయించి మరోమారు అభాసుపాలయ్యారు. చివరకు మహిళా కమిషన్ ఎదుట హాజరై క్షమాపణలు అడిగి మరింత దిగజారిపోయారు. 

ఆంధ్రప్రదేశ్ లో సిస్కో జిసిసి సెంటర్?!

ఏపీకి సిస్కో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ (జీసీసీ) రానుందా?  ఈ సంటర్ విశాఖ పట్నంలో ఏర్పాటు కానుందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా మంత్రి నారా లోకేష్ ఎమ్ఎన్సీ ఐటీ సంస్క సిస్కో వైస్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిస్ కట్సౌదాస్ తో మంగళవారం (జనవరి 21) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిస్సో జీసీసీ అన్నివిధాల అనుకూల వాతావరణం కలిగిన విశాఖపట్నంలో జీసీసీ సెంటర్ ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. అందుకు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ప్రాన్సిస్ సానుకూలంగా స్పందించారు.  ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా వైజాగ్, విజయవాడ, తిరుపతి పరిసరాల్లో అనువైన స్థలం, ప్రతిభ కలిగిన ఐటి వృత్తినిపుణులు అందుబాటులో ఉన్నారనీ, అమెరికాలోని భారతీయ ఐటీ వర్క్ ఫోర్స్ లో పాతికశాతం మందికి పైగా తెలుగువారేనని లోకేష్ వివరించారు.   ఎఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, పునరుత్పాదక ఇంధనరంగాల్లో నైపుణ్యాభివృద్ధి ద్వారా డీప్-టెక్ హబ్‌గా ఏపీ మారనుందని,  అతిపెద్ద టాలెంట్ పూల్‌ ఉన్న దృష్ట్యా కంపెనీ దీర్ఘకాల వ్యూహానికి ఎపి అనువుగా ఉంటుందనీ లోకేష్ ఈ సందర్భంగా సస్కో వైస్ ప్రెసిడెంట్ కు వివరించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆయన  భారత్ లో త్వరలో 1.5 బిలియన్ డాలర్లు వెచ్చించి ఫ్లెక్స్ సంస్థ తయారీ భాగస్వామిగా కాంట్రాక్ట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామనీ,  సమర్థవంతమైన మానవవనరులు ఉన్న ఏపీలో తమ కార్యకలాపాలు ప్రారంభించే విషయంలో  త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.  

మహా కుంభమేళా నుంచి తేనెకళ్ల సుందరి మాయం.. కారణమేంటో తెలుసా?

ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక జాతర మహాకుంభమేలా.. అనేకానేక విషయాలలో ఈ కుంభమేళా దానికదే సాటి. ఈ కుంభమేళాకు సాధువులు, నాగసాధువులు, అఘోరాలు ఇలా జనం ముందు ఎప్పుడో కానీ కనిపించని ఎందరెందరో వస్తారు. ఇలాంటి వారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మిగులు తారు. కానీ మహాకుంభమేళా ఆరంభం నుంచీ వీళ్లెవరూ కాదు.. ఓ 16 ఏళ్ల అమ్మాయి.. అతి సాధారణ కుటుంబానికి చెందిన బాలిక కుంభమేళాకు వచ్చిన వారందరినీ విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆమెతో సెల్ఫీలు తీసుకోవడానికి జనం పోటీలు పడ్డారు. అలా పోటీలు పడ్డవారిలో చిన్నా పెద్దా, ఆడా, మగా అన్న తేడా లేదు. ఆఖరికి విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఆ అమ్మాయిని ఒక్కసారి చూసి మాట్లాడి వీలైతే ఫొటో తీసుకోవాలని ఆరాటపడ్డారు. ఇంతకీ ఆమె ప్రత్యేకత ఏమిటి? అంటే ఎవరూ చెప్పలేరు. అతి సాధారణమైన ఆ అమ్మాయి సహజత్వం, కల్మషమెరుగని మందహాసం, మరీ ముఖ్యంగా తెనెకళ్లు.. అన్నిటికీ మించి అమాయకత్వం వెరసి ఆమె గరల్ ఆఫ్ ది సాయిల్. ఆ అమ్మాయిలోని ఈ  సింప్లిసిటీ, ఈ సహజత్వమే అందరినీ ఆకర్షించింది. ఇంకే ముంది నెటిజనులు ఆ అమ్మాయికి మోనాలిసా అని పేరు పెట్టేశారు. ఆమె ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. కుంభమేళా ప్రారంభం నుంచీ  సామాజిక మాధ్యమంలో ఆమె ఫొటోలే చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి తేనెకళ్ల సుందరి హఠాత్తుగా కుంభమేళా నుంచి మాయమైపోయింది. ఎందుకు, ఏమిటి అన్న ఆరా తీస్తే.. కుంభమేళాలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసేంత స్థాయిలో అరాచకం కూడా రాజ్యమేలుతోందన్న విషయం వెలుగులోనికి వచ్చింది. నభూతో నభవిష్యతి అన్న రీతిలో ప్రశాంతంగా కుంభమేళా నిర్వహణ అంటూ సొంత భుజాలను చరిచేసుకుంటున్న యూపీలోని యోగి సర్కార్ సిగ్గుతో తలవంచుకునేలాంటి సంఘటనలూ జరుగుతున్నాయని ప్రపంచానికి తెలిసింది.    పూసలూ, రుద్రాక్షలు అమ్ముకుంటూ జీవనం సాగించే మోనాలిసా (తేనెకళ్ల సుందరి) మీడియాకు ముడి సరుకుగా మారిపోయింది. అంతే కాదు ఆకతాయిలకు టార్గెట్ కూడా అయిపోయింది. ఎక్కడపడితే అక్కడ ఆమెను అటకాయించడం, ఫొటోలు దిగాలని ఫోర్స్ చేయడం, వేధించడం ఎక్కువైపోయింది. దీనికి తోడు ఆమెలో బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా వెలుగొందిన రేఖ పోలికలు కనిపించడంతో ఫ్యూచర్ బాలీవుడ్ హీరోయిన్ అంటూ మీడియా ఊదరగొట్టేసింది.తమది  దీంతో ఆమె అడుగు బయటపెట్టాలంటే బయపడే పరిస్థితి వచ్చింది. ఆమెను కాపాడుకోవడం ఎలాగో తెలియక ఆమె తల్లిదండ్రులు మధన పడ్డారు.  చివరకు మహాకుంభమేళా నుంచి బిచాణా ఎత్తేశారు.  

తెలంగాణలో యూనీలీవర్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లు.. దావోస్ లో రేవంత్ తొలి సక్సెస్

ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్​ ఎకనమిక్​ ఫోరం శిఖరాగ్ర సదస్సులో భాగంగా దావోస్‌లో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి బృందం అక్కడ తెలంగాణ పెవిలి యన్‌ను ప్రారంభించింది. ఈ పెవిలియన్ లో కేంద్ర మంత్రులు చిరాగ్ పశ్వాన్, జయంత్ చౌదరిలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.  తెలంగాణకు సంబంధించిన పలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించారు. అలాగే  పలు అంతర్జాతీయ కంపెనీల సీఈవోలతో  రేవంత్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు భేటీ అయ్యారు. దావోస్ పర్యటనలో పెట్టుబడుల ఆకర్షణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్ప సక్సెస్ సాధించారని చెప్పవచ్చు. ఈ సదస్సులో భాగంగా రేవంత్ రెడ్డి యూనిలీవర్ సీఈవో హెయిన్ షూమేకర్ తో  భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యూనీలీవర్ తెలంగాణలో రెండు మేనిఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి ఆయనను ఒప్పించారు.  ఇక రాష్ట్రంలో యూనిలీవర్ పెట్టుబడులు వ్యాపార అవకాశాలపై  రేవంత్ రెడ్డి ప్రజంటేషన్ ను కన్విన్స్ అయిన హెయిన్ షూమేకర్ తెలంగాణలో రెండు మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చారు. 

వివేకా హత్యపై మరో సినిమా.. వస్తారు మొత్తం బయటకు వస్తారు

మాజీ మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో వైఎస్ జగన్ పార్టీ విజయానికి ఈ హత్య ద్వారా వెల్లువెత్తిన సానుభూతి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఆ ఎన్నికలకు ముందు వివేకా హత్య వెనుక ఉన్నది తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ అంటూ వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సొంత మీడియాలో నారాసుర రక్త చరిత్ర అంటూ కథనాలు వండి వార్చింది. సరే ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి అంటే 2019 ఎన్నికల సమయానికి గతంలో వైసీపీ చేసిన ప్రచారం ఇప్పుడు బూమరాంగ్ అయ్యింది. దర్యాప్తులో ఈ హత్య వెనుక ఉన్నది వైసీపీయే అన్నది దాదాపుగా తేలిపోయింది. కోర్టులు నిర్ధారించి తీర్పు వెలువరించలేదు కానీ.. దర్యాప్తు సాగిన తీరు, దానిని అడ్డుకోవడానికి వైసీపీ ప్రయత్నించిన విధానాన్ని గమనించిన జనాలకు ఈ హత్య వేనుక ఉన్నది ఎవరు? వారిని కాపాడుతున్నది ఎవరు అన్న విషయంలో సందేహాలన్నీ నివృత్తి అయిపోయాయి. సరే 2019 ఎన్నికలలో వైసీపీకి సానుభూతికి ప్రోది చేసిన వైఎస్ వివేకా హత్య.. 2024 ఎన్నికల సమయానికి వైసీపీకి, జగన్ కు పెద్ద ప్రతికూల అంశంగా మారిపోయింది. ఈ హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి జగన్ కొమ్ము కాయడం, వివేకా హత్య కేసు విషయంలో జగన్ కు వ్యతిరేకంగా డాక్టర్ సునీత నిలబడటం, ఆమెకు జగన్ స్వంత సోదరి షర్మిల మద్దతు ఇవ్వడంతో విషయాలన్నీ సందేహాలకు అతీతంగా జనానికి అర్ధమైపోయాయి.  ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికలకు ముందు ‘వివేకం’ అనే పేరుతో వైఎస్ వివేకా హత్యపై ఓ సినిమా రూపొందింది. వివేకం సినిమా థియోటర్లలో విడుదల కాలేదు. కానీ యూట్యూబ్ ద్వారా లక్షల మంది ప్రజలకు చేరువైంది. అప్పట్లో ఈ సినిమాను షర్మిల కూడా మెచ్చుకున్నారు. వివేకం సినిమాలో వాస్తవాలే చూపారని ఆమె అప్పట్లో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. సరిగ్గా ఎన్నికలకు ముందు విడుదలైన ఈ సినిమా కూడా వైసీపీ ఘోర పరాజయంలో తన వంతు పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు. ఇప్పుడు వివేక హత్య కేసుపై మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా పేరు ‘హత్య’ ఈ నెల 24న ఈ సినిమా థియోటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా సెన్సార్ బోర్డు, రివిజన్ కమిటీల మధ్య దాదాపు తొమ్మిదిన్నర నెలల పాటు ఇరుక్కుపోయింది. ఎట్టకేలకు ఈ సినిమా ఈ నెల 24న విడుదల అవుతున్నా..  సెన్సార్ బోర్డు ఈ సినిమాకు దాదాపు వంద కట్స్ వేసిందని సమాచారం. 

అతి విధేయతా.. అభద్రతతో అనవసర రచ్చ

తెలుగుదేశం కూటమి పార్టీల కార్యకర్తల మధ్య ఇప్పుడు ఓ అనవసర రచ్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఎందుకో తెలియదు కానీ ఓ విధమైన అభద్రతా భావంలో ఉన్నారా అనిపించేలా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్ నేపథ్యంలో ఈ రచ్చ మొదలైంది. దీనిపై సవాళ్లు, ప్రతిసవాళ్లుగా రెండు పార్టీల క్యాడర్ మధ్య పరిస్థితి నెలకొంది. ముందుగా తెలుగుదేశం క్యాడర్ విషయానికి వస్తే లోకేష్ తన సమర్ధతను, తన రాజకీయ పరిణితిని నిర్ద్వంద్వంగా చాటుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ఆయనే నంబర్ 2 అందులో సందేహం లేదు. పార్టీ సీనియర్ నాయకులు నుంచి కింది స్థాయి క్యాడర్ వరకూ ఎవరికీ ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగుదేశం పార్టీకి మూడో తరం రాజకీయ వారసుడు ఆయనే అన్న విషయంలో కూడా భిన్నాభిప్రాయానికి చోటే లేదు. అటువంటప్పుడు నారా లోకేష్ ఉపముఖ్యమంత్రి కావాలన్న డిమాండ్ ఎందుకో అర్ధం కాదు. ఇక ఇప్పుడు జనసేన విషయానికి వస్తే.. ఆ పార్టీ నేతలూ క్యాడర్ కూడా లోకేష్ ను చూసి భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది. అటువంటి భయాలు పూర్తిగా అర్ధరహితం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను లోకేష్ డామినేట్ చేస్తున్నారనీ, ఉప ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోతుందనీ జనసేన కార్యకర్తల భయంగా కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో  జనసేన అధికార ప్రతినిథి రాయపాటి అరుణ స్పందించిన తీరు హుందాగా ఉంది. ఓ టీవీ డిబేట్ లో పాల్గొన్న ఆమె తెలుగుదేశం నుంచి నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్ లో తప్పేముందన్నారు. ఆ పార్టీ నాయకులు, క్యాడర్ లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిగా చూడాలని భావిస్తే తప్పేముంది.. జనసేన నాయకురాలిగా తాను పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలని కోరుకుంటున్నాను. ఇది తప్పు కానప్పుడు తెలుగుదేశం నారా లోకేష్ ను మరింత ఉన్నత స్థానంలో చూడాలని కోరుకోవడాన్ని ఎలా తప్పుపట్టగలమని ప్రశ్నించారు.  తెలుగుదేశం నుంచి లోకేష్ ఉప ముఖ్యమంత్రి అన్న డిమాండ్ బయటకు రావడంతోనే జనసేనలో గాభరా మొదలైంది. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన జనసైనికులు కొందరు తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని కూలదోస్తాం, జగన్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాం అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.  అటువంటి వారందరికీ జనసేన అధికార ప్రతినిథి చక్కటి  సమాధానం ఇచ్చారు. జనసేన పార్టీకి పవన్ కల్యాణే సుప్రీం, అలాగే చంద్రబాబు తరువాతి స్థానం తెలుగుదేశంలో నిస్సందేహంగా లోకేష్ దే. కూటమి ప్రభుత్వం విషయానికి వచ్చే సరికి అది తెలుగుదేశం, జనసేనల సమష్టి వ్యవహారం. దీనిలో పార్టీల ప్రశక్తే లేదు. ఒక పార్టీ మరో పార్టీని డామినేట్ చేస్తుందనీ, ఒక నాయకుడి వల్ల మరో నాయకుడి ప్రాధాన్యత తగ్గుతుందన్న ఆందోళనలు అనవసరం. తెలుగుదేశం, జనసేనల మధ్య ఇంత వరకూ ఎటువంటి పొరపొచ్చాలూ లేవు. ఇప్పుడు కూడా అటువంటి పొరపొచ్చాలకు తావీయవలసిన అవసరం లేదు. లోకేష్ కు తక్షణం ఎలివేషన్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకుంటే.. ఆ విషయాన్ని మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో చర్చించి, ఆయన అంగీకారంతోనే ఆ పని చేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. జనం కూటమి ప్రభుత్వానికి ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలని పగ్గాలు అప్పగించారు. ఇటువంటి చిన్న చిన్న విషయాలలో అసవసర రచ్చ చేసుకుని రోడ్డున పడితే మసకబారేది ఆయా పార్టీల అధినేతల ప్రతిష్ఠే.  ఇక విషయానికి వస్తే ఈ విషయంలో తెలుగుదేశం నాయకులు ఒకింత అతి చేశారని చెప్పక తప్పదు. విధేయతా ప్రదర్శనలో ముందుండాలన్న భావనతోనే ఒకరు డిప్యూటీ సీఎం లోకేష్ అంటే మరి కొందరు మరో అడుగు ముందుకు వేసి సీఎం లోకేష్ అంటూ చేసిన అతే.. జనసేనలో గాభరాకు కారణమైందని చెప్పాలి. మొత్తానికి ఈ విషయంలో జనసేన, తెలుగుదేశంలు రెండూ ఒకింత అపరిపక్వతతోనే వ్యవహరించాయి. ఇప్పటికైనా సంయమనం పాటించి ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టడం అన్ని విధాలుగా మంచింది. 

హవ్వ.. మోనాలిసాపై  ఆకతాయిల వేధింపులు 

నిన్న ,మొన్నటి వరకు ఆమె ఎవరో ఎవరికీ తెలియదు. కానీ నేడు దేశవ్యాప్తంగా సెన్సెషన్ అయ్యారు. సోషల్ మీడియా పుణ్యమా అని మోనాలిసా ఒక్కసారి స్టార్ సెలబ్రిటీ అయ్యారు. కుంభమేళకు వచ్చిన ఒకరు తొలుత ఆమె ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేం అమాంతం  ఆమె సెలబ్రిటీ   అయ్యారు. చూడచక్కని అందం ఆమె స్వంతం అని నిరూపించుకున్నారు. వంద, రెండొందలకు పూజలమ్మే మోనాలిసా మధ్య ప్రదేశ్ ఇండోర్ ప్రాంతానికి చెందిన వారు. ఆమె ఫోటో నెట్టింట వైరల్ అవడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు కుంభమేళలో ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిన మోనాలిసాపై వేధింపులు ఎక్కువయ్యాయి. ఇండోర్ కు చెందిన మోనాలిసా కుటుంబం పూసలమ్ముకుని జీవనం సాగిస్తుంది.  మోనాలిసా చూడచక్కని కళ్లు, మోముపై చిరునవ్వు కుంభమేళకు వచ్చిన వారిని ఆకర్షించింది. ఇంకే ఆమెతో సెల్ఫీలు దిగడం ప్రారంభించారు. కొందరు ఆకతాయిలు తమతో ఫోటోలు దిగాలని ఫోర్స్ చేశారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. చేతులు పట్టుకున్నారు.  దీంతో వారి పూసల వ్యాపారం అటుంచి నాన్ స్టాప్ నా న్సెన్స్ అయ్యింది. చేసేదేమి లేక మోనాలిసా కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి పంపించి వేశారు. కుంభమేళ అంటే ఆధ్యాత్మిక వేడుక. ఈ వేడుకలో కూడా మోనాలిసాపై ఈ విధంగా వ్యవహరించడం పట్ల ప్రతీ ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు.   

నక్సల్స్ రహిత భారత్ దిశగా గొప్ప ముందడుగు.. ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ పై అమిత్ షా

నక్సల్స్ రహిత భారత్ లక్ష్యంతో కేంద్రం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే మావోయిస్టులకు బలమైన పట్టు ఉన్న ఛత్తీస్ గఢ్ లో వారి పునాదులను పెకలించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. వరుస ఎన్ కౌంటర్లతో వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. తాజాగా  ఛత్తీస్ గఢ్- ఒడిశా సరిహద్దులో సోమవారం నుంచి మంగళవారం వరకూ జరిగిన ఎన్ కౌంటర్ లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. దీనిపై  కేంద్ర హోంమంత్రి స్పందించారు. ఛత్తీస్ గఢ్ - ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ లో 16 మంది మావోయిస్టులుకదలికలపై నిఘా ఉంచి వరుస ఎన్ కౌంటర్లతో  16 మంది నక్సల్స్ మరణించిన ఘటన భ్రదతాదళాలు సాధించిన గొప్ప విజయంగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. నక్సల్ రహిత భారత్ దిశగా ఇదో గొప్ప ముందడుగని పేర్కొన్నారు. ఇలా ఉండగా ఇటీవలి కాలంలో ఛత్తీస్ గఢ్ లో వరుస ఎన్ కౌంటర్ లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే. తాజాగా ఒడిశా సరిహద్దులో భద్రతా దళాలు, మావోలకు మధ్య ఎదురు కాల్పులు సోమవారం మొదలయ్యాయి. ఇంకా కొనసాగుతున్నాయని చెబుతున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో ఇప్పటి వరకూ 16 మంది మావోలు హతమయ్యారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.  

ఏపీలో భారీగా ఐపీఎస్ ల బదలీలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున  ఐపీఎస్ అధికారులను   బదిలీ చేసింది. మొత్తం 27 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ సీఎస్ విజయానంద్ సోమవారం రాత్రి   ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదలీలలో పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్న కొందరికి పోస్టింగులు లభించాయి.  తిరుపతిలో తొక్కిసలాటకు బాధ్యులుగా భావిస్తూ బదిలీ కి గురై పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న తిరుపతి మాజీ ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ కు ఈ బదిలీల్లో పోస్టింగ్ లు ఇచ్చారు. కేంద్రంలో డిప్యుటేషన్ ముగించుకొని వచ్చిన మధుసూదన్ రెడ్డి, పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న పాలరాజుకు కూడా పోస్టింగులు దక్కాయి.  ఇక  ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ చైర్మన్‌గా రాజీవ్ కుమార్ మీనాను నియమించారు. రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా ఎన్ మధుసూదన్ రెడ్డి. ఐజీ ఆపరేషన్స్ గా సీహెచ్ శ్రీకాంత్ నియమితులయ్యారు.  అలాగే టెక్నికల్‌ సర్వీసెస్‌ ఐజీగా  ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇకపోతే ఏపీ ఎస్పీ బెటాలియన్ ఐజీగా బీ రాజకుమారి, ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ గా జీ పాల రాజుకు పోస్టింగ్ ఇచ్చారు.  తిరుపతి ఎస్పీగా హర్షవర్దన్ రాజు, తిరుపతి జిల్లా ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా సుబ్బారాయుడులను నియమించారు.  కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ను కర్నూలు ఎస్పీగా బదిలీ చేశారు. ఇక ఆయన స్థానంలో కాకినాడ ఎస్పీగా బిందు మాధవ్ ను నియమించారు. కడప ఎస్పీగా అశోక్ కుమార్, ఏసీబీ డైరెక్టర్ గా ఆర్. విజయలక్ష్మి, ఎపీఎస్పీడీజీపీగా ఫక్కీరప్పలను నియమిస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.  పీటీవో డీఐజీగా సత్యఏసుబాబు,  వెల్ఫేర్‌ అండ్‌ స్పోర్ట్స్‌ డీఐజీగా అన్బురాజన్‌‌, ఏపీఎస్పీ కర్నూల్‌ రెండో బెటాలియన్‌ కమాండెంట్‌గా ఎం దీపిక, అదే విధంగా ఎస్‌సీఆర్‌బీ, సీఐడీ ఎస్పీగా పి పరమేశ్వరరెడ్డి నియమితులయ్యారు. కో-ఆర్డినేషన్, హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ లీగల్‌ ఎస్పీగా కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి,  సీఐడీ ఎస్పీ లుగా ఎన్‌ శ్రీదేవి రావు, ఎస్‌ శ్రీధర్‌, కె చక్రవర్తి,  ఇంటెలిజెన్స్‌ ఎస్పీలుగా జె రామ మోహన్‌రావు, ఎ రమాదేవిలను నియమించారు. విశాఖపట్నం, విజయవాడ అడ్మినిస్ట్రేషన్ డీసీపీలుగా కృష్ణకాంత్‌ పటేల్‌, సరిత, అల్లూరి సీతారామరాజు జిల్లా అదనపు ఎస్పీగా ధీరజ్‌ కునుబిల్లి , అల్లూరి సీతారామరాజు జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌)గా జగదీశ్‌‌ను నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. 

దిగ్గజ కంపెనీల అధిపతులతో వరుస భేటీలు.. దావోస్ లో చంద్రబాబు బిజీబిజీ

దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. దిగ్గజ కంపెనీల అధిపతులతో వరుస భేటీలతో ఆయన బిజీబిజీగా ఉన్నారు. వెల్స్‌పన్ చైర్మన్ బీకే గోయింకా, ఎల్జీ కెమ్ సీఈవో షిన్ హక్ చియోల్, కార్ల్స్‌బెర్గ్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్, టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, వాల్‌మార్ట్ ప్రెసిడెంట్- సీఈవో కాత్ మెక్‌లే, సిస్కో సీఈవో చుక్ రాబిన్స్, కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ తదితరులను ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నారు. ఒకరి తరువాత ఒకరితో వరుస సమావేశాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.  వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో రెండో రోజూ (జనవరి 21) వరుస సమావేశాల్లో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.  దాదాపు 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి, భేటీలు నిర్వహించనున్నారు. గ్రీన్ హైడ్రోజన్ - గ్రీన్ మాన్యుఫాక్చరింగ్, నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్, ఎనర్జీ ట్రాన్సిషన్, బ్లూ ఎకానమీ సదస్సులు - రౌండ్ టేబుల్ సమావేశాలకు చంద్రబాబు హాజరుకానున్నారు. సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాన్ కిమ్ యాంగ్, యూఏఈ ఎకానమీ మినిస్టర్‌తోనూ ఆయన మంగళవారం (జనవరి 21)   భేటీ అవుతారు.  బ్లూమ్‌బెర్గ్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించనున్నారు. కాగా  మిట్టల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్‌, సీఈఓ ఆదిత్య మిట్టల్‌తో సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్  , టీజీ భరత్ మంగళవారం (జనవరి 21) సమావేశమయ్యారు. ఆర్సెలర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ సంయుక్తంగా 17.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయడానికి ఇప్పటికే అంగీకారం కుదిరిన విషయం తెలిసింద. ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే అంశంపై ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది. కాగా సోమవారం  వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు ఘనంగా ప్రారంభమైంది.  దావోస్ కాంగ్రెస్ సెంటర్‌లో ప్రారంభమైన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు  రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా హాజరైన పారిశ్రామికవేత్తలతో పెట్టుబడుల అవకాశాలు, పొటెన్షియల్ కొలాబరేషన్స్‌పై చర్చించారు. దావోస్ కాంగ్రెస్ సెంటర్ ప్లీనరీ హాలు లాబీలో ఏర్పాటు చేసిన నెట్ వర్కింగ్ డిన్నర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమల మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలను పారిశ్రామిక వేత్తలకు సీఎం చంద్రబాబు వివరించారు.

దావోస్ వేదికగా చంద్రబాబులోని మరో కోణాన్ని బయటపెట్టిన లోకేష్

చంద్రబాబు అంటే అపర చాణక్యుడు, సంక్షోభంలో అవకాశాలు వెతుక్కుని ముందుకు సాగే వ్యూహకర్త, అపార అనుభవం ఉన్న రాజకీయవేత్త.. దార్శనికుడు అనే అందరికీ తెలుసు అయితే దావోస్ వేదికగా ఆయనలోని మరో కోణాన్ని ఆయన తనయుడు నారా లోకేష్ బయటపెట్టారు. తన తండ్రి చంద్రబాబు అంటే ఒక రాజకీయవేత్తగానే అందరికీ తెలుసు కానీ ఆయనలో ఒక వ్యాపారవేత్త ఉన్నాడని చెప్పారు. అయితే  ఆ వ్యాపారవేత్త దారుణమైన నష్టాలను చవి చూశారని వెల్లడించారు. హెరిటేజ్ కు ముందు సీబీఎన్ అనుక వ్యాపారాలు చేశారనీ, వాటిలో దారుణంగా నష్టపోయారనీ చెప్పారు. అయితే నష్టాలకు వెరవకుండా ఆయన ముందుకే సాగారన్న లోకేష్ చివరకు హెరిటేజ్ ను స్థాపించారని వివరించారు. ఇప్పుడు హెరిటేజ్ ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు.  అదే విధంగా ఆయన రాజకీయాలలోనూ ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా అనేక ప్రయోగాలు చేశారనీ, భవిష్యత్ ను ముందుగానే దర్శించిన దార్శనికుడని చెప్పిన లోకేష్.. తెలుగు వారు ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో రాణిస్తున్నారంటే అందుకు అప్పట్లో ఆయన విద్యావిధానంలో తీసుకువచ్చిన మార్పులే కారణమన్నారు. దావోస్ లో సోమవారం (జనవరి 20) నుంచి ప్రారంభమైన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం వెళ్లిన నారా లోకేష్ జ్యూరిల్ లో తెలుగు పారిశ్రామిక వేత్తల సదస్సులో ప్రసంగించారు. ఈ సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచీ దాదాపు 180 మంది తెలుగు పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. వీరిలో మహిళా పారిశ్రామిక వేత్తలు కూడా ఉన్నారు. వీరిని ఉద్దేశించి చేసిన తన ప్రసంగంలో ఆయన ఇక్కడ ఇంత మంది తెలుగు వారిని చూస్తుంటే ఆనందంగా ఉంది.. అసలు జ్యూరిచ్ లో ఉన్నానా.. జువ్వలపాలెంలో ఉన్నానా అన్న ఆశ్చర్యం కలుగుతోందని చమత్కరించారు.   ఇక వైసీపీ హయాంలో అన్ని విధాలుగా భ్రష్ఠుపట్టిన ఆంధ్రప్రదేశ్ ను చంద్రబాబు గాడిలో పెడుతున్నారనీ, ప్రస్తుతం రాష్ట్రం కష్టాల నుంచి గట్టెక్కి అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందనీ చెప్పిన నారా లోకేష్.. ఇప్పుడు రాష్ట్రానికి మీరంతా సహకారం అందిచాలన్నారు. పెట్టుబడులకు ఏపీ స్వాగతం పలుకుతోందనీ, మీరంతా స్పందించి ముందుకు రావాలని కోరారు.