హవ్వ.. మోనాలిసాపై ఆకతాయిల వేధింపులు
posted on Jan 21, 2025 @ 1:15PM
నిన్న ,మొన్నటి వరకు ఆమె ఎవరో ఎవరికీ తెలియదు. కానీ నేడు దేశవ్యాప్తంగా సెన్సెషన్ అయ్యారు. సోషల్ మీడియా పుణ్యమా అని మోనాలిసా ఒక్కసారి స్టార్ సెలబ్రిటీ అయ్యారు. కుంభమేళకు వచ్చిన ఒకరు తొలుత ఆమె ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేం అమాంతం ఆమె సెలబ్రిటీ అయ్యారు. చూడచక్కని అందం ఆమె స్వంతం అని నిరూపించుకున్నారు. వంద, రెండొందలకు పూజలమ్మే మోనాలిసా మధ్య ప్రదేశ్ ఇండోర్ ప్రాంతానికి చెందిన వారు. ఆమె ఫోటో నెట్టింట వైరల్ అవడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు
కుంభమేళలో ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిన మోనాలిసాపై వేధింపులు ఎక్కువయ్యాయి. ఇండోర్ కు చెందిన మోనాలిసా కుటుంబం పూసలమ్ముకుని జీవనం సాగిస్తుంది. మోనాలిసా చూడచక్కని కళ్లు, మోముపై చిరునవ్వు కుంభమేళకు వచ్చిన వారిని ఆకర్షించింది. ఇంకే ఆమెతో సెల్ఫీలు దిగడం ప్రారంభించారు. కొందరు ఆకతాయిలు తమతో ఫోటోలు దిగాలని ఫోర్స్ చేశారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. చేతులు పట్టుకున్నారు. దీంతో వారి పూసల వ్యాపారం అటుంచి నాన్ స్టాప్ నా న్సెన్స్ అయ్యింది. చేసేదేమి లేక మోనాలిసా కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి పంపించి వేశారు. కుంభమేళ అంటే ఆధ్యాత్మిక వేడుక. ఈ వేడుకలో కూడా మోనాలిసాపై ఈ విధంగా వ్యవహరించడం పట్ల ప్రతీ ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు.