తెలంగాణలో మరో ఎన్నికకు మోగిన నగారా

హైద్రాబాద్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవి వచ్చే మే 1తో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్డ్ విడుదల చేసింది.  ఈ నెల 28 నుంచి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ  నోటిఫికేషన్తో మొదలవుతుంది. వచ్చే  నెల 23న ఎన్నిక ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి మిత్ర పక్షంగా ఉన్న మజ్లిస్ ఈ స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. ఏప్రిల్ నాలుగో తేదీవరకు నామినేషన్లు స్వీకరిస్తారు.  అదే నెల ఏడో తేదీన నామినేషన్ల స్కూట్ని ఉంటుంది. ఏప్రిల్ 9 వతేదీ వరకు   నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు.  ఏఫ్రిల్ 23న పోలింగ్ , 25న ఫలితాలు వెల్లడికానున్నాయి.   

విధుల నుంచి జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపు!?

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో నోట్ల కట్టలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సొమ్మంతా లెక్కల్లో చూపనిదిగా తేలింది.  లెక్కల్లో చూపని సొమ్ము కట్టలు కట్టలుగా ఆయన నివాసంలో బయటపడింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో   అగ్నిప్రమాదం సంభవిం చడంతో ఈ నోట్ల కట్టల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.   ఓ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో ఇంత భారీ ఎత్తున నగదు ప్రత్యక్షమవడం న్యాయవర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై సుప్రీం కోర్టు సీజేఐ సంజీవ్ కన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నేతృత్వంలోని కొలీజియం అత్యవసరంగా సమావేశమై జస్టిస్ యశ్వంత్ వర్మపై చర్యలు తీసుకుకుంది. ఆయనను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. అయితే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ దీనిని వ్యతిరేకించింది.   దీంతో జస్టిస్ యశ్వంత్ వర్మకు ప్రస్తుతానికి న్యాయపరమైన ఎటువంటి బాధ్యతలూ అప్పగించరాదని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఆ వెంటనే   ఢిల్లీ హైకోర్టు అధికారిక వెబ్ సైట్ నుంచి ఆయనకు సంబంధించిన అన్ని వివరాలను సైతం తొలగించారు. అలాగే నోట్ల కట్టల విషయంలో పూర్తి స్థాయి దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ ను నియమించింది.    

స్వామి స్వరూపానంద భూ కబ్జాపై నోటీసులు

జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై కూటమి సర్కార్ చర్యలు తీసుకుంటోంది. అందులో బాగంగానే జగన్ కు రాజగురువుగా గుర్తింపు పొందిన స్వరూపానందకు నోటీసులు జారీ అయ్యాయి. స్వరూపానంద స్వామికి చెందిన   ఆశ్రమంలో ఇరవై రెండు సెంట్ల   ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినట్లుగా తేల్చిన అధికారులు ఆ స్థలంలో నిర్మించిన కట్టడాలను తొలగిం చాలని నోటీసులు జారీ చేశారు.   తొలుత చినముషిడి వాడలో శారదాపీఠం పేరుతో ఆశ్రమం ఏర్పాటు చేశారు. ఆ ఆశ్రమం పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. జగన్ హయాంలో ఈ కబ్జాకు సంబంధించి ఫిర్యాదులు అందినా పట్టించుకోలేదు. దీంతో దాదాపు 15 వందల గజాల స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టి పూర్తి చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కబ్జాలపై ఉక్కుపాదం మోపుతోంది. నోటీసులు జారీ చేసినప్పటికీ స్వరాపానంద విశాఖలో అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడీ నిర్మాణాలు తొలగిస్తారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

తమ్మినేని డిగ్రీ చదువుకున్నారా? కొన్నారా? తేల్చనున్న ప్రభుత్వ విచారణ

రాజకీయాల్లో రాణించడానికి చదువు అవసరం లేదు. రాజకీయ ప్రవేశానికి కానీ, పదవులకు కానీ చదువు అనేది ఒక అర్హత కానే కాదు. పంచాయతీ  బోర్డు సభ్యడి నుంచి ప్రధాని పదవి వరకూ దేనికీ ఎటువంటి విద్యార్హతా అక్కర్లేదు.  ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేయవచ్చును. ప్రజలు ఆదరించి గెలిపిస్తే ఎమ్మెల్ల్యే, ఎంపీ , మంత్రి,  ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి  ఇలా ఏదైనా కావచ్చు. ఏ పదవికీ చదవు సంధ్యలు అవసరం లేదు. డిగ్రీలు అక్కరలేదు. అయినా   రాజకీయ నాయకుల విద్యార్హతలు, డిగ్రీలు తరచూ వివాదం అవుతూనే ఉన్నాయి.  ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీలపై వివాదం నడిచిన సంగతి తెలిసిందే. మోదీ విద్యార్హతలు, డిగ్రీలకు సంబంధించిన సమాచారం కోసం సమాచార హక్కు చట్టం కింద తెలుసుకునేందుకు అప్పట్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న  అరవింద్ కేజ్రివాల్  చేసిన ప్రయత్నాలు ఫలిచలేదు.   అలాగే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మాజీ మంత్రి స్మృతీ ఇరానీ ..ఇంకా కొందరు ముఖ్య నేతలకు సంబందించిన  విద్యార్హతల విషయంలోనూ విషయంలోనూ వివాదాలు చెలరేగాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్  తమ్మినేని  సీతారం పేరు ఈ జాబితాలో ఉంది.  ఆయన   డిగ్రీ చదువు కోలేదనీ, చదువు కొన్నారనీ తెలుగుదేశం గతంలో ఆరోపించింది.  సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ కూడా చేసింది. అదలా ఉంచితే  స్వయంగా తమ్మినేని సీతారాం తాను డిగ్రీ చదువు కోలేదని అప్పట్లోనే అంగీకరించేశారు. అంగీకరించడమంటే నేను డిగ్రీ చదువుకోలేదు.. డిగ్రీ కొనుక్కున్నాను స్వయంగా తనంతట తాను చెప్పడం కాదు.  ఆముదాలవలస వైసీపీ అభ్యర్థిగా పోటీకి ఆయన దాఖలు చేసిన నామినేషన్ సందర్భంగా సమర్పించిన  అఫిడవిట్ లో ఆయన విద్యార్హతకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. తమ్మినేని ఎన్నికల అఫిడవిట్ లో డిగ్రీ డిస్ కంటిన్యూ అని ఉంది. మరి డిగ్రీ పూర్తి కాకుండా తమ్మినేని లా ఎలా చేశారు? అన్న చర్చ అప్పట్లో గట్టిగా జరిగింది. అయితే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో దీనిని పట్టించుకోలేదు. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. తమ్మినేని విద్యార్హతలపై ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం ఈ విషయంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.  దీంతో తమ్మినేని డిగ్రీ సర్టిఫికెట్ నకిలీదా? కాదా అన్నది ఈ విచారణ తేల్చనున్నది. తమ్మినేని స్వయంగా తన ఎన్నికల అఫిడవిట్ లో డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్న నేపథ్యంలో ఆయన డిగ్రీ సర్టిఫికెట్ ఎక్కడిది? ఎలా వచ్చింది? డిగ్రీ చేయకుండా లా ఎలా చదివారు ఇత్యాది విషయాలన్నీ దర్యాప్తులో తేలనున్నాయి. 

హైదరాబాద్ లో   బాలివుడ్ నటిపై అత్యాచార యత్నం..  పరారీలో నిందితులు

హైద్రాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది.  మాసాబ్ ట్యాంక్ శ్యామలా నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో చోటు చేసుకున్నఈ ఘటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఓ షాప్ ఓపెనింగ్ కోసం సదరు బాలివుడ్ నటిని  నిర్వాహకులు ఆహ్వానించారు. ప్లైట్ చార్జిలు, రెమ్యునరేషన్ మాట్లాడుకున్న నటి బస చేయడానికి అపార్ట్ మెంట్ లోని ఓ గదిని కేటాయించారు. అపార్ట్ మెంట్ కు  శుక్రవారం (మార్చి 21) రాత్రి గుర్తు తెలియని యువకులు  వచ్చారు. వారి వెంట ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ముగ్గురు యువకులతో  వ్యభిచారం చేయమని  ఆ మహిళలు ఒత్తిడి తెచ్చారు. నటి ప్రతిఘటించినప్పటికీ యువకులు కాళ్లు , చేతులు తాళ్లతో కట్టేసి అత్యాచారయత్నం చేశారు. దీంతో నటి పెద్దగా అరవడంతో యువకులు నటి దగ్గర ఉన్న 50 వేల నగదు తీసుకుని పారిపోయారు. ఈ   వర్దమాన నటి  పలుబాలివుడ్ చిత్రాలు, టీవీ సీరియల్స్ లో నటిస్తుంది . అపార్ట్ మెంట్ నుంచి ఎలాగో అలా బయటపడ్డ నటి 100 కు డయల్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

చిక్కుల్లో మాజీ స్పీకర్ తమ్మినేని 

ఎపి మాజీ సభాపతి తమ్మినేని సీతారాం చిక్కుల్లో చిక్కుక్కున్నారు. తాజాగా  ఆయన చుట్టూ నకిలీ డిగ్రీసర్టిఫికేట్  వివాదం చుట్టుకుంది. టిడిపి ఎమ్మెల్యే  కూనరవికుమార్ ఫిర్యాదు మేరకు సిఐడి విచారణ చేయనుంది. తమ్మినేని మొదట్నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ వస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్ లో మాజీ సభాపతి  తప్పుడు ధ్రృవపత్రం సమర్పించినట్లు  కూనరవికుమార్ ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి, సిఐడిలకు వేర్వురుగా ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. తమ్మినేనిపై చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది.  కూనరవికుమార్ ఫిర్యాదును సిఐడి స్వీకరించింది. తమ్మినేనికి నోటీసులు జారి చేయనుంది. తమ్మినేనిపై వచ్చిన ఆరోపణలపై  గత వైకాపా ప్రభుత్వం  ఉదాసీనంగా వ్యవహరించింది. 

ఢీ.. లిమిటేషన్.. దక్షిణాది రాష్ట్రాల భయాలేంటి?!

ఆలు లేదు చూలు లేదు .. కొడుకు పేరు సోము లింగం అన్నట్లు, లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజన అంశం పై, ఏడు రాష్ట్రాలకు చెందిన 14 పార్టీల నాయకులు చెన్నై లో సమావేసమయ్యారు. అయితే, దాహం వేసినప్పడు బావిని తవ్వడం కంటే, రేపటి అవసరాన్ని ముందుగానే గుర్తించి, ముందుగానే పలుగు పార ఎత్తడం విజ్ఞత అనిపించుకుంటుంది. సో.. నియోజక వర్గాల పునర్విభజన ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి, అడుగు ముందు కేయడం తప్పేమీ కాదు. అయితే, ఇలాంటి సున్నితమైన అంశాల విషయంలో ఇటూ అటూ కూడా ఆచి తూచి అడుగులు వేయడం అవసరం.  నిజానికి డిలిమిటేషన్ కు సంబందించి కేంద్ర ప్రభుత్వం మనసులో ఏముందో  ఎవరికీ తెలియదు. ఇందుకు సంబందించి, దక్షిణాది రాష్ట్రాల్లో  ‘ఒక్క’ సీటు కూడా తగ్గదు అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా  చేసిన ప్రకటన తప్ప  కేంద్రం నోటి నుంచి మరొక్క మాట బయటకు రాలేదు. అసలు కేంద్రం మనసులో ఏముందో  తెలియక  పోవడమే కాదు.. ఇటు  నుంచి  మరో పాతికేళ్ళు, లోక్ సభ స్థానాల సంఖ్య విషయంలో  యథాతథ స్థితిని కొనసాగించాలనే ప్రతిపాదన తప్ప మరో ప్రత్యామ్నాయ ప్రతిపాదన ఏదీ పస్పుటంగా బయటకు రాలేదు. అదొకటి అయితే అసలు డిలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభానికే ఇంకా చాలా సమయం వుంది. అంతకు ముందు జనగణన జరగాలి. జనగణనతో ముడి పడిన కుల గణన కుంపటి ఒకటి అలా  రగులుతూనే వుంది. ఈ అన్నిటినీ మించి మరో పాతికేళ్ళ పాటు, పునర్విభజన జోలికి వెళ్లరాదని, 2001 వాజపేయి ప్రభుత్వం విధించిన గడవు 2026లో గానీ ముగియదు. ఆ గడువు ముగిసన తర్వాతనే పునర్విభజన గురించి ఆలోచన చేస్తామని, అంతవరకు పునర్విభజన జరిపేది లేదని గతంలోనే మోదీ ప్రభుత్వం పార్లమెంట్ కు స్పష్టం చేసింది.ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా లోక్’సభ.శాసన సభ సీట్ల సంఖ్యను పెంచాలని, బీఆర్ఎస్ నోటి మాటగానే కాదు లిఖిత పుర్వకంగానూ సమాధానం ఇచ్చింది.  అయితే  జనాభా దామాషా ప్రాతిపదికన లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్  లేవనెత్తిన ఆందోళన  దక్షణాది రాష్ట్రాలను ఏకం చేసింది. ఈ నేపధ్యంలో దక్షిణాది రాష్టాల ఐక్య వేదిక పురుడు పోసుకుంది. ఐక్య వేదిక తొలి సమావేశం ఆదివారం(మార్చి 22) చెన్నైలో  జరిగింది.  తమిళ నాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత ఎంకే స్టాలిన్  నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హాజరయ్యారు. అలాగే  కేరళ ముఖ్యమంత్రి  విజయన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, పంజాబ్ ముఖ్యమంత్రి భగంత్ మాన్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిథి స్టాలిన్ తోపాటుగా మరికొందరు ముఖ్యనాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై ఐక్య పోరాటం సాగించాలని తీర్మానం చేశారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మరో అడుగు ముందుకేసి ‘‘జనాభా దామాషా ప్రాతిపదికన పునర్విభజనను దక్షిణాది వ్యతిరేకిస్తోంది. బీజేపీ ప్రతిపాదిస్తున్న ఈ పద్ధతిలో పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల్లోని మనం రాజకీయ గళం కోల్పోతాం. ఉత్తరాది మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా తగ్గించి వేస్తుంది. అప్పుడు ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌ వంటి రాష్ట్రాలు ఆధిపత్యం చెలాయిస్తాయి అని సీఎం రేవంత్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దీనికి అంగీకరించకూడదని,  దీనికి వ్యతిరేకంగా దక్షిణాది ప్రజలు, పార్టీలు, నేతలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. అంతే కాదు,  పునర్విభజన ప్రక్రియపై రాష్ట్ర శాసన సభలో త్వరలోనే తీర్మానం ఆమోదిస్తామని, అదే తరహాలో మిగిలిన రాష్ట్రాల్లోనూ తీర్మానం చేయాలని సహచర ముఖ్యమంత్రులు, ఇతర నేతలకు రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పునర్విభజనపై తదుపరి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తానని, పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడంపై అప్పుడు చర్చిద్దామని ప్రతిపాదించారు. ఈ పోరాటంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తానని, దక్షిణాదిలోని ప్రతి ఒక్కరూ హక్కుల రక్షణకు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఒక విధంగా చూస్తే, తమిళనాడు సిఎం  స్టాలిన్ లేవనెత్తిన అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి చంక నెత్తు కున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్ణాటక ఉపముఖ్యమంత్రి  డీకే శివకుమార్ కూడా సభకు హజరైనా, రేవంత్ రెడ్డి కొంచెం ఎక్కువ చురుగ్గా వ్యవహరించడం.. తదుపరి సమావేశం హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించడం విషయంలో రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక మవుతున్నాయి, అలాగే  ఈ విష యం లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే పడవలో ప్రయాణించడం పట్ల కూడా  అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.

జగన్, కేసీఆర్ పై సోము విమర్శల వర్షం.. కారణం అదేనా?

కూటమి పార్టీలలో ఎవరికీ ఇష్టం లేకపోయినా.. బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు అధిష్ఠానం ఆశీస్సులతో ఎమ్మెల్సీ అయిపోయారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏపీ నేతలు ఎవరూ కూడా అధిష్ఠానం నుంచి సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ టికెట్ ఆఘ‘మేఘా’లపై వస్తుందని ఊహించలేదు. చివరి నిముషంలో కమలం సోము వీర్రాజు పేరు ప్రతిపాదించి, అంతే వేగంగా తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేత ఆమోదముద్ర వేయించుకుని తెలంగాణ నుంచి ఓ విమానంలో సోము పేరు మీద బీఫాంను, హస్తిన నుంచి మరో విమానంలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని అమరావతిలో ల్యాండ్ చేసింది. అలా చివరి నిముషాలలో సోము వీర్రాజు చేత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా నామినేషన వేయించింది. అది పక్కన పెడితే.. ఎవరి వాడూ కాకుండానే ఏపీలో ఎమ్మెల్సీ అయిపోయిన వీర్రాజు ఇప్పుడు కూటమి పార్టీల్లో అందరి వాడు అనిపించుకోవడానికి నానా తంటాలూ పడుతున్నారు.  అసలు 2024 ఎన్నికలకు ముందు పొత్తును గట్టిగా వ్యతిరేకించిన బీజేపీ నేత ఎవరైనా ఉన్నారంటే అది సోము వీర్రాజు మాత్రమే. పైకి పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడమే లక్ష్యమంటూ కబుర్లు చెప్పినా, తెలుగుదేశంతో బీజేపీ, జనసేనలు జట్టు కట్టకుంటే జగన్ కు ప్రయోజం చేకూరుతుందన్న ఉద్దేంతోనే సోము వీర్రాజు గతం మరిచిన గజనీలా వైసీపీ అధినేత సోము జగన్ పై తీవ్రస్థాయి విమర్శలు గుప్పిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎంత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించినా  జగన్ విషయంలో సోముకు ఇంకా సాఫ్ట్ కార్నర్ పోలేదనే పరిశీలకులు అంటున్నారు. తాజాగా ఆయన జగన్, కేసీఆర్ లపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ బాయ్ కాట్ విషయంలో జగన్ వి ద్వంద్వ ప్రమాణాలన్నారు. మరో సారి అధికారంలోకి రావాలని జగన్ కలలు కంటున్నారనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగదని జోస్యం చెప్పారు. అదే సమయంలో కేసీఆర్ పై మాత్రం తీవ్ర స్థాయిలో విరుకుకుపడ్డారు. కేసీఆర్ ను గుంటనక్కతో పోల్చారు. కేసీఆర్ మానసిక సమతుల్యం కోల్పోయారనీ, ఆయనకు రాత్రిళ్లు నిద్రపోలేరరనీ, వింత వింత రాజకీయ వ్యాఖ్లు చేస్తున్నారనీ సోము విరుచుకుపడ్డారు. ప్రజలను మభ్యపెట్టి పదేళ్ల పాటు అధికారం చెలాయించారనీ, ఆయన నిజస్వరూపం తెలిసిన తరువాత జనం ఛీకొట్టారనీ సోము అన్నారు. అక్కడితో ఆగకుండా చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి కోసం పని చేస్తోందన్నారు.. అదే సమయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమారుడు, కుమార్తె, మేనల్లుడు పెరిగితే చాలని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. మొత్తం మీద సోము వీర్రాజు అనూహ్యంగా కేసీఆర్ ప్రస్తావన తీసుకువచ్చి మరీ విమర్శలు గుప్పించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశమైంది.  ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అధికారంలోకి రావడానికి పొత్తులే కారణమని కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే సోము వీర్రాజు ఈ విమర్శలు చేశారని పరిశీలకులు అంటున్నారు. ఏది ఏమైనా నిన్న మొన్నటి వరకూ జగన్ కు గట్టి మద్దతుదారైన సోము వీర్రాజు ఏకకాలంలో జగన్ ను ఆయన మిత్రుడు కేసీఆర్ ను విమర్శించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ మనిషిగా ముద్రపడిన వీర్రాజు ఇప్పుడు ఆ ముద్రను చెరిపేసుకునేందుకే ఇలా మాట్లాడుతున్నారని అంటున్నారు.   

ఎంఎంటిఎస్ లో  అత్యాచారయత్నం..రన్నింగ్ ట్రైన్  నుంచి దూకిన బాధితురాలు

సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది.  సికింద్రాబాద్ నుంచి మేడ్చెల్ వెళ్లే ఎంఎంటిఎస్ రైలులో  యువతిపై గుర్తుతెలియని యువకుడు అత్యాచారయత్నం చేయబోయాడు. తప్పించుకునేందుకు ఆ యువతి భోగిలో  నుంచే దూకేసింది. దీంతో ఆ యువతి తీవ్ర రక్త స్రావంతో గాయాలపాలైంది. చికిత్స నిమిత్తం ఆ యువతిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.  ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన చేసుకుంది. ఆ యువతిని కాపాడే నాథుడే లేకపోవడంతో కొంపల్లి స్టేషన్  సమీపంలో దూకేసింది. మేడ్చెల్ లో ప్రయివేటు హాస్టల్ లో ఉండే ఈ యువతి మొబైల్ ఫోన్  రిపేర్ చేసుకోవడానికి సికింద్రాబాద్ చేరుకుంది. రిపేర్ అయ్యాక తిరుగు పయనమైంది. ఒక్కో స్టేషన్ లో ప్రయాణికులు దిగిపోయారు. మహిళా భోగిలో ఒంటరిగా ఉన్న యువతికి కీడు శంకించింది. ఇంతలో  గుర్తు తెలియని  యువకుడు అల్వాల్ లో  ఎక్కాడు. ఎవరూ లేకపోవడంతో అత్యాచార యత్నం చేయబోయాడు. యువతి గట్టిగా కేకలు వేసినప్పటికీ రక్షించే వారు కరువయ్యారు. నడుస్తున్నభోగినుంచి ప్రమాదం అని తెలిసినప్పటికీ మానాన్ని కాపాడుకోవడానికి ఒక్కసారిగా బోగిలో నుంచి దూకేసింది. రైల్వేట్రాక్ పై పడిపోయి తీవ్ర రక్త స్రావమయ్యింది. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తనపై అత్యాచారయత్నం చేసిన యువకుడిని తాను మాత్రమే గుర్తుపట్టగలనని బాధితురాలుపోలీసులకు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఈ ఘటనతో ఎంఎంటిఎస్ మహిళలకు ఎంతవరకు సేఫ్ అనే  ప్రశ్న ఉత్పన్నమైంది. నిత్యం వేలాది మహిళలు ఎంఎంటిఎస్ ద్వారా తమ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు.   

వైసీపీ పతనమే బీజేపీ లక్ష్యం!?

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి పార్టీల విషయంలో జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తుంటారు. భారతీయ జనతా పార్టీ నేతలను తమలపాకుతోను, తెలుగుదేశం, జనసేన పార్టీలను తలుపు చెక్కతోను పరామర్శిస్తుంటారు. బిజెపి పట్ల మెతక ధోరణితో ఉంటే మంచిదని భావిస్తుంటారు. కానీ, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కీలక నేత మాత్రం తమ అసలు లక్ష్యం ఏమిటో చాలా స్పష్టంగా చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పతనాన్ని తమ పార్టీనే శాసిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీని ఖాళీ చేయడం, ఆ పార్టీ ఓటు బ్యాంకును 20 శాతానికి తగ్గించడం లక్ష్యాలని.. ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రకటించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తావిస్తోంది. పురందేశ్వరికి ముందు రాష్ట్ర బీజేపీకి అధ్యక్షుడుగా పనిచేసిన సోము వీర్రాజు, అప్పట్లో దూకుడుగా మాట్లాడగల కమలం నేతగా పేరు తెచ్చుకున్నారు. అయితే తమ పార్టీ బలంగా తయారు కావడానికి ఒంటరిగా రాష్ట్రవ్యాప్తంగా పోటీచేయడం బెటర్ అని నమ్మిన వాళ్లలో ఆయన ఒకరు. తెలుగుదేశంతో జట్టు కట్టిన తర్వాత, ఎన్నికల పర్వంలో ముక్తసరిగా వ్యవహరించారు. కానీ, ఎన్నికల్లో విజయం తర్వాత ఎమ్మెల్సీ అవకాశాలు దక్కినప్పుడు అనూహ్యంగా ఆయన పదవి దక్కించుకున్నారు. ఇప్పుడిక కమలదళంలో కీలక నేతగా తమ పార్టీ లక్ష్యాలు ఏమిటో ఘాటుగానే వివరిస్తున్నారు.  విశాఖపట్నంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. వైసీపీని ఖాళీ చేసేయడమేనని, ఆ పార్టీకి రాష్ట్రంలో 20 శాతం ఓటు బ్యాంకు కూడా లేకుండా చేస్తాం అని సోము వీర్రాజు ప్రకటించారు. అసెంబ్లీకి గైర్హాజరవుతున్న జగన్ తీరును ఆయన రెండునాల్కల ధోరణిగా సోము వీర్రాజుఎద్దేవా చేయడం విశేషం. 2014 లో ప్రతిపక్ష నేత హోదా ఉన్నప్పటికీ అసెంబ్లీకి జగన్ రాలేదని, ఇప్పుడు హోదా కావాలనే సాకుతో మళ్లీ ఎగ్గొట్టారని.. ఇది విడ్డూరంగా ఉన్నదని ఆయన గేలి చేస్తున్నారు.  జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలతో విరుచుకుపడడం కమలదళంలో సోము వీర్రాజుతో ఆగడం లేదు. జగన్ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేనంత నాశనం రాష్ట్రానికి చేశారని, ఎందుకూ పనికి రాని భూములను సెంటు స్థలం పేరుతో పేదలకు పంచి వారిని వంచించారని విష్ణుకుమార్ రాజు ఆరోపిస్తున్నారు.  మొత్తానికి రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద డైరెక్ట్ ఎటాక్ కు దిగుతున్నది.  వైసీపీని ఖాళీ చేయడం అనేది కూటమి లక్ష్యం అని సోము ప్రకటించినప్పటికీ.. బిజెపి ఆ ఎజెండాతో ఉన్నదని అర్థం అవుతోంది. ఆ నడుమ విశాఖ వైసీపీ నేత అడారి ఆనంద్ బిజెపిలోనే చేరారు. విజయసాయిరెడ్డి కూడా బిజెపిలో చేరుతారనే  వదంతులున్నాయి. ముందు ముందు ఇంకా పలువురు వైసీపీ నేతలకు బిజెపి ఎర వేస్తున్నదేమోనని సోము మాటలను బట్టి పలువురు అనుకుంటున్నారు.

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణకు శ్యామల

వైసీపీ అధికార ప్రతినిథి, నటి శ్యామల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సోమవారం (మార్చి 24) ఉదయం పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ ముందు శ్యామల హైకోర్టును ఆశ్రయించారు. ఆమె కేసు విచారించిన హైకోర్టు కేసు క్వాష్ చేయడానికి నిరాకరించింది.   ఈ కేసులో శ్యామలతో పాటు పలువురు నటులు, బుల్లితెర నటులు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు కూడా ఉన్నారు. అయితే ఎవరూ కోర్టును ఆశ్రయించలేదు. అరెస్టు భయంతో శ్యామల మాత్రమే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే  యాంకర్ విష్ణుప్రియ, రీతూ చౌదరిలు పోలీసుల విచారణకు హాజరయ్యారు.   ఈ కేసులో ఉన్నన నటులు విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్ లు సోషల్ మీడియా వేదికగా  వివరణలు ఇచ్చారు. పోలీసులు పిలిస్తే విచారణకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. వీరిలో వైసీపీ   అధికార ప్రతినిథి శ్యామల మాత్రమే హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు  ఆమెపై కేసు క్వాష్ చేయడానికి నిరాకరించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఆమె పంజగుట్ట పోలీసు స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. 

జగన్ ను విస్మరించి మరీ కేటీఆర్ పై విజయసాయి పొగడ్తలు.. సంకేతమేంటి?

జగన్, విజయసాయిరెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందా? వైసీపీకి రాజీనామా చేసిన తరువాత విజయసాయిరెడ్డి జగన్ ను ఇబ్బందుల్లోకి నెట్టడానికి అంది వచ్చిన ఏ అవకాశాన్నీ వదులు కోవడం లేదా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న పరిశీలకులు ఔననే సమాధానం ఇస్తున్నారు. నేరుగా జగన్ ను ఉద్దేశించి విమర్శనాత్మక వ్యాఖ్యలు ఏమీ చేయకపోయినా.. విజయసాయి మీడియా ముందుకు వచ్చిన ప్రతి సారీ, అలాగే ఎక్స్ వేదికగా పెట్టిన ప్రతి పోస్టులోనూ జగన్ ను ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడానికి ఇసుమంతైనా వెనుకాడటం లేదు. పైగా అవసరం, అవకాశం లేకపోయినా.. కల్పించుకుని మరీ జగన్ కు ఇబ్బందులు, చిక్కులు తెచ్చిపెట్టే వ్యాఖ్యలు, పోస్టులు చేస్తూ వస్తున్నారు. ఇటీవల కాకినాడ పోర్టు కేసులో సీబీఐ విచారణకు హాజరైన విజయసాయి.. ఆ కేసుకు సంబంధించి కర్త, కర్మ, క్రియా అన్నీ జగన్ కు బంధువు అయిన వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డే అని మీడియా ఎదుట కుండబద్దలు కొట్టేసి జగన్ కే కాదు.. మొత్తం వైసీపీకి షాక్ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా, అదే మీడియా సమావేశంలో అసందర్భంగానే అయినా అత్యంత వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ మద్యం కుంభకోణం వెనుక ఉన్నది కసిరెడ్డి రాజశేఖరెడ్డేనని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అవసరమైతే ముందు ముందు వెళ్లడిస్తానంటూ ఉత్కంఠ రేపారు. జగన్ లో ఆందోళన నింపారు. అయితే విజయసాయి వెల్లడించే వరకూ ఆగకుండా నెటిజనులు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి వ్యవహారం అంతా సోషల్ మీడియాలో గుమ్మరిం చేశారు. ఇక ఇప్పడు తాజాగా విజయసాయి చెన్నై వేదికగా తమిళనాడు  ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన డిమిటేషన్ వ్యతిరేక సదస్సు విషయంలో విజయసాయి తనదైన స్టైల్ లో స్పందించారు. రాజకీయాల నుంచి వైదొలిగిన విజయ సాయి డీమిటేషన్ విషయంలో జగన్ ను పూర్తిగా విస్మరించి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు మద్దతుగా ఎక్స్ వేదికగా స్పందించారు.  డిలిమిటేష్ పై కేసీఆర్ ప్రతిమాటకూ మద్దతు తెలిపిన విజయసాయి.. వ్యూహాత్మకంగా జగన్ ను విస్మరించారు. కేవలం జనాభా ప్రాతిపదికన డీమిలిటేషన్ పై దక్షిణాది రాష్ట్యాల ఆందోళనతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్ననని పేర్కొన్న విజయసాయి.. తన ట్వీట్ లో ఈ విషయంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)తో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు పేర్కొన్నారు. కేవలం జనాభా ప్రాతిపదికన కాకుండా దక్షిణాది రాష్ట్రాలు దేశ జీడీపీకి చేసిన కంట్రీబ్యూషన్ ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలని కేసీఆర్ సూచించారు. దీనిపైనే ఎక్స్ వేదికగా విజయసాయి స్పందించారు. అయితే డీలిమిటేషన్ ను వ్యతిరేకించిన జగన్  గురించి మాత్రం ఈ మాజీ వైసీపీ నేత కనీసం ప్రస్తావించలేదు. జగన్ పేరు ఎత్తడం కూడా తనకు ఇష్టం లేదన్నట్లుగా ఆయన ట్వీట్ ఉంది. ఈ విధంగా జగన్ ను విస్మరించడం ద్వారా విజయసాయి.. జగన్ పట్ల తన అయిష్టతను, వ్యతిరేకతను ప్రస్ఫుటంగా చాటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయసాయి ఈ తీరు ముందు ముందు జగన్ ను చిక్కుల్లోకి నెట్టడం ఖాయమని అంటున్నారు.  

మెగా బ్రదర్ కి నిరీక్షణ తప్పదా?.. పిఠాపురం వర్మ ఎఫెక్టేనా?

కొణిదెల నాగేంద్రబాబు అలియాస్‌ నాగబాబు గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ  ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్‌ కల్యాణ్‌ కంటే ఎక్కువ పని చేసిన నాగబాబు.. ఆ తర్వాత చిరంజీవి కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో సైలెంట్‌ అయ్యారు.. తరువాత జనసేన ఆవిర్భావం నుంచి తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ వెంట నిలిచారు.  2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున ఎక్కడా పోటీ చేయని నాగబాబు,  2019లో జనసేన నుంచి నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. మొన్నటి  ఎన్నికల్లో అనకాపల్లి నుంచి లోక్‌సభకి పోటీ చేయాలని నాగబాబు భావించినట్టు ప్రచారం జరిగింది. అయితే ఆ సీటు బీజేపీకి కేటాయించడంతో ఆయన పోటీ నుంచి విరమించుకున్నారని చెబుతుంటారు. ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం, జనసేన వందశాతం స్ట్రైక్‌ రైట్‌ సాధించడం, జనసేనాని పవన్‌కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడంతో  నాగబాబుకు కూడా పదవి ఖాయమనే ప్రచారం ఏడెనిమిది నెలలుగా సాగుతోంది. తాజాగా నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ నెలాఖరుకి మండలిలో పాత ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తుండటంతో ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గత డిసెంబర్‌ 9వ తేదీన రాజ్యసభకు అభ్యర్ధుల పేర్లను వెల్లడించిన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సరిగ్గా అదే సమయంలో నాగబాబును ఎమ్మెల్సీగా ఎన్నిక చేయించి రాష్ట్ర క్యాబినెట్‌లోకి తీసుకుంటామని ప్రకటన చేశారు. వాస్తవానికి అప్పటి వరకు నాగబాబును రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారం బలంగా జరిగింది. అయితే చంద్రబాబు ప్రకటనతో జనసేనకు రాజ్యసభ పోస్టు లేదనీ, దాని బదులు నాగబాబు రాష్ట్రంనుచే చట్టసభలోకి ప్రవేశిస్తారని స్పష్టమైంది.  చంద్రబాబు తలచుకుంటే మంత్రి చేయడానికి ఈ ఎమ్మెల్సీ తంతు ఏమీ అడ్డం కాదు. మంత్రి అయిన ఆరు నెలలలోగా ఎమ్మెల్సీ కావచ్చు. కానీ అలా చేయలేదు. దాంతో కేవలం నాగబాబును చేర్చుకోవడం కోసం మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతున్నదా? అన్న చర్చ నడిచింది. కనీసం ఏడాది నుంచి ఏడాదిన్నర అయితే తప్ప మంత్రివర్గంలో మార్పులు చేర్పులు సాధారణంగా జరగవు. పైగా చంద్రబాబు వర్కింగ్ స్టైల్ వేరు. ఏ నిర్ణయం అంత వేగంగా, అంత సులభంగా తీసుకోరు. అదీ కాక పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంతో తెలుగుదేశం శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. జనసేనకు అంత ప్రాధాన్యత ఇస్తుండటంపై పిఠాపురం తెలుగు తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే అసంతృప్తి మరింత పెరుగుతుంది. వర్మ, కిమిడి నాగార్జున ఇంకా చాలా మంది అర్హులైన నాయకులు బ్యాక్ బెంచ్లో కూర్చొని వెయిటింగ్లో ఉండగా, నాగబాబుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే ఇబ్బందని చంద్రబాబు సంశయిస్తున్నారన్న ప్రచారం  జరుగుతోంది.  వెయిటింగ్‌లిస్ట్‌లో ఉన్న టీడీపీ నేతలకు న్యాయం జరిగాకే నాగబాబుకి అమాత్య పదవి దక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఆ క్రమంలో ఇప్పట్లో నాగబాబును మంత్రిగా చూడడం కష్టం కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ కాబట్టి. మంత్రి పదవి ఇవ్వాలంటే క్షణంలో ఇవ్వవచ్చు. కానీ ఈ లోగా పిఠాపురం సభలో చాలా డ్యామేజ్ చేసుకున్నారు. పవన్ కామెంట్లు కూడా టీడీపీని కొంత డ్యామేజ్ చేసేవి ఉన్నాయని తమ్ముళ్లు మండిపడుతున్నారు. ఈ డ్యామేజ్ ఎఫెక్ట్‌తో నాగబాబుకి ఇప్పట్లో మంత్రి పదవి అన్నది ఉండదనే వాదన గట్టిగా వినిపిస్తోంది.

జగన్‌కు ఊడిగం చేశారు.. ఇప్పుడు ఇరుక్కున్నారు!

ఎట్టకేలకు రాష్ట్ర సమాచారశాఖ మాజీ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి పాపం  పండింది.  వైసీపీ  హయాంలో అనేక అవినీతి,అక్రమాలు, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన విజయకుమార్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, చెప్పాపెట్టకుండా ఢిల్లీకి వెళ్లిపోయారు. జగన్‌ మీడియాతో పాటు ఆయనకు భజన చేసిన కొన్ని టీవీ చానళ్లు, మరిన్ని యూట్యూబ్‌ చానళ్లు, సోషల్‌ మీడియాకు నిబంధనలు ఉల్లంఘించి  వందల కోట్ల రూపాయలను ప్రకటనల రూపంలో దోచిపెట్టారని ఆయనపై అభియోగాలున్నాయి. ఎట్టకేలకు విజయ్‌కుమార్‌రెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేయడంతో ఆయనకు కష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర సర్వీసులకు చెందిన ఆయన ప్రస్తుతం కోల్‌కతాలో పనిచేస్తున్నారు. ఈ-మెయిల్‌ ద్వారానేగాక హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి కూడా ఏసీబీ నోటీసులు పంపింది. ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌కు చెందిన విజయ్‌కుమార్‌రెడ్డి, జగన్‌ పాదయాత్ర సమయంలోనే ఆయనకు మద్దతు ప్రకటించి జగన్ భజన మొదలుపెట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాక 2019లో డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చారు. 2024 వరకు సమాచార శాఖ కమిషనర్‌గా విచ్చలవిడి వ్యవహారాలు చేపట్టారు. జగన్‌ సొంత మీడియాతో పాటు అనుకూల మీడియా, భజన మీడియాకు ప్రభుత్వ ప్రకటనల రూపంలో అడ్డగోలుగా వందల కోట్ల రూపాయలు దోచిపెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని ఓడించి గత ఏడాది గద్దెనెక్కిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంపై విజిలెన్స్‌-ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే బాధ్యతను ప్రభుత్వం ఏసీబీకి అప్పగించింది. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి విజయ్‌కుమార్‌రెడ్డిపై గుంటూరులో కేసు నమోదు చేశారు. రాష్ట్ర సర్వీసుల నుంచి వెళ్లిపోతే, తన అవినీతి, అక్రమాలు బయటకు రావనీ,  తనను ఎవరూ ఏమీ చేయలేరని విజయ్‌కుమార్‌రెడ్డి భావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గత ప్రభుత్వంలో అవినీతిపై ఆచితూచి చర్యలు తీసుకుంటుండడంతో, తనను ఏమీ చేయరనే ధీమాతో విజయ్‌కుమార్ కనిపించారు. అయితే, విజిలెన్స్‌ విచారణలో ఆయన చేసిన అవినీతి, అక్రమాలు, అనైతిక కార్యక్ర మాలు బట్టబయలు కావడంతో ఇప్పుడు ఏసీబీ అధికారుల ముందు నిల్చోవాల్సి వచ్చింది. జగన్‌ అధి కారంలోకి రాకముందే, రాష్ట్ర సంపదను ఎలా జగన్‌కు దోచిపెట్టాలన్నదానిపై ఒప్పందం చేసుకు, రాష్ట్రానికి వచ్చిన విజయ్‌కుమార్‌రెడ్డి వచ్చిన వెంటనే పనిలోకి దిగిపోయారు.  జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విజయ్‌కుమార్‌రెడ్డి చేసిన మొదటి పని పత్రికల టారిఫ్‌ పెంపుదల. పత్రికా యాజమాన్యాలు ఎవరూ అడగకపోయినా..అన్ని పత్రికల టారిఫ్‌ పెంచేశారు. ఎవరూ అడగకుండానే టారిఫ్‌లు పెంచడంతో అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు. కేవలం పెద్ద పత్రికలకే కాదు..చిన్న పత్రికలకు కూడా టారిఫ్‌ పెంచేశారు. ఎవరో ఒకరు కోర్టులో కేసులు వేసి,  జగన్ మీడియాకు దోచిపెట్టకుండా అడ్డుకుంటారన్న భావనతో..అందిరికీ పెంచేశారట.  అయితే రేట్లు పెంచారు కానీ, ఇతర పత్రికలకు ఐదేళ్లలో కనీసం ఒక్క ప్రకటన ఇచ్చిన పాపాన పోలేదు. గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, చిన్నపత్రికలకు ఎన్నోకొన్ని ప్రకటనలు ఇచ్చేవి. ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నప్పుడల్లా, వారికీ ప్రకటనలు ఇచ్చేవి. కానీ జగన్‌, విజయ్‌కుమార్‌రెడ్డిలు ఐదేళ్లలో ఒక్క ప్రకటనా ఇచ్చిన పాపాన పోలేదు. జగన్‌ సొంత మీడియాతోపాటు అనుకూల మీడియా, భజన మీడియాకు ప్రభుత్వ ప్రకటనల రూపంలో అడ్డగోలుగా వందల కోట్లు దోచిపెట్టారు.  ఇప్పుడు విజయ్‌కుమార్‌రెడ్డి ఏసీబీ విచారణకు హాజరుకాకుండా రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. విచారణకు రావాలని శుక్రవారం ఆయనకు నోటీసు ఇవ్వగా,  తాను ఇప్పుడు బిజీగా ఉన్నానని, రానని.. వీలు చూసుకొని ఏప్రిల్‌లో వస్తానంటూ సమాధానమిచ్చారు. విజయ్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేసుకున్నారు. అది విచారణలోనే ఉంది. అరెస్టు నుంచి ఆయనకు ఎలాంటి రక్షణ లేదు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కాకుండా సాకులు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఆయనకు మరోసారి ఫలానా తేదీలో విచారణకు రావాలంటూ నోటీసులివ్వాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

ఏపీ వర్ సెక్టార్‌లో ‘పవర్ ’ బ్రోకర్లు.. వాళ్లదే హవా.!

ఎన్నో వేధింపులు, ఎన్నో ఒత్తిళ్లు, కదిపితే  కేసులు, మెదిలితే దాడులు, మాట్లాడితే జైలు, అధికారంలో ఉన్నవారిని  విమర్శించడం కాదు, కనీసం కన్నెత్తి  చూడటానికి కూడా భయపడ్డ రోజులు. ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు బయటపడతాం దేవుడా... అని తెలుగుదేశం నాయకులు, అభిమానులు, మొదలుకుని సామాన్య ప్రజల వరకు ఎదురు చూసిన రోజులు. కోరికల మాట అటుంచి నెలనెలా రావాల్సిన జీతాల గురించి ప్రభుత్వ ఉద్యోగులు అడుక్కోలేని పరిస్థితుల నుంచి బయటపడ్డారు. దోపిడీ ప్రభుత్వం నుంచి, దుర్మార్గ పాలన నుంచి విముక్తి అని అనుకున్నన్ని రోజులు పట్టలేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వంలోనూ పాత వాసనే వస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడుగడుగునా గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన అధికారులు, పవర్ బ్రోకర్లే కనిపిస్తున్నారు. మైనింగ్, ఎక్సైజ్ రంగాలతో పాటు విద్యుత్ రంగంలోనూ వైసీపీ మనుషులే తిష్ఠ వేసుకుని కూర్చున్నారు.  ఐదేళ్లు అనుభవించింది చాలదన్నట్ల, మరో ఐదేళ్లు పవర్ సెక్టార్ ని  తమ చెప్పుచేతుల్లోనే పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అధికారం కోల్పోయిన పార్టీకి స్లీపర్ సెల్స్ లా పనిచేయటానికి ఎక్కడికక్కడ పథకాలు రచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేతిలో ఉన్న విద్యుత్ రంగాన్ని పూర్వ సంబంధాలను ఉపయోగించుకుని, తమ ప్రాజెక్టులకు ఇబ్బంది లేకుండా వైసీపీ నేతలు జాగ్రత్త పడుతున్నారు. ప్రభుత్వం మారి 9 నెలలు గడుస్తున్నా, ప్రభుత్వ పెద్దల కళ్ళకు గంతలు కట్టి, కొత్త ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకుంటున్నారు. అనంతపురం మొదలు కోస్తా జిల్లాల్లోని అన్నిచోట్ల పవర్ ప్లాంట్ లు, ట్రాన్ష్‌ఫార్మర్ల కాంట్రాక్టులు వైసిపి పెద్దలవే అని కిందిస్థాయి తెలుగుదేశం కార్యకర్తలు మొత్తుకుంటున్నారు. పవర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీల వరకు వారి పైరవీలే సాగుతున్నాయంట. వారి మనుషుల్ని డైరెక్టర్లుగా, వారు చెప్పిన మాట వినేవారినే సిఎండిలుగా కొనసాగేలా చేస్తూ తమ పనులు చేయించుకుంటున్నారట. తాజాగా 100 కోట్ల రూపాయల విలువైన ట్రాన్స్ఫార్మర్ల కాంట్రాక్ట్ ఖరారు కూడా ఇందులో భాగమే అంటున్నారు. ఎస్ పి డి సి ఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవిలోకి కొత్త వారు వచ్చే అవకాశం ఉండటంతో గడిచిన శుక్రు, శనివారాల్లో ఈ తాజా ఒప్పందాలు జరిగిపోయినట్టు అనుమానిస్తున్నారు. మొత్తం పవర్ సెక్టర్ చీఫ్ సెక్రటరీ చేతిలో ఉంది. ఆయన వైసిపి హయాం నుంచి అధికారం చవి చూసిన వారే. గతంలో విద్యుత్ శాఖలో సుదీర్ఘ కాలం ఉన్నత పదవి నిర్వహించి రిటైర్ అయిన అధికారి కుమారుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సీఎంఓలో విద్యుత్ విభాగం చూసే అధికారికి గాని, విద్యుత్ శాఖ మంత్రికి కానీ తెలియకుండానే వైసిపి దూతలు పనులు చక్కపెట్టుకుంటున్నారట. విద్యుత్ శాఖ మంత్రికి, సి ఎం ఓ లోని అధికారికి ఏమీ చేయలేని పరిస్థితి ఉందని, అందుకే వారు ఈ విషయాలు వదిలేశారని అంటున్నారు. అంతా చిన్న బాబు ప్రధాన అనుచరుని ద్వారా, చిన్న బాబు స్థాయిలోనే క్లియర్ చేయించు కుంటున్నారని చెప్పుకుంటున్నారు. ఆ క్రమంలో విద్యుత్ శాఖలో కింద నుంచి పై స్థాయి వరకు ప్రక్షాళన జరగనిదే కూటమి ప్రభుత్వానికి మరింత డ్యామేజీ తప్పని పరిస్థితి కనిపిస్తున్నది. సీఎంఓలో ఇన్వెస్ట్మెంట్ విభాగం అధికారి మొదలు, విద్యుత్ శాఖ అదనపు కార్యదర్శి, ఎస్పీడీసీఎల్, సి పి డి సి ఎల్ చైర్మన్ కం ఎండీలను, సభ్యులను, నెట్‌క్యాబ్ ఎండీని మార్చుకుంటే పవర్ సెక్టార్ పాలన చంద్రబాబు చేతిలో లేనట్లే భావించాలంటున్నారు. అభివృద్ధి వేరు, రాజకీయాలు వేరు అంటున్న ముఖ్యమంత్రి దానికే కట్టుబడితే, ఆయనకు మంచి పేరు రావచ్చేమో కానీ ఆయన వెనుక అభిమానించే వారు మిగలరన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గత ప్రభుత్వానిది రాక్షస పాలన అని చంద్రబాబు నమ్మితే, గత ఐదేళ్లలో పవర్ సెక్టార్లో ఎవరు పెత్తనం చేశారు, వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, సిఎంఓతో వారికి ఉన్న లింకులు ఏంటో విచారించుకోవాలని ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. ఇంజనీర్ కూడా కానీ ఒక అధికారి సోలార్ పవర్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. టిడిపి పెద్దలు, కార్యకర్తలు దోషిగా వేలెత్తి చూపిస్తున్న పెద్దిరెడ్డి లాంటి వైసీపీ నేతలే ఇంతవరకు పవర్ కార్పొరేషన్ చైర్మన్ ల మార్పిడి విషయంలో ప్రభావం చూపిస్తున్నారంటున్నారు.  ఏపీడీసీఎల్ సభ్యుడు ఒకరు  పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లకు లాబీయిస్ట్ అని చెప్తున్నారు. పవర్ సెక్టార్‌పై చంద్రబాబు పట్టు కోల్పోతే వైసిపి స్లీపర్ సెల్స్ లా పనిచేస్తున్న అధికారులు తమ ప్రభుత్వాన్ని ముంచేస్తారని ఆ రంగంలో నిపుణులైన  తెలుగుదేశం అభిమానులు అంటున్నారు. ఇలాగే వదిలేస్తే చంద్రబాబు కూడా అపనిందల పాలు కాక తప్పదని, ఆయన కూడా అవినీతిపరులతో కుమ్మక్కయ్యారన్న చెడ్డపేరు  వస్తుందని హెచ్చరిస్తున్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ, జెన్కో డిస్ట్రిబ్యూషన్ సంస్థలు అన్నీ గత తొమ్మిది నెలలుగా వైసీపీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయని తెలుస్తోంది, డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్లకు కొత్తగా నియమించబోయే డైరెక్టర్లుగా వైసీపీ ఏజెంట్లను నియమించాలని పవర్ బ్రోకర్ల ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ చేతిలోనే విద్యుత్ శాఖ కూడా ఉంది, ఆ శాఖకు ఇంతవరకూ వేరే ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించలేదు. ప్రస్తుత సీఎస్ శ్రీ విజయానంద్ పదవీవిరమణ అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎలెక్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీకి చైర్మన్ అవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది, రాబోయే 2029 ఎన్నికల్లో ఆయన గెలవబోయే పార్టీ తరఫున పార్లమెంటుకు లేదా అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారట, వీలైతే రాజ్యసభకు కూడా ఆయన ప్రయత్నాలు చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఔట్‌

కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల కాలంలో 50 వేల ఉద్యగాలు ఇచ్చింది’ ఈ మంత్రాన్ని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలు మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు’ రోజూ జపిస్తూనే ఉంటారు.  మరో వంక ఇందులో గత ప్రభుత్వం ఘాతాలోకి ఎన్ని పోతాయి,కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలోకి ఎన్ని వస్తాయి అనే చర్చ ఒకటి జరుగుతూనే వుంది. ప్రక్రియ మొత్తం పూర్తి చేసి,ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన, నియామాకాలను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ఖాతాలో కలుపుకున్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మేము వండి సిద్ధం చేసిన వ్నకలను వడ్డించి క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.   ఇలా  అటు కారు పార్టీ, ఇటు హస్తం పార్టీ క్రెడిట్ మాదంటే మాదని వాదులాడుకోవడం కూడా రోజు చూస్తున్నదే. అందులో ఏది నిజం, ఏది అబద్ధం అనే విషయాన్ని పక్కన పెడితే, ఇప్పడు నిరుద్యోగ యువత కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంతన్న సర్కార్’ , ఉన్నదీ పోయింది ..ఇంకొకటీ పోయింది అన్నట్లు, కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. ఉన్న చిరుద్యోగాలను గుజుజునేందుకు సిద్డంమవుతోంది. ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి ఉద్వాసన చెప్పేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.  నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఏదో చెప్పలేని వ్యతిరేకత ఇబ్బంది ఉన్నట్లుది. బయటకు చెప్పినా చెప్పక పోయినా ప్రభుత్వ ఉద్యోగులు అంటే తెల్ల ఏనుగులు అనే అభిప్రాయం ఏదో ఆయనలో అంతర్లీనంగా ఉన్నట్లు కనిప్స్తోందని ఉద్యోగులు అంటున్నారు. అందుకే, ఆయన  రాష్ట్ర క్లిష్ట పరిష్టిలో ఉన్న ప్రస్తుత సమయంలో డిఏలు అడగకండి, ఫస్ట్ తేదేకి జీతాలు ఇవ్వడానికే, నెలనెల రిజర్వు బ్యాంకు ముందు చేయి చాచ వలసి వస్తోంది. సో ... మీ జీతాలు మీకు  ఇస్తున్నదుకు సంతోషించి, రోజుకో రెండు గంటలు ఎక్కువ పనిచేసి ప్రభుత్వ ఋణం తీర్చుకోండి,అన్నట్లు ఓ చిన్న చిరునవ్వుతో  చురక వేశారు. అలాగే, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించవలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్.కొండలా పెరిగి పోయాయి, ఎక్కడ నుంచి తేవాలి,అంటూ ప్రభుత్వ ఉద్యోగులకు తెలియకుండానే’ మరో చురక వేశారు.రిటైర్డ్ ఉద్యోగుల నోటికి తాళాలు కూడా వేశారు.సరే, ఉద్యోగులు, నిరుద్యోగ యువకులతో పెట్టుకుంటే ఏమవుతుందో మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంత అర్థమయ్యే ఉంటుంది. పంతుళ్ళు చెప్పే పాఠం పూర్తిగా అర్థం అయ్యేందుకు ఇంకొంత సమయం పడుతుంది కావచ్చును.     అదలా ఉంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి’ కన్ను ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిపై పడిందని అంటున్నారు. దశలవారీగా ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిలో సగం మందిని తొలిగించేందుకు రంగం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.  అవును, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం  పొదుపు చర్యల్లో వివిధ శాఖల్లో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న డీబీఏలను (డాటా బేస్‌ అడ్మినిస్ట్రేటర్‌) తొలిగించే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి, ఇప్పటికే,  వేర్వేరు శాఖల్లో సంబంధిత  ఏజెన్సీల ద్వారా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఉద్వాసనలు మొదలయినట్లు సమాచారం. ఒకేసారి, అందరికీ ఉద్వాస పలికితే, బాధిత యువత ఆందోళనకు దిగే అవకాశం ఉన్నందున గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడి కక్కడ, తమచేతికి మట్టి అంటకుండా, ఏజెన్సీల ద్వారా  కాగల కార్యం కానిస్తున్నట్లు తెలుస్తోంది.  మొత్తం 60 ప్రభుత్వ శాఖల్లో కలిపి, పీఆర్సీ నివేదిక ప్రకారం  1,20,367 మంది కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులున్నారు. ఇందులో  సగం మందిని ఇంటికి పంపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్దమయిందని అంటున్నారు.   కాగా, కమర్షియల్‌ ట్యాక్స్‌ శాఖలో 75 మందిని తొలిగించడానికి లిస్టు సిద్ధం చేసియన్ నేపధ్యంలో, తమను ఉద్యోగాల నుంచి తొలిగించి, తమ కుటుంబాలను బజారుకు ఈడ్చవద్దని వేడుకుంటూఆ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. రవాణా శాఖలో మొదటి విడత కింద 62 మందిని తొలిగించడానికి లిస్టు సిద్ధం చేసినట్టు సమాచారం. కార్మిక శాఖలో ఇప్పటికే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల తొలిగింపు మొదలైనదని, కాంట్రాక్టు గడువు ముగిసిన ఉద్యోగుల కాల పరిమితి తిరిగి రెన్యూవల్‌ చేయకుండా ఇంటికి పంపిస్తున్నట్టు తెలిసింది. తాజాగా మరో 50 మంది ఉద్యోగుల తొలిగింపునకు నివేదిక రూపొందించినట్టు సమాచారం. ఎక్సైజ్‌ శాఖ, టీజీబీసీఎల్‌ నుంచి 80 మంది ఉద్యోగులను తొలిగించడానికి అధికారులు లిస్టు సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. నిజానికి, తెలంగాణ ఉద్యమ సమయంలో,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ ఏర్పడిన తర్వాత  ఔట్‌ సోర్సింగ్‌’ అనేదే ఉండదని చాలా గట్టిగా నామం బలికారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రి హోదాలోనూ కేసీఆర్, ఔట్‌ సోర్సింగ్‌’, కాంట్రాక్టు ఉద్యోగులు అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని వాగ్దానం చేశారు. కొంత మందిని చేసారేమో కూడా, కానీ, ఇప్పడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అసలుకే ఎసరు తెచ్చిందని ఔట్‌ సోర్సింగ్‌’ ఉద్యోగులు ఆందోళన వ్యక్త పరుస్తునారు.

బరువు తగ్గింది  భారం పెరిగింది

తెలంగాణ  ప్రభుత్వం ఈ నెల ( మార్చి) 19 న 2025 – 2026 వార్షిక బడ్జెట్’ ను సభకు సమర్పించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, రూ’ 3.04,965 కోట్ల అంచనాలతో,బరువు ‘తక్కువ’ బడ్జెట్’ను సభకు సమర్పించారు. అవును,గతంతో పోల్చుకుంటే, భట్టి విక్రమార్క’ ఎక్కువలకు పోలేదు. గాలిలో దీపం పెట్టి, దేవుడా రక్షించు అన్నట్లు కాకుండా బడ్జెట్ అంచనాలను అంతగా పెంచలేదు. గత సంవత్సరం రూ.2.91కోట్ల బడ్జెట్’ ప్రవేశ పెట్టి, ఆశించిన అంచనాల మేరకు ఆదాయం లేక భంగ పడిన అనుభవంతో కావచ్చును, ఈసారి కొంత జాగ్రత్త పడ్డారు. అంకెల గారడీ జోలికి పెద్దగా పోకుండా బడ్జెట్ రూపొందించారు. అలాగని, పూర్తి వాస్తవిక దృక్పధంతో బడ్జెట్ రూపొందించారా,అంటే లేదు. అనవసర గొప్పలకు పోకుండా, గత సంవత్సరపు రూ. 2.91 కోట్లకు నాలుగు శాతం అదనంగా కలిపి రూ’.3.04,965 కోట్ల అంచనాలతో బడ్జెట్’ను సమర్పించారు. నిజానికి, అప్పులు కూడా పుట్టని ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో, ఈ బరువు కూడా ప్రభుత్వానికి మోయలేని  భారమే అవుతుంది.జుట్టున్నమ్మ ఏ కొప్పు అయినా పెడుతుంది, అది లేనమ్మకు కొప్పు కుదరదు. సవరమో, విగ్గో తప్పవు.  రాష్ట్ర ప్రభుత్వానిది అదే పరిస్థితి,   కేంద్ర ప్రభుతం కరుణించి, ఏపీలో గత వైసీపీ ప్రభుత్వానికి అప్పుల విషయంలో కల్పించిన వెసులు బాటు కల్పిస్తే ఏమో కానీ, లేదనే కష్టమే అంటున్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుగ్వం ప్రభుత్వ భూముల మ్మకం మీద  చాలా ఆశలు పెట్టుకుంది.  గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్, అంచనాలను భారీగా,(సగటున 14 శాతం వంతున పెంచుకుంటూ పోయింది. అయితే, అలా అవాస్తవిక అంచనాలతో పెరిగిన బడ్జెట్ బరువు, గొప్పలు చెప్పుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరాలేదు, అనుబహంలో తెలిసింది,. అయిన చివరి వరకు అదే పంథాలో వెళ్ళింది. అయినా, వాస్తవ వ్యయం అంచనాల దరిదాపుకు కూడా వెళ్ళలేదు. అందుకు ఒకే ఒక్క మినహాయింపు అప్పులు.. ఈ ఒక్క విషయంలో మాత్రం, అంచనాలను  మించి అప్పులు చేశారు. అందుకే, ఇప్పడు అప్పులు కూడా పుట్టని స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చేరిందని, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి’ జనం ముందు ఘోల్లు  మంటున్నారు. అవును. నిజమే, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నట్లుగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను గాలికి వదిలేసింది. అందులో అనుమానం లేదు. అందుకే రాష్ట్ర అప్పుల్లో కూరుకు పోయిది. అయితే అదేదో, ఇప్పడే వెలుగులోకి వచ్చిన విషయం కాదు. అలాగే, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళలో చేసిన, పెంచిన అప్పుల భారం కూడా రహస్యం కాదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పడు ముఖ్యమంత్రి ‘విప్పి’ చెపుతున్న, అప్పుల లెక్కలే, ప్రతిపక్షంలో ఉన్నప్పడు, చెప్పారు. అంటే, రాష్ర ఆర్థిక పరిస్థితి ఏమిటన్నది, తెలిసే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఎన్నికల గెలుపే లక్ష్యంగా.కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్’కు మించి ఆరు గ్యారెంటీలను, ఇంకా ఎన్నో హామీలను ఇచ్చింది. ఇక్కడే, రాజకీయ ప్రత్యర్దులే కాదు, ఆర్థిక వేత్తలు, చివరకు సామాన్యులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు. సంక్షేమా పథకాలకు పెద్ద పీత వేసిన వైఎస్ రాజశేఖర రెడ్డే, అప్పట్లో, ఎట్లో పారేసినా ఎంచి పారేయాలని అనేవారు,. నిన్నటి బీఆర్ఎస్, ప్రభుత్వం గానీ,  ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, ఓటు  బ్యాంకు రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యత, ఆర్థిక క్రమశిక్షణకు ఇవ్వలేదు. సంక్షేమం ప్రభుత్వ బాధ్యత, అదే గీత దాటితే ఆర్థిక సంక్షోభం అనివార్యమవుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అదే జరిగంది అదే జరుగుతోంది. ప్రభుత్వాలు మారినా,పంథా మారటం లేదు.బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని, అప్పుల కుప్ప మారిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం, అదే చట్రంలో ముందుకుసాగుతోంది. ఒక లక్ష్యం,గమ్యం లేకుండా ఎటు పోతున్నామో తెలియకుండా, గత  ప్రభుత్వం పరిచిన అప్పుల బతాలో పడిపోతోంది, అందుకే ముఖ్యమంత్రి అప్పులు పుట్టడం లేదని గగ్గోలు  పెడుతున్నారు.   ఇప్పటికే, రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో చేసన అప్పుల పద్దులో, రూ. 1.53 లక్షల కోట్లు చెల్లించిందని ఆర్థిక మంత్రి  స్వయంగా చెప్పారు. మరో వంక గడచిన 15 నెలల కాలంలో రూ.1.52 లక్షల కోట్లు అప్పు చేశామని ఆయనే చెప్పారు. నిజానికి, ఆర్థిక క్రమశిక్షణ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నడిచిన దారిలోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందనేందుకు ఇంతకూ మించిన ఉదాహరణ అవసరం లేదు. ఆప్రభుత్వం ఈ ప్రభుత్వానికి