పీఎం వ‌స్తే ఎక్స్ సీఎం జంప్

రాజ‌ధాని  పునఃప్రారంభంలో క‌నీసం ట్వీటు కూడా చేయని జగన్? ఇదేనా మీకు ఆంధ్రుల పై ప్రేమా? ఇన్నాళ్లూ మ‌న‌ల్నో ఆంధ్ర‌ద్రోహి పాలించాడా? అంటూ జ‌నం కామెంట్లు రాజ‌ధాని అమ‌రావ‌తి అట్ట‌హాసంగా పునః ప్రాంర‌భ‌మైంది. ప్ర‌ధాని మోడీ చేతుల మీదుగా ఈ కార్య‌క్ర‌మం అంగ‌రంగ వైభ‌వంగా  జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అమ‌రావ‌తి  ప్రాంతంలో భారీ  ఎత్తున హ‌డావిడి క‌నిపించింది. సంద‌డి క‌ను విందు చేసింది. ఇన్నాళ్ల పోరాటం ఫ‌లించి.. రాజ‌ధాని రైతుల క‌ల సాకార‌మైంది. ఆ ఆనందం వారి క‌ళ్ల‌ల్లో ప్రస్ఫుటంగా ప్ర‌తిఫ‌లించింది. అంతే కాదు ఆంధ్ర‌ ప్ర‌జ‌లంద‌రిలోనూ.. మ‌న‌కంటూ ఒక రాజ‌ధాని వ‌చ్చిందన్న సంబ‌రం కొట్టొచ్చిన‌ట్టు కనిపించింది. మోడీ సైతం రావ‌డంతో దేశవ్యాప్తంగా అమ‌రావ‌తి పేరు మారు మోగింది. అంతా బాగుంది కానీ ఒక్క‌టే మిస్సింగ్.. ఆ మిస్సింగ్ నెంబ‌ర్ పేరే వైయ‌స్ జ‌గ‌న్. ఈ ప్ర‌బుద్ధుడు అసెంబ్లీలో ఒక మాట. బ‌య‌ట మ‌రోమాట‌గా దాగుడు మూత‌లాడి.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ 2019లో భారీ మెజార్టీతో గెలిచి ఏపీని ఐదేళ్ల పాటు పాలించారు. క‌ట్ చేస్తే.. మూడు ముక్క‌లాట ఆడి.. అమ‌రావ‌తి ప‌రువు తీశారు. ఉసురు తీయడానికీ ప్రయత్నించారు. ఈ ప్రాంత వాసుల ఉసురు తీసినంత  ప‌ని చేశారు. వీరి త్యాగాల‌ను అప‌హాస్యం చేశారు. వీరి భ‌విష్య‌త్తుతో ప‌బ్జీ ఆడుకున్నారు. ఈలోగా 2024 ఎన్నిక‌లొచ్చాయి. ఏక రాజ‌ధాని అమ‌రావ‌తా?  3 రాజ‌ధానులా? అన్న పందెం జ‌రిగినంత ప‌నైంది. కానీ ఈ పందెంలో మూడు ముక్క‌ల మైండ్ గేమ్.. ముక్క‌లు చెక్క‌లై.. 11 స్థానాల‌కు ప‌రిమిత‌మైంది ఫ్యాను పార్టీ. ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజ‌ధాని అమ‌రావ‌తే అన్న నినాదం ఫ‌లించి కూట‌మికి 164 సీట్లు ద‌క్కాయి. ఇంతటి విజయం రావడం ఆంధ్రుల్నే కాదు.. ఏకంగా కూట‌మి అగ్ర‌నేత‌లైన బాబు, ప‌వ‌న్, లోకేష్ లను సైతం అశ్చ‌ర్యపోయేలా చేసింది. జ‌గ‌న్ కి అయితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. ఇప్ప‌టికి ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చి అటు ఇటుగా ఏడాది కావ‌స్తోంది. ఈ స‌రికే ఒక ఆత్మ‌ప‌రిశీల‌న అవ‌స‌రం. కానీ జ‌గ‌న్ లో మాత్రం అలాంటిది ఇసుమంతైనా కనిపించట్లేదు, కించిత్ కూడా ఆయ‌న త‌న ప‌రాజ‌యం ప‌ట్ల ఒక విశ్లేష‌ణ చేసుకున్న‌ట్టే  క‌నిపించ‌దు. విజేత‌ల‌కు శుభాకాంక్ష‌లు చెప్ప‌డం మాత్ర‌మే కాదు. తాము ఎందుకు ఓడామో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. అది కూడా  వాస్త‌వ  ప‌రిస్థితుల‌కు అద్దం ప‌ట్టాలి. ఆ ఓట‌మిని బ‌హిరంగంగా చెప్ప‌కుంటే పోయారు.. కనీసం త‌మ‌లో తామైనా ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాలి. పార్టీలో అంత‌ర్గ‌తంగా అయినా ఒక రిపోర్టు త‌యారు చేసుకోవాలి. అట్ లీస్ట్ వంద‌ల కోట్ల  రూపాయ‌ల‌తో పెంచి పోషించిన బీహారీ గ్యాంగ్ నుంచైనా నివేదిక తెచ్చుకోవాలి. ఏ నివేదిక తెచ్చుకున్నా వ‌చ్చే రిజ‌ల్ట్ రాజ‌ధాని రైతుల ఉసురు త‌గిలి శ్రీమాన్ జ‌గ‌న్మోహ‌న రెడ్డిగారు దారుణ ప‌రాజ‌యం పాల‌య్యార‌నే వ‌స్తుంది. అలా నిజాలు తెలుసుకోవ‌డం ఎంద‌ుక‌నుకున్నారో ఏమో జ‌గ‌న్ ఎలాంటి నిజ నిర్దార‌ణ చేసుకోలేదు. పోస్టుమార్టం అంత‌క‌న్నా నిర్వ‌హించుకోలేదు. ఇంకా అదే చిత్త భ్ర‌మ‌. ఇంకా అదే మాయ‌లో ఉన్న‌ట్టున్నారు పాపం ‘ఫ్రీ’వారు. అదే అదే ఫ్రీగా ప‌థ‌కాలు ఇచ్చేయ‌గానే గెలిచేస్తామ‌న్న భ్ర‌మ‌ల్లో ఉన్న జ‌గ‌న్ సార్. అందుకే ఇప్ప‌టికి ఏడాది గ‌డిచిపోయింది. ఇంకా నాలుగేళ్లు మాత్ర‌మే. మ‌ధ్య‌లో జెమిలీగానీ వ‌స్తే రెండేళ్లే అంటూ కాకిలెక్క‌లు వేసుకుంటున్నారు. మ‌రింత ఓవ‌రాక్ష‌న్లో భాగంగా తాము అధికారంలోకి తిరిగి వ‌చ్చేసిన‌ట్టు.. ఏకంగా న‌ష్ట‌ప‌రిహారాల మిగులు బ‌కాయిలు చెల్లిస్తాన‌న్న ప్ర‌క‌ట‌న‌లు సైతం చేయిస్తున్నారు. ఓకే.. ఆశావాదం ఎవ‌రికైనా మంచి విష‌య‌మే. ఉండాల్సిందే. కాద‌న‌డం లేదు.. కానీ అప్పుడ‌ప్పుడూ వాస్త‌వ ప‌రిస్థితుల్లో జీవించ‌డం కూడా అవ‌స‌ర‌మే క‌దా? ఇంత జ‌రిగితే సారీ త‌ప్ప‌యి పోయింది. నేను ముందు ఒక మాట అన్నాను. త‌ర్వాత మాట మార్చాను. నావ‌ల్ల ఎవ‌రైనా ఇబ్బంది ప‌డి ఉంటే క్ష‌మించండి. చెప్పుడు మాట‌లు విని మోస‌పోయాను. నేను మీ ప‌క్ష‌మే. అని చెప్పుకోవ‌చ్చు.  స‌రే అదీ లేక పోతే పోయింది.. రాజ‌ధాని  పునః ప్రారంభ స‌మ‌యంలో క‌నీసం ఈ ప్రాంత వాసుల‌కు, అట్ లీస్ట్ రైతుల‌కైనా.. శుభాకాంక్ష‌లు చెప్పొచ్చు. కానీ జ‌గ‌న్ లో అలాంటి ల‌క్ష‌ణాలేవీ ఉన్న‌ట్టే క‌నిపించ‌దు. ఇక్క‌డుంటే అలాంటి ప‌ని చేయాల్సి వ‌స్తుంద‌నుకున్నారో ఏమో బెంగ‌ళూరు చెక్కేశారు. ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా.. అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఫిక్స‌యిపోయింది. ఈ దిశ‌గా వ‌చ్చే రోజుల్లో చ‌ట్టం చేసే అవ‌కాశాలు కూడా ఉన్నాయి. ఎవ‌రెంత మొత్తుకున్నా.. రాజ‌ధాని హోదా నుంచి ఈ ప్రాంతాన్ని మార్చే వాడే లేడు. రేప‌టి రోజున జ‌గ‌న్ ల‌క్కు ప‌ని చేసి పొర‌బాటున అధికారంలోకి వ‌చ్చినా.. ఆయ‌న సైతం ప్ర‌జా రాజ‌ధానిని మార్చే అవ‌కాశ‌మే లేదు. అలాంటి రాజ‌ధాని విష‌యంలో ముందే మేలుకుని.. ఈ ప్రాంత రైత‌న్న‌ల‌కు, ఆంధ్ర‌ ప్ర‌జ‌ల‌కు చిన్న విష‌స్ చెప్పొచ్చు. కానీ లోకేష్ అన్న‌ట్టు ప్యాలెస్ పిల్లి.. ఈ ప్యాలెస్ నుంచి ఆ ప్యాలెస్ కి చెక్కేయ‌డంతో.. ప్ర‌స్తుతం  అంద‌రూ ఆయ‌న్న క‌సికొద్దీ తిట్టుకుంటున్న దృశ్యం క‌నిపిస్తోంది. 

దీని భావ‌మేమి మోదీశా!

ఎంతో ఎదిగిపోయావుగా లోకేశా!  ఈ ఫోటోను చూశారుగా.. మోదీ లోకేష్ పై చూపుతున్న ప్రేమాభిమానం ఎలాగుందో గ‌మ‌నించారుగా.. శెభాష్ లోకేష్ బేటా.. తు బ‌హుత్ బ‌డా లీడ‌ర్ బ‌నేగా.. అంటూ హిందీలో ఏదో అంటున్న‌ట్టున్నారు చూశారుగా. నిజంగా ఇది లోకేష్ ని మోడీ భ‌జం త‌ట్టి మ‌రీ మెచ్చుకుంటున్నదే. కాద‌న‌డం లేదు కానీ  ఇలా ప్ర‌ధాని స్థాయి ప్ర‌శంస‌లు అంద‌డానికి లోకేష్ ప‌డ్డ క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు.  నారా భువ‌నేశ్వ‌రి- చంద్ర‌బాబు దంప‌తుల ఏకైక పుత్రుడు నారా లోకేష్. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎదుర్కున్న స‌మ‌స్య‌లు లెక్క‌లేన‌న్ని. అన్నిటినీ ఒంట‌రిగానే ఎదుర్కున్నారు. ప్ర‌తి దీ ప‌ర్స‌న‌ల్ గానే తీసుకున్నారు. పార్టీకి అన్నీ తానే స‌ర్వ‌స్వంగా వ్య‌వ‌హ‌రించారు. ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌ను చ‌వి చూశారు. నింద‌లూ నిష్టూరాల‌ను అధిగ‌మించారు. ఒక ర‌కంగా చెబితే అభిమ‌న్యుడ్ని కౌరవ సేనలు పద్మవ్యూహంలో చుట్టు ముట్టిన‌ట్టు చుట్టుముట్టాయి ఆయ‌న్ను స‌మ‌స్య‌లు. కానీ వీరోచిత పోరాటం చేశారు. ప‌ద్మ‌వ్యూహ చేధ‌న తెలిసిన అర్జునుడిలా బయటకు వచ్చారు.  తాను యువ‌గ‌ళం పాద‌యాత్ర మొద‌లు పెట్టిన నాటి నుంచి అన్నీ ఆటంకాలే. అతి  పెద్ద ఆటంకం తండ్రి జైలు పాలు కావ‌డం. ఎంత మాత్రం దాన్నో క‌ష్టంగా భావించ‌లేదు. ఇష్టంగా తీస్కున్నారు. రాజ‌కీయాల్లో ఇవ‌న్నీ మామూలే అంటూ త‌న‌కు తాను న‌చ్చ‌చెప్పుకున్నారు. త‌న‌ను అరెస్టు చేస్తార‌న్న ఆందోళ‌న క‌లిగినా వాటిని లెక్క చేయ‌లేదు. పైపెచ్చు ఎన్నో కొత్త ఎత్తుగ‌డ‌లు వేశారు. అందులో ప్ర‌ధాన‌మైన‌ది  రెడ్ బుక్. ఈ విష‌యం ఆయ‌న‌కు ఎవ‌రు చెప్పారో. లేక స్వ‌యంగా తానే అంత‌టి ఆలోచ‌నా ప‌రుడో తెలీదు కానీ, దీంతో తన‌కు తాను ఒక గేమ్ ఛేంజ‌ర్ గా నిలిచారు. దీంతో ఒక్క‌సారిగా డైన‌మిక్స్ మారిపోయాయ్. ఇపుడీ రెడ్ బుక్ ఒక ట్రెండ్. తెలంగాణ‌లో క‌విత దీన్ని కాపీ కొడుతూ తాము కూడా పింక్ బుక్ రాస్తున్నామ‌ని అన్నారు. ఒక‌రు మీ మెథ‌డ్ ఫాలో అయితే మీరు హండ్రెడ్ కి హండ్రెడ్ ప‌ర్సంట్ హిట్టు కొట్టిన‌ట్టే. స‌క్సెస్ సాధించిన‌ట్టే. ఇటు జ‌గ‌న్ కూడా లోకేష్ ని ఫాలో అవుతూ తాము బ్లూ బుక్ తెరుస్తామ‌ని అన్నారు. అంటే లోకేష్ ఈ విష‌యంలో ఒక ట్రెండ్ సెట్ట‌ర్ అన్న‌మాట‌. నేను ట్రెండ్ ఫాలో కాను సెట్ చేస్తాన‌నే డైలాగ్ ని నిజం చేశార‌న్న‌మాట‌.  ఒక్కొక్క‌ళ్ల‌నూ చుచ్చు పోయిస్తానంటూ ఆయ‌న ప‌లికిన డైలాగులు సైతం డైన‌మేట్ల‌లా పేలాయి. అంతే కాదు ఒకడుగు ముందుకు వేసి ఎవ‌రు ఎక్కువ కేసులు ఎదుర్కుంటే వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామ‌న్న ప్ర‌క‌ట‌నలు చేశారు. ఇలాంటి మాట అన‌డానికి ఎంతో గ‌ట్స్ ఉండాలి. అలాంటి ద‌మ్ము ధైర్యం త‌న గుండెల నిండుగా ఉన్న‌ట్టు చెప్ప‌డ‌మే కాదు చేసి చూపించారు నారా లోకేష్. చాలా మంది అంటుంటారు నారా లోకేష్ కి తెలుగు స‌రిగా రాదు.. అని. కానీ, ఆయ‌న ఇంగ్లీష్ లో మాట్లాడింది మీరెపుడైనా చూశారా? అమెరిక‌న్ యాక్సెంట్ దంచి కొడ‌తారు. ఆ ఫ్లో.. వేరే లెవ‌ల్. ఎంతైనా స్టాన్ ఫోర్డ్ రిట‌ర్న్డ్ క‌దా..  అంతేనా ఇవాళ జ‌గ‌న్ కి లోకేష్ కి తేడా ఏమిటో తెలుసా? జ‌గ‌న్ త‌న‌ను న‌మ్మిన కార్య‌క‌ర్త‌ల‌ను న‌ట్టేట ముంచేస్తారు. అదే లోకేష్.. వారికి ఏ క‌ష్టం వ‌చ్చినా వెంట‌నే రియాక్ట‌వుతారు. అంతే కాదు నేనున్నానంటూ భ‌రోసా ఇస్తారు కూడా.  మొన్నంటే మొన్న ఒక కార్య‌క‌ర్త ధైర్యం చాల‌క ఆత్మ‌హ‌త్యా య‌త్నం చేస్తే అండ‌గా నిలిచారు లోకేష్. మీకు నేనున్నా అధైర్య ప‌డొద్ద‌న్నారు. అంతేనా.. వారి పిల్ల‌ల చ‌దువుకు, ఇతర అవసరాలకూ స‌హాయ స‌హ‌కారాల‌ను అందించి బెస్ట్ లీడ‌ర్షిప్ క్వాలిటీస్ కి కేరాఫ్ గా నిలిచారు. ఇలాంటివెన్నో. మీకు తెలుసా.. కార్య‌క‌ర్త‌ల‌కు జీతం కావాల‌ని మొద‌ట ఘోషించింది లోకేషే. అంతే కాదు డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీమ్ ల‌ను తొలుత ప్ర‌స్తావించింది కూడా లోకేషే.  వాలంటీర్ల జీతాలు, ఇత‌ర ప‌థ‌కాల ద్వారా జ‌గ‌న్  చేసిన‌వ‌న్నీ కాపీ పేస్టే.   ఒక స‌మ‌యం సంద‌ర్భం రాక పోవ‌డం వ‌ల్ల ఆయ‌న తాను అనుకున్న‌ది సాధించ‌లేక పోయారు. దానికి తోడు తండ్రి చాటు కొడుకుగా ఉండటం వ‌ల్ల‌.. కొన్ని ప‌నులు సాధించ‌లేక పోయారు. ఇప్పుడు లోకేష్ బాగా రాటు దేలారు. త‌న కార్య‌క‌ర్త‌ల‌కు బీమా ప‌థ‌కాల‌ను తీసుకొచ్చి ఆదుకుంటున్నారు. ఎవ్రిథింగ్ ప‌క్కా. లైన్ క్లియ‌ర్ అన్న సంకేతాల‌ను ఇస్తున్నారు. ఎక్క‌డ ఏ చిన్న చీమ చిటుక్కుమ‌న్నా లోకేష్ కి స‌మ‌చారం చేరాల్సిందే. ఇటు పార్టీ కావ‌చ్చు అటు ప్ర‌భుత్వం కావ‌చ్చు ఆల్ అండ‌ర్ కంట్రోల్ ఆఫ్ లోకేష్.. ఒక‌ప్పుడు ఎన్నో నీచ‌మైన మాట‌ల‌తో కించ ప‌రిచిన వారే ఇప్పుడు లోకేష్ అంటే.. అద్దిరి  ప‌డుతున్నారు. అద్భుత‌మ‌ని ప్ర‌శంసిస్తున్నారు. అప్ప‌టికీ.. ఇప్ప‌టికీ లోకేష్ లో చాలా తేడా.  ప్రెజంట్ లోకేష్ రేంజే వేరు. ఆయ‌నకు ప్ర‌త్య‌ర్ధి పార్టీల నుంచి కూడా ప్ర‌శంస‌లందుతున్నాయ్. ఇటీవ‌ల వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ నుంచి అందిన ప్ర‌శంస‌లు అలాంటివే.  దువ్వాడ‌లా కొంద‌రు బ‌య‌ట ప‌డుతున్నారు. మ‌రి కొంద‌రు లోలోప‌లే లోకేష్ ఈజ్ గ్రేట్ అని అనుకుంటున్నారు. లోకేష్ ఈజ్ లోకేష్ ఆయ‌న సూప‌ర్ అంటూ కొంద‌రు బాహాటంగా చెప్పుకుంటున్నారు. మ‌రి కొంద‌రు చెవులు కొరుక్కుంటున్నారు. ఒక‌ప్పుడు లోకేష్ అంటే చిన్న చూపు చూసిన వారు ఇవాళ ఆయ‌న స్థాయిని సామ‌ర్ధ్యాన్ని చూసి జ‌డుసుకుంటున్నారు.  ఇప్పుడే ఇలాగుంటే వ‌చ్చే రోజుల్లో లోకేష్ లెవ‌లే వేరు కాబోతుందా అంటే అదే నిజం కాబోతుంద‌ని అంటున్నారు   రాజ‌కీయ విశ్లేష‌కులు. ఆయ‌నికిపుడు అన్ని రాజ‌కీయ విద్య‌లూ వ‌చ్చేశాయ్. ఒక‌ప్ప‌టి తండ్రి చాటు కొడుకు కాదాయ‌న‌. నారా లోకేష్ స‌న్నాఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు స్థాయి కాదు త‌న‌ది.  నారా చంద్ర‌బాబు ఫాద‌రాఫ్ నారా లోకేష్ రేంజికి అత్యంత త్వ‌ర‌లోనే చేరేలా క‌నిపిస్తున్నారు. అంత దీటుగా ధాటుగా క‌నిపిస్తున్నారు.. నారా లోకేష్ త‌న బాడీ లాంగ్వేజ్ ద‌గ్గర నుంచి మొద‌లు పెట్టారు. ఇప్పుడాయ‌న అత్యంత హ్యాండ్స‌మ్ గా క‌నిపిస్తున్నారు. మాట‌ల్లో ఫ్లో పెరిగింది. అగ్రెసివ్ నెస్ వ‌చ్చి చేరింది. ఇప్పుడాయ‌నది ఏపీ పొలిటిక‌ల్ ఐకానిక్ లీడ‌ర్షిప్.   అంత‌గా ప‌రిణితి చెందారు. ఇవ‌న్నీ గ‌మ‌నిస్తూ వ‌చ్చారు కాబ‌ట్టే మోడీ లోకేష్ భుజం మీద చెయ్యేసి శ‌భాష్ బేటా అని ప్ర‌సంశిస్తున్నారని అంటున్నారు పొలిటిక‌ల్ ఎన‌లిస్టులు. ఆల్ ద బెస్ట్ లోకేష్ సార్.. వి హోప్ బెట‌ర్ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ ఇన్ క‌మింగ్ డేస్...... అన్న‌ది ప్ర‌తి ఒక్క కార్య‌క‌ర్త నుంచి వినిపిస్తోన్న కామెంట్!

ఆరు నెలల తర్వాత తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయ తలుపులు

ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ దేవాలయం ద్వారాలు తెరుచుకున్నాయి శుక్రవారం (మే 2) ఉదయం 7 గంటలకు మంత్రోచ్ఛారణల మధ్య కేదారనాథ్ దేవాలయ ద్వారాలను తెరిచారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామీ కేదారనాథుని దర్శనం చేసుకుని తొలి పూజ చేశారు.  జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదారనాథుడిని దర్శించు కునేందుకు దేశం నలుమూ లల నుంచి ఏటా లక్షలాది మంది దర్శించుకుంటుంటా రు. భారీ మంచు కార‌ణంగా సుదీర్ఘ‌కాలం మూసి ఉండే ఈ పుణ్య‌క్షేత్రం దాదాపు ఆరు నెలల తరువాత ఈ రోజు తెరుచుకుంది. ఈ సందర్భంగా ఆలయాన్ని పువ్వులతో అందంగా అలంకరించారు.  కేదారనాథుని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. హెలికాప్టర్ ద్వారా భక్తులపై పూలర్షం కురిపించారు.  ఆరు  నెలల కిందట ఆలయం తలుపులను మూసివేసే సమయంలో మూల మూర్తికి అలంకరించిన పూజావస్తువులను తొలగించారు. తాజా పూలతో స్వామివారిని అలంకరించారు. కేదార్‌నాథ్ ఆలయం తలుపులు తెరచు కోవడంతో చార్ ధామ్ యాత్ర సీజన్ ప్రారంభమై నట్లయ్యింది.  యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను చార్ ధామ్ క్షేత్రాలుగా పిలుస్తారు.  యమునోత్రి, గంగోత్రి ధామాలు ఏప్రిల్ 30న‌ అక్ష‌య తృతీయ రోజున తెర‌వ‌గా, బద్రీనాథ్ ఆల‌యాన్ని ఈ నెల 4న తెర‌వ‌నున్నారు. కాగా కేదార్‌నాథ్ యాత్ర కోసం సోన్‌ప్ర‌యాగ్ నుంచి హెలి కాప్ట‌ర్ సేవ‌లు ప్రారంభ‌మ‌ య్యాయి. ఇటీవ‌ల జ‌మ్మూ క‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గామ్‌లో ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌ త్త‌మ‌య్యాయి.  ఈ చార్‌ధామ్ యాత్ర కొన‌సాగే మార్గంలో పోలీ సులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌తో భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. అనుమానిత వ్య‌క్తులు క‌నిపిస్తే వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని భ‌క్తుల‌కు అధికారులు చెబుతున్నారు.

అమరావతి అన్ స్టాపబుల్.. నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అన్ స్టాపబుల్ అని మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతి పునర్నిర్మాణ  పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన నారా లోకేష్ ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన అమరావతిని ఆపడం ఎవరి తరం కాదన్నారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో అమరావతిని నిర్వీర్యం చేయడానికి శతథా ప్రయత్నించారనీ, అయితే అది వారి వల్ల కాలేదన్నారు. మూడు రాజధానులంటూ మూడుముక్కలాట ఆడిన జగన్ సర్కార్ చివరికి ఒక్క చోటా ఒక్క ఇటుక కూడా వేయలేకపోయిందని విమర్శించారు.  ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణ పనులకు కూడా మోడీయే శంకుస్థాపన చేస్తున్నారనీ, ఇక అమరావతిని ఆపే సత్తా, దమ్మూ ఎవరికీ లేదన్నారు.   రాష్ట్రంలో ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఉందని, కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడతాయని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం ద్వారా 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి లోకేశ్ అన్నారు.   ఇక పుల్వామ ఉగ్రదాడి అనంతరం ప్రధాని మోడీ చర్యలకు పాకిస్థాన్ బెంబేలెత్తిపోతున్నదన్నారు. ఒక్క పాకిస్థాన్ కాదు వంద పాకిస్థాన్ లు వచ్చినా మోడీ మిస్సైల్ ముందు నిలవలేవని లోకేష్ అన్నారు. ఉగ్రవాదంపై పోరులో యావద్దేశం మోడీకి అండగా నిలుస్తుందన్నారు. 

విశేషంగా ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్, మోడీ విగ్రహాలు

అమరావతి పనుల పున: ప్రారంభ వేళ తెనాలిలోని సూర్య శిల్పశాల నిర్వాహకులు రూపొందించిన వివిధ విగ్రహాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ శిల్పాలను అమరావతి సభావేదిక ఎడమ వైపున ఏర్పాటు చేశారు.  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణం, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక ప్రాముఖ్యతలను తెలియజేయడానికి రూపిందించారు.   అమరావతి సభావేదికకు ఎడమవైపు ఏర్పాటు చేసిన శిల్పాలలో తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, ప్రధాని నరేంద్రమోడీ, బుద్ధుడి విగ్రహం, మేక్ ఇన్ ఇండియా సింహం, అమరావతి అక్షర రూపం, సైకిల్, కమలం విగ్రహాలు, ఉన్నాయి.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు ఎన్టీఆర్. జాతీయ రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసిన మహాను భావుడు.  ఆయన విగ్రహం రాష్ట్ర ప్రజలకు ఆయన సేవలను గుర్తు చేస్తూ, ప్రస్తుత పాలక పక్షమైన తెలుగు దేశం పార్టీకి చెందిన చారిత్రక వారసత్వానికి చిహ్నంగా నిలుస్తుంది.  ఇక ప్రధాని మోడీ  విగ్రహం   అమరావతి పునర్నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం మద్దతును చిహ్నంగా నిలుస్తుంది. అలాగే బుద్దుడి విగ్రహం అమరావతి చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి గుర్తుగా నిలుస్తుంది.  తయారీ రంగాన్ని ప్రోత్సహించే కేంద్ర ప్రభుత్వ చేపట్టిన  మేక్ ఇన్ ఇండియా ను స్ఫురింప చేస్తూ  అమరావతిని ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మేకిన్ ఇండియా సింహం విగ్రహం నిలుస్తుంది.   

అమరావతిలో క్వాంటం వ్యాలీ.. వచ్చే ఏడాది జనవరికల్లా రెడీ

క్వాంటం కంప్యూటింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ముందువరుసలో నిలపాలని పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఉడాది  జనవరి 1న అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు.  ఈ మేరకు ఉండవల్లిలోని సీఎం చం్రబాబు  నివాసంలో   ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ & టూబ్రో (L&T) సంస్థలతో  ప్రభుత్వం శుక్రవారం ( మే2)) ఎంవోయూ కుదుర్చుకుంది. దీంతో అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి, అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం కానుంది. దేశంలోనే తొలిసారి ఐబీఎం అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్‌ కలిగిన ‘క్వాంటం సిస్టం 2’ని అమరావతిలో నెలకొల్పనుంది.    ఎంవోయూ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. 1990లలో దేశంలో ఐటీ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ కీలకంగా నిలిచిందని, ఇప్పుడు దేశంలో క్వాంటమ్ విప్లవానికి కూడా ఏపీయే నాయకత్వం వహిస్తుందని అన్నారు. ఐబీఎం, టీసీఎస్‌, ఎల్ అండ్ టీతో జరిగిన ఒప్పందంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌కే కాదు, భారతదేశానికి కూడా చారిత్రాత్మక దినంగా మారిందని చంద్రబాబు అన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్  భవిష్యత్ పాలనకు, ఆవిష్కరణలకు పునాది అవుతుందనీ,  సాంకేతికరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త అవకాశాలు వస్తున్నాయనీ,  వాటిని అందిపుచ్చుకుని ముందుకు సాగడం ముఖ్యమన్నారు. భవిష్యత్ అవసరాలన్నీ క్వాంటం కంప్యూటింగ్‌‌పైనే ఆధారపడి ఉంటాయని అందుకే అమరావతిని క్వాంటం వ్యాలీ చేయాలనుకున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పారు. సిలికాన్ వ్యాలీ తరహాలో క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దాలని ఐబీఎం, టీసీఎస్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. హైటెక్ సిటీని 15 నెలల్లో నిర్మించిన అనుభవాన్ని గుర్తుచేస్తూ, క్వాంటమ్ వ్యాలీ తక్కువ సమయంలోనే నిర్మించవచ్చన్నారు. ఇప్పటికే ఎల్&టీకి స్థలాన్ని కేటాయించామన్న చంద్రబాబు, మౌలిక వసతులను అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకోసం రెండు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఒక కమిటీ నిర్మాణ పురోగతిపైనా, మరొక టి వ్యవస్థ అభివృద్ధిపైనా దృష్టి సారిస్తాయన్నారు.  భారతదేశంలో ఐబీఎం క్వాంటం సిస్టం 2 స్థాపన, దేశ క్వాంటం ప్రయాణానికి కీలక మలుపు కానుందన్నారు.  

జనసంద్రంగా మారిన అమరావతి.. అంతటా పండుగ శోభ

రాజధాని అమరావతి జనసంద్రంగా మారిపోయింది.  రాజధాని పునఃప్రారంభ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలి వచ్చారు.  శుక్రవారం (మే2) ఉదయం నుంచే రాజధాని ప్రాంతానికి చెందిన రైతులతో పాటు, రాష్ట్రం నలుమూలల నుంచీ  ప్రజలు పెద్ద సంఖ్యలో జనం అమరావతికి చేరుకున్నారు.  ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం మధ్యాహ్నానికే నిండిపోయింది.  ఈ కార్యక్రమానికి హాజరైన వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా  ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తాగునీరు, తాత్కాలిక ఆసుపత్రి, అంబులెన్సులను అందుబాటులో ఉంచింది. సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారుల ప్రదర్శనలు సభికులలో ఉత్సాహాన్ని నింపాయి. రాజధానిగా అమరావతి ప్రస్థానాన్ని పునఃప్రారంభించే ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతి పండుగ శోభను సంతరించుకుంది. 

పవన్ కల్యాణ్ పేరు చేర్చి రెండో ఆహ్వాన పత్రం

అమరావతి పునర్నిర్మాణ పనుల పున: ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వస్తున్న వేళ తెలుగుదేశం, జనసేనల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయా? అమరావతి పనుల పున: ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేరు లేకపోవడం ప్రభుత్వానికీ, కూటమి పార్టీలకే ఒకింత ఇబ్బందికరంగా మారిందా? ప్రొటో కాల్ ప్రకారం ప్రభుత్వ ఆహ్వాన పత్రికలో ఉప ముఖ్యమంత్రి పేరు ఉండాల్సిన అవసరం లేదన్న అధికారుల వాదన రాజకీయ ఒత్తిడుల ముందు వీగిపోయిందా? అంటే సమాధానం ఔననే వస్తున్నది.  రాజధాని అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన ఆహ్వాన పత్రం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.  అమరావతి ప్రజా రాజధాని పునఃప్రారంభం పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వాన పత్రికలు ముద్రించి, అమరావతి రైతులు, ప్రజాప్రతినిధులు, ఇతర నేతలకు పంపిణీ చేసింది.   నాలుగు పేజీల ఆహ్వానపత్రంలో తొలిపేజీలో అమరావతి స్థూపం నమునా, రెండు మూడు పేజీలలో తెలుగు, ఇంగ్లీషులలో కార్యక్రమం, అతిథుల వివరాలు, నాలుగో పేజీలో అమరావతి రాజధాని ఊహా చిత్రం ఉంది. అయితే, ఈ ఆహ్వాన పత్రికలో ఉపముఖ్యమంత్రి   పవన్ కల్యాణ్ పేరు లేకపోవడం జనసేన శ్రేణులలో ఆసంతృప్తికీ, ఆగ్రహానికీ హేతువైంది.   ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ పేరు లేకపోవడం ఏమిటని జనసైనికులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.  కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలుగుదేఇు తరఫున చంద్రబాబు ఉన్నప్పుడు జనసేన తరఫున పవన్ కల్యాణ్ పేరు ఎందుకు లేదు అంటూ జనసేన కార్యకర్తలు సామాజిక మాధ్యమం వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు  పవన్ కల్యాణ్‌న్ కు గౌరవం ఇవ్వకపోతే సహించేది లేదు అంటూ సామాజిక మాధ్యమంలో హోరెత్తించారు.   కాగా ఇదే విషయం వైసీపీ కూడా తనకు అనుకూలంగా మార్చుకుంది. మాజీ మంత్రి పేర్ని వంటి వారు సెటైర్లు కురిపించారు. సోషల్ మీడియా వేదికగా అమరావతి అహ్వానపత్రికను పోస్టు చేస్తూ ఇందులో ఎవరి పేరో మిస్సయ్యిందంటూ వ్యాఖ్యానించారు.  అలాగే వైసీపీ సోషల్ మీడియా విభాగం అయితే ఎన్డీఏ కూటమిలో జనసేనను అణచివేస్తున్నారంటూ గుండెలు బాదేసుకుంది.  ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం ఒకింత ఇబ్బంది పడాల్సి వచ్చిందనడం వాస్తవం. దీంతో వెంటనే నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. పవన్ కల్యాణ్ పేరు చేర్చుతూ మరో ఆహ్వాన పత్రాన్ని ముద్రించింది. ఈ కొత్త (రెండో) ఆహ్వాన పత్రికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్లు ఉన్నాయి.  వీటిని  పంపిణీ కూడా వెంటనే ప్రారంభించేసింది. దీంతో వివాదం సద్దుమణిగింది.   అమరావతి ఆహ్వాన పత్రికలో పవన్ కల్యాణ్ పేరు లేకపోవడం ప్రొటోకాల్ ప్రకారం కరెక్టే అయినా కూటమి పార్టీల మధ్య వివాదానికి తావు రాకూడదన్న ఉద్దేశంతో సర్కార్ వెంటనే రెండో ఆహానపత్రికను ముద్రించి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది.  ఈ సంఘటన కూటమిలో సమన్వయం, జనసేనకు గౌరవం వంటి అంశాలపై మరింత శ్రద్ధ అవసరమని తేలిందని పరిశీలకులు అంటున్నారు.  

గూడెం ఎమ్మెల్యే చావు కోసం ఎదురు చూస్తున్నది ఎవరు?

తాడేపల్లిగూడెంలో కూటమి రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆవేదన కూటమి నేతల మధ్య అసంతృప్తికి అద్దం పడుతోంది.  తాను చనిపోతే  బైఎలెక్షన్ కోసం కొందరు ఎదురు చూస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. అసలు తాడేపల్లిగూడెంలో బై ఎలక్షన్ కోసం ఎదురుచూస్తున్నది ఎవరు అన్న చర్చ మొదలైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి రాష్ట్రంవ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేనంత ఘన విజయాన్ని సాధించాయి.  ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూటమి స్నేహం 20 ఏళ్ల పాటు కొనసాగుతుందనీ.. మళ్లీ, మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరచూ అంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కూటమి శ్రేణుల మధ్య అటువంటి పరిస్థితులు కనబడటం లేదు. పవన్ కళ్యాణ్ బాహుబలి అని ప్రేమగా పిలుచుకునే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా చేసిన వ్యాఖ్యలు దానికి అద్దంపడుతున్నాయి.  చాలా కష్టపడి రాజకీయాల్లోకి వచ్చానని, ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకుగా ఎమ్మెల్యే అయిన తాను ప్రజలకు ఎంతో సేవ చేయాలనుకుంటున్నాని బొలిశెట్టి శ్రీనివాస్ మొదటి నుండి చెప్తూ వస్తున్నారు. అలాంటాయన తాను చనిపోతే బాగుండు, బైపోల్స్ వస్తాయని ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ఎమ్మెల్యేగా తనను ప్రజలు గెలిపించుకున్నారని, ఎవరో త్యాగం  చేస్తే  తాను ఎమ్మెల్యే అవ్వలేదని చురకలు అంటించారు. అసలు బొలిశెట్టి శ్రీనివాస్‌ను  అంత మానసిక క్షోభకు గురి చేసింది ఎవరు అనే దానిపైనా రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఆయన వ్యాఖ్యలతో జనసేన, టీడీపీల మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు,  ఇటు ఎమ్మెల్యేతో పాటు జనసేన ముఖ్య నేతల మధ్య అధికారులు నలిగిపోతున్నారన్నది వాస్తవం అంటున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుండి బొలిశెట్టి శ్రీనివాస్ తన దైన శైలిలో ప్రజల్లో దూసుకుపోతున్నారు. మిత్రపక్షాలకు ఇబ్బంది లేకుండా జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటూ   ప్రజలకు నిరంతరం దగ్గరగా ఉంటూ ఎప్పటికప్పుడు వారి సమస్యలకు పరిష్కారం చూపించే ప్రయత్నం  చేస్తున్నారు. అటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ ఒక్కసారిగా ఆవేదనతో మాట్లాడటంతో అసలు ఏమైంది అనే దానిపై రాష్ట్ర నేతలు సైతం ఆరా తీయటం మొదలు పెట్టారంట తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం సైతం బలోపేతంగా ఉంది. వైసీపీ హయాంలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణను ఎదుర్కోవటంలో జనసేన పార్టీ నుండి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్చార్జ్ వలవల బాబ్జి తమదైన శైలిలో పోరాడారు. అప్పటి రాజకీయ పరిస్థితుల ప్రభావంతో కూటమి ఏర్పడిన తర్వాత  తాడేపల్లిగూడెం టికెట్‌ని అనూహ్యంగా జనసేన కైవసం చేసుకుంది. కూటమి వేవ్ కలిసి వచ్చి బొలిశెట్టి శ్రీనివాస్ భారీ మెజార్టీతో గెలిచారు.  టీడీపీ ఇన్చార్జిగా ఉన్న వలవల బాబ్జికి ఏడాది కావస్తున్నా  ఏ పదవి ఇవ్వకపోవడంపై టిడిపి నేతల్లో కొంత అసంతృప్తి ఉంది. బాబ్జి తనకు పదవుల మీద ఆశ లేదంటూనే తనదైన మార్క్ చూపించుకోవడానికి నియోజకవర్గంలో ప్రయత్నాలు చేయటం ఇటు జనసేన నేతలకు కొంత ఇబ్బందిగా మారింది. ఎమ్మెల్యేగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్‌కు కనీస సమాచారం ఇవ్వకుండా స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ పట్టాభిరామ్‌తో కలిసి తన ఇంట్లో మున్సిపల్ అధికారులతో రివ్యూ సమావేశం పెట్టడం ఎమ్మెల్యే శ్రీనివాస్‌కు నచ్చలేదట.  మరోవైపు బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన బలోపేతంలో భాగంగా ఇతర పార్టీల నుండి వచ్చే బలమైన నేతలకు సముచిత స్థానం కల్పిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో టీడీపీ నుండి జనసేనలోకి వలసలు పెరగడంతో వలవల బాబ్జి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల నియోజకవర్గంలో జిల్లా అధికారుల పర్యటన సమయంలో వలవల బాబ్జిని పిలవలేదు.  దాంతో ఆగ్రహంతో ఉన్న టీడీపీ నేతలు కొందరు అత్యుత్సాహంతో మాట్లాడిన మాటలు వల్లే..  ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేశారంట. టీడీపీ నేతలు అక్కడ, ఇక్కడ మాట్లాడిన మాటలు నేరుగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చెవిన పడటంతో ఆయన మనోవేదనకు గురయ్యారని జనసైనికులు చెప్తున్నారు.  తమకన్నా తెలుగుదేశం నేతలకే బొలిశెట్టి శ్రీనివాస్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నా వారు ఇంకా ఆయన్న టార్గెట్ చేయడాన్ని జనసేన పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నియోజకవర్గంలో పై చేయి కోసం   ఇటు టీడీపీ,  అటు జనసేన నేతలు బహిరంగ విమర్శలు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేకి తెలియకుండా టీడీపీ నేతలు అధికారులకు ఫోన్లు చేసి తమ పనులు చేయాల్సిందేనని లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని బెదిరిస్తున్నారంట. అధికారులు ఇదే విషయాన్ని బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకు వెళ్లడంతో టీడీపీ, జనసేన మధ్య ఉన్న కోల్డ్ వార్ ఇప్పుడు బహిర్గతం అయిందంటున్నారు. మొత్తమ్మీద పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా జనసేనలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అసలు ఈ రచ్చ అంతటికీ కారణం రాబోయే మున్సిపల్ ఎన్నికలే అంటున్నారు. ఆ ఎన్నికల వాటాల్లో జనసేనపై పైచేయి సాధించేందుకే  టీడీపీ నేతలు ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నారని తెలుస్తోంది.

జగన్ బ్యాచ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ.. లిక్కర్ కేసులో కీలక మలుపులు

ఏపీలో సంచలనం సృష్టిస్తోన్న మద్యం కుంభకోణం కేసులో రాజ్ కేసిరెడ్డిని వారం రోజులు కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. అదే టైంలో  రాజ్ కేసిరెడ్డి  పీఏ దుబాయ్ పరారవ్వడానికి ప్రయత్నిస్తూ దొరికిపోవడంతో ఆ కేసులో  కీలక వ్యక్తుల గుట్టు రట్టవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక తాజాగా లిక్కర్ స్కాంకు సంబంధించి జగన్ బ్యాచ్‌కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ సీఎం జగన్ మాజీ సెక్రటరీ కె.ధనంజయ రెడ్డి, పీఏ పి.కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్‌ డైరెక్టర్, జగన్‌ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలు చూసే బాలాజీ గోవిందప్ప హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో వివరాలు సమర్పించేందుకు ప్రాసిక్యూషన్ సమయం కోరింది. ఈ క్రమంలో ప్రాసిక్యూషన్ సమయం కోరుతున్న నేపథ్యంలో ఈ దశలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. మద్యం స్కాంలో ఇప్పటికే అరెస్ట్ అయిన కొందరు నిందితులు తమ పేర్లు చెప్పారని, అందువల్ల తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. అయితే తాము ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ దశలో ముందస్తు బెయిల్‌ ఇవ్వలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. కాగా.. మద్యం స్కాం కేసులో లోతుగా విచారణ జరుగుతుండటంతో జగన్ బ్యాచ్‌లో వణుకు మొదలైంది. ఇప్పటికే ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి, ఆయన పీఏ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ కేసు తమ వరకూ రాబోతోందన్న భయంతో హైకోర్టులో పిటిషన్ వేశారు జగన్ బ్యాచ్. తమకు అరెస్ట్ లేకుండా చూడాలంటూ ముందస్తు బెయిల్‌కు అప్పీలు చేసుకున్నారు. జగన్ సెక్రటరీ కె.ధనంజయ రెడ్డి, పీఏ పి.కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ  హైకోర్టులో పిటిషన్‌‌ వేయగా, ఎలాంటి ముందస్తు అరెస్ట్ లేకుండా ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. అంతే కాకుండా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చాలా మంది నుంచి  దర్యాప్తు అధికారులు సమాచారాన్ని రాబట్టారు. మరికొంత మంది విచారణ కూడా జరుగుతోంది. ఈ కేసులో మరికొంత మందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ముగ్గురు హైకోర్టులో పిటిషన్‌ వేయగా.. వారికి ఎదురుదెబ్బ తగిలింది.

ఎట్రాసిటీ చట్టం వర్తించదు!

మతం మారిన ఎస్సీలకు ఏపీ హైక్టోర్టు షాక్ మతం మారిన ఎస్సీ కులస్తుల హోదా గురించి ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. షెడ్యూల్డ్‌ కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదాను కోల్పోతారని హైకోర్టు తేల్చిచెప్పింది. వారు ఎస్సీ, ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని స్పష్టంచేసింది. గతంలో ఒక చర్చి పాస్టర్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద పలువురిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తప్పుపట్టింది. చట్టాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని ఆక్షేపించింది. పోలీసులు ఛార్జిషీట్‌ వేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. కేసును కొట్టేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌ ఈ మేరకు ఇటీవల తీర్పు ఇచ్చారు. తనను కులం పేరుతో దూషించి, దాడి చేసి గాయపరిచారని ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పాస్టర్‌ చింతాడ ఆనంద్‌ 2021లో చందోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన ఎ.రామిరెడ్డి మరో ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ గుంటూరు ఎస్సీ, ఎస్టీ కోర్టులో పెండింగ్‌లో ఉంది. కేసును కొట్టేయాలంటూ నిందితులు 2022లో హైకోర్టులో పిటిషన్‌ వేశారు.  ఫిర్యాదుదారు పదేళ్లుగా పాస్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని ఫిర్యాదులోనే పేర్కొన్నారు. క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదు. రాజ్యాంగం షెడ్యూల్డ్‌ కులాలు ఆర్డర్‌-1950 ప్రకారం హిందూమతాన్ని కాకుండా ఇతర మతాలను స్వీకరించినవారు ఎస్సీ హోదాను కోల్పోతారు. కుల వ్యవస్థను క్రైస్తవం గుర్తించదని, ఆ మతాన్ని స్వీకరించిన వారికి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ ఉండదని సుప్రీంకోర్టు  గతంలో తీర్పులు ఇచ్చింది. వీటిని పరిగణనలోకి తీసుకుని కేసును కొట్టేయండని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. పాస్టర్‌ ఆనంద్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫిర్యాదుదారుడు ఎస్సీ అని తహసీల్దార్‌ ధృవపత్రం ఇచ్చారని గుర్తుచేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఫిర్యాదుదారుడు రక్షణ పొందలేరని పేర్కొంటూ, కేసు కొట్టేశారు.

హస్తినలో వర్ష బీభత్సం

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. శుక్రవారం తెల్లవారు జామున ఉరుములు, మెరుపులు, వడగళ్లతో పాటు తీవ్రమైన ఈదురుగాలులతో కురిసిన వర్షం హస్తినను అతలాకుతలం చేసేసింది. ఈ భారీ వర్షం కారణంగా ఢిల్లీ విమానాశ్రయం నుంచి విమానరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కనీసం 100 విమానాలు రీషెడ్యూల్ అయ్యాయి. విమాన రాకపోకల్లో గంటల తరబడి జాప్యం ఏర్పడింది.  పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిచిపోయారు. విమానాల రాకపోకలలో జాప్యాన్ని తగ్గించేందుక శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు విమానయాన శాఖ అధికారులు తెలిపారు. విమానాల రీషెడ్యూల్ వివరాలను విమాన సంస్థల వెబ్ సైట్ల ద్వారా తెలుసుకోవాలని సూచించారు.  ఇక ఢిల్లీలోని ద్వారక, ఖాన్‌పూర్, సౌత్ ఎక్స్‌టెన్షన్ రింగ్ రోడ్, మింటో రోడ్, లజ్‌పత్ నగర్ మరియు మోతీ బాగ్ వంటి ప్రాంతా ల్లో నీరు నిలిచిపోయింది. ఇక భారీ ఈదురుగాలుల కారణంగా చెట్లు కూలిపో యాయి. కొన్ని కొమ్మలు రహదారులపై పడిపోయాయి.  ఇక పోతే ఢిల్లీలోని ద్వారక, ఖాన్ పూర్, సౌత్ ఎక్స్ టెన్షన్ రింగ్ రోడ్, మింటో రోడ్, లజపత్ నగర్, మోతీబాగ్ వంటి ప్రాంతాలలో  రహదారులు జలమయమయ్యాయి. పలు చెట్లు నేలకూలాయి. ద్వారక ప్రాంతంలోని ఓ వ్యవసాయ భూమిలో ఉన్న ఇంటిపై భారీ వృక్షం కూలిపడటంతో ఆ ఇంట్లో ఉన్న కుటుంబంలోని నలుగురు మరణించారు. ఒక మహిళ, ఆమె ముగ్గురు పిల్లలూ మృత్యువాత పడ్డారు. ఆమె భర్త గాయాలతో బయటపడ్డాడు. కాగా శనివారం (మే 3) కూడా ఢిల్లీ అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది.  

భారత్ తో యుద్ధం చేసే సత్తా పాక్ కు లేదు.. వైరల్ అవుతున్న సీఐఏ రహస్య పత్రం

ఇటీవల కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దాడి తరువాత భారత్, పాకిస్థాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల మధ్యా ఇక యుద్ధమే అన్నట్లుగా వాతావరణం మారింది. పాకిస్థాన్ అయితే భారత్ దాడికి సమాయత్తమౌతోందంటూ ప్రకటనలు గుప్పిస్తోంది. అదే జరిగితే అణ్వాయుధ ప్రయోగానికి వెనుకాడబోమని హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నది. అయితే ఆ హెచ్చరికలు, ప్రగల్భాలూ కేవలం వాగాడంబరం మాత్రమేనని తేలిపోయింది. పాకిస్థాన్ కు భారత్ తో పోటీ పడే సత్తా కానీ, యుద్ధం చేసే బలం కానీ లేదని అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ( సీఐఏ) ఎప్పడో తేల్చేసింది. తాజాగా 1993లో సీఐఏ వెలవరించిన ఒక రహస్య పత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  పాకిస్థాన్ కు భారత్ లో యుద్ధం చేసే సత్తా లేదనీ, ఆ దేశ ఆర్థిక స్థితి గతుల కారణంగా ఏ విషయంలోనే భారత్ తో పోటీ పడే పరిస్థితి లేదనీ ఆ రహస్య పత్రం పేర్కొంది. ఇప్పుడు సోషల్ మీడియాలో నాటి సీఐఏ రహస్య పత్రంపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భారత్ తో యుద్ధం అంటే పాకిస్థాన్ పరారే అంటూ నెటిజనులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. భారత సైనిక, ఆర్థిక బలం ముందు పాకిస్థాన్ నిలవలేదని పేర్కొంటున్నారు. అందుకే పాకిస్థాన్ రక్షణ మంత్రి సందర్భం లేకుండా అణ్వాయుధప్రయోగం అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. యుద్ధ భయంతోనే పాక్ సైన్యాధ్యక్షుడు అజ్ణాతంలోకి వెళ్లారనీ, సైనికులు రాజీనామా బాటపడుతున్నారనీ పేర్కొంటున్నారు.  

మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు.. వైసీపీ బెంబేలు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. ఎక్కడా తగ్గేదే లే అన్నట్లుగా ఆధునిక సాంకేతికతను ఆధారం చేసుకుని మరీ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసిన సీఐడీ తాజాగా ఆయన పీఏ దిలీప్ ను అదుపులోనికి తీసుకుంది. అంతకు ముందే వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని విచారించింది. ఈ అరెస్టుల పర్వం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది. మద్యం కుంభకోణం తీగ లాగితే తాడేపల్లి ప్యాలస్ డొంక కదులుతుందన్న భయం వైసీపీలో  కనిపిస్తోంది. రాజ్ కేసిరెడ్డి అరెస్టుతో జగన్ పార్టీ కీలక నేతలతో తాడేపల్లి ప్యాలెస్ లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి హడావుడిగా పొలిటికల్ అఫైర్స్ కమిటీని వేయడం చూస్తుంటే.. మద్యం కుంభకోణం కేసులో తానూ జైలుకు వెళ్లక తప్పదన్న భయంలో ఆయన ఉన్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.  ఇక ఈ కేసులో నాలుగు మార్లు నోటీసులు అందుకుని కూడా విచారణకు డుమ్మా కొట్టి విదేశాలకు చెక్కేయాలని స్కెచ్ వేసుకున్న రాజ్ కసిరెడ్డిని ఆయన గోవా నుంచి వస్తున్నట్లుగా అందిన కచ్చితమైన సమాచారంతో శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. రాజ్ కేసిరెడ్డి శంషాబాద్ నుంచి మారుపేరుతో చెన్నై అక్కడ నుంచి విదేశాలకు చెక్కేయడానికి పక్కా ప్రణాళిక రచించుకున్నట్లు సీఐడీ పసిగట్టింది. ఇక కోర్టు కూడా రాజ్ కేసిరెడ్డిని ఏడు రోజుల సీఐడీ కస్టడీకి అప్పగించడంతో ఈ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. ఇక రాజ్ కేసిరెడ్డి పీఎ దిలీప్ అరెస్టు కూడా విమానాశ్రయంలోనే ఉంది. విచారణకు గైర్హాజర్ కావడమే కాకుండా దుబాయ్ పారిపోవడానికి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న దిలీప్ ను సీఐడీ అరెస్టు చేసింది. అతని కదలికలపై నిఘా పెట్టిన సీఐడీ, అతడి ఫోన్ లోకేషన్ ఆధారంగా చెన్నై విమానాశ్రయంలో అదుపులోనికి తీసుకుని విజయవాడ తరలించారు. రాజ్ కేసిరెడ్డిని సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతించడం, దిలీప్ పోలసులకు చిక్కడంతో లిక్కర్ స్కాం కు సంబంధించి కీలక సమాచారం లభించడానికి సీఐడీకి మంచి అవకాశం లభించినట్లైందని పరిశీలకులు అంటున్నారు.  ఈ అరెస్టుల నేపథ్యంలో  మద్యం కుంభకోణంతో తాడేపల్లి ప్యాలెస్ లింకులు బయటపడతాయన్న భయం వైసీపీ అగ్రనాయకత్వంలో వ్యక్తమౌతోందని అంటున్నారు. 

బెజవాడ కనక దుర్గమ్మ సేవలో ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ

తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు తనయుడు నందమూరి రామకృష్ణ గురువారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమరావతి పనుల పున: నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన ఆయన ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అమరావతి పున: నిర్మాణ పనులు విజయవంతం కావాలనీ, అలాగే ఏపీలో ప్రధాని పర్యటన సక్సెస్ కావాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఎన్డీఎ కూటమి ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణం పూర్తి కావాలని, ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని, తద్వారా ఏపీ అన్నపూర్ణగా రూపుదిద్దుకోవాలని, సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. తెలుగుదేశం పార్టీ, తమ తండ్రి ఎన్టీఆర్ ఆశయాల సాధనకు సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని, ఆయన నాయకత్వంలో ఏపీ అన్నివిధాలా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. స్వర్ణాంధ్రగా ఏపీ రూపుద్దికోవాలని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కలలు సాకారం కావాలని, ప్రజాశీస్సులతో స్వర్ణాంధ్ర-2047 ద్వారా లక్ష్యాన్ని సాధించాలని రామకృష్ణ ఆకాంక్షించారు.  

మిస్ వరల్డ్ 2025 పోటీల ఏర్పాట్ల సమీక్షకు హైదరాబాద్ కు జూలియా ఈవేలిన్ మోర్లీ

హైదరాబాద్ లో జరగనున్న మిస్ వరల్డ్ 2025 పోటీల ఏర్పాట్లను సమీక్షించేందుకు  లండన్ లోని మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి శుక్రవారం (మే2) హైదరాబాద్ చేరుకున్ననారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు  అధికారులు ఘన స్వాగతం పలికారు.  ఈ మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ కోసం జరుగుతున్న ఏర్పాట్లు, మిస్ వరల్డ్ కాంటెండర్స్ పర్యటించే వివిధ ప్రాంతాల లో చేపట్టిన ఏర్పాట్లు, వివిధ ఈవెంట్లకు సంబంధించిన అంశాలపై జూలియా మోర్లి సంబంధిత ఏజెన్సీలు, వివిధ విభాగాలతో సమీక్షిస్తారు. మిస్ వరల్డ్ 2025 పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు హైదరాబాద్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నెల 7 నుండి 31వ తేదీ వరకు జరగనున్న ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో 140 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటారు.   తెలంగాణకు అంతర్జాతీయంగా గుర్తింపును తెచ్చే ఈ వేదిక, రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తుందని భావిస్తున్నారు.  ఈ పోటీల సందర్భంగా, మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు మే నెలలో తెలంగాణలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించి తెలంగాణ సంస్కృతి, వారసత్వ సంపద, అభివృద్ధిని   ప్రపంచానికి తెలియజేయనున్నారు. ఇప్పటికే ఈ పోటీల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ఆ ఏర్పాట్లను సమీక్షించేందుకే మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లీ హైదరాబాద్ వచ్చారు.  ఈ పోటీల నిర్వహణ ద్వారా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ పెరుగుతుందని భావిస్తున్నారు. 

తిరుమలలో ముమ్మర తనిఖీలు

ఓ వైపు పహల్గాం ఉగ్రదాడి, మరో వైపు ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో అధికారులు అప్రమత్తమయ్యారు. వారాంతం సమీపిస్తుండటంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో భద్రతా పరంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఇంకో వైపు తిరుమలకు వచ్చే వాహనాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కండీషన్ సరిగా లేని వాహనాలుతిరుమల కొండపైకి వస్తుండటంతో ఘాట్ రోడ్డులో అగ్ని ప్రమాదాల సంఘటనలూ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీవో అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు.  తిరుమల ట్రాఫిక్ పోలీసులతో కలిసి ఆర్టీవో అధికారులు మొబైల్: పొల్యూషన్ వాహనంతో చెకింగ్ చేపట్టారు. తిరుమలకు ప్రత్యేకంగా పొల్యూషన్ చెకింగ్ వాహనం తీసుకవచ్చి తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గురువారం ఒక్క రోజే దాదాపు 24 వాహనాలు అత్యధిక కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని గుర్తించారు. మరొ కొన్ని వాహనాలకు ఫిట్ నెస్ సరిగా లేదని గుర్తించారు. వాహనాలకు పొల్లూషన్ సర్టిఫికెట్, సరైన ఫిట్నెస్ ఉంటేనే అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.  

సరిహద్దుల్లో యుద్ద ఘోష.. భారత ఫస్ట్ టార్గెట్ లాహోర్ ?

పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ప్రతీకార దాడి జరుగుతుందనే అంచనాల నడుమ భారత్ – పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. నలుదిక్కుల నుంచీ ముప్పు కమ్ముకొస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యం, జరగబోయే అనర్ధాన్ని ఊహించుకుని, తీవ్ర భయాందోళనలకు గురవుతోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ప్రతీకార స్వరూప స్వభావాలు, లక్ష్యాలు, ప్రతీకార సమయం, నిర్ణయించుకునే సంపూర్ణ కార్యాచరణ స్వేచ్ఛను భారత సైన్యానికి ఇచ్చిన నేపథ్యంలో, పాకిస్థాన్ ఏ క్షణంలో అయినా  భారత సైన్యం విరుచుపడే ప్రమాదం పొంచి ఉందనే భయంతో వణికి పోతోంది.  అయితే.. అదే సమయంలో పాక్  సైన్యం సరిహద్దుల వెంబడి,యధేచ్ఛగా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడుతున్నది. నిజానికి  2021లో ఉభయ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా, పాక్ సైన్యం తరచూ ఉల్లంఘనలకు పాల్పడుతునే వుంది. కాగా, పహల్గాం ఉగ్రవాద దాడి  (ఏప్రిల్ 22) తర్వాత పాక్ సేనలు భయంతో కాల్పుల జోరు పెంచారు. కాగా.. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లఘనలు రోజుల తరబడి కొనసాగడమే కాకుండా మొత్తం 720 కిలో మీటర్ల పొడవున వరసగా కాల్పులకు పాల్పడుతున్నారు. మరో వంక భారత  సైన్యం దీటుగా సమాధానం చెపుతోంది. మరో వంక  సరిహద్దుల్లో ఉభయ దేశాల సేనల మోహరింపు వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అన్నిటినీ మించి  పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒకటి రెండు రోజుల్లోనే యుద్ధం రావచ్చని ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్పష్టం చేశారు. అలాగే.. మనసులో భయాన్ని బయట పెట్టుకున్నారు. యుద్ధం దీర్ఘ కాలం పాటు కొనసాగి, అనివార్య పరిస్థితులు ఎదురైతే అణ్వాయుధాలను ప్రయోగించేందుకు కూడా వెనకాడబోమని అన్నారు. పరిస్థితి అంతవరకు వస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే  పాకిస్థాన్  రక్షణ శాఖ మంత్రిని యుద్ద భయం ఆవరించింది అనేది మాత్రం ప్రపంచానికి తెలిసొచ్చిందని అంటున్నారు.  అయితే పాక్  భయం వట్టి భయం కాదు.. వ్యూహాత్మకంగా నటిస్తున్న భయం అసలే కాదు.  నిజంగా కూడా పరిస్థితి అత్యంత భయంకరంగా ఉందనే   అంటున్నారు. ముఖ్యంగా  భారత దేశం ప్రతీకార చర్యలలో భాగంగా ఒకదాని వెంట ఒకటిగా తీసుకుంటున్న నిర్ణయాలు పాక్  కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గోరుచుట్టుపై రోకటి పోటులా సలుపుతున్నాయని అంటున్నారు.  ఓ వంక పహల్గాం ఉగ్రవాద దాడికి పాల్పడిన ఉగ్రవాదులను వెంటాడి  వేటాడే పని  ఇంచు మించుగా   ముగింపు  దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే  ఉగ్రవాదుల వేటలో ఉన్న సైనిక దళాలు, ఉగ్రవాదుల ఆచూకీ గుర్తించాయి. అంతే  కాదు 26 మంది ప్రాణాలు బలితీసుకున్న ఉగ్రవాదులను మట్టు పెట్టడం ఖాయమని, ఏ క్షణంలో అయినా శుభవార్త  రావచ్చని గ్రౌండ్ జీరో సమాచారంగా చెపుతున్నారు.  అన్నిటినీ మించి పాక్ గుండెల్లో రైళ్ళు కాదు, ఏకంగా యుద్ద విమానాలే పరుగులు తీస్తున్నాయని అంటున్నారు. అవును  పాక్  రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాటల్లో, ఆయన ముఖ కవళికల్లో భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే..  ఆయన పదే పదే గత్యంతరం లేని పరిస్థితి వస్తే, అణ్వాయుదాలు ప్రయోగిస్తామని అంటున్నారు. మరో వంక చడీ చప్పుడు కాకుండా భారత సేనలు వ్యూహాత్మకంగా లాహోర్ పై దాడికి సిద్దమవుతునట్లు తెలుస్తోంది. నిజానికి పాక్ భయానికి ఖవాజా ఆసిఫ్  ప్రేలాపనలకు ఆదే కారణంగా  కనిపిస్తోందని అంటున్నారు.  అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సంపూర్ణ కార్యాచరణ స్వేచ్చతో భారత సేనలు ఎప్పుడు ఏమి చేస్తాయి అనేది పక్కన  పెడితే. ధర్మం మన వైపుఉంది... అంతిమ విజయం మనదే అవుతుంది. ధర్మో రక్షిత రక్షితః!