సింహాచలం గోడ వెన‌క దాగిన గోపీ జ‌గ‌నేనా?

సింహాచ‌లం గోడ కూలిన ఘ‌ట‌న‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎందుకు స్పందించ‌రు? వైసీపీ   ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మేంటి? వేళ్లన్నీ గత పాలకుల పాపాలవైపే  సింహాచ‌లం గోడ కూలిన ఘ‌ట‌న‌లో అస‌లు ద్రోహి కూట‌మి ప్ర‌భుత్వం అన్న‌ది వైసీపీ చేస్తున్న ఆరోప‌ణ‌. అంతే కాదు ఇటు తిరుమ‌ల తొక్కిస‌లాట‌, అటు సింహాచ‌లం చంద‌నోత్స‌వం సంద‌ర్భంగా గోడ కూల‌డం వంటి విష‌యాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెద్ద‌గా స్పందించ‌డం లేద‌న్న‌ది వీరి  ఆరోప‌ణ‌. ఇక్క‌డ జ‌రిగిన అస‌లు వాస్త‌వాలేంట‌ని చూస్తే.. సింహాచ‌లం గోడ  ల‌క్ష్మ‌ణ రావు అనే కాంట్రాక్ట‌ర్ కి రూ. 54 కోట్ల రూపాయ‌ల‌తో ఇచ్చింది 2023లో.  అది కూడా జ‌గ‌న్ హ‌యాంలో. కానీ ఆ గోడ కూలింది కూట‌మి ప్ర‌భుత్వంలో. కాబ‌ట్టి ఆ పాప‌మంతా  కూట‌మిదే అంటుంది వైసీపీ. మ‌రి నాసిర‌కం ఇటుక‌లు, నాణ్య‌త లేని సిమెంటు ద్వారా క‌ట్టే కాంట్రాక్ట‌ర్ కి కాంట్రాక్ట్ ఇచ్చిన త‌ప్పిదం వ‌ల్లే క‌దా ఇదంతా జ‌రిగింద‌న్న‌ది కూట‌మి నేత‌లు వేస్తోన్న రివ‌ర్స్ కౌంట‌ర్. ఒక్క ప‌వ‌నే కాదు.. కూట‌మి త‌ర‌ఫున ఎవ‌రు మాట్లాడాల్సి వ‌చ్చినా స‌రిగ్గా ఈ పాయింట్ ద‌గ్గ‌ర్నుంచే మొద‌లు పెట్టాల్సి వ‌స్తుంది. వైసీపీ  ప్ర‌భుత్వ హ‌యాంలో చేసిన త‌ప్పిదాలు నేడు శాపాల రూపంలో ఆంధ్రుల‌ను వెంటాడుతున్నాయ‌నే చెప్పాల్సి వ‌స్తుంది.  తిరుమ‌ల‌లో కూడా అంతే! కేవ‌లం దేశీ ఆవుల మాత్ర‌మే(అంటే ప్రాంతీయ ఆవులు) ఉండాల్సిన గోశాల‌లో ఎక్క‌డెక్క‌డి నుంచో ఆవులు తెచ్చింది వాళ్లే. గోవుల మ‌ర‌ణాల సంఖ్య లెక్క‌కు మించి చూపించిందీ వాళ్లే.. అంతే కాకుండా ఫేక్ ఇమేజీల‌తో ట్రోల్ చేసింది కూడా వాళ్లే. ఇలాంటి దుష్ప్ర‌చారాల‌పై  ప్ర‌భుత్వం నోటీసులిచ్చింది.   ఈ దిశ‌గా కూట‌మి ప్ర‌భుత్వం   క‌ఠిన చ‌ర్య‌లు తీస్కోవాలన్న డిమాండ్ విన‌వ‌స్తోంది. ఇక తొక్కిస‌లాట ఘ‌ట‌న వెన‌క‌ ఎవ‌రున్నారో.. వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్నందుకు గోమ‌ర‌ణాల‌నే వ్య‌వ‌హారం ఉన్న‌ట్టుండి ఎందుకు బ‌య‌ట ప‌డిందో అంద‌రికీ తెలిసిందే. ఇలా ఎటు నుంచి ఎటు చూసినా క‌నిపించేది గ‌త పాల‌కుల తాలూకూ త‌ప్పిదాలే.  ఒక వేళ కూట‌మి నేత‌లు నిల‌దీయాల్సి వ‌స్తే గ‌త పాల‌క ప‌క్ష‌మైన వైసీపీని నిల‌దీయాల్సి ఉంటుంది. ఈ విష‌యం తెలిసినా వైసీపీ కావాల‌ని కూట‌మిని టార్గెట్ చేసి తానిలా బుక్ అయిపోతోంది. సింహాచ‌లంలో నాసిర‌కం ప‌నులు చేసే కాంట్రాక్ట‌ర్ల‌కు టెండ‌ర్ ఇచ్చింది చాల‌క ఆ త‌ప్పు కూడా మీదే అన‌డం.. లాజిక్కులు లాగ‌టం పైకి బాగానే ఉన్నా.. అది దైవ ద్రోహం కింద‌కు వ‌స్తుంది. ఇప్ప‌టికే ఎన్నో దైవ ద్రోహాల ఘ‌ట‌న‌ల్లో అడ్డంగా బుక్క‌యిన జ‌గ‌న్ అండ్ కోకి దేవుడితో పెట్టుకుంటే పంగ‌నామాలే అని సీట్ల రూపంలో తెలిసివచ్చినా ఇంకా అదే దుర్బుద్ధి. అదేమంటే మాజీ మంత్రి  రోజా వెంక‌న్న‌తో పెట్టుకుని పవ‌న్ కి బాగా తెలిసి వ‌చ్చిందంటున్నారు. ఈ విష‌యంలో ఫ‌స్ట్ తెలుసుకోవ‌ల్సిందే వారు. వైసీపీ దేవుడితో అన్నేసి స‌య్యాట‌లాడ్డం వ‌ల్లే అంత అడ్డంగా ఓడామ‌ని గుర్తించాలి. ఇప్ప‌టికే టీటీడీ వంటి హిందూ ధార్మిక ప్రాంతాల నిండా భార‌త‌మ్మ సైన్యం అలుపెరుగ‌క ప‌ని  చేస్తోంది. ఇలాంటి కుట్రల‌కు పాల్ప‌డ్డానికి వారు చేయ‌ని పాపం లేద‌న్న‌ విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికీ  టీటీడీలో వీరి సంఖ్య 2 వేల వ‌ర‌కూ ఉండొచ్చ‌ని అంచ‌నా. మ‌రి  వీరంద‌రి చేతా చేయించాల్సింన‌దంతా చేయించి.. ఆ పాపం తీస్కొచ్చి కూట‌మి ప్ర‌భుత్వం మీద వేయ‌డం ఎంత వ‌ర‌కూ స‌మంజ‌సం? అన్న‌ది వారికి వారే ఆత్మావ‌లోక‌నం చేస్కోవాలంటున్నారు సామాన్యులు.

తిరుమల ఘాట్ లో గుర్తుతెలియని వాహనం ఢీ కొని పునుగుపిల్లి మృతి

శేషాచలం అటవీ ప్రాంతంలో  మాత్రమే ఎక్కువగా కనిపించే పునుగు పిల్లులు అత్యంత అరుదైన, అంతరించిపోతున్న జాతిగా అటవీ అధికారులు ప్రకటించారు. ఈ పునుగుపిల్లులకు ఉన్న మరో విశిష్ఠిత ఉంది.  తిరుమల స్వామి వారికి వారం వారం నిర్వహించే తిరుమంజనం సందర్భంగా జరిగే అభిషేక సేవలో పునుగు పిల్లి తైనాన్నే వినియోగిస్తారు. పునుగు తైలం లేకుంటే స్వామివారి అభిషేకం పరిపూర్ణం కాదని అంటారు అర్చకులు. అటువంటి అరుదైన,  ప్రత్యేకమైన జాతికి చెందిన పునుగు పిల్లి ఒకటి తిరుమల రెండో ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో మరణించింది. గుర్తు తెలియని వాహనంన ఢీ కొని పునుగుపిల్లి మరణించడం దురదృష్టకరమని టీటీడీ అధికారులు అంటున్నారు. అత్యంత అరుదుగా మాత్రమే అటవీ ప్రాంతం నుంచి పునుగుపిల్లులు బయటకు వస్తాయి. అలా వచ్చిన సందర్భంలోనే గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఒక పునుగుపిల్లి మరణించింది.  కొంత కాలం కిందట ఒక దశలో శేషాచలం అటవీ ప్రాంతంలో పునుగుపిల్లుల సంఖ్య ఆందోళనకరంగా తగ్గిపోయిందని అటవీ శాఖ అధికారుల గణాంకాలు పేర్కొన్నాయి. దీంతో తిరుపతి జూలో వీటిని ప్రత్యేకంగా పరిరక్షించాలని కూడా అప్పట్లో భావించారు. అయితే ఇటీవలి కాలంలో శేషాచలం అటవీ ప్రాంతంలో పునుగుపిల్లల సంఖ్య పెరిగిందంటున్నారు. 

హిందూ ధార్మిక సంస్థలకు దేవాలయాల భూములు..ఐవైఆర్ అభ్యంతరం ఎందుకు? ఏమిటి?

ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాలకు. రాజులు, జమీందార్లు, భక్తులు దానంగా ఇచ్చిన భూములు విస్తారంగా ఉన్నాయి.  ఈ భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని దేవాలయాల నిర్వహణకు వాడుతుంటారు.  అయితే దేవాలయాలకు చెందిన భూములు ఎక్కవ భాగం ఆక్రమణలకు గురయ్యాయి. ఇందులో  రహస్యం ఏమీ లేదు.  ఈ ఆక్రమణలకు ప్రధాన కారణం ప్రభుత్వం, ఎండోమెంట్స్ శాఖ ఈ భూముల పట్టించుకోకపోవడం, ఖాళీగా వదిలేయడమే కారణం. ఈ భూములను వేలం ద్వారా లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ.. జనం ముందుకు రాని పరిస్థితి ఉంది.  ఇప్పుడు ఈ భూములను వినియోగంలోకి తీసుకురావడానీ, దేవాలయాల నిర్వహణకు అవసరమైన ఆదాయం సమకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దేవాలయాలకు చెందిన  వ్యవసాయేతర భూములను లాభాపేక్షలేని హిందూ సంస్థలకు లీజుకు ఇవ్వలని నిర్ణయించింది. అలా లీజుకు తీసుకునే హిందూ ధార్మిక సంస్ఠలకు కనీసం రెండు దశాబ్దాల ఛారిటీ ట్రాక్ రికార్డు కలిగి ఉండాలని నిబంధన పెట్టింది. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న హిందూ ధార్మిక సంస్థలకు దేవాలయాలకు చెందిన నిరుపయోగ భూములను నామమాత్రపు ధరకు లీజుకు ఇవ్వాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇలా కేటాయించడం వల్ల..  దేవాలయాల భూములు ఆక్రమణదారుల కబంధ హస్తాలలోకి వెళ్లకుండా నిరోధించడమే కాకుండా.. హిందూ ధార్మిక సంస్థలకు కూటాయించడం ద్వారా సమాజానికి ఉపయుక్తంగా మారుతాయి. దీనిపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం సహజంగా అయితే ఉండకూడదు. కానీ ఒక మాజీ ఐఏఎస్ అధికారి మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్ సీఎస్ గా కూడా పని చేశారు. ఆయనే ఐవైఆర్. విభజిత ఆంధ్రప్రదేశ్ కు తొలి సీఎస్ గా పని చేసిన ఆయన.. అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా వివిధ హోదాలలో హోదాలలో పని చేశారు. అప్పట్లో ఆయన సర్వీసులో ఉండగా ఆలయ భూముల పరిరక్షణకు తీసుకున్న చర్యలేవీ లేవు. అటువంటి ఐవైఆర్ దేవాలయాల భూముల పరిరక్షణకు ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వస్తే అడ్డుపుల్లలు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అన్నిటికీ మించి స్వయం ప్రకటిత హిందూ పరిరక్షకుడిగా ఉన్న ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. అటువంటి ఐవైఆర్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెట్టిన పోస్టుపై నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  వేలం లేకుండా భూముల కేటాయింపు సరికాదు. అలా చేయడం వల్ల అవి దుర్వినియోగమౌతాయి. చట్టబద్ధంగా దీనిని అడ్డుకోవాలంటూ ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు.   ఐవైఆర్ కు దేవాలయాల భూములు నిరుప యోగంగా ఉన్న సంగతి తెలుసు. వేలం ద్వారా వాటిని లీజుకు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడానికి గల కారణాలూ తెలియవని అనుకోలేం. హిందూ ధార్మిక సంస్థలకు వీటిని కేటాయించడం వల్ల ఆలయ భూములను కాపాడి, హిందువులకు, హిదూ ధార్మిక సంస్థలకు సహాయం చేయడం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోయి, వ్యతిరేకించడం వెనుక ఐవైఆర్ ఉద్దేశమేంటన్నది అర్ధం కాదు. పదవీ విరమణ చేసిన నాటి నుంచీ ఐవైఆర్ తీరు  అనుమానాస్పదంగానే ఉంది. హిందూ పరిరక్షణ పేర ఆయన వ్యవహరిస్తున్న తీరు వెనుక రాజకీయ కారణాలున్నాయన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు నిర్ణయాలను తప్పుపట్టడం వినా ఆయన హిందూ వాదిగా చేసిందేమీ లేదని అంటున్నారు.  

తెలంగాణలో కేంద్ర మంత్రి గడ్కరీ.. రూ.5,400 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం (మే 5) తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఉదయం హెలికాప్టర్ లో సిరిపూర్ కాగజ్ నగర్ చేరుకున్న ఆయన పలు నేషనల్ హైవే ప్రాజెక్టులను ప్రాంభంభాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం  కాగజ్ నగర్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు.  మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఆయన హైదరాబాద్ వివారులోని  కన్హా శాంతివనానికి చేరుకుని అక్కడ మధ్యాహ్నం వరకూ ఉంటారు. అనంతరం  సాయంత్రం 4 గంటలకు బీహెచ్ఈఎల్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ సందర్శించి ప్రారంభిస్తారు. సాయంత్రం ఐదున్నర గంటలకు అంబర్ పేట్ ఫ్లై ఓవర్ ప్రారంభించి.   సాయంత్రం 6 గంటలకు అంబర్ పేట మున్సిపల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. రాత్రి ఏడు గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హస్తినకు బయలుదేరి వెడతారు. 

నేటి నుంచి పది రోజులు జీరో షాడో.. అంటే ఏమిటో తెలుసా?

మిట్ట మధ్యాహ్నం మీ నీడ మాయమైపోతుందంటే నమ్ముతారా? అసలు పగటి వేళ మనిషి.. మనిషి అనేమిటి ప్రతి వస్తువు నీడ కనబడుతూనే ఉంటుంది. అటువంటికి పది రోజుల మాట ప్రతి రోజూ మిట్టమధ్యాహ్నం వేళ నీడ మాయమైపోతుందంటే ఆశ్చర్యంగా లేదూ. ఆ పది రోజులూ సరిగ్గా మిట్టమధ్యాహ్నం రెండు నిముషాల పాటు నీడ కనిపించదు. ఈ పరిస్థితిని జీరో షాడో అంటారు. సోమవారం (మే 5) నుంచి ఈ నెల 14 వరకూ ఓ పది రోజుల పాటు మధ్యాహ్నం రెండు నిముషాల పాటు మనిషి నీడ మాయమైపోతుంది. పది రోజుల పాటు సరిగ్గా మిట్టమధ్యాహ్నం ఈ ఖగోళ అద్భుతం సంభవిస్తుంది.  సాధారణంగా ఎండ వేళ మనిషి నీడ కనిపిస్తుంది. అయితే సోమవారం (మే 5) నుంచి మే 14 వరకూ మాత్రం  మిట్టమధ్యాహ్నం సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడటంతో నీడ మాయమౌతుంది. భూమి అక్ష్యం 23.5 డిగ్రీల వంపుగా ఉండటం వల్ల భూమి సూర్యుడి చుట్టూ తిరిగే సమయంలో ఉత్తర, దక్షిణ దిశలలో మారుతూ ఉంటుంది. ప్రతి ఏటా రెండు సందర్భాలలో కర్నాటక-మకర రేఖల మధ్య ఉన్న ప్రదేశాలలో సూర్యకిరణాలు మిట్టమధ్యాహ్న సమయంలో భూమిపై నిట్టనిలువుగా పడతాయి. ఈ కారణంగానే నిలువుగా ఉండే వస్తువుల నీడ ఈ రోజులలో మట్టమధ్యాహ్నం కనిపించదు.  

ఇండియన్ ఆర్మీ మాస్టర్ ప్లాన్.. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్!

విలేజ్ డిఫెన్స్ గార్డ్స్. వినడానికి కొత్తగా ఉన్నా.. విషయం చాలా ఉంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. కశ్మీర్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయ్. సరిహద్దు జిల్లాల్లో ఉగ్రవాదుల కదలికలు పెరిగాయనే అనుమానాలున్నాయి.  దాంతో.. ఇండియన్ ఆర్మీ ఓ కొత్త ప్లాన్ వేసింది. భారత సరిహద్దుల అవతలి నుంచి వచ్చే ఎలాంటి శత్రువైనా సరే.. ఆ సరిహద్దుల్లోనే ఖతమయ్యేలా మన ఆర్మీ పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది.  భారత శత్రువులెవరైనా సరే.. మన బోర్డర్ దాటాలంటే ఇకపై ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. మన సరిహద్దుల అవతలి నుంచి వచ్చే ఏ శత్రువైనా సరే.. ఆ సరిహద్దుల్లోనే ఖతమయ్యేలా ఇండియన్ ఆర్మీ పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ఇందుకోసం.. భారత బలగాలు సరికొత్త ప్లాన్ వేశాయ్. తీవ్రవాదుల్ని ఎదుర్కొనేందుకు.. బోర్డర్ దగ్గర్లో ఉన్న గ్రామస్తులకు ట్రైనింగ్ ఇచ్చి మరీ తుపాకులు అందిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.  దాంతో.. జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్వార్, దోడా, రాజౌరి, పూంచ్ లాంటి జిల్లాల్లో.. భద్రత దృష్ట్యా.. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌కు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులతో.. ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్.. తమ ఆయుధాలను సమర్థవంతంగా ఉపయోగించేందుకు, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు.. ఈ ట్రైనింగ్ ఎంతో కీలకమని పోలీసు అధికారులు చెబుతున్నారు. కొన్ని వారాలుగా.. కిష్ట్వార్, దోడా, ఉధమ్‌పూర్ జిల్లాల్లో టెర్రరిస్టుల యాక్టివిటీ పెరిగింది. గత నెలలో కిష్ట్వార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు, ఇంకొందరు టెర్రరిస్టులు తప్పించుకొని.. దట్టమైన అడవుల్లో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు. దాంతో.. ఈ శిక్షణా కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ట్రైనింగ్ తీసుకుంటున్న ఈ విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌ని.. సరిహద్దులకు దగ్గర్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో భద్రతను కాపాడేందుకు, ఉగ్రవాదుల నుంచి స్థానికులను రక్షించేందుకు ఏర్పాటు చేశారు. వీరికి.. పోలీసులు, సైన్యమే.. ఆయుధాలతో పాటు శిక్షణ కూడా ఇస్తాయి. ఈ ఆపరేషన్లలో.. ఇండియన్ ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో ఉగ్రవాదుల కదలికలను గమనిస్తున్నారు. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌కి ప్రధానంగా రైఫిళ్లు, ఆటోమేటిక్ ఆయుధాలను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలనే విధానంపై శిక్షణ ఇస్తున్నారు. ఉగ్రవాద దాడుల సమయంలో.. రక్షణాత్మకంగా ఉండటంతో పాటు, వారిపై ఏ విధంగా దాడి చేయాలనే దానికి సంబంధించిన వ్యూహాలను అమలు చేసే పద్ధతుల్ని కూడా నేర్పిస్తున్నారు. సరిహద్దు గ్రామాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు, ఆకస్మిక దాడుల సమయంలో వెంటనే స్పందించడం, అందరితో సమన్వయం చేసుకోవడం ఎలా అనేది కూడా చెబుతున్నారు. బోర్డర్‌ దగ్గరలో అనుమానాస్పద కదలికలను గుర్తించి.. పోలీసులకు, సైన్యానికి సమాచారం అందించడంపైనా శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా.. గ్రామీణ, కొండ ప్రాంతాల్లో శారీరకంగా చురుగ్గా ఉండేందుకు ఫిట్‌నెట్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ సెషన్ అంతా.. గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక పోలీస్ స్టేషన్లు, సైనిక శిబిరాల్లో సాగుతున్నాయి. కొన్నిసార్లు.. డ్రోన్ టెక్నాలజీ, రాత్రి పూట గస్తీ లాంటి ఆధునిక టెక్నిక్‌లపైనా శిక్షణ ఇస్తున్నారు. జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కలిసి.. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌కి ట్రైనింగ్ సెషన్స్‌ని నిర్వహిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత.. జమ్మూకశ్మీర్‌లో భద్రతా చర్యలు మరింత కఠినతరమయ్యాయ్. ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేసేందుకు.. ఈ గ్రామ రక్షణ బృందాలను సన్నద్ధం చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ విలేజ్ డిఫెన్స్ గార్డులకు శిక్షణని తప్పనిసరి చేయడం ద్వారా.. సరిహద్దుల్లో భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఉగ్రవాద బెదిరింపులను ఎదుర్కొనేందుకు.. ప్రభుత్వం, సైన్యం, పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాలు.. సరిహద్దు గ్రామాల్లో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో కీలకపాత్ర పోషిస్తాయని ఆశిస్తున్నారు. మరోవైపు.. జమ్మూకశ్మీర్ పోలీసులు, సైన్యం కలిసి ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించేందుకు యాక్షన్ ప్లాన్‌ని వేగవంతం చేశాయి. కిష్ట్వార్‌లోని దట్టమైన అడవుల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్‌తో పాటు స్థానికులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అనుమానాస్పద కదలికలను గమనిస్తే.. వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో భద్రతా భావాన్ని పెంపొందించడంతో పాటు, ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడంలో సహాయపడతాయని అధికారులు చెబుతున్నారు.

మానవత్వం చాటుకున్నా మంత్రి నాదెండ్ల

  రోడ్డు ప్రమాద బాధితుడిని కాపాడి ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. విజయవాడ నుండి కాకినాడకు వెళ్లే మార్గంలో, ఆయన కాన్వాయ్ ఏలూరు జిల్లా భీమడోలు వద్ద కారు, బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వస్తున్న మంత్రి స్వయంగా  మంత్రి వెంటనే గాయపడిన వారి వద్దకు వెళ్లి వారి పరిస్థితిని తనకంటూ సమీక్షించారు. వారు గాయాలతో తీవ్ర రక్తస్రావానికి గురవుతున్నదాన్ని చూసి, ఆందోళనకు లోనైన మంత్రి – తన మనసులో మానవత్వం నిగూఢంగా బలపడినట్లు మరోసారి చాటిచెప్పారు. ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ స్వయంగా 108 అంబులెన్స్‌కు కాల్ చేసి సహాయం కోరారు. అంబులెన్స్ రాగానే బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించేందుకు తన కాన్వాయ్‌లోని ప్రోటోకాల్ వాహనాన్ని ఎస్కార్ట్ వాహనంగా ఉపయోగించాలని అధికారులకు ఆదేశించారు. ఇది ట్రాఫిక్ క్లియర్ చేసి అంబులెన్స్ వేగంగా ఆసుపత్రికి చేరేందుకు ఎంతో తోడ్పడింది. అంతటితో ఆగకుండా, ఏలూరు జిల్లా ఎస్పీకి స్వయంగా ఫోన్ చేసిన మంత్రి నాదెండ్ల , గాయపడిన ఇద్దరికీ మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంత్రి సమయస్ఫూర్తితో స్పందించి చేసిన సహాయం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ గిరిజా ప్రియద‌ర్శిని క‌న్నుమూత‌

  తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గిరిజా ప్రియదర్శిని  కన్నుమూశారు.కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇవాళ తుదిశ్వాస విడిచారు. 2022 మార్చిలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ గిరిజా ప్రియదర్శిని బాధ్యతలు చేపట్టారు. ఆమె మృతి పట్ల హైకోర్టు న్యాయమూర్తులు, సిబ్బంది సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్ పట్టణానికి చెందిన గిరిజా ప్రియదర్శిని.. 1995లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. విశాఖ జిల్లా కోర్టులో ఏడేండ్లు ప్రాక్టీస్‌ చేశారు.  2008లో అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. ఖమ్మం ఫ్యామిలీ కోర్టులో మూడేండ్లు, విజయనగరం మొదటి అదనపు జిల్లా జడ్జిగా, నంద్యాలలో అదనపు జిల్లా జడ్జిగా పనిచేశారు. 2017లో ఒంగోలు జిల్లా కోర్టు చీఫ్‌గా పదోన్నతి పొందారు. ఆదిలాబాద్‌ జిల్లా కోర్టు చీఫ్‌ జడ్జిగా చేశారు. ఆ తర్వాత కరీంనగర్‌ జిల్లా కోర్టు చీఫ్‌ జడ్జిగా చేశారు. హైకోర్టు జ‌డ్జిగా బాధ్య‌త‌లు స్వీక‌రించే కంటే ముందు.. గిరిజా ప్రియద‌ర్శిని.. రాష్ట్ర లీగల్‌ సెల్‌ సర్వీసెస్‌ అథారిటీ సెక్రటరీగా ప‌ని చేశారు.  

ఏపీలో భారీ వర్షాలు..తిరుమలలో ఈదురు గాలులతో వాన

  తిరుపతిలో భారీ వర్షం కురిసింది. తిరుమల శ్రీవారి ఆలయంపై మబ్బులు కమ్మాయి. శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో శ్రీవారి ఆలయం ముందు భక్తులు తడుస్తూ పరుగులు తీశారు. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. బలమైన ఈదురు గాలులతో వర్షం పడటంతో పలు చోట్ల వృక్షాలు కూలియి. మరోవైపు విజయవాడ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారు.దీంతో జనజీవనం స్తంభించింది. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచింది. విజయవాడలోని మొగల్రాజపురం, పటమట ప్రాంతాల్లో భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి.   వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. చాలా రోజులుగా వేసవి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. భారీవర్షాల వల్ల ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డును మూసివేశారు. శ్రీకనక దుర్గానగర్‌ గుండా భక్తులు రాకపోకలు కొనసాగించేలా ఏర్పాట్లు చేశారు.పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు కొన్ని చోట్ల చెట్లు రోడ్లపై పడ్డాయి. ఉయ్యూరు-కాటూరు రోడ్డుపై చెట్టు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కృష్ణా జిల్లాలో భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న, అరటి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. 

మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదు : బండి సంజయ్‌

    మవోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లిలో ఆయన  హాట్ కామెంట్స్ చేశారు.‘తుపాకీతో అమాయకులను చంపేవారితో చర్చలు ఉండవు. మావోయిస్టులతో ఇక మాటల్లేవ్‌.. మాట్లాడుకోడాల్లేవ్‌. వారిపై నిషేధం విధించింది కాంగ్రెస్సే. మావోయిస్టులు.. పలు పార్టీల నేతలను మందుపాతరలు పెట్టి చంపారు. ఇన్‌ఫార్మర్ల పేరుతో గిరిజనులను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. ఎన్నో గిరిజనుల కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చారు. తుపాకీ వదిలిపెట్టేవరకు మావోయిస్టులతో చర్చల ఊసే ఉండదన్నారు. పాస్‌పోర్టు లేని విదేశీయులను గుర్తించి పంపిస్తున్నాం. రోహింగ్యాలపై తన వైఖరి ఏమిటో కాంగ్రెస్‌ పార్టీ చెప్పాలి’’ అని బండి సంజయ్‌ అన్నారు. ‘కేంద్రం నిర్ణయాన్ని తమ విజయంగా చెప్పుకోవడం  సిగ్గుచేటు’’ అన్నారు.  స్వాతంత్రం తర్వాత ఎన్నడూ దేశవ్యాప్తంగా కుల గణన జరగనివ్వని కాంగ్రెస్ పార్టీకి దీనిపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. 2010లో అనేక పార్టీల డిమాండ్‌కు స్పందిస్తూ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు కేవలం ఓ సర్వేనే చేపట్టిందన్నారు. కొన్ని రాజకీయ పక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీ పడుతున్నాయని సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే  ఇలాంటి అంశాలను తెరపైకి తెస్తోందని విమర్శించారు. శాంతి భద్రతల సమస్యను రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు.   

లోయలో పడ్డ ఆర్మీ ట్రక్కు.. ముగ్గురు జవాన్ల మృతి

  జమ్ముకశ్మీర్‌లో రాంభన్ జిల్లాలో 300 అడుగుల లోయలో ఆర్మీ ట్రక్కు పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. జమ్మూ నుంచి  శ్రీనగర్ వెళ్లున్న ఆర్మీ వాహనం బ్యాటరీ చెష్మా’ అనే ప్రదేశం వద్ద  లోయలోకి దొర్లిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న జవాన్లు చనిపోయినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. మృతి చెందిన సైనికులను అమిత్‌ కుమార్‌, సుజిత్‌ కుమార్‌, మన్‌ బహదూర్‌గా గుర్తించినట్లు సైన్యం వెల్లడించింది. సహాయక చర్యలు చేపట్టేందుకు పోలీస్‌, ఆర్మీ, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, సివిల్‌ క్యూఆర్టీ బృందాలు రాంబన్‌కు బయల్దేరినట్లు అధికారులు వెల్లడించారు.

ప్ర‌ధాని మోదీతో ఎయిర్ చీఫ్ మార్ష‌ల్‌ సమావేశం

  భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్‌ సింగ్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. కాశ్మీర్‌ పహల్గామ్‌‌లో ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో  ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకు ముందు రోజే నౌకాదళాధిపతి అడ్మిరల్‌ దినేష్‌ కె త్రిపాఠీ కూడా ప్రధానిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఇక‌, ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌ను భారత్ అన్ని వైపుల నుంచి దిగ్బంధనం చేస్తున్న విష‌యం తెలిసిందే. విడతల వారీగా తీసుకుంటున్న పలు నిర్ణయాలతో పాక్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీంతో భారత్ ఎప్పుడు దాడి చేస్తోందనని పాక్ వణికిపోతోంది. మరోవైపు, భారత్ చర్యలపై ప్రధాని మోదీ వరుసగా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.  అందులో భాగంగా భార‌త్ ఎయిర్ చీఫ్ మార్ష‌ల్‌తో భేటీ అయ్యారు. శనివారం నాడు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠితో కూడా మోదీ సమావేశమైన విష‌యం తెలిసిందే. అలాగే ఉగ్ర‌దాడి నేప‌థ్యంలోనే భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాల మంత్రి వర్గ క‌మిటీ సమావేశం  జరిగింది. ఉగ్ర‌వాదుల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు త్రివిధ ద‌ళాల‌కు ఈ సమావేశంలో కేంద్రం పూర్తి స్వేచ్ఛ‌ను ఇచ్చింది. ఇక శుక్ర‌వారం నాడు యుద్ధ స‌న్న‌ద్ధ‌త‌లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై వాయుసేన యుద్ధ విమానాల ల్యాండింగ్‌, టేకాఫ్ విన్యాసాల‌ను నిర్వ‌హించింది.  2019లో పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్‌ వాయుసేన పాక్‌లోకి ప్రవేశించి దాడి చేసింది. నాటితో పోల్చుకొంటే రఫెల్‌ యుద్ధ విమానాలు, ఎస్‌-400 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలతో ఐఏఎఫ్‌ శక్తి గణనీయంగా పెరిగింది. 

ప్రముఖ యోగా గురువు మృతి.. ప్రధాని మోదీ సంతాపం

  ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, యోగా గురువు స్వామి శివానంద తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వారణాసిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  కన్నుమూశారు. శివానంద మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆధ్యాత్మిక సాధనను, యోగా రంగానికి చేసిన అసమానమైన కృషిని ప్రధాని కొనియాడారు. దేశంలోని ప్రతి తరానికి ఆయన స్ఫూర్తినిస్తూనే ఉంటారని పేర్కొన్నారు. ఆయన మృతి యోగా రంగానికి తీరని లోటన్నారు.1896 ఆగస్టు 8న అవిభాజ్య భారత్‌లోని సిల్హెత్‌(ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) జిల్లాలో నిరుపేద కుటుంబంలో స్వామి శివానంద జన్మించారు. ఆరేళ్ల వయసులోనే శివానంద తల్లిదండ్రులను కోల్పోయారు.  దీంతో ఆయన పశ్చిమ బెంగాల్‌లోని ఓ ఆశ్రమంలో పెరిగారు. గురు ఓంకారానంద గోస్వామి ఆయనను పెంచి పెద్ద చేయడమేగాక, యోగా వంటి ఆధ్యాత్మిక విషయాలను బోధించారు. ఈ క్రమంలోనే తన జీవితాన్ని సమాజసేవకు అంకితం చేసిన స్వామి శివానంద.. గత 50 ఏళ్లుగా పూరిలో 400-600 కుష్టు రోగులకు సేవ చేశారు.ఆయన వయస్సు 128 ఏళ్లు అనే ప్రచారం ఉంది.యోగా రంగానికి చేసిన కృషికి గాను 2022లో శివానంద.. అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. తెల్లని ధోవతి, కుర్తా ధరించి.. కాళ్లకు చెప్పులు లేకుండా అత్యంత సామాన్యంగా వచ్చి ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించడం అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది.  

విజయసాయి తిరుపతి మొక్కు ఏమై ఉండొచ్చు?

విజ‌య‌సాయిరెడ్డి మొహం చూస్తుంటే ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్న‌ట్టుంది. ఒక ద‌రిద్రం వ‌దిలింద‌న్న సంబ‌రంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. అనేక విచార‌ణ‌ల‌కు వెళ్లి వ‌స్తున్నా.. ఆయ‌న మోములో తొణికిస‌లాడుతున్న‌ ఆ ఆనందానికి గ‌ల కారణాలేంట‌ని చూస్తే.. సాయిరెడ్డిగానీ ఇప్ప‌టికీ వైసీపీలో ఉండి ఉంటే ఆ టెన్ష‌న్ వేరే లెవ‌ల్లో ఉండేది. కానీ త‌న‌లోని చార్టెడ్ అకౌంటెంట్ తెలివి తేట‌ల‌న్నిటినీ వాడి.. వైసీపీకి రాం రాం చెప్పేసి.. చేతులు దులుపుకున్నారు.  ఇటు వైసీపీ స‌భ్య‌త్వానికి, అటు త‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన సాయిరెడ్డి అప్పుడే ప‌దే ప‌దే వెంక‌టేశ్వ‌ర స్వామివారిని తలుచుకున్నారు. అలాంటి స్వామివారి చెంత‌కు ఇప్పుడు వ‌చ్చాక ఆయ‌న ఎలాంటి మొక్కులు మొక్కుకుని ఉంటార‌న్నదానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. పైకి ఎంత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నట్లు కనిపిస్తున్నా.. విచారణలను ఎదుర్కొంటున్నారు.   మ‌ద్యం విచార‌ణ‌ల‌కు హాజ‌రవుతున్నారు. రాజ్ కేసిరెడ్డిని తెలివైన క్రిమిన‌ల్ అని ఈయ‌న అన‌డం, సాయిరెడ్డిని రాజ్ కేసిరెడ్డి కూడా విజయసాయిరెడ్డిని తిట్ట‌డం మ‌నకు తెలిసిందే.  ఈ క్ర‌మంలో రాజ్ కేసిరెడ్డి త‌దిత‌రులు వ్యాపారం చేస్కోడానికి అప్పులు ఇప్పించాన‌ని కూడా చెప్పారు విజ‌యసాయిరెడ్డి. ఇలాంటి వాటితో పాటు కాకినాడ పోర్టు వ్య‌వ‌హారాలు ఇంకా ఎన్నో స‌మ‌స్య‌ల్లో పీక‌లోతు కూరుకుపోయిన విజ‌య‌సాయి.. ఈ స‌మ‌స్య‌ల‌న్నిటికీ కార‌ణ‌మైన పార్టీని వ‌దిలినా.. అప్ప‌ట్లో ఆయ‌న చేసిన పాపాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. వీటి నుంచి విముక్తి క‌లిగించ‌మ‌ని మొక్కి ఉంటారా?  మొన్న‌టికి మొన్న భీమిలి బీచ్ లో విజ‌య‌సాయిరెడ్డి  సెవెన్ స్టార్ సామ్రాజ్యాన్ని సైతం పునాదుల‌తో స‌హా  పెక‌ళించింది  కూట‌మి ప్ర‌భుత్వం. దీన్నిబ‌ట్టీ చూస్తే సాయి రెడ్డి కూసాలు ఏ స్థాయిలో కదులుతున్నాయో అర్ధం చేసుకోవ‌చ్చు. అంటే బిడ్డ చ‌చ్చినా పురిటి కంపు పోవ‌డం లేద‌న్న చందంగా త‌యారైంద‌న్న‌మాట‌ విజ‌య‌సాయి జాత‌కం. ఈ విష‌యంలో స్వామివారిని ఏదైనా కోరి ఉంటారా? ఒక ర‌కంగా చెబితే పార్టీలో ఉండి  కేసులు ఎదుర్కుంటున్న వారు హ్యాపీగానే ఉన్నారు. వారికంటూ ఒక సింప‌తి వ‌చ్చే ప‌రిస్థితి కూడా ఉంది. అదే విజ‌య‌సాయి రెడ్డికి ఇటు గోడ దెబ్బ అటు చెంప దెబ్బ‌గా ఉంది. ఈ విష‌యంలో కాస్తా  త‌న‌ను బ‌య‌ట ప‌డేయ‌మ‌ని కూడా ఆయ‌న కోరుకుని ఉండొచ్చ‌ని అంటారు కొంద‌రు.  వైసీపీ అధికారంలోకి వ‌చ్చే వ‌ర‌కూ పార్టీలో నెంబ‌ర్ 2 గా ఉన్న విజ‌య‌సాయిరెడ్డి.. అధికారంలోకి వ‌చ్చాక 2వేల స్థానానికి ప‌డిపోవ‌డానికి కార‌కుల‌ను కూడా ఒక ప‌ట్టు ప‌ట్ట‌మ‌ని శ్రీవారిని వేడుకునే అకవ‌కాశాలు కూడా లేక పోలేదు. అంతే కాదు వీట‌న్నిటి నుంచి తాను బ‌య‌ట ప‌డ్డానికి ఒక మంచి పార్టీని చూపించ‌మ‌ని.. ఈ క‌ష్టాల క‌డ‌గండ్ల నుంచి త‌న‌ను త‌ప్పించ‌మ‌ని కూడా స్వామివారిని, సాయి రెడ్డి కోరుకునే అవ‌కాశాలు కూడా ఉండొచ్చంటారు కొంద‌రు. వీట‌న్నిటినీ అటుంచితే.. విజ‌య‌సాయి రెడ్డి తానొక మీడియా సంస్థ పెడ‌తాన‌ని కూడా గ‌తంలో అన్నారు. ఈ విష‌యంలో ఏదైనా మంచి పేరు త‌ట్టేలా చేయ‌మ‌ని కూడా స్వామివారిని కోరుకుని ఉండొచ్చు.  ఇక పోతే తాను త‌న శేష జీవితాన్ని వ్య‌వ‌సాయం చేసుకుని గ‌డుపుతాన‌ని కూడా ఆయ‌న‌ గ‌తంలో అన్నారు విజ‌య‌సాయిరెడ్డి. అందుకు త‌గిన సాయం.. చేయ‌మ‌ని కూడా తిరుమ‌ల వెంక‌న్న‌ను సాయిరెడ్డి కోరుకుని ఉండొచ్చంటారా? కొంద‌రు అంటున్న మాట‌ల‌ను బ‌ట్టీ చూస్తే విజ‌య‌సాయి పార్టీ నుంచి బ‌య‌ట‌కొచ్చి ఒక‌ర‌క‌మైన మెలో డ్రామాకు తెర‌లేపార‌నీ.. ఆ డ్రామా బ‌య‌ట ప‌డ‌కుండా చూడ‌మంటూ స్వామివారిని కోరి ఉండొచ్చ‌ని కూడా అంటున్నారు మ‌రి కొంద‌రు.  మ‌రి చూడాలి.. త‌న‌క‌న్నా మించిన వ‌డ్డీ లెక్క‌ల్ని క‌ట్టే ఒక భ‌క్తుడు ఎదురైన‌పుడు ఎంతైనా శ్రీవారికి కూడా కాస్త టెన్ష‌న్ గానే ఉండొచ్చు. ఎందుకంటే ఎన్నో లెక్క‌లు ఉన్న‌వి లేనివి- లేనివి ఉన్న‌వీ చూపించి సూట్ కేస్ కంపెనీలు పెట్టించి, పుట్టించి.. ఒక స‌మ‌యంలో త‌న మాజీ అధినేత జ‌గ‌న్ తో క‌ల‌సి ఏ2గా జైల్లో ఉండొచ్చినోడు.. అలాంటి మాయావి  ఎదురు ప‌డి.. త‌న స‌మ‌స్య‌ల‌ చిట్టా మొత్తం విప్పి.. వీట‌న్నిటినీ తీర్చాల్సిందే.. అని కోరుకుని పనిలో పనిగా క్విడ్  స్వామివారికి బంప‌రాఫ‌ర్ ప్ర‌క‌టించి  ఉండొచ్చు.  ఇలాంటి వ్య‌వ‌హారాల‌ను శ్రీవారు అనుమ‌తిస్తారా లేదా అన్నది వేరే విషయం. ఏది ఏమైనా సాయిరెడ్డి శ్రీవారి ద‌ర్శ‌నానికి రావ‌డం మాత్ర‌మే కాకుండా.. నిండా గుండు కొట్టుకుని న‌యా అవ‌తార్ లో క‌నిపించారు సాయిరెడ్డి. ఆయ‌న‌ త‌ర్వాతి అవ‌తారం ఎప్పుడు- ఎక్క‌డ‌- ఎలా ఉండ‌బోతుంద‌న్న‌దానిపై కూడా  క్లారిటీ రావ‌ల్సి ఉంది. చూద్దాం.. విజ‌య‌సాయి రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండ‌బోతుందో.. ఈ విష‌యంలో ఆయ‌న స్వామివార్ని ఎలాంటి కోరిక‌లు కోరి ఉంటారో.. తెలియాలంటే కొన్నాళ్ల పాటు వేచి చూడాల్సిందే. ఏమంటారు?

ఏమి జరుగుతోంది? ఎందుకీ మౌనం?

యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణాన ఏమి జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా, పాకిస్థాన్  పాలకులు కలవర పాటుకు గురవుతున్నారు. యుద్ధం వచ్చేసిందని, ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్  గంటలు ఘడియలతో సహా యుద్ధం ఎప్పుడు మొదలవుతుందో కూడా చెప్పేస్తున్నారు. ముహూర్తాలు పెట్టేస్తున్నారు. అణు హెచ్చరికలు చేస్తున్నారు. అణ్వాయుధాలు తమ వద్ద మాత్రమే ఉన్నట్లు  ప్రగల్బాలు పోతున్నారు. నిజానికి, భారత దేశం వద్ద పాక్  కంటే శక్తివంతమైన అణ్వాయుధాలే ఉన్నాయి. ఒక్క అణ్వాయుధాలే కాదు, ఆయుధ సంపత్తితో సహా సైనిక సామర్థ్యం, ససిద్ధత విషయంలో భారత దేశం పాక్  కు అందనంత ఎత్తులో వుంది. పాక్  వద్ద అణ్వాయుధాలు మాత్రమే ఉన్నాయి కావచ్చు. కానీ భారత అంబుల పొదిలో అణ్వాయుధాలను మైళ్ళ దూరంలోనే నిర్వీర్యం చేసే పటిష్ట మైన జీపీఎస్ జామర్  వ్యవస్థ ఉందని యుద్ద రంగ నిపుణులు చెపుతున్నారు. నిజానికి యుద్ధం అంటూ వస్తే పాకిస్థాన్  ఎప్పటికే  కోలుకోలేనంత భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, ప్రపంచ దేశాల యుద్దరంగ నిపుణులు పాక్ ను హెచ్చరిస్తున్నారు. నిజానికి, ఈ నిజం ప్రపంచ దేశాల కంటే ఎక్కువగా పాకిస్థాన్ కే తెలుసు. ఆ దేశానికి తమ బలమెంతో, బలహీనత ఏమిటో బాగా తెలుసు.   అయితే.. భారత దేశం ఇంకా మీనమేషాలు ఎందుకు లెక్కిస్తోంది? ఎందుకు, యుద్ధానికి పచ్చ జెండా ఉపడం లేదనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నుంచి,  మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలాంటి అనుమనాలు ఎక్కువగా  వ్యక్తమౌతున్నాయి. తాజాగా..  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పహల్గాం ఉగ్రదాడిని ఎదుర్కొనేందుకు విపక్షాలు కేంద్రంతో ఉన్నాయని స్పష్టం చేసినప్పటికీ ఇంతవరకూ కేంద్ర వద్ద నిర్దిష్టమైన వ్యూహం ఏమీ కనిపించడం లేదని, అన్నారు. శుక్రవారం (మే 2) జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.  మరో వంక  ప్రభుత్వం తమను విశ్వాసంలోకి తీసుకుని, అన్ని విషయాలు చర్చించాలని  ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్  సీనియర్ నాయకుడు జయరాం రమేష్  ఈమేరకు డిమాండ్ చేస్తే, కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ పహల్గాం ఉగ్రదాడి పై చర్చినేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ప్రభుత్వ వ్యూహం ఏమిటో కానీ.. ఏ విషయాన్ని బయటకు చెప్పడం లేదు. అలాగని, ఏమీ జరగడం లేదా అంటే.. ఏదో జరుగుతోందన్నది మాత్రం కాదనలేని నిజం అంటున్నారు.   మరో వంక  జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి  గులాం నబీ ఆజాద్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది, కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి వదిలేయాలని అంటున్నారు. ప్రభుత్వం వెలుపల ఉన్న ఎవరైనా ఒకటి రెండు కోణాలలో మాత్రమే చూడగలం, ప్రభుత్వం సమస్యను సమగ్రంగా అన్ని కోణాల్లో చూడగలుగుతుంది.  అలాగే  పర్యవసానాలు ఎలా ఉంటాయి.. లాభ  నష్టాలూ ఏమిటి? ప్రపంచ దేశాల స్పందన ఏమిటి? అన్న విషయాలన్నిటికీ సమగ్రంగా విశ్లేషించి నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. నిజానికి, ప్రస్తుత సంక్లిష్ట సమయంలో రోజు వారీ  నివేదికలు కోరటం ప్రతిపక్షాలకు తగదని విశ్లేషకులు సైతం అంటున్నారు.

తాడిపత్రికి పెద్దారెడ్డి.. జేసీ మాస్ వార్నింగ్

    అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చాలా రోజుల తర్వాత మళ్లీ పట్టణంలో అడుగుపెట్టబోతున్నారు. పోలీసు ఆంక్షలను సవాలు చేస్తూ కేతిరెడ్డి కోర్టు అనుమతితో మరో రెండు రోజుల్లో తాడిపత్రి రాబోతున్నారు. అయితే ఆయన్ని అడ్డుకునేందుకు జేసీ వర్గీయులు కూడా సిద్ధమవ్వడం, తాడిపత్రికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పెద్దారెడ్డిని జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమవుతున్నారు ... దాంతో ఇప్పుడు ఏం జరుగుతుందో అని పట్టణ  వాసులు టెన్షన్ పడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాడిపత్రి కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రాష్ట్రమంతా రాజకీయం ప్రశాంతంగా ఉంటే  ఒక్క తాడిపత్రి లో మాత్రం ఎప్పుడు పొలిటికల్ హీట్ రగులుతూనే ఉంటుంది.  తాడిపత్రిలో మాజీ  ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిల వైరం ఫ్యాక్షన్ వాతావరణాన్ని తలపిస్తూ ఎప్పుడూ టెన్షన్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. గత 30 ఏళ్లుగా తాడిపత్రిలో జేసీ కుటుంబానిదే ఆధిపత్యం. జేసీ కుటుంబంలో పార్టీకి సంబంధం లేకుండా ఏ పార్టీలో ఉన్న వారే గెలుస్తూ వచ్చారు. కానీ 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. కేతిరెడ్డి కుటుంబం నుంచి మొదటిసారి వైసీపీ నుంచి పోటీ చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక అప్పటినుంచి ఈ ఆధిపత్య పోరు మరింత ఎక్కువయింది. ఇద్దరి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో తాడిపత్రి హోరెత్తుతూ వస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి పోలీసుల సహాయంతో  జేసీ ప్రభాకరరెడ్డిని ఇంటి బయటకు కూడా రానివ్వకుండా అనేకమార్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏక్కడ ఏ ధర్నా కార్యక్రమం, ఏ ఆందోళన చేసే ప్రయత్నం చేసినా అడ్డుకున్నారు. ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లి ఆయన సోఫాలో కూర్చుని ఆ కుటుంబానికి సవాల్ విసిరారు.  ఇక అప్పటి నుంచి వారి మధ్య ఆధిపత్యపోరు మరింత పీక్స్ కు చేరింది.సీన్ కట్ చేస్తే ఇప్పుడు జేసీ వంతు . 2024 ఎన్నికల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి టీడీపీ నుంచి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలవడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డికి చుక్కలు కనపడుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి అనంతరం తాడిపత్రి కి దూరమైన పెద్దారెడ్డి ఇంతవరకు ఆయన సొంత ఇంటి మొహమే చూడలేదు. 2024 ఎన్నికల సమయంలో చెలరేగిన హింస వల్ల తాడిపత్రిలోని కీలక నేతలందరినీ పట్టణానికి దూరంగా ఉండాలని కోర్టు ఆదేశించడంతో పెద్దారెడ్డి తాడిపత్రికి దూరంగా ఉంటూ  కాలం గడపాల్సి వచ్చింది. కానీ కోర్టు ఆదేశాలతో ఇటీవల నేతలు ఒక్కొక్కరిగా తాడిపత్రికి చేరుకుంటున్నారు. పెద్దారెడ్డి మాత్రం ఇప్పటివరకు తాడిపత్రిలోని తన సొంత ఇంటి మొహం చూడలేకపోయారు. మధ్యలో ఒకసారి ఏదో పేపర్స్ కోసమని తాడిపత్రి కి వెళ్లే ప్రయత్నం చేయగా పెద్ద ఎత్తున ఘర్షణ చెలరేగడంతో పోలీసులు అప్పటినుంచి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి ఎంట్రీ లేకుండా చేశారు. ఆ క్రమంలో తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టు నుంచి తాడిపత్రికి వెళ్లేందుకు ఉత్తర్వులు  తెచ్చుకున్నారు.  రెండుమూడు  రోజుల్లో ఆయన తాడిపత్రిలో ఎంటర్ అవ్వడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ పెద్దారెడ్డి రాకను జేసీ ప్రభాకరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దానిపై పబ్లిక్ గానే పెద్దారెడ్డిని తాడపత్రిలోకి రానివ్వనని జేసీ స్టేట్మెంట్ ఇవ్వడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ క్రమంలో పెద్దారెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న గ్రౌండ్ వద్ద పెద్ద సంఖ్యలో రాళ్ల కుప్పలు దర్శనమివ్వడంతో పోలీసులు అలెర్ట్ అయి ఆ రాళ్ల కుప్పలను తొలగించారు. ఇక తాడిపత్రి వెళ్ళే విషయంలో పెద్దారెడ్డి కూడా గట్టిగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈసారి ఎలాగైనా తాడిపత్రి పట్టణంలో అడుగు పెట్టాలని నిశ్చయించుకున్నారు. జిల్లా ఎస్పీని కలిసి తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు ఆదేశాలను చూపించి పోలీస్ బందోబస్తుతో వెళ్లాలని అనుకుంటున్నారు.. అయితే జేసీ వార్నింగ్ నేపథ్యంలో పోలీసులు కేతిరెడ్డికి పర్మిషన్ ఇస్తారా లేదా అన్నది ఉత్కంఠభరితంగా మారింది.

హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెంపు..ప్రయాణికులపై పెనుభారం

  హైదరాబాద్ మెట్రో ఛార్జీలు మే రెండో వారం నుండి పెరిగే ఛాన్స్ ఉంది. కనిష్ట ఛార్జీ రూ. 15 వరకు, గరిష్ట ఛార్జీ రూ. 75 వరకు పెరగవచ్చు. ఎల్ అండ్ టీ ఈ పెంపు ద్వారా ఏడాదికి అదనంగా రూ. 150 కోట్లు ఆర్జించాలని భావిస్తోంది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను భర్తీ చేయడానికి.. సంస్థ యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఛార్జీల పెంపుదల అనివార్యంగా మారినట్లు తెలుస్తోంది. రూ.6500 కోట్ల భారీ నష్టాల్లో  L&T మెట్రో సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది. కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయామని, మెట్రో చార్జీలు పెంచాలని అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఎల్ అండ్ టీ ఈ సంస్ధ కోరింది. కానీ అప్పటి ప్రభుత్వం చార్జీల పెంపుకు సుముఖత చూపకపోవడంతో వాయిదా వేసింది. ఇటీవల బెంగళూరులో 44% మెట్రో చార్జీలు పెరగడంతో, హైదరాబాద్ లో ఎంత పెంచాలనే యోచనలో ఉంది మెట్రో సంస్థ. ఇప్పటికే రూ.59 హాలిడే సేవర్ కార్డు రద్దు, మెట్రోకార్డుపై రద్దీ వేళల్లో 10% డిస్కౌంట్‌ను సంస్థ ఎత్తివేసింది. మెట్రో కార్యకలాపాలు, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం.. మాల్స్‌లో అద్దెల ద్వారా సంస్థకు ఏటా సుమారు రూ. 1500 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. అయితే.. మెట్రో రైలు నిర్వహణ, బ్యాంకు రుణాలపై చెల్లించే వడ్డీలు.. ఇతరత్రా ఖర్చులు అన్నీ కలిపి సంవత్సరానికి దాదాపు రూ. 2 వేల కోట్ల వరకు వ్యయం అవుతోందని  L&T అధికారులు చెబుతున్నారు.

తిరుమల క్యూ లైన్‌లో ఒకరినొకరు కొట్టుకున్న శ్రీవారి భక్తులు

  తిరుమలలో భక్తు రద్దీ కొనసాగుతుంది. సమ్మర్ హాలీడేస్ కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి పోటెత్తారు. అయితే దర్శనానికి చాలా సమయం పడుతుండడంతో భక్తుల్లో అసహనం పెరుగుతోంది. ఒకేసారి క్యూలైన్లకు భక్తులను వదలడంతో ఒకరినొకరు తోచుకుంటున్నారు. అక్కడే ఉన్న విజిలెన్స్, పోలీస్ సిబ్బంది వారిని అదుపు చేసేందుకు ఎంత ప్రయత్నించినా భక్తులు ఒకరికి ఒకరు కొట్టుకున్నారు. శ్రీవారి ఆలయ పేష్కార్ రామకృష్ణ భక్తులకి ఎంత సర్ది చెప్పినా వినకుండా గొడవకు దిగిన వైనం వెంటనే క్యూలైన్ వద్దకి విజిలెన్స్ అధికారులు చేరుకొని భక్తుల్ని పక్కకు తీసుకెళ్లి  సముదాయించి గొడవ సద్దుమణిగేలా చేశారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుందని స్పష్టం చేసింది.  అది ఎటువంటి టోకెన్లు లేకుండా ఆల్రెడీ క్యూలైన్లోకి వెళ్లి కంపార్ట్ మెంట్‌లో వెయిట్ చేస్తున్న వారికి 10 గంటలు సమయం పడుతోందని వెల్లడించింది. ప్రస్తుతం కొత్తగా క్యూలైన్‌లోకి వెళ్లే వారికి 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. భక్తుల రద్దీని బట్టి సమయాలు మారుతాయని పేర్కొంది. శనివారం తిరుమల శ్రీవారిని 84 వేల 113 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,868 మంది తలనీలాలు  సమర్పించారు. హుండీ ఆదాయం  రూ.4.12 కోట్లు వచ్చింది. మొత్తం 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వెళ్లిన భక్తులకు సుమారు 15 గంటల సమయం పట్టింది. సమయం, స్లాట్ బుక్ చేసుకున్న భక్తులకు స్వామివారి సర్వదర్శనం 4 నుండి 6 గంటల పట్టింది. రూ. 300 ప్రత్యేక దర్శనం సుమారు 3 నుండి 4 గంటలు పట్టినట్లు తిరుమల అధికారులు తెలిపారు.