రాజకీయ అరంగ్రేటం చేయబోతున్న నేతల వారసులు...

రాజకీయాలు అంటేనే వారసుల విషయంలో చాలా పెద్ద స్థానం ఉంటుంది. తమ ఆస్తులను వారసులకు ఇస్తారో లేదో తెలియదు కానీ పొలిటికల్ కెరీర్ ను మాత్రం పది కాలాల పాటు భద్రంగా ఉంచుకోవటానికి నేతలు వారసులను రంగంలోకి దింపుతుంటారు . ఈ నేపధ్యంలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు రాజకీయ వారసుల అరంగేట్రానికి ప్లాట్ ఫాంగా మారాయి. అన్ని జిల్లా ల్లోనూ రాజకీయ వారసులు బరిలో ఉన్నారు. కింది స్థాయి నుంచి పెద్ద నేతగా ఎదగటానికి ఇదే మంచి తరుణంగా భావిస్తున్నారు రాజకీయ వారసులు. తమ పొలిటికల్ కెరీర్ పునాది గట్టిగా వేసుకోవటానికి మున్సిపల్ ఎన్నికలను వేదికగా మార్చుకున్నారు.  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలను రాజకీయ వారసులు బరిలోకి దిగుతున్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కుటుంబం బరిలోకి దిగింది. ఆయన కోడలు లావణ్యను 39 వ డివిజన్ నుంచి పోటీకి దింపారు. గతంలో సోమారపు సత్యనారాయణ గోదావరిఖని మున్సిపల్ ఛైర్మన్ గా రామగుండం ఎమ్మెల్యేగా పని చేశారు. ఇప్పుడు తన కుటుంబం నుంచి కోడలిని బరిలోకి దించగా.. ఇక పెద్దపల్లి మున్సిపాలిటీ నుంచి స్థానిక ఎమ్మెల్యే తన కోడలిని బరిలోకి దించారు. ఇరవై ఒకటో వార్డు నుంచి మమతారెడ్డి పోటీలో నిలిచారు. అయితే ఆమెతోపాటూ ఐదుగురు పోటీకి నామినేషన్ లు దాఖలు చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వారి నామినేషన్ లను ఉపసంహరించుకునేలా పావులు కదపడంతో దాసరి మమతారెడ్డి ఏకగ్రీవంగా గెలిచారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మున్సిపల్ ఎన్నికల్లో తన మార్క్ ఉండేటట్లు చూసుకుంటున్నారు. తన అక్క కోడలిని కరీంనగర్ మున్సిపాలిటీ 46 డివిజన్ నుంచి బరిలోకి దించుతున్నారు. గతంలోనూ ఆమె ఈ డివిజన్ నుంచి గెలుపొందారు. కరీంనగర్ జిల్లాలో మరి కొందరు జడ్పీటీసీ, ఎంపీటీసీలు మున్సిపల్ వార్డు మెంబర్ల వారసులు కూడా బరిలో నిలవడం విశేషం.మొత్తానికి నేతలు తమ వారసులను బరిలోకి దింపే పనిలో పడ్డట్టు సమాచారం.

బీజేపీ-జనసేన పార్టీల దోస్తీ.. భయపడేది లేదంటున్న వైసీపీ!!

ఏపీలో బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఇరు పార్టీ నేతల మధ్య కీలక సమావేశం జరుగుతోంది. విజయవాడలోని ఫార్చ్యూన్ మురళి హోటల్ లో జరుగుతోన్న ఈ భేటీ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీజేపీ తరపున కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు, పురందేశ్వరి, సోము వీర్రాజు హాజరుకాగా.. జనసేన తరపున పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. భవిష్యత్ ఉమ్మడి కార్యాచరణ, ప్రజా సమస్యలు, అమరావతి అంశాలపై వీరు లోతుగా చర్చిస్తున్నారు. బీజేపీ, జనసేనలు చేతులు కలపడంపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం.. బీజేపీ-జనసేన కలిసినా తమకి ఎలాంటి నష్టం లేదని ధీమా వ్యక్తం చేస్తోంది.

రోజురోజుకు పెరుగుతున్న సముద్రాల ఉష్ణోగ్రత...

2019 లో మానవజాతి చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ప్రపంచంలోని సముద్రాలన్నీ వేడెక్కాయని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ క్లైమేట్ అండ్ ఎన్విరాన్ మెంటల్ సైన్సెస్ అసోసియేట్ ప్రొఫెసర్ లీజింగ్ చెంగ్ బృందం వెల్లడించింది. ప్రపంచంలోని సముద్రాల సరాసరి ఉష్ణోగ్రత 0.135 ఫారెన్ హీట్లకు వరకు పెరిగిందని ఇది 360 కోట్ల హిరోషిమా బాంబు పేలుళ్ల నుంచి వెలువడే వేడికి సమానమైనదని పేర్కొన్నారు. పెరుగుతున్న భూతాపానికి ఇదొక సజీవ సాక్ష్యమని తెలిపింది. ఇలాగే సముద్రాలు వేడెక్కుతూ పోతే 2300 ల సంవత్సరం నాటికి సముద్ర మట్టాలు నాలుగడుగులు పెరుగుతాయని వివరించింది. దీంతో పెద్ద మొత్తంలో భూభాగాలూ నీటమునిగిపోతాయని హెచ్చరించారు ఆ బృందం. అట్లాంటిక్, దక్షిణ సముద్రాలు కూడా బాగా వేడెక్కాయని వివరించారు.  సముద్ర ఉపరితలం పైనే కాకుండా ఉపరితలానికి 6500 ల అడుగుల లోతులో కూడా సముద్ర జలాలు వేడెక్కాయని వెల్లడించారు. 1955 నుంచి 1986 మధ్య కాలంలో పెరిగిన సముద్ర జలాల వేడితో పోలిస్తే 1987 నుంచి 2019 మధ్య 450 శాతం వేడి పెరిగింది. భూతాపోన్నతిలో 96 శాతం వేడిని సముద్రాలే పీల్చుకుంటాయని 4 శాతం వరకు జంతుజాలం నివసించే భూమి వాతావరణంలో కలుస్తుందని అందుకు వేడికి తనలో కలిపేసుకునే గుణం సముద్రాలకూ ఉండటమేనని దీనికి కారణమని తెలిపింది ఆ బృందం. అమెజాన్, కాలిఫోర్నియా, ఆస్ట్రేలియాలో భూతాపం బాగా పెరిగిపోతుందని వివరించింది. ఆస్ట్రేలియాలో అడవులు తగలబడడానికి కారణం కూడా భూతాపం పెరగడమేనితెలిపినట్లు సమాచారం. ఈ బృందం నివేదికల ప్రకారం అయినా మానవులు జాగ్రత్తలు పడకపోతే ముందుముందు దారుణమైన విపత్తులు ఏదుర్కొవాల్సి పరిస్థితి వస్తుందని సమాచారం.

మరోసారి వాయిదా పడనున్న నిర్భయ నిందితుల ఉరి...

నిర్భయ ఘటన జరిగి 7 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికి న్యాయం జరగకపోవడం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిర్భయ దోషులకు ఉరి మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ నెల 22న ఉరిశిక్ష అమలు చేయటం సాధ్యం కాదని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. నలుగురు దోషులలో ఒకరైన ముఖేష్ సింగ్ క్షమాభిక్ష కోసం రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు దరఖాస్తు చేశాడు.రాష్ట్రపతి నిర్ణయం వెలువడే వరకు డెత్ వారెంట్ పై స్టే ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశాడు నిందితుడు.జైలు నిబంధనల ప్రకారం రాష్ట్రపతి నిర్ణయం వెలువడే వరకు ఉరిశిక్ష అమలు చేయలేమని ఢిల్లి ప్రభుత్వం కోర్టుకు వివరించింది.కావున నిర్భయ దోషులను ఈ నెల 22 న ఉరి తీయలేమని ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు తీహర్ జైలు అధికారులు. ముఖేష్ క్షమాభిక్ష అభ్యర్ధతను రాష్ట్రపతి తిరస్కరించినా నిబంధనల ప్రకారం దోషులను ఉరి తీయడానికి ముందు కనీసం 14 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు.  నిర్భయ దోషులు కుంటి సాకులతో రోజులు పొడిగించుకోవటానికి చేస్తున్న ప్రయత్నాల పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ముఖేష్ క్షమాభిక్ష అభ్యర్ధను వీలైనంత త్వరగా తిరస్కరించాలసిందిగా రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ని నిర్భయ తల్లి ఆశాదేవీ కోరారు. లాయర్లు దోషులను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను 7 ఏళ్ళుగా పోరాడుతున్న తన కూతురుకి న్యాయం జరగలేదని భారత న్యాయ వ్యవస్థ నిజంగానే గుడ్డిదని ఆశాదేవి ఆవేదనను వ్యక్తం చేశారు.నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు చేయటంలో ఢిల్లీ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని జాతీయ మహిళా కమీషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ మండి పడ్డారు. ట్రైల్ కోర్టు ఆదేశాలకు అణుగుణంగా ఎట్టి పరిస్థితిలో నలుగురు దోషులను జనవరి 22 నే ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేశారు. మొత్తానికి నిర్భయ దోషులు ఎన్ని తెలివితేటలు ప్రదర్శించిన వాళ్ళకు మరణ శిక్ష అమలు చేయడం కాయమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కానీ నిందితులకు ఇన్ని అవకాశాలు కల్పిస్తున్న కోర్ట్ పై కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు సమాచారం.

అప్పుడు విశాఖ వైపు కన్నెత్తి చూడని జగన్.. ఇప్పుడు మంచి చేస్తాడంటే నమ్మాలా?

కొద్ది రోజులుగా ఏపీని పట్టి కుదిపేస్తున్న అంశం రాజధాని తరలింపు. అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానుల ప్రతిపాదన అంశాన్ని సీఎం వైఎస్ జగన్ తెరమీదకు తీసుకురావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామని చెప్పడం.. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఇక రాజధాని తరలింపు ఖాయమని తెలుస్తోంది. దీంతో రాజధాని తరలింపుని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వారికి టీడీపీ పూర్తిగా మద్దతిస్తూ ఉద్యమిస్తోంది.  అయితే టీడీపీకి చెందిన కొందరు విశాఖ నేతలు మాత్రం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించారు. స్థానిక ప్రజల మెప్పు కోసమే ఆ ప్రాంత టీడీపీ నేతలు కొందరు జగన్ నిర్ణయాన్ని స్వాగతించారని టీడీపీ శ్రేణులు భావించాయి. మరోవైపు అసలు జగన్ విశాఖకు మంచి చేస్తానంటే గుడ్డిగా ఎలా నమ్ముతున్నారంటూ  కొందరు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు గతంలో విశాఖపై జగన్ ప్రదర్శించిన తీరుని గుర్తుచేస్తున్నారు. 2014 లో హుద్‌హుద్ తుఫాను విశాఖని అతలాకుతలం చేసింది. ఆ సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి విశాఖకు అండగా ఉన్నారు. కొద్దిరోజులపాటు విశాఖలోనే ఉండి అధికారులని ఉరుకులు పెట్టి పనులు చేయించారు. తుఫాను వచ్చి కళ తప్పిన విశాఖకు.. మళ్లీ కళ తెప్పించారు. విశాఖ ప్రజల కళ్ళల్లో ఆనందం తెప్పించారు. కానీ అప్పుడు వైఎస్ జగన్ మాత్రం విశాఖకు అండగా నిలబడలేదు. దానికి కారణం ఆయనకు విశాఖ ప్రజలపై ఉన్న కోపమే అని అప్పుడు ప్రచారం జరిగింది. 2014 ఎన్నికల్లో జగన్ తల్లి విజయమ్మ విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత హుద్‌హుద్ తుఫాను విశాఖను కుదిపేసింది. విజయమ్మని ఓడించిన పాపం విశాఖకు తగిలింది అంటూ ఆ సమయంలో కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి పైశాచిక ఆనందం పొందారు. ఇక జగన్ అయితే విశాఖ వైపు తిగిరిచూడలేదు. తన తల్లిని ఓడించారన్న కోపంతోనే జగన్ వారిని పరామర్శించలేదు, వారికి అండగా నిలబడలేదని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం గెలిచినా ఓడినా ప్రజలకు అండగా ఉండాలి. 2009 కర్నూల్ లో వరదలు వచ్చిన సమయంలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా చంద్రబాబు ప్రజలకు అండగా నిలబడి.. వారికి తన తరఫున, తన పార్టీ తరఫున ఎంతో సేవ చేశారు. కానీ జగన్ మాత్రం తన తల్లిని ఓడించారన్న కోపంతో... ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ళ కనీళ్ళు తుడవడం కాదు కదా.. కనీసం పలకరించలేదు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వీటిని గుర్తు చేస్తూ ఇప్పుడు జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న వారిని ప్రశ్నిస్తున్నారు కొందరు. అప్పుడు విశాఖ ప్రజలు కష్టాల్లో ఉంటే కనీసం కన్నెత్తి చూడనివాడు.. ఇప్పుడు విశాఖకు మంచి చేస్తానంటే ఎలా నమ్ముతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ కేవలం చంద్రబాబు మీద కోపంతోనే రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. విజయమ్మ ఓటమిని గుర్తు పెట్టుకొని విశాఖపై ప్రతీకారం తీర్చుకునే కుట్ర చేసినా ఆశ్చర్యం లేదని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు రాజధాని విషయంలో జగన్ మనసులో ఏముందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం జగన్ కి మద్దతుగా కొందరు, జగన్ కి వ్యతిరేకంగా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.

పవన్ మళ్లీ మళ్లీ అదే తప్పు... పార్టీ బ్రతకాలని లేదా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన తప్పే మళ్లీ చేస్తున్నాడా? తను తడబడుతూ తన వెంట నడుస్తున్న జనసైనికులను అయోమయానికి గురి చేస్తున్నాడా?. జనసేన ఆవిర్భావం నుండి తాజా రాజకీయ పరిస్థితులు వరకు ఆయన అడుగులు గమనిస్తే అవుననే అభిప్రాయం కలుగుతోంది. సినిమాలకు కామా పెట్టి 2014 లో సొంతంగా జనసేన పార్టీని స్తాపించాడు. సినిమాల్లో ఆయనను ఎంతగానో ఆదరించిన యువత.. రాజకీయాల్లో కూడా ఆయన వెంట నడవడానికి ఉత్సాహం చూపారు. ఆ సమయంలో పవన్ పోటీ చేస్తే గౌరవ ప్రదమైన సీట్లు గెలిపించే అంత ఉత్సాహం చూపించారు జన సైనికులు. కానీ, పవన్ మాత్రం మొదటి అడుగులోనే వారి ఉత్సాహానికి బ్రేకులు వేసాడు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టా అంటూ.. ఎన్నికల బరిలోకి దిగకుండా.. బీజేపీ-టీడీపీ పార్టీలకు మద్దతు తెలిపాడు. దీంతో సగం మంది జనసైనికులు నిరుత్సాహ పడ్డారు. మిగతా వారు పవన్ చెప్పినట్టు.. బీజేపీ-టీడీపీ పార్టీలకు ఓటేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి. దీంతో జనసైనికులు అది తమ విజయంగానే భవిస్తూ ఆనంద పడ్డారు. కానీ దానివల్ల జనసేనకు ఒరిగినదేమీ లేదు. బరిలోకి దిగకపోయేసరికి అదో రాజకీయ పార్టీగా ప్రజలు గుర్తించలేదు. పార్టీ గానీ, పవన్ గానీ ప్రజల్లోకి వెళ్ళలేదు. 2014 ఎన్నికల తరువాత కొన్నాళ్ళకు బీజేపీ-టీడీపీ పార్టీలకు పవన్ దూరం జరిగాడు. ప్రశ్నించడం మొదలు పెట్టాడు. 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో సంబంధం లేకుండా ఒంటరిగా బరిలోకి దిగాడు. కానీ తాను టీడీపీ, బీజేపీ పార్టీలకు మిత్రుడు అనే ముద్ర పోగొట్టుకోలేకపోయాడు. వైసీపీ నేతలు పవన్ టీడీపీ రహస్య మిత్రుడు అంటూ ఆరోపిస్తుంటే .. పవన్ ఆ ఆరోపణలకు చెక్ పెట్టలేకపోయాడు. అది పవన్ కి బాగానే నష్టం చేసింది. ఎంతలా అంటే.. పార్టీ గెలవడం మాట అటుంచితే.. పవన్ పోటీ చేసిన రెండు చోట్ల పరాజయం మూట గట్టుకున్నాడు. పార్టీ కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. పవన్ కి రాజకీయాల్లో అంతటి దారుణమైన ఓటమి ఎదురుకావడానికి ప్రధాన కారణం.. పవన్ కి స్పష్టమైన స్టాండ్ లేదని ప్రజల్లో భావన కలగడమే. పవన్ బీజేపీ-టీడీపీ పార్టీల వ్యక్తిగానే ఎక్కువ మంది భావించారు. అందుకే పవన్ ని పట్టించుకోలేదు. అయినా వీటి నుండి పవన్ పాఠాలు నేర్చుకున్నట్టు లేడు. అందుకేనేమో మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు. పవన్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్ళాడు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాని కలిశాడు. ఏపీలో జనసేన-బీజేపీ కలిసి పనిచేయాలని పరస్పరం అంగీకారానికి వచ్చాయని అంటున్నారు. దీంతో జనసైనికుల్లో అయోమయం, అసహనం నెలకొన్నాయి. పవన్ ఓడిపోయినా ఇంకా ఆయన వెంట ఎందరో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రజాసమస్యల మీద పోరాడుతూ, ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే.. ఆయన మీద, ఆయన పార్టీ మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది. కాస్త ఆలస్యమైనా ఆయనపై ప్రజలకు పూర్తి నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది. కానీ పవన్ మాత్రం తప్పటడుగులు వేసి ఉన్న నమ్మకాన్ని కూడా పోగొట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ ఆయన బీజేపీ గొడుగు కిందకు చేరితే.. ఆయనకంటూ ఓ స్టాండ్ లేదని ప్రజలు అనుకుంటారు. ఈ అయోమయంలో మరికొందరు జనసైనికులు కూడా దూరం అవుతారు. మరి పవన్ ఇప్పటికైనా ఇలా ఏదోక పార్టీతో జతకట్టడం మానేసి.. తన పార్టీ తరపున ప్రజాసమస్యలపై పోరాడుతూ.. జనసైనికులకు భరోసా, ప్రజలకు నమ్మకం కలిగిస్తారేమో చూద్దాం.

అమరావతి పరిస్థితిపై హైకోర్టు సీరియస్‌!!

రాజధాని అమరావతి ప్రాంతంలో నెలకొన్న పరిస్థితిపై హైకోర్టు సీరియస్‌ అయింది. మహిళలపై లాఠీచార్జ్‌ ఘటనను కోర్టు సుమోటోగా తీసుకుంది. అమరావతిలో పలు ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 చట్టం విధించిన సంగతి తెలిసిందే. అయితే 144 సెక్షన్ తొలగించాలని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. తమపై దాడులు చేస్తున్నారని, శాంతియుత నిరసనలకు అనుమతి ఇవ్వడం లేదని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజధానిలో పోలీసు చట్టాల అమలుపై హైకోర్టు అసంతృప్తి వెలిబుచ్చింది. రాజధానిలో పరిస్థితులకు సంబంధించి పిటిషనర్లు ఇచ్చిన దృశ్యాలను న్యాయమూర్తి పరిశీలించారు. రాజధాని గ్రామాల్లో ఏం జరుగుతోందో అర్ధం కావడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. గ్రామాల్లో పోలీసులు మార్చ్‌ఫాస్ట్‌ చేయడమేంటని ప్రశ్నించింది. కర్ఫ్యూ వాతావరణం ఎందుకు ఉందని హైకోర్టు నిలదీసింది. కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాలతో శుక్రవారం కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

రాజధాని గ్రామాల్లో పోలీసులకు త్రాగడానికి నీళ్లు లేవు.. కూర్చోడానికి బెంచి లేదు

అమరావతిలో ఆందోళనలు 27వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు కూడా ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించి కనిపిస్తున్నారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, తదితర ప్రాంతాల్లో 144 సెక్షన్, సెక్షన్ 30 అమలు చేశారు. రైతులు, మహిళలపై లాఠీ చార్జ్ చేసినందుకు ప్రతీకారంలో ఆయా గ్రామాల వాసులు పోలీసులకు సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఖాకీ డ్రెస్ వేసుకుని కనిపిస్తే చాలు టీ , టిఫిన్లు ,భోజనాలు అడిగితే ఇవ్వమని మొఖం మీదే చెబుతున్నారు. కనీసం మంచినీళ్ళు కూడా లేవు పొమ్మంటున్నారు. పోలీసులకు ఎటువంటి అమ్మకాలు చేయబోమని దుకాణాల యజమానులు కూడా చెప్తున్నారు.  అమరావతి పోలీసులు వర్సెస్ ఆందోళనకారుల మధ్య విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. ఊళ్లలో సేద తీరేందుకు వేసిన బల్లలపై వాడి పారేసిన ఇంజినాయిల్ కనిపిస్తుంది. ఊళ్లలో మోహరించిన పోలీసులు ఉన్నతాధికారుల ఉత్తర్వులంటూ 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు. అందుకు నిరాకరిస్తున్న గ్రామ ప్రజలు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. నలుగురు కలిసి మాట్లాడుకోకుండా అమలు చేసిన 144 సెక్షన్ పై వినూత్న నిరసన తెలిపారు. ఊళ్లో జనాన్ని కూర్చోనివ్వని పోలీసులకు.. వాళ్లను కూడా కూర్చోనివ్వకుండా బల్లలపై ఆయిల్ పోశారు. ఇప్పటికే అమరావతి ప్రాంతాల్లో పోలీసులకి నీళ్లు కూడా ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తున్నారు గ్రామస్తులు.

సంక్రాంతి దెబ్బకు టోల్ గేట్ల వద్ద బారులు తీరిన వాహనాలు

సంక్రాంతి కి సొంతూళ్ల కు వెళ్లే వారితో పట్నం కాస్త పల్లె బాట పట్టినట్లు తలపిస్తుంది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పై వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. పంతంగి, కొర్లపాడు టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్ జామ్ అవ్వకుండా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.  ప్రస్తుతం పంతంగి టోల్ గేట్ వద్ద గత రెండు రోజుల నుండి రద్దీ కొనసాగుతుంది. ప్రధానంగా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాలు పెద్దఎత్తున బార్లు తీరిన పరిస్థితి నెలకొంది. గత రెండు రోజుల నుండి ఇదే పరిస్థితి కొనసాగడంతో అదనంగా 16 మందిని టోల్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. వారు వాహనదారుల వద్దకే వెళ్లి త్వరత్వరగా పంపిస్తున్నప్పటికి టోల్ గేట్ల వద్ద రద్దీ కొనసాగుతుంది. అయితే పంతంగి టోల్ గేట్ తో పాటు కొర్లపాడు దగ్గర ఉన్న టోల్ గేట్ వద్ద రద్దీ కొనసాగుతుంది. ప్రధానంగా  విజయవాడకు వెళ్లాలంటే ఇటు పంతంగి కావచ్చు అదే విధంగా కొర్లపాడు చిల్లపల్లి టోల్ గేటు వద్ద భారీగా ట్రాఫిక్ ఆగింది.  సంక్రాంతి పండగ సెలవులు ఉండటంతో వాహనాల రద్దీ ఇప్పటికే లక్ష వరకు వెళ్లినట్టుగా టోల్ సిబ్బంది అధికారుల యాజమాన్యం తెలుపారు. ఇక ముఖ్యంగా ఫాస్ట్ ట్యాగ్ ను తీసుకొని త్వరగా వెళ్లేలా చెప్పారు అధికారులు. ఇలా చేస్తే వాహన దారులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. ముఖ్యంగా  ఇప్పటి వరకు ఫాస్ట్ ట్యాగ్ రూట్లకు సంబంధించి పంతంగి టోల్ గేట్ వద్ద 16  లైన్స్ ఉండగా.. ఇందులో పది లైన్లు ప్రధానంగా విజయవాడకు వెళ్లేందుకు ఏర్పాటు చేసారు. అందులో ఫాస్ట్ ట్యాగ్ కు  సంబంధించి ఐదు లైన్ లను వేరుగా పెట్టారు. అయితే వాటిలో కొంత ట్రాఫిక్ తక్కువగా ఉన్నప్పటికీ మిగతా లైన్లలో రద్దీ అయితే కొనసాగుతుంది.

ఎస్వీబీసీ చైర్మన్‌గా జర్నలిస్ట్ స్వప్న!!

శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) చైర్ పర్సన్ గా జర్నలిస్ట్ స్వప్నను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం స్వప్న ఎస్వీబీసీ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. కొద్ది రోజులుగా ఎస్వీబీసీలో వివాదాస్పద పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. లంచాలు తీసుకొని కొందరికి అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారని ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ పై ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు ఆయన ఓ మహిళా ఉద్యోగితో ఫోన్ లో శృంగార సంభాషణలు చేసినట్టు ఆడియో కలకలం రేపింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశం మేరకు.. ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం ఎస్వీబీసీ డైరెక్టర్‌గా ఉన్న స్వప్న.. ఆ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

హైదరాబాద్ పబ్ లో అశ్లీల నృత్యాలు.. 22 మంది యువతులు అరెస్ట్!

పబ్బులో గబ్బు పనులు చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు కొందరు యువత. మందు కిక్ లో ఉన్న యువకులకు మగువను ఎరగావేసి అసాంఘిక కార్యకలాపాలు జరుపుతున్న పబ్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు పోలీసులు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని టాట్ పబ్ లో ఆదివారం రాత్రి పోలీసులు చేసిన రైడ్ లో 22 మంది యువతులని అరెస్ట్ చేశారు. పబ్ లో అశ్లీల నృత్యాలు చేసినట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించి 22 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. పలువురు యువతీ, యువకులు పబ్ లో ఏర్పాటు చేసుకున్న పార్టీలో భాగంగా కొందరు యువతులను రప్పించి అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.  బంజారాహిల్స్ ఏసీపీ ఆదేశాలతో అక్కడికి చేరుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 22 మంది యువతులను అదుపులో తీసుకుని ప్రైవేట్ బస్ లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.  అయితే పోలీసులకు పట్టుబడిన యువతులు అర్థరాత్రి హల్ చల్ చేశారు. తాము పార్టీ చేసుకోవడానికి వచ్చామని.. తమను ఎందుకు వీడియోలు తీస్తున్నారని.. మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ ఫోన్ లను లాక్కొని క్రింద పడేశారు. కాగా సీడ్స్ కంపెనీకి చెందిన ఒక వ్యక్తి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. అయితే మొన్నటికి మొన్న నగరంలోని లిస్బన్ పబ్ వ్యవహారం కూడా బయటపెట్టారు పోలీసులు. పబ్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో రైడ్ చేసి పలువురు యువతీ యువకులను అరెస్ట్ చేశారు. అయితే ముఖ్యంగా పబ్ కి వచ్చే యువకులకు అమ్మాయిలను ఎరగా చూపించి వారి నుంచి భారీగా డబ్బులు తీసుకోని.. గర్ల్ ఫ్రెండ్ లేకుండా వచ్చే యువకులకు మందు మగువని చూపుతూ క్యాష్ చేసుకుంటున్నారు పబ్ నిర్వాహకులు.

హై పవర్ కమిటీ మూడవ సమావేశం.. తుది నిర్ణయం!

మూడు రాజధానుల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో హైపవర్ కమిటీ నేడు మూడో సారి సమావేశం కానుంది. ఇప్పటికే జీఎన్ రావు, బోస్టన్ కమిటీలపై చర్చించిన హైపవర్ కమిటీ సీఎం జగన్ తో సమావేశమై కీలక అంశాలపై మంతనాలు జరిపింది. నేటి మీటింగ్ లో చాలా అంశాల పై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. జనవరి చివరి నాటికి మూడు రాజధానుల ప్రక్రియను ఓ కొలిక్కి తెచ్చే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతుంది.అమరావతి రాజధాని మార్పుపై ఇప్పటికే హైపవర్ కమిటి రెండుసార్లు భేటి అయ్యింది. జనవరి 20 వ తేదీన ప్రభుత్వానికి నివేదిక అందించబోతున్నారు. ఆ తరువాత కేబినెట్ భేటీ, అనంతరం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఏపి రాజధానిపై తేల్చేసేందుకు సర్కారు రెడీ అవుతుంది.  ఈ సమయంలో ఒక వైపు అమరావతిలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు..మరో వైపు చంద్రబాబు జోలిపట్టి ఉద్యమము సాగిస్తున్నారు. ఇటువంటి పరిణామాలు ఏపీలో వేడి పెంచుతున్నాయి. ఈ తరుణంలో రాజధానిపై త్వరగా ఓ క్లారిటీ ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఏపి అసెంబ్లీలో జనవరి 20న ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సందర్భంగా హైపవర్ కమిటీ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాజధానితో సహా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణపై సభలో చర్చించే అవకాశముంది.  జనవరి 18 న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరుగుతుంది.  ఇప్పటికే జియన్ రావు కమిటి, బోస్టన్ గ్రూప్ నివేదికలు అందజేశాయి. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సమగ్రాభివృద్ధిపై అధ్యయనం చేసిన జీఎన్ రావు కమిటి వికేంద్రీకరణకే మొగ్గు చూపింది. ఒకేచోట అభివృద్ధి కేంద్రీకృతం అవ్వకూడదని అభిప్రాయ పడిన కమిటి రాష్ట్రాన్ని నాలుగు రీజియన్లుగా విభజించాలని సూచించింది. అసెంబ్లీ, హై కోర్టు, సచివాలయం ఏర్పాటుపై కీలక సూచనలు చేసింది. ఇటు మూడు రాజధానుల ప్రతిపాదనకు అనుకూలంగానే బోస్టన్ గ్రూప్ రిపోర్టు అందజేసింది. జియన్ రావు కమిటి , బీసీజీ రిపోర్ట్ లను అధ్యయనం చేసేందుకు కేబినెట్ మంత్రులతో నియమించిన హైపవర్ కమిటీ ఇవాళ మూడోసారి సమావేశం కానుంది. తొలి సమావేశంలో జియన్ రావు కమిటి , బీసీజీ ప్రతినిధులతో భేటీ అయిన హైపవర్ కమిటీ రెండో సమావేశంలో ఉద్యోగులకు కల్పించాల్సిన వసతులపై ప్రధానంగా చర్చించింది. కేబినెట్ భేటీలో నివేదిక అందజేసే దిశగా చర్యలు తీసుకుంటుంది. ఇక నేటి సమావేశంతో చాలా అంశాల పై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

రాష్ట్రాలు, రాజకీయాల గురించి కీలక చర్చలు... కేసీఆర్ తో జగన్ భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ నేడు భేటీ కానున్నారు. ఆ భేటీలో నీళ్ల పంపకాల అంశాలపైనే ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నా.. రాజకీయ అంశాలపై కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశముందని అంటున్నారు. మూడున్నర నెలల తరవాత జరుగుతున్న ఈ సమావేశంపై ఇరు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మూడున్నర నెలల క్రితం కృష్ణా ,గోదావరి నదుల అనుసంధానంపై జగన్ , కేసీఆర్ చర్చించారు, అధికారుల స్థాయిలోనే సంప్రదింపులు జరిగాయి. రెండు రాష్ట్రాల నుంచి ప్రణాళికలు రూపొందించారు. ఒక దానికి ఆమోద ముద్ర వేసి రెండు రాష్ట్రాల సమన్వయంతో ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించుకున్నారు. నదుల అనుసంధానంపై ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని గత సమావేశాల్లో అనుకున్నా.. అడుగు కూడా పడలేదు. ప్రతిపాదనలు దాదాపుగా అయిపోయినట్టేనని ప్రచారం జరిగింది. ఏపీ ప్రభుత్వం సొంతంగా నిర్మాణం కోసం ప్రతిపాదనలను సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో మరోసారి సమావేశం అవుతున్న సీఎంలు ఈ ప్రతిపాదనలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.  గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. మరో వైపు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యాన్ని 80,000 క్యూసెక్కులకు పెంచుతామని సీఎం జగన్ ప్రకటించారు. ఇవన్నీ కూడా భేటీలో చర్చిస్తారని సమాచారం. ఆయా రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్లేలా పరస్పర అంగీకారానికి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు విభజన చట్టంలోని అంశాలను.. షెడ్యూల్ 9 - 10 సంస్థల విభజన, ఉద్యోగుల విభజన, కార్పొరేషన్ లో ఉమ్మడి ఆస్తుల అంశాల పై జగన్ కేసీఆర్ చర్చించే అవకాశముంది. అటు కేంద్రం పట్ల అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు ముఖ్యమంత్రులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ద్రవ్యోల్బణం ఆర్థిక సంక్షోభం కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గిపోతున్నాయి. ఇవి సంక్షేమ పథకాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అటు సీఏఏ బిల్లుకు వైసీపీ మద్దతు తెలపగా..టీఆర్ఎస్ వ్యతిరేకించింది. అయితే ఎన్ఆర్సీ విషయాల్లో ఇరువురు వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని సీఏఏ , ఎన్ఆర్సీల పై తమ విధానం ప్రకటించే అవకాశముంది. ఇటీవల కేటీఆర్ తిరుమల పర్యటన తర్వాతే ఇరువురు ముఖ్యమంత్రుల సమావేశం ఖరారైనట్లుగా తెలుసింది. తిరుమలలో సీఎం జగన్ సన్నిహితులు మిథున్ రెడ్డితో కేటీఆర్ సమావేశమయ్యారు. ఇక ఈరోజు జరగబోయే భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.

ప్రమాదమా? ప్లాన్ చేశారా?.. యాక్సిడెంట్ లో నయీమ్ మేనకోడలు మృతి 

ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్యాంగ్ స్టర్ నయీమ్ మేనకోడలు సాజీదా షాహీనా (35) మృతి చెందారు. అయితే ఆ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లి అద్దంకి జాతీయ రహదారిపై ఈ యాక్సిడెంట్ జరిగింది. ముందుగా వెళ్తున్న ఓ లారీని ఓవర్ టేక్ చేసే సమయంలో యాక్సిడెంట్ జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. సన్నిహితుల గృహ ప్రవేశానికి వెళ్లి.. అక్కడి నుండి మిర్యాలగూడకు వెళుతుండగా ఆమె కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో కారు దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్లు గుర్తించారు అధికారులు.  ఈ ప్రమాదం నిజంగా లారీని ఓవర్ టేక్ చేసే సమయంలో జరిగిందా..? లేక ఎవరైనా కావాలనే చేసిన ప్రమాదమా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నయీమ్ ఎన్ కౌంటర్ అనంతరం పలు కేసుల్లో నిందితురాలిగా షాహీనా జైలుకు కూడా వెళ్లింది. షాహీనా పేరు మీద ఉన్న ఆస్తులు అన్ని నయీమ్  దందాలో భాగంగా షాహీనాను బినామీగా పెట్టినవేనని తెలుస్తుంది. ఈ ఆస్తుల పరంగా ఎన్నో వివాదాలు  ఉన్నాయి. ఆ వివాదాల్లో ఎవరైనా షాహీనాను హతమార్చాలనే ఉద్దేశంతో ఈ ప్రమాదానికి ప్లాన్ చేశారా..? అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.

తెలంగాణ రైతుపై ఏపీ మంత్రి దౌర్జన్యం.. బూతులు తిడుతూ దాడి!!

తెలంగాణకు చెందిన ఓ రైతుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మనుషులు దాడి చేశారనే వార్త వివాదాస్పదమవుతోంది. పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కంపెనీ.. తెలంగాణలో అనేక కాంట్రాక్టులు చేస్తోంది. వాటిలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బస్వాపూర్‌ రిజర్వాయర్‌ కూడా ఒకటి. అయితే తాజాగా పెద్దిరెడ్డి ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో.. ఓ రైతు తమ భూమిని తీసుకున్నందుకు పరిహారం చెల్లించాలని కోరాడు. దీంతో ఎవడ్రా నువ్వు అంటూ మంత్రి కోప్పడ్డాడు. మంత్రి గన్‌మెన్‌, కంపెనీ ఉద్యోగులు దుర్భాషలాడుతూ రైతుపై మూకుమ్మడిగా దాడి చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బస్వాపూర్‌ వద్ద 11.39 టీఎంసీల రిజర్వాయర్‌ నిర్మిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం.. భూ సేకరణలో భాగంగా.. బస్వాపూర్‌కు చెందిన ఉడుత సత్తయ్య, ఉడుత నర్సింహ, ఉడుత యాదయ్య కుటుంబాలకు చెందిన భూమిని పూర్తిగా స్వాధీనం చేసుకుంది. కానీ, నష్టపరిహారం మాత్రం పూర్తిగా చెల్లించలేదు. మరో 21 ఎకరాల భూమికి నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంది. ఆ పరిహారం కోసం నిర్వాసితులు రెండు, మూడేళ్లుగా అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. కళ్లు కాయలు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే, అధికారుల నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు.  దీంతో.. పరిహారం చెల్లించే వరకు ప్రాజెక్ట్ పనులు చేయనివ్వకుండా అడ్డుకోవాలని నిర్వాసితులు నిర్ణయించుకొని.. ఆదివారం ఉదయం పనులు చేస్తున్న ప్రదేశానికి వెళ్లారు. అప్పుడే నిర్మాణ సంస్థకు చెందిన పెద్దిరెడ్డి అక్కడికి వచ్చారు. ఆయనను గుర్తించిన నిర్వాసిత రైతు కుమారుడు రవి.. ‘సార్‌! మాకు నష్టపరిహారం చెల్లించలేదు.. మా భూమిలో పనులు నిలిపివేయండి’ అని కోరాడు. దాంతో మంత్రి.. ‘‘ఎవడ్రా నువ్వు.. పనులు నిలిపివేయమనడానికి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మంత్రి గన్‌మెన్‌ మరియు సంస్థకు ఉద్యోగులు రైతుని పిడిగుద్దులు గుద్దుతూ.. నానా దుర్భాషలాడుతూ వంద అడుగుల దూరం ఈడ్చుకువెళ్లారు. నిస్సహాయ స్థితిలో ఆ రైతు తన చేతికి అందిన మట్టి పెడ్డను విసిరాడు. దాంతో, ప్రాజెక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న శశి అనే వ్యక్తి చెవికి గాయమైంది. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా, తమ భూమికి న్యాయంగా రావాల్సిన పరిహారం కోరితే దాడికి పాల్పడి దౌర్జన్యం చేశారని బాధిత రైతు రవి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. మంత్రికి చెందిన కంపెనీ ఉద్యోగిపై మట్టి పెడ్డతో దాడి చేసినందుకు.. నీపైనే కేసు పెడతారు అంటూ రైతుని బెదిరించినట్లు సమాచారం.

దేవుడు ఉన్నాడు అనడానికి పృథ్వీరాజ్ ఎపిసోడ్ సాక్ష్యం!!

శ్రీవెంకటేశ్వర భక్తి చానల్‌(ఎస్వీబీసీ) చైర్మన్‌ పదవికి నటుడు పృథ్వీరాజ్‌ రాజీనామా చేశారు. గత కొద్దిరోజులుగా పృథ్వీరాజ్‌ ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. రాజధాని అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులు అంటూ కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా.. రైతులు బురదలో ఉండాలి తప్ప.. ప్యాంట్లు, బంగారం వేసుకుంటారా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో సొంత పార్టీ నేత నుండే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. వైసీపీ నేత పోసాని కృష్ణమురళి.. పృథ్వీరాజ్‌ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులకు, మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయినా పృథ్వీరాజ్‌ క్షమాపణలు చెప్పలేదు.. వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులేనంటూ..మళ్లీ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. పృథ్వీరాజ్‌ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్వీబీసీ చైర్మన్‌గా పృథ్వీరాజ్‌ను నియమించింది. అయితే ఎస్వీబీసీలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులను తొలగించి అక్రమ నియామకాలకు పాలపడినట్టు తెలుస్తోంది. ఆలా అక్రమంగా నియమించిన 36 మందిని తొలగించినట్లు టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి అంగీకరించారు.  అంతేకాదు ఓ మహిళ ఉద్యోగినితో పృథ్వీ రాజ్ మాట్లాడినట్లు చెప్తున్న శృంగార సంభాషణల ఆడియో కూడా వెలుగులోకి వచ్చింది.  ‘‘పడుకునేటప్పుడు గుర్తొచ్చానా? మార్చి వరకు మందు తాగను. నేను తాగడం మొదలుపెడితే నీతోనే మొదలుపెడతా. వెనక నుంచి పట్టుకుందామనుకున్నా. కెవ్వు మని అరుస్తావని భయపడ్డా. నువ్వు నా గుండెల్లో ఉన్నావ్‌. ఐ లవ్‌ యూ’’ అని పృథ్వీరాజ్‌ మాట్లాడినట్టు ఆ ఆడియోలో ఉంది. ఆ ఆడియో వైరల్ కావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పవిత్రమైన పదవిలో ఉంటూ ఇవేం పనులంటూ నెటిజనులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో ఎస్వీబీసీ చైర్మన్‌ పదవి నుంచి తప్పుకోవాలని.. సుబ్బారెడ్డి సూచించగా పృథ్వీరాజ్ హైదరాబాద్‌ లో ప్రెస్‌మీట్‌ పెట్టి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.   అయితే పృథ్వీరాజ్‌ మాత్రం తనకి ఏ పాపం తెలియదు అంటున్నారు. "నా మీద లేనిపోనివి పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. అది నా గొంతుకాదు.. ఫేక్‌ ఆడియో. నేను పద్మావతి అతిథిగృహంలో మందు తాగానని, డబ్బులు తీసుకుని ఉద్యోగాలిచ్చానని వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్‌ విచారణకు సిద్ధం. రుజువైతే నన్ను చెప్పుతో కొట్టండి. అమరావతి రైతుల పట్ల నా మాటలను వక్రీకరించారు. అందరినీ క్షమాపణలు కోరుతున్నా." అని పృథ్వీ చెప్పుకొచ్చారు.   పృథ్వీ రాజ్ ఎపిసోడ్ ని చూసిన కొందరు... దేవుడు ఉన్నాడని అనడానికి ఇదే సాక్ష్యం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. రైతుల గురించి తప్పుగా మాట్లాడిన పృథ్వీ అసలు బాగోతాన్ని.. ఆ శ్రీనివాసుడు రెండు రోజుల్లోనే బయటపెట్టాడంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు.

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే అరెస్ట్!!

రాజధానిని అమరావతి నుండి తరలించవద్దని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి టీడీపీ, జనసేన వంటి పార్టీలు అండగా నిలుస్తున్నాయి. ఇదిలా ఉంటే అధికార పార్టీ వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే మాత్రం రాజధానిగా అమరావతి వద్దంటూ ఆందోళన చేపట్టారు.   రాజధానిగా అమరావతి వద్దని, అధికార వికేంద్రీకరణ జరిగి, సమగ్ర అభివృద్ధి జరిగితేనే ఏపీ అన్ని రంగాల్లో ముందంజ వేస్తుందని చెబుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈరోజు ఉదయం గుంటూరు జిల్లా పెనుమాక నుంచి తాడేపల్లి భరతమాత విగ్రహం వరకు భారీ ర్యాలీ తలపెట్టారు. అయితే ఆయనను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. భారీ సంఖ్యలో మద్దతుదారులతో ఆయన బయలుదేరగా.. ఈ ప్రాంతంలో ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు తొలుత హెచ్చరించారు. అయినా వినకపోవడంతో... నిషేధాజ్ఞలను ఉల్లంఘించారంటూ ఆర్కేను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌ కు తరలించారు. ఆయనకు మద్దతుగా వచ్చిన స్థానిక వైసీపీ నాయకులను కూడా పోలీసులు స్టేషన్ కు తరలించారు.

ద్వారంపూడి... నీకెందుకంత బలుపు? నీకున్న ప్రజాబలమెంత?

ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి... కాకికాడ సిటీ ఎమ్మెల్యే... రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు... రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి ప్రజానాయకుడు అనుకునేరు... కానే కాదంటున్నారు ప్రత్యర్ధులు... ఎందుకంటే, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ప్రజల్లో మంచి పేరూ లేదు... కనీసం గుర్తింపూ లేదని చెబుతున్నారు... రెండుసార్లూ కూడా కేవలం ఆయా పార్టీల గాలి... అధినేతల అండదండలతో మాత్రమే గెలిచాడని... ద్వారంపూడి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడున్న పరిస్థితులను గమనిస్తే ఎవరికైనా ఈజీగా అర్ధమవుతుందంటున్నారు... 2009లో మొదటిసారి కాకినాడ సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ద్వారంపూడికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గాలి కలిసొచ్చిందని చెబుతున్నారు. వైఎస్ జగన్ అండదండలతో ...అప్పటివరకు కాకినాడ సిటీ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ గా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ముత్తా గోపాలకృష్ణను కాదని టిక్కెట్ దక్కించుకున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి... బ్రహ్మాండమైన వైఎస్ గాలిలో సైతం కేవలం 9వేల మెజారిటీ మాత్రమే తెచ్చుకోగలిగాడని అంటున్నారు. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరపున పోటీచేసి ఘోర ఓటమి చవిచూసిన ద్వారంపూడి... 2009లో మూడో స్థానానికి పరిమితమైన టీడీపీ అభ్యర్ధి చేతిలో ఏకంగా 24వేల భారీ తేడాతో పరాజయం పాలయ్యాడు. ఇక, ఇప్పుడు అంటే, 2019లో మరోసారి వైసీపీ నుంచి పోటీచేసిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి... వైఎస్ జగన్ ప్రభంజనంలో సైతం కేవలం 14వేల మెజారిటీ మాత్రమే తెచ్చుకోగలిగాడు. 2009లోను, 2019లోనూ ద్వారంపూడికి వచ్చిన మెజారిటీ మంచి మెజారిటీగానే పైకి కనిపిస్తున్నా.... అది కేవలం సాధారణ గెలుపుగానే పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే, మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి... అనామకులను నిలబెట్టినా కనీసం  పాతికవేలు మెజారిటీ వచ్చింది. వైఎస్ జగన్ ను చూసే ఓట్లు గుద్దేశారు ప్రజలు. కానీ, కాకినాడ సిటీ వరకు వచ్చేసరికి తేడా స్పష్టంగా కనిపించింది. జగన్ సునామీలో సైతం 14వేల మెజారిటీ మాత్రమే తెచ్చుకోగలిగాడు. అంటే, ద్వారంపూడి ప్రజాబలమున్న నాయకుడు కానే కాదని... కేవలం ఆయా పార్టీల గాల్లో గెలుస్తూ రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాడని అంటున్నారు. అలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి... ప్రజాబలమున్న నాయకుడు, దేశంలోనే సీనియర్ పొలిటీషన్, పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి, పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసి, ప్రస్తుతం ఏపీ అపోజిషన్ లీడర్ గా కొనసాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై నోటికొచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పార్టీలకతీతంగా ప్రజలు మండిపడుతున్నారు. ద్వారంపూడికి నోరా? లేక పెంటకుప్పా అంటూ విరుచుకుపడుతున్నారు.

ద్వారంపూడీ... నీది నోరా? పంది బురదా?

పక్కనే మహిళా ఎంపీ ఉన్నారనే స్పృహ లేదు. కనీసం తానొక ఎమ్మెల్యేనన్న సంగతి కూడా మర్చిపోయాడు. పబ్లిక్ లో మాట్లాడుతున్నాను... ప్రజలందరూ వింటున్నారనేదీ విస్మరించాడు. పంది బురద మాదిరిగా ఇంకితం కూడా లేకుండా చెలరేగిపోయాడు కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. రౌడీలు, పోకిరీలు, ఆవారాగాళ్లు, తాగుబోతులు, చిల్లరగాళ్లు సైతం సిగ్గుపడేలా నోటికి హద్దూ అదుపూ లేకుండా పచ్చి బూతులతో రెచ్చిపోయాడు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి, పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసి, తెలుగు రాష్ట్ర రాజకీయాలతోపాటు ఇండియన్ పాలిటిక్స్ లోనే కీలక పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై నోటికొచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తన తండ్రిలాంటివాడు... 70ఏళ్లు వయసున్న పెద్దమనిషనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా బూతులతో చెలరేగిపోయాడు. రాయలేని భాషలో... అసలేమన్నాడో చెప్పలేనివిధంగా చంద్రబాబుపై నోరు పారేసుకున్నాడు ద్వారంపూడి. (ల-జ-కొడకా, ఎధవా, దొంగనా కొడకా-అంటూ) పందులు సైతం సిగ్గుపడేలా నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ముసలోడు మళ్లీ లెగకూడదు... ఆ ఎదవను కొట్టాలని ఉందంటూ తాగుబోతు మాదిరిగా రెచ్చిపోయాడు. ద్వారంపూడి మాటలకు పక్కనే ఉన్న మహిళా ఎంపీ వంగా గీత సైతం అవాక్కై... నోటిపై చేయి అడ్డుపెట్టుకున్నారంటే... ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏ స్థాయిలో రెచ్చిపోయాడో అర్థంచేసుకోవచ్చు.  ఒక్క చంద్రబాబుపైనే కాదు... ఆయన కుమారుడు.... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైనా అనుచిత వ్యాఖ్యలు చేశాడు ద్వారంపూడి. వాడు పప్పు లోకేష్... వాడికి కొవ్వు కరిగేలా కొట్లాలి... బుద్ధి చెప్పాలంటూ నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ఇక, జనసేనాని పవన్ కల్యాణ్ పైనా చెలరేగిపోయాడు. ఇష్టానుసారంగా తిడుతూ ఏదిపడితే పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు. పవన్ కల్యాణ్ ఒక దొంగనా కొడుకంటూ రెచ్చిపోయాడు. అంతేకాదు లంజ చేసే పనులన్నీ పవన్ చేస్తున్నాడంటూ అసభ్య పదజాలంతో సభ్యతా సంస్కారం లేకుండా మాట్లాడాడు.    పందులు, కుక్కలు సైతం సిగ్గుపడేలా సభ్యత సంస్కారం వదిలేసి, తానొక ఎమ్మెల్యేనన్న సంగతి కూడా మర్చిపోయి, అధికార పార్టీలో ఉన్నాననే అహంకారంతో... దేశంలోనే సీనియర్ పొలిటీషియన్, పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుపై నోటికొచ్చినట్లు పచ్చి బూతులు తిట్టడంపై పార్టీలకతీతంగా తప్పుబడుతున్నారు. ద్వారంపూడి అసలు మనిషేనా అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి వాళ్లను ముఖ్యమంత్రి జగన్ కూడా ఉపేక్షించకూడదని సూచిస్తున్నారు. ఒకవేళ ద్వారంపూడి లాంటి లీడర్లను జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తే.... తగిన మూల్యం తప్పక చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.