భారత్ లో 11 లక్షలు దాటిన కరోనా కేసులు
భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 40,425 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అదే సమయంలో 681 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,18,043 కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 27,497 కి చేరింది. నిన్న ఒక్కరోజే 22,664 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 7,00,087 మంది కోలుకోగా, ప్రస్తుతం 3,90,459 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య కోటి 46 లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,46,44,360 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 6,01,911 మంది మృతి చెందారు.