రాఫెల్ రఫ్పాడిస్తే
రాఫెల్, జె 20, ఎఫ్ 16 దేని సామర్ధ్యం ఎంత
28 జూలై 1914 మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన రోజు. సరిగ్గా అదే రోజు మరో యుద్ధానికి సిద్ధం అంటూ రాఫెల్ ఫైటర్ జెట్స్ గగనతలంలో భారత్ దిశగా దూసుకువచ్చాయి. యుద్దం అంటేనే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడం. ఈ సారి యుద్ధం అంటూ వస్తే అది మూడో ప్రపంచయుద్దమే అవుతుందని అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు భారత్ అమ్ములపొదిలో చేరిన రాఫెల్ తో చైనాను గెలవడం సాధ్యమా అంటూ విమర్శిస్తున్నారు. అయితే తన సైన్యాన్ని సరిహద్దుల వెంట మోహరించడంతోపాటు పాకిస్తాన్ ను కూడా ఉసికొల్పుతోంది డ్రాగన్ కంట్రి. ఈ రెండు దేశాల వెన్నులో రాఫెల్ వణుకు పుట్టించిన సంగతి వాస్తవమే అయినా అది ఒప్పుకోవడానికి, ఆ దేశాలకు, వాటికి వత్తాసు పలికే మరికొందరికీ సాధ్యం కావడం లేదు. మరి యుద్ధం అంటూ వస్తే మన వైమానిక దళంలో చేరిన రాఫెల్ జెట్ ను ధీటుగా ఎదుర్కోగల యుద్ధ విమానాలు చైనాతో, పాక్ తో ఉన్నాయా వారి వద్ద ఉన్న అత్యంత ఆధునిక యుద్ధ విమానాల గురించి తెలుసుకుంటూ రాఫెల్ తో వాటిని పోల్చిచూస్తే మన సత్తా ఎంటో స్పష్టమవుతుంది.
రాఫెల్ వచ్చిన తరువాత, భారత వైమానిక దళం బలం అమాంతం పెరుగుతుందని, పాకిస్తాన్ ఎఫ్ -16 , చైనా జె -11 కన్నా రాఫెల్ మరింత శక్తి వంతమైనదని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా, పాకిస్తాన్ కలిసి యుద్ధానికి వచ్చినా మన రాఫెల్ ను ఎదిరించే సత్తా వారికి లేదని నిపుణులు స్పష్టంగా చెప్తున్నారు. అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో తయారు చేసిన రాఫల్ ఒకేసారి 8 శత్రు స్థావరాలపై నిఘా ఉంచగలదు. అంతేకాదు శత్రు స్థావరాలను కనిపెట్టి వాటిపై దాడి చేసి నామరూపాలు లేకుండా చేస్తుంది. అమెరికా నుంచి పాకిస్తాన్ గతంలో కొనుగోలు చేసిన ఎఫ్ 16 యుద్ధ విమానాలు రెండు ఒక రాఫెల్ కు సమానమని ఒక అంచనా.
ఈ మూడు యుద్ధ విమానాల గురించి తెలుసుకుంటే యుద్ధంమంటూ వస్తే ఎవరిది పై చేయి అవుతుందో స్పష్టంగా తెలుస్తుంది.
రాఫెల్ ఫ్రాన్స్ తయారు చేసిన యుద్ద విమానం. ట్విన్ ఇంజన్, 4.5 జనరేషన్, స్పీడ్ 2130, సర్వీస్ సీలింగ్ 15,235 మీటర్లు, అత్యంత ఆధునిక రాడార్ వ్యవస్థ ఇందులో ఏర్పాటు చేశారు. శత్రు కదలికలను ట్రాక్ చేస్తూ, వాటిని ట్రేస్ చేయడంతో పాటు నాశనం చేయడంలో అత్యంత చురుగ్గా పనిచేస్తుంది. రాఫెల్ నిర్మాణ ఖర్చులో 30శాతం రాడార్ వ్యవస్థ, కమ్యూనికేషన్ వ్యవస్థ కోసమే ఖర్చు చేశారు. ఈ ఫైటర్ జెట్ లో సాంకేతిక వ్యవస్థ అత్యంత ఆధునికం. 360 యాంగిల్స్ లో శత్రు కదలికలపై కన్నేసి ఉంచుతుంది. రెండు మిస్సైల్స్ ను 150,200 మీటర్ల లక్ష్యంతో ప్రయోగించగలదు. 33ఎంఎం కానోన్ తో 125రౌండ్స్ ఆయుధాలను ప్రయోగిస్తుంది. మిస్సైల్స్ ను 4220రేంజ్ లక్ష్యాన్నిఛేదిస్తుంది. అన్నింటికి మించి ఇది మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్.
ఎయిర్ టూ ఎయిర్, ఎయిర్ టూ ల్యాండ్, ఎయిర్ టూ సర్పెస్ పైకి ఆయుధాలను ప్రయోగిస్తుంది. ఆత్మరక్షణ వ్యవస్థతో పనిచేసే సెన్సార్ టెక్నాలజీ ఇందులో ఏర్పాటుచేశారు.
చెంగ్డూ జె-20
చైనాతయారు చేసిన యుద్ధ విమానం. అధికారికంగా చైనా ప్రకటించకపోయినా ఈ విమానం అమెరికా ఎఫ్ 22 నుంచి ఇన్ స్పైర్ అయి తయారు చేసినట్లు అంచనా. 5జెనరేషన్ అని చైనా చెబుతోంది. సింగిల్ ఇంజన్, స్పీడ్ 2,223, సర్నీస్ సీలింగ్ 20వేల మీటర్లు, చాలా శక్తివంతమైన రాడార్ వ్యవస్థ ఇందులో ఉందని చైనా చెపుతున్నా అందుకు ఎలాంటి ఆధారాలు మాత్రం లేవు. అయితే చైనా శాటిలైట్స్ ద్వారా వచ్చే సిగ్నల్స్ ఆధారంగా పైలెట్ ముందుకు వెళ్తారట.
ఎఫ్ 16
అమెరికా నుంచి గతంలోనే పాకిస్తాన్ ఈ యుద్ధ విమానాన్ని కొనుగోలు చేసింది. సింగిల్ ఇంజన్, స్పీడ్ 1500, సర్వీస్ సీలింగ్ 15,240 మీటర్లు, 20 ఎంఎం కానున్, మిస్సైల్ 3700రేంజ్ లో మాత్రమే స్ట్రైక్ గా ప్రయోగించగలుగుతాయి.
చైనా తయారు చేసిన చెంగ్డూ జె 20 యుద్ధ విమానం ఫిత్త్ జెనరేషన్ అని చెప్తున్నా అందుకు సంబంధించిన వాస్తవాలు బయటకు రాలేదు. అయితే ఇటీవల లాసా వద్ద జె 20ని సుఖాయ్ 30 ట్రాక్ చేసిందని సమాచారం. ఒకవేళ చైనా అమెరికా తయారు చేసిన ఫిత్త్ జెనరేషన్ ఎఫ్ 22 ఇన్సిరేషన్ గా తీసుకుని తయారు చేసింది వాస్తవమే అయితే రాఫెల్ చేతికి చిక్కాల్సిందే. గతంలో ఎఫ్ 22ను రాఫెల్ జెట్ ఫ్లైట్ పిక్ చేయగలిగిందని పరిశోధకులు చెబుతారు.
ఇక ఎఫ్ 16 విషయానికి వస్తే పాకిస్తాన్, భారత్ సరిహద్దుల్లో బాలాకోట్ వద్ద జరిగిన సంఘటనలో ఎఫ్ 16ను భారత వైమానిక దళం లోని మిగ్ 21 కూల్చివేసిందని అనధికార సమాచారం. అరవై ఏండ్ల కిందట తయారైన మిగ్ 21 దాడిలో నేలకొరిగిన ఎఫ్ 16 రాఫెల్ రఫ్పాడిస్తే తట్టుకుంటుందా..
అన్నింటి కన్నా మరో ముఖ్యమైన విషయం గతంలో జరిగిన ఎన్నో యుద్ధాల్లో రాఫెల్ తన సత్తా నిరూపించుకుంది. ఘనమైన పోరాట చరిత్ర రాఫెల్ సొంతం. గత దశాబ్దకాలంలో ప్రపంచవ్యాప్తంగా రాఫెల్ కు తిరుగులేదు. భారత్ చైనా, పాక్ సరిహద్దుల్లో యుద్ధం అంటూ వస్తే శత్రు దేశాలకు కఠినమైన గుణపాఠం చెప్పాలన్న భారత్ ఆశ రాఫెల్ ద్వారా తీరుతుందని ఆశిద్దాం.