జగన్ తో సంబంధం లేదు! షర్మిల 

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. లోటస్ పాండ్ లోని తన నివాసంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన షర్మిల.. తన పార్టీ గురించి సంచలన విషయాలు చెప్పారు వైఎస్ షర్మిల. తాను పార్టీ పెట్టడం మా అన్నకు ఇష్టం లేదన్నారు. అయినా మా అనుబంధాల్లో తేడాలుండవని తెలిపారు. మాటలు,  అనుబంధాలు, రాఖీలు ఉంటాయన్నారు. తమ మధ్య ఉన్నవి విబేధాలో భిన్నాభిప్రాయాలో తనకు తెలియదని చెప్పారు షర్మిల. తనకు పదవి ఎందుకు ఇవ్వలేదో జగన్‌నే అడగాలన్నారు. పార్టీ వేరు.. ప్రాంతం వేరైనా.. అన్నా చెల్లెళ్లుగా  తామెక్కటే అన్నారు.  తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు షర్మిల. విజయశాంతి, కేసీఆర్ ఇక్కడి వారా అని ప్రశ్నించారు. జయలలిత కూడా తమిళనాడు వాసి కాదని చెప్పారు. తనకు హైదరాబాద్ తో విడదీయరాని బంధం ఉందన్నారు షర్మిల. తాను తెలంగాణ కోడలినని షర్మిల స్పష్టం చేశారు. దేవుడి దయతో తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ వచ్చాక ప్రజల సమస్యలు తీరలేదన్నారు. అమరవీరుల ఆశయాలు నెరవేరలేదన్నారు.ఉద్యమంలో  లేనంత మాత్రాన.. తెలంగాణపై తనకు ప్రేమ ఉండదా  అని  షర్మిల ప్రశ్నించారు. అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ వాళ్ల గడపకు వెళ్లి వస్తానని చెప్పారు. తనకు అమ్మ విజయమ్మ మద్దతు ఉందని తెలిపారు వైఎస్ షర్మిల. 

నిరశన అస్త్రంగా నామినేషన్లు

ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి  నామినేషన్ల ఘట్టంలోనే అధికార తెరాసకు నిరసన సెగలు తాకాయ అంటే అవుననే అంటున్నారు నిరుద్యోగ  పట్ట భద్రులు. నామినేషన్ల చివరి రోజు  అధికార పార్టీ అభ్యర్ది పల్లా రాజేశ్వర రెడ్డితో సహా మొత్తం 28 మంది నామినేషన్’ దాఖలు చేశారు. అలాగే, మొత్తంగా నామినేషన్లు ముగిసే సమయానికి 76 మంది నామినేషన్ దాఖలు  చేశారు.  గత ఎన్నికలలో 22 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ఈ సారి ఎన్నికల్లో అంతకు మూడున్నర రెట్లు మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.ఈరోజు నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉసంహరణకు ఈ నెల 26 ఆఖరు తేదీ, సో ... ఆపాటికి గానీ చివరకు ఎంత మంది బరిలో మిగులుతారు అనేది తేలదు.  అయితే ఇంత పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు కావడానికి కారణం నిరుద్యోగ పట్టభద్రుల్లో ప్రభుత్వ పట్ల పెల్లుబుకుతున్నవ్యతిరేకతే కారణమని అంటున్నారు. గతంలో నిజామాబాద్ లో పసుపు రైతులు ప్రభుత్వ విధానాల పట్ల తమా వ్యతిరేకతను, ఆగ్రహాన్ని అధిక సంఖ్యలో నామినేషన్లు  దకాహాలు చేయడం ద్వారా వ్యక్త పరిచారు. ఇప్పడు కూడా, తెలంగాణ ఉద్యమానికి మూల కారణాల్లో ఒకటైన నియామకాల విషయంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని చెప్పేదుకే ఇంట పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యుకలు నామినేషన్లు వేశారు. నామినేషన్ వేసిన వారంతా పోటీకి నిలుస్తారా లేదా అనేది పక్కన పెడితే నిరుద్యోగ యువతలో రగులుతున్న వ్యతిరేకతకు మాత్రం ఇదొక నిదర్శనంగా భావించవచ్చును

పోలీసుల వల్లే బీఫార్మసీ విద్యార్థిని చనిపోయిందా?

బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య ఘటన హెచ్ఆర్సీకి చేరింది. హైకోర్టు న్యాయవాది అరుణ్‌కుమార్ పోలీసులపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు. అమ్మాయి జీవించే హక్కు కోల్పోయేలా పోలీసులు ప్రవర్తించారని తప్పుబట్టారు. కిడ్నాప్‌ ఘటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి.. ప్రెస్‌మీట్‌లు పెట్టడం వల్ల విద్యార్థిని మానసికంగా కృంగిపోయిందని తెలిపారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు. పోలీసుల తొందరపాటు చర్యల వల్ల విద్యార్థిని జీవించే హక్కును కోల్పోయిందని ఆయన అన్నారు. ముద్దాయిలు అని పోలీసులే చెప్పి.. ఆ తర్వాత వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు కేసు విషయాలన్నీ పూస గుచ్చినట్టు చెప్పడంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యాయని, వాటిని చూసి భరించలేక షుగర్ టాబ్లెట్‌లు వేసుకొని విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. యువతి ఆత్మహత్యకు పోలీసులే బాధ్యులని, వారిపై చర్యలు తీసుకోవాలని లాయర్ అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు.   

తెలంగాణలో ఉద్యోగాల్లేవ్.. విద్యార్థులకు అక్కలా ఉంటా.. 

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల దూకుడుగా ముందుకు వెళుతున్నారు. పార్టీ ఏర్పాట్లపై రోజూ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ విధివిధానాలు, భవిష్యత్ వ్యూహాలపై వివిధ వర్గాలకు చెందిన ప్రముఖలతో ఆమె చర్చలు జరుపుతున్నారు. దీంతో లోటస్ పాండ్ లోని షర్మిల నివాసం నిత్యం సందడిగా మారుతోంది. తనను కలిసేందుకు వస్తున్న నేతలతో మాట్లాడుతున్నారు. బుధవారం విద్యార్థులతో సమావేశమయ్యారు షర్మిల. పార్టీ ఏర్పాట్లపై వారితో మాట్లాడారు.  విద్యార్థులతో జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. మీ అక్కగా సమాజాన్ని బాగు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో ఎంతో మంది ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. తెలుగు ప్రజలను రాజశేఖర్ రెడ్డి గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని, డబ్బు లేని కారణంగా ఏ పేద విద్యార్థి చదువు ఆగి పోవద్దని ఆయన భావించారన్నారు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా వెయ్యి కడితే మిగతా ఫీజులు ప్రభుత్వం భరించేదని చెప్పారు. వైఎస్సార్ తీసుకొచ్చిన పథకం ద్వారా.. ఎంతో మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. వాళ్లంతా ఎప్పటికీ రాజశేఖర్ రెడ్డిని గుర్తు పెట్టుకుంటారన్నారు. ప్రతి జిల్లాకు యూనివర్సిటీ తెచ్చిన ఘనత వైఎస్ఆర్‌కు దక్కుతుందన్నారు వైఎస్ షర్మిల.   

జయ జ్ఞాపకాల్లో విజయ..

అమ్మా, మీరెక్కడో రాజకుమార్తెగా మళ్లీ జన్మించే ఉంటారు. అంటూ జయలలిత జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకున్నారు బీజేపీ నాయకురాలు విజయశాంతి. మీ స్నేహం, అభిమానం, ఆప్యాయత తీపి గుర్తులుగా అలాగే ఉంటాయని ఆమె వ్యాఖ్యానించారు. పిబ్రవరి 24  తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత జయంతిసందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ, 'అమ్మా... మీరెక్కడో రాజకుమార్తెగా మళ్ళీ జన్మించే ఉంటారు. అయినప్పటికీ మాకందరికీ తెలిసిన రోజుగా మీకివే పుట్టినరోజు శుభాకాంక్షలు. అంటూ మీరు పంచిన స్నేహం, అభిమానం, ఆప్యాయత నాకు జీవితకాలపు కానుకలుగా  తీపి గుర్తులుగా ఎప్పటికీ అలాగే ఉంటాయి. అంటూ విజయశాంతి జయలలిత ఉన్న ఫోటోను షేర్ చేస్తూ,మత తీవ్రవాదుల హిట్ లిస్టులో నేను ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల పాటు నా భద్రత కోసం మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. విప్లవ నాయకి జయలలితకు ప్రియమైన చెల్లెలు, ప్రచారంలో ఫిరంగి అంటూ మీరు నాకిచ్చిన గౌరవప్రదమైన పిలుపులు ఈ జన్మంతా జ్ఞాపకాలుగా మిగిలే ఉంటాయి' అని విజయశాంతి  ట్వీట్ చేశారు. 

విష్ణు రెడ్డిపై చెప్పుతో దాడి.. వైసీపీలో ఉలికిపాటు!

బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పుతో దాడి. పెయిడ్ ఆర్టిస్ట్ అన్నందుకు అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాస్ కాలి చెప్పుతో విష్ణును కొట్టారు. మామూలుగానైతే ఈ ఘనపై బీజేపీ నేతలంతా భగ్గుమనాలి. తమ నేతపై దాడి జరిగినందుకు ఊరూరా ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తించాలి. కానీ అలా జరగలేదు. విష్ణవర్థన్ రెడ్డిపై చెప్పుతో దాడి జరిగినా బీజేపీ శ్రేణులూ పెద్దగా పట్టించుకోలేదు. కాని వైసీపీలో మాత్రం ఉలికిపాటు కనిపిస్తోంది. అధికార పార్టీ నేతలెవరు బహిరంగంగా కామెంట్ చేయకపోయినా.. వైసీపీ కేడర్ మాత్రం సోషల్ మీడియాలో ఎదో జరిగినట్లుగా తెగ హైరానా చేస్తోంది. విష్ణు రెడ్డిపై జరిగిన దాడిని ఘోరం, దారుణం అంటూ ఆవేశానికి పోతున్నారు జగన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు.  సింపుల్ గా ఇద్దరు బీజేపీ నేతలు దాడి ఘటనను ఖండించారు. సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి తప్పక స్పందించాల్సిన పరిస్థితి. విష్ణువర్ధన్ రెడ్డిపై దాడిని ఖండిస్తూ ఓ వీడియో మెసేజ్ రిలీజ్  చేశారు వీర్రాజు. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ సైతం విష్ణుపై దాడిని తప్పుబట్టారు. అంతే. ఇంతకు మించి బీజేపీ వర్గాల నుంచి పెద్దగా స్పందన రాలేదు. కానీ వైసీపీ శ్రేణులు మాత్రం శ్రీనివాస్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులతో నానా రచ్చ చేస్తున్నారు. శ్రీనివాస్ ను టీడీపీతో లింకు కలుపుతూ విమర్శలు చేస్తున్నారు. తన పార్టీ నేతపై దాడి జరిగినా బీజేపీ నేతలే పెద్దగా పట్టించుకోకపోగా.. ఫ్యాన్ పార్టీ కేడర్ ఆవేశంతో ఊగిపోవడం చర్చగా మారింది. విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పుతో దాడి ఘటన తర్వాత.. ఎవరు పెయిడ్ ఆర్టిస్టులో.. ఎవరు ఎవరికి పెయిడ్ ఆర్టిస్టులో అనే చర్చ జోరుగా సాగుతోంది. విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ ముసుగులో ఉన్న వైసీపీ నేత అనే విమర్శ ఉంది. అతను ఎప్పుడు, ఏ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినా.. ఏ టాపిక్ వచ్చినా, అందులో వైసీపీ తప్పేమీ లేదన్నట్టు మాట్లాడుతారని అంటారు. అధికార వైసీపీ కంటే ప్రతిపక్ష టీడీపీనే టార్గెట్ చేస్తుంటారు. ఏ అంశం చర్చకు వచ్చినా.. అందులోకి చంద్రబాబును లాగి విమర్శిస్తుంటారని విష్ణువర్ధన్ రెడ్డిపై విమర్శలు ఉన్నాయి. ఆయన తీరును గమనించే వారంతా అధికార వైఎస్సార్ సీపీకి పెయిడ్ ఆర్టిస్టు అని చెబుతూ ఉంటారు. విష్ణుతో పాటు సోము వీర్రాజు, జీవీఎల్ లు సైతం వైసీపీని సమర్థించే బీజేపీ నేతలని టాక్. బీజేపీ, వైసీపీ మధ్య లోపాయికారి పొత్తు ఉందని.. అందుకే ఈ ముగ్గురు దాదాపు అన్ని విషయాల్లో వైసీపీని వెనకేసుకు వస్తుంటారని చెబుతుంటారు. వైసీపీతో అంటకాగిన అలాంటి వ్యక్తి.. రాజధాని కోసం 400 రోజులకు పైగా పట్టుసడలని పోరాటం చేస్తున్న జేఏసీ నేతను పట్టుకొని పెయిడ్ ఆర్టిస్టు అనడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి తీరును సహించలేక కొలికపూడి శ్రీనివాస్ పట్టరాని ఆవేశంతో అలా చెప్పుతో దాడి చేశారని చెబుతున్నారు.  చెప్పుతో దాడి జరిగినా బీజేపీ వర్గాల నుంచి పెద్దగా రియాక్షన్ రాకపోవడానికి ఇదే కారణమంటున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి తీరుపై పార్టీలో ఉన్న వ్యతిరేకతే కారణమని తెలుస్తోంది. బీజేపీ నేతగా ఉంటూ.. టీవీ డిబేట్లలో వ్యక్తి గత ఎజెండా ప్రకారం మాట్లాడుతుండటం.. వైసీపీకి అనుకూలంగా ఉండటం.. సొంత పార్టీలో చాలా మందికి నచ్చడం లేదట. అందుకే, తాజా దాడిపై వారెవరూ నోరు మెదపడం లేదని అంటున్నారు. మొత్తంగా విష్ణు రెడ్డిపై జరిగిన చెప్పు దాడి ఘటన బీజేపీ కంటే వైసీపీకే ఎక్కువ బాధ కలిగించిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. 

రాహుల్ ఆ విషయంలో వీక్..

వయనాద్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఫైర్ అవుతూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ అసమర్థ ఎంపీ అని దుయ్యబట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేరళలో రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో స్మృతి ఇరానీ ఈ విధంగా స్పందించారు. అమేథీలో ఓడిపోయిన తర్వాత రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్‌ మీద విషం  చిమ్ముతున్నారని స్మృతి ఇరానీ విమర్శించారు. అమేథీ ఆయనకు అన్నీ ఇచ్చిందని, ఆయన అసమర్థత వల్లే అక్కడి నుంచి పారిపోయారని దుయ్యబట్టారు. చివరికి అన్ని ఇచ్చిన అమేథీ ప్రజలను అవమానించారని ఆరోపించారు. అస్సాం వెళ్ళిన రాహుల్ గాంధీ గుజరాత్ ప్రజలను అవమానించడం అమానుషమని అన్నారు. దేశాన్ని ముక్కలు చేయాలనుకునే దేశ విద్రోహ  గ్యాంగ్‌కు రాహుల్ మద్దతు పలికారన్నారని. పదిహేనేళ్లపాటు అసమర్థ ఎంపీని అమేథీ ప్రజలు భరించారని  స్మృతి హిరానీ అన్నారు. గాంధీ కుటుంబం ‘విభజించు, పాలించు’ సిద్ధాంతాన్ని ఇప్పుడు చూపిస్తున్నారని ఆమె చెప్పారు. రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె  ప్రశ్నించారు. అమేథీ తన కుటుంబమని, అమేథీని అవమానిస్తే తాను భరించలేనని స్పష్టం చేశారు. అంతకుముందు స్మృతి ఇరానీ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘కతఘ్నుడు. జ్ఞానం లేకుండా వాగేవాడి గురించి లోకమంతా చెప్తోంది’’ అని చెప్పారు. రాహుల్ గాంధీ ఇటీవల కేరళలో మాట్లాడుతూ, తాను ఓ ప్రత్యేక తరహా రాజకీయాలకు అలవాటుపడ్డానన్నారు. కేరళకు రావడం చాలా ఉత్తేజభరితంగా ఉందన్నారు. ప్రజలు సమస్యల పట్ల శ్రద్ధ చూపిస్తుండటం, కేవలం పైపైని కాకుండా లోతుగా తరచి చూసే ప్రజలు కనిపించడం అకస్మాత్తుగా తనకు కనిపించినట్లు తెలిపారు.దీంతో  ఉత్తరాది, దక్షిణాది చర్చ మొదలైంది. అయితే  రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలోని వయనాద్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యంవహిస్తున్నారు. 

విశాఖ స్వరూపానంద ఆశ్రమం మూసేస్తారా? 

విశాఖపట్నంలోని శారధా పీఠం మూత పడనుందా? స్వరూపానంద స్వామికి షాక్ తగలనుందా? కొంత కాలంగా వివాదంలో చిక్కుకుంటున్నారు స్వరూపానంద. ఆయనకు రాజకీయ పార్టీలతో ఉన్న సంబంధాలపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆయన బహిరంగంగానే మద్దతు తెలుపుతుండటంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాజాగా స్వరూపానంద మఠంపై ఓ వ్యక్తి ఏపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. స్థానిక ఎన్నికలు ముగిసే వరకు ఆశ్రమాన్ని మూసివేయాలని అందులో కోరాడు. విశాఖపట్నంకు చెందిన రామ్‌ స్వరూపానంద ఆశ్రమాన్ని ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశారు. స్వరూపానంద ఓ దొంగ స్వామి అని అతను మండిపడ్డారు. స్వరూపానంద ఆశ్రమం వైసీపీ పార్టీ అడ్డాగా మారిందని తప్పుబట్టారు. భీమిలిలోని 15 పంచాయతీల్లో వైసీపీ బెదిరింపులకు పాల్పడిందని ఆరోపించారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని విమర్శించారు. ఇందులో ఆశ్రమం నిర్వాహకులకు సంబంధం ఉందని చెప్పారు. స్వరూపానంద ఆశ్రమాన్ని మూసివేయడంతో పాటు భీమిలిలో మళ్లీ ఎన్నికలు జరిపించాలని కోరామని రామ్ తెలిపారు.

హైదరాబాద్ లో నకిలీ ఐపీఎస్‌ అధికారి అరెస్టు

హైదరాబాద్ లో  ఐపీఎస్‌ అధికారినంటూ మోసం చేసిన శ్రుతిసిన్హా అరెస్టు అయింది. నిందితురాలిని బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వీరారెడ్డి అనే వ్యక్తి నుంచి 11 కోట్ల రూపాయలను శ్రుతి సిన్హా కొల్లగొట్టింది. తన చెల్లితో వీరారెడ్డి సోదరుడికి వివాహం జరిపిస్తాని చెప్పి... పెళ్లి పేరుతో వీరారెడ్డి వద్ద రూ.11 కోట్లు వసూలు చేసింది. బంధువు విజయ్‌కుమార్ రెడ్డితో కలిసి శ్రుతి  మోసం చేసింది.  వసూలు చేసిన డబ్బుతో శ్రుతి సిన్హా ఖరీదైన కార్లు కొనుగోలు చేసింది. మోసపోయానని గ్రహించిన వీరారెడ్డి  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు విషయం తెలిసి శ్రుతి బంధువు విజయ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. నకిలీ ఐపీఎస్‌ అధికారి పేరుతో చేసిన మోసం కేసులో మహిళకు సహకరించిన ముగ్గురిని బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద 3 కార్లు, రూ.6 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు.   

అనుమానంతో ప్రియురాలి హత్య..

ప్రేమోన్మాదం రెచ్చిపోతుంది. ప్రేమ పేరుతో ఉన్మాదానికి పాలుపడుతున్నారు దుర్మార్గులు.  ప్రేమించలేదని కొందరు,  తను ప్రేమించిన అమ్మాయి ఇంకొకరితో చనువుగా మాట్లాడుతుందని మరికొందరు. పేరు ఏదైతేనేమి  ప్రేమిచిన వారిపైనే దారుణాలకు పాలుపడుతున్నారు. వరుస ఘటనలు జరుగుతున్న, శిక్షలు పడుతున్న కానీ ప్రేమోన్మాధుల్లో మార్పు రాకపోగా ఇంకా బరితెగిస్తూ పోతున్నారు. నరసరావుపేట శివారులో దారుణం చోటు చేసుకుంది. కోట అనూష అనే విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. అనూష స్వస్థలం గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం గోళ్లపాడు. కృష్ణవేణి కాలేజిలో డిగ్రీ చదువుతున్న అనూష, విష్ణువర్ధన్ రెడ్డి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా, అనూష మరొకరితో చనువుగా ఉంటుందని విష్ణువర్ధన్ రెడ్డి అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో అనూషను విష్ణువర్ధన్ రెడ్డి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు. అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

దుర్గ గుడి అసలు దొంగలెవరు?

దుర్గ గుడి అవినీతి యవ్వారం బెజవాడ రాజకీయాల్లో కాక రేపుతోంది. దేవాలయాల ప్రక్షాళణే ప్రభుత్వ లక్షమని మంత్రి వెల్లంపల్లి అంటున్నారు. మంత్రి వెల్లంపల్లే అసలు దొంగని టీడీపీ నేతలువిమర్శిస్తున్నారు. దుర్గ గుడిలో అవినీతికి పాల్పడిన 13 మంది ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకున్నామని మంత్రి చెబుతున్నారు. మరి ఈవోను ఎందుకు రక్షిస్తున్నారని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఇలా విజయవాడ వేదికగా మంత్రి వెల్లంపల్లి, టీడీపీ నేత బుద్దా వెంకన్నల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతోంది. దొంగల‌ను దాచే సంస్కృతి గత టీడీపీ ప్ర‌భుత్వానిదని.. అవినీతికి తావులేకుండాపారదర్శక పాలన జగనన్న ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లంపల్లి అన్నారు. ఆల‌యాల్లో రాజ‌కీయ‌ల‌కు, అవినీతికి ఆస్కారం లేదన్నారు మంత్రి.  అటు వెల్లంపల్లిపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దుర్గగుడిలో జరిగిన ఏసీబీ సోదాల్లో అసలు దొంగ వెల్లంపల్లిని వదిలేశారన్నారు. దుర్గుగుడిలో మాయమైన చీరలు వెల్లంపల్లి ఇంటిలో, ఆయన దుకాణంలో ఉంటాయన్నారు.  దేవాలయంలోని స్టోర్‌లోని సరుకులు కూడా శ్రీనివాస్ ఇంటికే చేరుతాయని ఆరోపించారు. వెల్లంపల్లిని తక్షణమే అరెస్ట్ చేసి, విచారిస్తే దేవాలయాల సాక్షిగా ఆయన సాగిస్తున్న దోపిడీ బయటపడుతుందని తెలిపారు. దేవుడి సొమ్ము రూపాయి కూడా తినలేదని దుర్గమ్మ సన్నిధిలో తన బిడ్డలపై ప్రమాణం చేసి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పగలడా? అని సవాల్ విసిరారు బుద్దా వెంకన్న. దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యత వహించి వెల్లంపల్లి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్పోరేషన్ ఎన్నికలలో వైసీపీని ఓడించి అమరావతి రాజధాని ఇక్కడే అని చాటి చెప్పాలన్నారు బుద్దా వెంకన్న.   

మావోయిస్టుల దగ్గర డైరెక్షనల్‌ మైన్‌ ట్రిగ్గర్లు! తెలంగాణలో పంజా విసరబోతున్నారా?

తెలంగాణలో మావోయిస్టులు బలోపేతం అయ్యారా? పంజా విసిరేందుకు సిద్ధమవుతున్నారా? రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారా ? అంటే కొన్నిరోజులుగా ఏజెన్సీలో వెలుగుచూస్తున్న ఘటనలతో నిజమనే సమాధానమే వస్తోంది. తాజాగా ములుగు జిల్లాలో బయటపడిన మావోయిస్టుల డంప్ తో పోలీసు శాఖ కలవరపడుతోంది. ఖాళీ బీరు బాటిళ్లు..వెదురు బొంగులతో మావోయిస్టులు బాంబులు తయారు చేస్తున్నట్లు బహిర్గతమైంది. డైరెక్షనల్‌ మైన్‌ ట్రిగ్గర్లను మావోయిస్టులు తయారు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. తమకు అందుబాటులో ఉన్న వస్తువులతోనే ఐఈడీలను రూపొందిస్తున్నట్లు అక్కడ దొరికిన వస్తువులను బట్టి తెలుస్తోంది. ఖర్చు తక్కువ, మన్నిక ఎక్కువ కావడంతో ఖాళీ బీరు బాటిళ్లు.. వెదురు బొంగులతో మైన్లను తయారు చేస్తున్నారని ములుగు పోలీసులు అంచనాకు వచ్చారు. నిఘా పెరగడంతో పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన సామగ్రిని కొనుగోలు చేయడం ఇబ్బందికరంగా మారడంతో.. అడవిలో  లభించే వస్తువులతోనే బాంబులు తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు.   ఛత్తీస్ గఢ్‌ సరిహద్దుల్లో భద్రతా దళాలే లక్ష్యంగా కూంబింగ్‌ దళాలే టార్గెట్‌గా ల్యాండ్‌ మైన్‌లను పాతుతున్న మిలీషియా కమాండర్‌, డిప్యూటీ కమాండర్‌ సహా.. ఏడుగురిని  పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లవిచారణలో ఈ కీలక విషయాలు తెలిశాయంటున్నారు. పోలీసులకు పట్టుబడిన వారిలో మిలీషియా కమాండర్‌ ఉండుం పాండు, డిప్యూటీ కమాండర్‌ ముచ్చిక భీమయ్య, మిలీషియా సభ్యులు సోడి లక్ష్మయ్య, మాడవి అడమయ్య, మాడవి భుద్ర, మాడవి ఐతయ్య, మాడవి కోసగా గుర్తించారు. వీరంతా జెల్ల, పామునూరు, చెలిమల గ్రామాలకు చెందినవారు. దర్యాప్తులో వీరంతా.. తాము మావోయిస్టు అగ్రనేతలు యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌, బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ ఆదేశాలతో బాంబులను అమరుస్తున్నట్లు అంగీకరించారు. పట్టుబడిన మిలీషియా టీమ్ నుంచి తొమ్మిది ల్యాండ్‌మైన్స్‌, 80 మీటర్ల కార్డెక్స్‌ వైర్‌, 50 డిటోనేటర్లు, వాకీటాకీ, వెదురు బొంగుతో పేల్చే డైరెక్షనల్‌ మైన్‌, నాలుగు బాణాలు, 8 విల్లులు, కరెంటు వైర్‌,బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నట్లు ములుగు ఎస్పీ తెలిపారు. బీరు బాటిళ్లు, వెదురు బొంగులతో తయారు చేసిన బాంబులతో కూడా విధ్వంసాలు సృష్టించేందుకు మావోయిస్టులు వ్యూహం పన్నారనే విషయం మిలీషియా సభ్యుల విచారణలో వెల్లడైందని వివరించారు. సాధారణ ల్యాండ్‌ మైన్‌ 3 నుంచి 4 కిలోల బరువు ఉంటే.. బొంగులతో తయారు చేసేవాటి బరువు చాలా తక్కువ. అడవుల్లో ఒకచోటి నుంచి మరో చోటికి తరలించడానికి అనుకూలంగా ఉంటుంది. డైరెక్షనల్‌ మైన్స్‌కూడా ఎక్కువ బరువు ఉంటాయి. వాటి స్థానంలో వెదురుతో తయారు చేసినవి బరువు తక్కువగా.. తయారు చేయడం సులభంగా ఉంటుంది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో ఇద్దరు మావోయిస్టులను అరెస్టు చేశారు. చర్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో సీఆర్పీఎఫ్‌ బలగాలతో కలిసి స్థానిక పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా.. అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారిని  ఇంద్రావతి దళ సభ్యురాలు పద్దం మున్ని అలియాస్‌ అలియాస్‌ నిర్మల, మావోయిస్టు కొరియర్‌ జర్సుల బన్సీగా గుర్తించారు. గతంలో తెలంగాణ మావోయిస్టులకు కేంద్రంగా ఉండేది, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాలో మావోయిస్టులకు పట్టు ఉండేది. అప్పట్లో ఏజెన్సీ గ్రామాలన్ని భయం నీడలో ఉండేవి.మావోయిస్టుల సంచారం, పోలీసుల కూంబింగ్ తో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ కనిపించేంది. ఎన్ కౌంటర్లు భారీగా జరిగేవి. అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత మావోయిస్టు కదలికలు పెద్దగా లేవు. అయితే గడిచిన ఏడాది కాలంగా తిరిగి మావోయిస్టులు తెలంగాణలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో అరాచక పరిస్థితులు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. భూకబ్జాలు ఎక్కువయ్యాయనే విమర్సలు వస్తున్నాయి. దొరలు,భూస్వాములు మళ్లీ గ్రామాల్లోకి చేరి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. పెదపల్లి జిల్లాలో ఇటీవలే జరిగిన న్యాయవాద దంపతుల హత్య కలకలం స్పష్టించింది. ప్రశ్నించే వారే టార్గెట్ అవుతున్నారు.  తెలంగాణలో జరుగుతున్న పరిణామాలతో ప్రజల్లోనూ అసహనం కన్పిస్తోంది. దీన్నే అస్త్రంగా చేసుకుని మళ్లీ బలోపేతం కావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. కొంత కాలంగా భారీగా రిక్రూట్ మెంట్ జరిగిందనే సమాచారం వస్తోంది. మావోయిస్టుల కదలికలపై సమాచారం ఉండటం వల్లే ఏజెన్సీలో పోలీసుల మోహరింపు పెరిగిందంటున్నారు. గత ఏడాది డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా అదిలాబాద్, ఖమ్మం, వరంగల్ ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారు. అంతేకాదు మావోయిస్టుల కదలికలపై కేంద్రం హెచ్చరికలతో ఛత్తీస్ గడ్, తెలంగాణ , సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు కీలక సమావేశం నిర్వహించారు. మొత్తంగా మావోయిస్టుల కదలికలు పెరగడంతో తెలంగాణలో మళ్లీ పాత రోజులు రాబోతున్నాయనే ఆందోళన జనాల్లో వ్యక్తమవుతోంది. 

సర్పంచ్ గా గెలిచాడు.. ఆ విషయం తెలియకుండానే మరణించాడు..

అతను ఎన్నికల్లో గెలిచాడు, అదే రోజు జీవితంలో ఓడిపోయాడు. సర్పంచ్ గా గెలిచావు రామావతారం అనే వార్త ఆయన చెవిన పడకముందే ఆయన ఆశయాన్ని గెలిపించిన ఓటర్ల బలాన్ని విడిచివెళ్ళింది ఆయన ప్రాణం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పుల్లాయిగూడెం సర్పంచ్‌గా గెలుపొందిన నేడు ఆకస్మికంగా మృతి చెందారు. పోలింగ్ ముందు రోజే బ్రైన్ స్ట్రోక్‌తో రామావతరం ఆసుపత్రిలో చేరారు. ఎన్నికల్లో 56 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందినట్లుగా అధికారులు ప్రకటించారు. గెలుపొందిన విషయం కూడా తెలియకుండానే ఆయన  మృతి చెందడం విషాదకరం. జనసేన మద్దతుతో ఆయన సర్పంచ్‌గా విజయం సాధించారు.  

కిడ్నాప్ డ్రామా స్టూడెంట్ సూసైడ్.. కట్టుకథే చంపేసింది!

కీసరలో బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్. యువతిని ఎత్తుకెళ్లిన ఆటో డ్రైవర్లు. గ్యాంగ్ రేప్ చేసి.. పోలీసులు రావడంతో పొదల్లో వదిలేసి పారిపోయారు. ఇదీ పది రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం స్పష్టించిన కేసు. కట్ చేస్తే ఆ మార్నాడు మరో వర్షన్. గ్యాంగ్ రేప్ కాదు, ఆ యువతే బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి పొదల్లోకి వెళ్లింది. గంజాయి తాగి వారితో కలిసి బాగా ఎంజాయ్ చేసింది. పోలీసులను చూసి భయపడి కిడ్నాప్ డ్రామా ఆడింది. ఇలా ఇంకో ప్రచారం. ఈ రెండూ నిజాలు కావు. పోలీసుల విచారణలో మూడూ రోజుల తర్వాత అసలు విషయం వెలుగు చూసింది. ఆమెపై ఎలాంటి అత్యాచారం జరగలేదు. ఇంటి నుంచి పారిపోయేందుకు ఆ యువతి ఆడిన డ్రామా అదని పోలీసులు తేల్చారు. దీంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఈ కేసుపై విపరీత ప్రచారం జరగడంతో పరువు పోయిందని భావించిన ఆ యువతి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఫార్మసీ స్టూడెంట్ సూసైడ్ ఘటన మరింత కలకలంగా మారింది. 19 ఏళ్ల తెలిసీ తెలియని వయసు. అబద్దాలు చెప్పడం ఆమె హాబీ. కిడ్నాప్ కథలంటే ఎంతో ఇష్టం. చంచల మనస్తత్వం. ఏ సమస్య వచ్చిందో ఏమో గానీ.. ఇంట్లో నుంచి పారిపోవాలని అనుకుంది. అదే పని చేసింది. అంతలోనే తల్లి నుంచి పదే పదే ఫోన్లు రావడంతో.. డ్యామిట్, ఆమె కథ అడ్డం తిరిగింది. అది ఆత్మహత్యకు దారి తీసింది. కిడ్నాప్‌ నాటకం.. నలుగురు ఆటో డ్రైవర్లు అపహరించి, సామూహిక అత్యాచారం చేశారంటూ కీసరకు చెందిన బీఫార్మసీ విద్యార్థిని పోలీసులకు చెప్పిందంతా కట్టుకథ అని ఆ తర్వాత తేలింది. తొలుత బాధితురాలు తెలిపిన వివరాల ఆధారంగా సామూహిక అత్యాచారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలు సేకరించాక అత్యాచారం జరగలేదనే నిర్ధారణకు వచ్చారు. తమ కుమార్తెను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారంటూ ఫార్మసీ విద్యార్థిని బంధువులు డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. పోలీసులు రాత్రి 7.40 గంటల ప్రాంతంలో అన్నోజీగూడ రైల్వేగేట్‌కు కాస్త దూరంలో పొదల్లో అర్ధనగ్నంగా ఉన్న యువతిని గుర్తించారు. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు బృందం సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ చేసింది. కిడ్నాప్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటోడ్రైవర్‌ ఆ సమయంలో ఘటనా స్థలంలో లేడని సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల ద్వారా పోలీసులు నిర్ధారించారు. అప్పటికే పోలీసుల అదుపులో ఉన్న ఆటో డ్రైవర్ ను మరోసారి ప్రశ్నించారు. విద్యార్థిని ఆర్‌ఎల్‌నగర్‌లో దిగలేదని, వేరే స్టాప్‌లో దిగిందని అతను చెప్పాడు. అన్నోజిగూడలో యువతిని రక్షించిన స్థలం నుంచి ఆమె ఇంటి బస్‌స్టాప్‌ వరకు ఉన్న సీసీ కెమెరాలన్నీ పరిశీలించారు పోలీసులు. సాయంత్రం 6 నుంచి 7.30 గంటల మధ్య సమయంలో వివిధ ప్రాంతాల్లో ఆమె ఒంటరిగానే తిరిగినట్టు గుర్తించారు. పోలీసులు ఆధారాలతో సహా ఆ యువతిని ప్రశ్నించడంతో తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తనపై అత్యాచారం జరగలేదనే నిజం ఒప్పేసుకుంది. తాను ఇంట్లో నుంచి పారిపోవాలని అనుకున్నానని.. అంతలోనే అమ్మ నుంచి ఫోన్ రావడంతో అలా అబద్దం చెప్పానని అంగీకరించింది. ఆటో డ్రైవర్ల మీద కోపంతో వారిని ఇరికించే ప్రయత్నం చేశానని చెప్పిందా యువతి.   ఈ కట్టుకథ.. ఆమె జీవితం అర్థాంతరంగా ముగిసేలా చేసింది. ఈ విషయం విస్తృతంగా ప్రచారం జరగడం.. కొన్ని రోజుల పాటూ అంతా దీని గురించే చర్చించుకోవడంతో ఆమె పరువు పోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ఫార్మసీ విద్యార్థిని బుధవారం ఉదయం నిద్ర మాత్రంలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఘట్ కేసర్ ఆసుప్రతికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. కిడ్నాప్ ఘటన ఎంత సంచలనంగా మారిందో.. యువతి చనిపోవడమూ అంతే కలకలం స్పష్టిస్తోంది. తెలిసీ తెలియక ఆమె ఆడిన అబద్దం.. నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.

జగన్ కు అమరావతిపై సడెన్ లవ్వు అందుకేనా..

ఏపీలో అధికారం చేపట్టిన తరువాత జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని భుజాన వేసుకుంది. రాజధాని అమరావతిని టార్గెట్ చేస్తూ స్మశానం అని కొందరు, ఎడారి అని మరికొందరు వైసిపి నేతలు నిందిస్తూ దాడి చేస్తూ వస్తున్నారు. అసెంబ్లీలో తనకున్న రోడ్ రోలర్ మెజారిటీని అడ్డుపెట్టుకుని మూడు రాజధానుల బిల్లును జగన్ సర్కార్ పాస్ చేయించుకుంది. అయితే ఈ వ్యవహారంపై అమరావతి రైతులు హైకోర్టు తలుపు తట్టడంతో ప్రస్తుతానికి విశాఖకు రాజధాని మార్పుకు బ్రేక్ పడింది.. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలపై హడావిడి మొదలెట్టేశారు. అక్కడ నిర్మాణాలు నిలిచిపోయిన విషయం ఇపుడే తమ దృష్టికి వచ్చిందన్నట్లుగా బిల్డప్ ఇస్తూ.. వాటిని పూర్తి చేయడానికి నిధులు అవసరం కాబట్టి రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వమే బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఆ భవనాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని కూడా నిర్ణయించింది. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాత్రి పగలు తేడా లేకుండా నిత్యం జరిగే నిర్మాణ పనులతో సందడిగా ఉండే అమరావతి ప్రాంతం ఇప్పుడు పూర్తిగా నిర్మానుష్యం అయింది ఈ దశలో నిర్మాణ పనులు ఆపివేస్తే వేల కోట్ల నష్టం వస్తుందని తెలిసినా ఇన్నాళ్లు పట్టించుకున్న పాపం పోలేదు అయితే సడెన్ గా అక్కడి నిర్మాణాలు పూర్తి చేయాలనుకుంటున్నామని వైసిపి ప్రభుత్వం ప్రకటించింది. జగన్ ప్రభుత్వం తాజా ప్రకటనపై ఇటు రాష్ట్ర ప్రజలు, ఆ ప్రాంత వాసులు పెదవి విరుస్తున్నారు. నిధులు సమీకరించి అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలు పూర్తి చేస్తుందని ప్రజలు నమ్మే పరిష్టితిలో లేరు. దీనికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరేకారణం. అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నా అక్కడ కనీసం ఒక్క ఇటుక కూడా పెట్టని సర్కార్ ఇంత హఠాత్తుగా హడావిడి చేయడం చూసిన జనం.. ఈ హడావిడి వచ్చే నెల 10 వరకు మాత్రమే అంటున్నారు. దీనికి కారణం అమరావతిని అనుకుని ఉన్న విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు చుట్టుపక్కల మున్సిపాలిటీలలో మార్చి 10 న ఎన్నికలు జరగనున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ గెలిచేందుకే.. అమరావతి విషయంలో సానుకూలంగా ఉన్నామన్న ఫీలర్ జనంలోకి పంపించడానికే ఈ ప్రకటనలు చేశారని ప్రజలు భావిస్తున్నారు. దీంతో ఎన్నికలు పూర్తయేవరకు ఈ హడావుడి ఉంటుందని ఆ తర్వాత మళ్లీ.. జగన్ అమరావతి ఊసే ఎత్తరని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క రాష్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వానికి అప్పులు పుట్టే పరిస్థితి లేదు. దీంతో అంత మొత్తం అప్పు ఎవరు ఇస్తారన్నది పెద్ద సందేహంగా మారింది. అంతేకాకుండా రుణాలివ్వడానికి బ్యాంకులేవీ సుముఖంగా లేవు. అంతేగాకుండా ప్రభుత్వం ఇప్పటికే ఇటువంటి ప్రకటనలు పలుమార్లు చేసింది. కొన్ని కమిటీలు వేసి.. ఈ భవనాలను ఎలా వాడుకోవాలనే పరిశీన కూడా జరిపారు. చివరికి వీటిని పూర్తీ చేసి అమ్ముకుందామని కూడా ఆలోచన చేశారు. మరోపక్క ఇప్పటికిప్పుడు ఇక్కడ నిర్మాణాలు పూర్తీ చేయాలంటే పాత కాంట్రాక్టర్లకు దాదాపు ఆరు వందల కోట్ల వరకూ బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వాటికి ముందుగా ఫండ్స్ సర్దుబాటు చేయాలి. అయితే ప్రభుత్వం మాత్రం ఆ దిశగా కనీసం ప్రయత్నాలు చేసినట్లుగా లేదు .జగన్ సర్కార్ అమరావతిని ఒక నిరర్థక ఆస్తిగానే జమ కడుతోందని ప్రజలు ఇప్పటికి నమ్ముతున్నారు. దీంతో తాజాగా జగన్ ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రజలను మభ్యపెట్టే రాజకీయమేనని.. అక్కడ నిర్మాణాలు పూర్తి చేసి ఉద్దేశ్యం ఎంతమాత్రం ప్రభుత్వానికి లేదని ప్రజలు నమ్ముతున్నారు.

చుండూరు చరిత్రే చెప్పుతో దాడికి కారణమా?

బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్దన్ రెడ్డిపై చెప్పుతో దాడి. అది కూడా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ డిబేట్ లో. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది లైవ్ లో చూస్తుండగా జరిగిన ఈ దాడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టింది ఏ మామూలు వ్యక్తో కాదు. అమరావతి జేఏసీ కన్వీనర్. ప్రొఫెసర్ కొలికిపూడి శ్రీనివాసరావు. సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు పాఠాలు చెప్పే మేథావి. జేఏసీ కన్వీనర్, విద్యావంతుడైన శ్రీనివాసరావు అంత సడెన్ గా ఎందుకిలా ప్రవర్తించాడనేది ఆసక్తికరం.  అప్పటి వరకూ డిబేట్ సాఫీగానే సాగింది. ఒక్కసారిగా మాటలు దాడి మొదలైంది. అమరావతి జేఏసీ కన్వీనర్ ను పెయిడ్ అర్టిస్ట్ అన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. టీడీపీ కార్యకర్తలా మాట్లాడుతున్నావు.. టీడీపీ ఆఫీసులో పని చేసుకో అంటూ కామెంట్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన అమరావతి జేఏసీ కన్వీనర్ శ్రీనివాసరావు... కాలి చెప్పు తీసి విష్ణువర్ధన్ రెడ్డి ముఖంపై కొట్టారు. వెంటనే చర్చకు బ్రేక్ పడింది.  అంతటితో ఆగలేదు శ్రీనివాసరావు ఆగ్రహం. బ్రేక్ టైమ్ లో మరోసారి దాడి చేశారని అక్కడి వారు చెబుతున్నారు. మళ్లీ చెప్పు తీసుకొని విష్ణవర్థన్ రెడ్డిని చెడామడా బాదేశారట. లైవ్ లో ఎడమ కాలి చెప్పుతో కొడితే.. బ్రేక్ సమయంలో కుడి కాలి చెప్పు తీసి.. కసి తీరా కొట్టారట. ఛానల్ సిబ్బంది వచ్చి శ్రీనివాసరావును ఆపే ప్రయత్నం చేసినా ఆయనలో ఆగ్రహం అంత తొందరగా శాంతించలేదట. అమరావతి జేఏసీ కన్వీనర్, ప్రొఫెసర్ అయిన కొలికిపూడి శ్రీనివాసరావులో అంతటి ఆగ్రహం, ఆక్రోశం అంతకు ముందెప్పుడూ కనిపించలేదు. అనేక సార్లు టీవీ చర్చల్లో పాల్గొన్న ఆయన తన వాగ్ధాటితో, సబ్జెక్ట్ తో అందరినీ మెప్పించారే కానీ, ఇప్పటిలా ఇంతకు ముందెప్పుడూ హద్దు మీరి ప్రవర్తించలేదు. ఆయన ఉన్నత విద్యావంతుడు, సౌమ్యుడు, వివాదరహితుడు. అలాంటి శ్రీనివాసరావు అంతలా రెచ్చిపోవడానికి కారణమేంటనే చర్చ జరుగుతోంది. ఆ చర్చ ఆసక్తికర మూలాల్లోకి దారి తీస్తోంది.  కొలికిపూడి శ్రీనివాసరావు దళితుడు. ఆయనది గుంటూరు జిల్లా చుండూరు గ్రామం. ఇప్పటి కోపానికి అప్పటి దారుణానికి సంబంధం ఉందని కొందరు అంటున్నారు. 1991లో చుండూరులో జరిగిన మారణకాండ ఆ గ్రామవాసుల గుండెల్లో ఇప్పటికీ నివురు గప్పిన నిప్పులా రగులుతూనే ఉంది. ఆ మానని గాయం ఇలా అగ్నిపర్వతంలా బద్దలైందని అంటున్నారు. ఆనాడు చుండూరులో జరిగిన ఘటనను మరోసారి గుర్తు చేస్తున్నారు.  1991 ఆగస్టు 6న గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో అగ్రవర్ణాల వారు (రెడ్లు) దళితవాడపై దాడి చేశారు. వేట కొడవళ్లు, గొడ్డళ్లు, బరిసెలతో దళితులను దారుణంగా చంపేశారు. ఇద్దరు అన్నదమ్ములను మల్లెతోటలో చంపి భూమిలో తొక్కేశారు. ఒకరిని సజీవంగా సంచిలో కుక్కి కాలువలో పడేశారు. ఆ మారణ కాండలో ఎనిమిది మంది దళితులు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికి, గోనెసంచుల్లో మూటగట్టి, రాళ్ళు కట్టి తుంగభద్రలో పడేశారు. అప్పట్లో సంచలనంగా మారిన ఈ కేసులో సుదీర్ఘ విచారణ జరిగింది. 16 ఏళ్ల తర్వాత 2007లో ప్రత్యేక కోర్టు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దోషులు హైకోర్టుకు అప్పీల్ కు వెళ్లగా 21మంది నిందితులకు విధించిన శిక్షను రద్దు చేసింది హైకోర్టు. ఇలా చుండూరు ఘటన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మాయని మచ్చు.  ఆ చుండూరు బిడ్డే ఈ కొలికిపూడి శ్రీనివాసరావు. ఆనాటి దారుణం ఆ గ్రామవాసుల మాదిరే ఆయనలోనూ నరనరాన జీర్ణించుకుపోయి ఉంటుందని అంటున్నారు. అందుకే ఆయనలో కట్టలు తెగిన ఆగ్రహం కనిపించిందని చెబుతున్నారు. ఒకనాడు ఏ అగ్రవర్ణాల చేతిలోనైతే తమ వారు బలయ్యారో.. ఆ వర్గం నేత మరోసారి తనపై మాటల దాడి చేస్తుండటాన్ని శ్రీనివాసరావు సహించలేకపోయాడు. క్షణికావేశానికి లోనై.. లైవ్ షో లో విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పుతో దాడి చేశారని ఆ వర్గం వారి మాట. అసలు కారణం ఏదైనా.. నేటి శ్రీనివాసరావు దాడితో ఆనాటి చుండూరు ఘటన మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ లో తెగ చర్చ జరుగుతోంది.

అనంతలో వైసీపీ దుశ్శాసన పర్వం!

పంచాయితీ ఎన్నికలు ముగిసిన ఆగని వైసీపీ నేతల దాడులు. అనంతపురం జిల్లాలో జరిగిన ఘటన దుశ్యాషణుడ్ని తలపించేలా చేసింది.  బెదిరింపులు, దాడులు, అక్రమ కేసులతో ఆగక మహిళలపై  కూడా దారుణాలకు పాల్పడుతున్నారు. జిల్లాలోని సోమందేపల్లి మండలం తుంగోడు గ్రామంలో పద్మ  మొన్నటి పంచాయతీ పోరులో తాను రెబల్ అభ్యర్థిగా పోటీలో నిలిచినట్టు తెలిపింది. ఈ ఎన్నికల్లో వైసీపీ సానుభూతిపరుడు విజయం సాధించాడని.. ఆ విజయోత్సవాన్ని తన ఇంటి వద్ద జరిపారని చెప్పింది. పెద్ద ఎత్తున టపాసులు కాల్చగా ఆ శబ్దానికి తమ గొర్రెలు భయపడటంతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేశానని, దీంతో ఆగ్రహించిన వైసీపీ నాయకులు తన ఇంటిపై రాళ్లతో దాడి చేశారని,  విచక్షణారహితంగా దుర్భాషలాడారని వాపోయింది. అంతటితో ఆగకుండా చీర లాగి జాకెట్ చించారని ఆవేదన వ్యక్తం చేసింది.  ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తుంగోడు, కోనతొట్టి పల్లి గ్రామనికి చెందిన దాదాపు 200మంది.. మాజీ సర్పంచి నారాయణరెడ్డి, వాలంటీర్ ప్రతాపరెడ్డి, బాబు, మధుసూదన్ రెడ్డి తదితరులపై సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దళిత సంఘం దండు వీరయ్య వర్గం జిల్లా కార్యదర్శి జీకే ప్రకాష్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో సంబరాలు చేసుకోవడానికి ఎవరు అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. దళితులపై సర్పంచ్ అభ్యర్థులు దాడులు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. గెలిచిన అభ్యర్థులు ఐదు సంవత్సరాలు ప్రజలకు న్యాయం చేయవలసింది పోయే ఈ దాడులు చేయడం దారుణమన్నారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.   

మీ బరువు అమాంతం తగ్గాలంటే...

ఊబకాయం ప్రపంచంలో కరోనా తరువాత అత్యంత ప్రమాదకరమైనది అని నిపుణులు తేల్చారు. అయితే ఇప్పటి వరకు మీ శరీరానికి లైపో సక్షన్, నాన్ లైపో సక్షన్, బెరియా ట్రిక్ సర్జరీ, మినిమల్లీ ఇన్విజివ్, పద్దతిలో సర్జరీలు చేస్కో నక్కరలేదని బరువుతగ్గడం కోసం టీలు, న్యుట్రీషియస్ డైట్ తో బరువుతగ్గడం వల్ల వచ్చే సైడ్ఎఫెక్ట్స్ కు చెక్ చెప్పవచ్చు అంటున్నారు శాస్త్రజ్ఞులు. ఈ మేరకు యు సి ఎల్ కు చెందిన ఒబేసిటీ ఎండోక్రోనాలజీ సెంటర్ కి చెండిన ప్రొఫెసర్ బట్టర్ హం పరిశోదనా బృందానికి నాయకత్వం వహించారు. యు సి ఎల్ పరిశోదన తరువాత యు సి ఎల్ వెయిట్ మేనేజ్మెంట్ పై   2000 మంది పై 16 దేశాలలో ట్రైల్స్  నిర్వహించారు. దేశంలో 1/3 వంతు అంటే 35% ప్రజలు తీసుకున్న కొత్త మందు 20% బరువును తగ్గించింది. అని బట్టర్ హాం స్పష్టం చేసారు. శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదన  న్యు ఇంగ్లాండ్ జనరల్ ప్రచురించింది. వైద్య శాస్త్రజ్ఞ్యులు చేసిన ఈ పరిశోదనకుగాను ప్రజల ప్రశంశలు అందుకున్నారు. ఊబకాయంతో బాధపడుతున్న వారికీ  ఈ పిల్ ఒక వరమనే చెప్పాలి. ప్రొఫ్ బట్టర్ హం మాట్లాడుతూ ఒబేసిటీతో బాధపడుతున్నవారి జీవితంలో మార్పు తెచ్చిందని అనడంలో ఆతిశయోక్తి లేదని బట్టర్ హం అభిప్రాయపడ్డారు. SEMAAGLUTIDE తీసుకున్న 75% మంది 2.4 ఎం జి  తీసుకున్నారని 10% బరువు తగ్గారని మరే ఇతర మందు బరువును తగ్గించడంలో కీలకపాత్ర పోషించిన దాఖలాలు లేవని బట్టర్ హం తెలిపారు. ఇది నిజంగా ఊబకాయానికి వరదాయని వంటిదని అన్నారు. మొట్ట మొదటి సారిగా  ఊబకాయాన్ని మందుల ద్వారా తగ్గించగలిగామన్నారు. అయితే ఇప్పటివరకు బరువు తగ్గడానికి సర్జరీ ఒక్కటే మార్గమంటూ చేసిన ప్రకటనకు చెక్ పెట్టినటే అని బట్టర్ హం అభిప్రాయ పడ్డారు. ఊబకాయం ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు ఇప్పటివరకు . కోవిడ్ 19పై మాత్రమే దృష్టి పెట్టామని వైరస్ తో పాటు ఊబకాయం కూడా మరణానికి కారణమే అని బట్టర్ హం  స్పష్టం చేసారు. దీనికి తోడు డయాబెటిస్, గుండె సమస్యలు, లివర్ సమస్యలు క్యాన్సర్ లు కూడా మందు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈ అంశాన్ని యు కే  ఆరోగ్య విధానంలో చేర్చామన్నారు. ఒబే సిటీ పై నిర్వహించిన ట్రయిల్  లో 15.3% కేజీలు తగ్గారని ఇది కొంత మేర రిస్క్ తగ్గిస్తుందని అన్నారు. ఈ పరిశోధనలో  APPTETIKTE REGULATING విధానం వల్ల మెదడులో ఆహరం తినాలన్న కోరికను తగ్గిస్తుందని హార్డ్ డిసీజ్, డయాబెటిస్, రక్తంలో కొవ్వు రక్తంలో చక్కెర శాతాన్ని, రక్తపోటు వంటి సమస్యలు గణనీయంగా తగ్గాయని బట్టర్ హం వివరించారు.                                                                                           యునివర్సిటీ ఆఫ్ లివర్ పూల్ కు చెందిన ఇన్వెస్టి గేటర్ ప్రొఫ్ జాన్ విల్డింగ్ మాట్లాడుతూ ఊబకాయానికి అత్యంత అధునాతన చికిత్స అందించిందని అన్నారు. ఊబకాయానికి చేసే చికిత్సకు అనుమతిస్తూనే SEMAAGLUTIDE డయాబేటిస్ కు ఈ మందు తక్కువ మోతాదులో వాడుతున్నారని అన్నారు. డాక్టర్లకు ఇప్పటికే ఈమందు ఎలా వినియోగించాలో తెలుసునని. 1990 లోనే హమ్ము స్మిత్ ఆసుపత్రిలో జి ఎల్ పి1  కింద ల్యాబొరేటరీ లో  పరీక్షించామన్నారు. అప్పుడే దీనిని ఒబే సిటీ రోగులకు అత్యంత ప్రభావంతంగా పని చేస్తుందని  గుర్తించినట్లు చెప్పారు. ఈ పిల్ ద్వారా సేమా గ్లుటైడ్ ను రెగ్యులేటరీ ఊబకాయానికి అనుమతించించాలని కోరారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్  ఎక్స్ లెన్స్ యురోపియన్ మెడికల్ ఏజెన్సీ యు ఎస్ ఎ కు చెందిన ఎఫ్ డి ఎ అనుమతించింది . దీనితో ఈ మందుకు అధిక ప్రాధాన్యత పెరిగిందని అన్నారు. మూడవ విడత ట్రైల్స్ల్స్ లో 1961 మంది  వ్యక్తుల పై 1 ౦ 5 కేజీలు  ఉన్నవారికి ఇన్సులిన్ వాడుతున్న వారికీ 9 4.3% మంది ట్రైల్స్ల్స్ లో పాల్గొన్నారని పేర్కొన్నారు. 6 8 వారాలపాటు సాగిన పరిశోదన 2018 నాటికీ ముగిసిందని అన్నారు. ట్రైల్స్ లో పాల్గొన్న వారికీ ఫోన్ కౌన్సిలింగ్  లేదా డైటిషియన్స్ నాలుగు వారాల ఒకసారి క్యాలరీలు తగ్గించేందుకు ప్రయత్నం చేసారని శరీర వ్యాయామం పై దిశ నిర్దేశం చేసారు. దీనివల్ల దాదాపు 1 5 . 3 % బరువు గణనీయంగా తగ్గగలిగారని SEMAA GLUTIDE కు క్లినికల్ గా అనుమంతి లభించిందని అన్నారు. మొదటి రెండవ దశల్లో బాగా పనిచేసిందని మూడవ దశలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నారు.  సేమా గ్లుటైడ్ చికిత్సతో ఒబెసిటీ తగ్గించవచ్చు.  నోసర్జరీ నో సైడ్ ఎఫెక్ట్స్ సక్షన్, జస్ట్ ఒక్క పిల్ అంతే మీ బరువు అమాంతం తగ్గుతారు అంటున్నారు శాస్త్రజ్ఞులు.