జయ జ్ఞాపకాల్లో విజయ..
posted on Feb 24, 2021 @ 4:04PM
అమ్మా, మీరెక్కడో రాజకుమార్తెగా మళ్లీ జన్మించే ఉంటారు. అంటూ జయలలిత జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకున్నారు బీజేపీ నాయకురాలు విజయశాంతి. మీ స్నేహం, అభిమానం, ఆప్యాయత తీపి గుర్తులుగా అలాగే ఉంటాయని ఆమె వ్యాఖ్యానించారు. పిబ్రవరి 24 తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత జయంతిసందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ, 'అమ్మా... మీరెక్కడో రాజకుమార్తెగా మళ్ళీ జన్మించే ఉంటారు. అయినప్పటికీ మాకందరికీ తెలిసిన రోజుగా మీకివే పుట్టినరోజు శుభాకాంక్షలు. అంటూ మీరు పంచిన స్నేహం, అభిమానం, ఆప్యాయత నాకు జీవితకాలపు కానుకలుగా తీపి గుర్తులుగా ఎప్పటికీ అలాగే ఉంటాయి. అంటూ విజయశాంతి జయలలిత ఉన్న ఫోటోను షేర్ చేస్తూ,మత తీవ్రవాదుల హిట్ లిస్టులో నేను ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల పాటు నా భద్రత కోసం మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. విప్లవ నాయకి జయలలితకు ప్రియమైన చెల్లెలు, ప్రచారంలో ఫిరంగి అంటూ మీరు నాకిచ్చిన గౌరవప్రదమైన పిలుపులు ఈ జన్మంతా జ్ఞాపకాలుగా మిగిలే ఉంటాయి' అని విజయశాంతి ట్వీట్ చేశారు.