లవ్ లెటర్లు కాదు.. జాబ్ లెటర్లు కావాలి! 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ పై పాలనపై కాంగ్రెస్ నేతలు ఘాటు విమర్శలు చేశారు. తమ హయాంలో దాదాపు లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేశామంటూ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన ప్రకటనకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రవణ్ కుమార్ కౌంటరిచ్చారు. తండ్రి మాదిరిగానే కొడుకు కేటీఆర్ సిగ్గు లేను మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. నిరుద్యోగులకు అపాయింట్ మెంట్ లెటర్లు కావాలి.. లవ్ లెటర్ లు కాదని శ్రవణ్ ఎద్దేవా చేశారు.   2014 లో లక్ష 7 వేల ఖాళీలు వున్నాయని కేసీఆరే చెప్పారన్నారు శ్రవణ్ కుమార్. బిశ్వాల్ కమిటీ కూడా లక్ష 91 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పిందన్నారు. తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులే వుండరు అన్న కేసీఆర్.. మళ్లీ కాంటాక్ట్ ఉద్యోగులను ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో.. కేసీఆర్ ఫ్యామిలీకే కొలువులు దొరికాయన్నారు. తమ కుటుంబానికి తప్ప తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వరా అని  శ్రవణ్ నిలదీశారు. రాష్ట్రంలో 47 శాతం ఉద్యోగాలు భర్తీ లేకుండా ఉన్నాయన్నారు.  ఉద్యోగులు పూర్తి స్థాయిలో ఉంటేనే పాలన సరిగా జరుగుతుందన్నారు శ్రవణ్ కుమార్. ప్రగతి భవన్ లో ఉద్యోగులు ఉంటే సరిపోదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 10వేల ఉద్యోగాలు వేశారని కేటీఆర్ చెప్పడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ వ్యతిరేకి కిరణ్ కుమార్ రెడ్డి లక్ష 10వేల ఉద్యోగాలు  వేశారని చెప్పారు. టిడిపి, కాంగ్రెస్ హయాంలో వరుసగా టీచర్ ఉద్యోగాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ లు వచ్చాయన్నారు. గ్రూప్ -1, గ్రూప్ -2, 3 నోటిఫికేషన్ లు రానే రాలేదన్నారు శ్రవణ్ కుమార్. 

నిండు చంద్రుడు ఒకవైపు.. చుక్కలు ఒకవైపు?

రేవంత్ రెడ్డి ఒక్కడు ఒకవైపు. కాంగ్రెస్ సీనియర్లంతా మరోవైపు. టీపీసీసీలో అసలేం జరుగుతోంది? రేవంత్ రెడ్డిని ఎందుకంతలా టార్గెట్ చేస్తున్నారు? జగ్గారెడ్డి నుంచి జానారెడ్డి వరకూ అంతా వర్కింగ్ ప్రెసిడెంట్ పైనే పడి ఎందుకు ఏడుస్తున్నారు? పని చేసే లీడర్ ను పని చేయనీయరా? ఫైర్ బ్రాండ్ లీడర్ కు ఎందుకు మోకాలడ్డుతున్నారు? వాళ్లు చేయరు, రేవంత్ ను చేయనీయరా? ఇదీ తెలంగాణ కాంగ్రెస్ వాదుల్లోఎగిసిపడుతున్న ఆక్రోశం. కాంగ్రెస్ లో నడుస్తున్న కోల్డ్ వార్ కి తాజాగా జానారెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. పరోక్షంగా రేవంత్ రెడ్డి అండ్ టీమ్ ను టార్గెట్ చేస్తూ జానారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు.. సీనియర్లంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని జానా కామెంట్ చేశారు. అటువంటి వాళ్లపై పీసీసీ చర్యలు తీసుకోవాలని.. లేదంటే తాను అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు జానారెడ్డి. ఎక్కడా రేవంత్ రెడ్డి పేరు వాడకపోయినా జానారెడ్డి ఇచ్చిన వార్నింగ్ రేవంత్ టీమ్ కే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేది కేవలం రేవంత్ రెడ్డి అభిమానులు మాత్రమే. వాళ్లు ఫ్యాన్స్ కాదు రేవంత్ సైన్యం. రేవంత్ రెడ్డి కోసం ఏదైనా చేస్తారు. ఎంతకైనా తెగిస్తారు. తన అభిమాన నేతకు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్న కాంగ్రెస్ సీనియర్లను సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు రేవంత్ ఫ్యాన్స్. సీనియర్ నేతలు తప్పుకొని వెంటనే రేవంతన్నకు పీసీసీ పగ్గాలు అప్పగించాలని.. లేదంటే కాంగ్రెస్ పతనం ఖాయమంటూ పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. దీంతో, జానారెడ్డికి చిర్రెత్తుకొచ్చి ఇలా వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు.  కాంగ్రెస్ కథ మారదా? కాంగ్రెస్ లో మొదటి నుంచీ అంతే. ఆ పార్టీని ప్రత్యర్థులు ఓడించనక్కరలేదు. ఆ పార్టీ వారే ఓడిస్తారు. రాజకీయాల్లో మర్డర్లు ఉండవు, సూసైడ్లే అనే డైలాగ్ కాంగ్రెస్ కు సరిగ్గా సరిపోతుంది. ఎదిగే నేతనుఎదగనివ్వరు. పని చేసే వారిని పని చేయనివ్వరు. గ్రూపులు, గొడవలు, ఆధిపత్య పోరు.. అబ్బో హస్తం పార్టీ అదో టైపు. వైఎస్సార్ మరణం తర్వాత నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది కాంగ్రెస్ పార్టీ.బలమైన నేత లేక కేడర్ అంతా కకావికలం అవుతోంది. అనేక మంది పార్టీ మారితే.. ఆశాజీవులు మాత్రం మళ్లీ మంచి రోజులు రాకపోతాయా అని పార్టీనే నమ్ముకొని ఉన్నారు. అలాంటి వారందరికీ ఆశాకిరణం రేవంత్ రెడ్డి మాత్రమే. సో కాల్డ్ సీనియర్లు ఎందరున్నా.. రేవంత్ రెడ్డికి వాళ్లెవరూ సరి సమానం కాదనేది ద్వితియ శ్రేణి నాయకుల మాట.  కాలు పట్టి లాగడమే కాంగ్రెస్ నైజమా? కొంతకాలంగా పెద్ద పెద్ద నేతలంతా ప్రెస్ మీట్లకే పరిమితమైతే.. రేవంత్ రెడ్డి మాత్రం పాదయాత్ర, రణభేరితో దూకుడు మీదున్నారు. రేవంత్ రెడ్డి ఒక్క మాటంటే.. ఒక్క పిలుపు ఇస్తే.. అది ప్రజల్లోకి రాకెట్ లా దూసుకుపోతుంది. వాక్ చాతుర్యం, దూకుడు రాజకీయం ఆయన బలం. ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డి ఫైర్ మీద ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతూ వెనక్కి లాగుతుంటారు సీనియర్లు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాకు తగ్గట్టే రేవంత్ యాక్టివ్ గా పని చేసుకు పోతుంటే.. మిగతా సీనియర్ల నుంచి ఆయనకు ఎప్పుడూ సహాయ నిరాకరణే. ఇటీవల అచ్చంపేట నుంచి వావిలాల వరకూ రేవంత్ రెడ్డి రైతు భరోసా పాదయాత్ర చేస్తే అది పార్టీ నిర్ణయం కాదంటూ అడ్డుపుల్లలు వేశారు కొందరు నేతలు. ఇక రైతు రణభేరి సభకూ సీనియర్లంతా డుమ్మా కొట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటం కాంగ్రెస్ లో మరే నేత అయినా చేస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు ఆయన అభిమానులు. కాంగ్రెస్ లో కేసీఆర్ భయపడేది ఒక్క రేవంత్ రెడ్డికేనని అంటున్నారు. పార్టీ కోసం ఇంత చేస్తున్న రేవంత్ కు సీనియర్లు కాస్తైనా సహకరిస్తే తమ లీడర్ మరింత దూసుకుపోతాడని.. సర్కారుకు చుక్కలు చూపిస్తాడని అంటున్నారు. పోనీ, సహకరించకున్నా పర్వాలేదు కనీసం అడ్డుకోకుండా ఉన్నా చాలంటున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటేనే రేవంత్ రెడ్డి ఇంత యాక్టివ్ గా పని చేస్తుంటే.. ఇక పీసీసీ పగ్గాలు అప్పగిస్తే కేడర్ లో మరింత జోష్ రావడం ఖాయం అంటున్నారు. అలా జరిగితే అది కాంగ్రెస్ ఎందుకవుతుంది? ఎదిగే వారిని కాలు బట్టి లాగడమే కాంగ్రెస్ నైజం. రేవంత్ రెడ్డి విషయంలోనూ అదే జరుగుతోందా..? సమయం లేదు హైకమాండ్.. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఆలస్యం అవుతుండటంతో ఉత్సాహంగా పని చేసే నాయకుల్లో నిరుత్సాహం ఆవహిస్తోంది. అధిష్టానం తీరుతో విసుగెత్తి పార్టీ వీడుతున్నారు పలువురు ప్రముఖులు. కుతుబుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, గ్రేటర్ లో స్ట్రాంగ్ లీడర్ కూన శ్రీశైలం గౌడ్, సిర్పూర్ కాగజ్ నగర్ కు చెందిన బలమైన నేత పాల్వాయి హరీష్ బీజేపీలో చేరిపోయారు.  నాంపల్లి ఫైర్ బ్రాండ్ లీడర్ ఫిరోజ్ ఖాన్ కూడా  పార్టీని వీడి యోచనలో ఉన్నారు. వీరంతా రేవంత్ రెడ్డి వర్గీయులే. తమ నేతకు ఇంకా పీసీసీ పదవి రావడం లేదనే అసహనంతో వారంతా పార్టీకి దూరమయ్యారు. మరింత ఆలస్యం అయితే.. మరింత మంది నేతలు హస్తం పార్టీకి హ్యాండ్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ కు తెల్ల ఏనుగుల్లాంటి సీనియర్లు కావాలా? థౌజండ్ వాట్స్ పవర్ ఉన్న చిరుత లాంటి చిచ్చర పిడుగు రేవంత్ రెడ్డి కావాలో ఢిల్లీనే తేల్చుకోవాలి. సమయం లేదు హైకమాండ్.. ఆలస్యమైతే కాంగ్రెస్ ఖతం అంటున్నారు రేవంత్ రెడ్డి ఫ్యాన్స్.  

మరో షాక్.. వ్యాక్సిన్ రెండో డోసు తర్వాత కూడా పాజిటివ్

దేశం లో కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 16,577 మందికి కొత్త‌గా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరోపక్క తెలంగాణాలో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మొన్న‌టివరకు రాష్ట్రంలో మొత్తం 200 లోపే కేసులు బ‌యవస్తుండగా .. గురువారం ఒక్క జిహెచ్ఎంసీ పరిధిలోనే 192 కొత్త కేసులు వెలుగు చూడ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ఇది ఇలా ఉండగా గతంలో కరీంనగర్ ను వణికించిన కరోనా మరోసారి విజృంభిస్తోంది.తాజాగా జిల్లా వ్యాప్తంగా 26 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. రామగుండం ఎన్టీపీసీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ కు, గోదావరి ఖని బ్లడ్ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగికి, అతడి భార్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గోదావరి ఖని ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే ఉద్యోగి రెండు సార్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా సోకడంతో వైద్యులు షాక్ కు గుర్యయారు. బ్లడ్ బ్యాంక్ ఉద్యోగి వాసన కోల్పోవడంతో అనుమానం కలిగి కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. అతడు గత నెల 18న కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకోగా.. ఈనెల 18న రెండో డోస్ కూడా తీసుకున్నాడు. మరోపక్క బ్యాంక్ మేనేజర్‌కు కరోనా సోకడంతో అధికారులు బ్యాంక్‌ను మూసివేశారు. దీంతో కొద్దిరోజులుగా బ్యాంకుకు వెళ్లిన వినియోగదారులలో కూడా ఆందోళన నెలకొంది. మరోపక్క బ్యాంకు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా కరోనా భయం పట్టుకుంది. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

జగన్ కు మ్యాటర్ వీక్...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్ రెడ్డి పాలనపై మరోసారి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వైసీపీ పాలనలో ఏపీ పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. వైసీపీ పాలన చూస్తుంటే.. ‘పబ్లిసిటీ పీక్..మ్యాటర్ వీక్’ అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. దీనికి సన్నబియ్యమే ఒక ఉదాహరణగా చెప్పారు.  ఎన్నికల ముందు సన్నబియ్యం ఇస్తామని చెప్పారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నబియ్యం కాదని.. నాణ్యమైన బియ్యం ఇస్తామన్నామని మాట మార్చారని విమర్శించారుయ  ఇంటింటికి రేషన్ సరఫరా చేస్తామంటూ గొప్పలు చెప్పుకున్నారు.. వేల కోట్లు ఖర్చుచేసి వాహనాలు ఏర్పాటు చేశారు.. స్పీడుగా గ్రామాలకు పంపారు.. ప్రజలు ఛీ కొట్టారు.. మళ్లీ స్పీడుగా ఆ వాహనాలు తాడేపల్లి ప్యాలస్‌కు వచ్చాయని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. అందుకే జగన్ రెడ్డి ప్రభుత్వానికి పబ్లిసిటీ పీక్..మ్యాటర్ వీక్ అని అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను అడిగి.. అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా అభివృద్ధి జరగలేదని లోకేష్ విమర్శించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 38.89 శాతం పంచాయతీలను తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారని చెప్పారు నారా లోకేష్.  

డేటింగ్ కపుల్ ఛీటింగ్.. 11.5కోట్లతో జల్సాలు..

వాళ్లిద్దరు మహా కిలాడీలు. కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నారు. అతడు ఐపీఎస్ ఆఫీసర్ గా బిల్డప్ కొట్టాడు. ఆమె అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్‌పర్సన్‌గా ఫోజు కొట్టింది. ఇద్దరూ కలిసి ఓ బకరాను పెళ్లి పేరుతో మోసం చేశారు. ఏకంగా 11.5 కోట్లు కాజేశారు. ఈజీ మనీని విచ్చలవిడిగా ఖర్చు చేశారు. 40 లక్షలు కట్టి 40 రోజుల పాటు ఓ హోటల్ లో ఫుల్ ఎంజాయ్ చేశారు. 2 కోట్ల బీఎమ్ డబ్ల్యూ కారులో షికార్లు చేశారు. మరో ఐదు కార్లతో హంగామా చేశారు. ఖరీదైన విల్లా, భారీగా బంగారు ఆభరణాలు.. అబ్బో ఓ రేంజ్ లో సాగింది వారి యవ్వారం. కట్ చేస్తే.. ఆ డేటింగ్ కపుల్ లో విజయ్ కుమార్ రెడ్డి సూసైడ్ చేసుకున్నాడు. అతని పార్ట్ నర్ శిరీష అలియాస్ స్మృతి సింహ కటకటాలు లెక్కపెడుతోంది.  సంచలనంగా మారిన బాచుపల్లి మోసం కేసులో పోలీసు విచారణతో అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. కడప ప్రాంతానికి చెందిన మైనింగ్‌ వ్యాపారి పి.వీరారెడ్డి (36) బాచుపల్లిలోని ఏపీఆర్‌ ప్రణవ్‌ అంటిల్లా విల్లా నంబర్‌ 268లో నివాసం ఉంటున్నారు. పక్క విల్లాలో ఉంటున్న అంకిరెడ్డి విజయ్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి వీరారెడ్డితో పరిచయం పెంచుకున్నాడు. తాను ఐపీఎ్‌సకు ఎంపికయ్యానని, తన భార్య శ్రుతి సిన్హా మానవ హక్కుల కమిషన్‌ దక్షిణ భారత విభాగానికి చైర్మన్‌ అని. తన తండ్రి రాఘవ రెడ్డి డీసీపీ అని.. తమకు 77 బస్సులున్నాయని, 32 ఎకరాల పొలం ఉందని వీరారెడ్డికి అబద్ధాలు చెప్పాడు. వీరారెడ్డి తన తమ్ముడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టు తెలుసుకుని.. తమకు తెలిసిన ప్రవల్లిక అనే అమ్మాయి పెళ్లికి సిద్ధంగా ఉందని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన వీరారెడ్డి ఆమెతో మాట్లాడుతానని అడగ్గా.. శ్రుతిసిన్హాతో ఫోన్‌లో మాట్లాడించాడు.  నిజానికి వారిద్దరూ భార్యాభర్తలు కారు. వృత్తి రీత్యా కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌ అయిన విజయ్‌కుమార్‌ రెడ్డి.. భర్తను వదిలేసి ఒంటరిగా ఉంటూ బోరబండలో సూపర్‌మార్కెట్‌ నిర్వహిస్తున్న శ్రుతి సిన్హాతో సహజీవనం చేసేవాడు. విజయ్‌కుమార్‌ రెడ్డి, శ్రుతి సిన్హాలు వీరారెడ్డిని 2017 నుంచి మోసం చేస్తూ వచ్చారు. రకరకాలుగా నమ్మిస్తూ లక్షల్లో వసూలు చేశారు. నాలుగేళ్లలో మొత్తం 11.50 కోట్లు  వసూలు చేశారు.  రోజులు గడుస్తున్నా డబ్బు చెల్లించకపోవడంతో వీరారెడ్డికి అనుమానం వచ్చి విజయ్‌కుమార్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. ఎక్కడున్నావని అడిగితే డెహ్రాడూన్‌లోని పోలీసు అకాడమీలో ఉన్నానని చెప్పాడు. వాట్సప్‌లో లైవ్‌ లొకేషన్‌ పంపించాలంటూ వీరారెడ్డి అడిగాడు. అప్పటికే పలుమార్లు సమాధానం చెప్పలేక తప్పించుకుంటూ వచ్చిన విజయ్ కుమార్ రెడ్డి ఇక మరింత కాలం వీరారెడ్డిని మేనేజ్ చేయడం ఆయన వల్ల కాలేదు. విలాసాలపై శ్రుతి మోజు మరింతగా పెరగడం, వీరారెడ్డి నుంచి డబ్బు కోసం ఒత్తిడి పెరుగుతుండడంతో విజయ్‌కుమార్‌ రెడ్డి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరారెడ్డి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. శ్రుతి సిన్హాతో పాటు ఆమెకు సహకరించిన విజయ్‌కుమార్‌రెడ్డి బంధువులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

తిరుపతి, సాగర్ బైపోల్ షెడ్యూల్!  

ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయిన తిరుపతి లోక్ సభ తో పాటు తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద రావు సెప్టెంబర్ 16న చనిపోయారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ డిసెంబర్ 1న మరణించారు. ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. శుక్రవారం  మధ్యాహ్నం 4.30 గంటలకు మీడియా సమావేశాన్ని ఈసీ ఏర్పాటు చేసింది. దీంతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.    నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల తేదీలను భారత ఎన్నికల కమిషన్  ప్రకటించనుంది. పశ్చిమబెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది.  ఏప్రిల్-మేలో ఈ ఐదు చోట్ల ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు గత బుధవారంనాడు ఈసీ సమావేశమైంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న లోక్ సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించనుంది సీఈసీ.  తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, పశ్చిమబెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.  అసోంలో 126 అసెంబ్లీ స్థానాలు ఉండగా, కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. విశ్వాస పరీక్షకు ముందు ముఖ్యమంత్రి నారాయణ స్వామి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల రాజీనామా చేయడంతో పాండిచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించారు.

చంపేస్తావా ద్రౌపదీ..

కళాకారులు పాత్రలో నటించడం కంటే జీవిస్తేనే రక్తికడుతుంది. అది సినిమా అయినా, నాటకమైనా. హాస్యం, శృంగారం, శాంతి, కరుణ, అద్భుతం, సన్నివేశాలు ఐతే పరవాలేదు. కానీ రౌద్రం, భయానాకం, బీభత్సము, వీరత్వం సన్నివేశాలు  ఐతేనే కొంచెం రిస్క్ . నాటక దారులు పాత్రలో జీవితే ఒకే కానీ లీనమైతేనే ఇబ్బంది! తాజాగా ఓ కళాకారిణి ఇలా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి హత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర సంచలనం కలిగించింది.ద్రౌపది పాత్రలో నటించిన ఓ కళాకారిణి నిజంగానే రౌద్రావతారం ఎత్తిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కర్ణాటకలో మండ్య జిల్లాలోని నాల్వడి కృష్ణరాజ ఒడయార్‌ కళామందిరంలో ఈ నెల 4న ‘కౌండలీకన వధ’ అనే పౌరాణిక నాటక ప్రదర్శన జరిగింది. దీనిలో ద్రౌపది పాత్ర పోషించిన దొడ్డ శృతి నాటకం చివర్లో కాళికాదేవి అవతారమెత్తి త్రిశూలంతో రాక్షసుడు కౌండలికను సంహరించే సన్నివేశం ఉంది. చివర్లో కౌండలికను ద్రౌపది కింద పడేసి త్రిశూలాన్ని అయన గుండెకు ఆనిస్తే నాటకం పూర్తవుతుంది. కానీ.. కౌండలీకను గట్టిగా తోసి కిందపడేసిన ద్రౌపది పాత్రధారి ఆవేశంతో బిగ్గరగా కేకలు వేస్తూ త్రిశూలంతో ఆయన్ను పొడిచేందుకు ముందుకురికింది. అయితే పరిస్థితిని గమనిస్తున్న సహకళాకారులు.. ఉపద్రవాన్ని ముందే గుర్తించి వేదికపైకి వెళ్లి ఆమెను బలవంతంగా అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. శృతి మాట్లాడుతూ.. వేదికపై ఒక్కక్షణం ఏమైందో తనకు తెలియలేదని అన్నారు. 

ఏపీలో దేవుడి ఆస్తులకు రక్షణ ఏది?

ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి దుండగులు దేవాలయాల మీద దాడులు, విగ్రహాలను ద్వసం చేయడం సహా ఇతరత్రా ఆలయాలను పవిత్రతను పాడుచేసే చర్యలు యద్దేచ్చగా జరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సరం ఫిబ్రవరి 12,13 తేదీలలో నెల్లూరు జిల్లా బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో  రథాన్ని దుండగులు తగుల బెట్టారు.అంతకు ముందు కూడా పనిగట్టుకుని దేవాలయాలప పవిత్రతను చెరచే చర్యలు అనేక జరిగిన బిట్రగుంట సంఘటన తర్వాత దాడుల వెనుక దాగున్న కుట్ర మెల్ల మెల్ల మెల్లగా వెలుగులోకి రావడం ప్రారంభమైంది.అయినా  దాడులు ఆగలేదు సరికదా మరింత పెరిగాయి.  గత సంవత్సరం మే22 న జగన్ రెడ్డి ప్రభుత్వం సంవత్సర పాలన పూర్తయ్యే నాటికే ఆయన పాలనలో దేవాలయాలపై దాడుల సంఖ్య శతకాన్ని దాటింది. అదే క్రమంలో అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి రథం తగల బడింది. గత డిసెంబర్ 29 రామతీర్థంలో రాములోరి విగ్రహం తలను దుండగులు తీసేశారు.ఈ సంఘటన తర్వాత రాజకీయ వేడి రాజుకుంది.ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మొదటి సారిగా ఆలయాలపై జరుగుతున్న దాడుల విషయంపై స్పందించారు. ప్రభుత్వాన్ని నిందించారు. రామతీర్థం ఆలయాన్ని సందర్శించిన చంద్రబాబు.. ప్రభుత్వ ఉదాసీన వైఖరి కారణంగానే రాష్ట్రంలో హిందూ దేవాలయలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. బీజేపీ ఇతర హిందూ ధార్మిక సంస్థలుకూడా తీవ్రంగా స్పందించాయి.ఈనేపధ్యంలో జనవరి 17 న కర్నూల్ జిల్లా మంత్రాలయం నుంచి దేవాలయాల సందర్శన యాత్ర చేపట్టిన  త్రిదండి చినజీయర్ స్వామి రాయలసీమ జిల్లాల యాత్రను ముగించుకుని గురువారం తిరుమల శ్రీవేకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చినజీయర్ స్వామి.. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలు , దేవాలయాల ఆస్తులు దాడులకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన నాటికీ అవశేష ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో  దేవాదాయశాఖ ఆధీనంలో 4లక్షల 60వేల ఎకరాల భూమి ఉందని తెలిపారు. దేవుని ఆస్తులను రక్షించవలసిన ప్రభుత్వాలు సక్రమంగా వ్యవహరించక పోవడం వలన ఇప్పటికే చాలావరకు దేవుని ఆస్తులు అన్యాక్రాంత మయ్యాయని చిన జీయర్ స్వామి అన్నారు. పర్యవేక్షణ లోపం కారణంగానే రాష్ట్రంలో అనేక దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు.  ఆలయాల యాత్రకు సంబందించి, రాయలసీమలో దాడులు జరిగిన 27 ఆలయాలను పరిశీలించానని...ఈ ఆలయాలలోని 17 ఆలయాలలో అభివృద్ధికి తీసుకోవాల్సిన పలు సూచనలతో ఓ విఙ్ఞాపన పత్రాని టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డికి అందజేసినట్లు చినజీయర్ స్వామి తెలిపారు. రాష్ట్రంలో చాలా ఆలయాలు అభివృద్దికి నోచుకోలేదని, ప్రభుత్వం వెంటనే వాటిని అభివృద్ధి చేయాలని కోరారు. ఆలయాలు బాగున్నప్పుడే ప్రజలలో నైతిక ప్రవృత్తి బాగుపడుతుందని  చిన్నజీయ్యర్ స్వామి చెప్పారు. అయితే అయిన వాళ్ళకు ఆకుల్లో కానీ వాళ్ళకు కంచాల్లో అన్నట్లుగాముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్యమతాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ, హిందువుల పట్లవివక్ష చుపుతున్నారని, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సహా పలువురు రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. 

కోడలిని రేప్ చేసిన మామ..

మహిళలకు సమాజంలో రక్షణ లేకుండా పోతోంది. ఇంటి బయటే కాదు. ఇంట్లోనూ భద్రత కరువైంది.అమ్మాయిలు ఇంట్లో నుండి ఒంటరిగా బయటికి వెళ్లాలంటే సొంత వాళ్ళు తోడు వెళ్లాల్సిన సమాజంలో బతుకుతున్నాం. అమ్మాయికి తోడుగా వెళ్లిన ఇంటి మనుషులే తోడేళ్లవుతున్నారు. తండ్రి లా చూసుకోవాలిసిన మామే.. కామంచో కుళ్ళు మూసుకుపోయి సొంత కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఢిల్లీకి చెందిన మామా, కోడలు వస్త్రాల వ్యాపారం చేసేందుకు  హైదరాబాద్ వచ్చారు. ఆ అమ్మాయి మామ ను తన తండ్రితో సమానం అనుకుంది. మామతో కలిసి ఆ యువతి నాంపల్లిలోని ఓ లాడ్జ్‌లో రూం తీసుకొని బసచేసింది.  కోడలి పై కన్నేసిన మామ రాత్రి  కోడలిపై మృగంలా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హబీబ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.  తన మామే తనపై బలవంతం చేశాడని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హబీబ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.    

చంద్రబాబు ఇంటికి కరెంట్ కట్! 

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ తీరు దారుణంగా తయారైంది. టీడీపీ నేతలను బెదిరించడం, అక్రమ కేసులు పెట్టి వేధించడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పైనా నీచంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో  పర్యటిస్తున్నారు చంద్రబాబు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బస చేసిన ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. చిత్తూరు అధికారుల తీరుపై  మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బస చేసిన ఆర్‌అండ్‌బి అతిథి గృహానికి విద్యుత్ సరఫరా  నిలిపివేయడం దారుణమని మండిపడ్డారు. ఇది ప్రభుత్వంతో పాటు అధికారుల కక్ష సాధింపు చర్య అని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని అమర్నాథరెడ్డిహెచ్చరించారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. 

శ్రీవారికి పోస్కో 10 కోట్లు.. దేవుడిపై భక్తా?ఆంధ్రులకు బిస్కెట్టా?

పోస్కో. సౌత్ కొరియన్ కంపెనీ. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో పోస్కో పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో పోస్కో పేరు వినిపిస్తేనే మండిపడుతున్నారు జనాలు. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును కొల్లగొట్టే కంపెనీగా పోస్కోపై ఆగ్రహం పెంచుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ తో పాటు పోస్కోకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడుతున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు.  కొరియన్ కంపెనీకి సడెన్ గా మన తిరుమల వెంకన్న మీద భక్తి పుట్టుకొచ్చింది. శ్రీవారికి భారీ విరాళం ఇచ్చింది. శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు పోస్కో 10 కోట్లు విరాళం అందజేసింది. పోస్కో సంస్థ సీఈవో సంజయ్ పాసి డొనేషన్ కు సంబంధించిన డీడీలను టీటీడీకి అందజేశారు.  పోస్కో కంపెనీ టీటీడీకి భారీ విరాళం ఇవ్వడంపై జనాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. దేవుడికి ఇచ్చిన దానాన్ని ఎవరూ తప్పు బట్టక పోయినా.. సమయం, సందర్భం చర్చకు కారణమవుతోంది. గతంలో ఎన్నడూ లేనిది సడెన్ గా ఇప్పుడే పోస్కో ఈ పని చేయడం ఆసక్తికరంగా మారింది. ఓవైపు పోస్కోకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలో పోస్కో సంస్థ శ్రీవారికి 10 కోట్ల భూరీ విరాళం ఇవ్వడం వెనుక కేవలం భక్తి భావమే ఉందా? మరి, ఇంకేదైనా యుక్తి దాగుందా? అంటూ భక్తులు చర్చించుకుంటున్నారు. 

విశాఖ ఉక్కుకు మావోయిస్టుల మద్దతు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృమవుతోంది. కేంద్ర సర్కార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఉక్కు కర్మాగారం కార్మికులు చేస్తున్న పోరాటానికి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. ఏపీలోని ప్రధాన పార్టీలన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రోడ్డెక్కాయి. వామపక్షాలు కార్మికులతో నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. తాజాగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఉద్యమానికి మావోయిస్టులు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ మేరకు మావోయిస్ట్  ఏవోబీ జోనల్ కమిటీ కార్యదర్శి కైలాసం పేరుతో లేఖ విడుదలైంది. ఉక్కు పరిశ్రమని అందరం ఐక్యంగా ఉద్యమించి కాపాడుకుంటేనే 32మంది త్యాగానికి నివాళి తెలిపారు. బీజేపీ, వైసీపీ వేరైనప్పటికి.. వారు అమలు చేసే విధానాలు మాత్రం ఒక్కటే అంటూ మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.  ఉక్కు కర్మాగారానికి విశాఖలో 22వేల ఎకరాల భూములున్నాయి. ఈ భూముల్లో సగం మేర కర్మాగార నిర్మాణం ఉంది. మిగతా సగం ఖాళీ భూముల్లో విశాఖ ఉక్కు కంపెనీకి పోటీగా మరో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు దక్షిణ కొరియాకు  చెందిన పోస్కో కంపెనీ ముందుకొచ్చింది. అందుకు  కేంద్రం సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విడ్డూరం. 2019 అక్టోబర్ లో పోస్కో- రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. 2019 మే 30న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 జూన్ 21న సీఎం జగన్మోహన్ రెడ్డిని పోస్కో ప్రతినిధులు కలిసినట్టువార్తలొచ్చాయి. దీంతో సీఎం జగన్ డైరెక్షన్ లోనే ఢిల్లీ స్థాయిలో పావులు కదిలాయని అంటున్నారు.  విశాఖ స్టీల్ ప్లాంట్ ను వదిలించుకోవాలని ఎప్పటి నుంచో చూస్తోంది కేంద్రం. కుక్కను చంపాలంటే ముందుగా దాని మీద పిచ్చి కుక్క అనే ముద్ర వేయాలంటారు. అప్పుడిక పని మరింత సులువవుతుంది. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలోనూ అదే జరుగుతోంది. 2019 నాటికి 95 కోట్ల లాభంతో నడుస్తోంది RINL. కరోనా దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగా ఉక్కుకు డిమాండ్ తగ్గింది. ఆ ప్రభావం విశాఖ స్టీల్ మీదా పడింది. అన్ని కంపెనీల మాదిరే దీనికీ నష్టాలు తప్పలేదు. ఇది సాకుగా చూపించి మొత్తానికి మొత్తం గంప గుత్తగా అమ్మేయాలని.. రాష్ట్ర ప్రభుత్వ డైరెక్షన్ లో కేంద్రం వంద శాతం ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకుందని అంటున్నారు.   

క్లాస్ రూమ్‌లో టీచర్ల ఫైటింగ్

విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ నేర్పి మంచి పౌరులుగా తీర్చి దిద్దాల్సిన లెక్చరర్లు విచక్షణ కోల్పోయి తరగతి గదిలోనే ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అనపర్తి సమీపములోని కొత్తూరులో ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ ఇంగ్లిషు మీడియం గురుకుల జూనియర్‌ కాలేజీలో ఎనిమిది సంవత్సరాలుగా వెంకటేశ్వరరావు పార్ట్‌టైమ్‌ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. అయితే కొంతకాలం క్రితం వెంకటేశ్వరరావుతో పాటు అక్కడ పనిచేసే మరి కొంతమంది పార్ట్‌టైమ్‌ లెక్చరర్లు టెట్‌ పరీక్షలకు హాజరుకాలేదని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ‌ శ్రీనివాసరావు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు వెంకటేశ్వరరావుతో పాటు మరో అధ్యాపకుడిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పార్ట్‌టైమ్‌ లెక్చరర్ వెంకటేశ్వరావు, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ‌శ్రీనివాసరావు మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. కళాశాలలో జరుగుతున్న కొన్ని విషయాల గురించి వెంకటేశ్వరరావు ఉన్నతాధికారులకు తెలియజేయడంతో వారు శ్రీనివాసరావును వివరణ కోరారు. ఈ నేపథ్యంలో గురువారం ఇద్దరు తరగతి గదిలోనే విద్యార్థుల ముందే ఘర్షణకు దిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో గాయాలపాలైన వీరిద్దరిని సహచర లెక్చరర్లు, విద్యార్థులు విడదీసి అనపర్తి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి చేర్చారు. కళాశాలలో విద్య నేర్పాల్సిన గురువులు ఇలా తరగతి గదిలో విద్యార్థుల ముందే కొట్టుకోవడం తో ఇక వీరు క్రమశిక్షణ ఏమి నేర్పుతారు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

సొంత అన్నను చంపిన.. ఆస్తి వివాదం..

మంచితనం ఓడింది. అత్యాశే గెలిచింది. ఒకే రక్తం పంచుకుని పుట్టారు. ఆస్తి కోసం అన్నదమ్ముల మధ్య వివాదం నడిచింది. తమ్ముడి మూర్ఖత్వం  సొంత అన్న చావుకు బలికోరింది. వారసత్వంగా రావాల్సిన ఆస్తి ని తమ్ముడు ఒక్కడే అనుభవిస్తున్నాడు. పలుమార్లు తనకు వారసత్వంగా రావాలిన భూమి తనకు ఇవ్వమని  అన్న తమ్ముడ్ని అడిగాడు. తమ్ముడి వినలేదు. చివరికి ఆ ఆస్తి వివాదమే అన్న చావుకు కారణమైంది. మృతుడు తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం బేగంపేట వాస్తవ్యుడు కృష్ణారెడ్డి. బతుకుదెరువు కోసం అతను ఏపీలోని గుంటూరు జిల్లా చేవెళ్లపురంలోని అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అతడి తమ్ముడు కొండల్‌రెడ్డి ఊర్లోనే ఉంటున్నాడు. తండ్రి నర్సింహారెడ్డి తాను కొన్న 10 ఎకరాల్లో రెండెకరాలను తన భార్య పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించాడు. నర్సింహారెడ్డి మృతిచెందిన తర్వాత కొండల్‌రెడ్డి ఒక్కడే ఆ 8 ఎకరాల భూమిని తన పేరు మీద చేసుకోవడంతో వివాదం మొదలైంది. తనకు రావాల్సిన వాటా 4 ఎకరాలను తన పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయాలని కొండల్ రెడ్డిని అన్న కృష్ణారెడ్డి కోరాడు. గ్రామపెద్దల ముందు అన్నకు రావాల్సిన వాటా ఇస్తానని ఒప్పుకున్న కొండల్ రెడ్డి ఊరి పెద్దల మాటలను లెక్కచేయకుండా, అన్నదమ్ముల బంధాన్ని మరిచి రాక్షసుడిలా ప్రవర్థించాడు. తన వాటా ఇవ్వాలని అన్న పదేపదే కోరినా  తమ్ముడు మొహం చాటేస్తుండటంతో కృష్ణారెడ్డి మనస్తాపానికి గురయ్యాడు. సోదరుడి నుంచి ఇక భూమి రాదేమోనన్న ఆందోళనతో చివరికి ఆన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణారెడ్డి చావుకు తమ్ముడు కొండల్‌రెడ్డే కారణమని ఆరోపిస్తూ బంధువులు కొండల్‌రెడ్డి ఇంటి ఎదుట ఆందోళన చేశారు. తల్లిదండ్రులు మృతిచెందడంతో కృష్ణారెడ్డి ఇద్దరు కొడుకులు అనాథలుగా మారారని, ఇప్పటికైనా ఆస్తిని పిల్లల పేర్లపై రిజిస్ట్రేషన్‌ చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

కారులో భారీగా పేలుడు పదార్థాలు! అంబానీ ఇంటి ముందు కలకలం

భారత వ్యాపార దిగ్గజం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. ముంబైలోని ముకేశ్ నివాసం ‘ఆంటీలియా’ ఎదుట స్కార్పియో కారులో.. 20 జిలెటెన్ స్టిక్స్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం పెడ్డర్ రోడ్డులో నిలిపిన కారును గుర్తించిన అంబానీ సెక్యూరిటీ సిబ్బంది.. అనుమానం వచ్చి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారును పరిశీలించిన పోలీసులు బాంబ్ స్క్వాడ్​ను పిలిపించారు. కారులో జిలిటెన్ స్టిక్స్ గుర్తించి డాగ్ స్క్వాడ్​ను కూడా రప్పించారు. కారులో ఎక్క్​ప్లోజివ్ డివైస్ ఏదీ కనిపించలేదని పోలీసులు చెప్పారు. కారు లోపల కొన్ని నంబర్ ప్లేట్లు ఉన్నాయని పోలీసులు చెప్పారు. అవి ముకేశ్ అంబానీ సెక్యూరిటీ సిబ్బంది ఉపయోగించే కార్ల నంబర్లతో మ్యాచ్ అయ్యాయని, ఓ లెటర్​ కూడా స్వాధీనం చేసుకున్నామతీ ముంబై పోలీసులు తెలిపారు. కారు ఓనర్ ఎవరనేది ఆరా తీస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. గురువారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో రెండు కార్లలో కొందరు వచ్చినట్లు కనిపించింది. స్కార్పియో కారును అక్కడే ఉంచి, ఇన్నోవా కారులో వెళ్లిపోయినట్లు తెలిసింది.ఈ ఘటన ముంబైలో కలకలం రేపింది. 

బెజవాడలో కేశినేనిదే విజయం 

39వ డివిజన్.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. ఇక్కడ అభ్యర్థి విషయం తెలుగు దేశం పార్టీలో కాక రేపింది. ఎంపీ కేశినేని నాని ఒకవైపు. బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలు మరొకవైపు. ఒకే పార్టీకి చెందిన ఇరు వర్గాలు చెరో వైపునకు చేరి పార్టీ ప్రతిష్టతో చెడుగుడు ఆడుకుంటున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు జోక్యంతో వివాదం సమసిపోయింది. 39వ డివిజన్ అభ్యర్థి ఎంపికలో ఎంపీ కేశినేని నానినే పంతం నెగ్గించుకున్నారు. ఎంపీ బలపరుస్తున్న అభ్యర్థే పోటీలో ఉంటారని టీడీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చేసింది. విజయవాడ  39వ డివిజన్‌ టీడీపీ అభ్యర్థిగా శివశర్మ పేరును టీడీపీ ఖరారు చేసింది.  ఇదే 39వ డివిజన్‌ నుంచి మాజీ కార్పొరేటర్‌ గుండారపు హరిబాబు కుమార్తె గుండారపు పూజిత కూడా టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.ఈ నేపథ్యంలో ఎంపీ నాని, ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని ఉన్న తమను కాదని వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వ్యక్తికి కార్పొరేటర్‌ టికెట్‌ ఇవ్వడమే కాకుండా, కార్యాలయ ప్రారంభోత్సవానికి రావడం వెంకన్న వర్గీయుల్లో ఆగ్రహానికి కారణమయింది. దీంతో ఎంపీ నానీని గుండారపు హరిబాబు, ఆయన కుమార్తె పూజిత తదితరులు అడ్డుకుని నిలదీశారు. బీసీలమైన తమకు అన్యాయం చేయడం ఎంత వరకు సబబమని ప్రశ్నించారు. పార్టీనే నమ్ముకుని ఎంతో కాలంగా పనిచేస్తున్నామని, తమకు అన్యాయం చేయవద్దని కోరారు. నిరసనల నడుమే నాని ప్రారంభోత్సవాన్ని ముగించుకుని వెనుదిరిగారు.  అప్పట్నుంచి 39వ డివిజన్ అభ్యర్థిత్వంపై టీడీపీ వివాదం నెలకొంది. శివశర్మ అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఖరారు చేసిందని, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాకు  అచ్చెన్నాయుడు చెప్పారు. ఈ డివిజన్‌ అభ్యర్థిపై ఎంపీ కేశినేని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్ మీరా మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. ఈ పంచాయతి టీడీపీ అధినేత చంద్రబాబు దాకా వెళ్లింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు మాజీమంత్రి అచ్చెనాయుడును  దూతగా పంపారు. ఆ తర్వాత బుద్దా వెంకన్న, నాగుల్ మీరాను చంద్రబాబుతో అచ్చెన్నాయుడు మాట్లాడించారు. వాళ్లు అంగీకరించడంతో ఎంపీ కేశినేని సూచించిన శివశర్మే పోటీలో ఉంటారని టీడీపీ ప్రకటించింది.

వామనరావు కేసులో మరో ట్విస్ట్! 

దేశ వ్యాప్తంగా కలకలం రేపిన హైకోర్డు అడ్వకేట్ దంపతుల హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటికి వచ్చాయి. వామనరావు దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మెన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను... పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించాడని తెలుస్తోంది. బిట్టు శ్రీనుకు సంబంధించిన పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ఉన్నాయి.  హైకోర్టు న్యాయవాది వామనరావు హత్యకు నాలుగు నెలల క్రితమే బిట్టు శీను ప్లాన్ చేసినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. వామనరావ్ బతికుంటే తమకు ఎప్పుడైనా సమస్యనే అని బిట్టు శీను, మరో నిందితుడు కుంట శీను భావించినట్లు చెబుతున్నారు. బిట్టు శీను చైర్మన్‌గా ఉన్న పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టుపై వామనరావు అనేక కేసులు వేశారు. నాలుగు నెలల క్రితం గుంజపడుగులోనే పాత స్కూల్ బిల్డింగ్ నుంచి శీను గ్యాంగ్ రెక్కీ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు.అయితే అప్పుడు వామనరావు వెంట చాలా మంది ఉండటంతో హత్యా ప్రయత్నాన్ని విరమించుకున్నారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.  అదను కోసం ఎదురు చూస్తున్న నిందితులకు.. ఈనెల 17న వామనరావు ఒంటరిగా దొరకడంతో వామనరావు హత్యకు బిట్టు శీను, కుంట శీను ప్లాన్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. వామనరావు హత్య తర్వాత బిట్టు శీనుకు కుంట శీను ఫోన్ చేసినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. వామనరావు దంపతులు చనిపోయారని బిట్టు శీనుకు కుంట శీను సమాచారం అందించాడు. హత్య తర్వాత కుంట శీను అండ్ గ్యాంగ్‌ను మహారాష్ట్రకు వెళ్లిపోమని బిట్టు శ్రీను సలహా ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. 

రేవంత్ కి జానా రెడ్డి వార్నింగ్! ఇక జంపింగేనా? 

తెలంగాణ కాంగ్రెస్ లో కోల్డ్ వార్ ముదిరిందా? రేవంత్ రెడ్డిపై సీనియర్లు గుర్రుగా ఉన్నారా? అంటే అవుననే తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత , సీఎల్పీ మాజీ నేత జానా రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కాక రేపుతున్నాయి. ఎప్పుడు కూల్ గా మాట్లాడే జానా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో..  పైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ కు ఆయన వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.  సోషల్ మీడియాలో  కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు.. సీనియర్లంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని జానా కామెంట్ చేశారు. కాంగ్రెస్ సంస్కృతికి భిన్నంగా కొందరు వ్యక్తి పూజలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.అటువంటి వాళ్లపై పీసీసీ చర్యలు తీసుకోవాలని కోరారు జానా రెడ్డి. వ్యక్తుల కోసం కాంగ్రెస్ పార్టీ లేదని.. ఈ విషయాన్ని అందరూ గుర్తించుకుంటే మంచిదని మంచిదన్నారు. సీనియర్ల మీద సోషల్ మీడియాలో  తప్పుడు ప్రచారం చేసేవాళ్లపై పీసీసీ చర్యలు తీసుకోకపోతే తాను అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని కూడా  జానా రెడ్డి హెచ్చరించారు.    జానా రెడ్డి చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియాలో  యాక్టివ్గా ఉండేది రేవంత్ రెడ్డి అభిమానులే.  ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేతలను విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. సీనియర్ నేతలు తప్పుకొని వెంటనే రేవంత్కు పగ్గాలు అప్పజెప్పాలని.. లేదంటే కాంగ్రెస్ పతనం కావడం ఖాయమని పోస్టులు పెడుతున్నారు. దీంతో జానారెడ్డి స్పందించినట్టు సమాచారం. ఆయన రేవంత్ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ పరోక్షంగా ఆయనను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది.దీంతో జానారెడ్డి వాళ్లకే వార్నింగ్ ఇచ్చినట్టు కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.  

ఇది కుప్పం.. ఖబడ్దార్ 

భయపెడితే భయపడడానికి ఇది పుంగనూరు, కడప కాదు. ఇది కుప్పం ఖబడ్దార్. అంటూ సినిమా డైలాగ్ ను మరిపించేలా మాట్లాడారు.  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు. పర్యటనలో భాగంగా  వైసీపీ నేతలను హెచ్చరించారు. నేను ఇలాగే ఆనాడు ఉండి ఉంటే ఈ పుంగనూరు నేత అసలు ఉండేవారా అంటూ ఏదేవా చేశారు. వడ్డీతో కాదు చక్రవడ్డీతో సహా తిరిగిస్తానని కుప్పం పర్యటనలో చంద్రబాబు వైసీపీ నేతలకు వార్నింగ్ ఇస్తూ కుప్పం టీడీపీ నాయకుల్లో, కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు.   చంద్ర బాబు కుప్పంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా గురువారం చిత్తూరు జిల్లాలోని పర్యటిస్తూ గుడుపల్లి మండలం కొడతనపల్లి పంచాయితీలో సర్పంచ్‌గా గెలిచిన వెంకటేష్‌ను అభినందించారు. వైసీపీ నేతల దౌర్జన్యాలకు ఎదురొడ్డి విజయం సాధించడం అభినందనీయమన్నారు. పంచాయితీ ఎన్నికలు దౌర్జన్యాలతో జరిపించారని మండిపడ్డారు. కుప్పంపై కక్ష కట్టి తాము బలపరిచిన అభ్యర్థులను బెదిరింపులు, దాడులు, కేసులు పెట్టి అన్ని విధాలా భయపెట్టారని, ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కుప్పంలో ఏదో సాధించామని విర్రవీగుతున్నారని మండిపడ్డారు. అన్ని గుర్తుపెట్టుకుంటున్నానని, వడ్డీతో కాదు చక్రవడ్డీతో సహా తిరిగిస్తానన్నారు. ఎవరిని వదిలిపెట్టనని చంద్ర బాబు హెచ్చరించారు. నేను ఇలాగే ఆనాడు ఉండి ఉంటే ఈ పుంగనూరు నేత అసలు ఉండేవారా? నేను కక్ష సాధింపు చర్యలు ఎప్పుడు చేయలేదు. ఇంక ఒక్కటిన్నర సంవత్సరమే ఈ ప్రభుత్వం.. తరువాత అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి.. అప్పుడు మా సత్తా ఏంటో చూపిస్తా.. మీ ఆటలు ఇక్కడ కాదంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు అధైర్య పడవద్దని, అండగా ఉంటానని.. తరచు కుప్పం వచ్చి సమస్యలు తెలుసుకుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు.