ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీయే!

కొంద‌రికి శ‌త్రువులు, మిత్రులు, వీరాభిమానుల కంటే భ‌క్త‌గ‌ణ‌మే ఎక్కువ ఉంటారు. అదుగో అలాంటి మ‌హామ‌నిషి నంద‌మూరి తార‌క‌రామారావు. ఎన్‌టిఆర్ అంటూ వీరాభిమానంతో పిలుచుకునే తార‌క రాముడు సినీన‌టునిగా, రాజ‌కీయ‌నాయ‌కునిగా, మ‌రీ ముఖ్యంగా ఏపీ ముఖ్య‌మంత్రిగానూ ప్ర‌జ‌ల హృద యాల్లో నిలిచిన వ్య‌క్తి. ఆయ‌నంటే ఇష్ట‌ప‌డ‌ని వారు చాలా అరుదు. ఆయ‌న పేరుతో హెల్త్ యూని వ‌ర్సీటీ ఏర్పాటు అయిన‌పుడు సంతోషించ‌ని వారులేరు. అది ఆయ‌న్ను హృద‌య‌పూర్వ‌కంగా గౌర‌వించు కోవ‌డ మే అన్నారంతా.  ఇపుడు ఆ యూనివ‌ర్సిటీ పేరు మార్చ‌డం విష‌యంలో అన్ని పార్టీల‌వారూ ప్ర‌బుత్వా న్ని ప్ర‌శ్నిస్తున్నారు. హెల్త్ యూనివ‌ర్సిటీ అనేది ఎన్టీఆర్ క‌ల అని అందువ‌ల్ల‌నే ఆయ‌న పేరిట‌నే స్థాపించడం జ‌రిగింద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు అన్నారు.   ఆయ‌నంటే పార్టీలు, కుల‌మ‌త వ‌ర్గాల‌తో సంబంధంలేకుండా ప్రేమించేవారి శాత‌మే ఎక్కువ‌. ప్రాంతీయా భిమానానికి ప్ర‌తినిధిగా పార్టీ పెట్టి అన‌తికాలంలో ముఖ్య‌మంత్రి అయి, అటు కేంద్ర రాజ‌కీయాల్లోనూ ప్ర‌భావం చూపిన ఘ‌నుడు ఎన్టీ ఆర్‌. ఆయ‌న మ‌ర‌ణం తెలుగు జాతికి దుర‌దృష్ట‌మంది యావ‌త్ లోకం. అందులో ఏమాత్రం సందేహం లేద‌న్నారు అన్నివ‌ర్గాల‌వారూ, అన్ని పార్టీల‌వారూ. అదీ ఎన్టీఆర్ అంటే. వ‌ర్సిటీ పేరు మార్చ‌డం స‌బ‌బు కాద‌ని అంటూ  అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామా చేశారు. వ‌ర్సిటీకి ఆయ‌న పేరు మార్చాల‌న్న‌ది స‌రైన నిర్ణ‌యం కాద‌ని ఆయ‌న అన్నారు. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడం చాలా బాధగా ఉంది. ఎన్టీఆర్ పేరు తొలగించ డం సరైన నిర్ణయం కార‌ని ఆయ‌న అన్నారు.  ఆయ‌నే కాదు,  ట్విట్టర్ ద్వారా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా స్పందించ‌డం గ‌మ‌నార్హం.  ఆయ‌న కావ‌డానికి వైసీపీకి చెంద‌న‌వార‌యిన‌ప్ప‌టికీ  ఎన్టీఆర్ విష‌యంలో త‌న మ‌న‌సును చంపుకోలేక పోయారు. అందుకే  ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని మార్చుకోవాల‌ని ముఖ్య‌మంత్రి  జ‌గ‌న్‌కు విన్న‌వించారు. మీరు ఎంతో పెద్ద మనసుతో  తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకైన నందమూరి తారకరామారావు గారి పేరుతో జిల్లా ఏర్పాటు చేసి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవ్వని గుర్తింపునిచ్చి స్ఫూర్తి దాయకంగా నిలిచారు. నిజంగా అది ఎంతో చారిత్రాత్మకం..విప్లవాత్మకం..అదే జిల్లాలో ఎన్టీఆర్ గారి చొరవ తోనే ఏర్పాటైన ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కారణజన్ముడైన ఆ మహనీయుడి పేరే కొనసాగించే అవకాశాన్ని పరిశీలించాలని మనఃపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాన‌ని  వల్లభనేని వంశీ ట్విట‌ర్ ద్వారా కోరారు. 

ట్రాఫిక్ జామ్  సాక్షిగా ..!

ప్రేమ‌వ్య‌వ‌హారాలు ఎప్పుడూ చిత్రంగానే ఉంటాయి. పొలంలో ప‌నిచేస్తూ నాగేస్స‌ర్రావు సావిత్రిని, ప్ర‌బాస్ వ‌ర్షంలో త్రిష‌ని, క్లాస్లో రామ్ని నిధిఅగ‌ర్వాల్ ప్రేమించేసారు.. ఓ కుర్రాడు చాలారోజుల క్రిత‌మే బెంగు ళూరులో ట్రాఫిక్ జామ్‌లో ఓ అమ్మాయిని అమాంతం ప్రేమించేశాడు! అదెలా సాధ్యం అని ప్ర‌శ్నించుకోవ‌డం, ఆలోచించి బుర్ర‌పాడుచేసుకోవ‌డం అక్క‌ర్లేదు. ఎందుకంటే అది ప్రేమ‌.. దానికి ప్లేసు, టైమ్, వ్య‌క్తుల‌తో పెద్ద స‌మ‌స్య ఉండ‌దు. అదంతే ఎవ‌ర్నియినా ఎవ‌ర‌యినా ఫ్రేమిం చే య‌చ్చు! రైల్వే జ‌ర్నీలో తీరిగ్గా ప్రేమించేయ‌డం, దిగి పాట‌లు పాడేసుకోవ‌డం సినిమాల్లో చూపుతున్నా రు. అలాంటిది నిజ‌జీవితంలో జ‌రుగుతుందా? అని మామ్మ‌గారు మ‌న‌వ‌డినో మ‌న‌వ‌రాలినో తిట్ట‌వ‌చ్చు.. కానీ అదీ జ‌ర‌గ‌నూ వ‌చ్చు! కాల మ‌హిమ‌.  ట్రాఫిక్‌లో అంతా ఇళ్ల‌కు వెళ్లే స‌మ‌యంలో విసిగెత్తి ఉంటారు. ఎవ‌రో ఏదో గొడ‌వ‌ప‌డి ట్రాఫిక్ జామ్ అయిన సంద‌ర్భంలో ఈ ప్రేమ‌లు, బ‌హుమ‌తులు ఇచ్చిపుచ్చుకోవ‌డాలు జ‌రుగుతాయా? ఇది ఊహించ‌ లేని వ్య‌వహారం. కానీ ప్రేమ వ్య‌వ‌హారాలెప్పుడూ ఇంతే గురూ! అయినా ఈ బెంగుళూరు ల‌వ్‌స్టోరీ తెలుసుకోను కాస్తంత ఇంట్ర‌స్టింగ్‌గానే ఉంటుంది. బెంగుళూరులో ఓ ప్రాంతంలోని సోనీ వ‌ర‌ల్డ్ సిగ్న‌ల్స్ ద‌గ్గ‌ర ఒక రోజు మామూలుగానే ట్రాఫిక్ జామ్ అయింది. వాహ‌నాల రొద‌. అంత‌లో ఒక కుర్రాడు విసుగ్గా  అటూ ఇటూ చూస్తున్న‌పుడు మెరుపుతీగె లాంటి అమ్మాయి క‌న‌ప‌డింది. ఆమె కూడా అదే ట్రాఫిక్‌ లో  కాస్తంత దూరంలో ఇబ్బందిప‌డుతోంది. ఆమె అవ‌స్థ‌లు చూసి న‌వ్వొచ్చిం ది. న‌వ్వుకున్నాడు. ఆమె విసుగ్గా చూస్తూ  అతన్ని చూసింది. ఈ హీరోగారు చాలా స‌ర‌దాగా అంద‌రినీ చూస్తూ న‌వ్వుకుంటున్నాడు. ఇంత చిరాకు స‌మయంలోనూ అంత ఆనందంగా ఎలా ఉన్నాడ‌ను కుందిట‌. అంతే ట్రాఫిక్‌లో ఉన్న సంగతి మ‌ర్చిపోయి అత‌న్నే చూస్తూండిపోయింది. త‌ర్వాత హార‌న్ల మోత కూడా అంత‌గా తెలియ‌లేదు. అదే ఫ్రేమ మ‌హ‌త్తు! అత‌గా డూ అంతే. త‌ర్వాత ఇద్ద‌రిమ‌ధ్యా మాట‌లు క‌లిశాయి.  ఇక్క‌డ ట్విస్ట్ ఏమంటే... వాళ్లిద్ద‌రి ప్రేమ వ్య‌వ‌హారం జ‌రిగి మూడేళ్ల‌యింది. అంటే వారి పెళ్లీ అయింది. కానీ వారు తొలిచూపుల్లో క‌లిసిన ఆ మ‌హ‌త్త‌ర ప్ర‌దేశం లోని ఎజిపూర ఫ్లైఓవ‌ర్ ప‌నులు మాత్రం ఇంకా పూర్తి కాలేదుట‌!

కేసీఆర్ జాతీయ‌పార్టీకి  కుద‌ర‌ని ముహూర్తం

అన్నీ అనుకోగానే అయిపోతాయా? అది కొంద‌రికి ప‌ట్టే అదృష్టం.  చాలామంది విష‌యంలో జ‌ర‌గ‌ని క‌ల‌. కొంద‌రికి ఇవాళ‌, రేపు.. అంటూ ముహూర్తాల తేదీ మారిపోతూంటుంది. ఇపుడు తెలంగాణ ముఖ్య‌మంత్రి టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విష‌యంలోనూ అదే జ‌రుగుతోంది. ఆయ‌న జాతీయ‌పార్టీ ఏర్పాటు ముహూర్తం తేదీ మళ్లీ మారింది. అదిగో ఇదిగో అన్న‌ది అభిమానుల‌ను ఊరించింది. ఈమ‌ధ్య ఇదుగో ద‌స‌రాకి ప్ర‌క‌టిస్తార‌ని అంతా సినిమాకోసం ఎదురుచూసిన‌ట్టు చూస్తున్నారు. ఇంత‌లో అబ్బే అక్టోబ‌ర్ 5కి ప్ర‌క‌టించ‌డం క‌ష్టమ‌న్న‌ది తేలిపోయింది. ద‌స‌రా ముహూర్తం దాటిపోయింది గ‌నుక ఇక ఈ ఏడాది డిసెం బ‌ర్ లోనే బిఆర్ ఎస్ పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించ‌వ‌చ్చు.  ముహూర్తం మార్పు పంతులుగారు ఇంకా తేల్చ‌లేక‌పోవ‌డం కాదుట‌..కొత్త పార్టీ మానిఫెస్టోలో అంశాలు ఇద మిద్ధం ఏమి ఉండాల‌న్న‌ది ఇంకా తేల‌క‌పోవ‌డ‌మేన‌ట‌. మ‌రీ ముఖ్యంగ నీరు,విద్యుత్‌, వ్య‌వ‌సాయం, జాతీ య పార్టీ ప‌తాక రూప‌క‌ల్ప‌న మొద‌లైన అంశాల్లో పాల‌సీ ఎలా ఉండాల‌న్న‌ది  ఇంకా నిపుణుల క‌మిటీ తేల్చలేద‌ట‌. అంతేకాదు పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించ‌డానికి ముందు మ‌రిన్ని కీల‌కాంశాల గురించి దాదా పు ప్ర‌తీరోజూ ఇంకా చ‌ర్చిస్తున్నారని టీఆర్ ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. జాతీయ‌స్థాయిలో కొత్త పార్టీ ఏర్పాటు చేయాల‌న్న ఆలోచ‌న వ‌చ్చిన‌పుడు విజ‌య‌ద‌శ‌మిరోజునే ప్ర‌క‌టించా ల‌నుకున్నారు. అయితే ఎన్నిక‌ల క‌మిష‌న్ వ‌ద్ద పార్టీ రిజిస్ట‌ర్ చేయించే ప‌నులు ఇంకా పూర్త‌గాక‌పోవ‌ డంతో అపుడు అధికారికంగా ప్ర‌క‌టించ‌డానికి వీలులేక‌పోయింది. కాగా టీఆర్ ఎస్ పార్టీని  కొత్త‌గా ప్ర‌తిపాదిస్తున్న జాతీయ‌పార్టీలో క‌ల‌ప‌డం విష‌యంపైనా  పార్టీ ఎగ్జిక్యూటివ్ స‌మావేశంలో ఇంకా చ‌ర్చిం చాల్సి ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీనిపై సుదీర్ఘ చ‌ర్చ త‌ర్వాత ఆ రిజ‌ల్యూష‌న్ కాపీని ఈసీకి అంద‌జేయ వ‌ల‌సి ఉంటుంది.  ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు జాత‌కాల‌మీద ఎంతో న‌మ్మ‌కం ఉంది. క‌నుక మంచి ముహూర్తం కోసం ప‌ట్టుప‌డు తుం డ‌డంతోనూ కొత్త జాతీయ పార్టీ ప్ర‌క‌ట‌న జాప్యం అవుతోందని అంటున్నారు. అంద‌రూ ఎంతో ఆలోచించి, ఎంత‌మందితోనో స‌మాలోచ‌న చేసి అక్టోబ‌ర్ 5ని నిర్ణ‌యించారు. ఆ రోజు మంచి కార్య్ర‌ క‌మాలు ఆరంభించ‌వ‌చ్చ‌ని అంద‌రూ ఒక్క‌మాట‌గా సీఎంకి తెలియ‌జేశారు.  కాగా ప్ర‌స్తుతం మూఢాలు న‌డుస్తున్నాయి క‌నుక కొత్తపార్టీ ప్ర‌క‌ట‌న ముహూర్తాన్ని డిసెంబ‌ర్ 12కి వాయిదా వేశారు. అందువ‌ల్ల అప్ప‌టివ‌ర‌కూ వేచి ఉండాల్సి వ‌స్తుంది. ఈలోగా పార్టీ సంబంధించిన ఇత‌ర అంశా ల‌పై, విధివిధానా ల‌ను నిర్ణ‌యించుకో వ‌డంపై చ‌ర్చ‌లమీద దృష్టిపెడుతున్నారు.  ఒక‌వేళ డిసెంబ ర్ 12 కూడా కుద‌ర‌క‌పోతే ఇక వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కూ వేచి ఉండాల్సి వ‌స్తుందని రామ‌డుగు క‌ళ్యాణ‌శ‌ర్మ పండితులు తెలియ‌జేశార‌ట‌. 

మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కనిపించుట లేదు..!

ఎంత అన్నారు.. ఎంత ఎగిరారు మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్.. మంత్రి హోదాలో ఆ  టైమ్‌లో హీరోలాగా కోర మీసాన్ని   మెలి తిప్పేశాడు.. తొడ కొట్టేశాడు. కానీ మంత్రి పదవిని   మిఠాయి పొట్లాన్ని కాస్తా కాకి ఎత్తుకుపోయిన చందంగా ఆయన జిల్లాకే చెందిన కాకాణి గోవర్థన్ రెడ్డి ఎత్తుకెళ్లిన తర్వాత, మాజీ అయిన అనిల్ కుమార్ యాదవ్ సోదిలోనే లేకుండా పోయారు. దీంతో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి అనిల్ అదృశ్యమైపోయారంటూ సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.  మంత్రి పదవి ఊడిపోయి ... ఇంకా   ఆరు  నెలలు పూర్తి కాలేదు... అప్పడే... అనీల్ కుమార్ యాదవ్ కషాయం కట్టేశారా?.. కమండలం పట్టేసి.. సైలెంట్‌గా చెక్కేశారా? అంటూ ఆయన ప్రత్యర్థి వర్గం వ పంచ్‌లు మీద పంచులు పేలుస్తున్నారు తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అయితే ఆ సమావేశాల్లో ఎక్కడా అనిల్ కుమార్ యాదవ్ కనిపించలేదు. దీంతో వైసీపీలోనే  అనీల్ కుమార్ అంతర్ధానంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   అసెంబ్లీ సమావేశాలంటే ప్రతిపక్ష టీడీపీని చీల్చి చెండాడే  బృహత్తర అవకాశం. ఇలాంటి అవకాశాన్ని  నెల్లూరు సీటి ఫైర్ బ్రాంబ్ అనీల్ కుమార్ యాదవ్ ఎందుకు ఉపయోగించుకోలేదన్న చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.    మరోవైపు నెల్లూరు నగర ప్రజలు తమ ఎమ్మెల్యే   కనిపించడం లేదంటూ రేపో మాపో  స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుు సమాయత్తమౌతున్నారని ప్రచారంలో ఉంది.   2019 ఎన్నికల్లో   విజయం సాధించి  జగన్   తొలి కేబినెట్‌లో అత్యంత కీలక శాఖల్లో ఒకటైన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. దీంతో నెల్లూరు జిల్లాలో పార్టీలో సీనియర్లు.. సూపర్ సీనియర్లను కూడా   కాదని అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు  జగన్ మంత్రి పదవి కట్టబెట్టడంతో సీనియర్లు మింగలేక కక్కలేక మథన  పడ్డారు.  అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లను మీడియా సమావేశాలలో  విమర్శలతో రఫ్పాడించాలంటే  కొడాలి నాని  తరువాత  అనిల్ కుమార్ యాదవే అని అనుకునే స్థాయికి ఆయన ఎదిగిపోయారనడంలో సందేహం లేదు.  మరోవైపు మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్.... ఆయన సొంత జిల్లా నేతలతోనే ఐ డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరించేవారని.. కానీ మంత్రి పదవి కాస్తా పోయే సరికి ఇటు  సొంత జిల్లాలో పార్టీ నేతలతో సఖ్యత లేక.. అటు నియోజకవర్గంలో ఏ పనులూ చేయకపోవడంతో జనానికి ముఖం చూపించలేక సైలంటైపోయారని పార్టీ శ్రేణులే అంటున్నాయి.    కాగా వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గం మార్పుపై అనిల్ కుమార్ యాదవ్ దృష్టి కేంద్రీకరించారని.. ఆయన వెంకటగిరి నుంచి బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్నారని.. కానీ పార్టీ అధినాయకత్వం మాత్రం ఈ అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదనీ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అలాగే  అనిల్ కుమార్ యాదవ్‌కు ఆయన బాబాయి రూప్ కుమార్ యాదవ్ మధ్య రాజకీయంగా ఓ రేంజ్ లో ఫైట్ జరుగుతోందనీ, దీంతో  పరిస్థితి ప్రతికూలంగా ఉందని అర్థమైన అనిల్ కుమార్ యాదవ్ సైలంటై సైడైపోయారని అంటున్నారు.   

ఎన్టీఆర్ వ‌ర్సీటీకీ మీకూ సంబంధ‌మేమిటి.. చంద్ర‌బాబు

ఏపీ అసెంబ్లీ ఐదో రోజు బుధ‌వారం స‌మావేశం అయిన వెంట‌నే స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం ప్ర‌శ్నోత్త రాలు చేప‌ట్టారు. కానీ ఎన్టీఆర్ హెల్త్వ‌ర్సిటీ పేరు మార్పుపై స‌భ‌లో గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. హెల్త్ వ‌ర్సిటీ పేరు ఎలామారుస్తారంటూ టీడీపీ స‌భ్యులు భారీ నినాదాల‌తో హోరెత్తించారు. అయితే ఎన్టీఆర్ హెల్త్వర్సిటీ పేరు మార్పుపై బిల్లు పెట్టినప్పుడు అభిప్రాయం చెప్పాలని స్పీకర్ తెలిపారు. అయినప్ప టికీ టీడీపీ సభ్యులు తమ నిరసనను కొనసాగిస్తుండటంతో సభలో గందరగోళం నెలకొంది. సభ్యుల ఆందోళన ల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి.  ఎన్టీఆర్ హెల్త్యూనివర్సిటీకి వైఎస్ఆర్‌  పేరు పెట్టడంపై టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ 1986లో ఏర్పాటైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతో  వైఎస్ఆర్‌కు సంబంధమేమిట‌ని ప్రశ్నించారు. ఎన్టీఆర్ నిర్మించిన విశ్వ విద్యాలయానికి  మీ తండ్రి పేరు ఎలా పెట్టుకుంటావని సీఎం జ‌గ‌న్‌ని ప్ర‌శ్నించారు. హెల్త్ యూనివ ర్సి టీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందే అని స్పష్టం చేశారు. ఉన్న సంస్థలకు పేర్లు మార్చితే పేరు రాదని, కొత్తగానిర్మిస్తే పేరు వస్తుందని హితవు పలికారు. తెలుగు దేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకి స్తుందని ఆయన అన్నారు. వైద్య‌విద్య‌కు ప్ర‌త్యేక వ‌ర్సిటీ అవ‌స‌ర‌మ‌ని భావించే నాడు ఎన్టీఆర్ ఈ వ‌ర్సిటీని ఏర్పాటు చేశార‌ని చంద్ర బాబు గుర్తుచేశారు. ఆయ‌న మ‌ర‌ణాంత‌రం త‌మ ప్ర‌భుత్వంలో ఆ వ‌ర్సిటీకీ ఎన్టీఆర్ పేరు పెట్టామ‌న్నారు. కానీ  వ‌ర్సిటీ స్థాపించిన 36 యేళ్ల త‌ర్వాత ఈ వ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొల‌గించి వైఎస్ ఆర్ పేరు పెట్ట‌డం అర్ధ ర‌హిత‌మ‌ని టీడీపీ అధినేత అన్నారు.  మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేని ఈ ప్రభుత్వం ఉన్న వాటికే పేర్లు మార్చుతోందని మండిపడ్డారు. వర్సిటీ  రూ.450 కోట్ల నిధులు కూడా బల వంతంగా కాజేసిన ఈ ప్రభుత్వం.. ఏ హక్కుతో పేరు మార్చుతుందని నిలదీశారు. కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసి వర్సిటీ పరువు తీసి ఇప్పుడు పేరు మార్చుతారా అంటూ బాబు  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  దశాబ్దాల క్రితం ఏర్పాటైన సంస్థలకు ఉన్న పేర్లు మార్చి కొత్తగా మీ పేర్లు పెట్టుకుంటే మీకు పేరు రాదు. వ్యవస్థలను, సంస్థలను నిర్మిస్తేనే పేరు వస్తుంది అనే విషయాన్ని సీఎం జగన్ తెలుసు కోవాలి .ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును యథావిధిగా కొనసాగిం చాల‌ని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

మునుగోడు ముహూర్తం ఖరార్ .. ఉపఎన్నిక ఎప్పుడంటే ..!

మునుగోడు ఉపఎన్నికకు ముహూర్తం ఖారరైందా? సెప్టెంబర్ 17 న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్’ లో నిర్వహించిన తెలంగాణ  విమోచన దినోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన, కేంద్ర హోం మంత్రి అమిత్  షా, పార్టీ రాష్ట్ర నాయకులతో ప్రత్యేకంగా పరిస్థితిని సమీక్షించింది, అందుకేనా? అంటే, అవుననే అంటున్నారు బీజేపీ నాయకులు. నిజానికి,  బీజేపీలో చేరేందుకు, మునుగోడు సిట్టింగ్ (కాంగ్రెస్) ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి  ఆగష్టు 7 న, రాజీనామా చేశారు. ఆ తేదీ నుంచి ఆరు నెలలోపు  మునుగోడు అసెంబ్లీ స్థానికి ఉప ఎన్నిక జరగవలసి ఉంటుంది. అంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు టైముంది. అయితే, అంతవరకు ఆగితే,పరిస్థితి ఎటుపోయి ఎటు వస్తుందో అనే అనుమానంతో కావచ్చు, కమల దళం అక్టోబర్ లేదా నవంబర్’ నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.  నిజానికి, సాధారణంగా కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్, దేశంలో ఎక్కడైనా ఒకటి రెండు స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యం అయిన పరిస్థితిలో, ఆరు నెలల గడవు ముగిసేలోగా జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లతో పాటుగా ఉప ఎన్నికలు నిర్వహిస్తుంది. అందుకే, డిసెంబర్’లో జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా మునుగోడు ఉపఎన్నిక జరుగుతుందని అందరూ భావించారు. అయితే, నియోజక వర్గంలో పరిస్థితి వేగంగ మారుతున్నా నేపధ్యంలో ఆలస్యం అమృతం విషం అని భావించారో ఏమో కానీ,  మునుగోడు వ్యూహ రచనకు కేంద్ర బిందువుగా ఉన్న కేంద్ర మంత్రి అమిత్ షా, ముందుగానే ఉప ఎన్నిక  నిర్వహించాలనే  నిర్ణయానికి వచ్చారని, అదే విషయాన్ని  బీజేపే రాష్ట్ర నాయకులతో చర్చించారని అంటున్నారు. ఈ నేపధ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం వచ్చే నెల, (అక్టోబర్) చివరి వారంలో  మునుగోడుతో పాటుగా, ఇతర రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న మరికొన్ని అసెంబ్లీ , లోక్ సభ స్థానాల ఉపఎన్నికల కోసం ప్రత్యేకంగా షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారంగా తెలుస్తోంది.  నిజానికి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనేది, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాధికారం పరిదిలోకి రాదు. కేంద్రం ప్రభుత్వం నిర్ణయించదు. కేంద్ర ఎన్నికల సంఘం, నిర్ణయిస్తుంది. కానీ, రాజు తలచుకుంటే దెబ్బలకు  కొదవేముంది అన్నట్లు, మోడీ షా పాలనలో, కేంద్ర దర్యాప్తు సంస్థలే సర్కార్ చేతిలో కీలు బొమ్మల్లా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఎదుర్కుంటున్నపరిస్థితిలో కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందని అనుకోవడం, తీసుకోవాలని అసిచంచడం పేరాశే అవుతుంది. అందుకే బీజేపీ ఎప్పుడు ఉపఎన్నిక కావాలని అనుకుంటే అప్పుడు ఈసీ షెడ్యూల్ ఖరారు చేస్తుంది. ఎన్నిక నిర్వహిస్తుంది. ప్రస్తుతానికి అయితే, నెక్స్ట్ 45 డేస్’ లో మునుగోడు ఉప ఎన్నిక కథ ముగింపుకు వస్తుందని విశ్వసనీయంగా తెలుస్తోంది.

ప్రపంచం  ప్రమాదంలో ఉంది: యు.ఎన్‌ చీఫ్  హెచ్చరిక‌

ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రపంచం  పెద్ద ప్రమాదంలో ఉందని హెచ్చ రించారు. ఐక్యరాజ్యసమితి అధిపతి, మూడు సంవత్సరాలలో మొదటిసారిగా వ్యక్తిగతం గా కలుసుకునే నాయకులు సంఘర్షణలు వాతావరణ విపత్తులను, పెరుగుతున్న పేదరికం, అసమానతలను ఎదుర్కో వాలని, ప్రధానశక్తుల మధ్య విభజనలను పరిష్కరించాలని. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుండి ప‌రిస్థితులు దారుణంగా మారాయ‌ని ఛీఫ్ ఆందోళ‌న‌వ్య‌క్తం చేశారు. ఐక్య‌రాజ్య‌స‌మితి దేశాల  నాయకుల సమావేశం  ఆరంభిస్తూ గుటెర్రెస్,  ప్ర‌పంచాన్ని రక్షించడం మాత్ర మే కాకుండా, అక్షరాలా మంటల్లో ఉందన్నారు.  కానీ నిరంతర కోవిడ్‌ ని ఎదుర్కోవడం  అపారమైన పని ని ఉదహరించారు. కోవిడ్‌-19 మహమ్మారి. అభివృద్ధి చెందుతున్న దేశాలు కోలుకోవడానికి  ఆర్ధిక  వెసులు బాటు  లేకపోవడం, ఒక తరంలో కనిపించని సంక్షోభమ‌ని కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. విద్య, ఆరోగ్యం, మహిళల హక్కుల కోసం కోల్పోయిన లోకాన్ని గురించి స‌విస్త‌ర వివ‌ర‌ణ ఇచ్చారు. భౌగోళిక రాజకీయ విభజనలు మనందరినీ ప్రమాదంలో పడేస్తున్నప్రపంచానికి ఇది హుందాగా, వాస్తవిక మైన  పరిష్కా రాల పై దృష్టి కేంద్రీ కరించిన నివేదిక కార్డు అని యు.ఎన్‌ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ అన్నారు. ప్రపంచ నాయకుల 77వ జనరల్ అసెంబ్లీ సమావేశం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత  యూరప్ యుద్ధ నీడ.. రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదం.. ఇది ప్రపంచ ఆహార సంక్షోభాన్ని స్ప‌ష్టంచేసింది. అంతే గాక‌,  ప్రధాన శక్తుల మధ్య చీలికలను యుద్ధ‌వాతావ‌ర‌ణం స్ప‌ష్టంచేసింది. దాదాపు 150 మంది దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు తాజా స్పీకర్ల జాబితాలో ఉన్నారు. గ్రహం ఛిన్నా భిన్నమైన స్థితి ఉన్నప్పటికీ, ఐక్యరాజ్యసమితి అధ్యక్షులు, ప్రధానులు, చక్రవర్తులు, మంత్రులు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి మాత్రమే కాకుండా, గ్లోబల్ ఎజెండాలోని సవాళ్లను చర్చించడానికి ప్రైవేట్‌గా కలవడానికి కీలకమైన సమావేశ స్థలంగా మిగిలిపోయింది - మరియు ఆశాజనక కొంత పురోగతి.  రష్యా ఫిబ్రవరి 24 ఉక్రెయిన్‌పై దాడి, ఇది దాని చిన్న పొరుగువారి సార్వభౌమత్వాన్ని బెదిరించడమే కాకుండా ఇప్పుడు రష్యా ఆక్రమిత ఆగ్నేయ ప్రాంతంలోని యూరప్‌లోని అతిపెద్ద అణు కర్మాగారంలో అణు విపత్తు గురించి భయాలను పెంచింది. అనేక దేశాలలో నాయకులు విస్తృత యుద్ధాన్ని నిరోధించడానికి మరియు ఐరోపాలో శాంతిని పునరుద్ధ రించడానికి ప్రయత్నిస్తున్నారు. దౌత్యవేత్తలు, అయితే, ఈ వారం ఎటువంటి పురోగతిని ఆశించడం లేదు. ఉక్రెయిన్, రష్యా నుండి ముఖ్యమైన ధాన్యం మరియు ఎరువుల ఎగుమతుల నష్టం ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆహార సంక్షోభానికి దారితీసింది, అనేక ఇతర దేశాలలో ద్రవ్యోల్బణం  పెరుగుతున్న జీవన వ్యయం. అనే అంశాలు ఎజెండాలో ఎక్కువగా ఉన్నాయి. 2030 కోసం యు.ఎన్‌ లక్ష్యాలను ప్రోత్సహించడానికి సోమవారం జరిగిన సమావేశంలో - తీవ్రమైన పేదరి కాన్ని అంతం చేయడం, పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించడం మరియు లింగ సమానత్వాన్ని సాధించడంవంటివి- గుటెర్రెస్ మాట్లాడుతూ ప్రపంచంలోని అనేక తీవ్రమైన ప్రమాదాలు మన దీర్ఘకా లిక అభివృద్ధి ప్రాధాన్యతలను ఒక వైపు ఉంచడానికి ఉత్సాహం  క‌లిగిస్తు న్నాయ‌న్నారు. కానీ కొన్నివిషయాలు వేచి ఉండలేవని యుఎన్ చీఫ్ చెప్పారు. వాటిలో విద్య, గౌరవప్రదమైన ఉద్యో గాలు, మహిళలు బాలికలకు పూర్తి సమానత్వం, సమగ్ర ఆరోగ్య సంరక్షణ  వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించ డానికి చర్యలు. ప్రభుత్వ  ప్రైవేట్ ఫైనాన్స్ మరియు పెట్టుబడులు అన్నింటికంటే శాంతి కోసం అతను పిలుపునిచ్చారు. జనరల్ డిబేట్ అని పిలిచే  గ్లోబల్ గాదరింగ్, మహమ్మారి కారణంగా 2020లో పూర్తిగా వర్చువల్‌గా 2021లో హైబ్రిడ్‌గా మారింది. ఈ సంవత్సరం, 193-సభ్యుల జనరల్ అసెంబ్లీ వ్యక్తిగత ప్రసంగాలకు మాత్రమే వీలుంటుంది, ఒక్క మినహాయింపు తో ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జ‌ల‌న్‌స్కీ రష్యా, కొన్ని మిత్రదేశాల అభ్యంతరాలపై, ఉక్రేనియన్ నాయకుడు తన నియంత్రణకు మించిన కార ణాల వల్ల - కొన సాగుతున్న విదేశీ దండయాత్ర  సైనిక శత్రుత్వాల కారణంగా అతని దేశ రక్షణ  భద్రతా విధులు. సంప్రదాయం ప్రకారం, బ్రెజిల్ ఏడు దశాబ్దాలకు పైగా మొదట ప్ర‌స్థావించింది. 

మాటే మారెనా.. మమత తానే మారెనా.. మోడీనే శరణు కోరెనా?

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలియాలి అంటారు. రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన మమతా బెనర్జీకి ఆ విషయం ఇటీవలే తెలిసొస్తోంది. కేంద్ర ప్రభుత్వంపైనా, ప్రధాని మోడీపైనా విమర్శలతో విరుచుకుపడే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన గొంతు సవరించుకున్నారు. స్వరం మార్చారు. విమర్శల వాడిని తగ్గించారు. మెడీ మంచివాడేనన్నట్లుగా మాట్లాడారు. ఇంతకీ అసెంబ్లీ వేదికగా ఆమె మోడీపై సానుకూల వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడిన సందర్భం ఏమిటయ్యా అంటే... కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తదితర ఏజెన్సీలకు వ్యతిరేకంగా తీర్మానించిన తొలి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. ఇటీవలి కాలంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ నాయకులపై ఈడీ సీబీఐలు దూకుడుగా వ్యవహరిస్తుండటం, కేసులు పెట్టి అరెస్టులు చేస్తుండటం తెలిసిందే. ఇటీవలి కాలంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు పార్థ ఛటర్జీ ఉపాధ్యాయ నియామక స్కాంలో అరెస్టయ్యారు. సీఎం మమతా బెనర్జీకి సన్నిహితుడిగా పేరొందిన పార్థా ఛటర్జీ అరెస్టు అయిన తరువాత పార్టీ కేబినెట్ నుంచి బర్త్ రఫ్ అయ్యారు. పార్టీ నుంచి సస్పెండయ్యారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ బీర్బూమ్ జిల్లా అధ్యక్షురాలు అనుబ్రతా మోండల్ పశువుల అక్రమ రవాణా కేసులో అరెస్టయ్యారు. ఒక్క తృణమూల్ కాంగ్రెస్ అనేమిటి.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో నాన్ బీజేపీ  పార్టీలు, నేతలు లక్ష్యంగా సీబీఐ,ఈడీ,ఐటి దాడులు జరుగుతున్నాయని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. వాస్తవానికి కేంద్ర దర్యాప్తు సంస్ధల   దాడుల్లో నాన్ బీజేపీ పార్టీలకు చెందిన కీలక నేతలే ఎక్కువమంది అరెస్టవుతున్నారు. ఢిల్లీ, కర్ణాటక, జార్ఖండ్, మహారాష్ట్ర, బీహార్,తెలంగాణా  రాష్ట్రాల్లో కూడా బీజేపీయేతర పార్టీల నాయకులు లక్ష్యంగా దాడులు జరిగాయి, జరుగుతున్నాయన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే  నరేంద్ర మోడీ ప్రతిపక్షాలను, ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి మరీ కేసుల్లో ఇరికిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. తృణమూల్ సభ్యులు నిర్మల్ ఘోష్, తపస్ రాయ్  శాసనసభలో రూల్ 169 కింద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర ఏజెన్సీలు పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ నేతలను ఎంపిక చేసి భయాందోళనకు గురిచేస్తున్నాయని తీర్మానంలో పేర్కొన్నారు. ఇంత వరకూ బానే ఉంది ఆ తరువాత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సభలో చేసిన ప్రసంగమే అందరినీ ఆశ్చర్య పరిచింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు విపక్షాలను టార్గెట్ చేసి నిర్వహిస్తున్న దాడులు ప్రధాని మోడీకి తెలిసే జరుగుతున్నాయని తాను విశ్వసించడం లేదని మమతా బెనర్జీ అన్నారు. ఈ దాడుల వెనుక మోడీ ప్రమేయం లేదని చెప్పారు. అయితే మమత తన ప్రసంగంలో మోడీ పట్ల సానుకూల వ్యాఖ్యలు చేసి అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కనుసన్నలలోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయన్న అర్ధం వచ్చేలా మాట్లాడారు. అయితే మొత్తం మీద మమతా బెనర్జీ మోడీ పట్ల సానుకూల ధోరణిలో మాట్లాడటమే రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. కేంద్ర దర్యాప్తు సంస్థల నజర్ లో తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన మరింత మంది ఉండటంతో ఆమె మోడీతో ఘర్షణాత్మక ధోరణిలో కాకుండా సామరస్యంగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే తన సహజ శైలికి భిన్నంగా విపక్ష నేతలు టార్గెట్ గా కేంద్ర దర్యాప్తు సంస్థల దాడుల వెనుక మోడీ ఉన్నారని తాను భావించడం లేదని అన్నారు. ఒక వైపు కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి, మరో వంక మోడీకీ ఈ దాడులకూ సంబంధం లేదనడం ద్వారా మమతా రక్షణాత్మక ధోరణిలో వ్యవహరించారని, కేంద్రంతో పోరాడుతూనే.. మోడీ ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలన్న వ్యూహంతోనే ఆమె అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడి ఉంటారని పరిశీలకులు అంటున్నారు. పార్థా ఛటర్జీ అరెస్టు తరువాత నుంచీ కూడా కేంద్రంపై మమత విమర్శల దూకుడు తగ్గించిన విషయాన్ని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అంతే కాకుండా పార్థ ఛటర్జీ అరెస్టు విషయంలో మమతా బెనర్జీ స్పందించకపోవడాన్ని, పార్థ ఛటర్జీ స్వయంగా ఫోన్ చేసినా కూడా ఆమె ఆన్సర్ చేయకపోవడాన్నీ కూడా వారీ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. చిక్కుల్లో పడటం కంటే తగ్గి స్వాంతన పొందడమే మేలని మమత భావిస్తున్నారని విశ్లేషణలు చేస్తున్నారు. 

గ్రీన్‌, వేడ్ వీర‌విహారంతో ఆసీస్ విజ‌యం

మొహాలీలో ఆసీస్‌తో త‌ల‌ప‌డిన మొద‌టి టీ20లో గ్రీన్‌, వేడ్ వీర‌ బాదుడుతో, భువ‌నేశ్వ‌ర్, హ‌ర్ష‌ల్‌ చెత్త బౌలింగ్‌తో భార‌త్ ఓడి పోయింది. మూడుమ్యాచ్‌ల  సిరీ స్‌లో మొద‌టి మ్యాచ్‌లో ఆసీస్ చివ‌రి ఓవ‌ర్లో ఇంకా నాలుగు బంతులు ఉండ‌గానే గెలి చింది. మొదట బ్యాటింగ్ చేసిన భార‌త్ అత్య‌ధికంగా 209 ప‌రుగులు చేసింది. వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్స్ ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో విజ‌ యం సాధించింది. స్పిన్న‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ అద్భుతంగా బౌలిం గ్ చేసి 4 ఓవ‌ర్ల‌లో 17 ప‌రుగు లిచ్చి 3 వికెట్లు తీశాడు.  మొద‌ట బ్యాట్చేసిన భార‌త్ ప‌వ‌ ర్ ప్లే ముగిసే స‌మ‌యానికి 46 ప‌రుగులే చేసి కెప్టెన్ శ‌ర్మ‌, కింగ్ కోహ్లీ వికెట్లు కోల్పోయింది. శ‌ర్మ 9 బంతుల్లో 11 ప‌రుగులే చేశాడు. మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు అనుకున్న కోహ్లీ 7 బంతుల్లో కేవ‌లం 2 ప‌రుగులే చేసి వెనుదిర గ‌డం అభిమానుల‌ను నిరాశ‌ప‌రిచింది. భార‌త్ 50 ప‌రుగులు 7వ ఓవ‌ర్లో పూర్తిచేయ‌గ‌లిగింది. ఒక వంక కెప్టెన్ వెను దిరిగి న‌ప్ప‌టికీ మ‌రోవంక కె.ఎల్‌. రాహుల్ జాగ్ర‌త్త‌గా ఆడుతూ ఇన్నింగ్స్ నిల‌బెట్టేడు. రాహుల్ మంచి షాట్స్ ప్ర‌ద‌ర్శించాడు. ఊహిం చ‌ని విధంగా సిక్స్లు కొట్టి అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు. 8వ ఓవ‌రో్ల కొట్టిన సిక్స్‌తో రాహుల్‌ టీ20ల్లో 2000 ప‌రుగులు అధిగ‌ మించాడు. ప‌ది ఓవ‌ర్లు పూర్త‌య్యేస‌రికి భార‌త్ 2 వికెట్ల న‌ష్టానికి 86 ప‌రుగులు చేసింది. 11వ ఓవ‌ర్లో రాహుల్ అర్ధ‌సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. 2 సిక్స్‌ల‌తో స‌హా రాహుల్ 50 ప‌రుగులు 32 బంతుల్లో కొట్టాడు. అప్ప‌టికి భార‌త్ 91 ప‌రుగులు చేసిన‌ట్ల‌యింది. రాహుల్‌, సూర్య‌కుమార్లు అప్ప‌టికి 39 బంతుల్లో 56ప‌రుగులు పూర్తిచేశారు. 12వ ఓవ‌ర్లో భార‌త్ వంద‌ప‌రుగులు పూర్తిచేసింది. హాజ‌ల్ఉడ్ ఓవ‌ర్లో రాహుల్ వెనుదిరిగాడు. అత‌ను 35 బంతులో్ల 55 ప‌రుగులు చేయ‌ గ‌లిగాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన హార్దిక్ పాండ్యా అద్భుతంగా బ్యాట్ చేశాడు. ఆసీస్ బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టాడు. 13వ ఓవ‌ర్ స్పిన్న‌ర్ జాంపా వేయ‌గా ఆ ఓవ‌ర్లో 16 ప‌రుగులు వ‌చ్చాయి. ముఖ్యంగా పాండ్యా ఇర‌గ‌దీశాడు. 14వ ఓవ‌ర్లో సూర్య అవుట‌ య్యాడు. అత‌ను 24 బంతుల్లో 46 ప‌రుగులు చేశాడు. పాండ్యాతో క‌లిసి వేగంగా ప‌రుగులు చేయ‌డంతో భార‌త్ స్కోర్ 126 ప‌రుగుల‌కు చేరుకుంది. 15వ ఓవ‌ర్లో క‌మిన్స్ ప‌ది ప‌రుగులు ఇచ్చుకున్నాడు. 15 ఓవ‌ర్లు పూర్త‌య్యేస‌రికి భార‌త్ 4 వికెట్ల న‌ష్టానికి 141 ప‌రుగులుచేసింది. 16వ ఓవ‌ర్లో అక్ష‌ర్ అవుట‌య్యాడు. త‌ర్వాత కార్తిక్ వ‌చ్చాడు కానీ అత‌ను కేవ‌లం రెండు ప‌రుగుల‌కే వెనుదిరిగి నిరాశ‌ప‌రిచాడు. భార‌త్ 150 ప‌రుగులు 17వ ఓవ‌ర్లో పూర్త‌య్యాయి. 18వ ఓవ‌ర్లో భార‌త్ కు 16 ప‌రుగులు రావ‌డంతో భార‌త్ 5 వికెట్ల న‌ష్టానికి 176 చేసింది. మ‌రో ఎండ్‌లో పాండ్యా వీర‌బాదుడుతో భార‌త్ 20 ఓవ‌ర్ల‌లో 208 ప‌రుగులు చేసింది. పాండ్యా కేవ‌లం 30 బంతులోల్ 71 ప‌రుగులు చేశాడు. భార‌త్ ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 13 సిక్స్‌లు రావ‌డం గ‌మ‌నిచ‌ద‌గ్గ అంశం.  ఆసీస్ ఇన్నింగ్స్ విష‌యానికి వ‌స్తే మొదటి నుంచే ధాటిగా ఆడారు. భార‌త్ బౌల‌ర్లు ఏమాత్రం ప్ర‌భావం చూప‌లేదు. ఫించ్‌, గ్రీన్‌ లు భార‌త్ పేస‌ర్లు భువ‌నేశ్వ‌ర్‌, ఉమేష్ యాద‌వ్‌ల‌ను సునాయాసంగా ఆడారు. ఏదో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నంత సులువుగా ఫోర్లు, సిక్స్‌లు కొడుతూ మొద‌టి ఆరు ఓవ‌ర్ల‌లోనే జ‌ట్టు స్కోర్ 50 ప‌రుగుల‌కు చేర్చారు. ఆ స‌మ‌యంలో ఫించ్‌ను స్పిన్న‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ పెవిలియ‌న్ దారి ప‌ట్టించ‌డం కాస్తంత ఊపిరిపీల్చుకున్న‌ట్ల‌యింది.  కానీ గ్రీన్ రూపంలో ఆసీస్‌కు సూప‌ర్ బ్యాట‌ర్ విజృంభ‌ణ ప్ర‌ద‌ర్శిత‌మ‌యింది. బౌల‌ర్లు వారి మీద ఎలాంటి ప్ర‌భావం చూప‌క‌పోవ‌డంతో పాటు కీల‌క స‌మ‌యంలో రెండు క్యాచ్‌లు వ‌దిలే య‌డంతో ఆసీస్‌కు సువ‌ర్ణ అవ‌కాశం ఇచ్చిన‌ట్ల‌యింది. గ్రీన్ 30 బంతులోల్ల 61 ప‌రుగులు స్మిత్ 24 బంతులో్ల 35 ప‌రుగులు చేయ‌డంలో భార‌త్ బౌల‌ర్ల‌ను ఛండాడారు. మాక్స్‌వెల్ స్కోర్ చేయ‌కుండానే వెనుతిరిగిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత వ‌చ్చిన మాథ్యూవేడ్ భార‌త్బౌల‌ర్ల‌ను బౌలింగ్ మ‌ర్చి పోయేట్టు బాద‌డంతో ఆసీస్ విజ‌యం సునాయాసం అయింది. ముఖ్యంగా భువ‌నేశ్వ‌ర్ చాలా దారుణంగా బౌలింగ్‌ చేశాడు. చివ‌రి ఓవ‌ర్ల‌లో చాలా ప‌రుగులిచ్చాడు. చివ‌రి ఓవ‌ర్‌లో ఇంకా నాలుగు బంతులు ఉండ‌గానే ఆసీస్ విజ‌యం సాధించింది. ఆసీస్ విజ‌యంలో కీల‌క‌పాత్ర వ‌హించిన వేడ్‌కు గేమ్ ఛేంజ‌ర్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా గ్రీన్‌కు అవార్డ ఇచ్చారు.  

నియోజకవర్గాల పెంపు.. పునర్విభజన చట్టంలో ఉన్నా.. మొండి చెయ్యే!

కొన్నివార్తలు అంతే, చస్తూ ఉంటాయి, మళ్ళీ పుడుతూ ఉంటాయి. పునరపి జననం.. పునరపి మరణం...అన్నట్లు అన్నమాట. ఉభయ తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజక వర్గాల పెంపుకు  సబందించిన వార్త కూడా అంతే. నిజానికి, ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన చాలా చాలా చెల్లని హామీలలో ఇది కూడా ఒకటి. ఎపీకి ప్రత్యేక హోదా, తెలంగాణకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వంటి అనేక ఉత్తుత్తి హమీల్లాగానే, ఉభయ తెలుగు తెలుగు రాష్టాల్లో అసెంబ్లీ నియోజక వర్గాల సంఖ్య పెంచే హామీ కూడా ఉత్తుత్తి హమీనే అనే  విషయం అందరికీ తెలిసిందే. అయినా, నియోజక వర్గాల పెంపు అనే మాట వినగానే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాజకీయ సందడి మొదలవుతుంది. నిజానికి ఇందుకు సంబంధించి గడచిన ఎనిమిదేళ్ళలో తెలుగు రాష్ట్రాల ఎంపీలు పార్లమెంట్ లో అనేక సందర్భాలలో ప్రస్తావన తెచ్చారు.అయితే ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలోనూ కేంద్ర ప్రభుత్వం, అది ఇప్పట్లో కాదని ఖరాఖండిగా చెపుతూనే వుంది. 2026 జనాభా లెక్కలు తేలిన తర్వాత చూద్దాం అన్నట్లుగా దాటవేస్తోంది.  అయితే ఇప్పడు కొత్తగా మరో ఆశ చిగురించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో శాసనసభ నియోజకవర్గాల పెంపుపై కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్  పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ నియోజక వర్గాలను పెంచాలని, కానీ, ఇంత వరకూ ఆ ప్రక్రియను మొదలు పెట్టలేదంటూ పర్యావరణవేత్త ప్రొఫెసర్‌ కె.పురుషోత్తమ్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ సీట్లను 225కి, తెలంగాణలోని 119 సీట్లను 153కి పెంచాలని రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 26లో ఉందని, కానీ, ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఆ ప్రక్రియ  మొదలు పెట్టలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది రావు రంజిత్‌ వివరించారు. జమ్ము కశ్మీర్‌ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న నిబంధన మేరకు అక్కడ నియోజక వర్గాలను పెంచడానికి డీలిమిటేషన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసిందనీ, అదే నిబంధన ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నా కేంద్రం   చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ సీట్లను పెంచుతున్నప్పుడు ఏపీ, తెలంగాణల్లో ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే, సుప్రీం ధర్మాసనం కేంద్ర, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, ఈసీకి నోటీసులు జారీ చేసింది.   ఇంతవరకు రాజకీయ  పార్టీలు, పార్లమెంట్ సభ్యులు ఇదే ప్రశ్న వేసినా కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టిచుకోలేదు. మంత్రులు నియోకజకవర్గాలు పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని సమధాన్నాని దాట వేస్తూ వచ్చారు. అయితే ఇప్పడు, సుప్రీం కోర్టు  నోటీసులు జారీ చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఏమి సమాధానం ఇస్తుందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.   సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై ఏదో ఒక వైఖరి తీసుకోకుండా ఇక కేంద్ర ప్రభుత్వం తప్పించుకోలేదని న్యాయనిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు.  నిజానికి, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 26 ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో నియోజక వర్గాలను పెంచాలని రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ కేంద్రానికి టీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి చేస్తూనే ఉంది. అయితే, నియోజక వర్గాల పెంపునకు రాజ్యాంగ సవరణ అవసరమని కేంద్ర ప్రభుత్వం వాదిస్తూ ఆవు కథను వినిపిస్తూ వచ్చింది. అయితే తెరాస నియోజక వర్గాలు పెంచాలని కోరినా, బీజేపీ ప్రభుత్వం కాదన్నా అందుకు ప్రధానంగా రాజకీయమే కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాజకీయంగా లాభ నష్టాలను బీజేపీ బేరీజు వేసుకుంటుందని, నియోజక వర్గాలు పెంచితే తమకు అనుకూలమని అంచనాకు వస్తేనే ఈ అంశంపై ముందుకెళ్లే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు. అప్పటి వరకూ కేంద్రం కాలయాపన చేస్తూనే ఉంటుందని చెబుతున్నారు. కాగా, తెలంగాణలో నియోజక వర్గాలు పెరిగితే రాజకీయంగా తమకు నష్టం జరుగుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజక వర్గాల్లోనే మెజారిటీ స్థానాల్లో తమ పార్టీకి బలమైన అభ్యర్థులు లేరని, నియోజక వర్గాలను పెంచితే బలమైన అభ్యర్థులు దొరకడం కష్టతరమన్నది వారి అభిప్రాయంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే, తెరాస నియోజక వర్గాల సంఖ్య పెరిగితే మరింత మంది పార్టీ నేతలకు అవకాసం కలిపించి,అసంతృప్తిని తగ్గించుకోవచ్చని ఆశిస్తోంది. అయితే, కోర్టుల్లో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే సరికి పుణ్య కాలం పూర్తవుతుందని అంటున్నారు.

అమరావతే ఏపీ రాజధాని: తెలుగువన్ ఎండీ కంఠంనేని రవి శంకర్

అమరావతి రైతుల మహా పాదయాత్రలో తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ పాల్గొన్నారు. ఏపీకి ఒకటే రాజధాని అది అమరావతే అని నినదిస్తూ అమరావతి రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకూ చేపట్టిన  పాదయాత్ర మంగళవారం తొమ్మిదో రోజు బాపట్ల జిల్లా రేపల్లె నుంచి మొదలై పెనుమూడి వారథి మీదుగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది.  ఈ సందర్బంగా కృష్ణా జిల్లాలోని పల్లె పల్లె నుంచీ జనం అమరావతి రైతులకు ఘనస్వాగతం పలికారు. పెనుమూడి వారధి కింద కృష్ణానది ప్రవహిస్తుంటే.. వారథిపైనా ఆకుపచ్చ ప్రవాహం సాగుతోందా అన్నట్లుగా రైతుల పాదయాత్ర సాగింది. అమరావతిని నిర్వీర్యం చేయడం ద్వారా జగన్ యావత్ రాష్ట్రాన్నీ అధోగతి పాలు చేశారనీ, ఈ విషయాన్ని రాష్ట్రప్రజలు గుర్తించారని రైతులు పేర్కొన్నారు.  జగన్ సర్కార్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అవాంతరాలు కల్పించినా, అసత్య ప్రచారాలు చేసినా జనం మాత్రం అమరావతే రాజధాని కావాలని కోరుకుంటున్నారనీ, అందుకు తమ పాదయాత్రకు వస్తున్న అపూర్వ స్పందనే నిదర్శనమని రైతులు పేర్కొన్నారు.  కృష్ణా జిల్లాలోకి రైతుల మహాపాదయాత్రకు స్వాగతం పలుకుతూ తెలుగువన్ ఎండీ కంఠంనేని రవి శంకర్ జగన్ ప్రభుత్వం తుగ్లక్ ప్రభుత్వమని నిప్పులు చెరిగారు. కర్నాటక రాజధాని బెంగళూరు, తమిళనాడు రాజధాని చెన్నై ఎలాగో  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమేనన్నారు. రైతుల మహాపాదయాత్రకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందన్నారు.    ఈ పాదయాత్రలో తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, వివిధ పార్టీలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు పాదయాత్రకు మద్దతు తెలుపుతూ పెద్ద సంఖ్యలో వచ్చారు. అవనిగడ్డ బార్ అసోసియేషన్ రైతుల పాదయాత్రకు పూర్తి మద్దతు ప్రకటించింది.  మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు ప్రారంభించిన ఉద్యమం ఈ ఏడాది సెప్టెంబర్ 12వ తేదీతో వెయ్యి రోజులు పూర్తి చేసుకుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని రైతులు అమరావతి టు అరసవల్లి మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు.  రాజధాని పరిధిలోని 29 గ్రామాల నుంచి రైతులు, రైతు కూలీలు, మహిళలుతోపాటు అన్ని వర్గాల వారు ఈ మహా పాదయాత్రలో పాల్గొంటున్నారు.  ఈ మహా పాదయాత్ర... వెయ్యి కిలోమీటర్లు సాగి.. నవంబర్ 11న శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో కొలువైన ప్రత్యక్ష నారాయణుడు సూర్య భాగవానుడి చెంతకు చేరనుంది. ఈ మహా పాదయాత్రకు అధికార వైసీపీ మినహా  అన్ని రాజకీయ పార్టీలూ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.  

ప్రజాప్రతినిథులపై కేసుల ఉపసంహరణ జీవోలను ఉపసంహరించుకున్న జగన్ సర్కార్

అడుసు తొక్కడం.. కాళ్లు కడుక్కున్నట్లు చేయడం వైసీపీ సర్కార్ కు ఒక అలవాటుగా మారిపోయింది. గత మూడేళ్లుగా ఏపీలో జగన్ ప్రభుత్వం తీసుకున్న దాదాపు ప్రతి నిర్ణయానికీ న్యాయస్థానంలో చుక్కెదురైంది. కోర్టు అక్షింతలు వేయడం ప్రభుత్వం వెనక్కు తగ్గడం ఒక అలవాటుగా మారిపోయింది. తాజాగా వైసీపీ ప్రజా ప్రతినిథులపై కేసులు ఎత్తివేస్తూ జారీ చేసిన జీవోను కూడా సర్కార్ ఉపసంహరించుకుంది. సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించి మరీ రాష్ట్రంలో వైసీపీ ప్రజా ప్రతినిథులపై కేసులను ఉపసంహరిస్తూ జగన్ సర్కార్ మూడు జీవోలను  చేసిన సంగతి తెలిసిందే. అయితే  దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధు లపై కేసులవిచారణను వేగవంతం చేసి సాధ్యమై నంత త్వరగా తీర్పులు ఇవ్వాలనికోరుతూ భాజపా నాయకుడు అశ్వినీకుమార్ ఉపాధ్యాయగతంలో సుప్రీం దాఖలు చేసిన  ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీం కోర్టు హైకోర్టుల అనుమతి లేకుండా ప్రస్తుత, పూర్వ ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల ఉపసంహరణ కుదరదని విస్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏపీ హైకోర్టు   2020 సెప్టెంబరు 16 నుంచి2021 ఆగస్టు 25 మధ్య రాష్ట్రంలో ప్రజాప్రతినిధు లపైఎన్ని కేసులు ఉపసంహర ణకు జీవోలు ఇచ్చారు తదితర వివరాల్ని పరిశీలించేందుకు హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది. వైకాపా ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చర్యలు తీసుకునేందుకు సిఫార్సు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన తొమ్మిది జీవోలను ఈ వ్యాజ్యంలో ప్రస్తావించింది. అలాగే   జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభా నుపై మొత్తం పది కేసుల ఉపసంహరణకు ఇచ్చిన జీవోను సవాలు చేస్తూ ఏపీ జర్నలిస్టు ఫోరం అధ్య క్షుడు చెవులకృష్ణాంజనేయులు హైకోర్టులోదాఖలు చేశారు. మరో వైపు వైకాపాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణకు ఆమోదంతెలపాలని హైకోర్టును కోరుతూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దాఖలు చేసింది.  సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ప్రజాప్రతినిధులపై కేసులనుఉపసంహరించేందుకు జీవోలు జారీ చేసిన ప్రభుత్వం డేంజర్ జోన్ లో ఉందని హైకోర్టు గత విచారణలో వ్యాఖ్యానించింది. దీంతో సోమవారం హైకోర్టులో ఈ కేసులపై జరిగిన విచారణలో   ప్రభుత్వ న్యాయవాది మహేశ్వరరెడ్డి  ప్రజాప్రతినిధులపై కేసులు ఉపసంహరణకుగతంలో ఇచ్చిన 3 జీవోలనూ ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చినట్లు  తెలిపారు. ఆ వివరాలను మెమో రూపంలోకోర్టు ముందు ఉంచుతామన్నారు.  కేసుల ఉపసంహరణ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరిస్తామని కోర్టుకు తెలిపారు.  ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను అక్టోబరు13కు వాయిదా వేసింది.  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్మిశ్ర, జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతోకూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకుఆదేశాలు జారీ చేసింది. 

 ఫ్ల‌యిట్‌లో సీటు మార్చారు ఎందుకో తెలుసా?

మొద‌టిసారి మెట్రో రైల్లోనో, విమానంలోనో ప్ర‌యాణించేవారికి త‌లుపులు తెరుచుకోవ‌డం తెలియాలి. క‌నీసం ఎవ‌ర‌న్నాచెబితే తెలుసుకోవాలి. అస‌లు అందుకు ప‌క్క‌నున్న‌వారితో మాట్లాడ్డం తెలియాలి. అంటే భాషాప‌ర‌మైన తేడాలు ఉంటే మాత్రం బ‌హుత్ క‌ష్ట్ హై! ఏది వ‌చ్చినా రాకపోయినా ఈ రోజుల్లో కాస్తంత ఇంగ్లీషు మాత్రం చ‌చ్చిన‌ట్టు వ‌చ్చితీరాలి. లేక‌పోతే అనామ‌కుని చూసిన‌ట్టు చూస్తారు. నువ్వు అరిచి గింజుకున్నా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోరు.  విమానంలో సీటూ మారుస్తారు. ఇంగ్లీషోడి రూల్‌! ఈరోజుల్లో మ‌న‌వ‌ళ్ల‌ను చూసుకోను పెద్ద‌వాళ్లు ఓపిక తెచ్చుకుని మ‌రీ అవ‌కాయ‌జాడీల‌తో విదేశాల‌కు వెళు తున్నారు. బ‌స్సెక్కినంత సులువే అన్నా..అనుకుంటారు. కానీ అస‌లు స‌మ‌స్య కూచున్న‌త‌ర్వాత నుంచి మొద‌ల‌వుతుంది. మ‌నూరు బ‌స్సు సీట్ల కంటే మంచిసీట్ల‌ని విశ్రాంతి తీసుకోవ‌చ్చు. కానీ హ‌ఠా త్తుగా  ఓ అమ్మాయి వ‌చ్చి వాట్ యూ ఈట్‌? అనో ఆప్ క్యా ఖాతీ? అనో అడుగుతుంది. ఏవంట‌ది అన్నా.. అని ప‌క్కాయ‌న్నోసారి అడిగితే మీ ప‌ని అయిపోయిన‌ట్టే. ప‌క్క‌వాళ్లు చాలా చిరాగ్గా చూస్తారు. ఫ్ల‌యిట్ అటెండ‌ర్ న‌వ్వుతుంది. వెన‌కాల కూచున్నాయ‌న‌తో పెద్ద జోక్‌లా చెప్పి పొట్ట‌చెక్క‌ల‌య్యేలా న‌వ్విస్తుంది. మ‌నం జోక‌ర్ అవుతాం. అదీ సంగ‌తి. అంచేత రెండు ముక్క‌లు ఇంగ్లీషు, నాలుగు ముక్క‌ లు హిందీ రావాలంటా రు మ‌రి! అన్న‌ట్టు మ‌రో ప్ర‌మాదం కూడా ఉందండోయ్‌. ప‌క్క‌వాళ్ల‌కి  మ‌నం మాట్లా డేది అర్ధంగాక‌పోయినా, ప్ర‌ధాన రెండు భాష‌లు రాక‌పోయినా అమాంతం సీట్లు మార్చేయ‌గ‌లరు. ఆ ప్ర‌మాద‌మూ ఉంది. బ‌స్సులో లా కిటికీ ద‌గ్గ‌ర సీటు దొరికింద‌ని ఆనందించొద్దు. ప‌క్క‌నున్న‌ది మీ వూరు వాళ్ల‌యితే ఫ‌ర‌వాలేదు.. కాక‌పోతేనే పెను ప్ర‌మాదం. అమాంతం మిమ్మ‌ల్ని వెన‌క్కి పంపేస్తారు. మొన్నీమ‌ధ్య‌నే ఇండిగో విమానంలో ఇలాం టి సంఘ‌ట‌నే జ‌రిగింది.  ఓ తెలుగు పెద్దావిడకి తెలుగు త‌ప్ప మ‌రో భాష రాదు. అది ఆమె త‌ప్పు కాదు. కానీ తోటి ప్ర‌యాణీకుడికి, ఫ్ల‌యిట్ అటెండ‌ర్‌కీ ఇబ్బంది క‌లిగింది. ఏది అడిగినా స‌రిగా స‌మాధానం రావ‌డం లేదు. అమెకు తెలుగు త‌ప్ప మ‌రో భాష రాద‌ని అర్ధ‌మ‌యింది. అందువ‌ల్ల ఆమెను వేరే సీట్లోకి మార్చేరు. ఆమె పాపం తెగ కంగారు ప‌డింది. ఇంగ్లీషు, హిందీ రాక‌పోతే దించేస్తారేమోన‌ని! పైగా సెక్యూరిటీ కార‌ణాల వ‌ల్ల ఆమె సీటు మార్చ‌వ‌ల‌సి వ‌చ్చిందని ఫ్ల‌యిట్ అటెండ‌ర్ స‌మాధానం చెప్ప‌డం విడ్డూరం. అస‌లు ఫ్ల‌యిట్‌లో ప‌నిచేసే సిబ్బందికి ప్ర‌యాణీకుల‌తో ఎలా వ్య‌వ‌హ‌రించాల‌న్న‌ది శిక్ష‌ణ‌లో నేర్పు తారు. భాష‌ల విష‌యంలో ఇత రుల స‌హాయం తీసుకోమంటారు. కానీ పాపం ఆ పెద్దావిడ విష‌ యంలో ఆ ఫ్ల‌యిట్ అటెండ‌ర్ ఆ జాగ్ర‌త్త పాటించ‌లేదేమో! అన్న‌ట్టు మీర‌న్న రెండు ముక్క‌లు ఇంగ్లీషు, హిందీ నేర్చుకోండి ..ఇలాంటి గోల ఉండ‌దు. 

పెగాసన్ పై సభా సంఘం మధ్యంతర నివేదిక.. పెగాసన్ ప్రస్తావన ఏదీ?

పెగాసన్ పై గత అసెబ్లీ సమావేశాలలో నియమించిన సభా సంఘం.. గత ప్రభుత్వం డేటా చోరీ చేసిందని  ప్రాథమికంగా నిర్ధారించింది. అయితే ఇది ప్రాథమిక నివేదికే అన్న భూమన నేతృత్వంలోని కమిటీ ఇంకా సేకరించాల్సిన సమాచారం ఎంతో ఉందని చెప్పింది.  ఇప్పుడు సభ ముందుంచినది మధ్యంతర నివేదిక మాతరమేనని భూమన కరుణాకరరెడ్డి సభకు తెలిపారు. ఇంతకీ పెగాసన్ సాఫ్ట్ వేర్ దుర్వినయోగంపై ఏర్పాటు చేసిన సభా సంఘం తన మధ్యంతర నివేదికలో ఆసలా విషయాన్నే ప్రస్తావించలేదు. గత   తెలుగుదేశం ప్రభుత్వం డేటా చెరీ చేసిందంటూ పాత పాటనే సభా సంఘం తన నివేదికలో వల్లె వేసింది. డేటా చోరీ పేరుతో  గతంలో వైసీపీ సర్కార్ పేట్టిన కేసులోని వివరాలనే ఇప్పుడు భూమన నేతృత్వంలోని సభా సంఘం మరోసారి వల్లె వేసింది. అయితే ఆ కేసు ఎప్పుడో వీగిపోయింది.   పెగాసస్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి వ్యక్తులపై నిఘా పెట్టారా లేదా అన్న అంశంపై తేల్చేందుకు నియమించిన హౌస్ కమిటీ  తన మధ్యంతర నివేదికలో పెగాసస్ అంశాన్ని కనీసం ప్రస్తావనగా కూడా తీసుకు రాలేదు.  స్టేట్ డేటా సెంటర్లో  ఉండాల్సిన సమాచారాన్ని తెలుగు దేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులకు నేరుగా ఆ సమాచారాన్ని చేరవేశారనీ,  తద్వారా వారికి  ప్రత్యేక లబ్ధి చేకూరిందనీ పాత పాటనే మరోసారి వినిపించింది.  ఓటర్ల జాబితా నుంచి 30 లక్షల మంది ఓట్లు తొలగించే ప్రయత్నం జరిగిందని పేర్కొంంది. గత ప్రభుత్వం సేవామిత్ర యాప్ ను ఇందు కోసం దుర్వినియోగం చేసిందని విమర్శించారు. ఈ డేటా తస్కరణకు పాల్పడిన వారిని పట్టుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే ఓట్ల తొలగింపు ఆరోపణలపై అప్పట్లోనే ఈసీ స్పందించింది. ఎవరు పడితే వారు యాప్‌ల ద్వారా ఓట్లను తొలగిం సాధ్యం కాదని తేల్చేసింది.   అలాగే ఆధార్ నంబర్ తెలిసినంత మాత్రాన వ్యక్తిగత డేటా చోరీకి అవకాశం లేదని అప్పట్లో ఆధార్ స్పష్టం చేసింది. ఇప్పుడు భూమన నేతృత్వంలోని సభా సంఘం తన మధ్యంతర నివేదికలో.. పాచిపోయిన ఆ విషయాలనే కొత్తగా కనుగొన్నట్లు పొందుపరిచింది.   రాష్ట్రంలో ఎన్నికల హీట్ ఆరంభమైన నేపథ్యంలో భూమన నేతృత్వంలోని సభా సంఘం మధ్యంతర నివేదిక అంటూ అరకొర సమాచారం అసెంబ్లీ ముందు ఉంచడం   ఆధారాలు బయట పెట్టకుండా   ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి చేకూర్చుకునేందుకేనని తెలుగుదేశం అంటోంది.  

ఢిల్లీ లిక్క‌ర్‌స్కామ్‌.. జోనాట్రావెల్స్ స్పెష‌ల్ ఫ్లైట్లు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌  కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. లిక్కర్‌ పాలసీ కార్యకలాపాల కోసం స్పెషల్ ఫ్లైట్స్‌ బుక్ చేసినట్లు అధికారులు గుర్తించారు. జోనా ట్రావెల్స్ వివరాల ఆధారంగా ఫ్లైట్స్‌ వెళ్లి నట్లు నిర్ధారించారు. జోనా ట్రావెల్స్‌ను రమాసింగ్‌ లీడ్ చేస్తున్నట్లు గుర్తించారు. లిక్క‌ర్ పాల‌సీ కార్య‌ క‌లాపాల కోసం ప్ర‌త్యేక విమానాల‌ను బుక్చేసిన‌ట్లు అధికారులు గుర్తించారు అందుకు సంబంధించి జోనాట్రావెల్స్వ‌ద్ద స్వాధీనం చేసుకున్న‌ వివరాల ఆధారంగానే ఈ సంగ‌తి బ‌య‌ట‌ ప‌డింది.  పంజాబ్ ఎన్నికల సమయంలో ఢిల్లీ పార్టీ నేతలకు 200 కోట్లు ఇచ్చినట్టు, శ్రీనివాస్ రావు ద్వారానే లావా దేవీలు జరిగినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. 200 కోట్లు లావాదేవీల పైన శ్రీనివాస్ రావును  ఈడీ ప్రశ్నించింది. లిక్కర్ టెండర్ల కోసం చెల్లించారా లేదా మరో దానికా అనే కోణంలో దర్యాప్తును ఈడీ కొనసా గిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్ప‌టికే అరుణ్ రామచంద్ర పిళ్ళై, గోరుంట్ల బుచ్చి బాబు (సీఏ), అభినవ్ రెడ్డి, అభిషేక్ రావు, గండ్ర సృజన్ లను విచారించిన ఈడీ.. వీరు ఇచ్చిన సమాచారం మేరకు సోమ వారం ఆరు చోట్ల సోదాలు  నిర్వహించింది. సుచిత్రా, కొండాపూర్ లోని రెండు నివాసాలలో, మాదాపూర్ వార్సన్ సాఫ్ట్ వేర్ సంస్థ, ఉప్పల్ లోని సాలిగ్రామ్ టెక్నాలజీలో ఈడీ సోదాలు నిర్వహించింది. బిల్డర్ శ్రీనివాస్ ఇంట్లో సోదాలు చేసి అతన్ని అదుపులోకి తీసుకొని సుమారు ఆరు గంటల పాటు ఈడీ అధికారులు విచా రించి అతని స్టేట్ మెంట్ నమోదు చేసుకున్నారు. శ్రీనివాస్ రావు ఇచ్చిన సమాచారం మేరకు మరికొంత మందినిసైతం విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవు తున్నారు. ఈడీ అధికారులు నిన్న సుదీర్ఘంగా 7 గంటలపాటు శ్రీనివాసరావును విచారించి అతని స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఆయన ఇంట్లో సోదాలు చేసిన తర్వాత కీలక పత్రాలతోపాటు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకు న్నారు. వివిధ కన్నాల్టెన్సీలు, కంపెనీల్లో సోదాలు చేసి వాటిని సీజ్ చేశారు. మంగళవారం మరికొంత మందికి నోటీసులు జారీ చేయడం, మరికొన్ని కంపెనీలు, కార్యాలయాల్లో సోదాలు చేసే అవకాశముంది. ఇప్పటివరకు దాదాపు నాలుగుదఫాలుగా 23 బృందాలు.. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూ రు లో సోదాలు చేశారు.  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఉన్న కంపెనీలకు.. హైదరాబాద్‌లోని పలు కంపెనీలు, అలాగే శ్రీనివాసరావు కు చెందిన కంపెనీల నుంచే ముడుపులు వెళ్లినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. శ్రీనివాసరావు ద్వారానే కోట్లలో లావాదేవీలు జరిగినట్లు నిర్దారించారు. కంపెనీల ఏర్పాటుకు సంబంధించి కీలక పత్రాలు స్వాధీ నం చేసుకున్నారు. పిళ్ళై, శ్రీనివాసరావు మధ్య సంభాషణలను ఈడీ అధికారులు రిట్రైవ్ చేశారు. ఆ ఇద్దరి నుంచి అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం. కాగా ఈడీ అధికారుల సోదాల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. పంజాబ్ ఎన్నికల్లో ఢిల్లీ నేతలకు రూ. 200కోట్లు ఇచ్చినట్లు ఆధారాలు సేకరించారు. శ్రీనివాసరావు ద్వారానే కోట్లలో లావాదేవీలు జరిగి నట్లు గుర్తించారు. రూ.200 కోట్ల లావాదేవీలపై శ్రీనివాసరావును అధికారులు ప్రశ్నించారు. లిక్కర్ టెండ ర్ల కోసం చెల్లించారా? లేదా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలోని తొమ్మిది  లిక్కర్ కంపెనీలతో హైదరాబాద్ వ్యాపారవేత్తలకు లింకులు ఉన్నట్లు కనుగొన్నారు. ఈ డబ్బు ఎవరి ఖాతా నుంచి వెళ్లిందనే అంశం పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

అత్యవసర మందుల జాబితాలో మరో 34 డ్రగ్స్

అత్యవసర మందుల జాబితాలో యాంటి క్యాన్సర్ డ్రగ్స్ ను  ప్రభుత్వం చేర్చింది. బెండా ముస్టీన్ ,హైడ్రో క్లోరైడ్,ఐరి నోటి కాన్ ట్రై హైడ్రేట్ ,లేనా లైడో మైడ్,వంటి మందులను ప్రభుత్వం జాబితాలో చేర్చింది. ౩4 రకాల అత్యవసర మందులను వివిధ  క్యాటగరీలుగా విభజించారు. అందులో 27 రకాల థెరఫీ కేటగిరీలు క్యాన్సర్ యాంటి బయోటిక్స్,  వ్యాక్సిన్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అవి అనుబాతులో కొనుగోలు చేసే విధంగా ఉండే వీలు కల్పించినట్లు ఇది క్యాన్సర్ పెరుగుదల ఆధునిక చికిత్సల  మందుల ధర పెరుగుదల నేపథ్యం లో వీటిని అత్యవసర   జాబితాలో చేర్చారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వైద్య వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఇప్పటికే ౩84 రకాల మందులు ఈ అత్యవసర జాబితాలో ఉన్నాయనీ,   అదనంగా మరో 26 మందులను గతంలో ఉన్న జాబితానుండి తొలగించారు. 2౦15 నాటి జాబితాను పునరుద్దరించిన ఈ మందుల ధరలను నేషనల్ ఫార్మాస్యుటికల్ ప్రైసింగ్ ఆధారిటీ (ఎన్ఎల్ఇఎం) ధరలను నియంత్రిస్తుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. 

చిరు పొలిటికల్ ఎంట్రీ.. రాజకీయం నా నుంచి దూరం కాలేదంటూ ట్వీట్

మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఓ 10 సెకన్ల ఆడియో.. ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.   నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం.. నా నుంచి దూరం కాలేదంటూ... చిరంజీవి చెప్పిన ఆడియో ట్విట్.. అ హాట్ టాపిక్  అయిపోయింది. అయితే మెగాస్టార్ చేసిన ఈ ట్విట్‌పై ఓ వైపు మెగా అభిమానులు, మరోవైపు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మనకు రాజకీయాలు వద్దు బాస్ అంటు కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఇది చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం గాడ్‌ఫాదర్‌లోని డైలాగ్ అంటూ  కామెంట్స్ పెడుతున్నారు.ఏదీ ఏమైనా చిరంజీవి చేసిన ఈ కామెంట్స్‌పై భిన్న అభిప్రాయాలు మాత్రం వ్యక్తమవుతున్నాయన్నది మాత్రం నిజం. ఓ వైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల అధినేతలు.. తమ పార్టీల విజయం  కోసం.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అలాంటి వేళ.. మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి కామెంట్స్... అదీ రాజకీయంపై చేయడం పట్ల రాజకీయ పరిశీలకులు సైతం తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి... 2009 ఎన్నికల బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 18 సీట్లు కైవసం చేసుకొంది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన తన పార్టీని హస్తం పార్టీలో విలీనం చేశారు. ఆ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభలో అడుగు పెట్టి... కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగారు. అనంతరం ఆయన రాజకీయాలకు దూరంగా జరిగారు.  మరో వైపు  జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా థియేటర్ల టికెట్ల ధరలను భారీగా తగ్గించింది.  ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌తో తాడేపల్లిలో చిరంజీవి భేటీ అయ్యారు. దాంతో చిరంజీవికి మళ్లీ రాజ్యసభ టికెట్ అంటూ పెద్ద ప్రచారమే జరిగింది. దీంతో చిరంజీవి.. స్వయంగా   మీడియా ముందుకు వచ్చి తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని విస్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ట్విట్టర్‌లో వదిలిన ఆడియో..  ఆయన తాజాగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించినవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బీజేపీ వారి భ‌క్తి పిచ్చి

పెద్దాయ‌న‌కు నాగేస్స‌ర్రావంటే ఇష్టం, బ‌బ్లూకి చిరు అంటే వీరాభిమానం, పింకీకి చ‌ర్రీ అంటే..! వీరాభి మానం వింత‌పోక‌డ‌లే పోకూడ‌దు. సినిమాహాల్లో కాయితాలు చింపి ఎగ‌రేయ‌డం, ఫ్లెక్సీల‌కు పాలాభిషేకం చేయ‌డం వ‌ర‌కూ భ‌రించొచ్చు. ఏకంగా గుడిక‌ట్ట‌డంతో పిచ్చి పాకాన‌ప‌డింద‌ని అర్ధం. ఇప్ప‌టికే సినీస్టార్ల‌కు గుడిక‌ట్టి ఇలాంటి పిచ్చిత‌నాన్ని ఎంతో శాతం ప్ర‌ద‌ర్శించారు. గుడిక‌ట్టి ఏం చేస్తార న్నది వేరే విష‌యం. మ‌న‌సులో క‌ట్టాల్సింది బ‌య‌ట‌క‌డితేనే పెద్ద స‌మ‌స్య. ఎందుకంటే ఎగ‌స్పార్టీ వోరు కూల‌దోస్తే మ‌న‌సు విరిగి ఆత్మ‌హ‌త్య‌ల‌దాకా వెళ్ల‌కుండా ఉంటే చాలు. వీరాభిమానం ప్రాణాలు తీసుకునే స్థితి కి దిగ‌జార్చ‌కూడ‌దు. ఇపుడు కొత్త‌గా తెర‌మీద‌కి వ‌చ్చిన గుడిదేవుడు యోగి ఆదిత్యానాథ్‌! రాజ‌కీయాల్లో ఇలాంటి పిచ్చి ఎంత‌వ‌ర‌కూ దారితీస్తుంద‌నేదానికి స‌మాధానం లేదు. పార్టీ నాయ‌కునిగా త‌న‌కు దేవుడిగా భావించే ఆ పార్టీ వీరాభిమాని మ‌హా అయితే వీధిలో వాళ్ల‌చేత ఓటు వేయించి ఆనందిం చొచ్చు. అంత‌కుమించి వీరాభిమానికి ద‌క్కే సంతృప్తి ఉండ‌దు. కానీ గుడి క‌ట్టుకుంటే దేవుణ్ణి చూసిన‌ట్టు రోజూ చూసుకుంటూ, త‌న వీధిలో త‌నతో ఉన్న‌ట్టు భావించుకుని రెండింత‌ల ఉత్సాహంతో పార్టీ విజ‌యా నికి  ప‌ని చేయవ‌చ్చు. ఇలాంటి వారిని పార్టీ నాయ‌కులు పెద్ద‌గా కాద‌న‌రు. వారికి ఇలాంటి పిచ్చాళ్లే బాగా అవ‌స‌రం. వీరివ‌ల్ల ప్ర‌చారం రెండింత‌లు అవుతుంది గ‌దా! అయోధ్యకు చెందిన ప్రభాకరన్‌ మౌర్య అనే వ్యక్తి మాత్రం యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌పై ఉన్న అభి మానంతో ఏకంగా గుడినే కట్టించారు. బాణం, విల్లు పట్టుకొని కాషాయ వస్త్రాధారణతో సీఎం యోగి విగ్రహాన్ని గుడిలో ఏర్పాటుచేశారు. రోజూ ఉదయం, సాయంత్రం ఆ విగ్రహానికి పూజలు కూడా చేస్తు న్నారు. పూజల అనంతరం భక్తులకు ప్రసాదం పంచుతున్నారు. బీజేపీవారికి తెలిసిన దేవుడు రాముడే క‌నుక నాయ‌కుడిని కూడా రాముడిగానే ఊహించుకున్నాడు స‌ద‌రు వీరాభిమాని. దీనికి యోగిగారు ఏమాత్రం అడ్డు చెప్ప‌క‌పోవ‌డ‌మే ఇక్క‌డ త‌లెత్తే ప్ర‌శ్న‌. ముఖ్య‌మంత్రిగారు యోగి అయిన‌ పుడు రాము డిలా విల్లంబు లు, బాణాల‌తో కాషాయి వ‌స్త్రంతో విగ్ర‌హం ఏర్పాటును ఎలా అంగీక‌రిస్తారు. అది పార్టీకి ఎంత‌వ‌ర‌కూ ప‌నికి వ‌స్తుంది. విప‌క్షాలు విరుచుకుప‌డ‌తాయ‌న్న ఆలోచ‌నా రాలేదా? అనే ప్ర‌శ్న‌ల‌కు వీరాభిమాని కోరిక‌కు బొత్తిగా సంబంధం ఉండ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే అది యోగీని అడిగి మ‌రీ ఏర్ప‌ర‌ చిన‌ది కాద‌ని పార్టీ ఇత‌ర వీరాభిమానుల స‌మాధానం.  అయోధ్యలో రాముడి జన్మభూమికి 25 కి.మీల దూరంలో భరత్‌కుండ్  సమీపంలో ఫైజాబాద్‌- ప్రయాగ్ రాజ్‌ హైవే వద్ద ఈ గుడిని నిర్మించారు.  రాముడికి గుడి క డుతున్న యోగీజీకి  తాము గుడి కట్టామని మౌర్య అన్నారు. యోగీ ప్రజల కోసం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు తనను ఆకర్షించాయని, అం దుకే  ఆయనకు గుడి నిర్మించాలన్న ఆలోచన వచ్చిందని చెప్పారు. తనకు ఉద్యోగం లేదని, భూమి లేదని అయినా యూట్యూబ్‌లో భజనలు, భక్తిగీతాలు పోస్టుచేస్తూ నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తు న్నానని తెలిపారు. ఆ డబ్బుతోనే ఈ గుడి నిర్మించానని మౌర్య చెప్పారు.  ఈ త‌ర‌హా భ‌జ‌న‌ప‌రులు, వీర‌భ‌క్తులు, మ‌తం పిచ్చాళ్ల‌తో  బీజేపీ పార్టీ నిండిపోతే మామూలు ఓట‌రుకు గెలిపించాల‌న్న ఆలోచ‌న పోతే మోదీ, షా  ఏం చేస్తారు? ఇప్ప‌టికే బీజేపీ అంటే మ‌త‌పిచ్చితో ముందుకు వెళుతూన్న పార్టీ అని ముద్ర‌ప‌డింది. ఇపుడు ఇలాంటి బ‌క్తాగ్రేస‌రులు పార్టీ ఫాలోయ‌ర్స్‌గా ఉంటే పార్టీ రాజ‌కీయ‌స‌మాలోచ‌న స‌మావేశాల కంటే పురాణ కాల‌క్షేప స‌మావేశాల సంఖ్య పెరిగే అవ‌కాశాలున్నాయి. మ‌రి భ‌క్తి త‌త్వంలో ప‌డితే సామాన్య ఓట‌రు ఎందుకు ఓటు వేస్తాడు? 

కౌన్ బనేగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల ముహూర్తం దగ్గర పడుతోంది. ఇప్పటికే ప్రకటించిన ఎన్నికల షెడ్యూలు ప్రకారం, మరో రెండు రోజులో  అంటే గురువారం (సెప్టెంబర్‌ 22) నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది. సెప్టెంబర్‌ 25 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. అవసరం అయితే, అక్టోబర్‌ 17న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోలింగ్ నిర్వహిస్తారు.అక్టోబర్‌ 19న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.   అయితే, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అసలు ఎన్నికంటూ జరుగుతుందా?  ఆ అవసరం ఉంటుందా? అంటే, పార్టీ కీలక నేతలు సహా ఎవరూ స్పష్టమైన సమాధానం ఇవ్వలేక పోతున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ మనసులో ఏముందో ఎవరికీ తెలియక పోవడంతో, అధ్యక్ష ఎన్నికల వ్యవహారం అయోమయంగా మారిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినవస్తోంది. అయితే, సోనియా గాంధీ ఎట్టి పరిస్థితిలోనూ, పగ్గాలు పరాయి చేతికి ఇవ్వరని, అవసరం అయితే, మళ్ళీ ఆమే బాధ్యతలు చేపట్టినా చేపడతారని అంటున్నారు. నిజానికి, సోనియా గాంధీ విదేయ వర్గం ఇప్పటికే, ఆ దిశగా పావులు కదుపుతోందని అంటున్నారు. ఆదలా ఉంటే, అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ సమీపిస్తున్న నేపధ్యంలో,  రాహుల్ గాంధీ మళ్ళీ పార్టీ పగ్గాలు చేపట్టాలనే డిమాండ్ బలాన్ని పుంజు కుంటోంది. పార్టీ కీలక నేతలు కొందరు రాహుల్ గాంధీకి, విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేస్తున్నారు.పీసీసీ తీర్మానాలు చేస్తున్నాయి. అలాగే, రాహుల్ గాంధీని ఏకగ్రీవంగా ఎన్నికోవాలని సీనియర్ నేతలు కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరో వంక  మరో వంక కాంగ్రెస్‌ పార్టీలో సంస్థాగతమైన సంస్కరణలు అవసరమంటూ రెండేళ్ళ క్రితం నుంచి డిమాండ్ చేస్తున్న జీ23 గ్రూప్ కు మద్దతు పెరుగుతోంది. పార్టీలో నిర్మాణాత్మక సంస్కరణలు జరగాలని కాంగ్రెస్‌ యంగ్‌ గ్రూప్‌ పేరిట సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిటిషన్ కు ఇంచుమించుగా ఓ వెయ్యి మంది వరకు యువనేతలు మద్దతు తెలిపారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక జరుగుతుందా? ఏకగ్రీవం అవుతుందా అనే విషయంలో,పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ వ్యక్తమవుతోంది. అదలా ఉంటే కాంగ్రెస్‌ యంగ్‌ గ్రూప్‌  పిటిషన్ స్వాగతించిన పార్టీ సీనియర్‌ నేత,  తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌’ పోటీకి సై అంటున్నారు. ఆయన  పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. తమ మనసులోని మాటను ఆమె ముందుంచారు. అందుకు ఆమె కూడా  సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అంతేకాదు, అంతర్గత ప్రజాసామ్యం అవసరమని,పార్టీకి మేలు చేస్తుందని సోనియా గాంధీ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.  అయితే ఈ అన్నిటినీ మించి, పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ సిద్దంగా ఉన్నారా? లేదా? అనేది, ఇంకా ఆయన మనసులోని మాటగానే ఉంది. ఇటీవల కన్యాకుమారి నుంచి  భారత్ జోడో యాత్ర ప్రారంభించిన సమయంలోనూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే విషయంలో తమ మనసులో స్థిరమైన అభిప్రాయం ఉందని చెప్పారు,  కానీ  అదేమిటో మాత్రం బయట పెట్టలేదు. నామినేషన్ల ఘట్టం మొదలైన తర్వత తాను పోటీ చేసేది లేనిది తెలిసి పోతుందని, సస్పెన్స్ ను మరింత పెంచారు.  నిజానికి, 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరసగా రెండవసారి ఓడిపోయిన నేపధ్యంలో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ మరో మారు అధ్యక్ష పదవి చేపట్టాలనే డిమాండ్ అప్పటి నుంచి వినిపిస్తూనే వుంది. అయితే రాహుల్ గాంధీ మాత్రం ససేమిరా అంటున్నారని అంటున్నారు. మరోమారు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు సుముఖంగా లేరనే ప్రచారం బలంగానే సాగుతోంది. ఇప్పటికీ ఆయన అదే అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు.  అదలా ఉంటే  రాహుల్ గాంధీ చివరి వరకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు వద్దే వద్దనే మాట మీద నిలబడితే, సోనియా విదేయ వర్గం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్  ను పోటీకి సిద్దం చేస్తునట్లు తెలుస్తోంది.  నామినేషన్ల ఘట్టం ప్రారంభం కాగానే, గెహ్లాట్ నామినేషన్ వేస్తారని, అంటున్నారు. అలాగే, రాహుల్ గాంధీ నిర్ణయంతో సంబంధం లేకుండా శశిథరూర్‌ కూడా నామినేషన్ వేస్తారని అంటున్నారు. అయితే చివరకు రాహుల్ గాంధీ, ఓకే అంటే ఇద్దరూ ఉపసంహరించుకునే అవకాశమే ఉందనీ అలాగే  గెహ్లాట్, శశిథరూర్‌లలో ఎవరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనేది కూడా, చివరకు సోనియానే నిర్ణయిస్తారని అంటున్నారు.ఆ అవగాహనతోనే సోనియా గాంధీ, శశిథరూర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.నిజంగా అదే జరిగితే, చాంతాడంత రాగం తీసి, అదేదో పాట పడినట్లుగా, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక క్రతువు, మరో ప్రహసనంగా ముగుస్తుందని అంటున్నారు.