ప్రజాప్రతినిథులపై కేసుల ఉపసంహరణ జీవోలను ఉపసంహరించుకున్న జగన్ సర్కార్
posted on Sep 20, 2022 @ 5:28PM
అడుసు తొక్కడం.. కాళ్లు కడుక్కున్నట్లు చేయడం వైసీపీ సర్కార్ కు ఒక అలవాటుగా మారిపోయింది. గత మూడేళ్లుగా ఏపీలో జగన్ ప్రభుత్వం తీసుకున్న దాదాపు ప్రతి నిర్ణయానికీ న్యాయస్థానంలో చుక్కెదురైంది. కోర్టు అక్షింతలు వేయడం ప్రభుత్వం వెనక్కు తగ్గడం ఒక అలవాటుగా మారిపోయింది. తాజాగా వైసీపీ ప్రజా ప్రతినిథులపై కేసులు ఎత్తివేస్తూ జారీ చేసిన జీవోను కూడా సర్కార్ ఉపసంహరించుకుంది. సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించి మరీ రాష్ట్రంలో వైసీపీ ప్రజా ప్రతినిథులపై కేసులను ఉపసంహరిస్తూ జగన్ సర్కార్ మూడు జీవోలను చేసిన సంగతి తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధు లపై కేసులవిచారణను వేగవంతం చేసి సాధ్యమై నంత త్వరగా తీర్పులు ఇవ్వాలనికోరుతూ భాజపా నాయకుడు అశ్వినీకుమార్ ఉపాధ్యాయగతంలో సుప్రీం దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీం కోర్టు హైకోర్టుల అనుమతి లేకుండా ప్రస్తుత, పూర్వ ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల ఉపసంహరణ కుదరదని విస్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏపీ హైకోర్టు 2020 సెప్టెంబరు 16 నుంచి2021 ఆగస్టు 25 మధ్య రాష్ట్రంలో ప్రజాప్రతినిధు లపైఎన్ని కేసులు ఉపసంహర ణకు జీవోలు ఇచ్చారు తదితర వివరాల్ని పరిశీలించేందుకు హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది. వైకాపా ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చర్యలు తీసుకునేందుకు సిఫార్సు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన తొమ్మిది జీవోలను ఈ వ్యాజ్యంలో ప్రస్తావించింది. అలాగే జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభా నుపై మొత్తం పది కేసుల ఉపసంహరణకు ఇచ్చిన జీవోను సవాలు చేస్తూ ఏపీ జర్నలిస్టు ఫోరం అధ్య క్షుడు చెవులకృష్ణాంజనేయులు హైకోర్టులోదాఖలు చేశారు.
మరో వైపు వైకాపాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణకు ఆమోదంతెలపాలని హైకోర్టును కోరుతూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ప్రజాప్రతినిధులపై కేసులనుఉపసంహరించేందుకు జీవోలు జారీ చేసిన ప్రభుత్వం డేంజర్ జోన్ లో ఉందని హైకోర్టు గత విచారణలో వ్యాఖ్యానించింది.
దీంతో సోమవారం హైకోర్టులో ఈ కేసులపై జరిగిన విచారణలో ప్రభుత్వ న్యాయవాది మహేశ్వరరెడ్డి ప్రజాప్రతినిధులపై కేసులు ఉపసంహరణకుగతంలో ఇచ్చిన 3 జీవోలనూ ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు. ఆ వివరాలను మెమో రూపంలోకోర్టు ముందు ఉంచుతామన్నారు.
కేసుల ఉపసంహరణ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరిస్తామని కోర్టుకు తెలిపారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను అక్టోబరు13కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్మిశ్ర, జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతోకూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకుఆదేశాలు జారీ చేసింది.