ఎన్టీఆర్ వర్సీటీకీ మీకూ సంబంధమేమిటి.. చంద్రబాబు
posted on Sep 21, 2022 @ 10:29AM
ఏపీ అసెంబ్లీ ఐదో రోజు బుధవారం సమావేశం అయిన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్త రాలు చేపట్టారు. కానీ ఎన్టీఆర్ హెల్త్వర్సిటీ పేరు మార్పుపై సభలో గందరగోళం ఏర్పడింది. హెల్త్ వర్సిటీ పేరు ఎలామారుస్తారంటూ టీడీపీ సభ్యులు భారీ నినాదాలతో హోరెత్తించారు. అయితే ఎన్టీఆర్ హెల్త్వర్సిటీ పేరు మార్పుపై బిల్లు పెట్టినప్పుడు అభిప్రాయం చెప్పాలని స్పీకర్ తెలిపారు. అయినప్ప టికీ టీడీపీ సభ్యులు తమ నిరసనను కొనసాగిస్తుండటంతో సభలో గందరగోళం నెలకొంది. సభ్యుల ఆందోళన ల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి.
ఎన్టీఆర్ హెల్త్యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ 1986లో ఏర్పాటైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతో వైఎస్ఆర్‌కు సంబంధమేమిటని ప్రశ్నించారు. ఎన్టీఆర్ నిర్మించిన విశ్వ విద్యాలయానికి మీ తండ్రి పేరు ఎలా పెట్టుకుంటావని సీఎం జగన్‌ని ప్రశ్నించారు. హెల్త్ యూనివ ర్సి టీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందే అని స్పష్టం చేశారు. ఉన్న సంస్థలకు పేర్లు మార్చితే పేరు రాదని, కొత్తగానిర్మిస్తే పేరు వస్తుందని హితవు పలికారు. తెలుగు దేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకి స్తుందని ఆయన అన్నారు.
వైద్యవిద్యకు ప్రత్యేక వర్సిటీ అవసరమని భావించే నాడు ఎన్టీఆర్ ఈ వర్సిటీని ఏర్పాటు చేశారని చంద్ర బాబు గుర్తుచేశారు. ఆయన మరణాంతరం తమ ప్రభుత్వంలో ఆ వర్సిటీకీ ఎన్టీఆర్ పేరు పెట్టామన్నారు. కానీ వర్సిటీ స్థాపించిన 36 యేళ్ల తర్వాత ఈ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ ఆర్ పేరు పెట్టడం అర్ధ రహితమని టీడీపీ అధినేత అన్నారు. మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేని ఈ ప్రభుత్వం ఉన్న వాటికే పేర్లు మార్చుతోందని మండిపడ్డారు. వర్సిటీ రూ.450 కోట్ల నిధులు కూడా బల వంతంగా కాజేసిన ఈ ప్రభుత్వం.. ఏ హక్కుతో పేరు మార్చుతుందని నిలదీశారు. కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసి వర్సిటీ పరువు తీసి ఇప్పుడు పేరు మార్చుతారా అంటూ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దశాబ్దాల క్రితం ఏర్పాటైన సంస్థలకు ఉన్న పేర్లు మార్చి కొత్తగా మీ పేర్లు పెట్టుకుంటే మీకు పేరు రాదు. వ్యవస్థలను, సంస్థలను నిర్మిస్తేనే పేరు వస్తుంది అనే విషయాన్ని సీఎం జగన్ తెలుసు కోవాలి .ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును యథావిధిగా కొనసాగిం చాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.