జగన్ నియోజకవర్గ సమీక్షలకు మంగళం.. ఎందుకో తెలుసా?

రాజుగారికి వేగులు ఎలాగో రాజకీయ పార్టీకి క్యాడర్ అలగ..ఇది ఏపీ సీఎం జగన్ నిశ్చితాభిప్రాయంగా కనిపిస్తోంది. రాజుగారి వేగులు రాజ్యంలో ప్రజలేమనుకుంటున్నారన్నది రహస్యంగా సమాచారం సేకరించి రాజుగారికి చేరవేస్తారు. ఆ చేరవేసే సమాచారం అంతా రాజుగారి చెవులకు, మనసుకు హాయి కలిగించేదిలాగే ఉండాలన్నది అలిఖిత షరతు. ఎవ్వరూ ఆ సంగతిని వేగులకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లకి అలా తెలిసిపోతుందంతే. ఏదో సినిమాలో నటి అంజలి మాటమాటికీ ‘ఏమో నాకన్నీ తెలిసిపోతాయంతే’ అంటుంటుంది. అలా ప్రత్యకమైన హేతుబద్ధమైన కారణం ఏమీ లేకుండానే రాజుగారి వేగులకు రాజుగారికి ఏం చెబితే నచ్చుతుందో అలా తెలిసిపోతుందంతే. అలా తెలియని వేగులకు ఎలాగూ సమస్యలు తప్పవు. తల కోటగుమ్మానికైనా వేలాడొచ్చు. వేగు కొలువు ఊడిపోయినా ఊడిపోవచ్చు. జగన్ విషయంలో కూడా అంతే తమ పార్టీ అధినేతకు ఏం చెబితే రుచిస్తుందో ఆయన పార్టీ క్యాడర్ కు తెలుసు. ఏమో వారికి అలా తెలిసిపోయిందంతే. కానీ అదే క్యాడర్ లో అలాంటి లోకజ్ణానం లేని వారు కూడా ఉన్నారు. వారు అధినేత ముందు సమస్యలు ఏకరవు పెట్టారు. అభివృద్ధి, చేసిన పనులకు బిల్లులు, ఆగిపోయిన పెన్షన్లు అంటూ కొండవీటి చాంతాడంత జాబితాను జగన్ ముందు ఉంచారు. ఎలా అంటారా? తనకు అవసరమైతే తప్ప మంత్రుల ముఖం కూడా చూడటానికి ఇష్టపడని జగన్ పార్టీ క్యాడర్ ను ఎప్పుడు కలిశారు అన్న అనుమానం కలుగుతోంది. జగన్ ను కలిసిన వారు ఓ రెండు నియోజకవర్గాలకు చెందిన క్యాడరే. వాళ్లని కూడా అనేక వడపోతల తరువాత.. వారంతా జగన్ కు పరమ భక్తులని నిర్ణయించుకున్న తరువాత వారిని జగన్ ముందు ప్రవేశ పెట్టారు.  అయితే వందిమాగధుల ఊహలు తల్లకిందులయ్యాయి. అంతటి భక్తులూ అధినేత ముందు సమస్యల చిట్టా విప్పేశారు. పార్టీ పరువు గంగలో కలిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని అధినేతకు నివేదించారు. అసలు విషయమేమిటంటే.. రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెరగడంతో ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గ సమీక్షలకు ఉపక్రమించారు. ముందుగా ఆయన కుప్పం, రాజాం నియోజకవర్గాల క్యాడర్ తో భేటీ కావాలని అనుకున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 50 మంది చొప్పున ఎంపిక చేసి మరీ పిలిపించారు. వరుసగా రెండు రోజుల పాటు రోజు కో నియోజకవర్గం చొప్పున జగన్ సమీక్షించారు. అంతే అక్కడితో నియోజకవర్గ సమీక్షలను జగన్ బంద్ చేశారు. నియోజకవర్గ సమీక్షలు, క్యాడర్ తో సమావేశాలు అంటేనే ఆయన అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారనీ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఎందుకు అలా అని ఆరా తీస్తే అసలు విషయం వెల్లడైంది. పరిశీలకుల కథనం ప్రకారం జగన్ అభిమానులు టుది కోర్ అనుకున్న 50 మంది పార్టీ కార్యకర్తలను ఎంపిక చేసి మరీ నియోజకవర్గ సమీక్షల కోసం పిలిపిస్తే.. జగన్ ముందు వారు హాజరు ప్రభో అనడానికి ముందే నియోజకవర్గంలో పార్టీకి సానుకూల అంశాలు తప్ప ప్రతికూల అంశాలు ఏ మాత్రం ప్రస్తావించవద్దని విస్పష్ట ఆదేశాలు ఇస్తే.. వారు మాత్రం జగన్ ముందు సమస్యలనే ఏకరవు పెట్టారట. బిల్లులు, పథకాలలో కోతలు, రోడ్లపై గుంతలు, అడుగంటిన అభివృద్ధి అంటూ ఓ పేద్ద జాబితాను జగన్ ముందు ఇచ్చారు. కుప్పం క్యాడర్, రాజాం క్యాడర్ కూడా కూడబలుక్కున్నట్లు ఇవే విషయాలు ప్రస్తావించడంతో జగన్ ఇక క్యాడర్ తో కలిసే ప్రశక్తే లేదని ఖరాఖండిగా నిర్ణయానికి వచ్చేశారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. దీంతో జగన్ నియోజకవర్గాల సమీక్ష రెండు నియోజకవర్గాలకే పరిమితమైంది. ఇక నియోజకవర్గాన్ని కాపాడుకుని, అక్కడ పార్టీ జెండా ఎగిరేలా చూడాల్సిన బాధ్యతను ఉన్న చోట ఎమ్మెల్యేలకూ లేని చోట్ల నియోజకవర్గ ఇన్ చార్జీలకు అప్పగించేసి జగన్ చేతులు దులిపేసుకున్నారు.  దీంతో పార్టీ క్యాడర్ లో అసంతృప్తి కొండలా పేరుకు పోతోంది. ఈ పరిస్థితిపై పార్టీ క్షత్రస్థాయి క్యాడర్ లో ఆందోళన పెరుగుతోంది. జగన్ ఇప్పటికైనా పట్టించుకుని క్యాడర్ సమస్యలను అడ్రస్ చేయకపోతే వచ్చే ఎన్నికల నాటికి పార్టీ తరఫున పని చేయడానికి క్యాడర్ ఉండని పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గుడివాడ నుంచి పోటీ చేస్తా.. నానిని ఓడిస్తా.. తెలుగువన్ ఇంటర్వ్యూలో రేణుకా చౌదరి

గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేసి కొడాలినానిని ఓడిస్తానని రేణుకా చౌదరి అన్నారు. అమరావతి రైతులకు మద్దతు ప్రకటించిన రేణుకా చౌదరి   ప్రస్తుతం అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రలో పాల్గొని రైతుల ట్రాక్టర్ నడిపి ఉత్సాహపరిచారు. ఈ నేపథ్యంలో ఆమెపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శలు గుప్పించారు. ఖమ్మంలో కార్పొరేటర్ గా కూడా గెలవలేని రేణుకా చౌదరికి అమరావతిలో ఏం పని? అంటూ వ్యాఖ్యానించారు. కొడాలి వ్యాఖ్యలపై రేణుక ఘాటుగా స్పందించారు.   తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రేణుక  కొడాలి నాని లారీలు కడుక్కునే సమయంలోనే తాను కార్పొరేటర్ ని అని రేణుకా చౌదరి అన్నారు. "బుజ్జీ నీకు చరిత్ర తెలియదు... రాజీవ్ గాంధీ ఇచ్చిన సెల్ ఫోన్ లో గూగుల్ కొట్టు. రేణుకా చౌదరి అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. నువ్వు మాజీ మినిస్టర్ కదా. నువ్వు ఏదో పదవి కోసం అసెంబ్లీలో నా పేరు తీసుకొచ్చావ్. చాలా థ్యాంక్స్ అన్నారు. కొడాలి నాని ఎంత అమాయకుడు కాకపోతే... ఏపీ అసెంబ్లీలో నా పేరు తీసుకొచ్చి... నాకు బొచ్చెడు పబ్లిసిటీ తీసుకొచ్చారనీ, ఇంతటి పబ్లిసిటీ  ఎంత ఖర్చు పెట్టినా రాదనీ, కానీ నాని వల్ల నాకు పబ్లిసిటీ ఫ్రీగా వచ్చింది. అయితే కొడాలి నాని నియోజకవర్గం నుంచే తాను అసెంబ్లీకి పోటీ చేస్తాను, గెలుస్తానని రేణుకా చౌదరి  అన్నారు. తాను గుడివాడ నుంచి  పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తాను గుడివాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగుతానని చెప్పిన రేణుకా చౌదరి, కొడాలినానిని మళ్లీ ఎన్నుకోవడానికి గుడివాడ ప్రజలు సిద్ధంగా లేరని రేణుక అన్నారు.నా   చరిత్ర, ఛరిష్మా, నా పోరాట తత్వం ఇవే తనను గెలిపిస్తాయని రేణుకా చౌదరి అన్నారు.  

అయ్యో...ఆమె గొర్రెల‌కాప‌రి అనుకునేరు!

ఆరోగ్యం కోసం, ఉల్లాసంగా ఉండేందుకు ఇటీవ‌లికాలంలో వ‌య‌సుతో నిమిత్తంలేకుండా జాగింగ్ ప‌ట్ల అంతా ఆక‌ర్షితుల‌య్యారు. గ్రామాల్లో ఉండేవారికి ఇబ్బంది లేదు. ప‌ట్ట‌ణాల్లో,పెద్ద పెద్ద న‌గ‌రాల్లో ఉండే వారే జాగింగ్ ట్రాక్ ఉన్న‌పార్కుల‌నే ఆశ్ర‌యించాల్సి వ‌స్తోంది. ఒక‌రిని అనుస‌రించి చాలామంది జాగింగ్ ట్రాక్స్ పిచ్చిలో ప‌డుతున్నారు. కానీ అంతే వేగంగా చేయాల‌నేమీ లేదు. ఎవ‌రికి వీలుగా వారు చేయాల‌నే అంటున్నారు డాక్ట‌ర్లు కూడా. అయితే గ్రామాల్లో ప‌రుగులు తీసేవారు, జాగింగ్ పేరుతో పొలాల్లో తిరిగే వారు మాత్రం ర‌వ్వంత జాగ్ర‌త్త‌గానే ఉండాలి. గేదెలో, మేక‌లో, కుక్క‌లో వెంట‌ప‌డినా ప‌డ‌వ‌చ్చు.   ఫ్రాన్స్‌లో ఒక గ్రామంలో ఒకామె జాగింగ్ పేరుతో అలా తిరిగివ‌ద్దామ‌ని అనుకుంది. చాలాదూరం వెళ్లింది. కొంత‌సేప‌య్యాక చూస్తే ఆమె దాదాపు అట‌వీప్రాంతంలోకి వెళ్లింది. చెట్లు, చ‌ల్ల‌టిగాలి ఎంతో హాయిగా ఉంద‌ని ఓ క్ష‌ణం ఆగింది. చుట్టూ చూసింది. ఒక్క‌సారిగా భ‌య‌ప‌డింది. కార‌ణం ఆమె వెనుక గొర్రెల మంద ఉంది. ఆమె క‌దిలిగే అవీ క‌దులుతున్నాయి. అవి త‌న‌ని ఫాలో అవుతున్నాయ‌ని అప్ప‌టికి గాని ఆమె గ్ర‌హించ‌లేక‌పోయింది. ఆ గొర్రెల కాప‌రి ఎటు వెళ్లాడో తెలీదు, ఇవి మాత్రం ఆమెను త‌మ కాప‌రి అనుకు న్నాయో ఏమోగాని ఆమె వెంట‌ప‌డ్డాయి. ఆమేమీ ఎర్ర‌టి దుస్తుల్లో లేదు, పోనీ వెంటాడ‌టానికి. కొద్దిగా భ‌య ప‌డి ఆగిపోయింది. చెట్టుకింద క్ష‌ణం కూచుని మెల్ల‌గా బ‌య‌లుదేరింది.  కొంత‌దూరం వెళ్లే స‌రికి వాటిలో కొన్ని మ‌ళ్లీ ఆమె వెన‌కే వ‌స్తుండ‌డం గ‌మ‌నించింది. ఈసారి నిజంగానే ఆమె ఆగిపోయి అవి ఎవ‌రివో తెలుసుకోవాల‌నుకుంది. ఓర్నాయ‌నో ఇవ‌న్నీ త‌న ఇంటిదాకా వ‌స్తే ఏం కావా లి? అనుకుంది. ఎవ‌రో క‌నిపిస్తే పిలిచింది. కానీ ఎవ‌రూ ఆమె పిలుపు ప‌ట్టించుకోలేదు. కానీ ఒక వ్య‌క్తి మాత్రం ఆమె వెంట గొర్రెలు ఫాలో అవ‌డం మాత్రం వీడియో తీసి త‌ర్వాత నెట్‌లో పెట్టాడు. ఇపుడు దానికి వేల‌ల్లో అభిమానులు త‌యార‌య్యారు. ఇదో పెద్ద కామెడీ సీన్ అని పేరు పెట్టుకున్నారు. చూడ్డా నికి అదేదో సినిమాలో మోడ‌ర్న్డ్ర‌స్ వేసుకున్న హీరోయిన్ వెంట కుక్క‌లు ప‌డిన‌ట్టు వీక్ష‌కుల‌కు అనిపించింది. కాల‌క్షేపానికి వారికి బాగానే దొరికింద‌నుకున్నారు. కానీ ఆమె మాత్రం భ‌యంతో ఒణికి పోయింది. వాటి య‌జ‌మాని వ‌చ్చి త‌న‌ను తిడ‌తాడేమోన‌ని, ఎందుకంటే అవి త‌న‌నే అనుస‌రిస్తు న్నా యి మ‌రి. ఆమె వాటిని మందుపెట్టి త‌న వెంట తీసుకువ‌చ్చాన‌ని అనుకుంటే పెద్ద కేసే అవుతుంది క‌దా!  మొత్తానికి తేలిందేమంటే, ఆ గొర్రెల మంద అట‌వీప్రాంతంలో త‌ప్పిపోయాయి. ఆమెను చూసి గ్రామం లోకి వెళ్లే త‌మ య‌జ‌మాని అనుకున్నాయి. ఆమె వెళుతోంటే వెంట‌ప‌డింది ఆ మంద‌!

కాంగ్రెస్ కబ్జాకు రేవంత్ స్కెచ్..

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్నారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సంగతి చెప్పననక్కర లేదు. అసలే అనారోగ్యం, ఆ పైన కన్నతల్లిని కోల్పయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ప్రియాంక, ఇక్కడో కాలు, అక్కడో  కాలు అన్నట్లుగా ఎక్కడెక్కడి పనులో చక్కపెట్టుకోవడంలో చాలా చాలా బిజీగా ఉన్నారు. ఎక్కడున్నారో, అసలు దేశంలో ఉన్నారో లేదో ఏమో కానీ, చాలా కాలంగా రాబర్ట్ వాద్రాకు సంబందించిన వార్తలు ఎక్కడా వినిపించడం లేదు. కనిపించడం లేదు. నిజం ఏమిటో కానీ, ఆయన కూడా పీకల్లోతు కష్టాల్లోనే ఉన్నారని కొందరు అంటుంటే, అందుకే ఆయన అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారని ఇంకొందరు  అంటున్నారు. ఇలా కాంగ్రెస్ కీలక నేతలు ఎవరు అందుబాటులో లేక పోవడం వలనో, ఏమో కాంగ్రెస్ పార్టీ చుక్కాని లేని నావలా ప్రయాణం సాగిస్తోందని, పార్టీలో మిగిలిన పెద్దలు, పార్టీ క్యాడర్ ఆందోళనలో ఉన్నారు.  అదలా ఉంటే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ‘ఓనర్ షిప్’ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పుట్టెడు ఆశలతో పార్టీలో చేరారు. పార్టీలో చేరడం ఏమిటి మూడేళ్లు తిరక్కుండానే, కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన సీనియర్లను పడగొట్టి మరీ పీసీసీ పీఠం దక్కించుకున్నారు. రేవంత్ రెడ్డితో సన్నిహిత పరిచయం ఉన్న ఎవరైనా, ఆయనకు ముఖ్యమంత్రి కుర్చీ మీద మక్కువ ఎక్కువని అంటారు. ఆఫ్కోర్స్, రాజకీయ నాయకులు అందరికీ పదవీ కాంక్ష ఉండడం సహజం కానీ,  రేవంత్ రెడ్డికి, అది ఇంకొంచెం ఎక్కువని అంటారు. అందరిలా ఆయన ఏ మంత్రి పదవితోనో సంతృప్తి చెందే రకం కాదని, ముఖ్యమంత్రి పదవి ఒక్కటే ఆయన లక్ష్యమని అంటారు. అందుకే ఆయన అన్ని పార్టీలు తిరిగి చివరకు కాంగ్రెస్ లో చేరి ముఖ్యమంత్రి కుర్చీ టార్గెట్ గా అడుగులు వేస్తున్నారని అంటున్నారు.  అదొకటి అలా ఉంటే, రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా సీనియర్ నాయకులను సాగనంపి, పార్టీని కబ్జాచేసే ప్రయత్నాలు సాగిస్తున్నారని కొందరు సీనియర్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ పార్టీ సీనియర్లు అసంతృప్తితో రగిలి పోతూనే ఉన్నారు. అది అనేక మార్లు బహిర్గతం అవుతూనే ఉంది. పార్టీ అధిష్టానం దృష్టికీ వెళ్ళింది. ఒకటి రెండు పర్యాయాలు రాహుల్ గాంధీ నేతలందరినీ ఢిల్లీకి పిలిపించి రేవంత్, సీనియర్ నేతల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. ప్రియాంకా వాద్రా కుడా జోక్యం చేసుకుని ఫిర్యాదులు స్వీకరించారు. కోమటి రెడ్డి వెంకట రెడ్డిని పిలిపించుకుని, ‘పరిస్థితి’ చర్చించారు.  మరోవంక రేవంత్ రెడ్డి మొదటి నుంచి సీనియర్లతో సయోధ్యకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నా, సీనియర్లను సాగనంపే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు బహిరంగానే వినిపిస్తున్నాయి.కోమటి రెడ్డి వెంకట రెడ్డి, జగ్గా రెడ్డి, వీహెచ్, మర్రి శశిధర్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్ వంటి కొందరు సీనియర్లు  బహిరంగంగా బయట పడితే, ఇంకొందరు సైలెంట్ గా సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారు.  నిజానికి, రేవంత్ రెడ్డి మునుగోడుకు ముందు నుంచి కుడా, సీనియర్లను పొమ్మనకుండా పొగబెట్టి పంపించే ప్రయత్నాలు సాగిస్తున్నారని,. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా, కాంగ్రెస్, తెరాస పార్టీలు రెండూ మద్దతు ఇస్తున్న ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా తెరాస ఆహ్వానం మేరకు రాష్ట్రానికి వచ్చిన సమయంలో, మర్యాద పూర్వకంగా యశ్వంత్ సిన్హాను కలిసిన పార్టీ సీనియర్ నాయకుడు  వీహెచ్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ ఇంటిమీద కాకి ఆ ఇంటిమీద వాలడానికి వీలులేదని, పీసీసీ చీఫ్ హుకుం జారీ చేశారు. అంతే కాదు, ఎవరైనా,తాను గీసిన గీత దాటితే, బండ కేసి కొడతానని హెచ్చరించారు. అంతే కాకుండా  పార్టీలో ఉంటే ఉండండి పోతే పొండి. గీతదాటితే మాత్రం ఎంతటి వారినైనా ఉపెక్షించేంది లేదని సీనియర్ల  కు డైరెక్ట్ గానే  స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక మునుగోడు ఉప ఎన్నిక ఎపిసోడ్ మొదలైన తర్వాత, రేవంత్ రెడ్డి ఆయన వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ మరి  కొందరు  నాయకులు చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపాయి. ముఖ్యంగా పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డిని ఉద్దేశించి దయాకర్   బహిరంగ సభ వేదికగా చేసిన.  బూతు   వ్యాఖ్యలు, అలాగే రేవంత్ రెడ్డి సీనియర్లను, హోంగార్డ్స్ అంటూ చులకన చేస్తూ చేసిన వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి, సీనియర్ల మధ్య దురాన్ని మరింతగా పెంచేశాయి. ముఖ్యంగా కోమటి రెడ్డి వెంకట రెడ్డి చాల సీరియస్ అయ్యారు. అంతే కాకుండా, విషయం అధిష్టానం దృష్టికి వెళ్ళింది. ఈ నేపధ్యంలోనే ప్రియాంకా వాద్రా  రేవంత్ రెడ్డికి అక్షింతలు వేశారని, అందుకే రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పారని అంటున్నారు.  అలాగే, రేవంత్ రెడ్డితో చేతులు కలిపి సీనియర్ల మాటకు విలువ లేకుండా చేస్తున్నారని ఆరోపణలు ఎదురుకుంటున్న  రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి  మాణిక్యం ఠాగూర్‌ కు కూడా ప్రియాంక తలంటు పోశారని, పార్టీ సీనియర్ నాయకుడు  మాజీ ఎంపీ మధు యాష్కి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.  అయితే, అదెలా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా సీనియర్ నాయకుల అడ్డు తొలిగించుకుని, పార్టీని తన గుప్పెట్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారని అంటున్నారు. నిజానికి, రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీని, ఒక ప్రాంతీయ పార్టీగా మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అందుకే, మునుగోడు ఉప ఎన్నిక విషయంలో సీనియర్ నాయకులను ఇరికించే విధంగా వ్యూహ రచన చేస్తున్నారని అంటున్నారు. మునుగోడు ఆటలో కాంగ్రెస్ అభ్యర్ధి గెలిచినా ఓడినా, ఆటలో తమదే పై చేయి అయ్యేలా, రేవంత్ పావులు కదుపుతున్నారని  అంటున్నారు. అదలా ఉంటే, ప్రియాంక ఎంట్రీతో రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు సీనియర్లు కూడా వ్యూహాత్మకంగా పవువులు కదుపుతున్నారని అంటున్నారు. అందుకే, రేవంత్ రెడ్డి కేరళలో  భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని కలిసి వచ్చారని అంటున్నారు. అయితే, రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పై సర్వాధికారాలు సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నది నిజమే అయినా, కాంగ్రెస్ సీనియర్లు, ఆయన ఆటలు ఎంతవరకు సాగానిస్తారనేది చూడవలసి ఉందని విశ్లేషకులు అంటున్నారు. అదలా ఉంటే రేవంత్ కు రాహుల్ అండదండలుంటే. సీనియర్లకు ప్రియాంక మద్దతు గట్టిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, మునుగోడు ఉపఎన్నిక ఫలితంపైనే రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని సీయర్లు కొందరు ముక్తాయింపు నిస్తున్నారు.

రైతుల దీక్ష‌కు వెళ్ల‌కుండా టీడీపీ, సీపీఐ, సీపీఎం నాయకుల అరెస్టు

లేపాక్షి భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షం సోమవారం చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నంచేశారు. టీడీపీ, సీపీఐ, సీపీఎం, రైతు, ప్రజా సంఘాల నాయకులను ఎక్కడిక క్కడ నిర్బంధించారు.  లేపాక్షి నాలెడ్జ్‌హబ్‌ నిర్వాసిత రైతుల హక్కుల పరిరక్షణ వేదిక, అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం నుంచి కొడికొండ చెక్‌పోస్టు వద్ద దీక్ష చేపట్టాలని నిర్ణయించగా, పోలీసులు అనుమ తించలేదు. అయినా వెనక్కు తగ్గేది లేదని నాయకులు ప్రకటించారు. దీంతో పోలీ సులు ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్టులు, అరెస్టులు కొనసాగించారు. టీడీపీ శ్రీసత్య సాయి జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిని రొద్దం మండలం మరువపల్లిలో, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబి కా లక్ష్మీనారాయణను హిందూపురంలో హౌస్‌అరెస్ట్‌ చేశారు. దీక్షకు వెళుతున్న సీపీఐ నాయకులను హిందూపురంలో అడ్డుకుని, టూటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. చిల మత్తూరు లో టీడీపీ, సీపీఎం నాయకులను అరెస్ట్‌ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ, ఇతర నాయకు లను అరెస్టుచేశారు. మాజీమంత్రి  పల్లె రఘునాథ్‌రెడ్డిని  అనంతపురంలోని ఆయన నివాసం లో నిర్బంధిం చారు. ఇదిలా ఉండ‌గా, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ, తెలుగు రైతు ఆధ్వర్యంలో సోమవారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో కృష్ణాజిల్లా జ‌గ్గ‌య్య పేట‌ మండలంలోని బూద వాడకు చెందిన తెలుగు రైతు విభాగం విజయవాడ పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి గడ్డం హుస్సేన్‌, రాష్ట్ర టీడీపీ గ్రీవెన్స్‌ సెల్‌ కో కన్వీనర్‌ ముల్లంగి రామకృష్ణారెడ్డితో పాటు మరో వ్యక్తికి చిల్లకల్లు పోలీసులు ఆదివారం రాత్రి నోటీసులు అందించారు. అలాగే గంగ‌ప‌ల‌గూడెంలో  రైతులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీడీపీ ఆధ్వర్యంలో తల పెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లేందుకు అనుమతులు నిరాకరిస్తూ తెలుగు రైతు జిల్లా అధ్య క్షుడు చెరుకూరి రాజేశ్వరరావును సోమవారం పోలీసులు ఊటుకూరు గ్రామంలో హౌస్‌ అరెస్టు చేశారు. తెలుగు రైతు సంఘ జిల్లా నేతలురెడ్డిగూడెం: ప్రజా సమస్యల పరిష్కారానికి తలపెట్టిన చలో అసెంబ్లీని అడ్డు కోవడం ప్రభుత్వం నిరంకుశ ధోరణికి నిదర్శనమని తెలుగు రైతు సంఘ జిల్లా నాయకులు వేణుగోపాల రెడ్డి, రాయుడు వెంకటేశ్వర్లు అన్నారు. వారివురిని కూనపరాజుపర్వలో వారి నివాసాల వద్ద ఆదివారం సాయంత్రం నుంచి  సోమవారం సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు వారిని గృహ నిర్బంధం చేశారు. 

ఎలిజ‌బెత్‌-2 రాణికి అంతిమ‌వీడ్కోలు

రాజ‌కుటుంబం స‌మ‌క్షంలో ఎలిజ‌బెత్‌-2  అంత్య్ర‌కియ‌లు సోమ‌వారం జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో వివిధ దేశాధినేత‌లు, ప్ర‌త్యేక ఆహా్వ‌నితులు రెండువేల‌మంది పాల్గొన్నారు. కింగ్‌ చార్లెస్‌-3 ఆధ్వర్యంలో వెస్ట్ మినిస్టర్‌ హాల్‌లో క్యాటఫాక్‌పై నుంచి రాణి శవపేటికను విండర్స్‌ క్యాసల్‌ కు తరలించారు. ఈ కార్యక్ర మం లో యావత్‌ రాజ కుటుంబం పాల్గొంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సహా ప్రపంచ దేశాల ప్రతినిధులు రాణికి నివాళులర్పించారు.  రాణి పార్థివదేహాన్ని రాయల్‌నేవీ స్టేట్‌ గన్‌క్యారేజీలో వెల్లింగ్టన్‌ఆర్చ్‌ మీదుగా విండర్స్‌ క్యాసల్‌కు తరలించారు. భారీ ఎత్తున జరిపిన ఎలిజబెత్‌-2 అంతిమ యాత్రలో ఆరు వేల మంది సాయుధులైన సైని కులతో మార్చ్‌ నిర్వహించారు. రాణి అంత్యక్రియలు ప్రారంభమైన వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌ మొదలు.. రోడ్డుకు ఇరువైపులా పౌరులు దాదాపు 8 కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఎలిజబెత్‌-2కు నివాళిగా బ్రిటన్‌లో ఉద యం 8 గంటలకు ప్రజలంతా నిమిషం పాటు మౌనం పాటించారు. వెస్ట్‌మినిస్టర్‌లో రాణి పార్థివ దేహాన్ని ఖననం చేసే సమయంలో కూడా ప్రపంచ నేతలు రెండేసి నిమిషాల పాటు మౌనం వహించి, ఆమె ఆత్మ శాంతికి ప్రార్థనలు చేశారు. కామన్వెల్త్‌ ప్రధాన కార్యదర్శి బారోనెస్‌ ప్యాట్రిసియా, బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌ బైబిల్‌ వాక్యాలను పఠించి, కీర్తనలు అలపించారు. రాణి అంతిమ యాత్ర సందర్భంగా లండన్‌లోని బిగ్‌ బెన్‌ గంటను ఎలిజబెత్‌-2 96 ఏళ్లు జీవించినదానికి గుర్తుగా నిమిషానికి ఒకసారి చొప్పున 96 సార్లు మోగిం చారు. క్వీన్‌ ఎలిజబెత్‌ తన 96వ ఏట స్కాట్‌లాండ్‌లోని బల్మోరల్‌ క్యాజిల్‌లో ఈ నెల 8న మరణించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ‘గాడ్‌ సేవ్‌ ద కింగ్‌’ అనే బ్రిటన్‌ జాతీయ గీతాన్ని ఆలపించారు.  వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌లో రాణి అంత్యక్రియలు ప్రారంభమవ్వడానికి ముందు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలువురు దేశాధినేతలతో మాట్లాడారు. వారిలో టాంజానియా అధ్యక్షుడు సమియా సులుహూ హసన్‌, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ఉన్నారు. షేక్‌ హసీనా, ఆమె సోదరి షేక్‌ రెహెనాతో ముర్ము భేటీ అయినట్లు రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రపతి వెంట విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్‌ క్వాత్రా ఉన్నారు.

మాన్ ను విమానం నుంచి దింపేశారా? దిగిపోయారా?

పంజాబ్ ముఖ్యమంత్రికి జర్మనీలో ఘోర పరాభవం జరిగిందన్న వార్తలు దేశంలో సంచలనం సృష్టించాయి. తప్పతాగి విమానం ఎక్కారనీ అందుకే దించేశారని బీజేపీ విమర్శల దాడి చేస్తోంది. ఆప్ మాత్రం అనారోగ్యం కారణంగా ఆయన విమానం నుంచి దిగిపోయారని చెబుతోంది. కారణమేదైనా ఇప్పుడు పంజాబ్ ముఖ్యమంత్రి వ్యవహారం ఇటు మీడియాలోనూ.. అటు సామాజిక మాధ్యమంలోనూ విపరీతంగా వైరల్ అయ్యింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏ1గా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ శిసోడియా బుక్కవ్వడం.. అదే లిక్కర్ తాగి విమానం ఎక్కినందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ను జర్మనీలో విమానం నుంచి దించేయడం కాకతాళీయమే అయినా అవినీతిని ఊడ్చి పారేస్తాం అంటూ చెప్పే ఆప్ ఇలా మద్యం విషయంలో వార్తల్లో నిలవడం మాత్రం యాధృచ్చికం కాదంటున్నారు పరిశీలకులు. గాంధీ అంతే వాసి అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన ఆప్ ఇప్పుడు ఇలా మద్యం వ్యవహారంలోనే ఆరోపణలు ఎదుర్కొనడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ విషయానికి వస్తే ఆయన వారం రోజుల పర్యటన కోసం జర్మనీ వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఆయన సెప్టెంబర్ 11 నుంచి 18 ఆయన జర్మనీ పర్యటన షెడ్యూల్. షెడ్యూల్ ప్రకారమే ఆయన సెప్టెంబర్ 11న జర్మనీ బయలుదేరి వెళ్లారు. అలాగే షెడ్యూల్ ప్రకారమే 18వ తేదీన (ఆదివారం) తిరుగు ప్రయాణమయ్యారు. జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ విమానాశ్రయం నుంచి లుప్టాన్సా ఎయిర్ లైన్స్ విమానంలో ఆయన ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. అయితే ఆయన ఆ విమానంలో బోర్డ్ చేసిన తరువాత దిగిపోయారు. ఆ విమానం దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా అక్కడ నుంచి బయలు దేరింది. ఢిల్లీ చేరుకున్న ఆ విమానంలో మాన్ లేరు. తొలుత విమానం ఆలస్యానికి సాంకేతిక లోపం కారణమని ఎయిర్ లైన్స్ ప్రకటించింది. అయితే ఆ విమానంలో బోర్డ్ చేసిన తరువాత మాన్ దిగిపోవడానికి కారణమేమిటో వెల్లడించలేదు. అలాగే తరువాత విమానం ఆలస్యానికి సాంకేతిక లోపం కారణం కాదనీ, ఒక ప్రయాణీకుడిని  అతడి లగేజీని విమానం నుంచి దించి వేయాల్సిరావడం వల్లే ఆలస్యమైందని తరువాత ప్రకటించింది. ఆ ప్రయాణీకుడు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మానేనని అంటున్నారు. ఆయనను విమానం నుంచి దించివేయడానికి కారణం ఆయన తప్పతాగి ఉండటమేనని చెబుతున్నారు. అయితే ఆప్ మాత్రం మాన్ అనారోగ్యం కారణంగానే విమానం నుంచి దిగిపోయారని అంటున్నది. లేని విషయాన్ని బీజేపీ అనవసరంగా పెద్దది చేసి రాద్ధాంతం చేస్తోందని, గుజరాత్ ఎన్నికలలో ఆప్ బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్న కారణంగానే ఆ పార్టీ ఇటువంటి అవాస్తవ ప్రచారం చేస్తోందని విమర్శిస్తున్నది. 

టైం మీరు చెబుతారా.. నన్ను చెప్పమంటారా?.. షర్మిల

ఏదో సినిమాలో బాలకృష్ణ డైలాగ్ ఉంది ప్లేస్ నువ్వు చెబుతావా నన్ను చెప్పమంటావా, టైమ్ నువ్వు చెబుతావా నన్ను చెప్పమంటావా అంటూ సరిగ్గా అదే స్టైల్ లో వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల టీఆర్ఎస్ పై పంచ్ డైలాగులు సంధించారు. తన విమర్శలపై టీఆర్ఎస్ కేసులు పెడతామనీ, అసెంబ్లీకి పిలిపిస్తామనీ స్పందించిన తీరుపై ఆమె పవర్ ఫుల్ డైలాగులతో రిటార్డ్ ఇచ్చారు. ‘ప్లేస్ మీరు చెప్పేశారు..టైమ్ నన్ను చెప్పమంటారా.. మీరు చెబుతారా?’ అంటూ నిలదీశారు. దమ్ముంటే అసెంబ్లీకి పిలవండని సవాల్ చేశారు. నడుచుకుంటూ వస్తా.. కాలి నడకన వస్తా, తలెత్తుకు వస్తా అంటూ షర్మిల ఓ రేంజ్ లో డైలాగులతో అదరగొట్టేశారు.  సుదీర్ఘ పాదయాత్ర చేసినా తెలంగాణలో తనకు కానీ తన పార్టీకి కానీ ఎలాంటి గుర్తింపూ రాకపోవడం, ఎవరికీ పట్టనట్టుగా యాత్ర సాగడంతో ఆమె తన విమర్శలలో ఘాటు పెంచారు.  అరెస్టు, కేసుల వరకూ వెళితే తప్ప ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదని గ్రహించారు. విడతల వారీ పాదయాత్ర వల్ల వైఎస్సార్ టీపీకి ఇప్పటి వరకూ ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేకపోవడంతో ఆమె తన రూటు మార్చారు. ఓ వైపు పాదయాత్ర కొనసాగిస్తూనే.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులపై విమర్శల దాడిని తీవ్రం చేశారు. పరుష పదజాలంతో రెచ్చిపోతున్నారు. మరో వైపు టీఆర్ఎస్ కూడా షర్మిల విమర్శలను స్వాగతిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆమెపై కేసులు పెట్టీ, ప్రతి విమర్శలతో మరింత రెచ్చగొట్టేలా టీఆర్ఎస్ నేతలు వ్యవహరించడానికి కారణమిదేనని అంటున్నారు. ఎందుకంటే.. రాష్ట్రంలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందన్న అంచనాతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం లేని పార్టీకి ఏదో ఓ మేర గుర్తింపు వస్తేనే సాధ్యమౌతుందన్న అభిప్రాయంతో ఇంత కాలం పట్టించుకోకుండా వదిలేసిన షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తతలు పెచ్చరిల్లేలా, ఆమెపై విమర్శలు సెటైర్లతో రెచ్చగొట్టే వ్యూహాన్ని అనుసరిస్తున్నారని పేర్కొంటున్నారు. అందుకే ఆమెపై గవర్నర్ కు ఫిర్యాదు చేసి అసెంబ్లీకి పిలిపించడం ద్వారా ప్రజల దృష్టిని ఈడీ దాడులు, లిక్కర్ స్కాం వంటి అంశాల నుంచి మళ్లించి పొలిటికల్ హీట్ పెంచాలని భావిస్తున్నారని రాజకీయ వర్గాల్లో ఓ చర్చ సాగుతోంది. ఇదంతా పరస్పర అవగాహనతోనే జరుగుతోందా అన్న అనుమానాలు కూడా పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇంత కాలం షర్మిల పార్టీని కానీ, పాదయాత్రను కానీ ఇసుమంతైనా పట్టించుకోని టీఆర్ఎస్ ఇప్పుడు.. రాష్ట్రంలో లిక్కర్ స్కాం, బీజేపీ నేతల వరుస పర్యటనలతో పోలిటికల్ హీట్ పీక్స్ కు చేరిన సమయంలో.. షర్మిలపై విమర్శలు కేసులు అంటూ హడావుడి చేయడం వెనుక వ్యూహం ఇదేనని అంటున్నారు. 

రోజా ఫైర్ కు కారణం అదేనా?

ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గంలో అస్సలు పరిచమే అవసరం లేని మంత్రి ఎవరైనా ఉన్నారంటే, ఆ మంత్రి ..పేరు ..ఆర్కే రోజా... నిజమే మళ్ళీ ఆర్కే.. అంటే కొందరికైనా,  ఎవరామె?  అనే అనుమానం వస్తే రావచ్చును. కానీ, జబర్దస్త్ రోజా అన్నారనుకోండి, పిల్లా పాపా, గొడ్డు గోదా సహా ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాదు. ఠక్కున అర్థమైపోతుంది. ఆమె వందకు పైగా సినిమాల్లో నటించారు, రాజకీయాల్లోనూ చాలా కాలంగానే ఉన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు,. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు.అయినా, రోజా అంటే జబర్దస్త్, జబర్దస్త్ అంటే రోజా .. అనేలా పాపులర్ అయ్యారు. అందుకే, రోజా అనగానే ముందు ఆమె జబర్దస్త్ నవ్వు ఆ వెనకనే ఆమె అందమైన రూపం కళ్ళ ముందు కొచ్చేస్తాయి.  అవును రోజా, బహుముఖ ప్రజ్ఞావంతురాలు. హీరొయిన్ గా, నటిగా, యాంకర్ గా,అనేక రంగాలలో తన ప్రతిభాపాటవాలు ప్రదర్శించారు. ఇవన్నీ ఒకెత్తు అయితే,  అన్నింటినీ  మించి శ్రీమతి రోజా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పై ఈగ వాలినా సహించలేరు. జగనన్న అంటే రోజాకు అంత ఇదన్న మాట. జగనన్నకు కూడా అంతే సొంత సోదరి షర్మిలమ్మ కంటే దేవుడిచ్చిన చెల్లెలు రోజా అంటే ఎక్కువ ప్రేమ. అందుకే మంత్రి పదవి కోసం ఆమె పడ్డ తపనను చూసి తట్టుకోలేక, ఆమెకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. అందుకే ఆమె, రెట్టించిన ఉత్సాహంతో, జగనన్నను ఎవరన్నా ఏదన్నా అంటే, మరింతగా రెచ్చిపోతున్నారు.  ఇంతవరకు తెలుగు దేశం నాయకుల మీద నోరు పారేసుకున్న రోజా, ఇప్పడు జనసేన అధినేత, పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ చేసిన నేరం ఏమిటంటే, ఎవరో చేసిన ఏదో సర్వే ఆధారంగా నెక్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపే ఓడి పోతుందని, ఆపార్టీకి 45 నుంచి 67 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పారు. నిజానికి, అంత మాత్రానికే, రోజా మేడం అంతలా అగ్గిమీద గుగ్గిలం ఎందుకయ్యారో ఆమెకే తెలియాలని ఆమె అనుచరులే అంటున్నారు.  అయితే, ఆమె ఇలా రెచ్చి పోవడానికి ఇంకా ఎదో కారణం ఉందని,ఆమె కుర్చీ కిందకు నీళ్ళొచ్చాయని, అందుకే ఆమే జగనన్నను ప్రసన్నం చేసుకునేందుకే, ఎగస్ట్రా జబర్దస్త్ స్టైల్లో ఎగస్ట్రా ‘డైలాగ్స్’ తో విరుచుకు పడుతున్నారని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇచ్చిన కిక్కులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రులకు గట్టిగా క్లాసు పీకారు.ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డితో పాటుగా, ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతి ప్రమేయం ఉందని విపక్షాలు ఆరోపించాయి. అయినా, ఆ ఆరోపణను మంత్రులు ఎవరూ ఖండించలేదు. మంత్రులకు ఏ నిజాలు తెలుసో ఏమో  కానీ, ఎవరికి వారు, మన కెందు కొచ్చిందిలే అని మౌనంగా ఉండి పోయారు. సహజంగానే, ముఖ్యమంత్రికి కోపమొచ్చింది.మీకు మంత్రి పదవులు ఇచ్చింది ఎందుకు ఇందుకే కదా, నామీద, నా కుటుంబ సభ్యులపై ఇంతలేసి ఆరోపణస్తే ఖండించవలసిన బాధ్యత మీకు లేదా అంటూ మంత్రులపై మండి పడ్డారు. ఇలా అయితే లాభం లేదు,  మీ దారి మీది నా దారి నాదని హెచ్చరించారు. అంతేకాకుండా, ఇద్దరు మహిళా మంత్రులతో పాటుగా, మొత్తం నలుగురు మంత్రులకు ఉద్వాసన తపదని సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు.  ఆ నలుగురిలో ఫస్ట్ నేమ్. ఆర్కే రోజాదే అని పార్టీ వర్గాలే చెప్పాయి. అందుకే, ఇప్పుడు ఆమె, జబర్దస్త్ నుంచి ఎగస్ట్రా జబర్దస్త్  మించి మరింత రెచ్చి పోతున్నారని అంటున్నారు.

పోలీస్ అకాడెమీలో  స‌మావేశం.. అమిత్ షా  ల‌క్ష్య‌మేమిటి?

అస‌లే ప‌రీక్ష‌లు బాగా రాయ‌లేదు. మార్కులు అంతంత‌మాత్ర‌మే వ‌స్తాయ‌న్న భ‌యంతో  పిల్ల‌వాడు భ‌య ప‌డుతున్నాడు. దీనికి తోడు అమ్మ తిట్టిపోసింది, మావ‌య్య ప‌నిలో ప‌నిగా ఒక్క‌టిచ్చుకున్నాడు. ఇపుడే మో నాన్న‌ని హెడ్ మాస్ట‌ర్ పిలిచాడు! సాయింత్రం ఆర‌యింది. ఇంకా  నాన్న ఇంటికి రాలేదు. పిల్ల‌వాడు కిటికీలోంచి రోడ్డునే చూస్తున్నాడు. హెడ్‌మాస్ట‌ర్ నాన్న‌కి ఏమి ఫిర్యాదు చేశాడా? అని ఒణుకు తున్నాడు.  ఇపుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఐటీ, ఈడీ, సిబీఐ  ద‌క్షిణాది అధికారులతో స‌మా వేశమ‌వుతుండ డం వెనుక  ఆంత‌ర్య‌మేమిట‌ని రెండు తెలుగు రాష్ట్రాల  రాజ‌కీయ ప్ర‌ముఖులు  కాస్తంత భ‌య‌ప‌డుతూ న్నారు.   అస‌లే  లిక్క‌ర్ స్కామ్‌లు, అవినీతి, దేశ‌ద్రోహ‌చ‌ర్య‌ల మూలాలు ఇక్క‌డే ఉన్నాయ‌ని ఇటీవ‌ల కేసుల్లో బ‌యటప‌డ‌టంతో అమిత్ షా స‌మావేశం ఫ‌లితం ఎలా ఉంటుంద‌న్న‌ది ఇటు రాజ‌కీయ‌నాయ‌కుల్లోనూ ఖంగారుపెట్టిస్తోంది. ఈ కేసులు, సాక్షాలు బ‌య‌ట‌ప‌డ‌టంతో రాజ‌కీయప‌రంగా రాష్ట్రాల ప్ర‌తిష్ట దిగ‌జారి కేంద్రం చెప్పిన‌ట్టు జీ హుజూర్ అనాల్సి వ‌స్తుంద‌న్న ఆందోళ‌న‌తో రాజకీయవర్గాల్లో కలకలం రేగింది. అయితే, కేంద్ర హోం మంత్రి గ‌నుక అమిత్ షా ప‌రిశోధ‌నా సంస్థ‌ల‌తో భేటీ కావ‌డం, స‌మాచారం తెలుసు కోవ‌డానికి ఆయ‌న‌కు ఎంతో అవ‌కాశం ఉంది. దాన్ని ఎవ‌రూ కాద‌న‌లేరు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాడులు జ‌రుగుతున్న ఈ త‌రుణంలోనే ఆయ‌న వ‌చ్చి హైద‌రాబాద్‌లోని పటేల్ పోలీస్ అకాడమీలో ఈ సమావేశం నిర్వ‌హించ‌డ‌మే రాజ‌కీయ‌వ‌ర్గాల‌కు అంతుచిక్క‌డం లేదు. ఒక‌వేళ ద‌ర్యా ప్తును మ‌రింత వేగం చేయ‌మ‌ని సూచించారా లేక ఈ ద‌ర్యాప్తును అడ్డుపెట్టుకుని టీఆర్ ఎస్‌కు, అటు వైసీపీకి చిన్న షాక్ ఇవ్వ‌డానికి సిద్ధ‌ప‌డ్డారా అన్న‌ది ఇంకా తేల‌వ‌ల‌సి ఉంది.  కేసుల సంబంధించి ద‌ర్యాప్తుపై రివ్యూ కోసం చ‌ర్చిస్తే ఫ‌ర‌వా ఇల్లే.. అలాగాకుండా  ఈడీ, సిబీఐలతో రాజ కీయ అంశాలు కూడా చ‌ర్చించి కొత్త వ్యూహాలు ర‌చిస్తున్నార‌న్న అనుమానం త‌లెత్తుతోంది. అదే నిజ‌మైతే టీఆర్ ఎస్‌, వైసీపీలు మ‌రింత జాగ్ర‌త్త‌ప‌డాల్సి వ‌స్తుంది.  అయితే, ఈ స‌మావేశం కేసీఆర్‌ను ఇర‌కాటం పెట్ట‌డానికి వ్యూహాలు ప‌టిష్టంగా అమ‌లు చేసే దిశ గా మార్గ‌నిర్దేశం చేయ‌వ‌చ్చు. ఇప్ప‌టికే కేసీఆర్ స‌ర్కార్ను కూల్చేయ‌డానికి బీజేపీ కంక‌ణం క‌ట్టుకుని అన్ని విధాలా, అన్ని మార్గాలను మూసేసి ఉక్కిరిబిక్కిరి చేయ‌డానికే క‌మ‌ల‌నాథులు పూనుకున్నారు.   వీలు దొరికిన‌పుడ‌ల్లా కేంద్రం నుంచి బీజేపీ సీనియర్లు తెలంగాణాలో ప‌ర్య‌టించి ఏదో ఒక స‌భ‌, స‌మావేశం పేరుతో ఇక్క‌డి బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను, నాయ‌కుల‌ను ఉత్తేజ‌ప‌రిచి, మ‌రింత దాడుల‌కు ఉసి గొల్పుతున్నారు. లిక్క‌ర్ స్కామ్ లో క‌విత పేరు బ‌య‌ట‌ప‌డ‌టంతో కేసీఆర్ కుటుంబం  ఇబ్బందుల్లో ప‌డింది. ఈ అవ‌కా శాన్ని బీజేపీ ఏమాత్రం వ‌దులుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేదు.  మునుగోడు ఎన్నిక‌ల‌కు ముందే కేసీఆర్ కుటుంబ ప‌రువు రోడ్డుకి ఈడ్చేందుకు బీజేపీ వ‌ర్గాలు శ‌త‌విధాల ప్ర‌య‌త్న‌స్తూనే ఉంది. దీనికి తోడు తాజాగా ఎన్ ఐ ఏ దాడులు చేప‌ట్ట‌డం రాష్ట్రం ప‌రువుపోయి అవ‌మాన‌భారంతో కేసీఆర్ ప్ర‌భు త్వం ఇబ్బందుల్లో ప‌డింది. అటు జ‌గ‌న్ స‌ర్కార్ కూడా ఇదే ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న‌ది.  రెండు రాష్ట్రాల మీద ద‌ర్యాప్తుసంస్థ‌ల చూపు బ‌లప‌డుతున్నవేళ అమిత్ షా అదే ద‌ర్యాప్తు సంస్థ‌ల అధికారుల‌తో హైద‌రా బాద్ వ‌చ్చి ప్ర‌త్యేకంగా స‌మావేశం కావ‌డంతో కేసీఆర్‌, జ‌గ‌న్  ప‌రిస్థితి అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌లా మారింద నాలి. 

ఎమ్మెల్యేవే కాలేదు,  సీఎం ఎలా అవుతావు?...  రోజా 

తెర‌మీద న‌ట‌న‌కు వేలాదిమంది వీరాభిమానులు త‌యారుకాగానే రాజ‌కీయాల్లో నిల‌దొక్కుకోగ‌ల నాయ కుడు అవుతారా  సినీస్టార్లు?  సామాన్య జ‌నానికి  ఇదో తీర‌ని  సందేహం. సినిమాలు వ‌దిలేసుకుని జ‌నం కోసం పాటుప‌డ‌తానంటూ ప‌వ‌ర్‌స్టార్ రాజ‌కీయ‌రంగ ప్ర‌వేశం చేసిన త‌ర్వాత పెద్ద‌గా సాధించిందేమీ లేద ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మీద వైసీపీ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే ఉంది. తాజాగా వైసీపీ మంత్రి ఆర్.కె.రోజా ప‌వ‌ర్ స్టార్‌పై విరుచుకుప‌డ్డారు. వైసీపీకి 45 నుంచి 67 సీట్లు మాత్రమే వస్తాయని అంటున్నారు. ఇది  విని రాష్ట్రంలోని ప్రజలు నవ్వుకుంటున్నార‌ని . జగన్ సీఎం కాలేవు అన్నావు.. నువ్వు ఎమ్మెల్యేవి కాలేక పోయా వ‌ని. చిన్న పిల్లలు నీ మీటింగ్‌కు వస్తే సీఎం అయిపోతాన‌ని ఎలా అనుకున్నావ‌ని రోజా ఎద్దేవా చేశారు.  టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పాద‌యాత్ర‌ను ర‌ద్దు చేసుకున్నార‌ని మీరూ పాదయాత్ర‌ను ర‌ద్దు చేసుకోవ‌డమేమిట‌ని రోజా ప్ర‌శ్నించారు. అస‌లు ప్ర‌జారాజ్యం పార్టీకి రాష్ట్రంలో 175 సీట్ల‌కు పోటీ చేయడానికి అంత‌మంది అభ్య‌ర్ధులు లేర‌ని వైసీపీ మంత్రి రోజా అన్నారు.  వైసీపీకి 45 నుంచి 67 సీట్లు మాత్రమే వస్తాయని అంటున్నారు. ఇది విని రాష్ట్రంలోని ప్రజలు నవ్వుకుం టున్నార‌ని అన్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్‌టీ ఆర్ పార్టీ పెట్టీ అధికారంలోకి సింగిల్‌గా వచ్చారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి సింగిల్‌గా పోటీ చేశారు. జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌ తో భోజనం చేసి హక్కులు రాష్ట్రం వదులుకున్నా రని అంటున్నారు.. బీజేపీ, టీడీపీలు ఉమ్మడి రాజ ధానిగా హైదరాబాద్‌ను వదిలి వచ్చినప్పుడు నువ్వు షూటింగ్‌లో ఉన్నావా? అని ప్ర‌శ్నించారు. నీకు దమ్ముంటే 175 సీట్లలో నీ అభ్యర్ధులను పెట్టి జగన్‌తో ఢీకొను. పందులే గుంపుగా వస్తాయి. ఈ రోజు లోకేష్ ఒక బుర్ర తక్కువ పని చేస్తున్నాడు. లోకేష్‌కు కేవలం అధికార దాహం. అందుకే ఎంఎల్‌సీ, మంత్రి అయ్యాడు. పొద్దున్నే ఎద్దుల బండి ఎక్కి వస్తుంటే చూసిన వాళ్లు నవ్వుకుంటున్నా రన్నారు.  లక్ష 23 వేల కోట్ల ఈ ప్రభుత్వం రైతులకు మూడున్నర ఏళ్లలో అందించింది. నువ్వు అసెంబ్లీ పై జన సేన జెండా ఎగురవేస్తా అన్నావు. నువ్వు అసెంబ్లీలోనే అడుగుపెట్టాకుండా చేశామ‌ని పేర్కొన్నారు

ఏపీలో బీజేపీ మల్టీ స్టారర్.. హిట్టా.. ఫట్టా!

ఇటు  నుంచి కాకపోతే ..అటు నుంచి నరుక్కు రమ్మన్నారు పెద్దలు. ఇప్పుడు ఏపీలో బీజేపీ అదే చేస్తోందా, అంటే అవుననే అంటున్నారు, ఆ పార్టీ పెద్దలు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, మరీ ముఖ్యంగా, 2019 తర్వాత, బీజేపీ  ఆంధ్ర ప్రదేశ్ లో ఎదుగేందుకు, అన్ని ప్రయత్నాలు, ప్రయోగాలు చేసింది. అయినా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా, పార్టీ ఎదిగిందీ లేదు.పెరిగిందీ లేదు. మాటలే తప్ప చేతలు ఎక్కడా కనిపించడం లేదు. జాతీయ స్థాయిలో తారాజువ్వలా దూసుకుపోతున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం తడిసిన సీమ టపాసుల తుస్సు మంటోంది. చివరకు ఆటలో అరటి పండుగా మిగిలిపోయింది. ఈ నేపధ్యంలో బీజేపీ, ఇప్పుడు కొత్తగా మరో ప్రయోగాన్ని తెర మీదకు తెచ్చింది. అదే, మల్టీ స్టారర్ రాజకీయ చిత్రం. ఇంతకీ బీజేపీ చూపిస్తానంటున్న సినిమా ఏమిటి? ఆ కథేంటి?  ఆ వివరాలలోకి వెళితే .. రంగులు పూసుకునే, వారికి రాజకీయాలు ఎందుకు ? ఇది ఇప్పడు కాదు, ఎప్పుడో 80 వ దశకంలో, విశ్వవిఖ్యాత నందమూరి తారకరామా రావు, తెలుగు దేశం పార్టీ స్థాపించిన సమయంలో, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోట్ల విజయభాస్కర రెడ్డి (?) ఈ వ్యాఖ్య చేశారు. నిజానికి, పెద్దాయన కోట్ల ఒక్కరే కాదు, కాంగ్రెస్ నాయకులు మాత్రమే కాదు, ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై అప్పట్లో రాజకీయ విశ్లేషకులు కూడా చాలా వరకు అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, ఆ తర్వాత ఏమి జరిగింది, ఏమిటి అనేది చరిత్ర. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన 11 నెలలలోనే కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు. తెలుగు వారి ఆత్మ గౌరవం సాక్షిగా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసేతర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఏకచత్రాదిపత్యానికి గండి కొట్టారు.కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. తెలుగు దేశం పార్టీని రాష్ట్రంలో తిరుగులేని ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ వ్యతిరేక కూటమి ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. ఒక విధంగా కాంగ్రెస్ ఈ రోజు అనుభవిస్తున్న దురవస్థకు, బీజం అప్పుడే..అక్కడే పడిందని, అక్కడి నుంచే ఇక్కడికి చేరిందని అంటారు.   సరే, అదలా ఉంటే, ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో సినిమా సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలలో కాలు పెట్టేందుకు,అంగుళం జాగా కోసం అష్ట కష్టాలు పడుతున్న బీజేపీ, మల్టీ స్టారర్ పొలిటికల్ పిక్చర్  ప్రయత్నాలలో ఉన్నట్లు తెలుస్తోంది. బహుశా ఇటునుంచి కాకపోతే, అటు నుంచి నరుక్కు రావాలనే సూత్రాన్ని కమల దళం ఫాలో అవుతుందో ఏమో కానీ, రాష్ట్రంలో ఎదిగేందుకు ఇంతవరకు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టిన నేపధ్యంలో, ఇప్పుడు,కొత్త సినిమా ప్లాన్ చేస్తునట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సినిమా హీరోలకు కుల సమీకరణాలను జత చేసి కొత్త కథను సిద్ధం చేస్తోందని పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారంగా తెలుస్తోంది.   కొద్ది రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత షా హైదరాబాద్ లో జూనియర్ ఎన్టీఆర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇంచుమించుగా రెండు గంటలకు పైగానే ఆ ఇద్దరు మాట్లాడుకున్నారు. అమిత్ షా ఒక సినిమా హీరోతో అంత సేపు అది కూడా ఢిల్లీ తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేసుకుని మరీ మాట్లాడారంటే, ఎవరు అవునన్నా, కాదన్నా ఆ భేటికీ రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోదు. సరే, అన్నిగంటలు ఆ ఇద్దరు ఏమి మాట్లాడుకున్నారు, ఏమిటి, అన్నది ఎలా ఉన్నా, రాజకీయ వర్గాల్లో మాత్రం, ఆ భేటి వెనక ఏదో ఉందనే ప్రచారం  చర్చ అయితే ఇప్పటికీ  జోరుగా సాగుతోంది. మరో వంక  ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు.   అదలా ఉంటే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, జనసేన అధ్యక్షుడు, మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ మధ్య మరో  ‘శిఖరాగ్ర’  సమావేశం ఏదో జరగనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ భేటీ అమిత్ షా తో జూనియర్ భేటీకి కొనసాగింపా లేక ఇది ఇంకోటా అనేది ఇంకా క్లియర్ కాలేదు. కానీ ఈ ఇద్దరి భేటీ కూడా రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ భేటీ అంతర్యం ఏమిటనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. సినిమా రిలీజ్ ముందు అభిమానుల్లో ఎలాంటి టెన్షన్ ఉంటుందో ఇప్పుడు, ఆ ఇద్దురు ఎందుకు  కలుస్తున్నారు, ఏమి మాట్లాడుకుంటారు? అనే విషయంలోనూ అలాంటి  టెన్షనే కనిపిస్తోంది.  మరో వంక కేంద్ర రక్షణ శాఖ మంత్రి, రాజ్ నాథ్ సింగ్  ఇటీవల కన్నుమూసిన ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు కుటుంబాన్ని, పరామర్శించారు. పనిలో పనిగా, కృష్ణం రాజు సోదరుని కుమారుడు, హీరో ప్రభాస్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.నిజానికి ప్రభాస్ చాలా కాలంగా బీజేపీ పెద్దలతో టచ్ లోనే ఉన్నారు. గతంలో కృష్ణం రాజు వెంట ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో సమావేసమయ్యారు. అప్పట్లోనే ఆయన బీజీపీలో చేరుతున్నారనే ప్రచారం జరిగింది. అయితే, ప్రభాస్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు.  అయితే, ఇపుడు బీజేపీ, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ చిత్రాన్ని నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఇటీవల  రాజ్య సభకు నామినేట్ అయిన సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ కుటుంబ సహకారం కూడా ఉందని అంటున్నారు. అందుకే, బీజేపీ జాతీయ నాయకులు ఎవరు  రాష్ట్రానికి వచ్చినా, సినిమా హీరోల మీద ఫోకస్ పెడుతున్నారని అంటున్నారు. అయితే, బీజేపీ తయారు చేసినట్లు చెపుతున్న స్క్రిప్ట్ చూస్తే, ఆ ముగ్గురు హీరోలకు, ముఖ్యంగా యువతలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు, సామాజిక, కుల సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు చెపుతున్నారు.  జూనియర్ ఎన్టీఆర్ విషయం అయితే చెప్పనే అక్కరలేదు. ఆయనకు, అన్ని సామాజిక వర్గాలలోనూ అభిమానులు ఉన్నారు. రాజకీయంగా చూసినప్పుడు, ఎన్టీఆర్ మనవడిగా, సహజంగానే కమ్మ సామాజిక వర్గం యువతలో ఆయనకు ప్రత్యేక క్రేజుంది. అలాగే మెగా ఫ్యామిలీకి చెందిన పవన్ కళ్యాణ్ కు కాపు సామాజిక వర్గంలో ప్రత్యేక స్థానముంది. ఇక క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ప్రభాస్ కు ఆ సామాజిక వర్గంలో ఒక ప్రత్యేక స్థానమే ఉంది. ఇలా ప్రధాన సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకునేదుకు బీజేపీ మల్టీ స్టారర్ రాజకీయ చిత్రాన్ని తెరకెక్కిస్తోందని అంటున్నారు.అయితే, పవన్ కళ్యాణ్ అయితే ఆల్రెడీ కాల్ షీట్స్ ఇచ్చేశారు, సొంతంగా పార్టీ పెట్టుకుని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.   కానీ, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా?  ఒక్క తెలుగులోనే కుండా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆ ఇద్దరు, ఇప్పుడే పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా? అంటే డౌటే .. అంటున్నారు.

త‌న బొమ్మ‌గీయ‌మంది..ప‌దికి 5 మార్కులే ఇచ్చింది!

పిల్ల‌ల‌కు పాఠాలు చెప్ప‌డం ఓ క‌ళ‌. అది అంద‌రికీ సాధ్య‌ప‌డేది కాదు. బోర్డుమీద అఆలు, ఏబిసిడీలు రాసి వాటిని ప‌లికించి, ఆ త‌ర్వాత రాయించ‌డ‌మేగ‌దా.. అనుకుంటారు. కానీ దీని కంటే టెన్త్‌పిల్ల‌ల‌కు మాథ్స్ చెప్ప‌డం మ‌హా తేలిక అంటారు అనుభ‌వ‌జ్ఞులు. ఒక‌టో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు చెప్ప‌డంలో మ‌హా ఓపిక ఉండాలి. వాళ్లు వినేలాచేయాలి, వాళ్ల మాట‌లు వినాలి, వాళ్ల‌తో ఆడాలి, పాడాలి. అయితే ఒక టీచ‌ర్ స‌ర‌దాగా వాళ్ల‌తో బొమ్మ వేయించుకుంది. ఒక పిల్ల‌వాడు వేసిన బొమ్మ చూసి ఆశ్చ‌ర్యంతో అలా ఉండి పోయింది. ఇస్లామాబాద్‌లో ఒక స్కూలుటీచ‌ర్‌. చిన్న‌త‌ర‌గ‌తుల‌కు రోజంతా ఏవో వాళ్ల‌చేత చెప్పిస్తూ, రాయిస్తూం డేది. వారికి విసుగు క‌ల‌గ‌కుండా, స‌ర‌దాగా  ఆడించాల‌నుకుంది. అపుడ‌పుడు పాట‌లు పాడుతూ, క్లాస్‌ రూమ్ అంటే భ‌యం లేకుండా చేసింది. త‌ర్వాత తాను భ‌య‌పెట్టే టీచ‌ర్‌ని కాన‌ని అనేక విధాలా స‌ర‌దా క‌బుర్ల తో చెప్పింది. వాళ్లూ అర్ధం చేసుకున్నారు.  ఇలా కాదు, కేవ‌లం పాఠాలు చెప్ప‌డం కాకుండా క్లాస్‌రూమ్‌ని మ‌రింత చక్క‌టి వాతావ‌ర‌ణంలో చూడా ల‌ను కుంది. పిల్ల‌ల్లో బొమ్మ‌లు వేసే నైపుణ్యం ఏమాత్రం ఉందీ తెలుసుకోవాల‌నుకుంది. అంతే వెంట‌నే పిల్ల ల‌కు  పిల్ల‌లూ.. ఈ పూట పాఠం చెప్ప‌ను.. స‌ర‌దాగా మీకు తోచిన చూసిన జంతువు, మ‌నిషి బొమ్మ వేయండి. అంటూ అంద‌రికీ కాయితాలిచ్చింది. పిల్ల‌ల‌కు పెన్సిల్ చెక్కి ర‌బ్బ‌రుతో స‌హా సిద్ధ‌ ప‌డ్డారు. అంత‌లో టీచ‌ర్ ప్లాన్ మార్చేసింది. ఏదీ కాదు.. న‌న్ను చూసి నా బొమ్మ వేయండి.. అని అడిగింది.  ఓ అర‌గంట క్లాస్‌రూమ్ అంతా ప్ర‌శాంతంగా, పిన్‌డ్రాప్ సైలెన్స్‌గా ఉంది. ఎవ‌రు కిసుక్కుమ‌ని న‌వ్వినా, పెన్సిల్ చెక్కినా విన‌ప‌డేంత నిశ్శ‌బ్డం అన‌మాట‌! అర‌గంట త‌ర్వాత అంద‌ర్నీ కాయితాలు తెమ్మ‌న్న‌ది ఆ టీచ‌ర్‌. ఒక పిల్ల‌వాడు  టీచ‌ర్ బొమ్మ  చాలా బాగా  గీసాడు. .టీచ‌ర్ జుత్తు, డ్ర‌స్ ఎలా ఉండేది  కూడా స‌రిగ్గా దించేసాడు. అది చూసి ఆమెకు ఆశ్చ‌ర్య‌మేసింది. .వాడి ఊహాశ‌క్తికి. వాడికి ఓ ముద్దిచ్చి, చాక్లెట్ బ‌హుమానంగా ఇచ్చింది. కానీ  అన్న‌ట్టు ప‌దికి  5 మార్కులు ఇచ్చింది.  ఆ టీచ‌ర్ పేరు నిషాంత్‌. 

ఇటు కాంగ్రెస్ అటు తెరాస మధ్యలో లెఫ్ట్ ..అదీ స్టొరీ

మునుగోడు ఉపఎన్నికలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు,( సిపిఐ,సిపిఎం) అధికార తెరాసకు మద్దతు ప్రకటించాయి. ఈ పొత్తు ఉప ఎన్నిక వరకే అని, కమ్యూనిస్ట్ నేతలు ముందుగా ప్రకటించారు. అయితే, ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. బీజీపీ ముక్త భారత్ లక్ష్య సాధన కోసం, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వరకూ తెరాసతో పొత్తు కొనసాగుతుందని ప్రకటించారు. అందుకోసమే, అదే పవిత్ర ఆశయంతో  కమ్యూనిస్టులతో చేతుల కలుపుతున్నట్లు గులాబీ బాస్, ముఖ్యంత్రి కేసీఆర్ కూడా స్పష్టం చేశారు.  అలాగే, ఈ బంధం శాశ్వతం అని కూడా ప్రకటించారు. ఆ విధంగా మునుగోడు ఉప ఎన్నిక వరకే పరిమిత అనుకున్న తెరాస, కమ్యూనిస్ట్ పార్టీల ప్రేమ బంధం, మూడు ముళ్ళు వేసుకుంది.  అంటే, మునుగుడు గెలుపు  ఓటములతో సంబంధం లేకుండా, చివరి వరకు ఉభయ కమూనిస్ట్ పార్టీలు, తెరాసతో కలిసి సాగాలనే నిర్ణయానికి వచ్చాయి.  అదలా ఉంటే తాజాగా  సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి బీజేపీని నిలువరించేందుకు లౌకిక శక్తులు ఏకం కావాలని హైదరాబాద్ గడ్డపై నుంచే పిలుపు నిచ్చారు. అంతే కాదు, బీజేపీ వ్యతిరేక కూటమి కాంగ్రెస్ తో కలిసే పోరాటం చేస్తుందని ఏచూరి స్పష్టం చేశారు. అంతకు ముందే మునుగోడు సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా, ప్రగతి శీల, లౌకిక వాద శక్తులన్నీ ఏకం కావాలని పిలుపు నిచ్చారు. సిపిఐ నేతలు కూడా తెరాసతో ఎందు కోసం చేతులు కలిపినా, బీజేపీని ఓడించే ‘పవిత్ర’ ఆశయం తోనే, గులాబీ గూటికి చేరామని ప్రకటించారు.  అలాగే, అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో జరిగే సిపిఐ జాతీయ కార్యవర్గ సమావేశాలలో కేరళ, మిళనాడు, బీహార్, తెలంగాణ సహా బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరినీ ఆహ్వానిస్తున్నారు. ముఖ్యమంత్రులతో పాటుగా, ఇతర పార్టీల ముఖ్యనేతలు కూడా అక్టోబర్ 16 న జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని సిపిఐ నేతలు ప్రకటించారు.అంటే ఒక విధంగా, బీజేపీ యేతర శక్తుల ఐక్య వేదికకు సిపిఐ జాతీయ మహాసభలు  వేదిక కానున్నాయి. నిజానికి ఈ పరిణామాలుమ, ఈ ప్రకటనలు ఒకదానికొకటి సంబంధం లేనట్లు, కనిపించినా అంతర్లీనంగా చూస్తే, రాష్ట్రాలలో ఎలా ఉన్నా, జతీయ స్థాయిలో, ఒక్క కాషాయం మినహా మిగిలిన అన్ని రంగులలదీ ఒకటే గమ్యం , ఒకటే దారి, అనే విషయం క్లియర్ కట్ గా స్పష్ట మవుతోంది. అలాగే, మిగిలిన పార్టీల సంగతి ఎలా ఉన్నా, బీజేపీ వ్యతిరేకత విషయంలో మాత్రం కమ్యూనిస్టుల చిత్తశుద్ధిని శంకించవలసిన అవసరం లేదు. అలాగే, కాంగ్రెస్, కమ్యూనిస్టుల స్నేహ బంధం గురించి కూడా ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కరలేదు.   ఎప్పుడో, నెహ్రూ హయాంలో కృష్ణమీనన్ తో మొదలైన కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల స్నేహ బంధం, ఈ రోజుకూ అలా సాగుతూనే వుంది.  నిజానికి, ఈ రోజుకు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఒక్క కేరళ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ తో ఎదో ఒక విధమైన చెలిమిని  కొనసాగిస్తూనే ఉన్నాయి. గత సంవత్సరం జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలోనూ సిపిఎం, కాంగ్రెస్ కలిసే పోటీ చేశాయి. సో... కమ్యూనిస్టులతో చెలిమి అంటే, కాంగ్రెస్ తో చేయి కలిపినేట్లేనని వేరే చెప్పనక్కర లేదు. నిజానికి కమ్యూనిస్టుల పౌరోహిత్యంలో కాంగ్రెస్, తెరాస మధ్య,అసెంబ్లీ ఎన్నికలకు ముందే పొత్తు తధ్యమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. నిజానికి, మునుగోడు ఉప ఎన్నిక విషయంలోనూ కాంగ్రెస్, తెరాస ఒక అవగాహనతో ఉన్నాయని అందుకే, అభ్యర్ధి విషయంలో తెరాస ఆచితూచి అడుగులు వేస్తోందని అంటున్నారు.

వివేకా మర్డర్ కేసు విచారణ.. ఏపీ బయట విచారణ కోరుతూ సుప్రీంలో సునీత పిటిషన్

మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఆయన కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి అంత సులువుగా విడిచిపెట్టకూడదని నిర్ణయించుకున్నారు. తన తండ్రి హత్యకు న్యాయం జరిగే దాకా ఆమె న్యాయ పోరాటం చేయాలన్న కృత నిశ్చయంతో అడుగులు వేస్తున్నారు. వివేకాను అత్యంత దారుణంగా హతమార్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చేయాలన్న ధ్యేయంతో డాక్టర్ సునీతా రెడ్డి అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. న్యాయం కోసం సునీతారెడ్డి ఎంతదాకా అయినా వెళ్లి అసలు నిందితులకు శిక్ష పడేలా చేసేందుకు వెనుకాడటంలేదు. ఈ క్రమంలోనే వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను ఏపీలో కాకుండా మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఆయన కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారువేశారు. ఆమె పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం వైసీపీ సర్కార్ కు షాక్ ఇస్తూ.. నోటీసులు జారీ చేసింది. తన తండ్రి వివేకానందరెడ్డి హత్య జరిగి మూడేళ్లయినా ఈ కేసు విచారణకు అనుకూల పరిస్థితులు లేవని, దర్యాప్తు సంస్థ సీబీఐ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని, నిందితులుగా ఉన్న వారు బెయిల్ పై బయటికి వచ్చి సాక్షులను బెదిరిస్తున్నారని తన పిటిషన్ లో సుప్రీంకోర్టుకు సునీత నివేదించారు. సీబీఐ అధికారుల దర్యాప్తు విషయంలో నిందితులు కడపలో అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని సునీతారెడ్డి ఆరోపించారు. ఏపీలో నిర్వహిస్తున్న విచారణపై నమ్మకం లేదని, ఈ విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేసేలా ఆదేశించాలంటూ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి ధర్మాసనం విచారణ చేపట్టింది. సునీతారెడ్డి తరఫున న్యాయవాది సిద్దార్థ లూత్రా సుప్రీం ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. సాక్ష్యాలను చెరిపేసే యత్నం నిందితులు చేస్తున్నారని, ఏపీ సర్కార్ ఈ కేసులో ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదని ధర్మాసనానికి న్యాయవాది లూత్రా విన్నవించారు. వివేకా హత్య జరిగి మూడేళ్లయినా ఈ కేసు విచారణలో ఎలాంటి పురోగతికీ నోచుకోలేదని కోర్టుకు వివరించారు. సీబీఐ విచారణకు తోడ్పాటు ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ.. దిగువ స్థాయి పోలీసు యంత్రాంగం కానీ, ప్రభుత్వ అధికార వర్గాలు కానీ సహకరించడం లేదని చెప్పారు. నిందితులు ఒక్కొక్కరూ బెయిల్ పై బయటికి వస్తూ సాక్షులను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. వాదనలు విన్న అనంతరం సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ.. సునీత లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలంటూ సీబీఐ, వైసీపీ సర్కార్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 14వ తేదీకి వాయిదా వేసింది. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి 2019లో పులివెందులలోని ఆయన సొంత ఇంట్లోనే అత్యంత దారుణంగా హత్యకు గురైన సంగతి విదితమే.

జమ్మూ-కశ్మీరులో కొత్త వెలుగులు

జమ్మూ-కశ్మీరు,అనగానే ముందుగా గుర్తుకొచ్చేది, ఉగ్రవాదుల తుపాకుల మోత. నిత్యకృత్యంగా సాగే నరమేథం,మారణహోమం. నగరం నడివీదుల్లో ఉగ్రవాదుల వీరంగం,  సైనికుల ఎదురు కాల్పులు. సరిహాద్దులో క్షణం క్షణం భయభయంగా బతికే అమాయక ప్రజలు. ఎంతో కాలంగా, ఎన్నో  దశాబ్దాలుగా సాగిన ఉగ్రవాద నరమేధంలో ఎన్ని వందల వేల మంది అమాయకులు అమరులయ్యారో, ఎన్ని వేల కుటుంబాలు, అనాధలుగా మిగిలాయో, వేరే చెప్ప నక్కర లేదు. అంతే కాదు, సాధారణ ప్రజల జీవితాలను ఉగ్రవాదం ఎంతలా  చిన్నాభిన్నం చేసిందో, చెప్పేందుకు మాటలు చాలవు. జమ్మూ-కశ్మీరులో 30 ఏళ్లకు పైగా సినిమా హాల్స్ ముతపడే ఉన్నాయి, అంటే, పరిస్థితి ఏమిటో వివరించవలసిన అవసరం లేదు. నిజానికి కొద్ది సంవత్సరాల క్రితం వరకు కూడా జమ్మూ-కశ్మీరులో మళ్ళీ సాధారణ పరిస్థితులు నెల కొంటాయని ఆశించే పరిస్థితి కూడా లేదు.  కానీ, మూడేళ్ల క్రితం 2019 ఆగస్టులో జమ్మూ-కశ్మీరును రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత పరిస్థితి క్రమంగా అదుపులోకి ర్వడం మొదలైంది. విభజన అనంతరం కొంతకాలం రాజకీయ అలజడి కొనసాగినా, కేంద్ర పలనలో మెల్లమెల్లగా పరిస్థితి మారుతూ వచ్చింది. జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో నెమ్మదిగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇందుకు, మూడు దశాబ్దాల తర్వాత శ్రీనగర్, పుల్వామా, షోపియాన్‌లలో మళ్లీ సినిమా థియేటర్లు తెరుచుకోవడమే నిదర్శనంగా, విశ్లేషకులు భావిస్తున్నారు.  దక్షిణ కశ్మీర్‌లోని సోఫియాన్‌, పుల్వామాల్లో ఏర్పాటు చేసిన మల్టీఫ్లెక్స్‌లను నిన్న (ఆదివారం) జమ్మూ-కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ప్రారంభించారు. వీటిని ప్రభుత్వ ఆధ్వర్యంలోని మిషన్‌ యూత్‌ విభాగం, ఆయా జిల్లా యంత్రాంగాలు కలిసి నిర్మించాయి. నిజానికి, ఇవి కేవలం సినిమా థియేటర్లు మాత్రమే కాదు. బహుళ ప్రయోజన శిక్షణా కేంద్రాలు ఇక్కడ సినిమాల ప్రదర్శనలతో పాటు, సమాచారం, యవత నైపుణ్యాభివృద్ధికి సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. త్వరలో ప్రతి జిల్లాలోనూ ప్రారంభిస్తామని వెల్లడించారు. ఒక థియేటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌, మరో మల్టీఫ్లెక్స్‌’లో  భాగ్‌ మిల్కా భాగ్‌లను ప్రదర్శించారు. 2019 ఆగస్టులో జమ్మూ-కశ్మీరును రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే.   శ్రీనగర్‌లోని సోంవార్‌ ప్రాంతంలో నిర్మించిన మొట్టమొదటి మల్టీప్లెక్స్‌ మంగళవారం ప్రారంభం కానుంది. ఇందులో 520 సీట్ల సామర్థ్యంతో మూడు థియేటర్లు ఉన్నాయి. లాల్‌ సింగ్‌ ఛడ్డా సినిమాతో ఇవి ప్రారంభం కానున్నాయి.  పుల్వామా, షోపియాన్లలోని సినిమాహాళ్ల ప్రారంభం సందర్భంగా మనోజ్ సిన్హా   ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఇది చరిత్రాత్మక దినమని తెలిపారు. సినిమా హాళ్ళ ప్రారంభానికి సంబందించిన ఫొటోలను షేర్ చేశారు. బాలీవుడ్ చిత్రం ‘భాగ్ మిల్కా భాగ్’ను మనోజ్ సిన్హా వీక్షించారు.‘‘జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతానికి ఇది చరిత్రాత్మక దినం! పుల్వామా, షోపియాన్లలో మల్టీపర్పస్ సినిమా హాల్స్‌ను ప్రారంభించాను. ఇక్కడ మూవీ స్క్రీనింగ్, ఇన్ఫోటెయిన్‌మెంట్, యువతకు నైపుణ్య శిక్షణ వంటి సదుపాయాలు ఉన్నాయి’’ అని సిన్హా కార్యాలయం ఇచ్చిన ట్వీట్‌లో పేర్కొంది.  జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాదం పెచ్చరిల్లడంతో 1990వ దశకం ప్రారంభం నుంచి సినిమా హాళ్లు మూత పడ్డాయి. సుమారు 10 సినిమా హాళ్ళు ఉండేవి, కానీ వాటి యజమానులకు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చేవి. శ్రీనగర్ నడిబొడ్డున ఉన్న రీగల్ సినిమా థియేటర్‌పై 1999లో గ్రెనేడ్ దాడి జరిగింది. దీంతో వాటిని మూసేశారు. కొన్ని థియేటర్లను పునఃప్రారంభించడానికి చేసిన ప్రయత్నాలు అప్పట్లో సఫలం కాలేదు. జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ, 2019 ఆగస్టు 5న భారత రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేశారు. ఆ తర్వాత వివిధ రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు.  గత సంవత్సరంగా జమ్మూ, కాశ్మీర్ పారిశ్రామిక విధానం, 2021లో భాగంగా మూతబడిన సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడానికి సిద్ధపడింది. ప్రస్తుతం ఉన్న సినిమా హాళ్లను ఆధునీకరించడానికి, అత్యాధునిక సినిమా హాళ్లను నిర్మించడానికి కూడా ప్రోత్సాహకాలు ప్రకటించింది. మరోవంక, సినిమాల నిర్మాణంకు, షూటింగ్ లకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహాలు ప్రకటించింది. ఒకప్పుడు కశ్మీర్‌ షూటింగ్‌లకు స్వర్గధామంలా ఉండేది. ఆ వైభవాన్ని పునరుద్ధరించేందుకు నూతన ఫిల్మ్‌ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. తిరిగి అటువంటి వాతావరణం కల్పించడంకు ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని సినీ నిర్మాణం, చిత్రీకరణలకు గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి కృషి జరుగుతోంది. జమ్మూ-కశ్మీరు ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కృషితో సినిమాల ప్రదర్శనతోపాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలకు అందజేయడం కోసం మల్టీపర్పస్ హాల్స్‌ను నిర్మిస్తున్నారు.

పీకే నివేదిక తేల్చేసింది.. వైసీపీ ఓటమి తథ్యం..

పీకే నివేదిక తేల్చేసింది. ఫ్యాన్ తిరగడం ఇక అసాధ్యమని ఖరారు చేసేసింది. వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖాయమని ఖరారు చేసేసింది. 2024 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ విజయం కల్లేనని, జగన్ సీఎం పదవి నుంచి దిగిపోవడం తథ్యమని ప్రశాంత్ కిషోర్ రైట్ హ్యాండ్ అయిన రిష్ రాజ్ సింగ్ తాజా నివేదిక పేర్కొంది. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలలోనూ విజయమే లక్ష్యం అంటూ క్యాడర్ ను దిశా నిర్దేశం చేస్తున్న జగన్ ఈ నివేదికతో కంగు తిన్నారని పార్టీ క్యాడరే చెబుతోంది. ఇదేం నివేదిక, ఇదేం కథ అంటూ పీకే రైట్ హ్యాండ్ రిషి రాజ్ సింగ్ పైనా ఆయన బృందంపైనా జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని క్యాడర్ అంటోంది.   వచ్చే ఎన్నికల్లో మొత్తం 175కి 175 ఎమ్మెల్యే స్థానాలను కొల్లగొట్టాలనే లక్ష్యంతో సీఎం వైయస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీతోపాటు ఏ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకుండా ఉండేందుకు జగన్ అండ్ కో వ్యూహాలు రచిస్తున్నాయి.   తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో ఓడించాలన్న లక్ష్యంతో ఆ నియోజకవర్గ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించేసి గెలిస్తే మంత్రి పదవి తాయిలంగా ఇస్తానని కూడా జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే తెలుగుదేశం నాయకులు పోటీ చేస్తారని భావిస్తున్న ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే ఆయనకు మంత్రి పదవి ఖాయమంటూ జగన్ ఆశపెట్టిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి, ప్రభుత్వ పనతీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న అంశాలపై ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా జగన్ కోరిన మీదట.. ప్రశాంత్ కిషోర్ తరఫున జగన్ పార్టీ వ్యూహకర్తగా పని చేస్తున్న రిష్ రాజ్ సింగ్ తన బృందంతో జరిపిన సర్వేలో వెల్లడైన అంశాలు జగన్ కు దిమ్మతిరిగేలా ఉన్నాయని పార్టీ క్యాడరే చెబుతున్నారు. జగన్ పాలనపై ప్రజాభిప్రాయాన్ని ఉన్నదున్నట్లుగా పొందుపరుస్తూ రిష్ రాజ్ సింగ్ టీమ్ ఇన్చిన నివేదికతో జగన్ షాక్ అయ్యారని అంటున్నారు.  ప్రజా సంక్షేమం  పేరిట ఈ మూడున్నరేళ్లలో  కోట్లాది రూపాయిలు  బటన్ నొక్కి పందేరం చేసినా అది బూడిదలో పోసిన పన్నీరు చందమే అయ్యిందని, ఇక మిగిలిన స్వల్ప కాలంలోనైనా  అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని...పార్టీ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందన్నది ఆ నివేదిక సారాంశంగా చెబుతున్నారు.  రాష్ట్రంలో ముఖ్యంగా ఉద్యోగులు, యువతతో పాటు తటస్టులంతా అభివృద్ధిని కాంక్షిస్తున్నారని నివేదికలో రిష్ రాజ్ సింగ్ టీమ్ విస్పష్టంగా పేర్కొందని అంటున్నారు.  సంక్షేమ పథకాల పేరిట.. ప్రతి నెలా ఏదో ఒక పథకం పేర.. బటన్ నొక్కుతూ...నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి నగ దు బదిలీ చేస్తున్నా ఆ పథకాల లబ్ధి దారులు కూడా రాష్ట్రంలో అభివృద్ధి అడుగంటటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని నివేదిక తేల్చేసిందట. అలాగే మూడు రాజధానులంటూ జనగ్ చేస్తున్న విన్యాసాల పట్ల కూడా ప్రజలలో అసంతృప్తి గూడుకట్టుకుందనీ, మెజారిటీ ప్రజలు అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారనీ నివేదిక వెల్లడించిందని చెబుతున్నారు. అలాగే  రాష్ట్రంలో రహదారుల దుస్థితికి సంబంధించి ప్రతి రోజు సోషల్ మీడియాలో లక్షలాది పోస్టులు దర్శనమిస్తున్నాయని.. రహదారులు బాగు చేసేందుకు కూడా వైయస్ జగన్ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా? అంటూ నెటిజన్లు చేస్తున్న ట్రోలింగ్ కూడా ప్రజలపై ప్రభావం చూపి జగన్ సర్కార్ పట్ల అసంతృప్తి పెరిగేందుకు దోహదం చేస్తున్నాయని నివేదిక వెల్లడించిందని చెబుతున్నారు. మరో వైపు పెట్టుబడులు లేక పారిశ్రామిక రంగం కుదేలై పోయిందని.. రాష్ట్రవ్యాప్తంగా యువత రోడ్డున పడిందనీ,   ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్న జగన్ హామీ నెరవేరకపోవడం పట్ల కూడా ప్రజలలో ముఖ్యంగా యువతలో అసమ్మతి గూడుకట్టుకుందని అంటున్నారు.  సీపీఎస్ రద్దు అంశంలో సీఎం జగన్ మాట తప్పారని, మడమ తిప్పారన్న ఆగ్రహం ఉద్యోగులలో వెల్లువెత్తుతోందని నివేదిక పేర్కొంది.    

ఛ‌త్రీని అగౌర‌వ‌ప‌ర్చ‌డం స‌బ‌బా?

ఏ వృత్తిలో ఉన్నా ఇత‌రుల‌ను గౌర‌వించ‌డం మ‌న‌కే మ‌ర్యాద. చాలామంది ఉన్న‌తోద్యోగులు, రాజ‌కీయ నాయ‌కుల‌కు క్రీడాకారుల‌మీద పెద్ద‌గా గౌర‌వం ఉండ‌దు. మ‌రీ అంత‌ర్జాతీయ‌స్థాయిలో రాణించేవారు, వారికి కాస్తంత స‌న్నిహితంగా ఉండేవారో, వారి ప్రాంతానికి చెందిన‌వారికో అయితే త‌ప్ప పెద్ద‌గా ప‌ట్టించు కోరు. రాజ‌కీయ నాయ‌కుల‌కు వారి సీఎంలు, ఎంపీలే ముఖ్యం. అందుకే సునీల్ ఛ‌త్రి వంటి గొప్ప క్రీడాకారుడికి ల‌భించే గౌర‌వానికి కూడా అడ్డుత‌గ‌ల‌డం చాలా దారుణం.  ఆదివారం(ఆగ‌స్టు 18)న కోల్‌క‌తాలో బంగ‌ళూరు ఎఫ్‌సీ, ముంబై సిటీ ఎఫ్‌సి ల మ‌ధ్య డురాండ్ క‌ప్ ఫైన‌ల్ జ‌రిగింది. 40వేల‌మంది ప్రేక్ష‌కుల స‌మక్షంలో బ్ర‌హ్మాండంగా జ‌రిగిన ఆ మ్యాచ్‌లో సునీల్ ఛ‌త్రి నాయ‌క త్వం లోని బెంగ‌ళూరు జ‌ట్టు పై 2-1 స్కోరు తేడాతో గెలిచింది. మ్యాచ్ త‌ర్వాత ట్రీఫీని విజేత‌కు బ‌హుక రించే కార్య్ర‌క‌మం జ‌రిగింది. ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ గ‌ణేశ‌న్ విజేత‌కు ట్రోఫీ బహూక‌రించాలి. కానీ బెం గుళూరు కెప్టెన్ ఛ‌త్రీ స్టీజీ మీద‌కి వ‌చ్చి ట్రోఫీని అందుకోబోతుంటే గ‌వ‌ర్న‌ర్ అత‌న్ని ప‌క్క‌కు నెట్టారు. ఫోటోగ్రాఫ‌ర్లు క్లిక్ మ‌నిపించారు. ఛ‌త్రీ కాస్తంత ప‌క్క‌కు జ‌ర‌గాల్సి వ‌చ్చింది! గ‌వ‌ర్న‌ర్‌తో పాటు ఫోటో తీయిం చుకోవాలన్న  ఆతృత‌తో ఒక రాజ‌కీయ‌నాయ‌కుడు ముందుకు వ‌చ్చేశాడు. ఫైన‌ల్ మ్యాచ్‌లో బెంగుళూరు జ‌ట్టుకు అద్భుతంగా తొలి గోల్ చేసి జ‌ట్టు దూసుకువెళ్ల‌డానికి తోడ్ప‌డిన శివ శ‌క్తి నారాయాణ‌న్ ను స్టేజీ మీద‌కి పిలిచారు. కానీ అత‌న్ని కూడా ప‌ట్టించుకోలేదు. విజేత జ‌ట్టుకు సంబం ధించిన ప్లేయ‌ర్ల‌ను స్టేజీమీద‌కి పిలిచి మ‌రీ ఇలా అవ‌మానించ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు అని పించుకుంటుంది? ఈ ప్ర‌శ్న‌నే త‌ర్వాత ట్రోఫీ నిర్వాహ‌కుల‌ను చాలామంది ప్ర‌శ్నించారు. ఎందు కంటే దేశంలో ఫుట్బాల్ అన‌గానే విన‌ప‌డే గొప్ప ప్లేయ‌ర్ ఛ‌త్రీ. అలాంటి ప్రొఫేష‌న‌ల్‌ను గౌర‌వించ‌డం చాత‌కా న‌ప్పుడు తెలియన‌ట్టే ఉండాలి. క్రికెట్కు స‌చిన్ ఎలాగో, బ్యాడ్మింట‌న్‌కు సింధు ఎలాగో, ఫుట్‌ బాల్‌కి ఛ‌త్రీ అలాగ‌. కానీ స‌చిన్‌కి ల‌భించే గౌర‌వం ఇత‌ర క్రీడల‌కు సంబంధించిన ప్ర‌ముఖ క్రీడాకా రుల‌కు ల‌భించ‌క‌పోవ‌డం దుర‌దృష్టం.  ఛ‌త్రీని అవ‌మానించ‌డం దేశంలో ఫుట్‌బాల్‌ని అగౌర‌వ ప‌ర్చ‌డ‌మేన‌ని మాజీ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్లు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. గొప్ప‌క్రీడాకారుల కంటే రాజ‌కీయ‌నాయ‌కుల ఫోటో ఆరాటం ఎక్కువ‌యింద‌ని వ్యాఖ్యా నించారు. బెంగ‌ళూరు ఎఫ్‌.సీ 131వ సారి డూరాండ్ క‌ప్ ఫైన‌ల్లో గెలిచింది. అందుకు ముఖ్యంగా ఎన్‌. శివ శ‌క్తి,  అలెన్ కోస్టా వంటివారు త‌మ అనుభ‌వాన్నంతా ప్ర‌ద‌ర్శిస్తూ ఆడిన తీరు మ‌హాద్భుత‌మ‌ని ఫుట్ బాల్ వీరాభిమానులు అంటున్నారు. ఏమ‌యిన‌ప్ప‌టికీ,  క్రీడాకారుల‌ను అగౌర‌వ‌ప‌ర్చ‌డం మాత్రం ఎవ్వ‌రి కీ హ‌ర్ష‌ణీయం కాదు. దీన్ని గురించి అన్ని క్రీడల్లోని ప్ర‌ముఖులు నిర‌స‌న‌నే వ్య‌క్తం చేస్తున్నారు. 

తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ వేరు వేరు కాదా?

తెలంగాణ రాజకీయాలు విచిత్ర మలుపులు తిరుగుతున్నాయి. ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాల జపం మొదలు పెట్టారో ఆ క్షణం నుంచీ తెరాస వరుస వైఫల్యాలతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో పడింది. గతంలో ఎప్పుడో రాష్ట్ర ఆవిర్బావం సమయంలో తెరాస అధినేత కేసీఆర్ టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేసేస్థానన్నారు. ఇన్నేళ్లకు ఇప్పుడు ఆయనకు ఆ దారి తప్ప మరో దారి గోచరించని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికిప్పుడు విలీనం ప్రక్రియ పూర్తయిపోతుందని కాదు కానీ.. టీఆర్ఎస్ అడుగులు ఆ దారిలోనే పడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక లిట్మస్ టెస్ట్ గా తీసుకుని కాంగ్రెస్, తెరాసల మైత్రి అడుగులు ఉంటాయని అంటున్నారు. ఎవరు ఔనన్నా కాదన్నా కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రస్థానం తప్పటడుగులతోనే ఆరంభమైంది. అయితే ఈ తప్పుటడుగులను వెనక్కు తీసుకోలేనంతగా కేసీఆర్ అడుగులు ముందుకు పడ్డాయి. బీజేపీ, తెరాస మధ్య వైరుధ్యాల స్థాయి దాటిపోయింది. ఇప్పుడు ఆ పార్టీల నేతలు విమర్శల పేర వ్యక్తిగత దూషణల స్ధాయికి దిగజారిపోయారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కూడా తన విమర్శల తీవ్రతను పెంచేయడం.. అవి నేరుగా ప్రధాని మోడీ లక్ష్యంగా సాగడంతో.. ఇప్పుడిక వెనక్కు తగ్గే పరిస్థితి లేకుండా పోయింది. మరో వైపు జాతీయ రాజకీయాల దిశగా ఆయనకు అడుగడుగునా ఇబ్బందులే ఎదురయ్యాయి. జాతీయ స్థాయిలో మోడీ వ్యతిరేక శక్తులను ఏకం చేయాలన్న కేసీఆర్ ప్రయత్నం ప్రతి దశలోనూ ప్రతికూల ఫలితమే ఇచ్చింది. కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి ప్రయత్నం లగాయతు.. కొత్త పార్టీ ఏర్పాటు వరకూ ఆయనకు ఏ ప్రయత్నమూ కలిసి రాలేదు. ఈ మధ్యలో రైతులు, కొన్ని రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులతో వరుస భేటీలతో రాజకీయ వేడి రగల్చడానికి ప్రయత్నించినా పెద్దగా ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే అనివార్యంగా కేసీఆర్ తన జాతీయ రాజకీయ అజెండాలో నుంచి కాంగ్రెస్సేతర అనే పదాన్ని తొలగించేశారు. అంతే కాకుండా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలలో యూపీయే భాగస్వామ్య పక్షాలను మించిన ఉత్సాహంతో కాంగ్రెస్ కు అండగా నిలిచారు. ముఖ్యంగా ఉప రాష్ట్రపతి ఎన్నికలో అల్వా అభ్యర్థిత్వాన్ని ఎవరూ కోరకుండానే బలపరచడమే కాకుండా ఆమె నామినేషన్ కార్యక్రమంలో   ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి కేటీఆర్ పాల్గొనడమే కాకుండా కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో చనువుగా మెలిగారు.   అంతకు ముందే కాంగ్రెస్ లో తనకు ఉన్న పరిచయాల ఆధారంగా సోనియాతో భేటీకి సీఎం కేసీఆర్ ప్రయత్నించారన్న వార్తలూ వచ్చాయి. కాగా ఇప్పుడు కాంగ్రెస్ తో చెలిమి వినా వేరే ఆప్షన్ లేదన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చిన నేపథ్యంలో ఆయన ఆ పార్టీతో సయోధ్య యత్నాలను ముమ్మరం చేశారంటున్నారు. అవి ఫలించే దిశలోనే సాగుతున్నాయనడానికి ఇటీవల మూడు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలే నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలలో ఏ అంశంపైనా కాంగ్రెస్ తెరాసను కానీ తెరాస కాంగ్రెస్ ను కానీ విమర్శించలేదు. పైపెచ్చు పరస్పర ప్రశంసల పర్వానికి ఈ అసెంబ్లీ వేదికగా నిలిచింది. ములుగు మునిసిపాలిటీగా ప్రకటించినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కేటీఆర్ కు కృతజ్ణతలు తెలిపారు. అలాగే దళిత బంధు పథకంలో ఖమ్మం జిల్లాను చేర్చినందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వానికి, కేసీఆర్ కు కృతజ్ణతలు తెలిపారు. అలాగే కేసీఆర్ తన ప్రసంగంలో భట్టి విజ్ణతను పొగిడారు. నిన్న మొన్నటి దాకా ఉప్పూ నిప్పూలా ఉన్న రెండు పార్టీల మధ్యా ఇంతటి సయోధ్య ఏమిటా అన్న సందేహాలు జనబాహుల్యంలో తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రారంభం అయితే అయ్యింది కానీ.. అంతకు ముందే తెలంగాణలో కాంగ్రెస్, తెరాస జోడీ యాత్రకు అంకురార్పణ జరిగిందని పరిశీలకులు అంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజీయాల అడుగులు తడబడటంతోనే రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్, తెరాస చేతులు కలిపెందుకు అడుగులు పడ్డాయని పరిశీలకులు అంటున్నారు.  జాతీయ స్థాయిలో బీజీపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో, తెలంగాణలోనూ బీజేపీ వ్యతిరేక పార్టీలు, ఒక్కటై జట్టు కట్టేందుకు సిద్దమవుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక మాటున, బీజేపీ వ్యతిరేకత వంకన ఉభయ కమ్యూనిస్ట్  పార్టీలు ఇప్పటికే, తెరాసతో జట్టుకట్టాయి. ప్రగతి భవన్ పంచన చేరాయి. అయితే అదేమంత పెద్ద విషయం కాదు. ఉండీ లేనట్టు ఉన్న వామపక్షాలు ఎక్కడ ఉన్నా ఒకటే.. కానీ ఆ రెండూ తెరస పంచన చేరడం, తెరాస నాయకత్వం కాంగ్రెస్ పార్టీతోనూ జట్టుకట్టేందుకు సిద్దంగా ఉందన్న సంకేతాలివ్వడమేనని అంటున్నాయి. జాతీయ నేతలతో భేటీ పేర కేసీఆర్ హస్తిన యాత్రలు కూడా కాంగ్రెస్ తో చెలిమి యత్నాలలో భాగమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదలా ఉంటె ఇంతకాలం, తెరాస, బీజేపీ తోడూ దొంగలని ప్రచారం చేయడంలో అందె వేసిన చేయి అయిన అద్దంకి దయాకర్ స్వయంగా ఒక మీడియా తో మాట్లాడుతూ కాంగ్రెస్ తో జట్టు కట్టేందుకు కేసీఆర్ తహతహలాడుతున్నారని చెప్పారు.  అయితే, కాంగ్రెస్ తో కలిసేందుకు కేసీఆర్ సిద్దంగా ఉన్నా, తెరాసతో చేయి కలిపేందుకు కాంగ్రెస్ రెడీగా లేదని ఆయన అన్నప్పటికీ.. అది కేవలం ఫేస్ సేవింగ్ కోసమే అని పరిశీలకులు అంటున్నారు.   ఎందుకంటే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజకీయ ఎత్తుగడలలో సిద్ధహస్తుడు అయిన దిగ్విజయ్ సింగ్.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో  తెలంగాణ ప్రత్యేక  రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరిస్తే తెరాసని కాంగ్రెస్’లో విలీనం చేస్తానని అప్పట్లో కేసీఆర్ ఇచ్చిన మాటను గుర్తు చేస్తూ అయిపోయింది ఏదో అయిపోయింది, ఇక ఇప్పుడైనా, బీజేపీ వ్యతిరేక పోరాటంలో కాంగ్రెస్ తో కలిసి రావాలని కేసీఆర్ కు ఒక బహిరంగ ఆహ్వానం ఇచ్చారు. అలాగే   తెరాస ఎమ్మెల్యే బొల్లం యల్లయ్య యాదవ్ దేశంలో రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక శక్తులు అన్నీ ఏకం కావలసిన అవసరం ఉందని, ముఖ్యమత్రి కేసీఆర్ అదే ప్రయత్నంలో ఉన్నారని చెప్పారు. అంతేకాదు, కేసీఆర్ నచ్చిన అనచక పోయినా, దేశ ప్రయోజనాల దృష్ట్యా, కాంగ్రెస్ పార్టీ తెరాసతో చేతులు కలపాలని డిమాండ్ లాంటి సూచన చేశారు.  మొత్తానికి, జరుగుతున్న పరిణామాలను గమనిస్తే  కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు తెరాస, తెరాసతో జట్టు కట్టేందుకు కాంగ్రెస్ సుముఖంగానే ఉన్నాయనీ, అందుకోసం తెరచాటు యత్నాలు ప్రారంభించేశాయనీ పరిశీలకులు అంటున్నారు.  మునుగోడు ఉప ఎన్నికలకు ముందో, తరువాతో  కాంగ్రెస్, తెరాసల మధ్య పొత్తు పొడుపు ఖాయమేనని విశ్లేషణలు చేస్తున్నారు.