నగరి బరిలో తెలుగుదేశం అభ్యర్థి వాణీ విశ్వనాథ్?

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో నగరి బరి నుంచి మాజీ హీరోయిన్ వాణి విశ్వనాథ్ ను బరిలో నిలపాలని తెలుగుదేశం యోచిస్తోందా? నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేకు దీటుగా పోటీ ఇవ్వగలిగే అభ్యర్థి వాణీ విశ్వనాథ్ అని భావిస్తోందా అంటే జరుగుతున్న పరిణామాలను పరిగణనలోనికి తీసుకుంటే ఔననే అనాల్సి ఉంటుందంటున్నారు పరిశీలకులు. అప్పుడెప్పుడో గత ఎన్నికల ముందు నగరిలో తెలుగుదేశం అభ్యర్థిగా వాణి విశ్వనాథ్ పేరును తెలుగుదేశం పరిశీలించింది. అయితే అప్పట్లో ఆ పరిశీలన పరిశీలన స్థాయిలోనే ఆగిపోయింది. వాణి విశ్వనాథ్ తెలుగుదేశం పార్టీలో చేరిందీ లేదు.. నగరి అభ్యర్థిగా రంగంలోకీ దిగలేదు. మళ్లి ఇన్నాళ్లకు మరోసారి నగరి తెలుగుదేశం అభ్యర్థిగా వాణి విశ్వనాథ్ పేరు తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం నగరి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జిగా  గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు ఉన్నారు. ఆయనే తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగుతారనే ఇప్పటి వరకూ అంతా భావిస్తున్నారు. అయితే హఠాత్తుగా వాణి విశ్వనాథ్ తెరపైకి వచ్చారు. పార్టీ పరంగా ఇప్పటి వరకూ అధికారికంగా ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేదు. అలాగే ఆమె పార్టీలో చేరిందీ లేదు. కానీ ఇటీవల ఆమె నగరిలో పర్యటించి చేసిన ప్రసంగాలు మాత్రం ఆమె నగరి బరిలోకి దిగుతారని అంతా భావించే విధంగా ఉన్నాయి. ఆమె నగరి పర్యటన సందర్భంగా ఆమెతో కొందరు కౌన్సిలర్లు, మాజీ కౌన్నిలర్లు ఉన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ నగరి నుంచి ఎన్నికల బరిలో దిగుతానని ప్రకటించారు. అయితే తెలుగుదేశం అభ్యర్థిగానే రంగంలో ఉంటానని ఆమె చెప్పలేదు. కానీ నగరిలో తమిళ ఓటర్ల సంఖ్య దృష్ట్యా, ఆమె అభ్యర్థి అయితే ఆ మేరకు పార్టీకి లబ్ధి జరుగుతుందని తెలుగుదేశం భావిస్తున్నట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం బలంగా ఉన్న నగరి నియోజకవర్గంలో గత ఎన్నికలలో రోజా గెలుపునకు తమిళ ఓట్లే దోహదపడ్డాయన్న అభిప్రాయం అయితే బలంగా ఉంది. ఇప్పుడు రోజాకు ఆ అవకాశం, తమిళ ఓట్ల మద్దతు దూరం చేసే వ్యూహంతోనే వాణి విశ్వనాథ్ ను బరిలోకి దింపాలని తెలుగుదేశం ఉందని పరిశీలకులు అంటున్నారు. అయితే వాణి విశ్వనాథ్ పర్యటన వెనుక, ప్రకటనల వెనుకా తెలుగుదేశం మద్దతు ఉందా లేదన్న అన్నది ఇదమిద్థంగా తేలలేదు. కాగా తెలుగు సినిమాలలో ఒక సమయంలో వాణి విశ్వనాథ్, రోజాల మధ్య వృత్తిపరమైన పోటీ ఉండేది. ఇరువురూ కలిసి సర్పయాగం అనే సినిమాలో కూడా నటించారు. మొత్తం మీద నగరిలో వాణి విశ్వనాథ్ పోటీ చేయడమన్నది జరిగితే నగరిలో పోటీ రసవత్తరంగా మారుతుందని పరిశీలకులు అంటున్నారు.

చ‌ట్టాన్ని అతిక్ర‌మిస్తే గుండెల్లో నిద్ర‌పోతా...చంద్ర‌బాబు

చట్టాన్ని అతిక్ర‌మిస్తే మీ గుండెల్లో నిద్ర‌పోతా, త‌ప్పు చేసిన‌వాడిని వ‌దిలిపెట్టే  ప్ర‌స‌క్తే లేద‌ని టీడీపీ అధి నేత చంద్ర‌బాబునాయుడు హెచ్చ‌రించారు. శుక్ర‌వారం త‌మ పార్టీ లీగ‌ల్ సెల్ నూత‌న క‌మిటీ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు పాల్గొని ప్ర‌సంగించారు. చ‌ట్టాన్ని ఉల్లంఘించేవారు అధికారులైనా స‌రే శిక్ష త‌ప్ప‌ద‌ని బాబు అన్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానంప‌ట్ల ఆయ‌న మండిప‌డ్డారు.  తెలుగు దేశం పార్టీకి 40 ఏళ్ల సుదీర్ఘ చ‌రిత్ర ఉంద‌ని, దేశంలో చ‌రిత్ర సృష్టించిన ఘ‌న‌త త‌మ పార్టీకి ఉందన్నారు. వైసీపీ ప్ర‌భుత్వం లాంటి దిక్కుమాలిన ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తుంద‌ని  త‌న జీవితంలో క‌నీసం ఊహించ‌లేద‌న్నారు. ఇంత‌వ‌ర‌కూ ఏ ముఖ్య‌మంత్రి క‌క్ష‌సాధించే తీరులో  ప్ర‌వ‌ర్తిం చ‌లేద‌న్నారు. ఈ  ప్ర‌భు త్వం పోలీసు వ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్టుప‌ట్టింద‌ని,  ఆయ‌న విమ‌ర్శించారు.  రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని బాబు మండిప‌డ్డారు. వైసీపీ ఎంపీ ర‌ఘురామ పైనా పోలీసులు ఇష్టానుసారం ప్ర‌వ‌ర్తిస్తుండ‌టాన్ని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. ఆయ‌న్ను క‌స్ట‌డీలోకి తీసుకుని పోలీసులు దారుణంగా వేధించార‌ని, ఆయ‌న రాష్ట్రానికి రాలేని ప‌రిస్థితి క‌ల్పించార‌న్నారు.  వైసీపీ అధికారంలోకి రాగానే ముందు ఇచ్చిన హామీలు, మ‌ద్ద‌తులు మ‌ర్చిపోయార‌న్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌పుడు అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఒప్పుకుని, ఇపుడు అధికారంలో అమ‌రావ‌తిని రాజ‌ధాని విష‌యంలో మాట‌మార్చి మూడు రాజ‌ధానుల పేరుతో ప్రాంతీయద్వేషాలు రెచ్చ‌\గొడుతున్నార‌ని ఆరోపించారు. 

కేంద్రం నిర్ణ‌యం క్రికెట్ బోర్డు కొంప‌ముంచుతుందా?

బోర్డు నివేదిక ప్రకారం, 2023 వ‌న్డే వరల్డ్ కప్ నుండి ఐసీసీ ప్రసార ఆదాయంపై 21.84 శాతం పన్ను సర్ చార్జి విధించాలనే తన నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటే బీసీసీ ఐ దాదాపు రూ. 955 కోట్లు కోల్పోవచ్చు. వచ్చే ఏడాది  50 ఓవర్ల షోపీస్‌ను  అక్టోబర్-నవంబర్‌లో భారత్ నిర్వహించనుంది. పన్ను సర్‌ఛార్జ్ అనేది ప్రారంభంలో కోట్ చేసిన ధర కంటే ఒక వస్తువు లేదా సేవ  ధరకు జోడించబడే అదనపు ఛార్జీ, రుసుము లేదా పన్ను సూచిస్తుంది. ఇప్పటికే ఉన్న పన్నుకు సర్‌ఛార్జ్ తరచుగా జోడించబడుతుంది. వస్తువు లేదా సేవ పేర్కొన్న ధరలో చేర్చబడదు. ఐసీసీ ప్రమాణం ప్రకారం, గ్లోబల్ బాడీ నిర్వహించే టోర్నమెంట్‌లను హోస్ట్ చేయడానికి ఆతిథ్య దేశం ప్రభుత్వం నుండి పన్ను మినహాయింపు పొందాలి. భారతదేశ పన్ను నియమాలు అటువంటి మినహాయింపులను అనుమతించవు కాబట్టి, 2016 ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌ను నిర్వహించడానికి ప్రభుత్వం పన్ను సర్‌ఛార్జ్‌ను మినహాయించనందున  బీసీసీ ఐ ఇప్పటికే దాదాపు రూ. 193 కోట్ల నష్టపోయింది. ఆ కేసుపై బీసీసీఐ ఐసీసీ ట్రిబ్యునల్‌లో ఇంకా పోరాడు తోంది. తదుపరి ఐసీసీ ప్రధాన పురుషుల ఈవెంట్, ఇది ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023, 2023 అక్టోబర్ , నవంబర్ నెలల్లో దేశంలో నిర్వహించ‌నున్నారు. ఐసీసీకి పన్ను మినహాయింపు లేదా పన్ను పరిష్కా రాన్ని అందించడానికి  బీసీసీ ఐబాధ్యత వహించింది. ఈ ఈవెంట్ కోసం, ఏప్రిల్ 2022 నాటికి తాజాద‌ని ముంబైలో బోర్డ్ అక్టోబర్ 18 ఏజీఎంకి ముందు రాష్ట్ర యూనిట్ల మధ్య నివేదిక పంపారు. ఈ సమయ రేఖను ఐసీసీ బోర్డు 31 మే 2022 వరకు పొడిగించింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో,  బీసీసీ ఐ ఐసీసీకి సలహా ఇచ్చింది, 2016 ఈవెంట్ కోసం పన్ను ఆర్డర్‌కు అనుగుణంగా, ఇది 10శాతం ( సర్‌ఛార్జ్‌లు మినహా) 2023 ఈవెంట్‌కు అవసరమైన సమయ వ్యవధిలో మధ్యంతర చర్యగా పన్ను ఆర్డర్‌ను పొందవచ్చు. ఐసీసీ ఇప్పుడు దేశంలోని పన్ను అధికారుల నుండి 2023 ఈవెంట్ కోసం ప్రసార ఆదాయం కోసం 20 శాతం (సర్‌ఛార్జ్‌లు మినహా) పన్ను ఆర్డర్‌ను పొందింది. రాష్ట్ర సంస్థలతో పంచుకున్న బీసీసీఐ పత్రం ప్రకారం, 21.84 శాతం పన్ను చెల్లిస్తే, ఐసీసీ నుండి బోర్డు ఆదాయంపై ప్రతికూల ప్రభావం  116.47 మిలియన్ డాల ర్లు  ఉంటుంది. బిసిసిఐ ఇంకా చర్చలు జరిపి పన్ను సర్‌ఛార్జ్ శాతాన్ని ప్రస్తుత డిమాండ్ 21.84 నుండి 10.92 శాతానికి తగ్గించడానికి ప్రయత్నిస్తోందని అర్థం. బీసీసీఐ పన్ను సర్‌ఛార్జ్‌ను 10.92 శాతానికి తగ్గించగలిగితే, ఆదా య నష్టం దాదాపు రూ. 430 కోట్లు అవుతుంది. బీసీసీ ఐ ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభు త్వంతో కలిసి పనిచేస్తోంది మరియు ఈ 20శాతం (సర్‌ఛార్జ్‌లు మినహా) పన్ను ఆర్డర్‌కు వ్యతిరేకంగా అత్యధిక స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తోంది. త్వరలో 10 శాతం (సర్‌ఛార్జ్‌లు మినహా) పన్ను ఆర్డర్ రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేసింది. భార‌త్‌లో 2023 ఈవెంట్ కోసం ఐసిసి చేసే ఏదైనా పన్ను ఖర్చు ఐసిసి నుండి బిసిసిఐకి వచ్చే ఆదాయం తో సర్దుబాటు చేయబడుతుందని గమనించాలి" అని నివేదిక పేర్కొంది. 2016 నుండి 2023 వరకు ఐసీసీ సెంట్రల్ రెవిన్యూ పూల్ నుండి బీసీసీ ఐ వాటా 405 మిలియన్ డాల‌ర్లు (సు మారు రూ. 3336 కోట్లు). భారతదేశంలో 2023 ఈవెంట్ ప్రసార ఆదాయం నుండి ఐసీసీ  సుమారు రూ. 4400 కోట్లు) ఆశిస్తోంది.

మునుగోడులో ముగ్గురిలో ముందుండేదెవరో ?

మూడు పార్టీలకే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకే కీలకంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక ప్రక్రియలో ఒక ప్రధాన ఘట్టం ముగింపు దశకు చేరుకుంది. ఈరోజు (శుక్రవారం) తో నామినేషన్ల ఘట్టం ముగుస్తుంది. బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తెరాస అభ్యర్ధి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డి ముందుగానే నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. మరోవంక మునుగోడు బరిలో దిగేందుకు ఇప్పటికే 30 మందికి పైగా అభ్యర్ధులు నామినేషన్లు దాఖాలు చేశారు. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఇంకెంత మంది నామినేషన్ వేస్తారనేది పక్కన పెడితే, ఈ నెల 17న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన తర్వాత ఎంతమంది బరిలో మిగులుతారో చూడవలసి వుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. అయితే, మునుగోడు బరిలో ఎందరున్నా, ప్రధాన పోటీ మాత్రం తెరాస, బీజీపీ, కాంగ్రెస్ అభ్యర్ధుల మధ్యనే ఉంటుందని పరిశీలకులు ముందు నుంచి చెపుతూనే ఉన్నారు. అయితే, పోటీలో నిలిచే ఇతర పార్టీలు, అభ్యర్ధులను బట్టి, ప్రధాన పార్టీల అభ్యర్ధుల గెలుపు ఓటములు నిర్నయమవుతాయ్నై అంటున్నారు. పొతే ముగ్గురి మధ్యనే, కానీ, ఫలితాన్ని నిర్ణయించేది మాత్రం, ఇతరులే అంటున్నారు.    అయితే, మూడు ప్రధాన పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధులను బరిలో దించడంతో ఇతర సామాజిక వర్గాలు ఎలా స్పందిస్తాయనేది, ఆసక్తికరంగా మారింది. బీస్పీపీ తరపున  దళిత బహుజన వర్గానికి చెందిన  అందోజు శంకరా చారి నామినేషన్ దాఖలు చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు అర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఇతర ముఖ్యనేతలు నియోజక వర్గంలోని ఏడు మండలాలలో ప్రచారం సాగిస్తున్నారు.మరో వంక , కేఏ పాల్ పార్టీ ప్రజా శాంతి పార్టీ తరపున గద్దర్ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా, ఆయన నామినేషన్ అయితే వేయలేదు. అలాగే, వైఎస్ షర్మిల పార్టీ  వైఎస్సార్ - టీపీ కూడా పోటీ చేస్తుందని ప్రచారం జరిగినా,షర్మిలఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఆ ప్రచారం ఆగిపోయింది. అయితే ప్రస్తుతం ప్రజాప్రస్థానం పాద యాత్రలో ఉన్న, షర్మిల మునుగోడు ఉపఎన్నికలు నేపధ్యంగా తెరాసపై జోరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర పాలనను గాలికి వదిలేసి, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో మునిగి తేలుతున్నారని ఘాటైన విమర్శలు చేస్తున్నారు. అదలా ఉంటే, వివిద సంస్థలు నిర్వహిస్తున్న అధికార, అనధికార సర్వేలు మునుగోడులో అధికార తెరాస,  బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి గట్టి పోటీని ఎదుర్కుంటోందనే సంకేతాలు ఇస్తున్నాయి. ఒక దశలో తెరాస, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకంటే చాలా ముందున్నా, ఇప్పడు తెరాస, బీజేపీల మధ్య దూరం రోజురోజుకు తగ్గిపోతోందని అంటున్నారు. ముఖ్యంగా కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డిని పార్టీ అభ్యర్ధిగా ప్రకటించిన తర్వాత పరిస్థితి వేగంగా మారిపోతోందని అంటున్నారు. కూసుకుంట్లకు పార్టీలోనే మద్దతు లేదని, దీంతో కింది స్థాయి ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతల మద్దతు ఏ మేరకు ఉంటుందనే విషయంలో అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.  మరో వంక కాంగ్రెస్ అభ్యర్ధి స్రవంతి, పాల్వాయి గోవర్ధన రెడ్డి పలుకుబడి పై ఎక్కువగా ఆధార పడుతున్నారు, అలాగే, మహిళా కార్డును ఉపయోగిస్తున్నారు. ఇంతవరకు ప్రధాన పార్టీలు ఏవీ మహిళలకు అవకాశం ఇవ్వలేదని, తొలి సారిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక మహిళకు అవకాశం ఇచ్చారని పీసీసీ చీఫ్ రేవంత్. రెడ్డి  మహిళలను గెలిపించే బాధ్యత మహిళలే తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. స్రవంతిని గెలిపిస్తే, ములుగు ఎమ్మెల్యే, మునుగోడు ఎమ్మెల్యే  స్రవంతి సమ్మక్క సారలమ్మలలా అసెంబ్లీలో మహిళల గళం వినిపిస్తారని రేవంత్ రెడ్డి మహిళా కార్డ్’ను ప్రయోగించారు.అయితే, కోమటి రెడ్డి వెంకట రెడ్డి ప్రచారంలో పాల్గొనకపోవడం కాంగ్రెస్ పార్టీకి మైనస్సే అవుతుందని అంటున్నారు.  ఇక బీజేపే అభ్యర్ధి రాజగోపాల రెడ్డి, కోమటి రెడ్డి సోదరుల కార్డును, వ్యక్తిగత పలుకుబడి, కేంద్ర ప్రభుత్వ పథకాలను  ప్రధాని మోడీ, షా నాయకత్వం ప్రధాన అస్త్రాలుగా ప్రచారం సాగితున్నారు. అలాగే నియోజక వర్గం అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని ప్రచారం చేస్తున్నారు. తన రాజీనామాతో నియోజక వర్గంలో పనులు జరుగుతున్నాయని ప్రజలు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మూడు ప్రధాన పార్టీలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నా, ఇంకా ప్రచారపర్వం పతాక స్థాయికి చేరుకోలేదు. మూడు పార్టీల ముఖ్యనేతలు పూర్తి స్థాయిలో ప్రచార బరిలో దిగలేదు. దీంతో ముందు ముందు ప్రచారం జోరందుకున్న తర్వాత గానీ, వాస్తవ పరిస్థితిపై ఒక అంచనాకు రాలేమని పరిశీలకులు అంటున్నారు.  అదలా ఉంటే, మునుగోడు ఉపఎన్నికకు ఈ నెల 3న ఈసీ షెడ్యూల్ విడుదల చేయగా.. 7న నోటిఫికేషన్ వచ్చింది. 7వ తేదీ నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ 14తో ముగియనుంది. ఈ రోజు సాయంత్రం వరకు నామినేషన్లను అధికారుల స్వీకరిస్తారు. నవంబర్ 3న పోలింగ్ జరగనుండగా.. 6న కౌంటింగ్ జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు.

వ‌ర్క్ ఫ్ర‌మ్ ప‌బ్‌!

హాల్లో సోఫాలో తండ్రి, ఓ బెడ్‌రూమ్‌లో త‌ల్లి.. మ‌రో గ‌దిలో పెద్ద కూతురు, హాల్లో ఓ మూల కొడుకూ ఇది ఇప్ప‌టి కుటుంబాల్లో రాత్రి ఒంటిగంట‌వ‌ర‌కూ క‌నిపించే సీన్‌. కార‌ణం కోవిడ్ తో సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉద్యో గుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఆదేశం. ఈ వ‌ర్క్‌కి స‌మ‌యంతో ప‌నిలేదు..ఆఫీసు స‌మ‌యం కంటే ఎక్కువ స‌మ‌య‌మే చేయ‌క త‌ప్ప‌డం లేదు. క‌రెంటు బిల్లు పెరిగిపోతోంద‌ని పెద్దావిడ గోల‌, పిల్ల‌ది తెగ క‌ష్ట‌ప‌డి పోతోంద‌ని త‌ల్లి బాధ‌, వీడికి తిండి ధ్యాసే ఉండ‌టం లేద‌ని తండ్రి మ‌న‌సులో ప్ర‌శ్న‌లు. వీట‌న్నింటికీ విరుద్ధంగా ఏమీ జ‌ర‌గ‌డం లేదు. క్ర‌మేపీ కుటుంబం అంతా స‌ర‌దాగా మాట్లాడుకోవ‌డం, క‌లిసి ఎట‌న్నా వెళ్ల‌డం అనేవి కేవ‌లం ఆదివారాలే... అదీ పిల్ల‌లు ఓకే అంటేనే జ‌రుగుతోంది! సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీవితా ల‌న్నీ ఇలా మారిపోతున్నాయి.   అయితే ఈ విధంగా ప‌నిచేయ‌డంలోనూ ఉద్యోగుల అవ‌స్థ‌లు ఎక్కువే. ఇంట్లోనే ఉండి న‌న్ను ప‌ట్టించుకో వ‌డం లేద‌ని త‌ల్లిమీద పిల్ల‌లు అల‌గ‌వ‌చ్చు, వంట‌ప‌నిలో సాయం చేయ డం లేద‌ని అత్త‌గారికి కోపం రావ చ్చు.. ఇంటికంటే ఆఫీసే న‌య‌మ‌ని ఇంట్లో గోల భ‌రించ‌లేని స‌ద‌రు ఉద్యోగీ అనుకోవ‌చ్చు. అయితే ఇటీ వ‌ల  ఇలా వ‌ర్క్ చేయ‌డానికి కొంద‌రు స్నేహితులు క‌లిసి ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకుని దాన్నే వారి ఆఫీసుగా మార్చుకుని ఎవ‌రి ప‌నులు వారు చేసుకుంటున్నారు. ఇదో కొత్త ట్రండ్ మొద‌ల‌యింది. ఇదో ర‌కం వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్! టిఫిన్ బాక్స్‌తో రావ‌డ‌మో ఇల్లు ద‌గ్గ‌ర‌యితే ఇంటికి వెళ్లి తిని వ‌స్తూండ‌డ‌మో కూడా చేస్తు న్నారు.  ఇపుడు చిత్రంగా బ్రిట‌న్‌లో మ‌రో మార్గం ఆలోచించారు.  బ్రిట‌న్‌లో ప‌బ్‌లు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌కు చిన్న‌పాటి కార్యాల‌యాలుగా మారుతున్నాయి. అంటే ఆఫీసు స‌మ‌యంలో ప‌నిచేసుకున్న‌ట్టు ఇక్క‌డ చేసుకోవ‌చ్చు. అందుకు ఒక టేబుల్ డ్రింక్స్ ఏర్పాటు చేస్తార న్న‌మాట‌. వీల‌యితే అక్క‌డే ఫుడ్ తిన‌వ‌చ్చు.. మ‌ధ్య మ‌ధ్య‌లో పానీయాలు స్వీక‌రించుకోవ‌చ్చు.. అల‌వా టు ఉంటే. అంటే వ‌ర్క్‌ప్లేస్ పెద్ద స‌మ‌స్య‌గా ఉండ‌డంతో ఉద్యోగులు ఈత‌ర‌హా ఆఫ‌ర్‌ని కాద‌న‌డం లేదు. పైగా తిన‌డానికి, తాగ‌డానికి కూడా వెతుక్కోన‌వ‌స‌రం లేదు. అయితే అక్క‌డికి వచ్చేవారి గోల లేకుండా చూసుకోవాలి. ఆ ఇబ్బందులేమీ ఉండ‌వ‌ని బ్రిట‌న్‌లో ప‌బ్ య‌జ‌మానులు హామీ ఇస్తున్నార‌ట‌. అంటే మామూలుగా మందుసేవించే మందుబాబులు వ‌చ్చిపోతున్నా ఉద్యోగుల ప‌నికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌. అంటే వీళ్ల ప‌ని వీరిదే వాళ్ల ప‌ని వారిది. ఇటుకేసి వాళ్లు రాకుం డా చూసుకుంటున్నారు. పోతే, ఇన్ని గంట‌ల‌కు ఇంత అని వ‌సూలు చేస్తారు. అంటే రోజంతా అయితే మ‌న లెక్క‌ప్ర‌కారం రూ.13వంద‌లు ఇచ్చుకోవాలి. అదొక్క‌టే చూసుకోవాలి. అయితే మంచి జీతంలో ఉన్న‌వారికి ఇదేమంత ఖ‌ర్చు అనిపించుకోదు. ఎందుకంటే అక్క‌డే తిండి, ప‌ని, మ‌ధ్య‌లో మందు కూడా అందుబాటులో ఉంటుది గ‌నుక అదేమంత భార‌మైన ఖ‌ర్చుగా భావించ‌డం లేదు. సాండ్‌విచ్, లంచ్‌, కోరిన‌పుడ‌ల్లా కాఫీ లేదా టీ .. ఇదంతా ఆ పేమెంట్‌లోనే అయిపోతుంది! మ‌రి ఉద్యోగుల‌కు ప్ర‌శాంతంగా ప‌నిచేసుకోవ‌డానికి ఇంకేం కావాలి! ఇదే ప‌ద్ధ‌తి మ‌న దేశంలో పెద్ద పెద్ద న‌గ‌రాల్లో అమ‌లు చేస్తేనో!..మందుబాబుల‌ను క‌ట్ట‌డి చేయ‌డ‌మే య‌జ‌మానుల‌కు పెద్ద స‌మ‌స్యే అవుతుంది! ఇక్క‌డ ప్ర‌శాంతంగా ప‌నిచేయ‌నిస్తారా.. గోల, పాట‌లు, వీల యితే కొట్టుకోవ‌డాలూ జ‌రుగుతూంటాయి మ‌రి!  కానీ ఎవ‌రో ఒక‌రు ఈ కొత్త ట్రెండ్‌నీ ఫాలో అవుతారేమో చూడాలి. 

రైతుల యాత్ర ఆప‌డానికి  బ్రిడ్జి మ‌ర‌మ్మ‌తు  వంక‌

తండ్రికి చికిత్స చేయించాల‌ని హీరో త‌న స్నేహితుల‌తో పాటు ఆయ‌న్ను ప‌క్క ఊర్లో ఆస్ప‌త్రికి  తీసికెళు తూంటాడు.  క‌నుచూపు మేర‌లో చిన్న కాల‌వ‌వంతెన దాటాలి. కానీ అక్క‌డ విల‌న్ గ్యాంగ్ వెయిట్ చేస్తుం టుంది.  కారు, రెండు ఆటోలూ ఆపేసి ఏటి క‌నుక్కోరా అని హీరో అసిస్టెంట్‌ని పుర‌మాయిస్తాడు. వాడు త‌న్నులు తిని వ‌స్తాడు. కార్లు, జీపులు, ఆటోలు ఇయాల ఎల్లేందుకు ప‌ర్మిస‌న్ ఇవ్వ‌రంట విల‌న్ మాట‌గా చెప్పాడు. హీరోగారు తండ్రి ప‌రిస్థితి చూసి కాస్తంత త‌గ్గి ఒక మైలు వెన‌క్కి వెళ్లి మ‌రో మార్గంలో ఆస్ప‌త్రికి తీసికెళ‌తాడు. కానీ జ‌గ‌న్ మాత్రం రైతుల పాద‌యాత్రను స‌రిగ్గా ధ‌విళేశ్వ‌రాన్ని దాట‌నీయ‌కుండా చేయ‌డా నికే కంక‌ణం క‌ట్టుకున్నారు.  గోదావ‌రి న‌ది మీద రాజ‌మండ్రి కొవ్వూరు మ‌ధ్య రోడ్ క‌మ్ రైల్వే బ్రిడ్జి వారం రోజుల పాటు మూసివేశారు. రోడ్డు మ‌ర‌మ్మ‌త్తులు ఉన్నాయ‌ని మూసేస్టున్న‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌క‌టించారు. కొన్ని మరమ్మతులను ఆర్‌ అండ్‌బి, రైల్వేశాఖ చేపట్టనున్నాయి. అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర శ‌నివారం కొవ్వూరు చేరాలి. అదీ ఈ బ్రిడ్జ్ మీదుగానే యాత్ర కొన‌సాగాలి. కానీ మ‌ర‌మ్మ‌త్తు పనులు జ‌రుగుతున్న‌పుడు రైతుల‌ పాద‌యాత్ర ఎలా వెళుతుంది.  పాద‌యాత్ర‌తో ప్ర‌భుత్వానికి జ‌రిగే మేలు లేదు. అందుకే  వంతెన‌ మ‌ర‌మ్మ‌తు సంగ‌తి హ‌ఠాత్తుగా  గుర్తొ చ్చింది. ఇటీవ‌లి భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల్లో జ‌నం ఇబ్బందులు ప‌డిన‌పుడు మాత్రం దాన్ని గురించి ఆలోచ‌నే లేదు. ఇపుడు రైల్వేవారితో క‌లిసి మ‌ర‌మ‌తు కుట్ర‌కి పాల్ప‌డ్డార‌న్న‌ది ప‌రిశీల‌కుల మాట‌. రైతుల  పాదయాత్రలో వెయ్యిమందే పాల్గొంటున్నారు. వెయ్యిమంది న‌డిచి వెళతారు. అంతేగాని టూవీ ల‌ర్ల‌కి  పార్టీ జెండాలు క‌ట్టుకుని గోల చేస్తూ, చెవులు చిల్లులు ప‌డేలా నినాదాలు చేస్తూ వెళ్ల‌రు. పాద‌ యాత్ర‌కి వంతెన మ‌రీ దెబ్బ‌తింటుంద‌నే ఆలోచ‌నే అయితే స‌ర్కారు వారి ప్ర‌చార‌హోరుకి వెళ్లిన దారుల‌న్నీ నాశ‌న‌మ‌య్యాయి గ‌దా వాటి సంగ‌తేమిట‌ని జ‌నం ప్ర‌శ్నిస్తున్నారు.  రిపేరు అయితే వాహ‌నాలు రివ్వున వెళ‌తాయిగ‌దా! వాహ‌నాలు వెళ్ల‌డం కంటే పాద‌యాత్ర‌లో వెళ్లై రైతు ల‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త‌నీయ‌న‌వ‌స‌రం లేద‌ను కున్నార‌నే అనుకోవాలి. రైతు ఉద్య‌మం, పాద యాత్ర‌లు త‌మ ప్ర‌తిష్ట ను మ‌రింత దెబ్బ‌తీస్తున్నా య‌న్న అక్క‌సుతోనే జ‌గ‌న్ స‌ర్కార్  ఊహించ‌ని చ‌ర్య‌లకు దిగు తోంద న్న‌ది ప‌రిశీల‌కుల మాట‌. అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర‌ను ఈ విధంగా అడ్డుకోవ‌డం నీచ‌మ‌ని టీడీపీ నేత‌లు దుమ్మెత్తిపోస్తున్నారు.  కానీ ఈ చ‌ర్య‌లు రైతుల నిర్ణ‌యాన్ని వేగాన్ని ఆప‌లేవ న్న‌ది, త‌గ్గించ లేవ‌ని జ‌గ‌న్ సర్కార్ తెలుసుకోవాలి.

ఢిల్లీ లిక్క‌ర్ లింకులు. ..ఆర్‌.ఎస్‌.బ్ర‌ద‌ర్స్‌పై ఐటి దాడులు

ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో అరెస్ట‌యిన అశోక్‌రావు ఇచ్చిన స‌మాచారం మేర‌కే రాష్ట్రంలో ప‌లు ప్రాంతా ల్లో ఐటీ దాడులు జ‌రుగుతున్నాయి. ముఖ్యంగా హైద‌రాబాద్‌లో ప‌లుప్రాంతాల్లోని ప్ర‌ముఖంగా ఆర్‌.ఎస్‌. బ్ర‌ద‌ర్స్ వ‌స్త్రదుకాణాల మీద దాడులు జ‌రుగుతున్నాయి. ఆయ‌న వీటిలో పెట్టుబ‌డులు పెట్టారన్న సంగ‌తి తేల‌డంతో దాడులు తీవ్ర‌వ‌త‌రం చేశారు. ముందు మామూలు ఐటీ దాడులు అనే అంద‌రూ భావించారు. కానీ, అశోక్ రావు పెట్టుబ‌డులు పెట్టార‌న్న సంగ‌తి వెలుగుచూడ‌డంతో, ఈ దాడుల‌కు లిక్క‌ర్ లింకులు ఉన్నాయ‌న్న సంగ‌తి తెలిసి న‌గ‌ర ప్ర‌జ‌లు ఆశ్య‌ర్య ప‌డుతున్నారు.  తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మరోసారి ఐటీ అధికారుల రైడ్స్ కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌లో  ప‌ది చోట్ల ఏకకాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులు మాదాపూర్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, దిల్ సుఖ్ నగర్, హైటెక్ సిటీ, ఆర్.ఎస్ బ్రదర్ సహా పలు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు రాజధానిలో ఈడీ , సీబీఐ అధికా రుల దాడి జరగగా..తాజాగా ఐటీ  అధికారులు దాడులకు పాల్పడడం సంచలనంగా మారింది.  వ‌స్త్ర ప్ర‌పంచంలో అత్యంత ప్ర‌సిద్ధిపొందిన‌వాటిలో ఆర్‌.ఎస్‌. బ్ర‌ద‌ర్స్ ఒక‌టి. రాష్ట్రంలో, ముఖ్యంగా రాజ ధాని హైద‌రాబాద్‌లో మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల్లో ప్ర‌తీ శుభ‌కార్యానికి ఆర్‌.ఎస్‌.బ్ర‌ద‌ర్స్ ఉందిగ‌దా ఇక దిగులే మిటి అన్న‌ట్టుగా చీర‌ల‌కు, న‌గ‌ల‌కు కూడా ఆ దుకాణానికే వెళ్ల‌డం ప‌రిపాటి. పిల్ల‌ల డ్ర‌స్‌లు, పెద్ద‌వాళ్ల దుస్తులు, చీర‌లు అన‌గానే ఆర్‌.ఎస్కే వెళ్ల‌డం బాగా అల‌వాటుగా మారింది. ఇపుడు హైద‌రా బాద్‌లోని చాలా ప్రాంతాల్లో ఆర్‌.ఎస్‌.బ్ర‌ద‌ర్స్ వ‌స్త్ర దుకాణాల‌పై ఐటి దాడులు జ‌రుగుతున్నాయి. ఇలాంటి మాల్స్ ఆర్ధికంగా అన‌తికాలంలోనే అభివృద్ధి చెంద‌డం, లావాదేవీలు, వ్యాపార అంశాల మీద ఐటీ అధికారులు ప్రశ్నించ‌నున్నారు. హైద‌రాబాద్ కూక‌ట్‌ప‌ల్లి, మాదాపూర్‌, హైటెక్ సిటీ, దిల్‌సుఖ్‌న‌గ‌ర్ వంటి ప్రాంతాల్లో ఉన్న ఆర్‌.ఎస్‌.బ్ర‌ద‌ర్స్ మాల్స్‌పై ఒక్క‌సారిగా ఐటి దాడులు జ‌రుగుతున్నాయి. ఇటీ వ‌లి ఈ ఐటి దాడులు రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో, హైద‌రాబాద్‌లోనూ త‌ర‌చూ జ‌రుగుతూండ‌డం గ‌మ‌నిస్తున్నాం. అయితే ప్ర‌త్యేకించి వ‌స్త్ర‌దుకాణాలు, మాల్స్ మీద దాడులు జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారి. అందులోనూ అందరినీ ఎంత‌గానో చాలాకాలం నుంచి ఆక‌ట్టుకుంటున్న పెద్ద వ‌స్త్ర మాల్ ఆర్‌.ఎస్‌.పై దాడి ఆశ్చ‌ర్య ప‌రుస్తోంది. 

జగన్ తీరుతో వైసీపీ నేతల్లో నిర్వేద్వం

చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా ఉంది ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు. అన్ని వైపుల నుంచి ప్రజల  నిరసన సెగలను ఎదుర్కొంటున్న తరుణంగా ఆయన గత్యంతరం లేక ఎన్నికల మూడ్ లోకి వెళ్లి పోయారా? ఎన్నికల సన్నాహాలకు శ్రీకారం చుట్టారా? అంటే అవుననే అంటున్నారు వైసీపీ ముఖ్య నేతలు. నిజానికి, ఎన్నికలకు  ఏడాదిన్నరకు పైగానే సమయముంది. ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అలోచన వుందా అంటే అదీ లేనట్లే అంటున్నారు. మరి అలాంటప్పుడు ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి ఎన్నికల మూడ్ లోకి ఎందుకు వెళ్ళినట్లు? అంటే ముఖ్యమంత్రి మూడేళ్ళుగా కంటున్న కలలు ఒకటొకటిగా కరిగి పోవడమే  ఈ హడావిడికి అసలు కారణం అంటున్నారు.  అందుకే ఆయన ముందుగానే ఎన్నికల మూడ్ లోకి వెళ్లి పోయారని అంటున్నారు.  నిజానికి ముఖ్యమంత్రి మొదటి నుంచీ కూడా సంక్షేమ పథకాల పేరిట సాగిస్తున్న పందారాలనే నమ్ము కున్నారు. ఇటు నుంచి మీట నొక్కి అటు వైపుకు నోట్లు పంపితే   అటు నుంచి ఓట్లు వచ్చిపడతాయని పంచరంగుల్లో పగటి కలలు కన్నారు. అయితే గంపెడు ఆశలతో మొదలు పెట్టిన గడప గడపకు కార్యక్రమం సంక్షేమ పథకాల అసలు రంగును బయట పెట్టింది. సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందిన ప్రజలు బ్రహ్మరథం పడతారని జగన్ రెడ్డి ఆశిస్తే  ఫలితాలు అందుకు పూర్తి విరుద్ధంగా వచ్చాయి. సంక్షేమం ఒక్కటే సరిపోదని, అభివృద్ధి ఎక్కడని జనం నిలదీయడంతో, జగన్ రెడ్డికి తత్త్వం బోధ పడిందని, అందుకే ఆయన, మంత్రులు, ఎమ్మెల్యేల పై  మండిపడుతున్నారని అంటున్నారు.  ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నియోజక వర్గాల వారీగా సమావేశాలు మొదలు పెట్టారని అంటున్నారు. అందులో భాగంగా నిన్న గురువారం (అక్టోబర్ 13) కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే ముఖ్యమంత్రి మరో ఏడాదిన్నరలో ఎన్నికలకు వెళ్లబోతున్నామని, ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్దం కావాలని  పిలుపు నిచ్చారు. అయితే  సమావేశంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తఃలు ముఖ్యమంత్రి మాటా తీరులో మార్పు వచ్చిందని ఇదొక విధంగా అయన తోగిచుస్తున్న భయానికి సంకేతంగా ఉందని అంటున్నారు.   మూడు సంవత్సరాల కాలంలో మనం చేసిన మంచి పనులన్నింటినీ ప్రజలకు వివరించి చెప్పాలని సూచించారు.బానే వుంది. అయితే, మూడేళ్ళలో చేసిన మంచి కంటే చేయని మంచే, ఎక్కువగా ఉందని  ముఖ్యంగా ప్రజలు అడుగుతున్న మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కార్యకర్తలు, నాయకులు గుర్తు చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం  పాత పాటనే పడుతున్నారని, అంటున్నారు.  ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ మూడు సంవత్సరాల్లో రూ.1050 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని అలాగే, ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలను ముందుగా ప్రాధాన్యం ఉన్న పనుల కోసం కేటాయిస్తున్నట్లు చెప్పారని, అయితే ఇదే మాట చాలాకాలంగా చెపుతున్నా, జరుగుతున్నది ఏమీ లేదని అంటున్నారు. నిజనికి మూడేళ్ళుగా చిన్న పని అయినా చేయకుండా, ఇప్పడు  సచివాలయానికి రూ.20 లక్షలు ఇస్తే ఏ మూలకు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. మరోవంక ఎమ్మెల్యేలతో, మంత్రులతో కూడా తరుచుగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్న జగన్ ఆయా సమావేశాల్లో వారి నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించుకొని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నారని అంటున్నారు.అయితే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ముఖ్యమంత్రి, ముడున్నరేళ్ల తర్వాత ఏది చేయాలనుకుంటే అది అయ్యే పని కాదని  పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు.

వైసీపీ మళ్లీ ఛాన్స్ ఎందుకివ్వాలి?

ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి, అధికార పీఠం ఎక్కాలని పార్టీలన్నీ రకరకాల వ్యూహాలతో జనం ముందుకు వస్తున్నాయి. ఈ విషయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూడా పోటీ పడుతున్నాయి. తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ప్రస్తుతం అధికారం వెలగబెడుతున్న వైసీపీ కూడా అధికారపీఠాన్ని అంటిపెట్టుకుని కూర్చోవాలని ఇప్పటి నుంచే వ్యూహాలు పన్నుతోంది. మనిషి మాంసం రుచిమరిగిన పులిలా అధికారం రుచి మరిగిన వైసీపీ కుర్చీ పట్టుకుని వేళ్లాడడం కోసం ఫీట్ల మీద ఫీట్లు చేస్తోంది. ఒక్క ఛాన్స్ అంటూ ఊరూరా తిరిగి మరీ వేడుకుని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి సర్కార్ ఈ మూడున్నరేళ్లలో తమకు ఒరగబెట్టిందేంటనే సూటి ప్రశ్న జనం నుంచి దూసుకొస్తోంది. వైసీపీ పాలన ఏమాత్రం మెప్పించలేదని జనం చెబుతున్నారు. వైసీపీ అధినేతకు భయపడో, మరో కారణం వల్లో అంత చేశాం, ఇంత చేశాం అంటూ పైకి చెబుతున్నప్పటికీ జగన్ పాలనపై ఆ పార్టీ నేతల అనుచరులు కూడా అక్కడక్కడా పెదవి విరుస్తున్న సందర్భాలు ఉంటున్నాయి. అభివృద్ధిని పట్టించుకోకుండా, సంక్షేమ పథకాల పేరుతో తమను మభ్యపెట్టిన జగన్ సర్కార్ పై ప్రజల్లో మబ్బులు వీడిపోతున్నాయంటున్నారు. ఏపీలో అభివృద్ధి నేతిబీరలో నెయ్యి చందంగా మారిందంటున్నారు. నిజానికి జగన్ పాలనపై ఏపీని ఏ సామాజికవర్గమూ సంతృప్తిగా ఉన్నట్లు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తీవ్ర అవినీతిలో కూరుకుపోయిన వైసీపీ సర్కార్ ఏపీలో వస్తున్న ఆదాయాన్ని దేనికి ఖర్చు పెడుతోంది? లెక్కకు మించి తెస్తున్న అప్పుల సొమ్మును ఎందుకు వినియోగిస్తోందో తెలియని అయోమయస్థితి నెలకొందంటున్నారు. జగన్ రెడ్డి సర్కార్ తెచ్చిన అప్పుల్ని తీర్చే దెలా? అనే ప్రశ్న సామాన్యులు మొదలు రాజకీయ పండితులు, మేధావుల దాకా ప్రతి ఒక్కరూ వేస్తున్నారు. విభజిత ఏపీలో తొలిసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ ప్రభుత్వ పాలన ముగిసే నాటికి 3 లక్షల కోట్లు అప్పు ఉండేది. ఏపీకి అప్పుడు 16 వేల 78 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. లోటు బడ్జెట్ తో ఏర్పాటైన నవజాత ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు టీడీపీ పాలనా కాలం పూర్తయ్యే సరికి అప్పటి సీఎం చంద్రబాబు సర్కార్ 3 లక్షల కోట్లు అప్పు తెచ్చింది. అయితే.. ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు అహర్నిశలు కృషిచేశారు. అమరావతి రాజధాని పేరిట సరికొత్త నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. కానీ.. జగన్ సర్కార్ పాలన మూడేళ్లలో ఏపీ అప్పులను 7 లక్షల కోట్లకు పైగా తీసుకెళ్లింది. ఇంత భారీగా చేసిన అప్పుల్ని ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తీర్చ గలుగుతుందా? అనే సందేహాలు ఆర్థిక రంగ నిపుణుల నుంచి వస్తున్నాయి. వైసీపీ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోతే మరో రెండేళ్లు ఏపీలో అధికారంలో ఉంటుంది. ఈ క్రమంలో ప్రజలకు సంక్షేమ పథకాలు, ఉచిత పందేరాల నెపంతో అప్పటికి ఏపీ అప్పును దాదాపు 10 లక్షల కోట్లకు పెంచేసే అవకాశాలు లేకపోలేదనే ఆందోళన ఆర్థిక నిపుణుల నుంచి వ్యక్తం అవుతోంది. తలకు మించి వైసీపీ సర్కార్ చేసిన అప్పుల భారాన్ని ‘కల్లు తాగినోడే కట్టాలి తాటిచెట్టు పన్ను’ చందంగా వైసీపీకి ఓటు వేసి గెలిపించిన జనమే భరించక తప్పదంటున్నారు. ఇంత అప్పు చేసినా.. ఒక్క రూపాయి కూడా ఉత్పత్తి ఆధారిత, ఆదాయం వచ్చే  కార్యక్రమాలకు వైసీపీ సర్కార్ ఖర్చు చేయకపోవడం గమనార్హం. విద్యుత్, రవాణా చార్జీలు పెంచేసిన రాష్ట్ర ప్రభుత్వం చెత్త మీద కూడా పన్ను వేసిన దుర్మార్గానికి పాల్పడింది. ఏపీకి ఇలా ప్రజలపై వేసిన పన్నుల రూపంలో వస్తున్న ఆదాయమే తప్ప మరే ఇతర మార్గాల్లోనూ ఆదాయం లేని వైనాన్ని జనం గమనిస్తున్నారు. ఏపీలోని 66 కులాలకు 56 కార్పొరేషన్లు పెట్టి, వాటికి నిధులు ఇవ్వలేదు. దాంతో కార్పొరేషన్లు పెట్టి ప్రయోజనం ఏమిటనే సూటి ప్రశ్న ఆయా సామాజికవర్గాల నుంచి ఎదురవుతోంది. పంచాయతీలకు ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి మళ్లించుకుంటోంది. దీంతో ఆయా పంచాయతీల సర్పంచ్ లు స్థానికంగా పనులు చేసేందుకు భిక్షాటన చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈ విషయంపైనా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గ్రామ స్థాయిలో జగన్ పాలనపై విమర్శలు వస్తున్నాయి. గతంలో వైసీపీకి గ్రామ స్థాయిలోనే ఓట్లు అధికంగా వచ్చిన విషయం తెలిసిందే. ఆ ప్రజలే ఇప్పుడు జగన్ పార్టీకి ఎందుకు మళ్లీ ఛాన్సివ్వాలని చర్చించుకుంటున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు సాకుతో ఏపీకి అసలు రాజధాని కూడా లేకుండా చేసిన జగన్ సర్కార్ పై జనం బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మద్య నిషేధం పేరు చెప్పి గతంలో ఓట్లు అడిగిన జగన్ ఇప్పుడు మద్యం ధరలను పెద్ద ఎత్తున పెంచేసి సొంత బ్రాండ్లు పెట్టి జనం నుంచి లక్షల కోట్లు దోచేస్తున్న వైనాన్ని ఎక్కడికక్కడ చెప్పుకుంటున్నారు. ‘ఏపీలో ఏమున్నది గర్వకారణం ఏ రోడ్డు చూసినా గోతులు.. గతుకుల మయం’ అని ప్రజలు వైసీపీ సర్కార్ పై గుర్రుగా ఉన్నారు. ఏ విధంగా చూసినా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు ఎందుకు వేయాలనే ప్రశ్న జనం నుంచి వస్తోంది.

మావోయిస్టుల‌తో సంబంధం లేదు..సాయిబాబా విడుద‌ల‌కు కోర్టు ఆదేశాలు

ప్రొఫెస‌ర్ సాయిబాబాను జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని ముంబై  హైకోర్టు ఆదేశించింది. తనకు జీవిత ఖైదు విధిస్తూ ట్రయల్ కోర్టు 2017వ సంవత్సరంలో ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జిఎన్ సాయిబాబా దాఖలు చేసిన అప్పీల్‌ను జస్టిస్ రోహిత్ డియో, అనిల్ పన్సారేలతో కూడిన  నాగ‌పూర్ డివిజన్ బెంచ్ అనుమ తించింది. ప్రొఫెస‌ర్ సాయిబాబాతో పాటు మ‌రో అయిదుగురికి ఈ కేసు నుంచి విముక్తి ల‌భించింది.  శారీర‌కంగా విక‌లాంగుడ‌యి వీల్‌చైర్‌కే ప‌రిమిత‌మ‌యిన ఇంగ్లీషు ప్రొఫెస‌ర్ సాయి బాబా 2014 లో అరెస్ట‌యి నాగ‌పూర్ సెంట్ర‌ల్ జైల్లో ఉన్న‌ సంగ‌తి తెలిసిందే.  ఈ కేసులో అరెస్ట‌యిన మిగిలినవారిలో మ‌హేష్ తిక్రి, పాండు పోరా న‌రోత్‌, హేమ్‌కేశ‌వ్‌ద‌త్త మిశ్రా, ప్ర‌శాంత్ రాహి, విజ‌య్ నాన‌తిక్రి ఉన్నారు. అయితే వారిలో పాండుపోరా న‌రోత్  ఈ ఏడాది  ఆగష్టులో మ‌ర‌ణించాడు. మావోయిస్టుల‌తో సంబంధం లేద‌ని తేల‌డంతో వీరంద‌రిని, వేరే కేసుల్లో ఎలాంటి సంబంధాలు లేకుంటే, వెంట‌నే జైలు నుంచి విడుద‌ల చేయాల‌ని కోర్టు ఆదేశించింది.  2017 మార్చిలో మ‌హారాష్ట్ర గ‌డ్చిరోలీ జిల్లా కోర్టు  ప్రోఫెస‌ర్ సాయిబాబా త‌దిత‌రుల‌ను మావోయిస్టుల‌తో సంబంధాలున్నాయ‌న్న‌కేసులో అరెస్టు చేయ‌మ‌ని ఆదేశించింది. వారిలో ఒక జ‌ర్న‌లిస్టు, జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ వ‌ర్సిటీ విద్యార్ధి కూడా ఉన్నారు. వీరంతా మావోయిస్టుల‌తో క‌లిసి దేశంలో అల్ల‌ర్లు చేయ‌డానికి కుట్ర‌ప‌న్నుతున్నార‌న్న అభియోగంతో యుఏపిఏ, ఐపిసీ క్రింద  అరెస్ట‌య్యారు. 

అమ‌రావ‌తి  సాక్షిగా  నాలుక‌ల మెలిక‌లు !

మొన్నెపుడో చెప్పిందొక‌టి ఇపుడు మార్చి ఇదే విన‌మంటే ఎలాగ‌య్యా అంటాడు ప‌క్క‌నున్న‌వాడితో విల‌న్‌. అప్పుడు మ‌న విల‌న్ ఇపుడు రాటుతేలేడుసార్‌.. మ‌నం వ్యూహం మార్చాలి, మాట‌లూ మార్చి ఇత‌రుల‌ను బుట్ట‌లో వేసుకోవాలి.. అపుడే అన్ని ద‌క్కుతాయి.. వినండి. అంటాడు. వెంట‌నే మాట మార్చి ఫైటింగ్‌కి సిద్ధ‌మ‌వుతాడు. కానీ ఊరివాళ్లంతా త‌న్ని బ‌య‌ట‌కు నెట్టేస్తారు. దాదాపు ఇలాంటి సీన్‌కి ప‌రిస్థితులు సిద్ధ‌మ‌వుతున్నాయా అన్నఅనుమానం క‌లుగుతోంది ఏపీ ప్ర‌భుత్వానికి  రాజ‌ధాని అంశం లో. ఎందుకంటే అధికారంలోకి రావ‌డానికి ముందు, అధికారంలోకి వ‌చ్చాక మ‌రో మాట చెప్ప‌డంలో నాయ కుల నాలుక‌లు తాటాకుల్లా మార‌డం ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. అమ‌రావ‌తి రాజ‌ధాని అనుకుని గూగుల్ మ్యాప్‌వారూ దాన్నే ప్ర‌క‌టించినా, వైసీపీ స‌ర్కార్ మాత్రం ఇపుడు రైతాంగం మాట‌నీ కాద‌ని ప‌రిపాల‌నా సౌల‌భ్యం కోసం అని బోర్డు పెట్టుకుని విశాఖ‌, క‌ర్నూలు, గుంటూరు.. అంటూ అదేదో సినిమాలో క‌మెడి య‌న్ చెప్పిన‌న్ని ఊళ్ల‌పేర్లు చెబుతూ పోతున్నారు. పెద్ద‌ది గ‌నుక విశాఖ ను ఎక్కువ చెబుతున్నారు. ఇపుడు అదే కావాల‌ని గొంతు మార్చి వైసీపీ నాయ‌కులంతా ప్ర‌చారం చేయ‌డం వెనుక జ‌గ‌న్తో వారికి బంధాన్ని అంత త్వ‌ర‌గా వ‌దులుకోద‌ల్చుకొన‌క‌పోవ‌డ‌మేనా?  కానీ మాట మార్చి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నాలు ప‌నిచేయ‌వు. ప్ర‌జ‌లు, ఓట‌రు నాయ‌కుల్లా కాదు.. చాలా తెలివి మీరారు. ఎవ‌రు ఏమిట‌న్న‌ది ఇపుడు చ‌క్క‌గా బేరీజు వేసుకోగ‌ల్గుతున్నారు. అందుకే నిటారుగ నిల‌బ‌డి, గ‌ట్టిగానే స‌మాధానాలు చెబు తున్నారు.  శ్రీ‌కృష్ణ‌క‌మిష‌న్ నివేదిక ఆధారంగానే అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించారు. కానీ  ఈ  ప్రాంత‌మంతా ముంపున‌కు  గుర‌య్యే ప్రాంతం. కృష్ణా న‌దికి  8 ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటి ప్ర‌వాహానికే  ఈ ప్రాంతం చాలా దెబ్బతిన్న‌ది. భ‌విష్య‌త్తులో 11 ల‌క్ష‌ల క్యూసెక్కుల ప్ర‌వాహానికి నిల‌వ‌గ‌లగ‌డం అసాధ్యం. అన్ని విధాలా ఆలో చించే ఒక నిర్ణ‌యం తీసుకుంటామ‌ని 2019లో బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు.  కానీ విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం రాజ‌ధాని అమ‌రావ‌తే ఉండాల‌ని కొత్త ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది, దీన్ని ప్ర‌తిప‌క్షంగా తాము అంగీకరిస్తున్నామ‌న్నారు. అంతేకాదు తాము అధికారంలోకి వ‌చ్చినా దీనికే క‌ట్టుబ‌డి ఉంటామ‌ని, భూదం దాలు చేసేవారే మారుస్తారు గానీ మేము మార్చేదే లేద‌ని ఇదే బొత్స‌ స‌త్య‌నారాయ‌ణ విప‌క్ష పార్టీ నేత‌గా ఎన్నిక‌ల ముందు అన్నారు. రాజ‌ధాని విష‌యంలో నిపుణుల క‌మిటీ నివేదిక అనుస‌రించే అన్నీ జ‌రుగు తాయ‌ని, ఈప్రాంత రైతాంగాన్ని ఆదుకుంటామ‌ని, భ‌వ‌నాల నిర్మానం పూర్తి చేస్తామ‌ని ఆయ‌న 2019 న‌వంబ‌ర్‌లో అన్నారు. అంతేగాక  భూస‌మీక‌ర‌ణ ఒప్పందం అనుస‌రించి గ‌త ప్ర‌భుత్వం రైతుల‌కు ఇచ్చి న హామీల‌ను నెర‌వేరుస్తామ‌ని అన్నారు. 2020 జ‌న‌వ‌రిలో మాత్రం సిఆర్ డిఏ గురించి విరుద్ధంగా మాట్లా డారు. గ‌త ప్ర‌భుత్వం దీనివల్ల ఇత‌ర ప్రాంతాల అభివృద్ధిని నిర్ల‌క్ష్యం చేసింది గ‌నుక సిఆర్‌డిఏ చ‌ట్టాన్నే వ‌ద్ద‌న్నారు. విశాఖ, క‌ర్నూలు అభివృద్ధిని ఎలా నిరోధిస్తారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిని త‌మ ప్ర‌భుత్వం ఆశిస్తోంద‌ని బొత్స అన్నారు. ఆ  త‌ర్వాత మూడు రాజ‌ధానులు పాల‌నా సౌల‌భ్యానికే అన్న‌ది గుర్తించాల‌ని, ఇందులో త‌ప్పు ప‌ట్టాల్సింది, తీవ్రంగా వ్య‌తిరేకించాల్సిన అంశ‌ మేమీ లేద‌ని రౌండ్‌టేబుల్ స‌మా వేశంలో గ‌ట్టిగా ప్ర‌స్తావించారు. రాష్ట్ర మంత్రిగా  బొత్స ఒకే అంశం మీద ఇన్ని ర‌కాల అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేసి రాష్ట్ర ప్ర‌జ‌ల్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ప్ర‌భుత్వ ఆలోచ‌న ఎన్ని ర‌కాలుగా మారిస్తే  అన్నివిధాలుగా పోపు వేసి ప్ర‌చారం చేయ‌డం, విప‌క్షాలపై విరుచుకు ప‌డ‌టం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ముందు ప్ర‌క‌టిం చిన దానికి, చెప్పిన‌దానికి , ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌కూ పొంత‌న లేకుండా ఉండ‌టం వైసీపీ ప్ర‌భుత్వానికే చెల్లిం ద‌న్న‌ది ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మ‌వుతోంది.  రాజ‌ధాని విష‌యం ఎంతో కీల‌కాంశం. దీనిలోనే అనేక వొంకరులు పోవ‌డం విడ్డూర‌మే. పైగా రియ‌ల్ ఎస్టేట్ ఒప్పందంతోనే రైతులు భూములిచ్చార‌న‌డం రైతాంగాన్ని అవ మానించ‌డం కాదా అని విశ్లేష‌కులూ ప్ర‌శ్నించారు.  మ‌రో చిత్ర‌మేమంటే, విప‌క్షంలో ఉన్న‌పుడు అమ‌రావ‌తే రాజ‌ధానిగా ఉండాల‌న్నదానికి మద్ద‌తుగా ప్ర‌క‌ట న‌లు చేసిన ధ‌ర్మాన ఆ త‌ర్వాత గుంటూరు రాజ‌ధాని రాజ‌ధాని చేయ‌డానికి ఎందుకు వీలు కాద‌ని అన్నా రు. అధికారంలోకి రాగానే మాట‌మార్చ‌డం గ‌మ‌నించాం. 2019లో విశాఖ‌ను రాజ‌ధాని చేయ‌డానికి  అడ్డుకు నేవారిని అస్స‌లు క్ష‌మించ‌ద‌ని ఇదే ధ‌ర్మాన విజ‌య‌న‌గ‌రం ప్రాంతంలో ఒక  బ‌హిరంగ‌స‌భ‌లో ప్ర‌జ‌ల్ని దాదాపు రెచ్చ‌గొట్టే ప్ర‌సంగ‌మే చేశారు.  వైసీపీ మ‌రో నేత అవంతి శ్రీ‌నివాస్ అయితే అమ‌రావ‌తి నుంచి రాజ‌ధానిని మార్చాల్సిందేన‌ని, అలాగా కుంటే ఉత్త‌రాంధ్ర అభివృద్ధి అసాధ్య‌మ‌న్న‌ది విప‌క్షాల‌కు వినిపించేలా అన్నారు. అంటే వైసీపీ అధి నేత మాట‌కు, అడుగుల‌కు ప్ర‌చార‌కులుగా మార‌డం త‌ప్ప మ‌రో ఆలోచ‌నే లేద‌న్న‌ది వీరి ప్ర‌క‌ట‌న‌ల్లో డొల్ల త‌నం తెలియ‌జేస్తుంది. 

విజయసాయిపై చర్యలకు జగన్ జంకెందుకు?

విశాఖ భూముల వ్యవహారంలో సందేహాలకు తావు లేకుండా విజయసాయి అక్రమాలు పత్రికలలో ప్రచురితమౌతుంటే.. జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదు. పైగా మీడియా సమావేశం పెట్టి మరీ సొంత పార్టీ ఎంపీ భూ దందాలకు సంబంధించిన లీకులు ఇస్తుంటే.. జగన్ విజయసాయిపై చర్య తీసుకోకుండా ఎందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారు. అన్నిటికీ మించి మీడియాలో వెలుగు చూస్తున్న వార్తలకు వైసీపీ వర్గాల నుంచి, మరీ ముఖ్యంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వస్తున్న లీకేలే ఆధారమని కూడా చెబుతున్నారు. అసలు ఇటీవలి కాలంలో విజయసాయికి పార్టీలో ప్రాధాన్యత బాగా తగ్గింది. ఆయన నుంచి ఒక్కటొక్కటిగా అన్ని పదవులూ అధికారాలనూ తొలగించి దాదాపుగా ఒక ఉత్సవ విగ్రహంగా మార్చేశారు. వైసీపీకి బలం బలహీనత కూడా అయిన సోషల్ మీడియా అధికారాలను కూడా విజయసాయి నుంచి ఊడబీకి.. సజ్జల కుమారుడికి అప్పగించిన సంగతి తెలిసిందే. ఇలా ఇటీవలి కాలంలో తాడేపల్లి ప్యాలస్ కూ విజయసాయికి మధ్యా గ్యాప్ బాగా పెరిగిందన్న సంగతి బహిరంగ రహస్యమే. అయితే ఇన్ని విధాలుగా విజయసాయిని పక్కన పెట్టిన జగన్ ఆయనపై పార్టీ పరంగా ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదన్నది మాత్రం అంతుపట్టని ప్రశ్నగా మారిపోయింది. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణపై సస్పెన్షన్ వేటు వేసిన జగన్ అదే రీతిలో విజయసాయిపై ఎందుకు చర్య తీసుకోవడం లేదన్నది ఇప్పుడు వైసీపీ వర్గాలలోనే వినిపిస్తున్న ప్రశ్న. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో సొంత పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న నెపంతో మాజీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు వేసిన జగన్.. మరి సొంత పార్టీ ఎంపీపై మీడియా సమావేశం పెట్టి మరీ ఆరోపణలు చేసిన విజయసాయిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నదానిపై పరిశీలకులు కూడా పలు రకాల విశ్లేషణలు చేస్తున్నారు. ముఖ్యంగా హస్తినలో బీజేపీ పెద్దల గుడ్ లుక్స్ లో ఉండటం వల్లనే విజయసాయిపై చర్యలకు జగన్ జంకుతున్నారని అంటున్నారు. ఆ విషయం విస్పష్టంగా తెలిసినందునే విజయసాయి కూడా జగన్ ఆగ్రహానికి గురైతానన్న జంకు లేకుండా విశాఖలోనే ప్రెస్ మీట్ పెట్టి మరీ స్వంత పార్టీ ఎంపీపైనే విమర్శలు, ఆరోపణలు గుప్పించే ధైర్యం చేశాడని అంటున్నారు. అదే ధైర్యంతోనే జగన్ సొంత కుటుంబానికి చెందిన చానెల్ పై కూడా అన్యాపదేశంగా విమర్శలు గుప్పించి, తానే స్వయంగా ఒక చానెల్ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇక వైసీపీతో తెగతెంపులు చేసుకునే నిర్ణయానికి విజయసాయి వచ్చేశారనడానికి ఇదే నిదర్శనమని కూడా పరిశీలకులు అంటున్నారు. సాధారణంగా పార్టీ అధినాయకత్వంపై ధిక్కా స్వరం వినిపించిన వారికి వారంతట వారే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఏ పార్టీ అధిష్ఠానం ఇవ్వదు. పార్టీయే సదరు నాయకుడిని ఎక్స్ పెల్ చేయడమో, బహిష్కరించడమో.. కనీసం సస్పెండ్ వేటు వేయడమో చేస్తుంది. ఈటల విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ చేసింది కూడా అదే. మరి విజయసాయి విషయంలో మాత్రం జగన్ చర్యలకు వెనకాడుతున్నారు. ఆ బలహీనతను ఆసరా చేసుకునే సొంత చానెల్ అంటూ విజయసాయి ప్రకటనలు చేయడమే కాకుండా.. పార్టీ తీరునే తప్పుపట్టే విధంగా మీడియా సమావేశాలలో మాట్లాడుతున్నారు. దీనిపైనే పార్టీ వర్గాలలో సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ గుట్టుమట్లన్నీ తెలిసిన విజయసాయిపై చర్య తీసుకుంటే మొదటికే మోసం వస్తుందన్న భయం జగన్ ను వెంటాడుతోందా అన్న అనుమానాలు పార్టీ వర్గాల నుంచే వ్యక్తమౌతున్నాయి. అలాగే సుదీర్ఘ కాలం పార్టీలో నంబర్ 2గా ఉన్న విజయసాయికి పార్టీలోని పలువురు నాయకులు, కింది స్థాయి క్యాడర్ తో ఉన్న సత్సంబంధాలు కారణంగా విజయసాయిపై చర్య తీసుకుంటే పార్టీలో చీలిక వస్తుందన్న భయం జగన్ ను వెంటాడుతోందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. మొత్తం మీద విజయసాయి జగన్ కు కొరకరాని కొయ్యలా మారిపోయారన్న భావన అయితే పార్టీ శ్రేణుల్లో నెలకొని ఉందని అంటున్నారు. దీనికి అదనంగా విజయసాయికి బీజేపీకి చెందిన అగ్ర నాయకత్వంతో ఉన్న సంబంధాలు కూడా జగన్ ను నియంత్రిస్తున్నాయని అంటున్నారు.  

జాతీయ డేటా బేస్‌తో ఇక ఎన్ ఆర్ సి

ఊళ్లోవాళ్లు మ‌న గురించి ఏట‌నుకుంటున్నారో చెవొగ్గిరా.. అంటూ ఊరు ప్రెసిడెంటు త‌న బంటుని పుర‌మాయించాడు. వాడు తిరిగినా తిర‌క్క‌పోయినా సాయింత్రానికి ఆయ‌న ద‌గ్గ‌ర‌కెల్లి పెద్ద గొప్ప‌గా ఏటీ సెప్పుకోట‌ల్లేదండి మ‌రి అనేశాడు. ప్రెసిడెంటుకీ తెలుసు..అది వాడి మాటేన‌ని. ఆయ‌న రాత్రంతా ఆలోచించి పొద్దుటిక‌ల్లా ఒక పెద్ద బౌండ్ పుస్త‌కాన్ని ఇంటి ఆవ‌ర‌ణ‌లోనే చిన్న బ‌ల్ల‌మీద పెట్టి రోజూ ఎవ‌రు ఎక్క‌డికెళుతున్నారు, కార‌ణం, సైకిల్ నెంబ‌ర్‌తో స‌హా రాయ‌మ‌న్నారు. ఈ సంగ‌తి డ‌ప్పేయిం చాడు. అంతా న‌వ్వుకున్నారు. ఇపుడు మోదీగారి ప్ర‌భుత్వం చేప‌ట్టి వినూత్న కార్య‌క్ర‌మం కొద్దిగా ఇలానే ఉంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నాయి గ‌నుక ఓట‌ర్ల వివ‌రాలు అవ‌స‌ర‌మే. కానీ వారి పేర్లు, చిరు నామాతోనే కాదు వారి ద‌గ్గ‌రున్న స‌మ‌స్త కార్డుల వివ‌రాల‌తో స‌హా పేర్లు త‌నముందు ఉండాల‌ని జాతీయ‌ స్థాయిలో రిజిస్ట‌ర్ కావాల‌ని కొత్త ఆలోచ‌న చేసారు. పైగా దానికి చ‌క్క‌గా అఖిల భార‌త డేటా బేస్ అంటూ సూటేసిన పేరొక‌టి పెట్టారు. రిజిస్ట‌ర్‌లో ప్ర‌తీ పౌరుడి పుట్టిన‌, మ‌ర‌ణించిన స‌ర్టిఫికెట్ వివ‌రాలూ ఉంటాయి. అంచేత ఎవ‌రూ ఎక్క‌డికీ వెళ్ల‌లేరు, త‌ప్పించుకోలేరు. అన్నీ శ్రీ‌ప్ర‌భుత చేతుల్లోనే ఉంటారు.  ముందు అడుగుగా జాతీయ‌స్థాయిలో సిటిజెన్స్ రిజిస్ట‌ర్ (ఎన్ ఆర్ సి) సంబంధించి కేంద్ర హోం శాఖ డేటాబేస్ త‌యారు చేయ‌డానికి ఒక క్యాబినెట్ నోట్, ఒక బిల్లు ఆమోదించేలా ఈ శాఖ చేయ‌నున్న‌ట్టు తెలియ జేసింది. ఇప్ప‌టివ‌ర‌కూ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇటువంటి డేటాబేస్ ప్రాంతీయ రిజిస్టార్ల స‌హాయంతో నియంత్రిస్తున్న‌ది. ఇక త్వ‌ర‌లో ఇదంతా కేంద్రం ప‌రిధిలోకి వెళ్ల‌నుంది. ఓట‌ర్ ఐడితో ఆధార్ లింక్ చేయ‌డ‌మ‌న్న‌ది ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌భుత్వం చెబుతున్న‌ది ప్ర‌జ‌లు అంత సీరియ‌స్‌గా తీసుకోలేదు. కానీ ఇక చాలా సీరియ‌స్‌గా తీసుకోవాల్సివ‌స్తుంది. జ‌నాభా లెక్క‌లు, ఓట‌ర్ల జాబితాతో పాటు ఈ రిజిస్ట్రేష‌న్‌ను ప్ర‌భుత్వం స‌మ‌న్వయం చేయ‌ద‌ల‌చింది. అన్ని రాష్ట్రాల రిజిస్ట్రార్లూ  భార‌త రిజిస్ట్రార్ జ‌న‌ర‌ల్ డేటా పంచుకుంటారు. అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో మార్పులు చేర్పులూ చేప‌డ‌తూంటారు. ముఖ్యంగా ఆధార్‌, లైసెన్స్‌లు, రేష‌న్‌కార్డులు, ఓట‌ర్ కార్డుల వివ‌రాల విష‌యాల్లో ఈ మార్పులు చేర్పు లు చేప‌డ‌తారు. ఈ స‌మాచారం అంతా జాతీయ రిజిస్ట్రార్‌కు అంద‌జేస్తారు. దీనికి సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అన్ని రాష్ట్రాల‌కు ఆదేశాలు జారీ చేసింది. కాగా విదేశాల నుంచి వ‌చ్చి ఆశ్ర‌యం పొందుతున్న‌వారి వివ‌రాలు చ‌ట్ట‌ర‌హిత‌మ‌ని జాతీయ జ‌నాభా రిజిస్ట‌ర్ పేర్కొన్నారు. ఈ ఎన్ఆర్సిని మొద‌టి సారిగా అస్సాంలో ఆరంభించారు. ఇపుడు జాతీయ‌ స్థాయిలో ఆరంభించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆలోచిస్తున్నారు. దీనికి తోడు సిటిజ‌న్‌షిప్ అమెండ్మంట్ చ‌ట్టాన్ని కూడా అమ‌లు చేయాలన్న ఆలోచ‌న లో ఉంది. దీన్ని గురించి జాతీయ‌స్థాయిలో మూడేళ్ల క్రితం వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌యింది. విదేశాల నుంచి వ‌చ్చి ఉండేవారి పౌర‌స‌త్వ విష‌యంలో వారు 2015కి ముందు వ‌చ్చిన‌వారికే పౌర‌ స‌త్వం క‌ల్పించ‌డం జ‌రిగింది. అయితే వారు ముస్లింలు కాకుంటే ఎన్ ఆర్‌సి ప్ర‌క్రియ మైనారిటీల అంశంగా తీసుకుని చేయ‌బ‌డింది. 

వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ అరెస్టు అనివార్యమా?

రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా నడుస్తోంది. అయితే ఎప్పడికప్పుడు సీబీఐ హడావుడి పెరిగిన ప్రతి సందర్భంలోనూ సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. తాజాగా వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి తనకు ప్రాణ భయం ఉందంటూ మీడియా ముందుకు రావడమే కాకుండా, తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడమే కాకుండా  తాను చెప్పిన విషయాలన్నీ అవాస్తవాలని ప్రకటిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అంతే కాకుండా దస్తగిరి తనకు ప్రాణ హాని జరిగితే సిఎం జగన్ దే బాధ్యత అని చెప్పాడాన్ని బట్టి ఈ కేసులో   సిఎం పాత్ర ఉందని అనుమానించాల్సి వస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. అయితే వివేకా హత్య కేసులో ఎంపి అవినాష్ రెడ్డి, ఇతర ముఖ్య నేతల పై కేసు నమోదు చేయడంలో  దస్తగిరి వాగ్మూలం కీలకం కావడంతో అతనికి రక్షణ కల్పించాలని  తెలుగుదేశం డిమాండ్ చేస్తోంది. సుప్రీం కోర్టు లో వివేకా హత్య కేసు నిందితుల బెయిల్ పిటిషన్ల విషయంలో వెలువడుతున్న తీర్పులు చాలా స్పష్టంగా ఉన్నాయి.   వివేకా కేసులో జైల్లో ఉన్న నిందితులకు   బైయిల్ ఇచ్చే విషయంలో కోర్టులు సుముఖంగా లేవు.  వివేకా హత్య కేసులో సీబీఐ కి ఇటీవల షర్మిల వాంగ్మూలం  . దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్న నేతల ప్రమేయాన్ని షర్మిల సీబీ ఐ కి స్టేట్ మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే త్వరలో ఈ కేసులో అవినాష్ రెడ్డి అరెస్టు అనివార్యమని భావించాల్సి వస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఆర్‌.ఎస్‌.బ్ర‌ద‌ర్స్‌పై ఐటి దాడులు

వ‌స్త్ర ప్ర‌పంచంలో అత్యంత ప్ర‌సిద్ధిపొందిన‌వాటిలో ఆర్‌.ఎస్‌. బ్ర‌ద‌ర్స్ ఒక‌టి. రాష్ట్రంలో, ముఖ్యంగా రాజ ధాని హైద‌రాబాద్‌లో మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల్లో ప్ర‌తీ శుభ‌కార్యానికి ఆర్‌.ఎస్‌.బ్ర‌ద‌ర్స్ ఉందిగ‌దా ఇక దిగులే మిటి అన్న‌ట్టుగా చీర‌ల‌కు, న‌గ‌ల‌కు కూడా ఆ దుకాణానికే వెళ్ల‌డం ప‌రిపాటి. పిల్ల‌ల డ్ర‌స్‌లు, పెద్ద‌వాళ్ల దుస్తులు, చీర‌లు అన‌గానే ఆర్‌.ఎస్కే వెళ్ల‌డం బాగా అల‌వాటుగా మారింది. ఇపుడు హైద‌రా బాద్‌లోని చాలా ప్రాంతాల్లో ఆర్‌.ఎస్‌.బ్ర‌ద‌ర్స్ వ‌స్త్ర దుకాణాల‌పై ఐటి దాడులు జ‌రుగుతున్నాయి. ఇలాంటి మాల్స్ ఆర్ధికం అన‌తికాలంలోనే అభివృద్ధి చెంద‌డం, లావాదేవీలు, వ్యాపార అంశాల మీద ఐటీ అధికారులు ప్రశ్నించ‌నున్నారు. హైద‌రాబాద్ కూక‌ట్‌ప‌ల్లి, మాదాపూర్‌, హైటెక్ సిటీ, దిల్‌సుఖ్‌న‌గ‌ర్ వంటి ప్రాంతాల్లో ఉన్న ఆర్‌.ఎస్‌.బ్ర‌ద‌ర్స్ మాల్స్‌పై ఒక్క‌సారిగా ఐటి దాడులు జ‌రుగుతున్నాయి. ఇటీ వ‌లి ఈ ఐటి దాడులు రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో, హైద‌రాబాద్‌లోనూ త‌ర‌చూ జ‌రుగుతూండ‌డం గ‌మ‌నిస్తున్నాం. అయితే ప్ర‌త్యేకించి వ‌స్త్ర‌దుకాణాలు, మాల్స్ మీద దాడులు జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారి. అందులోనూ అంద‌రినీ ఎంత‌గానో చాలాకాలం నుంచి ఆక‌ట్టుకుంటున్న పెద్ద వ‌స్త్ర మాల్ ఆర్‌.ఎస్‌.పై దాడి ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. 

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి జనసేన అవకాశం ఇస్తుందా?

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి.. ఎంత వేగంగా రాజకీయాలలో ఒక వెలుగు వెలిగారో.. అంతే వేగంగా మసకబారిపోయారు. వైసీపీ తరఫున గొంతు చించుకుని మరీ ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడి... ఆ పార్టీ అధికారంలోకి రాగానే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) చైర్మన్ పదవి సంపాదించిన పృధ్వికి ఆ పదవి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. నోటి దురుసు కారణంగా వచ్చిన పదవి మళ్లీ అదే నోటి దురుసు కారణంగా పోయిందని అప్పట్లో వైసీపీ వర్గాల్లోనే సెటైర్లు పేలాయి.  ఏది ఏమైతేనేం అత్యంత అవమానకరమైన రీతిలో ఆయన పదవినే కాదు పార్టీలో స్థానాన్నీ కోల్పోయారు. సరిగ్గా థర్టీ ఇయర్స్ పృధ్వి ఏ ఆరోపణలతోనైతే పదవీ చ్యుతుడయ్యాడో.. సరిగ్గా అవే ఆరోపణలను ప్రస్తుత మంత్రి అంబటి, మాజీ మంత్రి అవంతి కూడా ఎదుర్కొన్నారు. అయితే వారిపై ఈగ కూడా వాలనీయని జగన్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫృధ్విపై మాత్రం కఠిన చర్యలు తీసుకున్నారు. అంతే కాదు.. మళ్లీ పార్టీలో ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో పృథ్వి పృధ్వీ.. తాను వైసీపీలో చేరి తప్పు చేశానని ఇటీవల మీడియా ముఖంగా పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేశారు. అవకాశం ఇస్తే జనసేన తరఫున పని చేయడానికి సిద్ధమనీ, జగన్ పార్టీలోని అక్రమార్కుల గుట్టు బయటపెడతాననీ కూడా సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ చెంతకు చరేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఒక చిన్న ఐడియా జీవితాన్నే మార్చేసినట్లు.. వైసీపీలో చేరడమనే పొరపాటు తన జీవితాన్నే తల్లకిందులు చేసేసిందని పృధ్వి భావిస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు ఆ పొరపాటు సరిదిద్దుకోవాలంటే జనసేనే సరైన వేదిక అని భావిస్తున్నట్లు చెబుతున్నారు. జనసేన గూటికి చేరి అవకాశం లభిస్తే తాడేపల్లి గూడెం నుంచి   పోటీ చేయాలని పృధ్వి భావిస్తున్నారని ఆయన మాటలను బట్టే అవగతమౌతుంది. తాడేపల్లి గూడెంలో అయితే తన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు గణనీయంగా ఉండటం కలిసి వస్తుందన్నది ఆయన భావనగా పరిశీలకులు చెబుతున్నారు. మరి జనసేన ఫృధ్విని దరి చేర్చుకుంటుందా? పోటీకి అవకాశం ఇస్తుందా? అంటే దానికి సమాధానం కాలమే చెప్పాలి. 

బెజవాడలో జగన్ కు నాగార్జునేదిక్కు!?

ప్రముఖ నటుడు  అక్కినేని నాగార్జున తనకు రాజకీయాలపై ఎంత మాత్రం ఆసక్తి లేదని పదే పదే చెబుతున్నా, వైసీపీ మాత్రం ఆయనను వదలడం లేదు. ముఖ్యంగా విజయవాడలో లోక్ సభ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా అక్కినేని నాగార్జున అయితేనే బాగుంటుందని జగన్ గట్టిగా భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే అక్కినేని నాగార్జున తాను ఎన్నికలలో పోటీ చేసే ప్రశక్తే లేదని పదే పదే చెబుతున్నా... జగన్ మాత్రం ఆయనపై ఒత్తిడి తెస్తున్నారనీ, ఇప్పటి వరకూ బెజవాడ పార్లమెంటు స్థానంలో గెలవలేకపోయిన వైసీపీ ఈ సారి ఆ స్థానంలో గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఆ స్థానంలో విజయాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జగన్.. అక్కడ నుంచి అక్కినేని  నాగార్జునను నిలబెడితేనే విజయం సిద్ధిస్తుందని విశ్వసిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్కినేని నాగార్జున వైసీపీ అభ్యర్థి అయితే సామాజిక వర్గాల పరంగా చూసుకున్నా వైసీపీకి అధిక ప్రయోజనం ఉంటుందనీ, ప్రత్యర్థి పార్టీకి చెందిన ఓట్లను కూడా ఆయన చీల్చగలుగుతారనీ, ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన ఓట్లలో చీలిక బారీగా ఉంటుందని జగన్ అంచనా వేస్తున్నారని చెబుతున్నారు. అందుకే నాగార్జున అంగీకారం, తిరస్కారంతో సంబంధం లేకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఆయనే విజయవాడ లోక్ సభ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం వెనుక వైసీపీయే ఉందని పరిశీలకులు చెబుతున్నారు. పార్టీ ప్రయోజనాలు, తన రాజకీయ అవసరాలను బేరీజు వేసుకుని జగన్ నాగార్జునపై విజయవాడ నుంచి పోటీ చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకువస్తున్నారని రాజకీయ వర్గాలలో బాగా ప్రచారంలో ఉంది. విజయవాడ లోక్ సభ స్థానంలో వైసీపీ విజయం సాధించాలంటే... ఆ స్థానం నుంచి నాగార్జునను నిలబెట్టడం వినా మరో మార్గం లేదని జగన్ నిశ్చితాభిప్రాయంతో ఉన్నారని పార్టీకి సన్నిహితంగా ఉండే వర్గాల సమాచారం. అన్నిటికీ మించి విజయవాడ లోక్ సభ స్థానం నుంచి నాగార్జునను బరిలోకి దింపితే... దాని ప్రభావం ఆ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లపై కూడా పడి... ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలలోని వైసీపీ అభ్యర్థుల విజయావకాశాలు మెరుగుపడతాయని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు. అందుకే నాగార్జున బహిరంగంగానే తానే పార్టీ తరఫునా ఎన్నికలలో పోటీ చేయబోయేది లేదని పదే పదే విస్పష్టంగా చెబుతున్నా... పట్టించుకోకుండా వైసీపీ తన ప్రయత్నాలు తాను చేస్తూనే.. అక్కినేని నాగార్జునే విజయవాడ లోక్ సభ స్థానంలో వైసీపీ అభ్యర్థి అన్న ప్రచారాన్ని కొనసాగిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మరోసారి ఆశల పల్లకిలో కమేడియన్ అలీ!.. గుంటూరు వైసీపీ అభ్యర్థిగా అవకాశం?

 చట్టసభకు కమేడియన్ అలీ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇంత కాలంగా ఆశపడి భంగపడుతూ వచ్చిన అలీకి వైసీపీ అధినేత జగన్ మరో సారి తాయిలం ఖాయమని సమాచారం ఇచ్చినట్లు పార్టీ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికలలో అలీని గుంటూరు నుంచి అసెంబ్లీకి పోటీకి దింపనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గుంటూరు -2 అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తాఫా పై జగన్ ఒకింత ఆగ్రహంగా ఉన్నారనీ, ఆయన పని తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారనీ చెబుతున్నారు. అదే విధంగా ప్రజలలో కూడా ఆయన పట్ల వ్యతిరేకత ఉందన్న సర్వేల సమాచారం ఆధారంగా వచ్చే ఎన్నికలలో ఆయనను తప్పించి అలీకి పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అన్నిటికీ మించి జగన్ సర్కార్ పై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో గూడుకట్టుకున్న పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకూ , సాధ్యమైనన్ని నియోజకవర్గాలలో కొత్త ముఖాలను రంగంలోనికి దింపాలని జగన్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందులో భాగంగానే గ్లామర్, పాపులారిటీలను దృష్టిలో ఉంచుకిని సాధ్యమైనంత వరకూ సినీ రంగానికి చెందిన వారిని పార్టీలోకి తీసుకువచ్చి ప్రయోజనం పొందాలని కూడా వైసీపీ అధినేత భావిస్తున్నట్లు వైసీపీ శ్రేణుల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే గుంటూరు నుంచి  అలీని అసెంబ్లీకి పంపాలని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. గత ఎన్నికలకు ముందు కూడా అలీ గుంటూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆశపడిన సంగతిని ఈ సందర్భంగా చెబుతున్నారు. అయితే అప్పట్లో అలీకి అసెంబ్లీ టికెట్ దక్కలేదు. అందుకు ప్రత్యామ్నాయంగా రాజ్యసభకు పంపుతారనీ, ఏదో ఒక కార్పొరేషన్ కు చైర్మన్ చేస్తారని మరోసారి అలీని ఆశల పల్లకిలో ఊరేగిస్తూ మూడున్నరేళ్లు  గడిపేసిన జగన్.. ఈ సారి అలీకి మరో తాయిలం ఎరవేశారని విశ్లేషకులు అంటున్నారు. ఇక మరో నటుడు పోసాని కృష్ణమురళికి కూడా ఈ సారి అసెంబ్లీకి పంపాలని జగన్ భావిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ప్రజారాజ్యం తరఫున చిలకలూరి పేట నుంచి పోటీ చేసి పరాజయం పాలైన పోసానికి అదే నియోజకవర్గం నుంచి ఈ సారి వైసీపీ అభ్యర్థిగా దింపాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు.చిలకలూరి పేట నియోజకవర్గంలో అంతర్గత విభేదాల నేపథ్యంలో కొత్త వారికి చాన్స్ ఇవ్వడం ద్వారా వర్గ పోరుకు చెక్ పెట్టినట్లవుతుందని జగన్ భావిస్తున్నారంటున్నారు. ఏది ఏమైనా ఈ సారి మూడోంతుల మంది సిట్టింగ్ లకు టికెట్ ఇచ్చే అవకాశాలు లేవని ఇప్పటికే జగన్ అన్యాపదేశంగా ప్రకటించేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గుంటూరు, చిలకలూరి పేటల నుంచి అలీ, పోసానిలకు లైన్ క్లియర్ అయ్యిందన్న టాక్ వైసీపీలో గట్టిగా వినిపిస్తోంది.  

బీఆర్ఎస్.. జాతీయ, ప్రాంతీయ ద్విపాత్రాభినయం..క్లిక్ అయ్యేనా?

అనుకున్నట్లే జరిగింది. రెండు దశాబ్దాల క్రితం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా, ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ( తెరాస) భారత రాష్ట్ర  సమితి (భారాస) గా పేరు మార్చుకుంది. జాతీయ పార్టీగా ఎదిగే దిశగా తొలి అడుగు వేసింది. తెరాస /భారాస అధ్యక్షుడు కల్వకుట్ల చంద్రశేఖర రావు 68 ఏళ్ల వయసులో తమ రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అయితే, పేరు మారినా, ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా కొత్తగా ప్రస్థానం మొదలు పెట్టినా, పార్టీ కార్యక్షేత్రం మారలేదని, కొత్త పాత పార్టీల వ్యవస్థాపక అధ్యక్షుడు హోదాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, స్పష్టం చేశారు. భారత రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నాన్నామని చెప్పారు. అంతే,కాదు, ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేకుండా, రాకుండా తెలంగాణ ముఖ్యమంత్రిగా తానే ఉంటానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా ఉంటూనే, దేశమంతా పర్యటిస్తానని కేసేఆర్ స్పష్టం చేశారు. అలాగే, కార్యక్షేత్రం వదిలేది లేదని, ఈ విషయంలోనూ  ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదని  చెప్పారు.  అయితే, నిజంగానే కేసీఆర్ ఎప్పటిలా జోడు పదవుల్లో కొనసాగుతారా ? సమయం సందర్భం చూసుకుని, ముఖ్యమంత్రి పదవిని మరొకరికి అప్పగిస్తారా,అనేది చూడవలసి వుంది. నిజానికి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి స్వయంగా కేసీఆర్ చేసిన, నిన్నటి (బుధవారం) ముగింపు ప్రకటన వరకు ఆయనే తెరాస  పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. అలాగే, 2014 నుంచి ఈ రోజు వరకు పార్టీ అధ్యక్ష పదవితో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగానూ  జోడు పదవులలో కొనసాగుతున్నారు. అఫ్కోర్స్, కుమారుడు కేటీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షునిగా, చేదోడు వాదోడుగా ఉన్నారనుకోండి, అది వేరే విషయం.  అయితే, రాష్ట్ర  స్థాయిలో సాధ్యమైన జోడు పదవుల స్వారీ జాతీయ స్థాయిలో సాధ్యమవుతుందా? ఈ ఏర్పాటు ఎంత కాలం కొనసాగుతుంది? అనేది, ఇప్పుడే తెలిసే విషయం కాదు. నిజమే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదివితో పాటు, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా జోడు పదవులు తనకే కావాలని కోరుకున్న ఆ రాష్ట ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,అశోక గెహ్లాట్ ఎదురైన అవరోధాలు, అడ్డంకులు, కేసేఆర్’ కు లేవు. కాంగ్రెస్ పెట్టుకున్న ఒక వ్యక్తికి ఒకే పదవి నియమం తెరాసకు పెట్టుకోలేదు. అంతేకాదు, అది తెరాస అయినా భారాస అయినా,గులాబీ పార్టీ కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆరే కాబట్టి, రాజస్థాన్’ పరిణామాలను ఇప్పటి కిప్పుడు తెలంగాణలో ఉహించలేము.   కానీ, కేంద్ర ఎన్నికల సంఘం తెరాస పేరు మార్పును అధికారికంగా గుర్తించి, తెరాస అధ్యక్షుడు కేసేఆర్, భారాస అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత, సంస్థాగత మార్పులు చేపట్టక తప్పక పోవచ్చును. అలాగే, అలాంటి ఆలోచన గులాబీ బాసుకు లేక పోలేదని అంటున్నారు. అయితే, తెరాస పేరు మార్పు,అనుకున్నట్లుగా ఒకటి రెండు రోజుల్లో తేలిపోతుందా, లేదా అనేది, కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, సో అంత వరకు  సంస్థాగత మార్పులు ఉండవనే అంటున్నారు. అదలా ఉంటే, ముఖ్యమంత్రి కేసీఆర్,ఓ వంక జాతీయ వాదాన్ని ఎత్తు కుంటూనే, తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ వాదాన్ని వదిలేది అంటున్నారు. ముఖ్యమంత్రి కేసేఆర్ తమకున్న అనుభవంతో జోడు పదవులను సమర్ధవంతంగా నిర్వర్తించ వచ్చునేమో కానీ, జోడు విధానాలను, జోడు వాదాలను ఎలా, సమన్మయ పరచు కుంటారు అనేది, ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా వుందని అంటున్నారు. రెండు దశాబ్దాల తెరాస చరిత్ర, కేసీఆర్ రాజకీయ జేవిత చరిత్ర మొత్తం తెలంగాణ కేంద్రంగానే సాగిందనేది కాదన లేని నిజం.    కేసేఅర్’ కు జాతీయ స్థాయిలో ఏదైనా గుర్తింపు ఉందంటే, అది తెలంగాణ ఉద్యమ నేతగా, తెలంగాణ అస్తిత్వ వాదంతో ముడిపడి ఉన్నగుర్తింపే కానీ, మరొకటి కాదు. అయితే, ఆ ప్రస్తావన ఎక్కడా రాకుండా, ఎనిమిదేళ్ళలో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలనే జాతీయ ఎజెండాలో చేర్చారు. అందులోనూ ప్రధానంగా సంక్షేమ పధకాలను, మరీ ముఖ్యంగా కౌలు రైతలకు కాదని, వందల ఎకరాల భూములు, వందల కోట్ల ఆస్తులు ఉన్న మంత్రి మల్లా రెడ్డి వంటి భూస్వాములు, రాజకీయ, వ్యాపార రంగాలలో స్థిరపడిన ధనినికులు, ప్రభుత్వ ఉద్యోగులకు సహా భూస్వాములకు ప్రజల సొమ్మును దోచి పెడుతున్నారనే ఆరోపణలున్న రైతు బంధు, ఇంకా రాష్ట్ర్రంలోనే పూర్తి స్థాయిలో పట్టాలేక్కని  దళిత బంధు, గిరిజనబందు వంటి పథకాలనే తెలంగాణ మోడల్’ గా ప్రముఖంగా పేర్కొంటున్నారు. ఈ ఎజెండాకు దేశ ప్రజలు ఎంతవరకు ఆమోదిస్తారు అనేది ఎలా ఉన్నా, జంట పదవులు, జోడు వాదాలలో భారాస ప్రస్థానం ఎలా ముందుకు సాగుతుంది అనేది, చూడవలసి ఉందని అంటున్నారు.