రాష్ట్ర విభజనకు జగన్ సంపూర్ణ మద్దతు పలికారా?

వైసీపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన విశాఖ గర్జన తుస్సు మంది. డ్వాక్రా మహిళలు, వర్సిటీ విద్యార్థులను బెదరించి బలవంతంగా తీసుకువచ్చినా.. విశాఖ జనంలో స్పందన లేకపోవడంతో గర్జన శబ్దం కనీసంగా కూడా విశాఖలో వినిపించలేదు. చివరికి సభలో చెప్పుకోదగ్గ జనం కూడా లేకుండా పోయారు. ఇంతోటి దానికి ఇంత మంది మంత్రులు తరలి రావాలా అన్న వ్యాఖ్యలూ వినిపించాయి. సరే ఇదంతా పక్కన పెడితే.. విజయసాయి గర్జన్ లో అసలు కనిపించలేదు, వినిపించలేదు. ఆయన ప్రమేయం ఇసుమంతైనా లేకుండానే వైసీపీ ఇంతటి కార్యక్రమాన్ని చేపట్టి పూర్తి చేసింది. వాస్తవానికి విశాఖ రాజధాని అయితే అందరి కంటే ఎక్కువగా లబ్ధి చేకూరేది విజయసాయికే. ఆ లబ్ధి కోసమే ఆయన ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ చార్జిగా ఉన్న సమయంలో ఎడాపెడా భూ దందాలు చేశారు. అవన్నీ ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో పార్టీ ఉద్దేశ పూర్వకంగానే ఆయనను విశాఖ బాధ్యతల నుంచి తప్పించిందంటారు. అందులో వాస్తవం ఎలా ఉన్నా.. విజయసాయి కుమార్తె, అల్లుడి ఖాతాలోకి విజయసాయి విజయవంతంగా చేర్చిన భూముల జాబితా మీడియా ముఖంగా సర్వే నంబర్లతో సహా వెలుగులోనికి వస్తుండటంతో ఆయన ఫేస్ విశాఖలో కనబడినా వైసీపీకి తీరని నష్టం జరుగుతుందని స్వయంగా జగనే భయపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిని పార్టీ వ్యవహారాల నుంచి దూరంగా ఉంచాలన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లు చెబుతున్నారు. విశాఖ భూదందా, ఢిల్లీ లిక్కర్ స్కాం లింకులు అన్నీ విజయసాయి కేంద్రంగానే ఉండటంతో.. మరీ ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కాం లో జగన్ సతీమణి భారతి పేరు బయటకు రావడం వెనుకా విజయసాయి సెల్ఫ్ ప్రొటక్షన్ వ్యూహం ఉందని జగన్ అనుమానిస్తున్నారని అంటున్నారు.  ఈ నేపథ్యంలోనే విజయసాయి భూదందా వ్యవహారాలన్నీ ఒకదాని వెనుక ఒకటి మీడియా ముఖంగా బయటపడుతున్నా... వైసీపీ బాకా ఉదే జగన్ సొంత పత్రికలో కనీసం ఖండనలు కూడా రాలేదని అంటున్నారు. పార్టీ తనను దూరం పెడుతున్నదన్న నిర్ణయానికి వచ్చిన తరువాతనే విజయసాయి సొంత చానెల్ అంటూ ప్రకటించారనీ.. నిజానికి వైసీపీలో ఆయనకు మరింత ఉక్కపోత ఎదురైతే సొంత పార్టీ పెట్టేందుకు కూడా వెనుకాడరనీ అంటున్నారు. జగన్ ను ఢీ కొట్టేందుకు కూడా వెనుకాడని ధైర్యం విజయసాయికి రావడం వెనుక కమలం ఆశీస్సులున్నాయా అన్న అనుమానాలు సైతం వ్యక్త మౌతున్నాయి. బీజేపీ ఆశీస్సులు విజయసాయికి పుష్కలంగా ఉండటం వల్లనే ఇంత జరుగుతున్నా జగన్ ఆయనపై వేటు వేయడానికి కానీ, పార్టీ నుంచి సస్పెండ్ చేసి షోకాజ్ నోటీసు జారీ చేయడానికి కానీ వెనుకాడుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకూ విజయసాయిపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదని అంటున్నారు. ఈ ధీమాతోనే.. రాహుల్ భారత్ జోడో యాత్ర ఏపీలో ప్రవేశించే తరుణంలో నాడు జగన్ రాష్ట్ర విభజనకు సంపూర్ణ మద్దతు ఇచ్చిన విషయం వెల్లడయ్యేలా విజయసాయి కాంగ్రెస్ ను రెచ్చగొడుతూ ట్వీట్ చేశారని కూడా పరిశీలకులు అంటున్నారు. సరిగ్గా రాహుల్ భారత్ జోడో యాత్ర ఏపీలో ప్రవేశించే సమయంలో జగన్ రాష్ట్ర విభజనకు సంపూర్ణ మద్దతు ఇచ్చారంటూ.. నాడు వైసీపీ తీర్మానం చేయడాన్ని... ఆ తీర్మానాన్ని అప్పటి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు పంపుతూ వైసీపీ పంపిన లేఖను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జై రాంరమేష్ ఇప్పుడు వెల్లడించడానికి కారణం విజయసాయి చేసిన ట్వీటే కారణం కావడం గమనార్హం. 

కాంగ్రెస్ గూటికి  క‌విత‌!

తెలంగాణా రాజ‌కీయాల ప‌రిణామాలు వేగవంతంగా మారిపోతున్నాయి. టీఆర్ ఎస్ పార్టీ బీఆర్ ఎస్‌గా మారిపోయింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ దేశ రాజ‌కీయాల్లోకి దూకి కేంద్రానికి గ‌ట్టి స‌వాలు విసిరి త‌న ప్రాధా న్య‌త‌ను దేశ‌మంతా విస్త‌రించేలా చేయ‌డానికి ముంద‌డుగు వేశారు. అయితే ఈ స‌మ‌యంలోనే ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణం బ‌య‌ట‌ప‌డ‌టం, అందులో కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట క‌విత త‌దిత‌రుల కీల‌క‌పాత్ర గురించి వార్త‌లు దేశ‌మంత‌టా విస్త‌రించ‌డం ఎంతో ప్రాధాన్య‌త‌ను సంత‌రించు కుంది. ఆమె పాత్ర ఎంత‌వ‌ర‌కూ ఉంది, అది కేసీఆర్ రాజ‌కీయ భ‌విష్య‌త్తు మీద ఏ మేర‌కు ప్ర‌భావం చూపుతుంద‌న్న‌ది తెలంగాణా రాజ‌కీయాల్లో త‌న దైన శైలితో విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్న, కేసీఆర్ సోద‌రుని కుమార్తె తెలంగాణా ఫైర్‌బ్రాండ్ ర‌మ్యారావు,  క‌విత కాంగ్రెస్  ఆశ్ర‌యించ‌డానికే ఎంతో అవ‌కాశం ఉంద‌న్నారు. ఆమె కాంగ్రెస్‌తో లోపాయ కారి ఒప్పందాలు చాలాకాలం క్రిత‌మే చేసుకుంద‌ని అన్నారు.  శ‌నివారం తెలుగువ‌న్‌తో ర‌మ్యారావు ప్ర‌స్తుత రాజ‌కీయాప‌రిణామాల‌గురించి చ‌ర్చించారు. ఈ సంద‌ ర్భంగా ఆమె మాట్లాడుతూ, అస‌లు తెలంగాణాలో టీఆర్ ఎస్ రెండోప‌ర్యాయం అధికారంలోకి వ‌చ్చే స‌మ‌యానికే క‌విత బీజేపీ వారితో సంబంధాలు ప‌టిష్ట‌ప‌రుచుకుంద‌ని ర‌మ్యారావు అన్నారు.  రెండో పర్యాయం టీ ఆర్ ఎస్‌ రాకున్నా ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకున్నార‌న్నారు. అం దువ‌ల్ల‌నే ఆమె ఎంపీగా గెలిచిన నిజామా బాద్ నుంచే మ‌ళ్లీ పోటీచేయ‌డానికి నిర్ణ‌యించుకున్నారు. ఇక్క డ త‌మ పార్టీ రాకున్నా కేంద్రంలో బీజేపీ పార్టీతో ఉన్న స‌త్సంబంధాలు క‌విత‌కు మ‌ద్ద‌తునిస్తాయన్న ధైర్యం ఆమెకు  ఎప్ప‌టి నుం చో ఉంద‌న్నారు. అప్ప‌ట్లో అమిత్ షా ని మ‌రో కీల‌క నాయ‌కునితో సంప్ర దించార‌ని, త‌మ స్థానం సు స్థిరప‌ర‌చుకోవ‌డానికి సిద్ధ‌ప‌డ్డార‌ని  ర‌మ్యారావు  స్ప‌ష్టం చేశారు.   లిక్క‌ర్ స్కామ్ వ్య‌వ‌హారం గురించి ప్ర‌స్తావిస్తూ, మ‌రీ విస్త‌రించేంత‌వ‌ర‌కూ వాస్త‌వానికి కేసీఆర్‌కు తెలియ ద‌ని, దాని సీరియ‌స్ నెస్ బ‌య‌ట‌ప‌డ‌డంతో కుమార్తెను ఆ ఉచ్చునుంచి బ‌య‌ట‌ప‌డేసేటందుకు ఆయ‌న తీవ్ర కృషిచేస్తున్నార‌ని ర‌మ్యారావు అన్నారు. ఢిల్లీలో నాయ‌కుల‌ను సంప్ర‌దించి కేసు తీవ్ర‌త‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నాలు ముమ్మరం చేశారన్నారు. అయితే మునుగోడు ఎన్నిక‌ల స‌మ‌యం ఆస‌న్న‌ మ‌యిన ఈ స‌మయంలో కేసు ప్ర‌భావం ఉంటుంద‌ని అంటూనే తీవ్ర‌త‌ను త‌గ్గించ‌డానికే ప‌రువు కాపాడు కునే య‌త్నా ల్లో భాగంగానే కేసీఆర్ ఢిల్లీ యాత్ర‌లు చేస్తున్నారు. వాస్త‌వానికి క‌విత పాత్ర కీల‌క‌మా కాదా అన్న‌ది ఇంకా తేల‌వ‌ల‌సి ఉంద‌ని, అయితే ఈసీ ఏసి బీ దాడుల‌తో ఆమె చుట్టూ కేసు బిగియ‌డం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ  క‌విత స‌న్నిహితుడు అప్రోవ‌ల్‌గా మారితేనే ఆమెకు ప్ర‌మాదం ఉండ‌వ‌చ్చుగాని అప్ప‌టివర‌కూ ఉండ ద‌న్నారు.  అయితే క‌విత నేరుగా ఆర్ ఎస్ ఎస్ ఛీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్‌ని సంప్ర‌తించార‌ని, ఆయ‌న ఆమెను స్కామ్ నుంచి ర‌క్షిస్తార‌న్న న‌మ్మ‌కంతో ఉంద‌ని ర‌మ్యారావు అన్నారు. అంచేత కేసీఆర్ ప్ర‌య‌త్నాల కంటే మోహ న్ భ‌గ‌వ‌త్ క‌రుణాక‌టాక్షాలే ఆమెను కాపాడ‌తాయ‌న్నారు. కానీ ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల్లో టీఆర్ ఎస్ కేంద్రం మీద భారీ విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్న నేప‌థ్యంలో అదెంత‌వ‌ర‌కూ సాధ్య మ‌న్న ప్ర‌శ్న‌క స‌మాధానం చెబుతూ, మునుగోడు ఎన్నిక‌ల ముందు పార్టీ ఇబ్బందిప‌డ‌కుండా బీజేపీ వారు కూడా జాగ్ర త్త‌లు తీసుకుంటార‌ని, ఆమెపై చ‌ర్య‌కు ఉప‌క్ర‌మిస్తే మునుగోడులో సెంటిమెంట్ మీద టీఆర్ ఎస్ గెలిచే అవ‌కాశాలుంటాయి గ‌నుక టీఆర్ ఎస్‌పై దాడి అంత వేడిగా ఉండ‌క‌పోవ‌చ్చ‌న్నారు. ప‌రిస్థితుల‌ను అను స‌రించే అంతా జ‌రిగిపోతుందే త‌ప్ప వెంట‌నే చ‌ర్య‌ల‌కు దిగితే కేంద్రం కూడా చిక్కుల్లో ప‌డుతుంద‌నే వారు ఆలోచిస్తారన్నారు.  కేటీఆర్‌, కేసీఆర్ ల మ‌ధ్య విభేదాల గురించి వ‌స్తున్న వార్త‌ల‌ను ప్ర‌స్తావిస్తూ, అలాంటిదేమీ లేద‌ని, అసెంబ్లీకి ఎవ‌రు ముందు రావాలి, ఎవ‌రు త‌ర్వాత రావాల‌న్న‌దేమీ ఉండ‌ద‌ని, పైగా ఒక‌రు లేని స‌మ‌యంలో మ‌రొక‌రు రావ‌డం అనేది ఉండ‌ద‌న్నారు. విభేదాల‌కు ఆస్కారం లేద‌ని, కేసీఆర్ కేంద్ర రాజ‌కీయాల్లోకి వెళుతున్న‌ప్పుడు కేటీఆర్‌ను ఇక్క‌డ ముఖ్య‌మంత్రి చేసి పార్టీ బాధ్య‌త‌ను పూర్తిగా ఆయ‌న చేతుల్లో పెట్టే యోచ‌న‌లో ఉన్న‌పుడు విబేదాల‌కు ఆస్కారం ఉండ‌దని ర‌మ్యా రావు అన్నారు. కేంద్రంలో బీజేపీని ఎదు ర్కొన‌డానికి ప్ర‌తిప‌క్షాల‌తో స్నేహ‌సంబంధాలు మ‌రింత మెరుగుప‌ర్చుకుని యుద్ధానికి స‌న్న‌ధ్ద‌మ‌వుతున్నార‌నే అనాలి. అలా ఆయ‌న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌తో క‌లిసి ఇక్క‌డ త‌న కుమారుడు కేటీఆర్ కు ఎలాంటి ఎదురుదాడి లేకుండా చేసుకోవ‌డానికి రేవంత్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ ప‌ద‌వి నుంచి తొల‌గింప చేయ‌వ‌చ్చు. ఫ‌లితంగా తెలంగాణాలో బీఆర్ ఎస్‌, కేటీఆర్ ప్ర‌భుత్వానికి అడ్డంకులు ఉండ కుండా పోతా య‌న్న‌ది ఆయ‌న వ్యూహంలో భాగం కావ‌చ్చున‌న్నారు. 

రాష్ట్ర విభజనకు జగన్ మద్దతు.. జైరాం రమేష్

ఏపీ సీఎం జగన్ నాడు రాష్ట్ర విభజనకు సంపూర్ణ మద్దతు ఇచ్చారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ అన్నారు. రాష్ట్ర విభజనకు సంపూర్ణ మద్దతు ఇస్తూ జగన్ అప్పటి కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారని గుర్తు చేశారు. తాను బళ్లారి పర్యటనలో ఉండటంతో ప్రస్తుతం ఆ లేఖ విడుదల చేయలేకపోతున్నారని.. త్వరలోనే విడుదల చేస్తాననీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏపీలో ప్రవేశిస్తున్న నేపథ్యంలో విజయసాయి చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా జైరాం రమేష్ ఈ విషయాలు చెప్పారు. రాహుల్ భారత్ జోడో యాత్ర వల్ల ఏపీలో కాంగ్రెస్ పార్టీకి  ఒరిగేది ఏమీ లేదనీ.. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు రాహుల్ కు గుర్తు చేయాలంటూ విజయసాయి ట్వీట్ చేయడంపై జై రాం రమేష్ స్పందించారు. అప్పటి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు డిసెంబర్ 28న 2012న  అప్పటి వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ నేత ఎంవీ మైసురారెడ్డి, సెంట్రల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు కేకే మహేందర్‌రెడ్డి రాసిన లేఖను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ఆ లేఖలో 2011 జులై 8,9 తేదీలలో జరిగిన వైసీపీ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ ప్రజల మనోభావాలను తమ పార్టీ గౌరవిస్తోందనీ,   రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడం, లేదా విభజించడంపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానిదేననీ పేర్కొన్నారు.   

టీఆర్ ఎస్‌ను మునుగోడు ప్ర‌జ‌లు న‌మ్మ‌రు..రాజ‌గోపాల్‌రెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో ఎలాగ‌యినా గెలిచి రాష్ట్ర రాజ‌కీయాల్లో తిరుగులేని పార్టీగా టీఆర్ ఎస్ చ‌క్రం తిప్పాల‌ని చూస్తోంది. 2024 ఎన్నిక‌ల‌కు సెమీస్‌గా భావిస్తున్న మునుగోడు ఎన్నిక‌ల్లో ఎలాగ‌యినా భారీ మెజారిటీతో గెల‌వాల‌న్న ప‌ట్టుద‌ల‌ను టీఆర్ ఎస్ ప్ర‌ద‌ర్శిస్తోంది. ఈ ఆలోచ‌న‌తోనే త‌న చుట్టూ ఉన్న నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను టీఆర్ ఎస్ నేత‌లు ప‌శువుల్లా కొనుగోలు చేస్తున్నార‌ని బీజేపీ అభ్య‌ర్ధి, మాజీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు ప్ర‌జ‌లు టీఆర్ ఎస్‌ను న‌మ్మే స్థితిలో లేర‌ని వారికి ఈ ఎన్నిక‌ల్లో గ‌ట్టి బుద్ధి చెబుతార‌నీ అన్నారు.  మునుగోడు ఇపుడు బీజేపీవారికీ కీల‌కంగా మారింది. కేసీఆర్ కేంద్ర రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డానికి ఎంతో ఆస‌క్తి చూపుతూ దూసుకుపోతున్న త‌రుణంలో, పార్టీ పేరు కూడా బీఆర్ ఎస్‌గా మార్చి మ‌రీ కేంద్రం మీద విరు చు కుప‌డుతున్న స‌మ‌యంలో వ‌స్తున్న ఈ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్‌కు గ‌ట్టి షాక్ ఇవ్వాల‌న్న‌దే  బీజేపీ ల‌క్ష్యంగా పెట్టుకుంది. అందుకు కాంగ్రెస్‌నుండి త‌మ పార్టీలోకి వ‌చ్చిన మాజీ ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి పై ఎంతో న‌మ్మ‌కంగా ఉన్నారు. ఒక స‌మ‌యంలో ఆయ‌న త‌ప్ప‌కుండా భారీ మెజారిటీతో  గెలిచే అవ కాశా లున్నాయ‌ని ప్ర‌చారం చేసుకుంటూ వ‌స్తున్న బీజేపీ ఇప్ప‌టి ప‌రిస్థితుల దృష్ట్యా అంత సీన్ లేదన్న అను మానం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప‌రిస్థితుల‌ను త‌మ‌కు అనుకూలం చేసుకోవాల‌ని ఒక వంక కాంగ్రెస్, మ‌రో వంక టీఆర్ ఎస్ మ‌రింత విజృంభిస్తున్నారు. కాంగ్రెస్ అభ్య‌ర్ధి ముందే మునుగోడులో దూసుకుపోతు న్నారు.  కాగా,  ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి చండూరు చౌరస్తాలో  రాజ‌గోపాల్ రెడ్డి  మాట్లాడు తూ,  మునుగోడు ప్రజలను ఎన్ని ప్రలోభాలు పెట్టినా టీఆర్ ఎస్ ను  నమ్మే పరిస్థితిలో లేరని, వారంతా బీజేపీ వైపే చూస్తు న్నారని అన్నారు. బీజేపీ నేతలను, కార్యకర్తలను పార్టీ మారాలని పోలీసులతో టీఆర్ ఎస్‌ బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. మునుగోడును దత్తత తీసు కుంటానన్న కేటీఆర్ తాను మూడేళ్లుగా అభివృద్ధికి నిధులు ఇవ్వమని అడిగితే కనీసం స్పందించ లేదన్నారు.  తెలంగాణ ఉద్యమంలో పని చేస్తున్న సమయంలో పార్టీ ఫండ్‌ కావాలని అడిగితే కేసీఆర్‌, కేటీఆర్‌, కవితలకు తాను కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేశానన్నారు.  అభివృద్ధి అంటే సిరిసిల్ల, గజ్వేల్‌, సిద్దిపేట నియోజకవర్గాలకే పరిమితమా? మునుగోడు నియోజక వర్గానికి నిధులు ఎందుకివ్వర‌ని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా బీజేపికి ప్రజలు పట్టం కడుతున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. చట్టసభల్లో ప్రశ్నించే గొంతు లేకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకుని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఘనత కేసీఆర్‌ దేనన్నారు. పార్టీ మారితే తప్ప అభివృద్ది చేయలేరా అని ప్రశ్నించారు. 

కోడి కత్తా, కోనసీమ విధ్వంసమా.. విశాఖలో వైసీపీ ప్లాన్ ఏంటి?

విశాఖపట్నంలో పెద్ద ఎత్తున విధ్వంస కాండకు తెరలేపి.. రైతుల మహాపాదయాత్రను అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే పవన్ కల్యాణ్  విశాఖ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విశాఖలో కోడి కత్తి డ్రామాను రిపీట్ చేయడమో, కోనసీమ విధ్వంస కాండకు తెరలేపడమో చేయడమే వైసీపీ కుట్రగా కనిపిస్తోందంటున్నారు.  పవన్ కల్యాణ్ విశాఖపట్నం చేరుకున్న సందర్బంగా  విశాఖ విమానాశ్రయం వద్ద చోటు చేసుకున్న సంఘటనలు, సంభవించిన పరిణామాలూ కోడి కత్తిని గుర్తుకు తెస్తున్నాయి. జనసేనాని విశాఖ వస్తున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు వేల సంఖ్యలో జనసైనికులు విమానాశ్రయానికి చేరుకున్న సమయంలోనే విశాఖ గర్జన ముగించుకుని మంత్రులు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మంత్రులు రోజా, జోగి రమేష్, వైసీపీ విశాఖ ఇన్ చార్జ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులపై జనసైనికులు దాడి చేశారంటూ పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురిపై 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ అరెస్టులు, కేసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అయితే   పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా అరెస్టులు చేయలేదనీ, అలా చేసి ఉంటే.. ఇప్పుడు పోలీసులు అరెస్టు చేసిన వారెవరూ ఆ దాడికి పాల్పడిన వారిలో లేరన్నది ప్రస్ఫుటం  అవుతుందని అంటున్నారు. అయినా జనసేనానికి ఉన్న జనాభిమానం గురించి తెలిసీ, ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వస్తారని తెలిసీ ఎందుకు సరైన భ్రదతా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అలాగే మంత్రులు విమానాశ్రయానికి వస్తున్నప్పుడు ప్రొటోకాల్ ప్రకారం ఉండాల్సిన భద్రతా ఏర్పాట్లు కూడా కనిపించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జరిగిన సంఘటనలు, అందుకు దారి తీసిన పరిస్థితులు గమనిస్తే.. విశాఖలో కోనసీమలో జరిగినట్లుగా పెద్ద ఎత్తున విధ్వంసం జరగాలని జగన్ సర్కార్ కోరుకుంటున్నదా అని అనుమానం కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు. మంత్రులపై దాడికి పాల్పడిన వారు వైసీపీ కార్యకర్తలేనని జనసేన ఆరోపిస్తోంది. మరి ఆ దిశగా పోలీసులు ఎందుకు దృష్టి సారించడం లేదన్న ప్రశ్నలు వినవస్తున్నాయి. 

తుగ్లక్ లా జగన్ తీరు ఉందన్న జయప్రకాశ్ నారాయణ్

మూడు రాజధానులంటూ ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి పట్ల క్రమంగా అన్ని వర్గాలలోనూ వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటి వరకూ ఈ విషయంపై పెద్దగా నోరు మెదపని వారు కూడా ఇప్పుడు బయటకు వచ్చి జగన్ సర్కార్ తీరును తప్పుపడుతున్నారు. ఆ క్రమంలోనే లోక్ సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ్.. మూడు రాజధానులంటూ వైసీపీ, జగన్ సర్కార్ తీరును తప్పుపట్టారు. గతంలో అందరూ కలిసి ఏకగ్రీవంగా రాజధానిగా అమరావతిని గుర్తు చేశారని ఆయన గుర్తు చేశారు. అంతటితో ఆగకుండా తుగ్లక్ కూడా తరచుగా రాజధానులను మార్చిన సంగతి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రబుత్వానికి రాష్ట్ర రాజధానికి మార్చే హక్కు ఇసుమంతైనా లేదని విస్పష్టంగా తేల్చేశారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై జయప్రకాశ్ నారాయణ్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. రాష్ట్రానికి ఒకటి కాదు మూడు రాజధానులు అంటున్న జగన్ సర్కార్ ఆరు నూరైనా మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతామంటోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి, వికేంద్రీకరణే తమ విధానమని వైసీపీ చెబుతున్నది.  కాగా అమరావతే రాజధాని అంటూ ఆ ప్రాంత  రైతులు మహాపాదయాత్ర చేస్తున్నారు. ఆ యాత్రను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో, ఆ యాత్ర విశాఖ ప్రవేశించరాదన్న తలంపుతో వైసీపీ విశాఖ గర్జన్ కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలోనే  రాజధాని అంశంపై లోక్ సత్తా  అధినేత జయప్రకాశ్ నారాయణ  ఏపీకి రాజధాని అమరావతే అని ఆయన తేల్చి చెప్పారు. తుగ్లక్ తరచూ రాజధానులను మార్చిన సంగతిని ప్రస్తావించిన ఆయన జగన్ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని అన్నారు. జగన్ సర్కార్ రాజధానిపై ప్రజలలో గందరగోళాన్ని సృష్టిస్తోందని అన్నారు. అయితే రాష్ట్ర హైకోర్టు రాజధానిపై విస్పష్ట తీర్పు ఇచ్చిన తరువాత కూడా జగన్ సర్కార్ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లనడం సరికాదని జయప్రకాశ్ అభిప్రాయపడ్డారు.   ఒక సార్వభౌమ అధికారం ఉన్న ప్రభుత్వం ఇండిపెండెంట్ గా హామీ ఇచ్చిన తర్వాత, రాతపూర్వకంగా ఒక కాంట్రాక్ట్ కుదిరిన తర్వాత వెనక్కి వెళ్లే హక్కు లేదని హైకోర్టు చెప్పిందని ఆయన పేర్కొన్నారు.  రాజధాని అంశంపై తారస్థాయిలో రగడ జరుగుతున్న వేళ.. ఏపీ రాజధాని అమరావతే అంటూ జయప్రకాశ్ నారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  

విశాఖ పరిణామాలపై చంద్రబాబు ఆరా.. పవన్ కు ఫోన్

విశాఖలో గత రెండు రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరా తీశారు. పవన్ కల్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించడం, ఆ హోటల్ లో బస చేసిన జనసేన నేతలను అరెస్టు చేయడం, పవన్ కల్యాణ్ కు పోలీసులు నోటీసులు ఇవ్వడం తదితర అశాలపై చంద్రబాబు స్వయంగా పవన్ కల్యాణ్ కు పోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జనసేన నేతలకు, కార్యకర్తలపై కేసులు, అరెస్టులను ఖండించారు. ఈ సందర్భంగా చంద్రబాబు జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి విపక్షాల గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.  పవన్ కు నోటీసులు ఇవ్వడాన్ని ఖండించారు.  పవన్ కల్యాణ్ పర్యటనపై ఆంక్షలను వెంటనే తొలగించాలని  చంద్రబాబు డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో శనివారం వైకాపా నేతృత్వంలో జరిగిన విశాఖ గర్జన్ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. కాగా అదే రోజు జనసేనాని పవన్ కల్యాణ విశాఖ రావడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. విశాఖ విమానాశ్రయంలో పవన్ కల్యాణ్ వచ్చిన సమయంలోనే విశాఖ గర్జన ముగించుకుని మంత్రులు విశాఖ విమానాశ్రయానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కొందరు మంత్రుల వాహనాలపై దాడికి పాల్పడ్డారు. జనసేన శ్రేణులు మంత్రులపై దాడులకు పాల్పడ్డారంటూ  వైసీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు జనసేన నేతలను, కార్యకర్తలను అరెస్టు చేశారు. ఆదివారం  పోలీసులు పవన్ కు నోటీసులు ఇచ్చి  విశాఖను వీడాలంటూ స్పష్టం చేశారు.   ఈ పరిణామాల నేపథ్యంలోనే  చంద్రబాబు పవన్ కల్యాణ్ కు ఫోన్ చేసి  పవన్ తో మాట్లాడారు. వందలాది మంది జనసేన నేతలపై కేసులు పెట్టడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఓ పార్టీ అధ్యక్షుడికి ప్రజల సమస్యలు తెలుసుకునే హక్కు ఉంటుందన్న చంద్రబాబు,  జనసేన జనవాణి కార్యక్రమాన్ని సమర్థించారు ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ విశాఖలో పరిస్థితులపైని,  తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడం, తమ నేతలను అరెస్టు చేయడం తదితర అంశాలను చంద్రబాబుకు వివరించారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందనీ, జగన్ సర్కార్ పోలీసు అండతో విపక్షాల గొంతు నొక్కాలని ప్రయత్నిస్తోందనీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.  ప్రతిపక్ష నేతల కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు. విపక్ష నేతలను దూషించడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.   ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారని పవన్ తో అన్నారు చంద్రబాబు.

టీఆర్ఎస్ కు మునుగోడు భయం

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు ఓటమి భయం వెంటాడుతోందా? అందుకే ముందుగానే ఓటమికి కారణాలు వెతుక్కునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందా? అంటే వరుసగా జరుగుతున్న సంఘటనలను బట్టి చూస్తే ఔననే అనాల్సి వస్తోందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా సింబల్స్ విషయంలో టీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీలో నెలకొన్న భయాన్నే సూచిస్తోందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎర్పడిన తరువాత ఇప్పటి వరకూ జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలలోనూ టీఆర్ఎస్ కారు గుర్తుతోనే విజయం సాధించింది. ఆ తరువాత కూడా పలు ఉప ఎన్నికలలో కారు గుర్తుతోనే టీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే తెరాస దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో పరాజయం పాలైన తరువాత మాత్రమే కారును పోలిన గుర్తులు ఉండటం వల్లనే ఓటమి పాలయ్యామని చెప్పుకుంది. ఇప్పుడు ముందుగానే ఆ విషయాన్ని గట్టిగా చెప్పడం ద్వారా ఇప్పటి నుంచే మునుగోడు ఉప ఎన్నిక ఓటమికి ఎక్స్యూజ్ వెతుక్కోవడానికి ప్రయత్నాలు ప్రారంభించేసింది. మునుగోడు ఉప ఎన్నికలో కారు గుర్తును పోలిన ఎనిమిది గుర్తులను ఎవరికీ కేటాయించవద్దంటూ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈసీ నుంచి ఎలాంటి స్పందనలేదంటూ హైకోర్టును ఆశ్రయించింది. సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్నారు టీఆర్ఎస్ నేతలు. హౌజ్‌ మోషన్‌ విచారణ చేపట్టాలని శనివారం కోరగా కోరగా.. అందుకు హైకోర్టు నిరాకరించింది.  దీంతో సోమవారం లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది.  కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడను గుర్తులను మునుగోడు ఉప ఎన్నికలో ఎవరికీ కేటాయించరాదని  కోరుతూ  ఎన్నికల కమిషన్ ను ఈనెల 10న టీఆర్ఎస్ కోరిన సంగతి విదితమే.  ‘కారును పోలిన గుర్తులను అభ్యర్థులకు ఇవ్వడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. అందుకే ఈసారి ఎన్నికల్లో వాటిని కేటాయించవద్దు’ అంటూ టీఆర్‌ఎస్‌ నేతలు సీఈవోని కోరారు. అయితే ఈసీ నుంచి స్పందన రాకపోవడంతో.. హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు టీఆర్ఎస్ నేతలు. గతంలో పలు నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులకన్నా..కారును పోలినట్లు ఉండే ఈ గుర్తులతో బరిలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థులకు అధిక ఓట్లు వచ్చాయన్నారు. కారును పోలి ఉన్నందునే వారికి ఓట్లు పడ్డట్లు స్పష్టమవుతోందని ఈసీకీ టీఆర్ఎస్ అంటున్నది. మునుగోడు, జహీరాబాద్‌, సిర్పూర్‌, డోర్నకల్‌లో 2018 ఎన్నికల్లో రోడ్‌రోలర్‌ గుర్తుకు సీపీఎం, బీఎస్పీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువాడ, నాగార్జునసాగర్ లో కెమెరా గుర్తుకు కూడా బీఎస్పీ, సీపీఎం కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయని అంటున్నారు. అందువల్ల ఆ  గుర్తులను తొలగించాలని టీఆర్ఎస్ కోరుతోంది. ఈ విషయంమీదే హైకోర్టులో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ కు సిద్ధమౌతోంది. 

ఖర్గే వర్సెస్ థరూర్ అధ్యక్ష పీఠం ఎవరిదో?

ఇంచు మించుగా రెండున్నర మూడేళ్ళుగా ఇదిగో అదిగో అంటూ వాయిదా పడుతూ వచ్చిన భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల  ముహూర్తం రానే వచ్చింది. సోమవారం ( అక్టోబర్ 17) కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నుకునేందుగా దేశ వ్యాప్తంగా ఒకేసారి పోలింగ్ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది వేల మందికి పైగా ఉన్న పీసీసీ ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకుంటారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజ్య సభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే, మరో సీనియర్ నేత లోక్ సభ ఎంపీ, శశి థరూర్’  పోటీ పడుతున్న విషయం తెలిసిందే.  భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర చాలా గొప్పది, ఎప్పుడో 137 ఏళ్ల నాడు, 1885 డిసెంబరు 25న మాజీ బ్రిటిషు అధికారి ఏ. ఓ. హుమే కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. దేశ స్వాతంత్ర పోరాటం తుదిఘట్టంలో మహాత్మా గాంధీ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్ర పోరాటానికి సారధ్యం వహించిన కాంగ్రెస్ పార్ట అధ్యక్ష పదవికి ఎన్నిక జరగడం మాత్రం,ఇది ఆరవసారి. అయితే  అదంతా చరిత్ర. అలాగే, ఆ కాంగ్రేస్ ఈ కాంగ్రెస్ ఒకటేనా, అంటే అది మళ్ళీ వేరే చర్చ అవుతుంది. 1969 చీలికకు ముందున్న భారత జాతీయ కాంగ్రెస్’ ప్రస్తుత కాంగ్రెస్’, ఒకటి కాదనే వాదన ఒకటుంది.   ఆ అంశాన్ని అలా పక్కన పెట్టి, ప్రస్తుతంలోకి వస్తే, అంతటి ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఎన్నిక జరుగుతోంది. ఈ 24 ఏళ్లలో ఇంచు మించుగా 22 ఏళ్లకు పైగా సోనియా గాంధీనే అధ్యక్ష పదవిలో కొనసాగారు. మధ్యలో కొద్ది కాలం రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా, 2019 సార్వత్రిక ఎన్నికల ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ, ఆయన రాజీనామా చేయడంతో మళ్ళీ సోనియా గాంధీనే, తాత్కాలిక ప్రాతిపదికన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఇదొక రికార్డ్. నెహ్రూ, ఇందిరా గాంధీ సహా ఎవరూ కూడా రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కాలం కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో లేరు.  అదలా ఉంటే, గాంధీ కుటుంబం సభ్యులు (సోనియా, రాహుల్, ప్రియాంక) అధ్యక్ష పదవి వద్దనుకోవడంతో ఎన్నిక అనివార్యమైంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ, అధ్యక్ష పదవి ముట్టేది లేదని భీష్మించుకు కూర్చోవడం వలన ఎన్నిక అనివార్యమైంది. కాగా, ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత జరిగిన అనేక నాటకీయ పరిణామాల నేపధ్యంగా గాంధీ కుటుంబ బయటి వ్యక్తులు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్’ పోటీలో నిలిచారు. గాంధీ కుటుంబం తటస్థ వైఖరిని ప్రకటించినా, తెర వెనక తతంగం మరోలా  ఉందని, శశి థరూర్’ ఆరోపించారు. గాంధీల దృష్టిలో ఇద్దరు సమానమే కానీ , ఖర్గే కాసింత చాలా ఎక్కువ సమానం’ అనే ఆరోపణలు/విశ్లేషణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.ఈ నేపధ్యంలో ఖర్గే ఎన్నిక లాంచానమే అంటున్నారు.  నిజానికి ఖర్గే గాంధీలకు విధేయుడు అనడంలో ఎవరికీ సందేహం లేదు. అయినా  ఖర్గే, పోలింగ్;కు గంటల ముందు కూడా తమ విధేయతను మరోమారు చాటుకున్నారు. రిమోట్ కంట్రోల్ అన్నా,ఇంకొకటన్న తాను పట్టించుకోనని అవమానంగా భావించనని  స్పష్టం చేశారు. అలాగే, కాంగ్రెస్ అధ్యక్షునిగా గాంధీల సూచనలు సలహాలు తీసుకునేందుకు ఏమాత్రం సిగ్గు పడనని స్పష్టం చేశారు. ఒకటి రెండు ఎన్నికలలో ఓడి పోయినంత మాత్రాన గాంధీలను తప్పు పట్టడం సరికాదని, గాంధీలు దేశానికి, పార్టీకి చేసిన మేలును మరిచిపోలేమని అన్నారు. మరో వంక శశి థరూర్’  కాంగ్రెస్ సిద్ధాంతాలకు సంబంధించి తనకు ఎలాంటి ఫిర్యాదు లేదని, అయితే పార్టీ పని విధానంలో మార్పు రావాలని, అన్నారు. ఖర్గే గెలిస్తే ఆయనతో కలిసి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఆయన యంగ్ టర్క్’ వాయిస్ వినిపించారు. మార్పు కోరుకునే యువకులంతా తన పక్షాన ఉంటే,యథాతథ స్థితిని కోరుకునే వృద్ధులు ఖర్గే పక్షాన ఉన్నారని చెప్పు కొచ్చారు. అయితే ఎవరు ఎవరి పక్షాన ఉన్నారు, ఎవరు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి పార్టీ పగ్గాలు అందుకుంటారు అనేది, అక్టోబర్ 19 న తేలి పోతుంది.

కేటీఆర్ కు చెలగాటం కవితకు సంకటం

ఉరుము ఉరిమి మంగలం మీద పడడం  అంటే ఇదే నేమో. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం రోజు రోజుకు వేడెక్కుతోంది. ముఖ్యంగా, మునుగోడు ఉప ఎన్నికను తమ రాజకీయ భవిష్యత్ ను నిర్ణయించే కీలక ఎన్నికగా భావిస్తున్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కల్వకుట్ల తారక రామా రావు, దటీజ్ కేటీఅర్  ప్రధానంగా  బీజేపీయే టార్గెట్ గా కత్తులు దూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మొదలు మునుగోడు బీజేపీ అభ్యర్ధి కోమటి రెడ్డి వెంకట రెడ్డి వరకు ఎవరినీ వదిలి పెట్టకుండా, విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.  నిజమే. సహజమే ఎన్నికల సమయంలో ప్రత్యర్ధులపై విమర్శలు చేయడం  సహజమే. కానీ, కేటీఆర్  స్థాయిని మరిఛి చేస్తున్న విమర్శలు, శృతి మించుతున్నాయి, చిక్కులు తెచ్చిపెడుతున్నాయని, అంటున్నారు. ఒక విధంగా కేటీఆర్ విమర్శలు ఇటు పార్టీని, పార్టీ నాయకులను,మరీ ముఖ్యంగా కల్వకుట్ల కుటుంబాన్నిచిక్కుల్లోకి నేట్టేస్తోందని అంటున్నారు. ఓ వంక, సోదరి, తెరాస ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో చిక్కుకుని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని వార్తలొస్తున్నాయి. అదే సమయంలో కేటీఆర్ చేస్తున్న విమర్శలు బీజేపీ నాయకులను రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయని తెరాస నాయకులే గుసగుసలు పోతున్నారు. ఇది పార్టీకు, ఫ్యామిలీకి ఇద్దరికీ మంచిది కాదని, అంటున్నారు.  రాజకీయాలలో రాణించాలంటే, ఎక్కడ ఎక్కాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసుండాలి, నిజానికి కేసీఆర్ విజయ రహస్యం అదే. ఉద్యమ సమయం నుంచి  కూడా కేసీఆర్, బ్లో హాట్ అండ్ బ్లో కోల్డ్ పాలసీనే ఫాల్లో అవుతూ వచ్చారు. గిట్టని వాళ్ళు కొందరు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, అంటారు అయినా కేసీఆర్ అదే పాలసీనే ఫాలో అవుతున్నారని అంటారు. ఇప్పుడు కూడా  కేసేఆర్ కుమార్తె కవితను వెంట పెట్టుకుని ఢిల్లీ వెళ్లి, అక్కడే  ఉన్నారు. ఆయన ఢిల్లీ యాత్రకు, కవిత కేసుకు సంబంధం వుందో లేదో, కానీ, ఢిల్లీ లిక్కర్ కేసులో బోయినపల్లి అభిషేక్‌’ను సీబీఐ అదుపులోకి తీసుకున్నవెంటనే కవిత, సంతోష్ను వెంటపెట్టుకుని ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారు. నిజానికి, ‘నువ్వు గోకినా గోకకున్నా, నిన్ను నేను గోకుతూనే ఉంటాను’ అంటూ ప్రధాని మోడీని పేరు పెట్టి మరీ హెచ్చరించిన కేసేఆర్, ఇంచు మించుగా గడచిన వారం రోజులుగా ఢిల్లీలో ఉండి కూడా మోడీని ఒక్క సారి కూడా  గోకలేదు. ఒక్క మాట కూడా అనలేదు. అలాగని ఆయన కవిత లిక్కర్ కేసు విషయంలో భయపడుతున్నారని అనలేము అలాగే  అనకుండానూ ఉండలేమని అంటున్నారు. సమస్యలు చుట్టు ముట్టినప్పుడు మౌనాన్ని ఆశ్రయించడం కేసీఆర్ అడాప్ట్ చేసుకున్న విధానమని  ఆయన ప్రస్తుత మౌనం కూడా అందుకు సంకేతం కావచ్చని అంటున్నారు.   అయితే కేసీఆర్ గోకుడు ఆపేసినా, అనూహ్యంగా మునుగోడు బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నకేటీఆర్ మాత్రం గోకుడు ఆపలేదు. మోడీ.. బోడీ.. ఈడీ.. దేనికైనానా రెడీ అంటూ ప్రధాని మోడీని దూషించిన కేటీఆర్, కోమటి రెడ్డి బ్రదర్స్గా పాపులర్ అయిన మునుగోడు బీజేపీ అభ్యర్ధి, కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి, ఆయన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డిని కలిపి వారు ‘కోమ‌టిరెడ్డి బ్రదర్స్ కాదు కోవర్ట్ బ్ర‌ద‌ర్స్’ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో అటు నుంచి కౌంటర్ గట్టిగానే వచ్చింది. కల్వకుట్ల కుటుంబం కమీషన్ల కుటుంబం అంటూ కోమటి రెడ్డి సోదరులు ఇద్దరూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అంటే కాకుండా బీజేపీ నాయకులు మొత్తంగా కల్వకుట్ల ఫ్యామిలీ టార్గెట్’గా పాత పురాణాలు అన్నీ బయట పెడుతున్నారు. అందులో భాగంగానే, రాజగోపాల రెడ్డి, తాజాగా, “ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీలోని 600 మద్యం దుకాణాల్లో వాటా ఉంది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆమెతోపాటు కేసీఆర్‌ హస్తం కూడా ఉంది. కవిత అవినీతిపై ఇప్పటికే సీబీఐ విచారణ జరుగుతోంది. వచ్చే బతుకమ్మ వేడుకలను ఆమె తీహార్‌ జైల్లోనే జరుపుకోవాల్సి ఉంటుంది’’ అని అన్నారు. మరోవంక సీబీఐ, ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణను వేగం పెంచింది. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రిక్’గా విచారణ సాగిస్తోంది. సీబీఐ అదుపులో ఉన్న బోయినపల్లి అభిషేక్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఆయన గతంలో కవితకు వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దీంతో, ఏ క్షణానికి ఏమి జరుగుతుందో, అనే అనుమానం తెరాస నాయకులను,వెంటాడుతోంది. అయితే, కేటీఆర్ మాత్రం తగ్గేదేలే... అంటూ తన దారిలో తాను బీజేపీ నాయకులను తమదైన ధోరణిలో విమర్శిస్తూనే ఉన్నారు. అందుకే, కేటీఆర్ ధోరణి, పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్న విధంగా మారిందని అంటున్నారు.

మ‌మ్మీ..!

ఇంటికి అందం ఆడ‌పిల్ల‌లు. మ‌న‌సు ఎంత వ్య‌ధకి గుర‌యినా, ఇంటికి రాగానే క‌న‌ప‌డితే అదో ప్ర‌శాంత‌త‌. ఒంట‌రిగా ఉన్న‌పుడు తానున్నా న‌ని బుజం మీద చేయి వేసి క‌బుర్లు చెప్పే కూతురు ఇంట్లో ఉంటే అదో ధైర్యం, అదో అద్భుతం. పూర్వం ఆడ‌పిల్ల‌లు బ‌రువు అనే అనుకునేవారు. ఇపుడు ఆ అభిప్రాయాల‌కు తావులేదు. చిన్న‌పిల్ల‌యినా క‌ళ్లు తుడిచి హ‌క్కున చేర్చు కుంటుంది. అంత‌కంటే జీవితంలో ఏం కావాలి. ఈ త‌ల్లికీ అంతే.. ఊహించ‌ని ప‌ర‌మానందం పంచింది ఈ చిన్నారి. కార‌ణం ఏద‌న్నా కావ‌చ్చు. ప్ర‌శాంత‌త క‌రువ‌యింది ఆ త‌ల్లికి. త‌న స‌మ‌స్య‌లు చెప్పుకుని బాధ‌ను త‌గ్గించుకోవ‌డానికి ఆమెకు త‌ల్లి లేదు. బుజ్జిదానితో కాల‌క్షేపంతో కాలం గ‌డిపేస్తోంది. దానితోనే మాటలు, ఆట‌లు. కానీ ఆ బుజ్జిత‌ల్లి మాత్రం త‌న యింట్లో బామ్మో, మామ్మో లేక‌పోవ‌డం గ‌మ‌నించింది. ఆమ‌ధ్య నీకు మ‌మ్మీ లేదా? అని అడిగింది. ఆ త‌ల్లి క్ష‌ణం ఆశ్చ‌ర్య‌పోయింది. లేదు అన గ‌లిగింది. చిన్న‌పిల్ల‌కి చెప్పినా అర్ధంకాదుగ‌న‌క‌. దూర‌మ‌యిన‌వారి గురించి పిల్ల‌ల‌కు చెప్ప‌కూడ‌ద‌నే ఉద్దేశం కావ‌చ్చు! కానీ ఆ ప‌సిది మాత్రం నేను నీ అమ్మ‌ని.. న‌న్ను మ‌మ్మీ అని పిలు! అంది. ఇది ఊహించ‌ని స‌మాధానం. ఊహించ‌ని ప్ర‌శాంతత‌. అమాంతం పిల్ల‌దాన్ని గ‌ట్టిగా కావ‌లించుకుని మ‌మ్మీ అంటూ భోరున ఏడ్చింది ఆ త‌ల్లి.. ఏడ‌వ‌కు.. నేనున్నాన‌ని చిట్టిచేతుల‌తో కొడుతూ ధైర్యం చెప్పింది. ఇపుడు ఆ త‌ల్లికి ఓ త‌ల్లి దొరికింది.. కొండంత ధైర్య‌మూ ఇచ్చింది! ఆమె ఆనందం ఆకాశ‌మంత‌!

దేశ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం: జిహెచ్‌ఐ నివేదికపై మోదీ

శనివారం విడుదల చేసిన 2022 గ్లోబల్ హంగర్ ఇండె క్స్(జిహెచ్‌ఐ)నివేదికలో భారతదేశం ఆరు స్థానాలు దిగజారి 121 దేశాల్లో 107వ స్థానంలో నిలిచింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం, అధికారిక ప్రకటనలో, నివేదికను తప్పు డు సమాచారం, దేశ ప్రతిష్ట ను దెబ్బతీసే ప్రయత్నంలో భాగమని పేర్కొంది. నివేదిక వాస్తవికత నుండి డిస్‌కనెక్ట్ చేయబడింద‌ని పిలుస్తున్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఇఏ) మహమ్మారి సమయంలో ఆహార భద్రత ను నిర్ధారించడానికి ప్రభు త్వం చేసిన ప్రయత్నా లను ఉద్దేశ పూర్వకంగా విస్మరించాలని ఎంచుకుంటుంది. కేంద్రం ప్రపంచంలో అతిపెద్ద ఆహార భద్రతా కార్యక్రమని నడుపుతోందని పేర్కొంది. ప్రభుత్వ సంస్థలు ఎన్జీఓల‌తో సహా అంతర్జాతీయ సంస్థల నుండి ఇదే విధమైన విమర్శలు మోడీ ప్రభుత్వంనుంచీ కూడా త్వరి త తీవ్రమైన ప్రతిస్పందనలను పొందాయి. జూలైలో, ఎంఇఏ, చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ప‌ద‌కండు ఇతర దేశాలతో పాటు భారతదేశాన్ని మతస్వేచ్ఛపై ప్రత్యేకమైన ఆందోళన కలిగిన దేశాల జాబితాలో చేర్చిన దాని నివేదిక కోసం యుఎస్‌ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ (యుఎస్‌సిఐ ఆర్ ఎఫ్‌)ని నిందించింది. యుఎస్‌సిఐ ఆర్ ఎఫ్‌, ప్రెసిడెంట్, సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లోని రెండు పార్టీల నాయకత్వంచే నియ మించబడిన యుఎస్‌ ఫెడరల్ ప్రభుత్వ కమిషన్, భారతదేశాన్ని క్రమబద్ధమైన, కొనసాగుతున్న మరియు తీవ్రమైన మతస్వేచ్ఛ ఉల్లంఘనలలో పాల్గొనడానికి, సహించ టానికి ప్రత్యేక శ్రద్ధగల దేశంగా పేర్కొంది. ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్యాక్ట్ (ఐఆర్ఎఫ్ ఏ) ద్వారా నిర్వచించబడింది. యుఎస్‌ని ఉద్దేశించి ఎంఇఏ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు భారతదేశం, దాని రాజ్యాంగ చట్రం పై, దాని బహుళత్వం మరియు దాని ప్రజాస్వామ్య నీతిపై తీవ్రమైన అవగాహన లేకపోవడాన్ని ప్రతిబింబిస్తున్నాయి... ఇటు వంటి చర్యలు సంస్థ విశ్వసనీయత మరియు నిష్పాక్షికత గురించి ఆందోళనలను బలోపేతం చేయడానికి మాత్రమే ఉపయోగ పడతాయి. ఒక నెల ముందు, జూన్ 29 న, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయంపై ఎంఇఏ, సుప్రీం కోర్ట్ ఆదేశం తర్వాత ఉద్యమకారుడు-జర్నలిస్ట్ తీస్తా సెతల్వాద్, మాజీ డీజీపీ శ్రీకుమార్‌లను అరెస్టు చేయడంపై విమర్శిం చినందుకు ఎదురుదెబ్బ తగిలింది. 2002 గుజరాత్ అల్లర్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇతరులకు ప్రత్యేక దర్యాప్తు బృం దం(సిట్) క్లీన్చిట్ ఇచ్చింది. తీస్తా సెతల్వాద్, ఇద్దరు మాజీ పోలీసు అధికారులను అరెస్టుచేయడం నిర్బంధించడం పట్ల మేము చాలా ఆందోళన చెందుతున్నాము, వారిని వెంటనే విడుదలచేయాలని పిలుపు నిచ్చారు. 2002 గుజరాత్ అల్లర్ల బాధితులతో వారి క్రియాశీలత, సంఘీభావంకోసం వారు హింసించబడకూడదని యూ ఎన్‌ మానవ హక్కుల సంఘం పేర్కొంది. ఏప్రిల్ 18 న న్యూయార్క్ టైమ్స్ కథనం, "గ్లోబల్ కోవిడ్ డెత్ టోల్ పబ్లిక్‌గా మార్చడానికి డ‌బ్ల్యూహెచ్ ఓ(ప్రపంచ ఆరోగ్య సంస్థ) యొక్క ప్రయత్నాలను భారతదేశం నిలిపివేస్తోంది" అనే శీర్షికతో భారతదేశం నుండి తీవ్ర స్పందన వచ్చింది. కోవిడ్-19 మరణా లపై డబ్ల్యూహెచ్‌ఓ  చేసిన అధ్యయనం యొక్క డేటాను బహిరంగంగా తెలియజేయడంపై భారతదేశం అభ్యంతరం వ్యక్తం చేస్తోం దని, 2020-21లో కోవిడ్‌కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా 4.7 మిలియన్ల మరణాలు సంభవించాయని అంచనా వేసినట్లు ఆ కథ నం పేర్కొంది. కోవిడ్ మరణాల సంఖ్య కేవలం 481,486. ఒక ప్రకటనలో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  డ‌బ్ల్యూహెచ్ ఓ పద్ద తిని ప్రశ్నించింది..ఈ ప్రక్రియ, పద్దతి, ఫలితాలపై భారతదేశం అభ్యంతరం వ్యక్తంచేసినప్పటికీ, డ‌బ్ల్యూహెచ్ఓ భారతదేశ ఆందోళ నను తగినంతగా పరిష్కరించకుండా అదనపు మరణాల అంచనాలను విడుదల చేసింది. గత డిసెంబర్ 2న, మానవ హక్కుల కార్యకర్త ఖుర్రం పర్వేజ్‌ను ఉగ్రవాద ఆరోపణలపై అరెస్టు చేయడంపై వచ్చిన‌  విమర్శలకు ఎంఇఏ ప్రతిస్పందించింది, యూఎన్‌ మానవ హక్కుల సంఘం ప్రకటన - పౌర సమాజ నటులపై అణిచివేతకు వ్యతిరేకంగా, తీవ్ర వాద వ్యతిరేక చర్యలు, పౌరుల హత్యలు - చట్టాన్ని అమలు చేసే అధికారులు, భారతదేశ భద్రతా దళాలపై నిరాధారమైన, నిరాధారమైన ఆరోపణలు చేసారు. పర్వేజ్ అరెస్ట్ .. నిర్బంధం, పూర్తిగా చట్టంలోని నిబంధనల ప్రకారం జరిగింద న్నారు. మార్చి 14, 2021న జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను రెండు ప్రముఖ ప్రజాస్వామ్య -రేటింగ్ ఏజెన్సీలు భారతదేశం డౌన్‌గ్రేడ్ చేయడం గురించి అడిగారు - యూఎస్‌-ఆధారిత ఫ్రీడమ్ హౌస్, భారతదేశాన్ని పాక్షి కంగా ఉచిత‌మ‌ వర్గీకరించింది, ఫ్రీ అని అంతకుముందు, స్వీడిష్ సంస్థ వెరైటీస్ ఆఫ్ డెమోక్రసీ, ఇది భారతదేశాన్ని ఎన్నికల నిరంకుశత్వంగా వర్గీకరించింది. సంస్థలు ఉపయోగించే ప్రమాణాలను ప్రశ్నించడం ద్వారా జైశంకర్ స్పందించారు. ఇది వంచన. భారతదేశంలో ఎవరైనా తమ ఆమోదం కోసం వెతకడం లేదని, వారు ఆడాలనుకుంటున్న ఆట ఆడటానికి ఇష్టపడటం లేదని కడుపునింపుకోవడం చాలా కష్టంగా భావించే ప్రపంచంలోని స్వీయ-నియమించబడిన సంరక్షకులసమితి మాకుంద‌ని అన్నారు. 

మా కార్య‌క్ర‌మాలు ఎలా చేపట్టాలో వైసీపీ చెప్పాలా?.. ప‌వ‌న్ 

అన్నీ త‌న‌కు తెలిసే జ‌ర‌గాల‌ని, ఏది జ‌రిగినా త‌న‌కు వ్య‌తిరేకంగా జ‌ర‌గ‌డానికి వీల్లేద‌న్నధోర‌ణిలో రాజుగారుంటే ప్ర‌జ‌ల‌కు, ప్ర‌తి నిధుల‌కు ఇక స్వేచ్ఛ ఏముం టుంది.. కొద్దిగా ఇలానే ప్ర‌శ్నిం చారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్‌. అయినా సంఘ‌విద్రోహ‌క కార్య‌క్ర‌మాలేమీ చేప‌ట్ట‌డంలేదుగ‌దా.. గొంతు నొక్కేయ‌డానికి అనీ ప్ర‌భుత్వాన్ని క‌ళ్యాణ్ ప్ర‌శ్నించారు. ఆయ‌న ఆదివారం మీడి యాతో మాట్లాడుతూ, అస‌లు జనసేన కార్యక్రమాలు ఎలా చేసుకోవాలో వైసీపీ చెబు తుందా?మేం ఎక్కడికి వెళ్తామో వైసీపీ నేతలకు చెప్పాలా? అని ప్రశ్నించారు.  ఉత్తరాంధ్ర పర్యటనను మూడు నెలల క్రితమే ఖరారు చేశా మని స్పష్టం చేశారు.  ప్రజల సమస్య లు తెలుసుకునేందుకే జన వాణి కార్యక్రమం చేపట్టామని, విధానపరంగా నిర్ణయాలు తీసుకో వాలనేది జనసేన సిద్ధాంత మని చెప్పారు. వైసీపీ నేతలవి ఎప్పుడు బూతు పురాణాలే తప్ప.. సమస్యలను పరిష్కారించ లేదని ఆరోపించారు. తమ కార్యక్రమం అజెండాలో రాజధానుల అంశం లేదని, రాజు వచ్చినప్పుడల్లా రాజధాని మారిస్తే ఎలా?! అని పవన్‌ కల్యాణ్ ప్రశ్నించారు. నిన్న ఎయిర్‌పోర్టు దగ్గర పోలీసుల ప్రవర్తన సరిగా లేదన్నారు. పోలీస్‌ శాఖపై తనకు ప్రత్యేక గౌరవం ఉందన్నారు. పోలీసులు నిర్ణయాలు తీసుకోరు.. ప్రభుత్వ సూచనలు పాటిస్తారని, నిన్న జనసేన కార్యకర్తలపై పోలీసులు జులుం చూపారని పవన్‌ అన్నారు.

విశాఖ గ‌ర్జ‌న ప్ర‌భావ‌మెంత‌?

ప్ర‌శాంత విశాఖ‌ప‌ట్నంలో ఊహిం చ‌నివిధంగా రాజ‌కీయ‌ వాతా వ‌ర‌ణం వేడెక్కింది. మూడు రాజ‌ ధానుల కోరుతూ వైసీపీ విశాఖ గ‌ర్జ‌న ప్ర‌క‌ట‌న విశాఖ‌పై ఎంతో ప్ర‌భావం చూపింది. పాలనా వికేం ద్రీకరణకు మద్దతుగా విశాఖ పట్నంలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వ హించిన 'విశాఖ గర్జన'కు పెద్దఎత్తున ప్రజలు పోటెత్తారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని కోరుతూ భారీ ర్యాలీ చేపట్టారు. అంబేడ్కర్‌ సర్కిల్‌ నుంచి పార్క్‌ హోటల్‌ వైఎస్సార్‌ విగ్రహం వరకూ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాసంఘాల నేతలు, పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జేఏసీ నేతలు పాల్గొన్నారు. సాయంత్రం జన సేన అధినేత పవన్‌కల్యాణ్‌ మూడు రోజుల పర్యటనకు వచ్చారు. ఆయనకు స్వాగతం పలకడానికి జన సైనికు లు, ఆయన అభి మానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. వీరంతా స్వచ్ఛందంగా వచ్చినవారు కావడంతో పోలీసులు  బెదిరించినా కదలకుండా ఆయన వచ్చిన దగ్గర నుంచి బీచ్‌ రోడ్డులో హోటల్‌కు చేరేంత వరకు ఆయనతో పాటే ఉన్నారు. ఆయన వాహనం లో టాప్‌పై నిలబడి అభిమానులకు అభివాదం చేస్తూ ర్యాలీగా తరలివెళ్లారు.   శివారు ప్రాంతాల్లోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో హ‌ఠాత్తుగా క్లాసులు రద్దు చేసి బస్సుల్లో విద్యార్థులను నగరంలోని ర్యాలీకి తీసుకువచ్చార‌న్న మాటా విన‌ప‌డుతోంది. ఇంకా నర్సింగ్‌ విద్యార్థులను ర్యాలీ ప్రారంభ వేదిక  అంబేడ్కర్‌ సెంటర్‌కు తీసుకు వచ్చారు. ఇంత చేసినా అధి కార పార్టీ నాయకుల ప్రయత్నం ఫలించలేదు. విశాఖలో శని వారం ఉదయం ఆరు గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. తొమ్మిది గంటల సమయంలో వర్షం కాసేపు విరామం ఇవ్వడంతో ఆ నగరం నలు మూలల నుంచి జనాలను గుంపులుగా తరలించారు. పది గంటల సమయానికి సుమారు గా పది వేల మంది వరకు చేర‌గానే పాత జైలు రోడ్డు మార్గం కిక్కిరిసిపోయింది. అదే పదివేలుగా భావించిన పార్టీ నాయకులు ఉద‌యం 10.30 సమయంలో పాద యాత్ర ప్రారంభించారు. ఆ సమయంలోనే చిన్నగా మళ్లీ చినుకులు ప్రారంభమయ్యాయి. సీనియర్‌ మంత్రి బొత్స సత్య నారా యణ, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్సీ వంశీకృష్ణ, మాజీ మంత్రి కురసాల కన్న బాబు, మాజీ ఎమ్మెల్యేలు పంచకర్ల, చిం తలపూడి తదితరులు ర్యాలీకి ముందుండి నడిచారు. ఆ తరువాత దశలవారీగా మేయర్‌ వెంకట హరికుమారి, మంత్రి రోజా తది తరులు రెండో బృందంగా బయలుదేరారు. ఆ తరువాత మంత్రులు బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్‌ తదితరులు, మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు, ఇంకా పలు వురు ర్యాలీలో పాల్గొన్నారు. వీరంతా పైడా కాలేజీ ముందు నుంచి సెవెన్‌ హిల్స్‌ జంక్షన్‌కు చేరి కాసింత ముందుకువెళ్లేసరికి మళ్లీ వర్షం మొదలైంది. మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని గొడుగులు వేసుకొని ఆ వర్షంలోనే ముందుకు నడిచా రు. సుమారుగా 3.5 కిలోమీటర్ల దూరం నడిచి అంతా 11.45 గంటలకల్లా ర్యాలీ ముగింపు వేదిక అయిన పార్క్‌ హోటల్‌ జంక్షన్‌ దగ్గరున్న వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఈ ర్యాలీ వల్ల ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దువ్వాడలోని విజ్ఞాన్‌ కాలేజీ నుంచి సుమారు పది బస్సుల్లో వేయి మంది విద్యార్థుల ను ఈ ర్యాలీ కోసం తీసుకువచ్చారు. వారు పార్క్‌హోటల్ వ‌ద్ద‌కు చేరుకునే సరికి సభ ముగిసిపోయింది. విశాఖ డాబాగార్డెన్స్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభమైంది. దీనికి ముందు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పా టు చేశారు. విద్యార్థులు వాటిని ఆసక్తిగా తిలకించారు. ర్యాలీ ప్రారంభమై అవన్నీ అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోగానే విద్యార్థు లు పక్కకు తప్పుకొన్నారు. అక్కడికి సమీపంలోనే ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్‌ వైపు వచ్చేశారు. వారిని తిరిగి ర్యాలీలోకి మళ్లించ డానికి నేతలు యత్నించినా ఫలితం కనిపించలేదు.  ఈ సభకు హాజరైన వారిని గమనిస్తే విశాఖ జిల్లాలో పోటీ చేసే మా పార్టీ వారికి కనీసం డిపాజిట్‌ కూడా దక్కే అవకాశాలు కనిపించడం లేదు. సేవ్‌ విశాఖ పిలుపు ప్రజల్లో బలంగా వినిపిస్తోంద‌ని వైసీపీ ఎంపీ రఘు రామ కృష్ణరాజు అన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. విశాఖ గర్జన సభ వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తే బాగుండదని భావించి జేఏసీ పేరిట ఏర్పాటు చేశారన్నారు. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి విశాఖ నగరంలో గర్జన ఫ్లెక్సీలు, హోర్డింగులను ఏర్పాటు చేశారని, జేఏసీకి అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. ఇంత ప్రచారం చేసుకున్నా సభకు కనీసం 5 వేల మంది కూడా హాజరుకాలేదని తెలి పారు. కాగా, అమరావతి రైతులు కాళ్లు కందిపోయేలా పాదయాత్ర చేస్తుంటే వారిని పెయిడ్‌ ఆర్టిస్టులని కొంతమంది నాయకులు అపహాస్యం చేయడం దారుణమని మండిపడ్డారు. విశాఖ జేఏసీ కేవలం పేరుకేనని, జేఏసీ నాయకులుగా వ్యవహ రించిన లజ పతి రాయ్‌, సాయిబాబాలు ఎవరికీ తెలియదన్నారు. విశాఖ గర్జనకు మంత్రులు రోజా, రజని, బొత్స సత్యనారా యణ, గుడివాడ అమర్నాథ్‌, అప్పలరాజు, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ స్థానిక నేతలు మాత్రమే హాజర య్యారని, ధర్మాన ప్రసాద రావు ఎందుకు హాజ రు కాలేదని ప్రశ్నించారు. విశాఖలో లేనిది ఏదీ లేదని, విశాఖకు రావల సిన అంతర్జా తీయ విమానా శ్రయం రాలేదని, స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి పెడితే డీల్‌ కుదుర్చుకున్నారని, రైల్వే జోన్‌ కోసం ప్రయత్నమే చేయలేదని విమర్శించారు. విశాఖ గర్జనకు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు, డ్వాక్రా మహిళలే హాజరయ్యారని, ఆంధ్ర వర్సి టీ విద్యా ర్థులకు బస్సులను ఏర్పాటు చేసి సభకు తరలించారని, డ్వాక్రా మహిళలను బలవంతంగా తెచ్చారని తెలిపారు. విశాఖను రాజధానిగా స్థానికుల్లో అత్యధిక శాతం మంది వ్యతిరేకించారని రఘు రామ తెలిపారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సినిమాలు మాత్రం విశాఖలో ఆడాలి కానీ విశాఖను రాజధానిగా వద్దంటారా అంటూ కొంతమంది తమ పార్టీ నేతలు ప్రశ్నించా రని, అమరావతిని రాజధానిగా, విశాఖను మహా నగరంగా అభివృద్థి చేస్తామం టే ఎవరు వద్దన్నారని ప్రశ్నించారు. కాగా, సేవ్‌ విశాఖ ఉద్యమాన్ని తీవ్రతరం చేద్దామని, రాజ ధాని అమరావతిని కాపాడు కుందామని పిలుపునిచ్చారు.

మునుగోడుతో మొదలు ముందున్నదంతా ఎన్నికల కాలమే

తెలంగాణలో మునుగోడు అసెంబ్లీ స్థానం సహా, దేశంలో మరి కొన్ని కొన్ని రాష్ట్రాలలో ఆరు అసెంబ్లీ, ఒకటి రెండు లోక్ సభ స్థానాలకు వచ్చే నెల, నవంబర్ 3 న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 6 ఓట్ల లెక్కింపు.. ఫలితాలు. ఇక ఆ తర్వాత వారం రోజులు అయినా తిరక్కుండానే, నవంబర్ 12  హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించింది. ఇక అక్కడి నుంచి వచ్చే సంవత్సరం చివరి వరకు ఎన్నికలే ఎన్నికలు. ఈ 13 - 14  నెలల కాలంలో ఒకటి రెండు కాదు, ఏకంగా 11 రాష్ట్రల శాసన సభలకు ఎన్నికలు జరుగుతాయి. అంటే మునుగోడు ఉప ఎన్నికతో మొదలవుతున్న నిరంతర ఎన్నికల ప్రవాహం వచ్చే సంవత్సరం డిసెంబర్ లో జరిగే తెలంగాణ శాసన సభ ఎనికల వరకు కొనసాగుతూనే,,ఉంటుంది.  ఇలా వరసగా అసెంబ్లీ ఎన్నికలు రావడం, భారాసగా పేరు మార్చుకుని జాతీయ పార్టీగా ఎదిగేందుకు నూతన ప్రస్థానం ప్రారంభించిన తెరాసకు శుభ సూచకంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారాస బారసాల వేళా విశేషమేమో కానీ, గులాబి కారు రెక్కలు విచ్చుకునేందుకు 11 రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికలు స్వాగతం పలుకుతున్నాయి.అయితే, భారాస అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా ? పోటీ చేస్తే అన్ని రాష్ట్రాలలో పోటీ చేస్తుందా? కొన్ని రాష్టాలకే పరిమితం అవుతుందా? అసలు పూర్తిగా పోటీకి దూరంగా ఉంటుందా ? అనేది  ఆపార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అది వేరే విషయం. అవకాశం అయితే తలుపులు తడుతోందని ఎంతవరకు ఉపయోగించుకుంటారు అనేది గులాబీ బాస్ ఇష్టమని పరిశీలకులు భావిస్తున్నారు.  తెరాస, భారాస విషయాన్ని పక్కన పెడితే, రానున్న సంవత్సరం పై చిలుకు కాలంలో జరిగే 11 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ప్రధాన జాతీయ, ప్రాంతీయ పార్టీలు అన్నింటికీ పెద్ద పరీక్షగానే, భావించవలసి ఉంటుంది. ముఖ్యంగా, ఈ సంవత్సరం చివరిలో ఎన్నికలు జరిగే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలతోపాటుగా, వచ్చే సంవత్సరం ఎన్నికలు జరిగే, కర్ణాటక, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు దేశ భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రాన్ని నిర్దేశిస్తాయని అంటున్నారు. ఇందులో రాజస్థాన్, తెలంగాణ మినహ మిగిలిన నాలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో వుంది. రాజస్థాన్ లో కాంగ్రెస్, తెలంగాణలో తెరాస అధికారంలో ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండవ రాష్ట్రం  ఛత్తీస్ గడ్ లోనూ 2023 డిసెంబర్ లో తెలంగాణతో పాటుగా ఎన్నికలు జరుగుగుతాయి.  అలాగే వచ్చే సంవత్సర కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు ఈశాన్య రాష్ట్రాలలో నాలుగు రాష్ట్ర్లాలో బీజేపీ, బీజేపీమిత్ర పక్షాల సంకీర్ణ ప్రభుత్వాలున్నాయి. ఈశాన్య రాష్ట్రాలలో త్రిపుర కీలక రాష్ట్రంగా భావిస్తున్నారు. కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న త్రిపురలో తొలిసారిగా 2018లో కమల దళం కాషాయ జెండా ఎగరేసింది. ఎన్నికలు జరిగే 11 రాష్ట్రాలలో ఏడు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ, ఉన్న రాష్ట్రాలను నిలుపుకోవడంతో పాటుగా, రాజస్థాన్, ఛత్తీస్ గడ్, తెలంగాణ  రాష్ట్రాలలో పాగా వేసేందుకు, ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. ఒక రకంగా 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగే, సెమీఫైనల్ ఎలక్షన్స్  మోడీ షా జోడీకి సవాలుగా భావిస్తున్నారు. ఒక విధంగా మోడీ హ్యాట్రిక్ అవకాశాలను సెమీఫైనల్స్ నిర్ణయిస్తాయని అంటున్నారు. ఆ విధంగానూ నెక్ట్స్ ఇయర్ ఎలక్షన్స్ కీలకం కానున్నాయి.  అలాగే  ప్రస్తుతం కేవలం రెండే రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ఈ పదకొండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజస్థాన్, చతీస్ గఢ్ రాష్ట్రాలలో అధికారాన్ని నిలుపుకోవడంతో పాటుగా, కర్ణాటక, మధ్య ప్రదేశ్, తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాలలో అధికారం అందుకోవడం కీలకం కానుందని అంటున్నారు. ఒక  విధంగా, రాహుల గాంధీ  భారత్ జోడో యాత్రకు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక పరీక్ష కాగలవని అంటున్నారు.ముఖ్యంగా గుజరాత్, హిమాచల్ తో పాటుగా 2023 ప్రధమార్దంలో ఎన్నికలు జరిగే, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం కానున్నాయని అంటున్నారు. రాహుల్ గాంధీ భాజో యాత్ర కర్ణాటకలో గట్టి ప్రభావాన్ని చూపిందని ప్రచారం జరుగతున్న నేపధ్యంలో రాహుల్  యాత్ర ఎన్నికల ఫలితాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుంది,. అనే ప్రశ్నకు కర్ణాటక ఫలితాలు సమాధానంగా నిలుస్తాయి. అంతకంటే ముఖ్యంగా కాంగ్రెస్ కు కాబోయే కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వరాష్ట్రం కర్ణాటక కావడంతో, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, ఆయన నాయకత్వానికి తొలి పరీక్ష కాగలవని అంటున్నారు. అందుకే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు అటు రాహుల్ గాంధీకి, ఇటు ఖర్గేకి కూడా సవాలు కానున్నాయని అంటున్నారు.  అదలా ఉంటే, రానున్న రోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, ముఖ్యంగా. గుజరాత్ (182), రాజస్థాన్ (200) మధ్య ప్రదేశ్,(230) కర్ణాటక (224), ఛత్తీస్ గఢ్ (60)లలో ప్రధాన పోటీ బీజేపే, కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. ఈ ఐదు రాష్ట్రాలలో కలిపి మొత్తం వందకు పైగా ( గుజరాత్ 26, రాజస్థాన్ 25, మధ్య ప్రదేశ్ 29 కర్ణాటక28, ఛత్తీస్ గఢ్ 11) లోక్ సభ స్థానాలున్నాయి.  సో.. 2023లో జరిగే వరస అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలను కూడా ప్రతిబింబిస్తాయని  చెప్పవచ్చును.

ఎమ్మెల్యేలు, మంత్రులపై నిఘా.. జగన్ తెగేదాకా లాగుతున్నారా?

వచ్చే ఎన్నికలలో 175కు 175 స్థానాల్లోనూ విజయం సాధించాలన్న పగటి కలను సాకారం చేసుకోవడానికి జగన్ నేల విడిచి సాము చేస్తున్నారా? పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకుల సహనాన్ని తెగేదాకా లాగుతున్నారా? వంధిమాగధుల ప్రశంసలతో ఆయనకు దేవతా వస్త్రాలు తొడిగారా? అంటే ఒకదాని తరువాత ఒకటిగా ఆయన పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు మదింపునకు చేస్తున్న ప్రయత్నాలు, తీసుకుంటున్న చర్యలు చూస్తుంటే ఔననక తప్పదంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే పలు మార్లు ఆయన పార్టీ నేతల పనితీరుకు కొలమానం గడపగడపకు కార్యక్రమంలో వారి పనితీరేనని చెప్పారు. వారి పని తీరును బట్టే వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ ఉంటుందా.. ఊడుతుందా అన్నది నిర్ణయిస్తాననీ చెప్పారు. ఈ విషయంలో సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేదనీ అందరినీ ఒకే గాటన కట్టేశాననీ చెప్పారు. ఇప్పుడు ఇక ఆయన మరో అడుగు ముందుకు వేసి పార్టీ ఎమ్మెల్యేలపై నిఘా పెట్టారు. పెంచారు. ఇప్పటికే పలు మార్లు హెచ్చరించినా ఎమ్మెల్యేలు, మంత్రులు పని తీరు మార్చుకోవడం లేదని ఆగ్రహంగా ఉన్న జగన్ ఇప్పుడు వారిపై నిఘా నేత్రాలను సారించారు. పీకే బృందం ఒకవైపు, ఇంటిలిజెన్స్ మరో వైపు ఎమ్మెల్యేలను అడుగడుగునా పరిశీలిస్తున్నారు. గడపగడపలో వారి పెర్ఫార్మెన్స్ పై ఎప్పటికప్పుడు జగన్ కు నవేదికలు ఇస్తున్నారు. ఇప్పటికే అది జరుగుతున్నా.. విశాఖ గర్జన వైఫల్యంతో ఈ నిఘాను మరింత పెంచారు. వచ్చే ఎన్నికలలో ఎవరికి పార్టీ టికెట్ ఇవ్వాలి, ఎవరికి మంగళం పాడాలి అన్న విషయంపై ఈ నిఘా నివేదికలనే ఆయన నమ్ముకున్నారు. దీంతో ప్రతి ఎమ్మెల్యే వెంటా ఒక ఐప్యాక్ ప్రతినిథిని పంపడానికి జగన్ నిర్ణయించుకున్నారు. ఇక ఇంటెలిజెన్స్ నిఘా ఎలాగూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రుల వెంట తిరిగే ఐ ప్యాక్ ప్రతినిథి అనుక్షణం వారి పనితీరును పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు జగన్ కు పంపుతారు. ఆ నివేదికలే సదరు ఎమ్మెల్యే, మంత్రి పని తీరుపై జగన్ ఒక అంచనాకు, తద్వారా ఒక నిర్ణయానికి రావడానికి దోహదపడుతాయి. ఐప్యాక్ ప్రతినిథులు రోజువారీ నివేదికలు, ప్రజలలో ఎమ్మెల్యేకు ఉన్న ఆదరణ, ప్రజల వద్దకు వెళుతున్నారా? ఆయన ప్రసంగాలలో ప్రభుత్వ పథకాల గురించి సమగ్రంగా వివరిస్తున్నారా? సంక్షేమ పథకాల లబ్ధిని చెబుతున్నారా? గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తున్నారా..ఇలా ఎమ్మెల్యే తన ఇంటి గడప దాటి గడప గడపకు వెళుతున్నారా లేదా నుంచి.. ప్రతి మాటకూ ముందూ వెనుకా జగన్ సంక్షేమ పథకాలను పొగుడుతున్నారా లేదా అన్న అంశాలపై ఉంటాయి. ఈ నివేదికలను ఏ రోజుకారోజు వైసీపీ కార్యాలయం విశ్లేషించి వారానికి ఒక సారి ఒక సమగ్ర నివేదికను జగన్ కు అందజేస్తుంది. ఇలా రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న 151 నియోజకవర్గాల నుంచీ కూడా జగన్ కు నివేదికలు అందుతాయి. వాటి ఆధారంగా జగన్ ఎమ్మెల్యేల పనితీరును మదింపు చేస్తారు. ఇప్పటికే జగన్ గడప గడపకు వర్క్ షాప్ లో కొందరు ఎమ్మెల్యేల పేర్లు చెప్పి మరీ వారి పని తీరు బాగాలేదనీ, మార్చుకోకుంటే చర్యలు తప్పవనీ ముఖం మీదే చెప్పేసిన సంగతి తెలిసిందే. అలా జగన్ తన అసంతృప్తిని వ్యక్తం చేసిన వారిలో మంత్రులు బొత్స సత్యనారాయణ, రోజా వంటి వారు కూడా ఉన్నారు. ఆ వర్క్ షాపులో పేర్లు చెప్పని వారి పని తీరు బాగుందని కాదని కూడా ఆ సందర్భంలో జగన్ విస్పష్టంగా చెప్పారు. ఇలా ప్రతి క్షణం, ప్రతి రోజూ నిఘా నీడలో పని చేయాల్సి రావడం చాలా ఇబ్బంది అని వైసీపీ ఎమ్మెల్యేలు తమ సన్నిహితుల దగ్గర వాపోతున్నారు. ప్రతి క్షణం శీల పరీక్షకు నిలబడి పని చేయడం తమ వల్ల కాదని ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. పార్టీ టికెట్ రాకపోతే పోయింది. ప్రతి రోజూ, ప్రతి క్షణం స్కానింగ్ కు నిలబడటం మా వల్ల కాదని కొందరు కాడి వదిలేయడాని కూడా సిద్ధపడుతున్నారని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇప్పటికే జగన్ చాలా దూరం వచ్చేశారనీ, పిల్లినైనా గదిలో తలుపులు మూసి బంధించి బెదరిస్తే తిరగబడుతుందనీ, ప్రజా ప్రతినిథుల మీద జగన్ నిఘా బూమరాంగ్ అయి మొదటికే మోసం వచ్చే పరిస్థితి తప్పదనీ రాజకీయవర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా ప్రజా ప్రతినిథుల పని తీరును చెప్పాల్సింది ప్రజలే కానీ.. నిఘా బృందాలు కాదనీ, ఇప్పుడు జగన్ ఎమ్మెల్యేల సహనాన్ని పరీక్షిస్తున్నారనీ, తెగేదాకా లాగుతున్నారనీ పరిశీలకులే కాదు, పార్టీలోని కొందరు కూడా బాహాటంగానే చెబుతున్నారు. 

మునుగోడు లో టిఆర్ఎస్ కు  షాక్‌.. మాజీ ఎంపీ బూర గుడ్ బై

పార్టీ అధినేత పార్టీ నేత‌ల‌కు అందుబాటులో ఉండాలి. వారి మాటా వినాలి. స‌ల‌హాలు విన‌క‌పోయినా ప‌ర వాలేదు. కానీ వారి అభిప్రాయాల‌కీ గౌర‌వం ఇవ్వాలి. కానీ వీటికి ఏమాత్రం ఇష్ట‌ప‌డ‌ని కేసీఆర్ త‌న పార్టీ నుంచి మాజీ ఎం.పి బూర న‌ర్స‌య్య‌గౌడ్ వెళిపోవ‌డానికి కార‌కుల‌య్యారు. ఇటీవ‌లి కాలంలో కేసీఆర్  దేశ రాజ‌కీ యాల‌మీద ఆస‌క్తి చూప‌డం, పార్టీని ఆ విధంగా బ‌లోపేతం చేయ‌డం అస‌లు పార్టీ పేరునే మార్చి కేంద్రం లో బీజేపీకి ట‌గ్గ‌ఫ‌ర్‌గా నిలిచి  అక్క‌డి రాజ‌కీయాల్లో హ‌ల్‌చ‌ల్ చేయ‌డానికి సిద్ధ‌ప‌డ‌ట‌మే ఇక్క‌డ పార్టీ ప‌రిస్థితులప‌ట్ల అనాస‌క్తి పెంచింద‌నాలి. ఉద్య‌మ‌యోధునిగా, తెలంగాణా ఆవిర్భావానికి కార‌కునిగా, తొలి ముఖ్యమంత్రిగా ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందిన కేసీఆర్ క్ర‌మేపీ ప్ర‌జ‌ల‌కంటే త‌న పార్టీ వారికే బాగా దూర‌మ య్యారన్న‌ది తెలుస్తోంది.  త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు, బీజేపీని దెబ్బ‌తీయ‌డం ప్ర‌ధాన ల‌క్ష్యంగా పావులు క‌ద‌ప‌డంలో పార్టీ మునుగోడు విజ‌యానికి ప‌టిష్టం చేయ‌డంపై ఆస‌క్తి చూపుతున్నారా అన్న ప్ర‌శ్న‌త‌లెత్త‌డానికి కేసీఆర్  స్వ‌యంగా కార‌కుల‌య్యారు. అభ్య‌ర్ధిని నిల‌బెట్టాలి గ‌నుక ఒక‌రిని ప్ర‌క‌టించ‌డం త‌ప్ప విజ‌యావ‌కాశాలు ఏ మేర‌కు ఉన్నాయ‌న్న లెక్క ప‌రిశీలించ‌డం లేదు. కార‌ణం ఆయ‌న కుటుంబం స‌మ‌స్య‌ల వ‌లయంలో చిక్కు కుంది. మ‌రీ ముఖ్యంగా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో ఆయ‌న కుమార్తె టిఆర్ ఎస్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత పేరు బ‌య‌టికి రావ‌డంతో ఆ మ‌చ్చ‌ను తొల‌గించుకునే ప‌నిలోప‌డ్డారు. రోజూ కేంద్రాన్ని, మోడీని, షానీ తిట్టు కోందే రోజు గ‌డ‌వ‌ని కేసీఆర్, ఇపుడు త‌న ప‌రువు కాపాడుకునేందుకు ఢిల్లీలోనే మ‌కాం పెట్టి ఢిల్లీ పెద్ద‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవాల‌ని చూస్తున్నారు. అయితే తిట్టిన నోటితోనే అన్నా నా కూతురుని నీవే కాపాడాలి, మా పాలిగ వెంక‌న్న‌వి, యాద‌గిరి న‌ర్సింహుడివీ అంటే ఎంత కాషాయంలో ఉన్న‌ప్ప‌టికీ మోదీ వింటారా? ప‌గ‌దీర్చుకోవ‌డానికి కేసీఆర్ స్వ‌యంగా దొరికిపోయారు. బుర‌ద‌ప‌డిన పార్టీలో ఎవ‌రు మాత్రం ఆస‌క్తితో, ఇష్టంతో ఉంటారు. ఎవ‌రి కెరీర్‌వారిది. ఎవ‌రి ఇష్టాయిష్టాలు వారివి. బూర వి అందుకు మిన‌హాయింపు కాదు. అందుక‌నే ఒక‌నాటి కేసీఆర్‌కి ఇప్ప‌టి రాటుదేలిన రాజ‌కీయ‌చ‌ద‌రంగం తెలిసిన కేసీఆర్‌కి ఎంతో వ్య‌త్యాసం గుర్తించి బూర న‌ర్సింగ్ గౌడ్ వంటి సీనియ‌ర్లు పార్టీ మార‌డానికి నిర్ణ‌యించు కున్నారు. పైగా  త‌న మాట‌ను, పిలుపుని ప‌ట్టించుకోని నాయ‌కుని ద‌గ్గ‌ర ఉండి అవ‌మానప‌డే కంటే వేరు పార్టీ పంచ‌న చేరి కాస్తంత గౌర‌వం ద‌క్కించుకోవ‌డానికి నిర్ణ‌యించుకున్నార‌నే అనుకోవాలి. ఇదేమంతగా కేసీఆర్‌కు న‌ష్టం క‌లిగించ‌క‌పోవచ్చు. కానీ హితుల‌ను దూరం చేసుకోవ‌డం భ‌విష్య‌త్తులో టీఆర్ ఎస్‌కు ఎంతో వ్య‌తిరేక ప్ర‌భా వ‌మే చూపుతుంది.  ఏ రోజు పదవి కోసం పాకులాడలేదని తెలిపారు. తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ఆకాంక్ష కొరకు మాత్రమే పోరాటం చేసినట్లు బూర చెప్పారు. తన తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కూడా అంత బాధ పడలేదన్నారు. బీసీ వర్గాల సమస్యలను కూడా చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ముఖ్యమంత్రికి సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా లేదన్నారు. ఏ పార్టీ అయినా ప్రజల సమస్యలు పరిష్కరిస్తే వారితో ఉంటానని బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. 

పిచిక‌ల‌ది, పిట్ట‌ల‌దీ గోల కాదు.. వినండి! 

సంగీతం అంద‌ర్నీ ఆక‌ట్టుకునే శ‌క్తి క‌లిగిన క‌ళ‌. అందులోనూ గాయ‌కులు మ‌రీ ప్ర‌త్యేకం.ఘంట‌సాల పాట దూరం నుంచి విన‌ప‌డ‌గానే క్ష‌ణం ఆగి వింటారు ఎవ్వ‌రైనా..వీల‌యితో ఒక‌టి రెండు చ‌ర‌ణాలు గుర్తుచేసు కుంటూ వెళ‌తారు. ల‌తామంగేష్క‌ర్‌, బాలు.. ఎవ‌రైనా స‌రే హిందీ అయినా, తెలుగయినా పాట పాటే, గాయ కుడు గాయ‌కుడే ఎవ‌రైనా అంతే గొప్ప ప్ర‌భావం చూపుతారు. మ‌నిషి మ‌న‌సు బాగోలేన‌పుడు, ఒంటరిగా ఉన్న‌పుడో ఒక్క పాట మ‌న‌సును తేలిక‌ప‌రుస్తుంది. ఇపుడు తాజాగా విదేశీ శాస్త్ర‌వేత్త‌లు కొత్త సంగ‌తి చెబు తున్నారు..కోయిల‌నే విన‌డం క‌ష్ట‌మే.. ప‌క్షుల కిల‌కిలారావాలు వింటే మ‌నసు ప్ర‌శాంత‌త పొందుతుంద‌ని. వాస్త‌వానికి ఇది మ‌న పూర్వీకుల మాటే. ప్ర‌కృతి వైద్య‌శాల‌ల్లో స‌గం మానిసిక వైద్యం ఇలానే జ‌రిగిపోతుంటుంద‌ని అంటూం టారు. అందుకే చెట్ల‌ను జీవుల‌ను ఎంతో ప్ర‌త్యేకంగా చూడాలం టారు.  ఎప్పుడయినా  మీ యింటి ప‌రిస‌రాల్లో చిల‌క‌లో, పిచిక‌లో కిల‌కిలారావం చేయ‌డం చెవొగ్గి విన్నారా? ఒక్క క్షణం.. అదీ మీ ఇంటి ఆవ‌ర‌ణ‌లో, అపార్ట్‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో చెట్లు ఉంటే, మీ కాల‌నీలో చెట్లు బాగా ఉంటే పొద్దుటే, మ‌ద్యాన్న‌మో పిచిక‌ల గోల క్ష‌ణం వినండి. చాలా బావుంటుంది. వాటి మ‌ధ్య స‌మాచార ప్ర‌వాహం ఎలా ఉంటుంద‌నేది తెలుస్తుంది. వినేకొద్దీ వినాల‌నిపిస్తుంది..అంటున్నారు జీవశాస్త్ర‌ వేత్త‌లు, ప‌ర్యావర‌ణ వేత్త‌లు. ఇంటికోసం చెట్టు కొట్టేసేట‌పుడు అదే ఆధానంగా ఉన్న పిట్ట‌లు ఏమ‌యి పోతాయ‌ న్న‌ది ఆలోచించాలి. ఎందుకంటే అవి మీకు ఎంతో మాన‌సిక ప్ర‌శాంత‌త‌నిచ్చే శ‌క్తి క‌లిగిన‌వి. అయితే ప‌ల్లెలు క్ర‌మేపీ అంత‌రించిపోతున్నాయి.. అంతా ప‌ట్ఠ‌ణ వాతావ‌ర‌ణం విస్త‌రించ‌డంలో చెట్టూ చేమ‌నీ అడ్డుగానే భావిస్తున్నారు ఈ త‌రం. పిట్ట‌లు గోల చేస్తున్న‌ట్టే ఉంటుంది. కానీ క‌ర్ణక‌ఠోరంగా అయితే ఉండ‌దు. ప‌క్షులు పాట‌లు పాడ‌వు, వాటిలో అవే మాట్లాడుకుంటూ అప్పుడ‌ పుడు కాస్తంత గొంత స‌వ‌రిస్తూంటాయి. అదీ ఒక్కటి రెండుర‌కాల ప‌క్షులే. అవి ఎలాగూ అపార్ట్‌ మెంటు ప్రాంతాల్లో క‌నిపిం చ‌వు. క‌నుక నిత్యం క‌నిపించే పిచిక‌లనే ప‌రిశీలించాలంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు.  విదేశాల్లో వీటి గురించిన ప‌రిశోధ‌న జ‌రిగింది. మాన‌సిక వ్యాధుల‌తో ఇబ్బందిప‌డుతున్న‌వారిలో చాలా మంది స‌ర్వ‌సాధార‌ణ వాతావ‌ర‌ణంలో పిట్ట‌లు, ప‌క్షులు వీల‌యినంత‌గా ఉండే తోట‌ల్లో,  చెట్లు బాగా ఉన్న ప్రాంతాల్లో వాటిని వింటూ క్ర‌మేపీ మాన‌సిక వొత్తిడికి దూర‌మ‌వుతున్నార‌న్న‌ది రుజువ‌యింద‌ట‌. ఇది చిత్ర‌మేమీ కాదు. మ‌న‌మే మ‌న‌చుట్టూ ఉన్న ప‌రిస‌రాల‌ను, ప‌రిస్థితుల‌ను ప‌ట్టించుకోమంతే. విదేశాల్లో దీన్ని గురించి ప్ర‌త్యేక ప‌రిశోధ‌నే చేశారు. దీన్నే స‌హ‌జ‌సిద్ధ చికిత్స‌గానూ పేర్కొంటున్నారు. ఒక‌వేళ అలాంటి వాతావర‌ణం లేకున్నా రికార్డు చేసిన ప‌క్షుల మాట‌ల్ని కిల‌కిల‌ల‌ను  వినిపిస్తున్నార‌ట‌. అది ఎంతో గొప్ప అనుకూల ప్ర‌భావంచూపుతోందిట‌. ఈసారి స‌మ‌యం చూసుకుని మీరు ఓ క్ష‌ణం వినండి.. అదో అద్భుతం!

ఫార్మా కంపెనీల వల్లే వ్యాధుల విస్తరణ.. మద్రాస్ హైకోర్టు వ్యాఖ్య

ఫార్మా కంపెనీలు అనైతిక కార్యక్రమాలకు కార్యకలాపాలకు పాల్పడుతున్నాయా? వైరల్ వ్యాధుల విస్తరణకు ఫార్మా కంపెనీలు చట్ట వ్యతిరేక  చర్యలే కారణమా? మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలను బట్టి ఔననే అనుకోవాల్సి వస్తోంది.  కాగా ఇటీవలి కాలంలో ప్రజలు పబ్లిక్ డొమైన్ లో గ్రామీణ,పట్టణ ప్రాంతాలలోని ప్రభుత్వ ఆసుపత్రులలో   నిరుపేద రోగులకు  కాలం చెల్లిన మందులు  పంపిణీ చ్రేస్తున్నాయంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన మద్రాస్ హైకోర్టు    కొన్నిరకాల వ్యాధుల  వ్యాప్తికి ఫార్మా కంపెనీలు ఉద్దేశపూర్వకంగా ఒక పద్దతి ప్రకారం అనైతిక చర్యలకు పాల్పడటమే కారణమా అన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది.  ఈ పిటిషన్ విచారించిన  మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి  జస్టిస్ సుబ్రహ్మణ్యం   కాలం చెల్లిన మందుల పంపిణీ, వైరస్  వ్యాధుల విస్తరణ కు ఫర్మా కంపెనీలు దోహదపడేలా వ్యవహరిస్తున్నాయా అన్న అంశంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని తమిళనాడు ఆరోగ్య శాఖ, తమిళనాడు ప్రభుత్వాలను  ఆదేశించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి    సుప్రీం కోర్టు  ఫార్మా కంపెనీలు మంద్రుల ప్రచారానికి వేల కోట్ల రూపాయలు వినియోగించడంపై చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు.  .