టీఆర్ ఎస్‌ను మునుగోడు ప్రజలు నమ్మరు..రాజగోపాల్‌రెడ్డి
posted on Oct 17, 2022 @ 10:40AM
మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలాగయినా గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని పార్టీగా టీఆర్ ఎస్ చక్రం తిప్పాలని చూస్తోంది. 2024 ఎన్నికలకు సెమీస్‌గా భావిస్తున్న మునుగోడు ఎన్నికల్లో ఎలాగయినా భారీ మెజారిటీతో గెలవాలన్న పట్టుదలను టీఆర్ ఎస్ ప్రదర్శిస్తోంది. ఈ ఆలోచనతోనే తన చుట్టూ ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులను టీఆర్ ఎస్ నేతలు పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని బీజేపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు ప్రజలు టీఆర్ ఎస్‌ను నమ్మే స్థితిలో లేరని వారికి ఈ ఎన్నికల్లో గట్టి బుద్ధి చెబుతారనీ అన్నారు.
మునుగోడు ఇపుడు బీజేపీవారికీ కీలకంగా మారింది. కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లడానికి ఎంతో ఆసక్తి చూపుతూ దూసుకుపోతున్న తరుణంలో, పార్టీ పేరు కూడా బీఆర్ ఎస్‌గా మార్చి మరీ కేంద్రం మీద విరు చు కుపడుతున్న సమయంలో వస్తున్న ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్‌కు గట్టి షాక్ ఇవ్వాలన్నదే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు కాంగ్రెస్‌నుండి తమ పార్టీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పై ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఒక సమయంలో ఆయన తప్పకుండా భారీ మెజారిటీతో గెలిచే అవ కాశా లున్నాయని ప్రచారం చేసుకుంటూ వస్తున్న బీజేపీ ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా అంత సీన్ లేదన్న అను మానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులను తమకు అనుకూలం చేసుకోవాలని ఒక వంక కాంగ్రెస్, మరో వంక టీఆర్ ఎస్ మరింత విజృంభిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి ముందే మునుగోడులో దూసుకుపోతు న్నారు.
కాగా, ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి చండూరు చౌరస్తాలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడు తూ, మునుగోడు ప్రజలను ఎన్ని ప్రలోభాలు పెట్టినా టీఆర్ ఎస్ ను నమ్మే పరిస్థితిలో లేరని, వారంతా బీజేపీ వైపే చూస్తు న్నారని అన్నారు. బీజేపీ నేతలను, కార్యకర్తలను పార్టీ మారాలని పోలీసులతో టీఆర్ ఎస్ బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. మునుగోడును దత్తత తీసు కుంటానన్న కేటీఆర్ తాను మూడేళ్లుగా అభివృద్ధికి నిధులు ఇవ్వమని అడిగితే కనీసం స్పందించ లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో పని చేస్తున్న సమయంలో పార్టీ ఫండ్ కావాలని అడిగితే కేసీఆర్, కేటీఆర్, కవితలకు తాను కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేశానన్నారు.
అభివృద్ధి అంటే సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలకే పరిమితమా? మునుగోడు నియోజక వర్గానికి నిధులు ఎందుకివ్వరని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా బీజేపికి ప్రజలు పట్టం కడుతున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. చట్టసభల్లో ప్రశ్నించే గొంతు లేకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకుని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఘనత కేసీఆర్ దేనన్నారు. పార్టీ మారితే తప్ప అభివృద్ది చేయలేరా అని ప్రశ్నించారు.