25 రోటీల ఫ‌లితం!

చింటూకి తూగు వ‌చ్చింది. ఓ క్ష‌ణం పుస్త‌కాల మీద త‌ల‌వాల్చి ప‌డుకున్నాడు. ప‌క్క‌వాడు ఏదో రాస్తున్నాడ‌నుకున్నాడు. బోర్డు మీద లెక్క వేసి చెబుతున్న టీచ‌ర్ గ‌మ‌నించి చాక్‌పీస్‌ను క్రికెట్ బంతి వేసినంత వేగంగా విసిరింది. అంతే అదొచ్చి మాడు మీద ఠ‌ప్‌మ‌ని త‌గ‌ల‌గానే చింటూ త‌ల పైకెత్తి ఎనిమిదిరెళ్ల ప‌దారు.. అన్నాడు.. ఒరే అద‌యి పోయిం ది.. లెక్క చెబుతోంది టీచ‌ర్ అ న్నాడు ప‌క్క‌వాడు.. టీచ‌ర్‌కి కోపం వ‌చ్చి తిట్టింది. చింటూ చిన్న‌బుచ్చుకున్నాడు. అక్క‌డకి క‌థ అయింది. అది నాలుగో త‌ర‌ గ‌తి క్లాసు కాబ‌ట్టి ఏదో అయి పోయింది. కానీ ఈ పోలీసాయ‌న నిద్ర‌పోయింది మాత్రం శిక్ష‌ణా కార్య‌క్ర‌మంలో! పైగా సారీ అని త‌ప్పించు కోలేదు. తాను నిద్ర‌ పోవ‌డానికి కార‌ణం చెబుతూ ఉత్త‌రం కూడా రాసిచ్చాడు అధికారికి! ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సుల్తాన్‌పూర్‌. కానిస్టేబుల్ రామ్‌ష‌రీష్ యాద‌వ్ ఈమ‌ధ్య శిక్ష‌ణాత‌ర‌గ‌తిలో క్లాస్ వింటూ చ‌క్క‌గా గుర్రుపెట్టి నిద్ర పోయాడు. క‌మాండ‌ర్‌కి కోపం వ‌చ్చింది. ఇంత నిర్ల‌క్ష్యంగా ఉంటావా, క్లాస్‌లో నిద్ర‌పోవ‌డ‌మేమిటి బుద్ధుందా అని తిట్టి మ‌రీ అవ మానించాడు. యాద‌వ్‌కి కోపం వ‌చ్చింది. క‌మాండ‌ర్ మీద కాదు.. త‌న‌కు ఆ ఉద‌యం భారీ తిండిపెట్టిన‌వాడి మీద‌. క్లాస్‌లో అలా నిద్ర‌పోవ‌డ‌మేమిటి? అపాల‌జీ చెప్ప‌మ‌ని క‌మాండ‌ర్ డిమాండ్ చేసి రుస‌రుస‌లాడుతూ వెళిపోయాడు. యాద‌వ్‌కి త‌న‌మీద త‌న కే కోపం వ‌చ్చింది. రొట్టెలు తిన‌నేల‌, తింటిపో.. అన్ని తిన‌నేల‌.. తింటిపో.. క్లాసులో గుర్రుపెట్టనేల‌.. అనుకుంటూ గ‌దికి వెళ్లాడు. వెళ్లి లెట‌ర్‌ప్యాడ్ అందుకుని అయ్యా నాకు క్లాసులో నిద్ర‌రావడానికి కార‌ణం ఇది అని రాశాడు.   సార్, న‌న్ను తిట్టారు బాగానే ఉంది. క్లాసు లో నిద్ర‌పోవ‌డం నా త‌ప్పే కానీ అందుకు కార‌ణం తిండే! క్లాసుకు వ‌చ్చే ముందు ఏకంగా 25 రోటీలు, కొద్దిగా అన్నం, కూర‌లు తిన్నాను. బ‌కాసురుడిలా అంత తినేస‌రికి సుఖంగా ఫ్యాన్ గాలికి నిద్ర రాక ఛ‌స్తుం దా సార్‌.. నాది బ‌ద్ధ‌కంకాదు, భుక్తాయాసంలో తూలాను అంతే. ఈసారికి కాసుకో దొరా! అని హిందీలో రాసి ఇచ్చాడు.   క‌మాండ‌ర్‌కి ఆ ఉత్త‌రం అందింది. ఆయ‌న కోపగించుకోలేదు.. న‌వ్వుకున్నాడు. వీడు సిన్సియ‌రే..అని. కానీ పైకి కాస్తంత కోపం ప్ర‌ద‌ర్శించి ఇక ముందు ఇలా క్లాసులో గుర్రుపెట్ట‌కు అని సున్నితంగా మంద‌లించి బురుగు మీసాలు దువ్వుకుంటూ వెళ్లాడు.  

అంతా అమ్మ‌ద‌య ...ఖ‌ర్గే

కాంగ్రెస్ పార్టీకి ఇన్నాళ్ల సేవను గుర్తించి పార్టీ అధ్య‌క్ష‌ప‌ద‌విని క‌ట్టబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ  కొత్త  అద్య క్షునిగా ఎన్నిక‌యిన మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే పార్టీ అధినేత సోనియాగాంధీకి, రాహుల్ గాంధీకి కృత‌జ్క్ష‌త‌లు చెప్పారు. ఆమె నాయ‌క‌త్వంలో కేంద్రంలో రెండు ప‌ర్యాయాలు అధికారంలోకి వ‌చ్చామ‌ని అన్నారు. రాజ్య‌స‌భ ఎంపీగా పార్టీ త‌ర‌ఫున స‌భ‌లో గ‌ళం వినిపించిన ఖ‌ర్గే పార్టీ అద్య‌క్ష‌ప‌ద‌వి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వెంట‌నే మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నిక‌ల అధారిటీ చైర్మ‌న్ మ‌ధుసూద‌న మిస్త్రీ ఖ‌ర్గేను  విజేత గా ప్ర‌క‌టించారు.  పార్టీ అధ్య‌క్ష‌ప‌ద‌వికి జ‌రిగిన ఎన్నిక‌లో  మొత్తం 9,385 ఓట్లు ప‌డ‌గా, ఆయ‌న‌కు 7,897 ఓట్లు, థ‌రూర్‌కి 1,072 ఓట్లు వ‌చ్చాయ‌న్నారు. 416 ఓట్లు చెల్లలేదు.  అధ్యక్షునిగా ఈ నెల 26వ తేదీన పూర్తి బాధ్య‌త‌లు స్వీక రిస్తారు. ప్ర‌స్తు తం భార‌త్ జోడో యాత్ర‌లో ఉన్న పార్టీ యువ నేత రాహుల్ గాంధీ ఖ‌ర్గే కు శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌న‌తో  పార్టీ ప‌ద‌వికి  పోటీప‌డిన శ‌శి థ‌రూర్‌ని క‌లిసి పార్టీని విజ‌య‌ప‌థంలోకి తీసికెళ్ల‌డానికి అనేక అంశాల‌ను చ‌ర్చిం చాన‌ని ఖ‌ర్గే అన్నారు.  పార్టీ కార్య క‌ర్త‌లుగా అంద‌రం క‌లిసి ప‌నిచేయాల‌ని, పార్టీలో ఎవ‌రు పెద్ద‌, చిన్నాలేర‌న్నారు. అంద‌రం ఐక మ‌త్యం తో దేశంలో మ‌త‌మౌఢ్యంతో రెచ్చిపోతున్న శ‌క్తుల‌ను అడ్డుకోవాల‌న్నారు.  ఈనెల 17వ తేదీన అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరిగింది. పోలింగ్ అనంతరం ఆయా రాష్ట్రాల నుంచి బ్యా లెట్ పెట్టెలను న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. బుధవారం ఉదయం 11 గంట లకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన పోలింగ్‌లో అక్రమాలు జరిగాయని శశి థరూర్ వర్గం ఆరోపించింది. కాంగ్రెస్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ దృష్టికి ఈ విషయం తీసుకు వెళ్లింది. లక్నోలో లేని డెలిగేట్ల ఓట్లు పోలయ్యాయని, యూపీ నుంచి పోలైన అన్ని ఓట్ల ను చెల్లనివిగా పరిగణించాలని కోరింది. 

పవన్ కు బీజేపీ నుంచి పిలుపు.. పవన్ వ్యాఖ్యలతో కమలంలో కుదుపు

మంగళగిరిలో మంగళవారం జరిగిన జనసేన కార్యకర్తల సదస్సులో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో ఒక్కసారిగా ప్రకంపనలు పుట్టించాయి. మిత్రపక్షమైనా బీజేపీతో కలిసి నడవడానికి రాష్ట్రంలో ఆ పార్టీ  నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు పెద్ద అవరోధంగా మారిందని పవన్ కల్యాణ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ హై కమాండ్ లో కదలిక వచ్చింది. వెంటనే స్పందించింది. జనసేనాని పవన్ కల్యాణ్ ను హస్తిన రావాల్సిందిగా బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింద. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అయితే మంగళవారంమే పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సోము వీర్రాజు తన అధిష్టానానికి ఏమి వివరణ ఇచ్చారో.. ఏమో గానీ.. బుధవారం మధ్యాహ్నానికల్లా సీన్ మారిపోయింది. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ ను ఢిల్లీ రావాల్సిందిగా బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చిందని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ‘నేను వ్యూహాలు మార్చుకోవాల్సి వచ్చింది. ఇకపై ఏపీలో కొత్త రాజకీయ ముఖచిత్రం చూస్తారు’ అంటూ జనసేన నేతలు, కార్యకర్తల సమావేశంలో పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బీజేపీని రోడ్ మ్యాప్ ఇవ్వమని అడిగి నెలలు గడుస్తున్నా ఆ పార్టీ పట్టించుకోకపోవడంతో సమయం గడిచిపోతోందంటూ పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేయడమే బీజేపీ వర్గాల్లో కంగారుకు కారణమై ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.  దానికి తోడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్ కు వెళ్లి సుమారు గంట సేపు ప్రైవేటుగా చర్చలు జరపడం కూడా బీజేపీలో కంగారు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ మీద, మోడీ మీద తనకు గౌరవం ఉందంటూనే   ‘అలా అని చెప్పి నా స్థాయిని చంపుకోలేను.. ఊడిగం చేయలేను’ అంటూ పవన్ కల్యాణ్ చేసిన ఘాటు వ్యాఖ్యలు కమలం పెద్దలను ఇరుకున పెట్టాయని పరిశీలకులు అంటున్నారు.  వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తమతో కలిసి నడుస్తారని ఇప్పటి దాకా   బీజేపీ నేతలు భావిస్తూ వచ్చారు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ వ్యూహాలు మార్చుకుంటున్నట్లు ప్రకటించడంతో కమలం పార్టీకి గాలి ఆడని పరిస్థితి ఎదురైందని అంటున్నారు. నిజానికి బీజేపీ- జనసేన మధ్య 2019 ఎన్నికల తరువాత నుంచీ పొత్తు ఉంది. అయితే  చాలా కాలంగా పవన్ కళ్యాణ్ ను బీజేపీ అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు. జనసేనతో తాము పొత్తులోనే ఉన్నాయని బీజేపీ రాష్ట్ర నాయకత్వం అప్పుడప్పుడూ చెబుతున్నా కొంతకాలంగా ఆ రెండు పార్టీలు కలిసి ఎలాంటి ఉద్యమం కానీ కార్యక్రమం కానీ నిర్వహించలేదు. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ పర్యటించకుండా పోలీసులు అడ్డుకోవడంతో పాటు రెండు రోజులు ఆయన బసచేసిన హొటల్ నుంచి బయటకు రానివ్వకుండా నిర్బంధించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గత ఆదివారంనాడు విజయవాడకు తిరిగివచ్చి ‘ఇక్కడే తేల్చుకుంటా’ అని చెప్పడం.. మంగళగిరి ఆఫీసులో తమ పార్టీ నేతలు, శ్రేణుల సమావేశంలో ఆవేశపూరితంగా మాట్లాడారు. విశాఖ ఘటన తర్వాత బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు పవన్ కళ్యాణ్ ను పరామర్శించి, మద్దతు తెలిపినప్పటికీ తనకు బీజేపీ పూర్తి మద్దతు ఇచ్చిన దాఖలాలు పవన్ కళ్యాణ్ కు కనిపించలేదు. మరో పక్కన విశాఖ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అందరి కంటే ముందుగా స్పందిచి పవన్ కు సంఘీభావం ప్రకటిస్తూ ట్వీట్ చేయడం..  మంగళగిరి సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించిన కొద్ది సేపటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు వెళ్లి పవన్ కు కలసి సంఘీభావం తెలపడంతో   బీజేపీ నేతల్లో కంగారు మొదలైనట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి రావాలని పవన్ కళ్యాణ్ కు బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చిందని అంచనా వేస్తున్నారు.  పవన్ కల్యాణ్ విషయంలో బీజేపీ అధిష్టానం వైఖరిపై ఆ పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తో సఖ్యత విషయంలో ఏపీ బీజేపీ నాయకత్వం విఫలమైందని బాంబు పేల్చడం గమనార్హం. పవన్ తో సమన్వయం చేసుకోవడంలో సోము వీర్రాజు దారుణంగా విఫలమయ్యారని తన మనసులో మాటను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. బీజేపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ ను లైట్ తీసుకోవడం, రాష్ట్ర నాయకత్వం కూడా పవన్ కు అంతగా ప్రాముఖ్యం ఇవ్వకపోవడం వల్లే జనసేనకు బీజేపీ దూరమయ్యే పరిస్థితి వచ్చిందని కన్నా లక్ష్మీనారాయణ విస్పష్టంగా తేల్చి చెప్పడంతో.. జనసేనతో మైత్రిని కొనసాగించడంలో బీజేపీ నేతల ఉదాశీనతపై కమలం పార్టీలో ఇంత వరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు కమలంలో సెగలు పుట్టించాయి. ఏపీలో బీజేపీ పరిస్థితి ఇంత దయనీయంగా మారడానికి, చివరికి రాష్ట్రంలో పార్టీకి ఉన్న ఏకైక మిత్రపక్షం కూడా దూరమవ్వడానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరే కారణమని కన్నా కుండబద్దలు కొట్టారు. అసలు రాష్ట్ర పార్టీలో ఏం జరుగుతోందో తమకెవరికీ తెలియడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర పార్టీ అంటే తానొక్కడినే అన్న భావంతో సోము వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.  అసలు సమస్య అంతా సోము వీర్రాజు వల్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోము వీర్రాజు వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ అసంతృప్తి సెగలు హస్తినను కూడా తాకడంతోనే పవన్ కల్యాణ్ కు బీజేపీ హై కమాండ్ నుంచి ఆహ్వానం వచ్చిందని అంటున్నారు.  

వైసీపీని బంగాళాఖాతంలో కలిపేద్దాం.. చంద్ర నిప్పులు

జగన్ భయపడి 2024లో గాని, ముందు ఎన్నికలు జరిపినా, వైసిపిని ప్రజలను భూస్థాపితం చేస్తా రు, మోటార్లకు మీటర్లు పెట్టి రైతులకు ఉరితాళ్లు వేస్తున్నాడు. తెలంగాణ మీటర్లు పెట్టడం లేదు. ఎక్కడా లేని ఈ అతితెలివి నీకే ఎందుకు వచ్చింది జగన్, ఈ అతి తెలివి పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపాలని టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు పిలుపునిచ్చారు. నాలుగేళ్లుగా రాష్ట్రం లో ఒక్కరికి ఉద్యోగం రాలేదు. నా జీవితంలో దాపరికం లేదు, అందుకే అన్ స్టాపబుల్ లో అన్ని వివరిం చాను,  రాష్ట్రాన్ని నెంబర్ 1 చేసేవరకు విశ్రమించనన్నారు. జగన్ పాలనలో బిసిలు, ఎస్సిలు, ముస్లింలు సహా అందరూ దెబ్బతిన్నారు. ప్రజల అప్పులు పెరిగాయి, ఆదాయం పెరగలేదు అప్పులు పెంచే ప్రభుత్వం మనకు అవసరమా రాష్ట్రాన్ని కాపాడుకుందాం...అందరూ సహక రించాలని కోరుతున్నా న‌న్నారు. అస‌త్యాలు చెప్ప‌డంలో జ‌గ‌న్ దిట్ట‌, రైతుల‌ను ఆదుకోవాల‌న్న ఆలోచ‌న ఆయ‌న‌కు లేనే లేద‌ని టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయ‌కుడు ఎద్దేవా చేశారు. ప‌ల్నాడు జిల్లా చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం నాదెండ్ల గ్రామంలో ప్ర‌తిపంట రైతుల‌ను బాబు క‌లిసి వారి క‌ష్టాలు విన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, భారీ వర్షాలకు ప్రత్తి, మిరప రైతులు తీవ్రంగా నష్టపోయారు. పల్నాడు జిల్లాలో2.52 లక్షల ఎకరాల్లో ప్రత్తి, 1.50 లక్షల ఎకరాల్లో మిరప పంటల సాగు ఉంది. మిరప, ప్రత్తి పంటలకు ఇప్పటికే ఎకరా నికి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టారు.తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న ముఖ్యమంత్రికి ఈ పంట నష్టం పట్టడం లేదా అన్నారు. రైతాంగానికి అంత ఇచ్చాం,ఇంత ఇచ్చాం అంటూ ప్ర‌చారం చేసుకోవ‌డ‌మే త‌ప్ప వాస్త‌వానికి రైతుల‌ను ఆదుకోవ‌డానికి జ‌గ‌న్ ఏమీ చేయ‌లేద‌ న్నారు. రైతుల‌కు ఇంత న‌ష్టం జ‌రిగితే అధికారులుగాని, ఎమ్మెల్యేగానీ రాలేద‌ని, రైతుల‌కు మేలు చేసే సీఎం రావాల‌న్నారు. అస‌లు రైతుల‌కు ఏమి ఇచ్చారో ప్ర‌తిగ్రామంలో బోర్డు పెట్టాల‌ని రైతుల‌కు క‌ట్టాల్సిన పంట‌ల భీమా డ‌బ్బులు కూడా క‌ట్ట‌ని ప్ర‌భుత్వం ఇది అంటూ బాబు మండి ప‌డ్డారు.    జ‌గ‌న్ ఎక్క‌డ కాలుపెడితే అక్క‌డ మ‌టాష్‌, ఆయ‌న సీఎం అయిన త‌ర్వాత గుంటూరు జిల్లాలో ఆత్మ‌హ‌త్య లు పెరిగాయ‌ని, ఆయ‌న పాల‌న‌లో మూడువేల‌మంది రైతులు ఆత్మ‌హత్య చేసుకున్నార‌ని, ఈ విష‌యం లో మాత్రం రాష్ట్రం మూడో స్థానంలో ఉంద‌ని బాబు అన్నారు. దేశంలోనే ఎక్కువ అప్పు ఉండే రైతులు మన రాష్ట్ర రైతులే. రైతులపై తలసరి అప్పు 2.45 లక్షలు గా ఉందన్నారు.  మన మీద కేసులు పెడితే ఏమవుతుంది. పవన్ కళ్యాన్ పార్టీ వారి పైనా కేసులు పెట్టారు. అందుకే నేను వెళ్లి సంఘీభావం తెలియజేశాను. మాపై కేసులు పెట్టడంపై పెట్టే శ్రద్ద రైతులను ఆదుకోవడంపై పెట్టాలి గత ఏడాది మిర్చికి తామర పురుగువచ్చి పంట పోతే ఒక్కరైనా వచ్చి చూశారా, జగన్ రెడ్డి పాలన వల్ల రైతులు అంతా నాశనం అయ్యారన్నారు.  భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి ఎకరా పత్తికి 30 వేలు, ప్రతి ఎకరా మిరపకు 50 వేల పరిహారం ఇవ్వాలి. మైక్రో ఇరిగేషన్ ద్వారా 90శాతం సబ్సిడీ ఇచ్చిన ఘనత టిడిపి దే. టిడిపి హయాంలో 60 వేల కోట్లు ఇరి గేషన్ పై ఖర్చు పెడితే, ఇప్పుడు పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. జగన్ ఎక్కడ నుంచి వచ్చాడని, రైతు కుటుంబం నుంచి రాలేదా,  అమరావతి రైతులను హేళన చేస్తా రా....కార్లు, బంగారం అని హేళన చేస్తారా అని చంద్ర‌బాబు ఆగ్ర‌హించారు.  పవన్ కళ్యాణ్ విశాఖ పట్నం వెళ్లే హక్కులేదా అని ప్ర‌శ్నించారు. మీ దోపిడీ, కబ్జాలు బయటపడ తాయనే  పవన్ను అడ్డుకున్నారా అని బాబు ఎద్దేవా చేశారు. జగన్ మోహన్ రెడ్డి సైకో అనుకుం టే...ఆయన కొత్త సైకోలను తయారు చేస్తున్నారని, అమరావతి కి వెళ్లేటప్పుడు నా కాన్వాయ్ పై దాడి చేస్తే ప్రజాస్వామ్యం అనడం దారుణ‌మ‌న్నారు. పవన్ రాజకీయ పార్టీ వేరే కావచ్చు, కానీ ప్రజాస్వామ్యం కోసం వెళ్లి తాను మద్ద తు ఇచ్చాన‌న్నారు.రాజకీయ పార్టీలకే దిక్కులేకపోతే, ఇక ప్రజల సంగతి ఏంటని, త‌ప్పుడు ఆరోపణ లకు సిఎం సమాధానం చెప్పాల‌న్నారు. టిడిపి కార్యాలయంపై దాడి చేసి ఏడాది దాటినా ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి  చర్యలు లేవు, దీనికి  డిజిపి సమాధానం చెప్పగలరా అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. తాటాకు చప్పుళ్లకు, అక్రమ కేసులకు, దాడు లకు తాను భయపడనన్నారు. వివేకా హత్య జరిగితే నారా సుర రక్త చరిత్ర అన్నారు. నాడు వివేకా హత్యపై జగన్ సిబిఐ దర్యాప్తు కావాలి అన్నారు...తరువాత సిఎం అయ్యాక సిబిఐ దర్యాప్తు వద్దు అన్నారు. కన్న కూతురుగా తండ్రి హత్యపై పోరాడుతున్న సునీతను అభినందించాలని, సిబిఐ దర్యా ప్తు చేస్తుంటే వారిపైనే కేసులు పెట్ట‌డం ఎక్క‌డ‌యినా ఉంటుందా అని బాబు ప్ర‌శ్నించారు. 

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌..రోహిత్‌, కోహ్లీల‌కు పెద్ద ప‌రీక్ష‌!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఈసారి ఆస్ట్రేలియాలో ఆరంభ‌మ‌యింది. ఈ 8వ ఎడిష‌న్ ఎవ‌రు విజేత అవుతారు, క‌ప్ కొడ‌తారన్న చ‌ర్చ ఆరంభ‌మ‌యిన‌పుడు భార‌త్‌కే చాలా అవ కాశాలున్నాయ‌నే అందరూ అన్నారు. 2007 లో ధోనీ నాయ‌క‌త్వంలో టీమ్ ఇండియా క‌ప్ గెలిచింది. మ‌రి ఈ ఏడాది అంతే స్థాయిలో విజ‌యం సాధించేందుకు శ‌ర్మ నాయ‌క‌త్వ ప‌టిమ ప్ర‌ద‌ర్శించాలి. ఎందు కం టే మ‌న దాయాదులు పాకిస్తాన్ చెప్పుకోద‌గ్గ స్థాయిలో టోర్నీలో నిలిచే అవ‌కాశాలు లేవ‌న్న ప్ర‌చారం ఇప్ప టికే ఉంది.  ఈమ‌ధ్య ఆసీస్ తో త‌ల‌ప‌డిన సీరీస్‌ను 2-1 తేడాతో  గెలిచి క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో అత్యధిక టీ 20 మ్యాచ్‌లు గెలిచిన‌ దాయాదుల రికార్డును అధిగ‌మించిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్‌లో జ‌రిగిన చివ‌రి మ్యాచ్‌లో విజ‌యంతో టీ 20 లో 21 విజ‌యాలు సాధించిన‌ట్ల‌యింది. పాకిస్తాన్ 2021లో 21 మ్యాచ్‌లు గెలిచింది. కాగా 2022లో ఇంత‌వ‌ర‌కూ భార‌త్  ప‌ది వివిధ జ‌ట్ల‌తో 32 టీ20లు ఆడింది. వాటిలో 23 గెలవ‌గా 8 ఓడిపోయింది. ఒక మ్యాచ్ ఫ‌లితం తేల‌లేదు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో వెస్టిండీస్‌తో త‌ల‌ప‌డిన సిరీస్‌ను 3-0 తేడాతో భార‌త్ కైవ‌సం చేసుకుంది. త‌ర్వాత లంక‌తో త‌ల‌ప‌డిన సిరీస్ కూడా అలానే సాధించింది స‌త్తా చాటి, ఆ విజ‌య‌ప‌రంప‌ర అలా కొన‌సాగి స్తోంది. కానీ ఆసియాక‌ప్‌లో మాత్రం జ‌ట్టులో కొన్ని లోపాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. పాకిస్తాన్‌తో త‌ల‌ప‌డిన తొలి మ్యాచ్ లో గొప్ప‌గా ఆడ‌క‌పోయినా గెలిచింది. కానీ సూప‌ర్ ఫోర్ స్థాయిలో పాక్ చేతిలోనే ఓడిపోయింది. దీంతో ఫైన‌ల్ అవ‌కాశాలూ దెబ్బ‌తిన్నాయి. శ్రీ‌లంక కూడా భార‌త్‌ను ఓడించింది. చిత్ర‌మేమంటే పాకిస్తాన్‌ని కూడా చిత్తు చేసి శ్రీ‌లంక విజేత‌గా ఇంటికి వెళ్ల‌డం! దీని త‌ర్వాత ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా ల‌తో త‌ల‌ప‌డిన సిరీస్‌ల‌ను 2-1 తేడాతో గెలిచి జ‌ట్టు బ‌లం వీగిపోలేద‌ని నిరూపించింది.  అయితే భార‌త్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి కార‌ణంగా ప్ర‌పంచ‌క‌ప్ కి దూరం కావ‌డం జ‌ట్టును దెబ్బ‌తీస్తుంది. అత‌ని స్థానాన్ని భ‌ర్తీ చేయ‌డానికి మ‌రో మంచి పేస‌ర్ వ‌చ్చిన‌ప్ప‌టికీ అత‌ని లోటు మాత్రం క‌న‌ప‌డుతుంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కి అత‌నంటే బాగా న‌మ్మ‌కం కూడా. అంతే గాకుండా, చివ‌రి ఓవ‌ర్ల‌లో ధాటిగా ప్ర‌త్య‌ర్ధిని ఇబ్బందిపెట్ట‌గ‌లిగే బౌల‌ర్ అత‌నికి క‌ర‌వ‌య్యాడు. మ‌రీ ముఖ్యంగా ఫీల్డింగ్‌లో చిరుత లాంటి ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర‌జ‌డేజా లోటు మాత్రం ప్ర‌పంచ‌క‌ప్‌లో స్ప‌ష్ట‌మ‌ వుతుంది. ప్ర‌త్య‌ర్ధి జ‌ట్ల‌కు కూడా అత‌ని స‌త్తా తెలుసు.  2007 త‌ర్వాత ప్రపంచ‌క‌ప్‌ను అందుకోని భార‌త్ గ‌త టోర్నీలో సెమీస్ కూడా చేరుకోలేక‌పోయింది. ఈ ప‌ర్యాయం భార‌త్ ఉన్న గ్రూప్‌లో పాకిస్తాన్‌, ద‌క్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఉన్నాయి. అందువ‌ల్ల ఆరంభం నుంచే గ‌ట్టి పోటీని టీమ్ ఇండియా ఎదుర్కొ నుంది. మ‌రి కెప్టెన్ రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వ ప‌టిమ ఇపుడు తెలుస్తుంది. పాకిస్తాన్ ఎలాగ‌యినా భార‌త్‌ను టీ 20ల జోరును అడ్డుకో వాల‌న్న‌ ప‌ట్టుద‌ల‌తోనే ఉంది. జ‌ట్టులో కింగ్ కోహ్లీ , రోహిత్ శ‌ర్మ‌, కెఎల్ రాహుల్ మ‌ళ్లీ త‌మ పాత గొప్ప ఫామ్‌లోకి తిరిగి రావ‌డం కూడా పాక్‌, ద‌క్షిణాఫ్రికాల‌ను కంగారుపెడుతోంది. 

కేసీఆర్ హస్తిన వెళ్లారు.. వచ్చారు.. అంతే.. ఇంకేం లేదు!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. దాదాపు పది రోజుల పాటు హస్తినలో బస చేసిన ఆయన అక్కడ ఏం చేశారన్నది ఆయన పర్యటన ముగిసి తిరుగు పయనమైనా ఇంకా రహస్యంగానే ఉంది. ఇన్ని రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలో ఏం చేశారు అన్న విషయంపై రాజకీయ వర్గాలలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. జాతీయ పార్టీ ప్రకటన తరువాత తొలిసారిగా హస్తిన వెళ్లిన కేసీఆర్ తన జాతీయ రాజకీయ జెండా అజెండాను నేషనల్ మీడియాకు వివరిస్తారనీ, వివిధ రాజకీయ పార్టీల నేతలతోనూ, ప్రజా సంఘాల నాయకులతోనూ, ఇతర వర్గాల ప్రముఖులతోనూ జాతీయ రాజకీయాల గురించి చర్చిస్తారనీ అంతా భావించారు. అయితే ఆయన పది రోజుల హస్తినలో బస చేసినా ఎవరినీ కలిసిన దాఖలాలు లేవు. కనీసం మీడియాతో కూడా మాట్లాడలేదు. అన్నిటికీ మించి డిల్లీ లిక్కర్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమార్తె కవిత, మరో బంధువు సంతోష్ లను వెంటబెట్టుకుని ఆయన ఢిల్లీ వెళ్లడంతో తెరచాటు మంత్రాంగం నెరిపి వారిని ఆ కేసు నుంచి బయటపడేసేందుకు లాబీయింగ్ చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా రాజకీయ వర్గాలలో వ్యక్తమయ్యాయి. అయితే వీటిని వేటినీ కేసీఆర్ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ పది రోజులూ కూడా ఆయన హస్తినలో దాదాపు అజ్ణాతవాసంలో ఉన్నట్లే గడిపారు. మధ్యలో ఒక సారి సీఎస్ ను, మరో సారి ఇన్ఫర్మేషన్ కమిషనర్ ను పిలిపించుకున్నారు. అలాగే పార్టీ వర్గాల నుంచి కేసీఆర్ స్వల్ప అస్వస్థతతో ఉన్నారనీ, అందుకే ఎవరినీ కలవడం లేదనీ ఒక ప్రకటన జారీ చేశారు. అంతే.. అంతకు మించి కేసీఆర్ హస్తినలో బసకు సంబంధించి ఎటువంటి వివరాలూ తెలియరాలేదు.  దీంతో సామాజిక మాధ్యమంలో నెటిజన్లు కేసీఆర్ హస్తినలో ఏం చేస్తున్నట్లో అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. రాజకీయ వర్గాలలో కూడా పలు విధాల కేసీఆర్ మౌనంపై చర్చోప చర్చలు జరిగాయి. చివరకు ఆయన హస్తిన పర్యటన ముగించుకుని బుధవారం(అక్టోబర్ 19) హైదరాబాద్ చేరుకున్నట్లు ఆయన పీఆర్వో హజారీ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో కేసీఆర్ హస్తిన వెళ్లారు... పది రోజులు బస చేశారు.. తిరిగి వచ్చారు అంతే. చెప్పుకోవడానికి ఇంకే లేదు. దీంతో రాజకీయ వర్గాలలో కేసీఆర్ హస్తిన పర్యటనపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి.

రాష్ట్ర రాజకీయాల నుంచి కవితను తప్పించినట్లేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన కుమార్తె కవితను రాష్ట్ర రాజకీయాల నుంచి దూరం పెడుతున్నారా? అందుకు అవసరమైన రంగం సిద్ధం చేసేశారా? అంటే తెరాస వర్గాలు ఔననే అంటున్నాయి. ఆమెను బీఆర్ఎస్ జాతీయ అంతర్జాతీయ మీడియా కోఆర్డినేటర్ ఢిల్లీకే పరిమితమౌతారని తెరాస వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇటీవల తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు ప్రపంచ గ్రీన్ సిటీ అవార్డు లభించిన నేపథ్యంలో దాదాపు 300 కోట్ల రూపాయల వ్యయంతో జాతీయ మీడియాకే కాకుండా అంతర్జాతీయ మీడియాకు కూడా అడ్వర్టైజ్ మెంట్లు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందు కోసం ఢిల్లీలో ఆయన బస చేసిన సమయంలోనే కవితను ఆ వ్యవహారాలన్నీ సమన్వయం చేయాల్సిందిగా ఆదేశాంచారని చెబుతున్నారు. ఇందుకోసమే  ఇన్ఫర్మేషన్ కమిషనర్ అరవింద్ కుమార్ ను ప్రత్యేకంగా ఢిల్లీ పిలిపించుకున్నట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్పు చేస్తూ జాతీయ పార్టీగా ప్రకటించిన అనంతరం హైదరాబాద్ కు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వచ్చిన సందర్భాన్ని పూర్తిగా ఉపయోగించుకుని దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా పెద్ద  ఎత్తున ప్రచారం చేసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. దక్షిణ కొరియాలోని జెజులో జరిగిన ఏఐపిహెచ్‌ 2022 వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ 2022లో హైదరాబాద్ మొత్తం 'వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ 2022, లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ విభాగంలో మరొకటి గెలుచు కుంది. దేశం మొత్తంలో ఈ పురస్కారాలకు ఎంపిక అయిన ఏకైక ఇండియన్ సిటీ హైదరాబాద్ మాత్రమే కావడం గమనార్హం. దేశంలోని నగరాలన్నిటినీ తోసి రాజని అంతర్జాతీయ అవార్డునకు హైదరాబాద్ ఎంపిక కావడం రాష్ట్ర పురోగతి, ప్రగతి పట్ల తెరస ప్రభుత్వం చూపిన శ్రద్ధ, కృషి ఉన్నాయని కేసీఆర్ చెబుతున్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని, రాష్ట్ర రాజధానిని అగ్రభాగంలో నిలబెట్టిన తన పాలనా దక్షతకు ఈ అవార్డులే నిదర్శనమని చెబుతున్న కేసీఆర్.. ఆ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. కేవలం జాతీయ మీడియాలోనే కాకుండా అంతర్జాతీయ మీడియాలో కూడా తెలంగాణ ఘనతను చాటాలని నిర్ణయించారు. ఇందు కోసం భారీ ఎత్తున ప్రకటనలు విడుదల చేయాలని నిర్ణయించారని విశ్వసనీయ సమాచారం. దేశంలోని అన్ని నగరాల కంటే అత్యద్బుతంగా అభివృద్ధి చెందిన నగరంగా హైదరాబాద్ ఖ్యాతిని ప్రచారం చేయడం ద్వారా తన ప్రభుత్వ పని తీరును విశ్వవ్యాప్తం చేసుకునే ఉద్దేశంతో ఆయన ఉన్నారని అంటున్నారు. అలాగే జాతీయ అంతర్జాతీయ మీడియా సమన్వయ కర్తగా తన కుమార్తె కవిత  హస్తినకు పరిమితం  చేయడం ద్వారా లిక్కర్ స్కాం ప్రకంపనలు జాతీయ పార్టీపై ప్రబావం చూపకుండా జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు. అలాగే రాష్ట్ర రాజకీయాల నుంచి కవితను దూరం పెట్టడం ద్వారా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆమెపై వచ్చిన ఆరోపణల ప్రభావం ఇక్కడ ప్రతిఫలించకుండా  ఉండేందుకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెరాస వర్గాలే చెబుతున్నాయి.  

ఆనందాన్నిచ్చే శ్ర‌మ‌!

పిల్ల‌ల‌తో వాళ్ల ఆట‌లు ఆడుతూండు, వాళ్ల ప‌క్క‌నే కూచుని చ‌దువుతూంటే గ‌మ‌నిస్తూండు నీ బాల్యం గుర్తొస్తుంది.. అదో ఆనందం, గొప్ప శ‌క్తినిస్తుందంటాడు పిల్ల‌ల ర‌చ‌యిత లివింగ్‌స్ట‌న్‌. అదేమోగాని, పిల్ల‌ల చ‌దువు అనగానే త‌ల్లిదండ్రుల‌కు కూడా పెద్ద ప‌రీక్ష‌ల‌తో సమానం. పెద్ద చ‌దువుల‌కు వెళ్లే కొద్దీ వాళ్ల‌తో పాటు చ‌దివినంత ప‌ని అవుతుంది. ద‌గ్గ‌రుండి హోమ్‌వ‌ర్క్ చేయించ‌డంతో ఆరంభ‌మై వాళ్ల‌కి పోటీ ప‌రీక్ష‌ల‌కు పుస్త‌కాలు తేవ‌డం, వీల‌యితే ఒక‌టి రెండు స‌బ్జెక్టులు కాస్తంత తెలుసుకోవ‌డం త‌ల్లిదం డ్రుల వంతే అవు తోంది. ఇపుడు రాకేష్ ప‌రిస్థితి ఇదే. అభిజిత్ అనే ఉద్యోగి ఆమ‌ధ్య ఉబ‌ర్ క్యాబ్ బుక్ చేసుకుని ఆఫీస్‌కి బ‌య‌లుదేరాడు. ఆ  క్యాబ్ డ్రైవ‌ర్ రా కేష్ త‌న ఫోన్ లో అప్ప‌టివ‌ర‌కూ చూస్తున్న యూట్యూబ్ బంద్ చేశాడు. ఆ ఉద్యోగి ఏం చూస్తున్నావ్‌, చ‌దువుతున్నావ‌ని అడిగాడు. ఈ చాన‌ల్లో క‌రెంట్ అఫైర్స్‌, ఆర్ధిక‌శాస్త్రం సంబంధించిన అంశాలు చ‌దు వుతున్నానన్నాడు. అభిషేక్‌కి మ‌తి పోయింది. క్యాబ్ డ్రైవ‌ర్‌కి వాటితో అవ‌స‌రం ఏమొచ్చిందా అని  తెగ ఆలోచిస్తూ ఆఫీసుకు వెళ్లాడు. త‌ర్వాత క‌నుక్కుంటే త‌న కూతురు కోసం రాకేష్ చ‌దువుతు న్నాడ‌ని తెలు సుకుని చాలా ఆనందించాడు. ఏ ప‌నిచేస్తున్నా, తండ్రి తండ్రే.. పిల్ల‌ల భ‌విత‌కు త‌ప్ప‌ని శ్ర‌మ‌..ఎంతో ఆనందాన్నిచ్చే శ్ర‌మ‌! త‌న కూదురు యుపిఎస్‌సి ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అవుతోంది. అందుకే రాకేష్ ఆమెకు కావ‌ల‌సిన పుస్త‌కాలు కొన‌డ‌మే కాకుండా కొంత నోట్సు రాసుకోవ‌డానికి అత‌ను అధ్య‌య‌నం మొద‌లెట్టాడు. అత‌నికీ ఎంతో తెలుసుకోవాల‌న్న త‌ప‌నా పెరిగింది. పిల్ల‌ల్ని త‌మ‌కంటే ఎక్కువ చ‌దివించాల‌ని, మంచి స్థాయిలో చూడాల‌నే క‌దా త‌ల్లిదండ్రులు ఆశించేది. 

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్?

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో అద్భుతమేమీ జరగలేదు. అనూహ్యమైన ఫలితం ఆవిష్కృతం అవ్వలేదు. అందరూ అనుకుంటున్నట్లుగానే కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లిఖార్జున్ ఖర్గే విజయం సాధించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో మొత్తం 9,500 ఓట్లు పోలవగా.. ఖర్గేకి 7,897 ఓట్లు వచ్చాయి. మరో అభ్యర్థి శశిథరూర్ కు 1072 ఓట్లు వచ్చాయి. మరో  416 ఓట్లు చెల్లలేదు. ఇక్కడి వరకూ అంతా ఓకే కానీ పరాజయం పాలైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. దీంతో రిగ్గింగ్ సంస్కృతి ఇప్పుడు పార్టీ అధ్యక్ష ఎన్నికలకు కూడా పాకిందా? ఇప్పటిదాకా అసెంబ్లీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోసం జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చేవి. ఇప్పుడు ఈ జాడ్యం పార్టీ సంస్థాగత ఎన్నికలకు కూడా పాకిందా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. 137 ఏళ్ల చరిత్ర గల గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి సంస్థాగతంగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ ఈ పదవికి పోటీ పడిన శశిథరూర్ ఆరోపణలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఈ పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరిగాయి. బుధవారం ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో 9,500 ఓట్లు పోలవగా.. ఖర్గేకి 7,897 ఓట్లు రాగా.. శశిథరూర్ కు వెయ్యి 72 మంది ఓటు వేశారు. కాగా.. మరో 416 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. శతాధిక కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తాజాగా నిర్వహించిన ఎన్నికలతో కలిపి ఇప్పటి వరకూ ఆరుసార్లు ఎన్నికలు జరిగాయి. సుమారు 24 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు దక్కాయి. ఈ ఎన్నికలో తన అదృష్టాన్ని పరీక్షించుకుని ఓటమి చవిచూసిన శశిథరూర్ ట్విట్టర్ వేదికగా కొత్త అధ్యక్షుడు ఖర్గేను అభినందించారు. ఈ మేరకు ఆయన ఒక సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. అంతటితో ఆగకుండా.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని, ఉత్తరప్రదేశ్ లో అత్యంత తీవ్రమైన అవకతవకలు జరిగాయని ఆరోపించడం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్ మధుసూదన్ మిస్త్రీకి శశిథరూర్ బృందం రాసిన లేఖ తాజాగా వెలుగుచూసింది. ఒక పక్కన అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగా శశిథరూర్ తరఫున ఎన్నికల ఏజెంట్ గా వ్యవహరించిన సల్మాన్ సోజ్ ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ‘ఉత్తరప్రదేశ్ లో తీవ్ర అవకతవకలు జరిగాయి. ఈ విషయం మిస్త్రీ కార్యాలయం దృష్టికి తెచ్చేందుకు పలుమార్లు ప్రయత్నించాం. కానీ ఫలితం లేకపోవడంతో ఈ లేఖ రాయాల్సి వచ్చింది. యూపీ ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయత, సమగ్రత లోపించడం శోచనీయం. ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో ఖర్గే మద్దతుదారులు అక్రమాలకు పాల్పడిన విషయం ఆయనకు తెలియకపోవచ్చు. తెలిస్తే ఆయన అలా జరగనిచ్చేవారు కాదు. యూపీలో బ్యాలెట్ బాక్సులకు అధికారిక సీల్ వేయలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద అనధికార వ్యక్తులు కూడా ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ అవకతవకలపై చర్యలు తీసుకోకపోతే.. ఈ ఎన్నిక ప్రక్రియ స్వేచ్ఛగా.. న్యాయంగా , పారదర్శకంగా జరిగినట్లు ఎలా అవుతుంది? అందువల్ల యూపీలోని ఓట్లన్నీ చెల్లనివిగా పరిగణించాలని మేం డిమాండ్ చేస్తున్నాం’ అని థరూర్ బృందం ఆ లేఖలో పేర్కొన్నదని చెబుతున్నారు. అయితే.. అంతర్గతంగా రాసిన ఈ లేఖ మీడియాకు లీకవడంతో సల్మాన్ సోజ్, శశిథరూర్ స్పందించారు. సీఈఏకి అంతర్గతంగా రాసిన లేఖ మీడియాకు లీక్ అవడం దురదృష్టకరం.  కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకే ఈ ఎన్నిక. విభజించేందుకు కాదు. ఈ విషయంలో సల్మాన్ ఇచ్చిన వివరణతో అనవసర వివాదానికి ముగింపు దొరుకుతుందని ఆశిస్తున్నా’ అని థరూర్ ట్వీట్ చేశారు.

విభ‌జ‌న హామీల పూర్తికి రాహుల్ హామీ

ఆంధ్రప్ర‌దేశ్ విభ‌జ‌న హామీల విష‌యంలో ఇప్ప‌టికే ప్ర‌జ‌లు నీళ్లు వ‌దిలేశారు. జ‌గ‌న్ స‌ర్కార్‌తో ఏమీ అవ‌ద‌ని తేలిపోయింది. ఇపుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ త‌న పాద‌యాత్ర‌లో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌చ్చి మ‌ళ్ళీ ఆశ‌లు రేపుతున్నారు. విభ‌జ‌న హామీల‌న్నీ త‌మ ప్ర‌భుత్వంతోనే నెర‌వేరుతాయ‌ని, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌ను కోరారు.  భార‌త్ జోడో యాత్ర ఏపీలోకి ప్ర‌వేశించింది. దీనిలో భాగంగా బుధ‌వారం రాహుల్ గాంధీ క‌ర్నూలులో ప‌ర్య టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌య‌లో ఇచ్చిన కొన్ని హామీలు తాము అధికారంలోకి రాగానే తీరుస్తామ‌న్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం ప్రాజెక్టు, రాజ ధాని విష‌యంలోనూ కీల‌క నిర్ణ‌యం తీసుకుని పూర్తిచేస్తామ‌ని కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.  ప్ర‌స్తుత ప్ర‌భుత్వం  ప్ర‌చారం చేస్తున్న మూడు రాజ‌ధానుల ఆలోచ‌న స‌ర‌యిన‌ది కాద‌న్నారు. రాష్ట్ర  విభ జన హామీల్లో పోలవరం ప్రాజెక్ట్  కూడా ఉందన్నారు. విభజన హామీలన్నీ కేంద్రం అమలు చేయాలన్నా రు. పోలవరం పూర్తి చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.  అమరావతి రైతుల పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు రాహుల్ ప్రకటిం చారు.  భారత్ జోడో యాత్ర ద్వారా చాలా విషయాలు నేర్చుకు న్నానన్నారు. దేశంలో కొన్ని శక్తులు ద్వేషం, హింసను పెంచు తున్నాయన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయన్నారు. బీజేపీ దేశాన్ని విభజి స్తోందని.. ద్వేషాన్ని సృష్టిస్తోందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు.. ఉల్లి రైతులు ధర లేక ఇబ్బం దుల్లో వున్నారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో భారత్ జోడో యాత్ర చేస్తోన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలవరం నిర్వాసితు లు, అమరావతి రైతులు కలిశారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగేలా చూడాలని రాహుల్ కి అమరావతి జేఏసీ నేతలు వినతిపత్రం సమర్పించారు.  ఏపీకి అమరావతే  ఏకైక  రాజధానిగా వుండాలని రాహుల్ గాంధీ అన్నారు. అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించారు రాహుల్. రైతు లు రాజధాని కోసం భూములిస్తే.. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులు పెడతామని అంటోంద న్నారు రాహు ల్.  ఏపీకి ప్రత్యేక హోదాకు కట్టుబడి వున్నామని.. అధికారంలోకి వస్తే ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. పోలవరం నిర్వాసితులు, అమరావతి రైతుల సమస్యలు చూస్తుంటే బాధగా వుందని రాహుల్ అన్నారు. 

మోదీజీ మీ జాబితాలో రేపిస్టుల‌నూ చేర్చండి...ఓవైసీ చుర‌క‌

మంచివారు ఎవ‌ర‌న్న‌ది చ‌ర్చ‌గా మారిపోతోంది. జైలు జీవితం గ‌డుపుతున్నంత మాత్రాన వారంతా చాలా మంచివారుగా, స‌త్ప్ర‌వ‌ర్త‌న‌తో త‌మ జీవితాన్ని కొన‌సాగిస్తార‌ని బీజేపీ అభిప్రాయం కావ‌చ్చునేమోగాని విప క్షాలు అలా భావించ‌డం లేదు. కేవ‌లం త‌మ అధికారం చ‌లాయించ‌డానికి అడ్డుగోడ‌ల‌ను తొల‌గించు కోవ డానికే ఇలాంటి ప్ర‌చారాలు చేయ‌డం త‌ప్ప వాస్త‌వానికి స‌మాజంలో జ‌రుగుతున్న‌ది విరుద్ధ‌మ‌న్న‌ది విప క్షాలు మండిప‌డుతున్నాయి. ముఖ్యంగా బిల్కిస్‌బానో కేసులో ఇటీవ‌ల ప‌ద‌కండు మంది నిందితులు ఎంతో మారిపోయారంటూ విడుద‌ల చేయ‌డం పై పెద్ద దుమార‌మే లేచింది. తాజాగా ఏఐఎంఐఎం అధి నేత అస‌దుద్దీన్ ఒవైసీ మండిప‌డుతున్నారు.  బిల్కిస్ బానో కేసుకి సంబంధించి 11మంది నిందితుల‌ను విడుద‌ల చేశారు. అయితే ఇది కేంద్ర హోం మంత్రి ఆదేశం మేర‌కే జ‌రిగిం ద‌న్న విమ‌ర్శ‌లు ఇంకా ఉన్నాయి. బుధ‌వారంనాడు గుజ‌రాత్‌లో డిఫెన్స్ ఎక్స్‌పో 2022 ఆరం భోత్స‌వం సంద ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ మాట్లాడుతూ, దేశం పావురాళ్ల‌ను ఎగ‌రే య‌డం నుంచి  పులుల‌ను విడుద‌ల చేసే స్థితికి వ‌చ్చింద‌ని అన్నారు. దీనికి ఏఐఎంఐఎం ఛీఫ్ అస‌దు ద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు.  ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న‌లో చీటాల‌తో పాటు రేపిస్టుల‌ను కూడా ఆ జాబితాలో చేర్చాల‌ని అస‌దుద్దీన్  విమ‌ర్శనా స్త్రం సంధించారు. ఇపుడు ఇది తీవ్ర ప్ర‌కంప‌న‌ల‌కు దారితీస్తోంది. బీజేపీ ప్ర‌భుత్వం కేవ‌లం చిరుత‌ల నే కాదు అత్యాచారాల‌ను చేసేవారికి కూడా స్వేచ్ఛ‌నిస్తోంద‌ని ఓవైసీ ఎద్దేవా చేశారు. బిల్కిస్ బానో కేసులో 11 మందికి స్వేచ్ఛ‌నీయ‌డంలో  అర్ధ‌మేమంట‌ని ప్ర‌శ్నించారు. వారిని విడుద‌ల చేయ‌డం సీబీఐ కూడా వ్య‌తిరేకించిన‌ప్ప‌టికీ వారిని విడుద‌ల చేశార‌ని ఓవైసీ మండిప‌డుతున్నారు. వారి ప్ర‌వ‌ర్త‌న‌లో ఎంతో మార్పు వ‌చ్చిందని, చాలా మంచివారిగా మారిపోయార‌నీ, పైగా వారి జైలు శిక్ష స‌మ‌యం పూర్తిగా అను భ‌వించారంటూ 11మందినీ  విడుద‌ల చేసిన‌ట్టు ప్ర‌క‌టించార‌ని గుజ‌రాత్ ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. వారిలో ఒక‌ర‌యిన మితేష్ చిమ‌న్‌లాల్ భ‌ట్ పెరోల్ స‌మ‌యంలో 2020ల జూన్‌లో ఒక మ‌హిళ‌పై అత్యా చారం చేశాడ‌ని తెలిసింది.  అస‌లు మంచిప్ర‌వ‌ర్త‌న‌, మంచిగా మారాడ‌న్న‌దానికి అర్ధ‌మేమిట‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ ఎం.పీ మ‌హువా మైత్ర ప్ర‌శ్నించారు. అచ్చేదిన్‌, అచ్చేలోగ్‌, బేటీకో బ‌చావో అంటూ బీజేపీ, మోదీ స‌ర్కార్ విజ‌యాల‌కు ప్ర‌చారం చేసుకుంటున్న‌పుడు ఈ విధ‌మైన ప్ర‌వ‌ర్త‌న కూడా మీకు ఎంతో మంచి ప్ర‌వ‌ర్త‌నే అవుతుందా అని ఎంపీ ప్ర‌శ్నించారు. బీజేపీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే సంస్కార‌వంతులుగా మారిన రేపిస్టుల‌కు స్వేచ్ఛా జీవితం ప్ర‌సాదిస్తామ‌ని బీజేపీ త‌న మానిఫెస్టోలోనే పేర్కొంటుందేమో అని ఆమె ఎద్దేవా చేశారు. 

వివేకా కేసులో కీలక మలుపు! విచారణ వేరే రాష్ట్రానికి బదిలీకి సుప్రీం ఓకే

ఏపీ సీఎం జగన్  సొంత బాబాయ్, మాజీ మంత్రి  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో   విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయడానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసు విచారణను ఎక్కడికి బదిలీ చేయాలనే ఉత్తర్వులను శుక్రవారం(అక్టోబర్ 21) ఇస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. వివేకా హత్య కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయడానికి తమకు అభ్యంతరం లేదని సుప్రీంకోర్టులో 200కు పైగా పేజీల అఫిడవిట్ ను సీబీఐ దాఖలు చేసింది. వేరే రాష్ట్రానికి ఈ కేసు విచారణను ఎందుకు బదిలీ చేయాలో చెబుతూ బలమైన కారణాలను కూడా కోర్టుకు సీబీఐ అందజేసింది. ఇరు పక్షాల లాయర్ల వాదనలను విన్న సుప్రీం ధర్మాసనం.. ఈ కేసు విచారణను ఏపీ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయడానికి సమ్మతించింది. తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సరిగా జరగడంలేదని, ఏపీలో కాకుండా విచారణ వేరే రాష్ట్రంలో జరిగేలా ఉత్తర్వులు ఇవ్వాలని వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వివేకా హత్య కేసులో సాక్షులను భయపెడుతున్నారని, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైన కూడా ప్రైవేట్ కేసులు పెడుతున్నారని తన పిటిషన్ లో సునీతారెడ్డి   పేర్కొన్నారు. సునీతారెడ్డి పిటిషన్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం(అక్టోబర్19) విచారణ జరిపింది. కేసు విచారణను తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు బదిలీ చేయాలా? అని సుప్రీంకోర్టు ప్రస్తావించినప్పుడు.. హైదరాబాద్ ఏపీకి దగ్గరగా ఉన్నందున విచారణను ప్రభావితం చేసే ఛాన్స్, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని సీబీఐ తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. విచారణను కర్ణాటక సహా మరే ఇతర రాష్ట్రానికి బదిలీ చేసినా అభ్యంతరం లేదని వారు వెల్లడించారు. కేసు విచారణను ఢిల్లీకి బదిలీ చేయాలా? అనే ప్రస్తావన కూడా రావడం గమనార్హం.

తెలంగాణకు వివేకా హత్య కేసు విచారణ?.. రఘురామ రాజు

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య‌కేసు దర్యాప్తు విష‌యంలో  జాప్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివేకా కుమార్తె సునీత తన తండ్రి హత్య కేసు దర్యాప్తు ఏపీలో అయితే సజావుగా సాగదనీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును అడుగడుగునా అడ్డుకుంటోందనీ ఆరోపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే వివేక హత్య కేసు విచారణను ఏపీలో కాకుండా  హైద‌రా బాద్ లేదా ఇత‌ర రాష్ట్రాల‌కు బ‌దిలీ చేయాల‌ని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి విదితమే. సునీత పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టుకు సీబీఐ ఇచ్చిన వాంగ్మూలంలో వివేకా హత్య కేసు దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తున్న సంగతి వాస్తవమేనని పేర్కొంది. ఈ కేసు విచారణ ఏపీ నుంచి ఇరత రాష్ట్రానికి బదిలీ చేయాలని నిర్ణయిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని సీబీఐ స్పష్టం చేసింది.   ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కేసు విచార‌ణపై  వివేకానంద కుమార్తె ఎన్‌.సునీతారెడ్డి వ్యక్తం చేసిన అనుమానాలు, అభ్యంత‌రాలు అక్షర సత్యాలని సుప్రీం కు సీబీఐ సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నది. పేర్కొన్న‌ది. అంతేగాక రాష్ట్ర పోలీసులు, నిందితులు కుమ్మక్కయ్యారని సీబీఐ ఆరోపించింది.  సెక్షన్‌ 164 కింద వాంగ్మూలం ఇవ్వడానికి అంగీకరించిన సీఐ శంకరయ్యపై రాష్ట్ర ప్ర‌భుత్వం  సస్పె న్షన్‌ను ఎత్తి వేయడమే కాక, ఆయనకు  ప్రమోషన్   కూడా ఇచ్చిన విషయాన్ని సీబీఐ ఈ సందర్భంగా ప్రస్తావించింది. ప్ర‌భు త్వం చేసిన మేలుకు  మాటమార్చడం ద్వారా సీఐ బదులు తీర్చుకున్నారని సీబీఐ పేర్కొంది. అందుకే  వాంగ్మూలం కోసం సీబీఐ ఒత్తిడి తెస్తోందంటూ ఆరోపించార ని తెలిపింది.  సాక్షులకు ముప్పున్న విషయం కూడా వాస్తవమే నని, ఏకంగా సీబీఐ అధికారులనే బెదిరిం చారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో వేరే రాష్ట్రానికి కేసు విచా రణను బదిలీ చేస్తే తమకు అభ్యంతరం లేదని సీబీఐ స్పష్టం చేసినట్లు తెలిసింది. సీబీఐ వివేకా హత్య కేసులో పోలీసులు, ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ చెప్పడం, అంతే కాకుండా ఈ కేసులో నిందితులు,పోలీసులు కుమ్మక్కయ్యాని సీబీఐ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో ఈ కేసును ఇతర రాష్ట్రాలకు తరలించాలన్న వైఎస్ సునీత పిటిషన్‌కు బలం లభించినట్లయిందని న్యాయవర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి   ఈ నేపథ్యంలోనే వివేకా హత్య కేసు విచారణ ఏపీ నుంచి తెలంగాణకు మారే అవకాశం ఉందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అంచనా వేశారు. అదే జరిగితే అది  ఏపీ సర్కార్ కు పెద్ద ఎదురుదెబ్బే కాకుండా అవమానం కూడా అని ఆయన వ్యాఖ్యానించారు. పరిస్థితి ఇంత వరకూ రావడానికి రాష్ట్ర ప్రభుత్వం తీరే కారణమని ఆయన విమర్శించారు. 

తెలుగుదేశం కార్యాలయంపై వైసీపీ దాడికి ఏడాది.. చర్యలేవి?

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ అరాచకత్వానికి, అధికార దుర్వినియోగానికి అంతు లేకుండా పోతోంది. విపక్షాలపై దాడులు, కేసులతో రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి.. ఆ వ్యవస్థను చెప్పు చేతల్లో ఉంచుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా తయారు చేసింది. ఇక సీఐడీ విషయమైతే చెప్పనవసరం లేదు. నిబంధనలకు తిలోదకాలిచ్చి.. అర్ధరాత్రి అరెస్టులు, దాడులతో విపక్ష నేతల ధైర్యాన్ని, స్థైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా అధికార వైసీపీ కనుసన్నలలో పని చేస్తున్నది. ఈ క్రమంలోనే ఏడాది కిందట సరిగ్గా ఇదే రోజు (అక్టోబర్ 11,2021) మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడి చేశారు.  వైసీపీ గూండాలు తెలుగుదేశం కార్యాలయంలోనికి ప్రవేశించి అద్దాలు, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. పలు వాహనాలపై దాడి చేసి విధ్వంసానికి పాల్పడ్డారు.  ఈ మెత్తం వ్యవహరం అంతా పార్టీ కార్యాలయంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ ఆధారాలతో సహ టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఈ ఏడాది కాలంలో ఆ దాడికి సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు అంటూ తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి రజనీకి రిటర్ గిఫ్ట్ ఇవ్వడానికి చిలకలూరి పేట రెడీ అయ్యిందా?

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు రెడిగా ఉన్నారన్న టాక్  ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఓ రేంజ్ లో వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అంటూ ఓ వైపు  రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో నినదిస్తుంటే.. రాజధాని అమరావతికి ఆనుకుని ఉన్న నియోజకవర్గానికి చెందిన విడదల రజని మాత్రం.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం అంటూ ఇటీవల విశాఖలో  జరిగిన గర్జన సభలో మాట్లాడడం పట్ల.. జిల్లా వ్యాప్తంగా మరీ ముఖ్యంగా చిలకలూరి పేట నియోజకవర్గంలో  తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది. చిలకలూరిపేటకు కూతవేటు దూరంలో ఉండే అమరావతిని కాదని.. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉండాలని ఆమె పేర్కొనడంపై జనంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది.   ఎంత విశాఖపట్నం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా ఉంటే మాత్రం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌.. అంటూ మాట్లాడడమేమిటని వారంతా మంత్రి రజినీని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి  జగన్.. ఏం చెబితే దానికి తాన తందానా..   అంటూ తల ఊపడమేనా.. అని ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు మంత్రి రజనిని నిలదీస్తున్నారు. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు... చేస్తున్న ఆందోళనలు, ధర్నాలు, పాదయాత్రలు  కనబడడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.  వచ్చే ఎన్నికల్లో విడుదల రజినీకి ఓటమిని ఆమెకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. అయినా.. ఏ రొటి దగ్గర ఆ పాట అదీ ఎం ఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో ట్యూన్ కట్టినట్లుగా పాడాలంటే మాత్రం ఈ చిలకలూరిపేట ఎమ్మెల్యేగారికే చెల్లుతోందంటూవ్యంగ్యంగా పేర్కొంటున్నారు. మంత్రిగారి గత చరిత్ర తాలుక ప్రతిభాపాటవాలను ఈ సందర్భంగా ఏకరువు పెడుతున్నారు.   2014 ఎన్నికల వేళ.. యూఎస్ నుంచి వచ్చి.. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేశారని.... ఆ క్రమంలో 2017లో విశాఖలో నిర్వహించిన టీడీపీ మహానాడు వేదిక పైనుంచి నరకాసురులంటూ వైయస్ రాజశేఖరరెడ్డిని, వైయస్ జగన్ మోహన్ రెడ్డిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన రజనీ.. 2019 ఎన్నికల వేళ.. చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి... భంగపడి, నాటి ప్రతిపక్ష నేత, వైయస్ జగన్ సమక్షంలో ఆమె వైసీపీలో  చేరి.. ఆ పార్టీ అభ్యర్థిగా చిలకలూరిపేట నుంచి విజయం సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఇలా రాజకీయంగా ఆమె ఎదిగే క్రమంలో... టీడీపీలో రాజకీయ ఓనమాలు నేర్పించిన ప్రత్తిపాటి పుల్లారావుపై రాజకీయ ప్రత్యర్థిగా పోటీ చేసి గెలిపొందిందని.. అలాగే జగన్ పార్టీలో కీలక నేత, సదరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మర్రి రాజశేఖర్‌ రాజకీయ భవిష్యత్తను విశాఖలో రిషికొండను గుండు కొట్టినట్లు కొట్టేసిందని ఉమ్మడి గుంటూరు జిల్లా వాసులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మర్రి రాజశేఖర్ అనుచర గణం... విడదల రజినీపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారని అంటున్నారు.  చిలకలూరిపేటలో స్థానిక స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రమౌళి పేరుతో ఉన్న కూరగాయల మార్కెట్‌ పేరును   వైయస్ రాజశేఖరరెడ్డి కూరగాయల మార్కెట్‌గా మార్చడంపై కూడా నియోజవకర్గ ప్రజలలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అలాగే నరసారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయులను సైతం... ఈ రజినీ అండ్ గ్యాంగ్.. ఐ డొంటే కేర్ అన్నట్లు వ్యవహరిస్తోందని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఆ క్రమంలో ఈ పంచాయతీని  ఎంపీ.. తాడేపల్లి ప్యాలెస్‌కు తీసుకు వెళ్లినా.. ప్రయోజనం లేకుండా పోయిందని సమాచారం.  మొత్తం మీద విశాఖ గర్జనతో చిలకలూరి పేట నియోజకవర్గంలో మంత్రి విడదల రజనీపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయన్నది మాత్రం వాస్తవమని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు.

జయలలిత మరణం  ఇంకా మిస్ట‌రీయేనా?

జయలలిత ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలడంతో జయలలిత మరణించిన తర్వాత జె.జయలలిత సన్నిహితురాలు వి.కె.శశికళ అవినీతి ఆరోపణలపై అరెస్టయి, బ‌య‌టికి వ‌చ్చిన సంగతి తెలిసిన‌దే. 2016లో చెన్నైలోని అత్యున్నత ఆసుపత్రిలో చేరిన జె జయలలిత మరణంపై దర్యాప్తు జరగాలని మాజీ న్యాయమూర్తి ఒక సుదీర్ఘ నివేదికలో పేర్కొన్నారు. అంతేకాదు ఒక ఉన్నత ప్రభుత్వ అధికారిని, జ‌య‌ల‌లిత‌తో నివసించిన సన్నిహితురాలు వికె శశి కళ ను దూషించింది. 2017లో జయలలిత పార్టీ అన్నాడీఎంకే తమిళనాడును పాలించినప్పుడు, కుట్ర సిద్ధాంతాలు, జయ లలిత అనారోగ్యం, అపోలోలో చికిత్సకు సంబంధించిన వివాదాస్పద ఖాతాలను జల్లెడ పట్టేందుకు 2017 లో మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి  ఏ. ఆర్ముఘస్వామి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 2021లో డిఎంకె రాష్ట్ర బాధ్యతలు చేపట్టినప్పుడు, జయ లలిత మరణానికి దారితీసిన పరిస్థితులను వివరంగా దర్యాప్తు చేస్తామని ఎన్నికల హామీని పునరుద్ఘాటించింది. జస్టిస్ ఏ. ఆర్ముఘ స్వామి నివేదికను ఆగస్టులో ప్రభుత్వానికి సమర్పించారు. జయలలిత మరణాన్ని అధికారికంగా ప్రకటించడాన్ని కూడా కమిషన్ విమర్శించింది. డిసెంబరు 4, 2016 న జయలలిత గుండె పోటు కు గురైన తర్వాత ఏమి జరిగిందో ఉదహరిస్తూ కమిషన్, డిసెంబర్ 4 మధ్యాహ్నం 3.50 గంటల నుండి సీపీ ఆర్ , స్టెర్నోటమీ వ్యాయామాలు ఫలించలేదు. ఆమె మరణం అధి కారిక ప్రకటనలో జాప్యాన్ని వివరించడానికి ఇవి ఒక ఎత్తుగడగా ఉపయో గించబడ్డాయి.  పన్నీర్‌సెల్వం అంతరంగిక వ్యక్తి, అధికారికంగా స‌న్నిహితుల్లో ఒకర‌ని కమిషన్ పేర్కొంది. దివంగత ము ఖ్య మంత్రి జీవించి ఉన్న సమయంలో కూడా ఏదైనా జరిగిందనేది ఆయనకు తెలిసినదే. అతను ఎటు వంటి సమయాన్ని కోల్పోకుండా సీఎం కార్యాలయా నికి చేరుకున్నాడు. అతను సరిపోయేటట్లు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటనలో ఉన్నాడు. దివంగత ముఖ్యమంత్రి వారసుడిగా తనను తాను నిల బెట్టుకు న్నారు. ఇది యాదృచ్ఛికంగా జరగలేదు. కాగా, ఈ నివేదికను ఇప్పుడు  తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం పంచుకుంది. జయలలిత మరణించి న సమయంలో అత్యున్నత బ్యూరోక్రాట్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రామమోహనరావు క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారని పేర్కొంది. నివేదికలో అప్పటి  ఆరోగ్య మంత్రి విజయభాస్కర్‌పై  తీవ్ర వ్యాఖ్యలు చేశారు, జయలలిత పరిస్థితిపై అపోలో ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి తప్పుడు ప్రకటనలు ఇచ్చారని పేర్కొంది. తమిళ నాడు అత్యంత ఆకర్షణీయమైన, అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకులలో ఒకరైన  జయ లలిత నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మాజీ నటి, ఆమె ఎఐఎడిఎంకె క్యాడర్‌కు తమిళనాడు అమ్మగా ప్రియమైనది, అయితే ఆమె కెరీర్ చివరి భాగంలో ఆమెపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆమె అత్యంత సన్నిహితురాలు వీకే శశికళ దశాబ్దాలుగా ఆమెతో కలిసి జీవించారు. 2017లో  జయ లలిత ప్రధాన నింది తురాలిగా ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలడంతో జయ లలిత మర ణించిన తర్వాత శశికళ అవినీతి ఆరో పణలపై అరెస్టయ్యారు. నాలుగేళ్ల తర్వాత పొరుగున ఉన్న కర్ణాటక లోని జైలు నుంచి శశికళ విడుదలై అన్నాడీఎంకే బాధ్యతలు చేపట్టేందుకు ఆమె చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కమిటీ తరఫున వాంగ్మూలం ఇచ్చిన సాక్షుల్లో అన్నాడీఎంకే అగ్రనేత ఓ పన్నీర్‌సెల్వం, జయలలిత మేనకోడలు దీప, రాజకీయనాయకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారని తెలిపిన మేనల్లుడు దీపక్, లిఖిత పూర్వక వాంగ్మూలం దాఖలు చేసిన శశికళ ఉన్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లోని నిపుణు లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందించిన చికిత్సపై అపోలో ఆసుపత్రి వైద్యులు వాంగ్మూలం ఇచ్చారు, ఈ విషయాన్ని సమీక్షించాలని సుప్రీంకోర్టు కోరింది.

చెల్లెళ్లకు మిగిలేది దిగులేనా?

అన్నీ, అంద‌రూ ఉన్నా కొంద‌రికి జీవితం ఏమాత్రం సుఖంగా సాగ‌దు. అధికారం, పిలిస్తే ప‌లికే మ‌నుషు లు అంతా ఉన్న‌ట్టే  ఉంటుంది కానీ ఎవ‌రూ, ఏదీ త‌మ‌వి కావ‌న్న బాధ మ‌నసుని తినేస్తుంటుంది. ఎవ‌రికి ఎవ‌రు చివ‌రికి ఎవ‌రు.. వంటి గీతాలే బాగా ఇష్టంగా పాడుకోవాల్సిన ఒంట‌రిత‌నంలో మిగిలి పోతుంటారు. ఇపుడు ఇలాంటి వెలుగు జారిపోతున్న రాజ‌కీయ గ‌దుల్లో ఇద్ద‌రు ఆడ‌పడుచులు బెంగె ట్టుకుని బిక్కు బిక్కుమంటున్నారు. ఒకరు ఆంధ్రా, మ‌రొక‌రు తెలంగాణాకి చెందిన‌వారు. వారే ఆర్‌.కె. రోజా, క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆర్‌.కె. రోజా అనేకంటే ఒక‌నాడు టాలీఉడ్‌ని ఏలిన సూప‌ర్ హీరోయిన్ రోజా అంటేనే ఠ‌క్కున గుర్తుకు వ‌స్తుంది. వివాహం త‌ర్వాత సినిమాలు త‌గ్గించుకున్న రోజా మెల్లగా రాజ‌కీయాల్లో ఆస‌క్తితో అడుగిడినా త‌న వాక్చాతుర్యం, ధైర్య‌సాహ‌సాల‌తోనే అంద‌రికీ బాగా ఎరుక‌. ఏమాత్రం భ‌యంలేని ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం, విప‌క్షాల‌వారితో అంతే స్థాయిలో విరుచుకుప‌డ‌టంలో ఆమె ప్ర‌త్యేకత ఆమెది. రోజా బీఎస్సీ చదువుతున్న ప్పుడే ప్రేమ తపస్సు సినిమా ద్వారా సినిమాలకు పరిచయమైంది. అంతకు ముందు ఆర్కే రోజా తమిళ చిత్రం చంబరతిలో నటించారు. ఈ చిత్రం కోలీవుడ్‌లో మ్యూజికల్ హిట్ అయ్యింది తెలుగులోకి చేమంతి అనే టైటిల్ తో డబ్ చేశారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు ఆర్కే సెల్వమణి ఈ చిత్రాన్ని రూపొం దించారు. రోజా అతనిని వివాహం చేసుకున్నారు. ఆర్కే రోజా 2004లో నగరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆమె చెంగారెడ్డి రెడ్డివారిపై పోటీ చేశారు. 2009లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఆమె మళ్లీ పోటీ చేసినా ఆశించిన ఫలితాలు రాలేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌లో చేరిన రోజా, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. రోజా 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి వైఎస్సార్‌సీపీ టికెట్‌పై రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలి చా రు. 2014 అసెం బ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సీనియర్, దివంగత సీనియర్ టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు పై రోజా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఆయన కుమారుడు గాలి భానుప్రకాష్‌పై విజ యం సాధించారు. వైఎ స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఫైర్‌బ్రాండ్‌ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా.. ప్రతిపక్షాలను సైతం వదలడం లేదన్న విషయం తెలిసిం దే. రాజకీయ విమర్శలు చేయడంలో ఆమెది తనదైన శైలి. 2020 నుంచి రెండేళ్లపాటు ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా పని చేశారు. ప్ర‌స్తుతం వైసీపీ ప్ర‌భుత్వం లో మంత్రిగా చేస్తున్నారు.  కానీ వాడిగా, వేడిగా మారిపోతున్న రాజ‌కీయాల్లో ఆమె న‌మ్ముకున్న పార్టీగాని, అన్న సీఎం జ‌గ‌న్ గాని ఆమె రాజ‌కీయ భ‌వి ష్య‌త్‌కు ఢోకా లేద‌ని మాత్రం చెప్ప‌లేక‌పోతున్నారు. కార‌ణం పార్టీ ప‌రిస్తితులు అధోగ‌త‌కి మ‌ళ్లాయి. సినిమాల్లో, టీవీ షోల కంటే ప్ర‌జ‌ల‌కు సేవ‌చేయాలంటే రాజ‌కీయాల్లోనే ఉండాల‌న్న నిర్ణ‌యం తో వైసీపీలో చేరిన‌ప్ప‌టికీ, ఆమెకు మొద‌టి నుంచి త‌గినంత గుర్తింపు ల‌భించ‌లేద‌నే అనాలి. కేవ‌లం విప క్షాల‌వారి మీద విరుచుకు ప‌డ‌టం త‌ప్ప పార్టీవారు, సీఎం జ‌గ‌న్ చెల్ల‌మ్మా అన‌డం త‌ప్ప ఆమెకు త‌గ్గ స్థాయిని తొలి విడ‌త కల్పించ‌లేదు. క్ర‌మేపీ ప్ర‌భుత్వ విధానాలు, పాల‌న ప‌ట్ల ప్ర‌జ‌లు విసిగెత్తి ప్ర‌భుత్వ వైఖ‌రిని దుయ్య‌ప‌ట్ట‌డం ఆరంభించారో అప్ప‌టికి మంత్రివ‌ర్గంలో మార్పులు ఎంతో అవ‌స‌ర‌మ‌న్న జ్ఞానం క‌లిగి రోజాను మంత్రివ‌ర్గంలోకి తీసుకున్నారు. కానీ ఇది మూడేళ్ల ముచ్చ‌ట కూడా కాద‌న్న‌ది ఆమెకు తెలు సు. మూడేళ్ల పాల‌న త‌ర్వాత కూడా ప్ర‌జ‌లు ప్ర‌భు త్వం ప‌ట్ల ఏమాత్రం ఆస‌క్తి లేక‌పోవ‌డం, పార్టీలో నాయ కుల‌కు, అధినేత‌కు మ‌ధ్య ప‌నితీరులో వ‌చ్చిన వ్య‌త్యాసాలు, ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స్పంద‌న అన్నీ వెర‌సి  రెండోవిడ‌త మంత్రివ‌ర్గంలోకి వ‌చ్చిన మంత్రుల‌కు ఇబ్బందిక‌రంగానే ఉంది. ముఖ్యంగా నాని వంటి వారు నోటి దురుసుతో ప్ర‌తిప‌క్షం మీద‌, నాయ‌కుల మీద భాష‌లో లేని మాట‌ల‌తో చాలా ఛండాలమైన‌ తిట్ల‌పురాణాం అందుకోవ‌డంతో పార్టీ ప‌రువు బ‌జారున ప‌డింది. ఇలాంటి ప‌రిస్థితులు  రోజా వంటి కొత్త మంత్రుల‌కు మ‌రి జ‌నాల్లోకి వెళ్ల‌డానికి ఇబ్బందిక‌రంగానే మారాయ‌నాలి. రాబోయే ఎన్నిక‌లనాటికి పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయాల‌ని, భారీ మెజారిటీతో గెల‌వాలంటే త‌న‌తోపాటు అంద‌రూ క‌ష్టించి ప‌ని చేయాల‌ని జ‌గ‌న్ ప్ర‌వ‌చ‌నం లాంటి హెచ్చ‌రిక‌లు చేయ‌డం రోజా వంటి కొత్త మంత్రుల‌కు మ‌న‌సు క‌ష్ట పెట్టింది. మూడేళ్ల‌న్నా సుఖంగా ఉండాల‌నుకుంటే విప క్షాల తిట్లు తినాల్సి వ‌స్తోంద‌న్న బాధ క‌క్క‌లేక మింగలేకుండా ఉన్నారు. పార్టీని మ‌ళ్లీ ప్ర‌జ‌ల్లోకి తీసికెళ్లి గ‌తంలో కంటే నాలుగు ఓట్లు ఎక్కువ‌చ్చేట్టు చేయాల‌ని ప్ర‌య‌త్నించ‌డంలో లోపం లేక‌పోవ‌ చ్చు. కానీ ప్ర‌య‌త్నాల‌న్నీ ఆల‌స్యంగా ఆరంభిం చ‌డం తోనే విప‌క్షాలు ల‌బ్దిపొందేందుకు మార్గం క‌ల్పించిన‌ట్ల‌ యింది. ఊహించ‌నివిధంగా మ‌ళ్లీ టీడీపీ ని, చంద్ర బాబు నాయ‌క‌త్వాన్ని ప్ర‌జ‌లు ఆశిస్తున్న ఈ త‌రుణంలో జ‌గ‌న‌న్న ఇక నిల‌వ‌లేని స్థితిలో ఉన్నారు. చెల్లి రోజాను గ‌ట్టిగా హెచ్చ‌ రించ‌లేని స్థితి  ఆ  అన్న‌ది. చెల్లి రోజా కేవ‌లం న‌వ్వ‌డం త‌ప్ప ఇంకేమీ చేయ‌ల‌ని ప‌రిస్థితుల్లో మౌనంగా ఉండిపోతోంది. ప‌ర్య‌ట‌క మంత్రి ప‌ద‌వి మూన్నాళ్ల ముచ్చ‌ట‌గానే అయింది. జ‌బ‌ర్ ద‌స్త్ సీన్లు రిపీట్‌గా చూపించినా అస్సలు న‌వ్వు చిలికే ప‌రిస్థితి లేదు.  ఇక తెలంగాణా ముద్దుబిడ్డ‌, తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత. హైద‌రాబాద్ జెఎన్‌టీయూలో ఇంజ‌నీ రింగ్ చేసిన క‌విత రాజ‌కీయాల్లోకి రావ‌డానికి ముందు సామాజిక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. 2006లో న‌ల్గొండ జిల్లాలో కొన్ని గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకుని వాటి అభివృద్ధికి తోడ్ప‌డ్డారు. ఆమె భ‌ర్త అనిల్ కుమార్  ఇంజ‌నీర్‌. క‌ల్వ‌కుంట్ల క‌విత అనేక కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియ‌న్ల త‌ర‌ఫు న కూడా కొంత కాలం ప‌నిచేశారు. 2014లో తెలంగాణా ఆవిర్భావం, కావ‌డంతో ఆమె నిజా మాబాద్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేసి ఏకంగా ల‌క్షా 70వేల మెజారిటీతో గెలిచారు. ఎంపీగా తెలంగాణా, ఇత‌ర జాతీ య‌ స‌మ‌స్య‌ల్ని పార్ల‌మెంటులో చ‌ర్చించి జాతీయస్తాయిలో అన్ని పార్టీలూ ఆలోచించేలా చేశారు. పార్ల‌మెంటులో అనేక ప్ర‌ముఖ క‌మిటీల‌కు గౌర‌వ స‌భ్యురాలుగానూ ఉన్నారు. ఎంతో అద్భుతంగా సాగి పోతున్న ఆమె రాజ‌కీయ జీవితానికి ఊహించ‌ని విధంగా   ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణం మాయ‌ని మ‌చ్చ‌గా త‌యార‌యింది. ఆమెను అప్ప‌టివ‌ర‌కూ ఎంతో మంచి స్నేహితురాలిగా, అక్క‌గా, చెల్లి గా భావించుకున్న రాజకీయ‌నాయ‌కులు, స‌న్నిహితులంతా దూర‌మ‌య్యే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇది స్వ‌యంకృత‌మా అంటే అవున‌నే అంటున్నాయి వార్తలు. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణా నికి సంబంధించి రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది.  తాజాగా ఈ స్కామ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు వస్తు న్నా యి. ఈ కుంభకోణం వెనుక కవిత హస్తం ఉందని, మద్యం వ్యాపారంలో కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారని బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్‌ సిర్సా ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యుల సలహా మేరకే ఢిల్లీ మద్యం విధానం రూపొందిందని, ఈ విధానం రూపకల్పనకు సంబంధిం చిన భేటీ లకు కేసీఆర్ కుటుంబసభ్యులు హాజరయ్యారని పర్వేశ్ వర్మ ఆరోపిం చారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి ఢిల్లీ లిక్కర్ కుంభ కోణంతో నేరుగా సంబంధం ఉందని, ఎక్సైజ్ కమిషనర్‌తో పాటు కేసీఆర్ కుటుంబం కూడా డీల్‌ రూపకల్పనలో భాగస్వామమై ఉందన్నారు. త‌ర్వాత డొంక క‌దిలి హైద‌రాబాద్‌లోనూ ఈడీ, సీబీఐ దాడులు, సోదాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఆర్‌.ఎస్‌. బ్ర‌ద‌ర్స్ వంటి పెద్ద పెద్ద మాల్స్ ల్లోనూ సోదాలు జ‌ర‌గ‌డం సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాన్నీ ఆశ్చ‌ర్య‌ ప‌రిచింది. ఇపుడు క‌విత‌కు త‌ప్పించు కునేందుకు స‌మ‌యం త‌గ్గింది. ఉచ్చుబిగుస్తోంద‌న్న వార్త‌లే విన‌బ‌డుతున్నాయి. ఒక‌వంక మునుగోడు ఉప ఎన్నిక‌, మ‌రో వంక కుమార్తె క‌విత రాజ‌కీయ భ‌విత రెండూ తెలంగాణా ముఖ్య మంత్రి కేసీఆర్‌కు క‌డు ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లోకి నెట్టేశాయి. కూతురిని కాపాడుకోవ‌డానికి ఢిల్లీలోనే కేసీ ఆర్ మకాం వేశారు. కేంద్రం మీద విరుచుకు ప‌డే కేసీఆర్ ఇపుడు కేంద్రంలోని కీల‌క బీజేపీ నాయ‌కుల‌తో మంతనాలు చేస్తున్నారు. కూతురుని ఆ ఉచ్చునుంచి త‌ప్పించాల ని వేడుకుంటు న్నార‌నే అనాలి. త‌న‌ను త‌న తండ్రి ర‌క్షించాలి, బీజేపీ మాట వినే ఆర్ ఎస్ ఎస్ నేత‌లు ర‌క్షించాల‌ని దేవుడిని  ప్రార్ధిస్తున్నారు.  అన్ని దారులూ మూసుకుపోయి తాను రాజ‌కీయాల‌కు మ‌రీ దూర‌మ‌యి సాధా ర‌ణ మ‌హిళ‌గా మిగిలిపోవ‌డం కంటే తండ్రి స‌హ‌కారంతో కేంద్రంలో వారిచేత స‌రే ర‌క్షిస్తామ‌ని పించుకోవ‌డ‌మే ఇక క‌విత‌కు మిగిలింది. కానీ అది అంత సులువుగా జ‌రు గుతుందా అన్న‌దే అను మానం. తెలంగాణా రాజ‌కీయ నాయ కులు అంద‌రూ కేంద్రం మీద ప్ర‌తీ అంశంలోనూ విరుచుకు ప‌డుతున్నారు. మునుగోడులో గెల‌వాల‌న్నా, పోనీ ప‌రువు ద‌క్కించుకోవాల‌న్నా ఈ కుంభ‌కోణం ఉచ్చునుంచీ క‌విత య‌మ‌ర్జంట్‌గా బయట ప‌డాలి. కేసీఆర్ సొంత‌గా విమానం కొన‌డం మంచిద‌యిం ద‌నే అనుకోవాలి. ఢిల్లీ, హైద‌రాబాద్ చ‌క్క‌ర్ల‌కు ఇబ్బంది లేకుం డా పోయింది. లేకుంటే ప్ర‌తీ విమానాశ్ర‌యంలోనూ కూతురు గురించి ప్ర‌తీవారూ ప్ర‌శ్నించి వేధిం చే అవ‌కాశ‌మే ఉంటుం ది.కేసీఆర్ త‌న ప‌రువు ప్ర‌తిష్ట ప‌క్క‌న‌పెట్టి కూతురు క‌ష్టాలు తీర్చ‌డానికి తండ్రిగా వ్య‌వ‌హ‌రిస్తారా, బీఆర్ ఎస్ అధినేత‌గానా, తెలంగాణా ముఖ్య‌మంత్రిగానా అన్న‌ది వేచి చూడాలి. కానీ క‌ల్వ‌కుంట్ల క‌విత మాత్రం లోలోప‌ల దుఖిస్తూ ఆట్టే రోజులు వేచి ఉండ‌లేక పోవ చ్చు. తండ్రి నుంచే స‌హాయం ఏమాత్రం అందు తుంది, ఆయ‌న ఏమాత్రం కాపాడుతాడ‌న్న‌దే భీతితో ఆమె ఎదురుచూస్తోంది. త‌మ్ముడు కేటీఆర్ మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌న్న ప్ర‌చారం బాగా ఉంది. ఆయ‌న‌కు ఈ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తే మ‌రో ఉన్న‌త ప‌ద‌వికి దారి సుగ‌మ‌మ‌వుతుంద‌న్న గొప్ప ఆనందం ఆయ‌న‌ది.

చంద్రబాబు.. పవన్ బేటీ.. ఏపీలో రాజకీయ వేడి

ఒక్క సమావేశం.. ఒకే ఒక్క సమావేశం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలను వేడెక్కించింది. ఔను రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించిన స్వల్ప వ్యవధిలోనే దాదాపు అలాంటి చిత్రమే ఆవిష్కృతమైంది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు విజయవాడ నోవాటెల్ లో బస చేసిన పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసి సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. ఆ తరువాత దాదాపు గంట సేపు ఇరువురూ ముఖాముఖీ భేటీ అయ్యారు. ఇప్పటికే జనసేన, బీజేపీ మిత్రపక్షాలు.. ఇరు పార్టీల మధ్యా పొత్తు ఉంది. అయినా ఈ మూడేళ్లలో ఇరు పార్టీలూ కలిసి పని చేసిన సందర్భాలు పెద్దగా లేవు. కలిసి పోరాటాలు చేసిన సందర్భమూ లేదు. చివరాఖరికి విశాఖపట్నంలో జనవాణి కార్యక్రమం జరిగే అవకాశం లేకుండా అడ్డంకులు సృష్టించిన సందర్భంలోనూ.. పవన్ కు మద్దతుగా బీజేపీ ముందుకు రావడంలో జాప్యం చేసింది. ముందుగా తెలుగుదేశం సంఘీభావం ప్రకటించింది. ఆ తరువాతే బీజేపీ పవన్ కల్యాణ్ కు సంఘీభావం ప్రకటిస్తూ ముందుకు వచ్చింది. సరే ఆ సంగతి పక్కన పెడితే విజయవాడ నోవాటెల్ హోటల్ లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ బేటీ రాష్ట్ర రాజకీయాలలో పొత్తలపై చర్చను మళ్లీ తెరమీదకు తీసుకు వచ్చింది. వీరి భేటీకి ముందు మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో కార్యకర్తలతో సమావేశంలో బీజేపీ విషయంలో తన అసంతృప్తి ఇసుమంతైనా దాచుకోకుండా వ్యక్తం చేశారు. ఆ తరువాత చంద్రబాబుతో భేటీ కావడంతో ఇరు పార్టీల మధ్య వచ్చే ఎన్నికల నాటికి పొత్తు పొడిచే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన పొత్త ఖాయమనీ, బీజేపీ కలుస్తుందా లేదా అన్నది ఆ పార్టీ తేల్చుకోవలసిన అంశమని అంటున్నారు. అన్నిటికీ మించి గంట సేపు ముఖాముఖీ భేటీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య చర్చకు వచ్చిన అంశాలేమిటి? పొత్తుల ప్రస్తావన వారి మధ్య వచ్చిందా అన్న విషయంపై రాజకీయ వర్గాలలో తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. పొత్తు ఊహాగానాలకు బలం చేకూర్చే విధంగా వైసీపీ నుంచి ఒంటరి పోరుకు దమ్ముందా? అంటూ ఆవుకథలాంటి విమర్శలు వెల్లువెత్తాయి. కాగా నోవాటెల్ లో చంద్రబాబు పవన్ బేటీ సమయంలో ఓ పది నిముషాల పాటు మాత్రమే నాగబాబు, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఆ తరువాత దాదాపు గంట సేపు బాబు, పవన్ కల్యాణ్ ముఖాముఖీ ముచ్చటించుకున్నాయి. కాగా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరరు విశాఖలో ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుపై పవన్ కల్యాణ్ చంద్రబాబుకు వివరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉమ్మడి వేదిక ఏర్పాటు ఆవశ్యకతపై, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలనూ ఏకతాటిపైకి తీసుకురావాలని ఒక నిర్ణయానికి వచ్చారు. వామపక్షాలు, బీజేపీలను ఓకే వేదికపైకి తీసుకురావడం ఒకింత కష్టమైనా, రాష్ట్రంలో అరాచక పాలనను ఎదిరించేందుకు అందరినీ కలుపుకుపోవాలని ఇరువురు నాయకులూ అభిప్రాయపడ్డారు. ఇక వీరి బేటీలో ముందస్తు ఎన్నికల ప్రస్తావన కూడా వచ్చిందని అంటున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం పోరాటాలు చేస్తూనే మరో వైపు ఎన్నికలకూ సిద్ధం కావాల్సిన అవసరం ఉందని ఇరువురూ కూడా తమ సంభాషణలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. 

మూడు ప‌వ‌ర్‌గేమ్‌లు

షా నివాసంలో సౌరవ్ బహిష్కరణ స్క్రిప్ట్  కేంద్ర హోంమంత్రి అమిత్ షా 6-ఎ, కృష్ణ మీనన్ మార్గ్ అధికారిక నివాసంలో అక్టోబర్ 6 అర్ధరాత్రి జరిగిన సమావేశంలో సౌరవ్ గంగూలీకి బిసిసిఐ అధ్యక్షుడిగా రెండవసారి నిరాకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో సీనియర్‌ షా ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన కుమా రుడు జయ్ షా బీసీసీఐ కార్యదర్శిగా ఉన్నారు. కానీ అమిత్ షా ఏ రాష్ట్ర క్రికెట్ బాడీలో లేదా బీసీసీఐలో ఎటు వంటి పదవిని కలిగి ఉండరు. హాస్యాస్పదంగా, ఆ సమావేశంలో సౌరవ్‌కు రెండవసారి పదవిని నిరాకరించాలని కోరుతూ, మాజీ బీసీసీఐ అధ్యక్షుడు ఎన్‌. శ్రీనివాసన్ అతని డిమాండ్‌కు అతను చేసిన కొన్ని అవకతవ కలను పేర్కొన్నారు. వాస్త‌వానికి గంగూలీ బీసీసీఐ అధ్య‌క్ష‌స్థానంలో మ‌రింత కొన‌సాగా ల‌నే అనుకున్నాడు. అత‌న్ని కొన‌సాగించాల‌నేవారు, మ‌ద్ద‌తుదారులు ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యా ఊగిస‌లాడారు. త‌మ అబిప్రా యాన్ని స్ప‌ష్టం చేయ‌డంలో వెనుకాడారు. చాలాకాలం నుంచే దాదా ఆ ప‌ద‌విలో ఉన్నారు గ‌నుక ఇక కొత్త వారికి అవ‌కాశం ఇవ్వ‌డం వ‌ల్ల వేరే ప్రాంతీయుల‌కు అవ‌కాశం వ‌స్తుంద‌ని, త‌ద్వారా ప్రాంతీయసంస్థ‌ల విష‌యంలో ఆ రాత్రి జరిగిన సమావేశంలో తీసు కున్న ఇతర నిర్ణయాలూ కప్పి పుచ్చడం కోసం తహతహ లాడాయి. ఎన్నిక‌యిన‌ సంస్థలలో రాజవం శాల ఉనికి, ప్రచారంపై ప్రధాని నరేంద్ర మోడీ అడ్డుకుంటు న్నారు. అమిత్ షా కూడా అందుకు ఆజ్యం పోస్తు న్నారు. త‌న  నివాసంలో స‌మావేశంలో  బీసీసీఐ ఉన్న తా ధికారులు జే షాకు రెండవసారి పదవిని ఇవ్వా లని నిర్ణయించారు, అంతే కాకుండా కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధుమాల్ పేరును  ఐపీఎల్‌ చైర్మన్ పదవి కీ ఖరారు చేశారు. పత్రికా స్వేచ్ఛ  వ్యాఖ్యపై  గెహ్లాట్ విరుచుకుపడ్డారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ) గత వారం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మీడియా ప్రతి నిధులను తమ ప్రభుత్వా నికి ప్రకటనలు కావాలంటే ప్రచారం ఇవ్వాలని కోరినందుకు నిందించింది. డిసెంబర్ 16, 2019న విలేకరుల సమావేశంలో గెహ్లాట్  విజ్ఞానం కావాల‌నుకుంటే మా వార్త‌లు చూపించమ‌ ని అన్నారు. ఈ వ్యాఖ్య స‌ర‌దాగా  చేసినప్పటికీ, పిసిఐ సుమోటోగా గుర్తించి, ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి నోటీసు జారీ చేసింది. ఇటువంటి ప్రక టన ప్రజా స్వామ్య విలువలకు విరుద్ధం, మీడియా విశ్వసనీయత, స్వేచ్ఛను ప్రభావితం చేస్తుంద‌ని పిసిఐ పేర్కొం ది. రాజస్థాన్ పత్రిక రాష్ట్రదూత్ ప్రతినిధి ఈ విషయాన్ని పీసీఐ దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదుపైకి వెళ్లిన పిసిఐ విచారణ కమిటీ (ఐసి)  మీడి యాకు ప్రకటనలను ఉపయోగించడం పెద్ద అనారోగ్యం అని భావిం చింది. వార్తల ప్రవాహాన్ని ప్రభావితం చేయడానికి  గెహ్లాట్ ఈ కర్రను ఉపయో గించడ‌మేకాదు,  దీనికి ప్ర‌చా రం కూడా చేశారని, మరికొందరు మరింత విచక్షణతో ఉన్నారని కమిటీ పేర్కొంది. పిసీఐలో ప్రతి రెండవ ఫిర్యాదు ప్రభుత్వాలు,  ప్ర‌భుత్వ‌ విభాగాలు ప్రభుత్వ ప‌రిమి తిని అనుసరించని మీడియా సంస్థలకు ప్రక టనలను తిర స్కరించే సమస్యకు సంబంధించినదని పేర్కొం ది. కొన్ని మార్గదర్శ కాలు లేదా చేయవలసినవి, చేయకూడనివి రూపొం దించడానికి పిసీఐ సమస్యను లోతుగా పరిశీలించాల్సిన అవసరం  ఉం దని కమిటీ భావించింది. తోచిన‌ట్టు ఆడుతున్నారు..  ఖర్గే కాంగ్రెస్ ఓటర్లు అక్టోబర్ 17న కొత్త పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. పదేపదే నిరా కరణలు చేసినప్పటికీ, ఎన్నికల ప్రచారంలో మల్లికార్జున్ ఖర్గేకు గాంధీ కుటుంబం మద్దతు ఉందని, తత్ఫలితం గా రాష్ట్ర పార్టీ యూనిట్ల మద్దతు ఉందని సందేహం మిగిల్చింది. ఖర్గే ప్రత్యర్థి శశిథరూర్ పర్య టన సందర్భంగా ఆయనను కలుసుకుని పలకరించడానికి కూడా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నిరాకరించారు. ఇద్దరు అభ్యర్థులను సమానంగా చూడాలని పార్టీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ,  స్థాయి ఆట తీరు లేకపోవడంపై థరూర్ చేసిన ఫిర్యాదు పూర్తిగా తప్పు కాదు. కొంతమంది రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గేకు తమ రాష్ట్రాలకు చెందిన ఓటర్లందరి మద్దతు ఉంటుందని వ్యక్తి గతంగా హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఒక ముఖ్యమంత్రి  కూడా  ఖర్గేకి ఇదే హామీ ఇచ్చారు. ఎన్నికలకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాల్లో పార్టీ ఆఫీస్ బేరర్‌లు ఏ అభ్యర్థికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని కోరారు. అయితే థరూర్‌పై పరోక్షంగా దాడి చేయడం ద్వారా లేదా ఖర్గేను ప్రశం సించడం ద్వారా ఖర్గేను నెత్తినెత్తుకోవ‌డం గురించి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఖర్గే తన నామినేషన్ పత్రాలపై సంతకం చేయడానికి పార్టీలోని దాదాపు మొత్తం అగ్ర నాయకత్వాన్ని కూడా ఆకర్షించగలి గారు. ఖర్గేకు అనుకూలంగా ఈ మద్దతు కూడగట్టడం వల్ల వారు ఎవరికి ఓటు వేస్తారనే దానిపై ఓటర్ల మనస్సు లలో చిన్న సందేహం ఉంది. అందువల్ల, ఖర్గే గాంధీ కుటుంబ ప్రతినిధి అని చెప్పడం తప్పు కాదు, కుటుంబం సహాయంతో  కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. అయితే ఆయ‌న గాంధీ కుటుంబం మాట‌కే  లొంగి పార్టీ వ్య‌వ‌హారాలు చేప‌డ‌తారా, స్వంత ఆలోచ‌న‌ల‌తో కార్య‌క‌ర్త‌ల‌ను ముందుడువేయిస్తారా అన్న‌ది చూడాలి. ఎన్ని చెప్పుకున్నా, ఎంత చేసినా కాంగ్రెస్ పార్టీలో మాత్రం గాంధీ కుటుంబం మాటే చెల్లుబాటు అవుతుంది.