ముషారఫ్‌కి బూటు దెబ్బలు

      పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. మద్ధతుదారులతో సింధ్‌ హైకోర్టు బయటకు వస్తుండగా ఆయనపై శుక్రవారం ఓ ఆగంతకుడు బూటు విసిరారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా అందరూ నిశ్చేష్టులయ్యారు. బెయిల్ నిమిత్తమై ముషారఫ్ సింధ్ హైకోర్టుకు హాజరయ్యారు. ఆయనకు కోర్టు 15 రోజులపాటు బెయిల్‌ పొడిగించింది. తీర్పు పూర్తైన అనంతరం కోర్టునుంచి బయటకు వస్తున్న ముషారఫ్పై ఈ దాడి జరిగింది.   నాలుగేళ్ల  ప్రవాస జీవితం అనంతరం ఇటీవల ముషారఫ్ స్వదేశానికి వచ్చారు. ఆయన వస్తే తాము చంపేస్తామని తాలిబన్ ఉగ్రవాదులు హెచ్చరించినా ఆయన భయపడలేదు. తీవ్రవాదుల హెచ్చరికలకు తాను భయపడడని ఆయన అన్నారు. అయితే ఆయన వచ్చిన నాలుగురోజులకే ఈ సంఘటన జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయనకు భద్రత కట్టుదిట్టం చేశారు. ఆయన భారీ భద్రత నడుమనే కోర్టుకు వచ్చారు. అగంతకుడు విసిరిన బూటు కూడా ఆయనకు తగలలేదు.  

పేర్ని నానికి చెక్ పెట్టేందుకు సిద్దం అవుతున్న కాంగ్రెస్

  కాంగ్రెస్‌ పార్టీకి హ్యాండిచ్చి వైకాపాలోకి జంపు చేసిన కాంగ్రెస్ శాసన సభ్యుడు పేర్నినాని చాలా కీలకమయిన బాధ్యతలు చేపట్టవచ్చుననే గొప్పకలలు కంటూ ఆ పార్టీలోకి దూకితే అక్కడ పరిస్థితులు మరోలా ఉన్నాయి. ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నగనిపిశెట్టి గోపాల్ వంటి వారు అనేక మంది వచ్చే ఎన్నికలలో మచిలీపట్టణం అసెంబ్లీ, పార్లమెంటు నియోజక వర్గలాపై చాల ఆశలు పెట్టుకొని ఉండటంతో, హట్టాతుగా ఊడిపడిన పేర్నినాని రాకతో కలవరం చెందుతున్నట్లు సమాచారం. అదే విషయం ఇటీవల వారు నిర్వహించిన బందరు పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో చర్చకు కూడా వచ్చినట్లు సమాచారం. వారిలో కొందరు నేతలు వైకాపా అధిష్టానం తమను కాదని కొత్తగా వచ్చిన పేర్నినాని మాటకే ఎక్కువ విలువీయడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపద్యంలో పేర్నినానికి వైకాపాలో కుదురుకోవడానికి మరి కొంచెం సమయం పట్టవచ్చును.   ఇక, మరో వైపు కాంగ్రెస్ పార్టీ కూడా పేర్ని స్థానంలో ఆయనకి సమఉజ్జీలను నియమించుకొని, వచ్చే స్థానిక ఎన్నికలలోపుగానే నియోజక వర్గంలో ఆయన ప్రాదాన్యత పూర్తిగా తగ్గించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. మంత్రి కె. పార్థ సారథి, మాజీ డిప్యూటీ స్పీకర్ వేదవ్యాస్, మాజీఎంపీ బాడిగ రామకృష్ణలను ముగ్గురికీ బందరు నియోజక వర్గంలో బాధ్యతలు అప్పగించడం ద్వారా పేర్ని నానికి చెక్ పెట్టే ప్రయత్నాలు మొదలయాయి.   2004లో బందరు నుంచి ఎంపీగా గెలుపొందిన బాడిగ రామకృష్ణ ఆ తరువాత ఎన్నికలలో ఓటమి పాలవడంతో, ఆయన తన రాజకీయ కార్యకలాపాల జోరు కొంచెం తగ్గించుకొన్నారు. కానీ, మారిన రాజకీయ నేపద్యంలో, పార్టీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవవడంతో ఆయన ఇటీవలే బందరులో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, స్థానిక సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా మునిసిపల్ కమిషనర్‌ను కలిసి తాగునీటి సరఫరాపై ఆరా తీశారు. అంతే కాకుండా మునిసిపాలిటీకి రెండు నీళ్ళ ట్యాంకర్లను కూడా అందజేశారు.   మరో వైపు నుండి మంత్రి కె. పార్థ సారథి, వేదవ్యాస్ వంటి వారు కూడా తమ కార్యకర్తలతో సమావేశాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ విధంగా ముగ్గురు ఉద్దండులయిన కాంగ్రెస్ నేతలు బయట నుండి పేర్నినాని పరిధిని కుచించే ప్రయత్నాలు మొదలుపెడితే, మరో వైపు వైకాపాలో నేతల నుండి వ్యతిరేఖత కూడా ఎదుర్కోవడం పేర్నినానికి కత్తి మీద సామే అవుతుంది.   ఎన్నికలు దగ్గిర పడుతున్నకొద్దీ పార్టీ టికెట్ కోసం పోటీ తీవ్రతరం అయినప్పుడు మరి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆయనకే టికెట్ ఇస్తారో లేక మరెవరయినా దానిని ఎగరేసుకుపోతారో చూడాలి. అదే గనుక జరిగితే పేర్నినాని పని రెంటికీ చెడిన రేవడిగా మారుతుంది. అయితే, నియోజక వర్గంలో మంచి పలుకుబడి, అనుచరుల మద్దతు ఉన్న పేర్నినానికే పార్టీ టికెట్ దక్కే అవకాశాలున్నాయి. గానీ, అంతవరకు ఎదురయ్యే ఒత్తిళ్ళను భరించడమే ఆయనకు ఒక అగ్ని పరీక్ష అని చెప్పవచ్చును.

యువతితో బిజెపి ఎమ్మెల్యే లాడ్జ్ లో రాసలీలలు

        కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజులు సమయం ఉండగా బీజేపీకి గట్టి ఎదుదెబ్బ తగిలింది. ఉడిపి ఎమ్మెల్యే రఘుపతి భట్ ఓ యువతితో లాడ్జ్ లో రాసలీలలు ఆడుతూ అడ్డంగా బుక్కయ్యారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కొందరు రహస్యంగా సీసీటీవి కెమెరాల్లో బంధించి మీడియాకు విడుదల చేశారు. దీంతో ఈ వ్యవహారంపై పెద్ద దుమారం చెలరేగింది.   ఈ ఎమ్మెల్యే భార్య కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇందులో రఘుపతిభట్ ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసు పోలీసుల దర్యాప్తులో వుంది. తాజాగా మరో మరో సెక్స్ స్కాంలో అడ్డంగా దొరికిపోయారు. అయితే ఆ సీడీలో ఉన్నది తాను కాదని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరగాలని, ఏదో ఒకటి తేలే వరకు తాను ఎన్నికల్లో పోటీ చేయనని రఘుపతి భట్ స్పష్టం చేశారు.

టిడిపి ఆవిర్భావ దినోత్సవం

        తెలుగుదేశం పార్టీ 32వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. అన్ని మండలాల్లో వేడుకలు ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పెదపుడిలో ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ సంధర్బంగా పార్టీలకి సేవలందించిన సీనియర్లను చంద్రబాబు సన్మానించనున్నారు. విద్యుత్ సమస్యలపై పాత ఎమ్మెల్యే నివాస సముదాయ ప్రాంగణంలో నిరశన దీక్ష చేస్తున్న ఎమ్మెల్యేలు అక్కడే ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.

చేతులుకాలేక ఆకులు పట్టుకొన్న ప్రభుత్వం

  మొత్తం మీద ప్రతిపక్షాలన్నీ కలిసి బాబ్లీ ప్రాజెక్టుపై ఇంతకాలంగా నిద్రపోతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో నిద్రలేపగలిగాయి. నెల రోజుల క్రితం సుప్రీం కోర్టు మన రాష్ట్రానికి వ్యతిరేఖంగా బాబ్లీ ప్రాజెక్టుపై తీర్పు వెలువరించినప్పుడు దానివల్ల మన రాష్ట్రానికి ఎంత మాత్రం నష్టం లేదని బల్ల గుద్ది వాదించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో బాబ్లీపై సుప్రీం కోర్టులో పునర్విచారణకు పిటిషను వేసేందుకు అంగీకరించడమే కాకుండా అవసరమయితే ప్రతిపక్షాలను స్వయంగా డిల్లీ తీసుకువెళ్ళి కేంద్రం మీద రాజకీయ ఒత్తిడి తెచ్చేందుకు కూడా అంగీకరించారు. అయితే, ఇదే సమావేశం సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్నపుడే నిర్వహించి అన్ని పార్టీలను కలుపుకొని ఆనాడే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఉంటే ఈ రోజు బాబ్లీ ప్రాజెక్టు ఉండేదికాదు.   రాష్ట్ర ప్రయోజనాలను కాపడుకోవలాసిన సమయంలో కూడా ప్రతిపక్షాలను సంప్రదించడానికి ముఖ్యమంత్రికి అహం అడ్డుపడటంతో మహారాష్ట్ర పని సులువయిపోయింది. అదీ గాక దేనినయినా రాజకీయ అంశంగా చూసే మన రాజకీయ పార్టీల దురలవాటు కూడా ఈ అనరధానికి మరో కారణం అని చెప్పవచ్చును. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బాబ్లీపై మహారాష్ట్ర అక్రమ నిర్మాణం చేపడుతున్నపుడు దానిని ఆపడానికి ప్రయత్నించలేదు.   మహారాష్ట్రను అడ్డుకొంటే అక్కడ తన వోటు బ్యాంకుకు గండి పడుతుందని కేంద్రం నిర్లిప్తత వహిస్తే, రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు దానితో రాజకీయచదరంగం ఆడుకొన్నాయి. అయితే, ఈ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడవలసిన అధికార కాంగ్రెస్ పార్టీనే ఇందుకు పూర్తిగా తప్పు పట్టవలసి ఉంటుంది. జరిగిన తప్పు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నపటికీ అహంభావంతో, బేషజాలతో ఇంతకాలం వితండవాదం చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు తీరికగా అఖిల పక్షం పెట్టి సలహాలు కోరడం, సుప్రీం కోర్టులో పునర్విచారణకు పిటిషను వేసేందుకు అంగీకరించడం, ప్రతిపక్షాలను డిల్లీకి తీసుకువెళతానని హామీలు ఈయడం కేవలం ప్రతిపక్షాలను శాంతింప చేయడానికి మాత్రమే పనికి వస్తాయి తప్ప, మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు నుండి అక్రమంగా నీళ్ళని వాడుకోకుండా ఆపలేవు. ఇది కేవలం చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం తప్ప మరొకటి కాదు.   కనీసం ఇప్పటికయినా ప్రభుత్వానికి ఈవిషయంలో చిత్తశుద్ధి కానీ పశ్చాతాపం కానీ లేకపోవడం విచారకరం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి, అసమర్ధతకు , నిర్లక్ష్యానికి రైతన్నలు మూల్యం చెల్లించవలసి రావడం దారుణం.

ఎన్టీఆర్ ను వెంటాడుతున్న ఫ్లెక్సీ పాలిట్రిక్స్

        యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను ఫ్లెక్సీ లా వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాను తెలుగుదేశం పార్టీని వీడి బయటకు వచ్చేది లేదని గతంలోనే స్పష్టం చేశారు. జగన్ పార్టీ వైఎస్ఆర్.కాంగ్రెస్ మాత్రం తమ పార్టీ ఫ్లెక్సీ లలో ఎన్టీఆర్ ఫోటో పెట్టడం మాత్రం మానడం లేదు. లేటెస్ట్ గా షర్మిలా పాదయాత్ర స్వాగతం చెబుతూ విజయవాడలో కట్టిన ఫ్లెక్సీలో వైకాపా నేతలతో ఎన్టీఆర్ ఉండడం కలకలం రేపుతోంది.   వైకాపా ఫ్లెక్సీలో ఎన్టీఆర్ ఉండడం ఇది మొదటిసారి కాదు. కొన్నిరోజుల క్రితం మచిలీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లో జగన్, కోడాలి నాని తో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫోటో దర్శనమిచ్చింది. ఎన్టీఆర్...జగన్ మీద అభిమానంతో ఆ ఫ్లెక్సీ నేనే పెట్టానని ఓ అభిమాని వివరణ ఇవ్వడంతో వ్యవహారం సద్దుమనిగింది. ఆ వివాదం ముగిసి రెండు రోజులు కాకముందే మళ్ళీ ఎన్టీఆర్ ఫోటో ప్రత్యక్షమవడంతో..టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ పార్టీ ఓట్ల కోసం ఎన్టీఆర్ ఫోటో వాడుకుంటున్నారని విమర్శించారు. ఈ వివాదం పెద్దది కాకముందే..ఎన్టీఆర్ అభిమానులు పోలీసులకు పిర్యాదు చేసి ఎన్టీఆర్ వున్న ఫ్లెక్సీ ని తొలగించారు.

టిడిపి దీక్ష: క్షీణించిన ఎమ్మెల్యేల ఆరోగ్యం

        విద్యుత్ సమస్యలపై ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిరవధిక దీక్ష చేపట్టిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులలో జైపాల్ యాదవ్, అనసూయ, సత్యవతి, రాథోడ్, సీఎం రమేష్, శ్రీరాం రాజగోపాల్, దేవినేతి ఉమ, కె. శ్రీధర్, ఆంజనేయులు ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు పేర్కొన్నారు. వారికి తక్షణం వైద్య సహాయం అందించాలని డాక్టర్లు పోలీసులకు సూచించారు. కాగా టీడీపీ నేతలు వైద్య సహాయానికి నిరాకరిస్తూ, తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగి వచ్చేవరకు దీక్ష విరమించేది లేదని వారు స్పష్టం చేశారు.   మరోవైపు విద్యుత్ సమస్యలపై టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరవధిక దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడమే విద్యుత్ సమస్యలకు కారణమని వారు ఆరోపించారు. విద్యుత్ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని, సకాలంలో కరెంట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ నేతలను ప్రజలు గ్రామాల్లోకి రానివ్వరని టీడీపీ ఎమ్మెల్యేలు హెచ్చరించారు.  

జగన్ పార్టీలోకి జోగి రమేష్

      కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా పెడన శాసనసభ్యుడు జోగి రమేష్ జగన్ పార్టీలోకి చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం సమంయలో జోగి రమేష్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన విషయం తెలిసిందే. ఆఖరు నిమిషం వరకు తాను ప్రభుత్వానికి అండగా ఉంటానని చెప్పిన జోగి రమేష్ చివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు లేచి నిలబడి కాంగ్రెసుకు షాక్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన తాను జగన్ పార్టీలోకి వెళ్తానని ప్రకటించారు.   ఈరోజు జోగి రమేష్ చంచల్ గూడ జైల్లో ఉన్న జగన్ ను ములాఖత్ సమయంలో కలిశారు. పెడన నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చేందుకు రమేష్ కు జగన్ హామీ ఇచ్చారని సమాచారం.  

రాహుల్ భజన చేయోద్దంటే వినరూ...

  పుట్టుకతో వచ్చిన బుద్దులు పుడకలతోగానీ పోవంటారు పెద్దలు. అదేవిధంగా అధిష్టానానికి భజన చేయడానికి అలవాటు పడిపోయిన కాంగ్రెస్ ప్రాణులు రాహుల్ గాంధీ ఎంత వద్దని మొట్టుకొంటున్నా ఆయన భజన చేయడం ఆపలేకపోతున్నారు. ఆయన పార్టీని, ఇంకా వీలయితే దేశాన్ని సమూలంగా మార్చిపారేద్దామని కలలుగంటుంటే, అది అంత వీజీ కాదంటున్నారు ఆ పార్టీ నేతలు. అధికార వికేంద్రీకరణ జరిగి దేశంలో మారుమూలనున్న పార్టీ కార్యకర్తకి కూడా పార్టీలో ఉన్నత పదవులు చేపట్టే అవకాశం కల్పించాలని రాహుల్ గాంధీ ఆలోచిస్తుంటే, ‘అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ’ అంటూ రాహుల్ గాంధీ తప్ప మరెవరికీ అధికార పగ్గాలు చెప్పట్టే యోగ్యత, హక్కు లేవని బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు దిగ్విజయ్ సింగు వంటి సీనియర్ నేతలు.   “రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి పదవి చేపట్టనని ఎవరితో ఎన్నడూ అనలేదు. ప్రధాని పదవి కంటే ప్రజా సంక్షేమానికే తానూ అధిక ప్రాదాన్యం ఇస్తానని ఆయన అంటే, మీడియా దానిని వక్రీకరించి “ఆయన ప్రధాని పదవి మీద ఆసక్తి లేదు, మన్మోహన్ సింగు తరువాత ఎవరు ప్రధాని బాధ్యతలు చేపడతారు?” అంటూ ఒక పెద్ద చర్చ కూడా మొదలుపెట్టేసింది. అయితే, వచ్చే ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత లభిస్తే, తప్పనిసరిగా ఆయనే ప్రధాని పదవి చెప్పట్టాలని నేను కోరుకొంటాను."   "అసలు పార్టీ అధ్యక్ష పదవిని , ప్రధాన మంత్రి పదవిని ఒకరే చేపట్టడం మంచిదని నా అభిప్రాయం. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంతవరకు ప్రభుత్వ వ్యవహారాలలో ఎన్నడూ కల్పించుకోలేదు. అయినప్పటికీ యుపీయే-1&2 లలో రెండు అధికార కేంద్రాలు ఉండటం వలన ప్రజలలో, పార్టీలో, ప్రభుత్వంలో కూడా కొంత గందరగోళం ఏర్పడినట్లు నేను భావిస్తున్నాను. అందువల్ల పార్టీని, ప్రభుత్వాన్ని ఒకరే నడిపిచినట్లయితే ఆ బాధ్యతలు చెప్పటిన వ్యక్తికి రెంటి మీద పూర్తి ఆదిపత్యం కలిగి ఉండటమే కాకుండా, దానివల్ల ఆ రెండు వ్యవస్థల మధ్య చక్కటి సమన్వయం కూడా ఏర్పడుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం,” అంటూ తన రాహుల్ గాంధీ భజన కార్యక్రమం ముగించారు కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి దిగ్విజయ్ సింగు.

బాలీవుడ్ సంజయ్ దత్ కంట నీరు

        మీడియా సమావేశంలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ కన్నీళ్ళ పర్యంతమయ్యారు. సుప్రీం కోర్టు తీర్పు కు కట్టుబడి వుంటానని, ఇచ్చిన గడువులోపే లొంగిపోతానని ఆయన చెప్పారు. క్షమాభిక్షకు ఎలాంటి దరఖాస్తు పెట్టుకోనని స్పష్టం చేశారు. క్షమాభిక్షకు అర్హులైనవారెందరో వున్నారని అన్నారు. తన కుటుంబానికి,తనకు ఇది కష్ట సమయమన్న సంజయ్ దత్ ఎలాంటి సమయంలో తమకు అండగా నిలిచినవారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఎంతో ఉద్వేగంతో నాలుగు మాటలు మాత్రమే మాట్లాడి వెళ్లిపోయారు. ఆయన వెంట సోదరి ప్రియాదత్ ఉన్నారు. కాగా సంజయ్‌దత్ కోసం క్షమాభిక్ష పిటిషన్‌ను వేయనున్నట్లు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ మార్కెండేయ కట్జూ ప్రకటించారు.

శ్రీలంక మిత్రదేశం కాదు ... జయలలిత

  శ్రీలంకకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అసెంబ్లీలో తీర్మానం పెట్టగా ఈ తీరమానానికి అన్ని పార్టీలు మద్ధతు తెలపటంతో సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. శీలంకలో ప్రత్యేక తమిళ రాష్ట్రం ఈలం కోసం తమిళులు నివసిస్తున్న ప్రాంతాల్లో రెఫరెండం నిర్వహించాలని, తమిళుల ఊచకోతపై అంతర్జాతీయ స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని, తమిళుల హత్యాకాండకు బాధ్యులైన వారిని అంతర్జాతీయ న్యాయస్థానం ముందు నిలబెట్టి తగిన విధంగా శిక్షించాలని, శ్రీలంక తమిళుల అణిచివేటను ఆపాలని ఈ తీర్మానం డిమాండ్ చేసింది. భారతదేశం శ్రీలంకకు మిత్రదేశం హోదాను రద్దుచేయాలని, ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలు విధించాలని జయలలిత కేంద్రానికి ఒక లేఖ రాశారు.

పార్టీలోనే కొనసాగుతా ... వంశీ

  విజయవాడ ఎంపి, విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడు వల్లభనేని వంశీ గాలివార్తలకు తెరదించారు. ఆయన స్థానంలో విజయవాడ లోక్ సభ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా కేశినేని శ్రీనివాస్ (నాని),  నగర పార్టీ అధ్యక్షునిగా నాగుల్ మీరాను, రాష్ట్ర కమిటీలోకి వంశీని మంగళవారం తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. దీంతో వంశీ అనుచరులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే వంశీ మాత్రం తనకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాటే తనకు శిరోధార్యమని, ఆయన మాట ఏదీ కాదనలేదని, ఏ బాధ్యతలు అప్పగించినా సంతోషంగా నిర్వహిస్తానని తెలిపారు తాను తెలుగుదేశం పార్టీని వీడి వేరే పార్టీలోకి వెళుతున్నట్లు వస్తున్న పుకార్లు అవాస్తమని వల్లభనేని వంశీ బుధవారం తెరదించారు.  గన్నవరం సీటు ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తాననడం కూడా పుకారే అని వంశీ తెలిపారు.

గ్రామ పంచాయితీ ఎన్నికలు జూన్ లో ...

  రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన బుధవారం రాత్రి మంత్రులతో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలు గురించి వ్యాహాన్ని రూపొందించారు. మేలో జరగాల్సిన గ్రామపంచాయితీ ఎన్నికలను జూన్ నెలలో జరిపించాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏప్రిల్, మే రెండునెలలు ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాలో విస్తృతంగా పర్యటించాలని కూడా నిర్ణయించారు. జగజ్జీవన్ రాం జయంతి నుంచి అంబేడ్కర్ జయంతి వరకు అంటే ఏప్రిల్ 5 నుండి 14 వరకు ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక చట్టబద్ధత కల్పించిన అంశంపై ప్రచారం చేసేందుకు ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటిస్తారు. ఏప్రిల్ 11వ తేదీన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రవీంద్రభారతిలో పేదలకు సబ్సీడీ ధరలకు వివిధ నిత్యావసర వస్తువులు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. అలాగే మండల కేంద్రాల్లో ఏప్రిల్ 15 నుంచి మండల కేంద్రాల్లో ప్రారంభిస్తారు. రైతు చైతన్య యాత్రలను ఏప్రిల్ 21 నుండి మే 8 వరకు, రెవెన్యూ డివిజన్ స్థాయిలో రైతు సదస్సులు మే10 నుండి 15 వరకు, ఏప్రిల్ 25 నుండి 10 వరకు స్థాయీ సంఘాల సమావేశాలు జరపాలని నిర్ణయించారు. జూన్ లో గ్రామ పంచాయితీల ఎన్నికలు నిర్వహిస్తారు. గ్రామ పంచాయితీల ఎన్నికల తరువాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారు.

విద్యుత్ పై తెలుగుదేశం సమరశంఖం

  ఇందిరా పార్క్ వద్ద లెఫ్ట్ నేతల నాలుగురోజుల నిరాహారదీక్షను భగ్నం చేసి గాంధీ ఆసుపత్రికి తరలించింది. బుధవారం లెఫ్ట్ నేతలు దీక్షను విరమించారు. ఇప్పుడు తెలుగుదేశం వంతు మొదలైంది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లొ తెలుగుదేశం ఎమ్మెల్యేలు నిరాహారదీక్షలు మొదలుపెట్టారు. బుధవారంతో రెండు రోజుల దీక్ష దిగ్విజయంగా పూర్తిచేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉన్న పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ సభ్యులతో ఫోన్ లొ మాట్లాడి కార్యాచరణ గురించి సమీక్షించారు. తెలుగుదేశం పార్టీ దీక్షా శిభిరానికి లెఫ్ట్ పార్టీ నేతలు తరలివచ్చి వారికి మద్ధతు పలికారు. బుధవారం మధ్యాహ్నం భేటీ అయిన పది లెఫ్ట్ పార్టీ నేతలు భవిష్యత్తులో చేపట్టవలసిన  కార్యాచరణను రూపొందించారు. ఏప్రిల్ 1న జిల్లా, మండల కేంద్రాలలో నిరసనలు చేపట్టాలని, ఏప్రిల్ 9న రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు. కరెంట్ ఛార్జీలు, పవర్ కట్, సర్ ఛార్జీలు ప్రభుత్వమే భరించేలా రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచే వరకు నిరాహార దీక్షలు విరమించకూడదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గట్టిగా నిర్ణయించుకున్నారు.

హోలీ వేడుకల్లో విషాదం

        జిల్లాలోని బుధవారం హోలీ సంబరాల్లో విషాదం చోటు చేసుకుంది, హోలీ అడిన అనంతరం స్నానానికి వెళ్ళిన ఐదుగురు విద్యార్ధులు దుర్మరణం చెందారు. జిల్లాలోని సిరికొండ మండలం, బసంత్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్ధుల మృతితో స్థానికంగా విషాదం అలుముకుంది. మరోవైపు కూకుట్‌పల్లి హోలీ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఐడీఎల్ చెరువులో ఈతకు వెళ్లిన ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

రాష్ట్రాన్ని కాంగ్రెస్ చీకటిలోకి నెట్టింది

        రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చీకటిలోకి నెట్టిందని, కరెంట్ కష్టాలకు ప్రభుత్వమే కారణమని, విద్యుత్ విషయంలో ముందుచూపు లేకపోవడమే దీనికి కారణమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. గత 20 ఏళ్లలో ఇంత సంక్షోభం ఎప్పుడు చూడలేదని, కరెంట్ కష్టాలతో జనం అల్లాడుతున్నారని ఆయన అన్నారు.   టీడీపీ హయాంలో వ్యవసాయానికి తొమ్మిది గంటలు కరెంట్ సరఫరా చేశామని, ఈ ప్రభుత్వ హయాంలో కరెంట్ ఇప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని చంద్రబాబు ధ్వజమెత్తారు. వర్షాలు కురిస్తే కరెంట్ ఇస్తామంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే గ్యాస్ ఎగుమతి అవుతోందని, విద్యుత్ వ్యవస్థకు సంబంధించి సీఎం వద్ద ప్రణాళిక లేదని ఆయన ఆరోపించారు. విద్యుత్ సమస్యపై వామపక్షాలతో కలిసి టీడీపీ పోరాటం చేస్తుందని, వైఎస్సార్‌సీపీతో కలిసి పోరాడే సమస్యేలేదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

వల్లభనేని వంశీ అసంతృప్తి

        టిడిపి పార్టీ నాయకుడు వల్లభనేని వంశీమోహన్ తనకు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మొన్నటి వరకూ విజయవాడ లోక్ సభ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న వంశీకి ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి తప్పించి, కొత్త బాధ్యతలు అప్పగించారు. తనకు ఏ పదవి అక్కర్లేదని , తాను సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని ఆయన అంటున్నారు. విజయవాడ లోక్ సభ స్థానం బాధ్యతలు కేశినేనినానికి అప్పగించగా, వల్లభనేనికి ఇంకా నియోజకవర్గం ఏదీ కేటాయించినట్టు లేదు. గతంలో గన్నవరం శాసనసభ స్థానం పార్టీ టిక్కెట్ తనకు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఒకవేళ ఆయన ఇవ్వకపోతే, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని వంశీ స్పష్టం చేశారు.

ఈ ‘దూకుడు’ లాభించేనా?

  గత కొంత కాలంగా ప్రతిపక్షాలతో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మొదట్లో పార్టీ వర్గాలు, మీడియా కూడా మెచ్చుకొన్నపటికీ అది చూసి మరి కొంచెం అతిగా వ్యవహరిస్తున్న ఆయన ధోరణిని ఇప్పుడు అదే పార్టీవర్గాలు, మీడియా కూడా తీవ్రంగా విమర్శించడం మొదలుపెట్టాయి.   ముఖ్యమంత్రిలో గణనీయమయిన ఈ మార్పు సహకార ఎన్నికల తరువాత నుండే మొదలయిందని చెప్పవచ్చును. సహకార ఎన్నికలలో పార్టీలో ఎవరూ సహకరించకపోయినప్పటికీ, ఆయన ఒంటి చేత్తో పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవడమే అందుకు కారణం అని చెప్పవచ్చును. ఆ తరువాత ప్రతిపక్షాలు తన ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా అవలీలగా వీగిపోవడంతో ఆయన ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. కానీ, అవిశ్వాసానికి తెదేపా దూరంగా ఉనందునే తన ప్రభుత్వం నిలబడి ఉందని ఆయనకు తెలిసినప్పటికీ, తెదేపా తనపై అవిశ్వాసానికి మద్దతు ఈయలేని నిస్సహాయ స్థితిలో ఉందని ఆయన భ్రమించడమే ఆయనకు కొండంత దైర్యం ఇచ్చి ఆయన దూకుడు కొనసాగించేలా చేస్తోంది.   ఇప్పుడు ఆయన ప్రవర్తన చూస్తుంటే, కిరణ్ కుమార్ అసలు నైజం ఇదే అయినప్పటికీ, ఇంత కాలం పార్టీలో, ప్రభుత్వంలో పరిస్థితులు తనకు వ్యతిరేఖంగా ఉనందునే సాత్విక ముసుగు వేసుకోవలసి వచ్చిందేమోననిపిస్తుంది.   కొద్ది నెలల క్రితం ఇదే ముఖ్యమంత్రి రవీంద్రభారతిలో విద్యార్దులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘ఎన్ని రోజులు పదవిలో ఉంటానో’ అంటూ వైరాగ్యం ప్రదర్శించారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు వచ్చే ఎన్నికల తరువాత కూడా తానే ముఖ్యమంత్రిగా కొనసాగబోతునట్లు దృడంగా విశ్వసిస్తున్నట్లు కనబడుతున్నారు.   అయితే, క్రమంగా ఆయన దూకుడు అహంకారంగా మారుతుండటంతో ఇప్పుడు అన్ని వర్గాల నుండి విమర్శలు మూట కట్టుకొంటున్నారు. కొద్ది రోజుల క్రితం తెరాస నేత హరీష్ రావుకి దీటుగా సమాధానం చెబుతూ ‘తెలంగాణకు ఒక్క నయాపైసా కూడా విదిలించాను ఏమి చేసుకొంటారో చేసుకోండి’ అని ఆయన అనడం తెరాస నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.   ఆ తరువాత మొన్న శాసన సభలో ‘కాగ్ నివేదిక అంటే అదేమి బైబిలో భగవద్గీతో కాదు అందులో చెప్పినవన్నీ నిజాలని నమ్మడానికి’ అంటూ కాగ్ నివేదికలను సైతం ఆయన తప్పుపట్టారు. మళ్ళీ అదే కాగ్ చేత ఆ మరునాడే అక్షింతలు వేయించుకోవలసి వచ్చింది.   ఒకవైపు విద్యుత్ కోతలతో నీళ్ళు అందక పంటలు ఎండిపోతుంటే, రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క ఎకరం కూడా నీళ్ళు అందక ఎండిపోలేదని ఆయన శాసనసభలో చాల గట్టిగా వాదించడం చూసిన తరువాత మేధావులు సైతం ఆయన ధోరణిని అసహ్యించుకోవడం మొదలుపెట్టారు. అదే విధంగా విద్యుత్ బిల్లులు పెరిగితే ప్రజలు తప్పనిసరిగా ఆ భారం బరించాల్సిందే అంటూ దురుసుగా మాట్లాడి ప్రజలలో కూడా తనను తానూ చులకన చేసుకొన్నారు. అందుకు ప్రతిచర్యగా ప్రతిపక్షాలు అన్నీ ధర్నాలు నిరాహార దీక్షలు చేయడం, చివరికి వారి ఒత్తిడికి తట్టుకోలేక ఆయన విద్యుత్ బిల్లుల పెంపు విషయంలో వెనక్కి తగ్గాల్సిరావడం ఇటీవల కాలంలో ‘పెరిగిన ఆయన రేటింగ్స్’ పెరిగినంత వేగంగానూ పడిపోయేలా చేసాయి.   నానాటికి అడ్డు ఆపులేకుండా పెరుగుతున్న ధరలు, విద్యుత్ కోతలు, విద్యుత్ లేకపోయినా సామాన్య ప్రజలకు షాకులు ఇస్తున్న విద్యుత్ బిల్లులు వంటి అనేక ప్రతికూల అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా, కేవలం కాంగ్రెస్ అధిష్టానం అండదండలు చూసుకొని, రాష్ట్రంలో ప్రతిపక్షాల మద్య జరుగుతున్న తీవ్రయుద్ధాలను చూసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో ఇప్పుడు ‘తన గాలి వీస్తోందనుకొంటే’ అంతకంటే పొరపాటు ఉండదు.   కాంగ్రెస్ పార్టీలో ఎవరి పరిస్థితి ఎల్లకాలం ఒకేలా ఉండదని ఆ పార్టీ చరిత్ర తెలిసిన వారెవరయినా చెప్పగలరు. ఆయన ఎంత అకస్మాత్తుగా ముఖ్యమంత్రి అయ్యారో అంతే అకస్మాతుగా దాని నుండి దింపబడినా ఆశ్చర్యం పోనవసరం లేదు. అటువంటప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఇంత దురుసుగా వ్యవహరించడం అంటే తానూ కూర్చొన్న కొమ్మను తానే నరుకొంటున్నట్లు అవుతుంది. ఉన్న కొద్దిపాటి సమయంలో ‘ఫలానా కిరణ్ కుమార్ అనే ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఈ గొప్ప పనులు చేసారు’ అనే పేరు సంపాదించుకోగలిగితే అదే ఆయనకు శ్రీ రామరక్షగా నిలుస్తుంది తప్ప ఈ ‘దూకుడు’ మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పవచ్చును.

దీక్ష చేస్తున్న నేతలతో మాట్లాడిన చంద్రబాబు

        విద్యుత్ సమస్యలపై ఓల్ట్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిరవధిక దీక్ష చేపట్టిన 26 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో తూ.గో జిల్లాలో వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. దీక్షలకు సంఘీభావంగా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని నేతలకు బాబు పిలుపునిచ్చారు. విద్యుత్ బిల్లులను దగ్ధం చేసి నిరసన తెలపాలని సూచించారు.  మరోవైపు విద్యుత్ సమస్యలపై టీడీపీ పోరుబాట కొనసాగుతోంది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో 26 మంది టీడీపీ ఎమ్మెల్యేలు నిరవధిక దీక్షలు రెండోరోజుకు చేరుకున్నాయి. సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఎమ్మెల్యేల దీక్షకు మద్దతు ప్రకటించారు.