మెదక్, నందిగామ పోలింగ్ పూర్తి
తెలంగాణలోని మెదక్ లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ కష్ణాజిల్లా నందిగామ శానసనభ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు. మెదక్ లోక్‌సభ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు 63.14 శాతం, నందిగామలో 63 శాతం ఓట్లు పోలయ్యాయి. మెదక్ లోక్‌సభ పరిధిలోని సిద్దిపేటలో 64.5, మెదక్‌లో 63, నర్సాపూర్‌లో 76, సంగారెడ్డిలో 60, పటాన్చెరులో 49, దుబ్బాకలో 64.5, గజ్వేల్‌లో 65 శాతం ఓట్లు పోలయ్యాయి.