పాలేరు ఉపఎన్నిక నగారా.. మే16న పోలింగ్
ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నిక షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 22వ తేదీన నోటిఫికేషన్, అదే రోజు నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ, 30న నామినేషన్ల పరిశీలన, మే 2వతేదీన నామినేషన్ల ఉపసంహరణ, 16న పోలింగ్, 19న లెక్కింపు, అదే రోజు ఫలితాల వెల్లడి ఉంటుందని ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. కాగా పాలేరు నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న రాంరెడ్డి వెంకటరెడ్డి గత నెల 4వ తేదీన మరణించడంతో ఈ నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైంది. మేఘాలయలోని తురా పార్లమెంటరీ నియోజకవర్గంతోపాటు ఏడు రాష్ర్టాల్లోని తొమ్మిది శాసనసభా స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నది.