మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మోడీ.. ఇంటర్నెట్లో జోకులు
ప్రధాని నరేంద్ర మోడీ మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో పెట్టిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇటీవలే మోడీ కొలతలు తీసుకెళ్లిన మ్యూజియం సిబ్బంది.. అప్పుడే మోడీ విగ్రహాన్ని తయారు చేసి దానిని మ్యూజియంలో ఉంచారు. మోడీ కూడా తన విగ్రహాన్ని చూసి ఎంతో సంబరపడిపోయారు. ఇక బీజేపీ నేతలు కూడా ప్రపంచంలో ప్రముఖ నాయకుల సరసన మోడీ చేరినందుకు సంతోషపడుతున్నారు. మేడమ్ టుస్సాడ్ మ్యూజియపు సింగపూర్, బ్యాంకాక్, హాంకాంగ్ శాఖలలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటుచేసారు. తెలుపు రంగు కుర్తా పైజామా, క్రీమ్ కలర్ జాకెట్ తో నమస్కార భంగిమలో ఆ విగ్రహం ఉంది. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఇంటర్నెట్లో మాత్రం మోడీ మైనపు విగ్రహంపై పలు జోకులు, సెటైర్లు హల్ చల్ చేస్తున్నాయి. ఆ జోకులేంటే మనం కూడా ఓ లుక్కేద్దాం..
**మోడీని మరింత ఎత్తుగా, తెల్లగా తయారుచేశారు. అంతేకాదు ఇక ఆయన వెళ్లిన చోటల్లా శాశ్వతంగా చేతులు కిందకు దించకుండా నమస్కార భంగిమలోనే ఉండవచ్చని ఒకరు అన్నారు.
**నిజమైన మోడీ మైనపు మోడీతో: హే.. చూసావా.. ఇప్పుడు భారతీయులకు ఇద్దరు మోడీలున్నారు. నువ్వు దేశంలో ఉండూ నేను ప్రపంచ దేశాలను పర్యటనలుగా చుట్టేసి వస్తాను.. మన ఇద్దరి తేడా ఎవరూ కనిపెట్టలేరు.
**యూపీఏ ప్రభుత్వం చేయలేని ఘనకార్యాన్ని మోడీ సాధించారు. ఆయన మోడీని దేశానికి రప్పించారు.
**ఈ ఇద్దరిలో తండ్రెవరూ.. కుమారుడెవరో చెప్పలేక మీడియా బుర్రలు బద్ధలుకొట్టుకుంటోందంటూ ఇంకొక ట్వీట్ వాలా జోక్ చేసాడు.