మహిళపై అనుచితంగా ప్రవర్తించిన హోం మినిస్టర్.. అడ్డంగా బుక్కయ్యారు..
posted on Apr 21, 2016 @ 5:06PM
మహిళలపై రాజకీయ నాయకులు అప్పుడప్పుడు వివదాస్పద వ్యాఖ్యలు చేయడం.. అనుచితంగా ప్రవర్తించడం జరుగుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ ఓ హోమంత్రి గారు కావాలనే ఓ మహిళ పట్ల అనుచింతంగా ప్రవర్తించి అడ్డంగా బుక్కయ్యారు. ఇంతకీ ఆ మంత్రి గారు ఎవరంటే.. మధ్యప్రదేశ్ సీనియర్ నాయకుడు, హోం మంత్రి బాబూలాల్ గౌర్. ఓ కార్యక్రమంలో ఆయన అక్కడ ఏర్పాటు చేసిన ఓ బస్సులో పలువురు ఎక్కుతున్న సమయంలో ఒక మహిళను ఉద్దేశ పూర్వకంగా చేతులతో తాకారు. చుట్టూ కార్యకర్తలు ఉండడంతో ఎవరికీ కనిపించబోదనే ఉద్దేశంతో ఓ మహిళ బస్సు ఎక్కుతుండగా ఆమెను టచ్ చేశారు. అక్కడే మంత్రిగారు పప్పులో కాలేశారు. కార్యకర్తలు చూడలేదు కాని అక్కడ ఏర్పాటు చేసిన ఓ కెమెరాలో సదరు మంత్రిగారి ఈ నీచ ప్రవర్తన రికార్డయింది. మొత్తానికి కెమెరా పుణ్యమా మంత్రిగారు అడ్డంగా బుక్కయ్యారు. మరి దీనిపై ఎలా స్పందిస్తారో.