నన్ను నేను చంపుకోవాలనిపిస్తోంది...
అందాల తార శ్రీదేవి మరణంపై అనుమానాలు క్షణక్షణం ఉత్కంఠభరితంగా మారాయి. తమ బంధువుల పెళ్లికి గాను దుబాయి వెళ్లిన శ్రీదేవి అక్కడే హార్ట్ అటాక్ రావడంతో అక్కడే మరణించింది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మాత్రం కార్డియాక్ అరెస్ట్ కాదని తేలడంతో అసలు అనుమానాలు మొదలయ్యాయి అందరికి. దీంతో అసలు శ్రీదేవి చనిపోవడానికి కారణం ఏంటని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక టీవి ఛానల్స్ అయితే మినిట్ టు మినిట్ అప్ డేట్ ఇస్తూ.. ఇంకా టెన్షన్ పుట్టిస్తున్నారు. దీంతో యావత్ భారత్ దేశం మొత్తం ఆమె మరణం వెనుక ఉన్న అసలు నిజం ఏంటి....? అక్కడ విచారణ ఎప్పుడు ముగుస్తుంది...? ఆమె డెడ్ బాడీ ఎప్పుడు ఇండియా వస్తుంది..? అని ఎదురుచూస్తున్నారు. మరోపక్క ఆమె అభిమానులు మాత్రం తమ అభిమాన నటి మృతిపై వస్తున్న వార్తలను చూసి బాధపడుతున్నారు.
మరి శ్రీదేవిని దేవతగా భావించే రామ్ గోపాల్ వర్మ పరిస్థితి ఏంటి..? ఇప్పటికే ఆమె మృతిపై స్పందించిన వర్మ... దేవుడిని తిట్టిపోశాడు. ఇప్పుడు ఈ వార్తలపై కూడా స్పందిస్తూ.... శ్రీదేవి జీవించి ఉన్నప్పుడు ఆమె అందం, శరీరం, హావభావాలు, పెదాలు, నడుము గురించి మాట్లాడుకునే వారని... కానీ, ఇప్పుడు ఏవోవే మాట్లాడుకుంటున్నారని... ఆమె రక్తంలో మద్యం ఉందని, ఊపరితిత్తుల్లో నీళ్లు ఉన్నాయని, పొట్టలో ఇంకేవో ఉన్నాయని అంటున్నారని ‘‘ఎవరి జీవితమన్నా ఇంత భయంకరంగా, ఇంత విషాదంగా ముగుస్తుందా? ఆమె మరణవార్తను ఇలా ఇన్ని రకాలుగా వినాల్సి రావడం బాధాకరం. ఇదంతా చూస్తుంటే నన్ను నేను చంపుకోవాలనిపిస్తోంది’’ అని వర్మ ట్వీట్ చేశాడు. నిజంగా వర్మ అన్నట్టు అప్పుడు ఆమె అందాన్ని, అభినయాన్ని గురించి మాట్లాడుకున్న వాళ్లు... ఇప్పుడు అదే శ్రీదేవి మృతి గురించి ఇలా మాట్లాడుకోవడం ఎంతైనా బాధాకారం...