శాంతిని కూతుర్లా భావించావా... మా నాయనే!

‘ఏరా’ విజయసాయిరెడ్డి కళింగిరి శాంతిని కూతుర్లా భావించాట్ట. ఈ గొప్ప విషయాన్ని తెలియజేస్తూ శనివారం నాడు ‘ఏరా’ విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ చేశాడు. సాధారణంగా ‘ఏరా’ ఎప్పుడైనా ట్వీట్ చేశాడంటే, దాని నిండా కడుపులో తిప్పే స్థాయిలో బూతులు, ఆరోపణలు వుంటాయి. ఇప్పుడు కళింగిరి శాంతి వ్యవహారంలో పీకల దాకా కూరుకుపోయి వున్న ‘ఏరా’ విజయసాయిరెడ్డి ట్వీట్లు డిఫెన్స్ మోడ్‌లోకి మారిపోయాయి. పరనిందతో నిండి వుండే ఆయన ట్వీట్లు ఇప్పుడు ఆత్మస్తుతిలోకి షిఫ్ట్ అయిపోయాయి. శనివారం నాడు ‘ఏరా’ విజయసాయిరెడ్డి హృదయాలను కదిలించే విధంగా ట్వీట్ చేశాడు. అందులో మేటర్ ఏంటంటే, ‘‘అవాస్తవాలు ప్రచారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్ళు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజా ప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం వుంది. శాంతి కళింగిరిని 2020 సంవత్సరంలో ఎండోమెంట్స్ ఆఫీసర్‌గా వైజాగ్ సీతమ్మధార ఆఫీసులో మొట్టమొదటగా మీట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూతురుగానే భావించాను. ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశాను. తనకు కొడుకు పుట్టాడంటే వెళ్ళి పరామర్శించాను. మా తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించాను. ఏ పరాయి మహిళతోను, అనైతిక / అక్రమ సంబంధాలు లేవు. నేను నమ్మిన దేవదేవులు శ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా చెప్తాను’’ ఇదీ మేటర్... ఈ ట్వీట్ మీద అసలు మేటర్లోకి వెళ్ళేముందు, ‘ఏరా’ విజయసాయి రెడ్డికి ఒక హెచ్చరిక... నీ తొక్కలో ఇష్యూలన్నిట్లోకి వెంకటేశ్వరస్వామిని లాగకు. ఆయనతో పెట్టుకుని నీ ఏ1, ఆయన ఫాదర్ కూడా మటాష్ అయిపోయారు. శాంతిని కూతుర్లా భావించావో, నాయనమ్మలా భావించావో... నీ ఏడుపేదో నువ్వు ఏడువు.. నీ తంటాలు నువ్వు పడు.. ఓవర్ బిల్డప్ ఇవ్వడానికి స్వామివారి పేరు ఉపయోగించావంటే నీకు మామూలుగా ఇత్తడైపోదు.. బీ కేర్‌ఫుల్! ఇక అసలు మేటర్లోకి వస్తే, ‘ఏరా’ విజయసాయిరెడ్డికి, శాంతి అక్రమ సంబంధం వుందనిగానీ, ఆమెకి పుట్టిన కొడుకుకు తండ్రి విజయ సాయిరెడ్డి అని గానీ, మీడియావాళ్ళు ఎవరూ అనడం లేదు. సదరు శాంతి భర్త నెత్తీనోరూ బాదుకుంటూ మీడియా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ చెప్పుకుంటున్నారు. మొన్న నువ్వు వైజాగ్‌లో ఒక దిక్కుమాలిన ప్రెస్‌మీట్ పెట్టి చెత్త వాగుడంతా వాగితే మీడియా కవరేజ్ ఇచ్చింది కదా.. అదే విధంగా శాంతి భర్త మదన్ మొత్తుకుంటున్నదానికి కూడా కవరేజ్ ఇస్తోంది అంతే. ఆమాత్రం దానికి నువ్వు మీడియా వాళ్ళని ఆడిపోసుకుంటూ, ‘ఏరా’, ‘ఒరేయ్’ అని నోరు పారేసుకుంటూ టాపిక్‌ని డైవర్ట్ చేస్తున్నావు. ‘‘నేను డిఎన్ఎ టెస్టుకి ఒప్పుకుంటున్నాను’’ అనే ఒక్కమాటతో అయిపోయే విషయాన్ని సాగదీస్తున్నావు. లేనిపోని అనుమానాలు కలిగేలా చేస్తున్నావు. ఈ సోది ట్వీట్లు చేసేబదులు, ఆ టెస్టుకు ఒప్పుకోవచ్చు కదా.. అందరి నోళ్ళూ మూయించొచ్చు కదా? ఇంకో ఇంపార్టెంట్ పాయింట్.... అసలు నువ్వు శాంతిని కూతుర్లాగా ఎందుకు భావించాలి? నువ్వొక ఎంపీవి, ఆమె ఒక గవర్నమెంట్ ఆఫీసర్. మీ ఇద్దరి మధ్య రిలేషన్ అంతవరకే వుండాలి తప్ప.. ఆమెని నువ్వు ఎందుకు కూతుర్లా భావించాలి? ఆమె ఇంటికి నువ్వెందుకు వెళ్ళాలి? నీ ఇంటికి ఆమె ఎందుకు రావాలి? ప్రభుత్వ వ్యవహారాల్లో మీ పర్సనల్ మేటర్స్ ఏంటి? ఎందుకు నువ్వు తండ్రిలా ఆమెకి సహాయం చేయాలి? ఎంపీ హోదాలో వున్న నువ్వు నీ దగ్గరకి వచ్చిన వాళ్ళందరిలో కూతుర్నో, పిన్నినో, బాబాయ్‌నో చూసుకోవడమేంటి? అసలు ఏంటి ఇదంతా? 

‘ఆంధ్రా బెర్లిన్ గోడ’ కూల్చివేత!

జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు, ప్రభుత్వానికి అడ్డుగా కట్టిన గోడ ఇప్పుడు కూలిపోయింది. ‘బెర్లిన్ గోడ’ లాగా అవరోధాన్ని కలిగిస్తున్న ఈ గోడను ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశాలతో కూల్చేశారు. అసెంబ్లీ దగ్గరకు అమరావతి రైతులు రాకుండా జగన్ ప్రభుత్వం అసెంబ్లీ రెండో గేటుకి అడ్డంగా ఈ గోడ కట్టించింది. మూడు రాజధానుల పేరుతో అమరావతి రాజధానిని ముక్కలు చేయాలన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఐదేళ్ళపాటు అమరావతి రైతులు ఉద్యమించారు. వారి ఆందోళనల నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఈ గోడను కట్టించింది. ఈ గోడను కూల్చేసిన సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ‘‘ప్రజలు వారి సమస్యలను చెప్పుకునే అవకాశం కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత. ప్రజాస్వామ్య నిలయమైన శాసనసభ గేట్లు తెరిచే వుండాలి. రాష్ట్రంలో ఇప్పుడున్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజలకు అందుబాటులో వుండే ప్రభుత్వం. ఇది ప్రజా అసెంబ్లీ’’ అన్నారు.

రేవంత్ మాస్టర్ స్ట్రోక్.. రుణమాఫీ !

సకల రోగాలకూ మందు జాలిమ్ లోషన్ అన్నట్లుగా.. రాజకీయంగా తాను ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ రైతు రుణమాఫీయే విరుగుడు అని రేవంత్ భావిస్తున్నారు. అందుకే రూ. రెండు లక్షల రుణమాఫీని కటాఫ్ డేట్ కంటే ముందే ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్నికలలో కూడా చేయనంత ప్రచారం చేస్తున్నారు. గురువారం (జులై 18)న  లక్ష   రూపాయల వరకూ రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించి, రైతుల ఖాతాలలో నిధులను జమ చేయడానికి రెడీ అయిపోయారు. అసలు తొలుత రుణమాఫీకి రేవంత్ పెట్టిన కటాఫ్ డేట్ ఆగస్టు 15.ఆ విషయాన్ని స్పష్టంగా ప్రకటించారు కూడా. అయితే  జులై 18నే రుణమాఫీ నిధులను విడుదల  ప్రారంభించేశారు. రెండు లక్షల రుణమాఫీని మూడు విడతలుగా అందిస్తామని ప్రకటించిన ఆయేన తాను చెప్పిన ఆగస్టు 15 గడువు కంటే ముందే రైతులకు రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. అందులో భాగంగా  లక్ష రూపాయల వరకూ రుణమాఫీని గురువారం (జులై 18) ప్రారంభించారు.  ఇక లక్షన్నర వరకూ ఉన్న రుణాలను ఈ నెలాఖరులోగా, రెండు లక్షల వరకూ ఉన్న రైతు రుణాలను ఆగస్టులో మాఫీ చేస్తామని ప్రకటించారు. రేవంత్ నిర్ణయంతో ఒక్కసారిగా ఆయన సర్కార్ పట్ల సర్వత్రా సానుకూలత వ్యక్తం అవుతోంది. ఇటీవల  రేవంత్ రెడ్డి  ఇంటా బయటా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్షాల నుంచే కాకుండా కాంగ్రెస్ లో కూడా ఆయన తీరు పట్ల ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అలాగే  బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహించడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలాగే  నిరుద్యోగుల ఆందోళన కూడా రేవంత్ సర్కార్ కు తలనొప్పిగా మారింది.  ప్రభుత్వంపై   అసంతృప్తి పెరుగు తోందన్న భావన ఏర్పడుతున్న సమయంలో  రేవంత్ రుణమాఫీ అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. దీంతో విపక్షాల నోళ్లు మూతపడే పరిస్థితి కల్పించారు. లబ్ధిదారులలో కోత విధించారంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన బాట పట్టడానికి ప్రయత్నించినా అప్పటికే రేవంత్ వారిపై పై చేయి సాధించేశారు.  మొత్తంగా రుణమాఫీ పేరుతో రేవంత్  ప్రభుత్వాన్ని ఒకదాని వెనుక ఒకటిగా చుట్టుముడుతున్న సమస్యలను దూరం చేశారు. 

పార్టీ కండువా మార్చేసిన హరీష్ రావు.. దేనికి సంకేతం?

బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం వలసల పర్వం కొనసాగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కాంగ్రెస్ లోకి చేరిపోతుండగా, ఆ పార్టీకి రాజ్యసభలో ఉన్న నలుగురు సభ్యులూ గంపగుత్తగా  కాషాయ కండువా కప్పుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ మనుగడపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వైపు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ వ్యవహారాలలో క్రియాశీలంగా వ్యవహరించడం లేదు. పార్టీ నుంచి వలసలను నిరోధించడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన చేతులెత్తేశారు. ఏం జరగాలని రాసుంటే అదే జరుగుతుందన్న ధోరణిలో కేసీఆర్ ఉన్నారు. ఇక ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కూడా అడపాదడపా ఎక్స్ వేదికగా రేవంత్ సర్కార్ పై విమర్శలు, సవాళ్లు వినా, పార్టీలోనూ, పార్టీ క్యాడర్ లోనూ జోష్ నింపడంలో పూర్తిగా విఫలమయ్యారు. కాగా ఆ పార్టీలో మరో కీలక నేత హరీష్ రావు కూడా జెండా మార్చేస్తున్నారా అన్న అనుమానాలు పార్టీలో వ్యక్తం అవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే బీజేపీ ఆయనకు గేలం వేస్తున్నది. బీఆర్ఎస్ లో సమర్థ నేత హరీష్ రావు ఒక్కరే అంటూ రాష్ట్ర బీజేపీ నాయకులు కొత్త పల్లవి అందుకున్నారు. బీజేపీ మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అయితే ఒక అడుగు ముందుకు వేసి హరీష్ రావు బీజేపీలోకి వస్తారని సంకేతాలు ఇచ్చేలా ఇటీవల కొన్ని సభలలో ప్రసంగించారు.  ఈ నేపథ్యంలోనే పటాన్ చెరు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు బీఆర్ఎస్ కండువా ధరించలేదు. దీంతో ఆయన పార్టీ మారే ఉద్దేశంలో ఉన్నారా అన్న చర్చ మొదలైంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. హరీష్ రావు బీఆర్ఎస్ కండువా ధరించ లేదు సరే.. మరి ఏ పార్టీ కండువా ధరించారు. ఆయన ధరించింది బీజేపీ కండువా కాదు, కాంగ్రెస్ కండువా కూడా కాదు. మరి ఏమిటి? అంటే ఆయన టీఆర్ఎస్ కండువా ధరించారు. దీంతో ఆయన జెండా మార్చేశారన్న అభిప్రాయం గ ట్టిగా వినిపిస్తోంది. తొలి నుంచీ జాతీయ రాజకీయాల కోసం పార్టీలోని తెరాస పేరును తొలగించడాన్ని బాహాటంగా కాకపోయినా పార్టీ వేదికల మీద హరీష్ రావు గట్టిగా అభ్యంతరం తెలిపారు. పార్టీ పేరు మార్పు తెలంగాణ సెంటిమెంట్ ను గాయపరుస్తుందని ఆయన కేసీఆర్ కూ చెప్పారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  సరే ఏమైనా టీఆర్ఎస్ పేరు తొలగించి పార్టీకి బీఆర్ఎస్ అని నామకరణం చేసేశారు కేసీఆర్. అయితే పేరు మార్పు తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. ఈ తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికలలోనూ బీఆర్ఎస్ ప్రదర్శన మరింత అద్వానంగా మారింది. లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కు జీరో రిజల్ట్ వచ్చింది. దీంతో పేరు మార్పు సరికాదు అన్న హరీష్ రావు వంటి నేతల మాటలను ఎందుకు పట్టించుకోలేదా అని కేసీఆర్ భావిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే పటాన్ చెరు కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు బీఆర్ఎస్ కండువా మార్చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకీ ఆయన ఏ కండువా కప్పుకున్నారంటే.. టీఆర్ఎస్ కండువా. దీంతో బీఆర్ఎస్ పేరు మళ్లీ టీఆర్ఎస్ గా మారిపోనుందా అంటూ సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.  

ఏపీలో వైసీపీ గాయెబ్!?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు వైసీపీ ఎక్కడా కనిపించడం లేదు. ఏదో ఆ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాలో వార్తలు, ప్రకటనల్లో తప్ప.. రాష్ట్రంలో ఎక్కడా ఆ పార్టీ నేతలు కనిపించడం లేదు. ఇటీవలి ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ క్రమంగా కనుమరుగౌతోందా అన్న అనుమానాలు రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. ఎన్నికల తరువాత మీడియా ముందుకు వచ్చిన నేతలు కూడా ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. ఆఖరికి ఆ పార్టీ అధినేత జగన్ కూడా ఆర్ఘాటంగా ప్రకటించిన ప్రజాదర్బార్ ను సైతం రద్దు చేసుకుని ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చెక్కేశారు. ఆయన రాష్ట్రానికి వచ్చేది ఎప్పుడు అన్న విషయంలో క్లారిటీ లేదు. ఇక వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ప్రత్యర్ధులపై, తెలుగుదేశం నేతలపై బూతులతో విరుచుకుపడిన నాయకులెవరి గొంతులూ ఇప్పుడు వినిపించడం లేదు. ఇప్పటికే చ ాలా మంది రాష్ట్రం దాటేశారన్న సమాచారం ఉంది. ఇక రాష్ట్రంలో ఉన్న నేతలూ కూడా ఎవరికీ కనిపించకుండా, వినిపించకుండా దాదాపు అజ్ణాత వాసం చేస్తున్నారు.    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీ హయాంలో వివిధ రంగాలలో జరిగిన విధ్వంసంపై ఇప్పటి వరకూ నాలుగు శ్వేత పత్రాలు విడుదల చేశారు.  ఆ శ్వేత పత్రాలలో వైసీపీ అరాచక పాలన కారణంగా రాష్ట్రానికి జరిగిన భారీ నష్టం వెలుగులోనికి వస్తుంది. అంచనాలకు మించి వైసీపీ సర్కార్న, నేతలు రాష్ట్ర సంపదను కొల్లగొట్టారని తేటతెల్లం అవుతోంది. అమరావతి, పోలవరం, విద్యుత్, సహజ సంపద దోడిపీపై చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రాల ద్వారా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  వైసీపీ అరాచ, అధ్వాన పాలన, దోపిడీపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయినా చంద్రబాబు శ్వేత పత్రాలలో వెల్లడించిన అంశాలను, జగన్ పలనా వైఫల్యం, అరాచకత్వం, అక్రమాలపై చేసిన ఆరోపణలను ఖండించడానికి  వైసీపీ అధినేత సహా ఏ నాయకుడూ ముందుకు రావడం లేదు.  మాజీ మంత్రి పేర్ని నాని వంటి వారు మీడియా ముందుకు వచ్చి ఏవో నాలుగు మాటలు మాట్లాడి తూతూ మంత్రంగా చంద్రబాబు శ్వేతపత్రాలపై విమర్శలు గుప్పించి మిన్నకున్నారు. ఆ మీడియా సమావేశాలలో వారు రాసుకొచ్చిన స్క్రిప్ట్ చదివేసి విలేకరుల ప్రశ్నలకు బదులివ్వకుండా, అసలు వారికి ప్రశ్నలు వేసే అవకాశమే ఇవ్వకుండా తాము చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్లిపోతున్నారు.   రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి. ఎక్కడా వైసీపీ నేతలు కనిపించడం లేదు. పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనా రాయణ, పుంగనూరు పుడింగి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం తొడకొట్టి మీసం మెలేసి మరీ ప్రత్యర్థులపై విరుచుకుపడిన మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్, సమయం సందర్భంతో పనిలేకుండా మీడియా కనిపిస్తే చాలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై విరుచుకుపడిన రోజా,  వాడు, వీడు అంటూ విపక్ష నేతలపై బూతుల వర్షం కురిపించడానికే మీడియా ముందుకు వచ్చిన కొడాలి నాని వీరెవరూ ఇప్పుడు నోరెత్తడానికి కూడా సాహసించడం లేదు. బొత్స సత్యనారాయణ  అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఆయన మాట్లాడే మాటలు, చేసే వ్యాఖ్యలు  వైసీపీ మరింతగా ఇబ్బందుల్లోకి నెట్టేవిగానే ఉంటున్నాయి. ఆయన చూపులు కాంగ్రస్ వైపు మళ్లినట్లుగా పార్టీ వర్గాల్లోనే గట్టిగా వినిపిస్తోంది. ఇక ధర్మాన ప్రసాదరావు,  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ ఇలా పార్టీలోని సీనియర్లు ఎవరూ కూడా  నోరు విప్పి మాట్లాడటం లేదు. అసలు పార్టీలో కొనసాగుతారో లేదో తెలియడం లేదు. పలువురు వైసీపీ సీనియర్లు కాషాయ కండువా కప్పు కోవడానికి తహతహలాడుతున్నట్లు రాజకీయవర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.  అసలు పార్టీ సీనియర్ నేతలలో చాలా మంది ఇప్పటికే రాష్ట్రం దాటేశారని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. వారెవరూ ఇప్పట్లో రాష్ట్రానికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నాయి. స్వయంగా పార్టీ అధ్యక్షుడే తాడేపల్లి ప్యాలెస్ నుంచి బిచాణా ఎత్తేసి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు పలాయనం చిత్తగించారు, ఇక వైసీపీ నేతల పరార్ ఒక లెక్కా అని తెలుగుదేశం శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి.  మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం వైసీపీ అజ్ణాతంలోకి వెళ్లిపోయిందా అన్నట్లుగి పరిస్థితులు ఉన్నాయి.  

మోడీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపగలరా?

నరేంద్రమోడీ ముచ్చటగా మూడో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు దాటింది. గత రెండు సార్లు ఆయన ప్రధానిగా ఉన్నప్పటి పరిస్థితి వేరు. మూడో సారి ప్రధానిగా ఆయన ప్రస్థానం వేరు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే తొలి రెండు సార్లూ మోడీ నేతృత్వంలోని ఎన్డీయే పేరుకే సంకీర్ణం. కానీ బీజేపీకి భాగస్వామ్య పక్షాల మద్దతు అవసరం లేకుండానే సొంతంగా సర్కార్ ను ఏర్పాటు చేయగలిగినంత బలం ఉంది. ఆ కారణంగానే మోడీ పాలన ఆయన ఇష్టారాజ్యంగా సాగింది. పేరుకు భాగస్వామ్య పక్షాలకు తన కేబినెట్ లో స్థానం కల్పించినా. వాటికి కేటాయించిన శాఖలు అత్యంత అప్రాధాన్యమైనవి. అలాగే భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలకు ఇసుమంతైనా విలువ ఇవ్వకుండానే ఆయన పాలన సాగింది. అదే సమయంలో  మోడీ భాగస్వామ్య పక్షాలను నిర్వీర్యం చేయడానికీ, వాటిలో చీలిక తీసుకురావడానికి ఇసుమంతైనా వెనుకాడని పరిస్థితి ఉండేది. ఆ కారణంగానే ఒక దశలో ఎన్డీయే నామమాత్రం అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయ్యింది. అందుకు తగ్గట్టుగానే పలు పార్టీలు ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశాయి.  2014 ఎన్నికల ముందు నాటికి జాతీయ ప్రజాస్వామ్య కూటమి.. అదే ఎన్డీయే కథ ముగిసిపోయిందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అయ్యాయి. వాజ్ పేయి హయాంలో 24 పార్టీలతో కూటమిగా  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చక్రం తిప్పిన ఎన్డీయే కూటమి పరిస్థితి 2024 నాటికి అగమ్య గోచరంగా మారిపోయింది. అసలా కూటమికి శుభం కార్డు పడిందా అన్న అనుమానాలు సైతం పరిశీలకుల నుంచి వ్యక్తం అయ్యాయి. చివరాఖరికి ఎన్డీయేకు ఏదో ఒక స్థాయిలో కూటమి అన్న గుర్తింపు రావడానికి కారణమైన బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ కూడా ఒక దశలో కాడె వదిలేసి కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగట్ బంధన్ లో చేరి తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకున్నారు. అయితే ఇండియా కూటమి సారథ్యం వహించాలన్న ఆయన ఆకాంక్ష సాకారమయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో మళ్లీ వెనక్కు వచ్చారనుకోండి అది వేరే సంగతి. వాస్తవానికి 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ‘ఏకపార్టీ’ ఆధిక్యత సాధించిన రోజునే, ఎన్డీఎ కథ ఇక ముగిసినట్లే అన్న విశ్లేషణలు వెలువడ్డాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా 2014 ఎన్నికలలో లోక్ సభలో బీజేపీ సొంతగా సాధారణ మెజారిటీ (272) కంటే  10 సీట్లు అదనంగా (282) గెలిచింది. ఇక 2019 ఎన్నికల్లో బీజేపీ సొంత బలమే 303 కు చేరింది.  అదే సమయంలో  ప్రతిపక్ష కూటమి యూపీఎ పరిస్థితి అంతకంతకూ దిగజారుతూ వచ్చింది. ఇక బీజేపీ విషయానికి వస్తే.. అయినా 2014లో తిరిగి 2019లో  కూడా బీజీపీ  ప్రధాని మోడీ సారధ్యంలో ఎన్డీఎ సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పాటు చేసింది.  ప్రధాని నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో తెలుగు దేశం, శివసేన, అకాలీదళ్, సహా అనేక ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. అయితే ఆ తర్వాత  ఎవరి కారణాలు వారికీ ఉన్నా, ఒక్కొక్క పార్టీ ఎన్డీఎకి దూరమవుతూ వచ్చింది.   2019 ఎన్నికల్లోనూ అకాలీ దళ్, శివసేన, పాశ్వాన్ పార్టీ ఎల్’జేపీ, ఎఐఎడిఎంకే, జేడీ(యు)సహా అప్నా దళ్, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ వంటి మరికొన్ని చిన్నా చితక పార్టీలు సహా మొత్తం తొమ్మిది పార్టీలు మాత్రమే ఎన్డీయేలో ఉన్నాయి. 2014 వచ్చే సరికి వాటిలో కొన్న బీజేపీకి తద్వారా ఎన్డీయేకి దూరమయ్యాయి.   దీంతో  2024 ఎన్నికల  నాటికి ఎన్డీయేలో ఉన్న ఏ పార్టీకీ, జేడీయూ వినా సొంతంగా ఒకటి రెండు స్థానాలకు మించి గెలుచుకునే అవకాశాలు కూడా లేని చితనా చితకా పార్టీలు మాత్రమే కూటమిలో మిగిలాయి. అలా మిగిలిన ఏ పార్టీకీ కూడా లోక్ సభలో ఒకటి, రెండు స్థానాలకు మించి లేవు.   బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థానాలలో విజయం సాధించే అవకాశం లేదన్న సర్వేలతో కంగారుపడిన బీజేపీ మళ్లీ ఎన్డీయేను బలోపేతం చేసేందుకు కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే ఎన్డీయేకు దూరమైన పార్టీలను ఆహ్వానిస్తూ అమిత్ షా పిలుపునిచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా బీజేపీ, తెలుగుదేశం పార్టీలు పొత్తుతో కలవాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. అలా చివరి నిముషంలో బీజేపీ మేల్కొని ఎన్డీయే కూటమి పటిష్టతకు నడుంబిగించి ఒకటికి రెండు మెట్లు దిగిరావడంతో మోడీ మూడో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగలిగారు. లేకుంటే బీజేపీ మూడో సారి అధికార కూటమికి నేతృత్వం వహించగలిగేది కాదని 2024 సార్వత్రిక ఎన్నికలు తేటతెల్లం చేశాయి. ఇప్పుడు కేంద్రంలో మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం  మనుగడ పూర్తిగా భాగస్వామ్య పార్టీల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉంది.  దీంతో ఐదేళ్ల పాటు భాగస్వామ్య పక్షాల మద్దతు పొందేలా మోడీ పాలన సాగించగలరా? అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో ఎదురౌతున్నాయి.  మోడీ, షా జోడీ నాయకత్వంలో బీజేపీ నిన్నటి వరకూ శతృ మిత్ర బంధాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలనూ నిర్వీర్యం చేయడమనే ఫార్ములాను అనుసరించింది.  అన్ని పార్టీలను రాజకీయ ప్రత్యర్ధులుగానే చూసింది.    ఏక పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం దిశగా బీజేపీ అడుగులు వేస్తొందని పరిశీలకుల విశ్లేషణలకు అనుగుణంగానే మోడీ 2014, 2019లలో అధికారం చేపట్టినప్పుడు వ్యవహరించారు.   కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యంగా అడుగులు వేసిన మోడీ సర్కార్.. ఆ పేరుతో ఇతర రాజకీయ పార్టీలను కూడా కబలించేయడానికి శతథా ప్రయత్నించింది. విఫలమైంది. దీంతో ఇప్పుడు మూడో సారి మోడీ నేతృత్వంలోని సర్కార్ కేంద్రంలో కొలువుదీరిన తరువాత మారిన పరిస్థితులకు అనుగుణంగా మోడీ తీరు మారుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   

రామసేతు వాస్తవం..రామాయణం నిజం!

హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడు. త్రేతా యుగంలో రాముడు అయోధ్యను పాలించాడని పురాణాలు చెబుతున్నాయి. రావణుడు అపహరించిన సీతను తీసుకురావడానికి  లంక వెళ్లి రావణుని సంహారించి  వెనక్కి తీసుకువచ్చాడు శ్రీరాముడు. అందుకోసం 100యోజనాల దక్షిణసముద్రానికి వానరుల సహాయంతో వారధి కట్టారని రామాయణ కధనం. దాన్నే నేడు రామసేతు అంటున్నారు. 2018లోనే నాసా రామసేతు నిజమని చెప్పింది.ఇప్పుడు మన ఇస్రో శాస్త్రవేత్తలు నాసా సహాయంతో మరింత సమాచారం, మరిన్ని ఫోటోలు సేకరించారు.ఈ ఫోటోలలో 10మీటర్ల మ్యాప్ లో వంతెన పూర్తిగా కనిపిస్తున్నది. సముద్రగర్భం నుంచి 8మీటర్లు ఎత్తులో ఈ రామసేతు ఉందని తేల్చారు. రామసేతు దాదాపు 99.9శాతం సముద్రంలో మునిగిపోయిందన్నారు. కేవలం  కొద్ది భాగం మాత్రమే కనిపిస్తున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  రామసేతు తమిళనాడు రామేశ్వరం సమీపంలోని ధనుష్కోటి నుంచి శ్రీలంక లోని మన్నారు ద్వీపంలోని తలైమన్నారు వరకూ నిర్మించాలని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిని బండరాళ్లు, సున్నం రాళ్లతో  నిర్మించారని తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఐస్ శాట్-2 సహాయంతో మ్యాప్ విడుదల చేసారు. ఈ వంతెన 29కిలోమీటర్లు వరకూ ఉందని పేర్కొన్నారు. క్రీ.శ.9వ శతాబ్దం వరకూ పర్షియన్లు సేతు బందైగా పిలిచేవారు. రామేశ్వరం ఆలయ వర్గాల మేరకు తుఫానులతో ఈ వంతెన ధ్వంసమైందని తెలిసింది. క్రీ.శ.1480 నాటివరకూ వంతెన కనిపించిందని తెలిపారు. 

కాళ్ళమీద పడొద్దు.. చంద్రబాబు రిక్వెస్ట్!

కాళ్ళకు నమస్కారాలు పెట్టే సంస్కృతిని మానాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఈ సూచన చేశారు. ‘‘ఎవరైనా నా కాళ్ళకు దణ్ణం పెడితే, వారి కాళ్ళకు నేను దణ్ణం పెడతా. ఈరోజు నుంచి నా కాళ్ళకు నమస్కారం పెట్టే విధానానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నాను. తల్లిదండ్రులు, భగవంతుడి కాళ్ళకి నమస్కారం పెట్టాలి తప్ప, నాయకులకు కాదు. నాయకుల కాళ్ళకి నమస్కారాలు పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దు. నాయకుల కాళ్ళకు ప్రజలు, పార్టీ శ్రేణులు దణ్ణం పెట్టే సంస్కృతిని ఇకనైనా ఆపాలి’’ అని చంద్రబాబు అన్నారు.

కుమార్తె కోసం పార్టీ పణం?!

గత ఏడాది తెలంగాణ  అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. ఆ పరాజయానికి కొనసాగింపు అన్నట్లుగా ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేక చతికిల బడింది. బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ఆవిర్భావం తరువాత లోక్ సభలో స్థానం లేకుండా ఉన్న పరిస్థితి ఇదే తొలిసారి. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పార్టీ ఓటమి పరాభవం కంటే తన కుమార్తె కవిత మద్యం కుంభకోణంలో అరెస్టై బెయిలు కూడా దొరకకుండా తీహార్ జైల్లో మగ్గుతుండటం ఎక్కవగా బాధిస్తోందనడంలో సందేహం లేదు.  కవితపై సీబీఐ మరో చార్జిషీట్ దాఖలు చేయడం ఆయనను మరింత ఆందోళనకు గురి చేస్తున్నది. ఈ కష్టాలన్నిటి నుంచీ బయటపడటానికి బీజేపీతో చెలిమి ఒక్కటే మార్గమని కేసీఆర్ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు ఇటీవలి కాలంలో ఆయన మౌనాన్ని ఉదాహరణగా చెబుతున్నారు.  అయితే బీజేపీ నుంచి సానుకూల స్పందన లభించకపోవడం  కేసీఆర్ లో ఆందోళన మరింత పెరుగుతోంది.  పోనీ పార్టీని బలోపేతం చేయడం ద్వారా బలమైన విపక్షంగా నిలబడి కేసులను ఎదుర్కొందామా అనుకుంటే.. పార్టీ అస్థిత్వానికే ముప్పు వాటిల్లుతోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసలు ఉన్నాయి. అలాగే రాజ్యసభలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీల అడుగులు చూస్తుంటే నేడో రేపో బీఆర్ఎస్ రాజ్యసభాపక్షం బీజేపీలో విలీనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఇంకో వైపు కేసీఆర్   ఫోన్ ట్యాపింగ్ కేసులో  పీకలోతు ఇరుక్కున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అలాగే  కాళేశ్వరం  సహా ఆ ప్రాజెక్టులో భాగంగా కట్టిన మేడిగడ్డ, సుందిళ్ల అక్రమాలు, అవినీతి, నాణ్యతా లోపాలు కూడా కేసీఆర్ మెడకే చుట్టుకోనున్నాయా అన్న అనుమానాలు కూడా సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఇన్ని ఇబ్బందులూ, కష్టాలలోనూ కేసీఆర్ దృష్టంతా కవితను బయటకు తీసుకురావడం ఎలా అన్నదానిపైనే ఉంది. అందుకోసం పార్టీని కూడా పట్టించుకోవడం లేదు. పార్టీలో తన తరువాత ప్రముఖులుగా గుర్పింపు ఉన్న తన తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావులను కవిత బెయిలు, బీజేపీతో రాజీ కోసం హస్తిన పంపించారు. హస్తినలో  కవిత బెయిలు కోసమే కాకుండా, ఆమెను మద్యం కుంభకోణం కేసు నుంచి బయటపడేసేందుకు సహకారం అందిస్తే.. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులను మూకుమ్మడిగా బీజేపీలో చేర్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కేటీఆర్, హరీష్ రావు హస్తిన వెళ్లి వచ్చిన తరువాత జరిగిన పరిణామాలు ఆ వార్తలు వాస్తవమేననిపించేలా ఉన్నాయి.   స్థానిక ఎన్నికలలో బీజేపీకి మద్దతుగా నిలిచేందుకు కూడా బీఆర్ఎస్ మంతనాలు సాగిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ ఈ ప్రయత్నాలన్నీ కేసీఆర్ పర్యవేక్షణ, మార్గదర్శకంలోనే జరుగుతున్నాయని అంటున్నారు. అటు కాంగ్రెస్ ను ఇరుకున పడేయడం, ఇటు తన కుమార్తె కవితను మద్యం కుంభకోణం కేసు నుంచి బయటపడేయడం లక్ష్యంగానే కేసీఆర్ బీఆర్ఎస్ భవిష్యత్ ను పణంగా పెడుతున్నారని అంటున్నారు.  

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లకు మోక్షం.. తక్షణం రిపేర్లు!

ఆంధ్రప్రదేశ్‌లో దారుణంగా వున్న రోడ్ల పరిస్థితి మారనుంది. తక్షణం రిపేరు పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రహదారులు, భవనాల శాఖపై చంద్రబాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రోడ్ల పరిస్థితిపై ఆరా తీశారు. జగన్ ప్రభుత్వంలో కనీసం గుంతలు కూడా పూడ్చలేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదని తెలిపారు. గత ప్రభుత్వ తీరుతో ఇప్పుడు కాంట్రాక్టర్లు ఎవరూ రోడ్లు వేయడానికి ముందుకు రావడం లేదని అధికారులు వివరించారు. రోడ్ల మీద గుంతలు పూడ్చడానికి తక్షణం 3 వందల కోట్లు అవసరమని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. వెంటనే టెండర్లు పిలిచి, రోడ్ల పనులను తక్షణం ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.   జగన్ ప్రభుత్వం రోడ్లను ఎంతమాత్రం పట్టించుకోలేదని, ప్రజలు ఐదేళ్ళపాటు గతుకుల రోడ్ల మీద నరకం చూశారని చంద్రబాబు చెప్పారు. ఈ పరిస్థితి మారేలా పనులు  మొదలవ్వాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 4,151 కిలోమీటర్ల మేర రోడ్ల మీద గుంతల సమస్య వుంది. తక్షణం మరమ్మతులు చేయాల్సిన రోడ్లు 2,936 కిలోమీటర్లు వున్నాయి. ఈ 7,087 కిలోమీటర్ల పరిధిలో రోడ్ల మరమ్మతులు వెంటనే ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశించారు.

షర్మిల సెటైర్లు వింటే జగన్‌‌‌కి హార్టెటాక్ ఖాయం!

జగన్‌ని పొరపాటుగా చట్టం వదిలేసినా, ధర్మం వదిలేసినా, న్యాయం వదిలేసినా, జైళ్ళు వదిలేసినా, కేసులు వదిలేసినా... నేను మాత్రం వదలను అన్నట్టుగా వుంది జగన్ గారి చెల్లెమ్మ షర్మిలమ్మ పట్టుదల. సమయం, సందర్భం దొరికితే చాలు... జగన్ మీద విరుచుకు పడుతున్నారు. ఒకవేళ సమయం, సందర్భం దొరక్కపోతే, తానే ఆ రెండిటినీ కల్పించుకుని మరీ జగన్ని ఒక ఆట ఆడుకుంటున్నారు. లేటెస్ట్.గా జగన్ అండ్ బ్యాచ్ మీద షర్మిల విసిరిన పంచులు ఇవి.... * వైసీపీ అంటే, యువజన, శ్రామిక, రైతు పార్టీ. అంటే, డాక్టర్ రాజశేఖరరెడ్డికి, ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. * రాజశేఖరరెడ్డి గారి జయంతి రోజున జగన్ ఏం చేశారు? ఇడుపులపాయలో రాజశేఖరరెడ్డి స్మృతి  చిహ్నం దగ్గర కేవలం ఐదు నిమిషాలు మాత్రమే వున్నారు. సొంత తండ్రి జయంతి కార్యక్రమం ఎంత బాగా నిర్వహించాలి? సిద్ధం సభ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కదా.. వైఎస్సార్ జయంతికి ఏం చేశారు? జగన్ ఏమీ చేయలేదు.. ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏమీ చేయలేదు. ఇలాంటి జగన్ వైఎస్సార్ రాజకీయ వారసుడు ఎలా అవుతాడు? * జగన్ మీద, వైసీపీ మీద కోపంతో కొంతమంది రాజశేఖరరెడ్డి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. నా విజ్ఞప్తి ఏమిటంటే, వైసీపీకి, రాజశేఖరరెడ్డికి ఎలాంటి సంబంధం లేదు.

రోజూ నవ్వి తీరాల్సిందే.. జపాన్‌లో కొత్త చట్టం!

జపాన్‌లో ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ప్రజలు రోజుకు ఒక్కసారైనా నవ్వితీరాల్సిందే. జపాన్‌లోని యమగట ప్రాంతానికి చెందిన స్థానిక ప్రభుత్వం ఈ చట్టం చేసి, ఆర్టినెన్స్ జారీ చేసింది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. రోజుకు ఒక్కసారి నవ్వడం మాత్రమే కాకుండా, నవ్వుతో కూడిన వాతావరణాన్ని ప్రోత్సహించాలని కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. ప్రతినెలా ఎనిమిదో తేదీని ప్రత్యేకంగా ‘హాస్యంతో ఆరోగ్యం’ కోసం కేటాయించాలని జీవోలో పేర్కొంది.  అయితే, ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. నవ్వాలంటూ చట్టం ఏంటయ్యా బాబూ అని ప్రతిపక్షాలవాళ్ళు అంటుంటే, ఇదేమీ జరిమానాలు విధించే చట్టం కాదు కాబట్టి లైట్‌గా తీసుకుని నవ్వుకోండి అని అధికారపక్షం అంటోంది.

మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ దారెటు?

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నేతలకు ఊపిరాడటం లేదు. అధికారంలో ఉన్నంత కాలం అడ్డగోలు దోపిడీకి తెరలేపిన నేతలు ఇప్పుడు కేసుల భయంతో వణికి పోతున్నారు. అరెస్టు తప్పించుకోవడానికో లేదా వ్యాపారాలకు ఇబ్బంది కలుగుతుందనో కారణాలేవైనా వైసీపీకి దూరం జరిగేందుకు సిద్ధపడుతున్నారు. అలా వైసీపీ నుంచి బయటకు వచ్చే వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అలియాస్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు. ఆయన బిజినెస్ మేన్. అవంతి  విద్యాస్థంస్థల అధినేత. ఈయన  2009 ఎన్నిక‌ల్లో తొలిసారి భీమిలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్ర‌జారాజ్యం పార్టీ త‌ర‌పున ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. కొంత‌కాలం కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగిన అవంతి.. 2014లో  తెలుగుదేశంలో చేరి అన‌కాప‌ల్లి ఎంపీగా పోటీచేసి విజ‌యం సాధించారు.  2019 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరిన అవంతి.. భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో కొద్దికాలం జ‌గ‌న్ క్యాబినెట్ లో మంత్రిగానూ ప‌నిచేశారు.  వైసీపీ అధికారంలోఉన్న కాలంలో చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ల్యాణ్ పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసిన వారిలో అవంతి ఒక‌రు. తాడేప‌ల్లి కార్యాల‌యం నుంచి వెళ్లిన స్క్రిప్ట్ కు అనుగుణంగా టీడీపీ, జ‌న‌సేన పై అవంతి ఇష్టారీతిలో రెచ్చిపోయిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. 2024 ఎన్నిక‌ల్లో మ‌రోసారి భీమిలి నుంచి పోటీచేసిన ఆయ‌న ఓడిపోయారు. ప్ర‌స్తుతం ఏపీలో తెలుగు దేశం  కూట‌మి   అధికారంలోకి రావ‌టంతో త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు అవంతి శ్రీ‌నివాస్ మ‌ళ్లీ తెలుగుదేశంలో చేరేందుకు పావులు క‌దుపుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే తెలుగుదేశం  అధిష్టానం మాత్రం అవంతిని పార్టీలోకి తీసుకునేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేద‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. దీంతో ఆయన కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీలవైపు పడిందంటున్నారు. మొత్తం మీద అవంతి శ్రీనివాస్ వైసీపీలో కొనసాగే అవకాశాలు మాత్రం లేవని చెబుతున్నారు.  వైసీపీ ఘోర ఓట‌మితో చాలా మంది నేత‌లు ఆ పార్టీని వీడేందుకు రెడీ అయిపోతున్నారు. గ‌త ఐదేళ్ల కాలంలో ఏపీలో ఏ రంగ‌మూ అభివృద్ధికి నోచుకోలేదు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వ‌చ్చి నెల‌రోజులు కాక‌ముందే సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో అభివృద్ధి ప‌రుగులు పెడుతోంది.  ప్ర‌జ‌లలో కూట‌మి పాల‌న‌పై సంతోషం వ్య‌క్తం అవుతోంది. మ‌రోవైపు ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో బ‌లోపేతం అయ్యేందుకు వైఎస్‌ ష‌ర్మిల ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. వైఎస్ఆర్ అభిమానులుగా వైసీపీలో ఉన్న చాలామంది నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న టాక్ ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఏపీలో కాంగ్రెస్ బ‌ల‌ప‌డితే రాబోయేకాలంలో వైసీపీకి రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని భావిస్తున్న మాజీ మంత్రులు, వైసీపీ ముఖ్య‌నేత‌లు ఇప్పుడే కూట‌మిలోని ఏదోఒక పార్టీలో చేర‌డం బెట‌ర్ అనే భావ‌న‌కు వ‌స్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజా రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో రాబోయే కాలంలో వైసీపీని వీడేవారికి సంఖ్య భారీగా ఉంటుంద‌న్న చర్చ ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. 

వీరప్పన్ వారసుడు జగన్!

కేంద్ర మంత్రి బండి సంజయ్ వైఎస్ జగన్‌కి మంచి బిరుదు ఇచ్చారు. జగన్ వీరప్పన్ వారసుడు అని తేల్చేశారు. గురువారం నాడు బండి సంజయ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి ఆలయం నుంచి బయటకి వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  ఈ సందర్భంగా ఆయన వైవసీపీ పాలకులు వీరప్పన్ వారసులు అన్నారు. ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను వీళ్ళందరూ కలసి దోచుకున్నారని, ఎర్రచందనం దొంగలను వదిలిపెట్టేది లేదని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, ‘‘శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారు. ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చింది. జగన్ అరాచక ప్రభుత్వంలో స్వామివారి నిధులను పక్కదారి పట్టించి తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు’’ అన్నారు.

బుగ్గన చూపు బీజేపీ వైపు?!

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూట‌మి  అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అభివృద్ధి ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. సీఎం చంద్ర‌బాబు నాయుడు పాల‌న‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో జ‌రిగిన అవినీతిని బ‌య‌ట‌పెడుతూనే.. కేద్రం స‌హ‌కారంతో రాష్ట్రంలోని అన్ని రంగాల‌ను అబివృద్ధి చేసేందుకు చంద్రబాబు సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. మ‌రో వైపు వైసీపీ హ‌యాంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని త‌మ అక్ర‌మ‌ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రించుకున్న నేత‌ల‌పైనా కూట‌మి ప్ర‌భుత్వం దృష్టి సారించింది. గ‌త ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు చేయించిన వైసీపీ నేత‌ల‌పైనా చ‌ట్ట‌రిత్యా చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో వైసీపీలో కొన‌సాగితే ఇబ్బందులు త‌ప్ప‌వని, ఇబ్బందులకు తోడు  రాజ‌కీయం భ‌విష్య‌త్తు లేకుండా పోతుందని భావిస్తున్న కొంద‌రు నేత‌లు ఆ పార్టీని వీడేందుకు రెడీ అవుతున్నారు. అలా వైసీపీని వీడే ఆలోచనలో ఉన్నవారిలో పలువురు మాజీ  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఉన్నార‌ని తెలుస్తోంది. ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం బ‌లంగా ఉండ‌టంతో పాటు.. వైఎస్ ష‌ర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సైతం బ‌లోపేతం అవుతోంది. కాంగ్రెస్ ఏపీలో బ‌ల‌ప‌డితే వైసీపీ చాప్ట‌ర్ క్లోజ్  అన్న అంచనాకు వైసీపీ నేతలు వచ్చేశారు.   దీంతో వైసీపీని వీడి  అవకాశం ఉన్న ఇతర   పార్టీలోకి జంప్ చేసేందుకు  ప్ర‌య‌త్నాలు షురూ చేసినట్లు వైసీపీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధ‌మ‌వుతున్న వారిలో మాజీ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత బుగ్గన కార్యకర్తలకు  అందుబాటులో ఉండ‌టం లేదు.  ఫలితాల తరువాత ఒక్కసారి మాత్రమే ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎక్కువ స‌మ‌యం ఢిల్లీలోనే గ‌డుపుతున్నార‌ని ఆయన అనుయాయులు చెబుతున్నారు.   వైసీపీ హ‌యాంలో ఆర్థిక మంత్రిగా ప‌నిచేసిన బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డికి ఢిల్లీలోని బీజేపీ పెద్ద‌ల‌తో మంచి స‌త్సంబంధాలు ఏర్ప‌డ్డాయి. ప్ర‌స్తుతం వారి ద్వారా బీజేపీలోకి వెళ్లేందుకు బుగ్గ‌న ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతున్నది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ మాజీ మంత్రికి మైనింగ్, సిమెంట్ వంటి వ్యాపారాలు ఉన్నాయ‌నీ అంటున్నారు.  గత ఐదేళ్ల కాలంలో ఆర్థిక శాఖను బుగ్గ‌న‌ విధ్వంసం చేశారని ప్ర‌స్తుత ప్రభుత్వం శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ఆర్థిక దోపిడీ జరిగిందని లెక్కలతో సహా సీఎం చంద్ర‌బాబు బయటపెట్టారు. దీంతో రాబోయే రోజుల్లో త‌న‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే అంచనాకు బుగ్గ‌న వ‌చ్చార‌నీ, తెలుగుదేశం ప్ర‌భుత్వం నుంచి ఎదుర‌య్యే ఇబ్బందుల‌ను త‌ప్పించుకోవాలంటే బీజేపీలో చేర‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని ఆయ‌న‌ భావిస్తున్నార‌ు. దీంతో ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు ఆయన సన్నిహితులే చెబుతున్నారు. అయితే, బీజేపీవైపు బుగ్గ‌న చూస్తున్నారంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై ఆయ‌న‌ అనుచ‌రులతో పాటు వైసీపీ సోష‌ల్ మీడియా ఖండించింది. అయితే  బుగ్గ‌న మాత్రం మీడియా ముందుకొచ్చి తన పార్టీ మార్పు వార్త‌ల‌ను ఖండించ‌లేదు. దీనికితోడు బుగ్గ‌న తాజా వ్య‌వ‌హార శైలి చూస్తుంటే ఆయన ఇంకెంత మాత్రం వైసీపీలో కొనసాగే అవకాశాలు కనిపించడం లేదని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. బుగ్గన వైసీపీని వీడితే జగన్ మైండ్ బ్లాక్ కావడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జగన్ ది జైలు బాట.. చంద్రబాబుది అభివృద్ధి జాడ!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు జగన్ పాలనను జనం ఎంత తీవ్రంగా తిరస్కరించారో తేటతెల్లం చేశారు. అదే సమయంలో చంద్రబాబు సుపరిపాలన రాష్ట్రానికి ఎంత అవసరమో కూడా జనం గ్రహించారని ఫలితాలు తెలియజేశాయి. అయితే తన పట్ల, తన పాలన పట్ల వెల్లువెత్తిన ప్రజాగ్రహం కారణంగానే తాను పరాజయం పాలయ్యాననీ, విభజిత ఆంధ్రప్రదేశ్  తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు సాగించిన సుపరిపాలనను దూరం చేసుకున్నందుకు పశ్చాత్తాపం కూడా వ్యక్తమైనందునే ఈ స్థాయిలో తన పార్టీని ఓడించారని జగన్ గ్రహించడం లేదు. కాదు కాదు అంగీకరించడం లేదు. విభజిత ఆంధ్రప్రదేశ్ లో తొలి ఐదేళ్లు చంద్రబాబు పాలనను, మలి ఐదేళ్ల జగన్ పాలనను పోల్చి చూసుకుని మరీ, రాష్ట్రం బాగుండాలంటే, జగన్ విధ్వంసం నుంచి కోలుకుని ప్రగతి బాట పట్టాలంటే చంద్రబాబు పాలన ఒక్కటే మార్గమన్న కృత నిశ్చయంతో , చంద్రబాబును ను గెలిపించుకోవాలన్న పట్టుదలతో, అలాగే జగన్ ను గద్దె దింపాలన్న కసితో పోలింగ్ బూత్ లకు వెల్లువెత్తారనీ తేటతెల్లమైనా దానికి అంగీకరించి, తప్పులు ఒప్పుకుని పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలన్న ఉద్దేశం జగన్ లో ఇసుమంతైనా కనిపించడం లేదు. పైగా తానేదో తన జేబులో డబ్బులు ఇచ్చినట్లు సంక్షేమం అంటే వేలకు వేల రూపాయలు బటన్ నొక్కి పందేరం చేసినా జనం ఎందుకు ఓట్లు వేయలేదని నెపం వారిపైనే నెట్టేస్తున్నారు. అలాగే గతంలో తాను గట్టిగా సమర్ధించిన ఈవీఎంలే తన ఓటమికి కారణమని చెప్పుకుంటున్నారు.   జగన్ ఓటమికి కారణాలేమిటి అన్న దానిపై పరిశోధనలు, విశ్లేషణలు అవసరం లేదు. చాలా సింపుల్.. రాష్ట్ర విభజన  తరువాత గత పదేళ్లలో రెండు ప్రధాన పార్టీలకు ప్రజలు చెరో  అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం, వైసీపీ   పార్టీల పాలనను ప్రజలు చూశారు. సీఎంగా చంద్రబాబు పనితీరును, అలాగే జగన్   పనితీరును గమనించారు. దీంతో  అధికారం ఎవరికి ఇవ్వాలి.. మరోసారి సీఎంగా ఎవరు కావాలి అనేది జనం నిర్ణయించుకున్నారు. రాష్ట్రం మొత్తం ప్రాంతాలు,  సామాజిక వర్గాలు, యువత, వయోవృద్ధులు అన్న తేడా లేకుండా జనం దాదాపుగా ఏకాభిప్రాయానికి వచ్చేశారు.  ఐదేళ్లు చంద్రబాబు, ఐదేళ్లు జగన్ పాలన చూసిన తరువాత  ఇద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం, తాము బాగుంటాము అన్న విషయంలో వారిలో కన్ఫ్యూజన్ అన్నది ఇసుమంతైనా కనిపించలేదు.  అభివృద్ధి, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం,  ప్రభుత్వ నిర్ణయాలు, రాజ్యాంగం అమలు, చట్టాలు, సమానత్వం, సమాజంలో నేరాలు, మహిళల భద్రత, వ్యవసాయం, ప్రజల కోసం పాలసీలు, నిధులు.. వాటిని ఖర్చు చేసే ఆవశ్యకత, సమాజంలో అసమానతలు, విద్యా, వైద్యం, ఇతర రాష్ట్రాలతో సంబంధాలు, కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం, అప్పులు, నిధులను ఖర్చు చేయడంలో ప్రాధాన్యత ఇలా  అన్ని అంశాలలో జగన్ పాలనను, చంద్రబాబు పాలనతో పోల్చి చూసి జగన్ ను తిరస్కరించారు.  గత ఐదేళ్లలో అరకొర సంక్షేమం తప్ప అభివృద్ధి అన్న మాటకు అర్ధమే లేకుండా, అసలా పదమే వినపడకుండా పాలన సాగించిన జగన్ ను జనం ఛీకొట్టారు. జగన్ పాలనలో కొత్త పరిశ్రమ మాట అటుంచి... ఉన్న పరిశ్రమలే రాష్ట్రం వదిలి పారిపోయిన పరిస్థితిని గమనించిన జనం.. రాష్ట్రం బాగుండాలంటే.. తమ బతుకులు బాగుపడాలంటే తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావలసిందేనన్న కృత నిశ్చయానికి వచ్చేశారు. అందుకే ఏపీలో ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం కూటమికి అంత అనుకూలంగా వచ్చాయి. ఆ ఫలితాలు జనాభిప్రాయానికి పట్టం కట్టాయి.  సరే ఆ విషయాన్ని గ్రహించడానికి జగన్ సిద్ధంగా లేరు. అది ఆయన ఇష్టం. కానీ తన ఐదేళ్ల పాలనలో అధికారాన్ని అడుపెట్టుకుని వైసీపీ నేతలు నిబంధనలను తుంగలోకి తొక్కి సాగించిన అవినీతిపై, అధికార మదంతో పాల్పడిన అక్రమదందాలు, అడ్డగోలు దాడులు, దౌర్జన్యాలపై ఇప్పుడు తెలుగుదేశం కూటమి చర్యలకు ఉపక్రమించింది. అది సహజం కూడా. అవినీతికి పాల్పడిన, నేరాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. ఉండాలి కూడా. అలా తెలుగుదేశం కూటమి సర్కార్ చర్యలకు పాల్పడుతుంటే జగన్ మాత్రం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలంటూ గగ్గోలు పెడుతున్నారు. ఈవీఎంలను ధ్వంసం చేసి అరెస్టై జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యేను పరామర్శించి, ఆయనో స్వాతంత్ర్య సమరయోధుడన్నంత బిల్డప్ ఇచ్చారు. గతంలో ఓదార్పు యాత్రలు చేసిన జగన్ ఇప్పుడు జైలు యాత్రలు చేస్తున్నారు. అది ఆయన ప్రాధాన్యత.  మరో వైపు  ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ చంద్రబాబు పర్యటనల మీద పర్యటనలు చేస్తున్నారు. పోలవరం, అమరావతిలలో పర్యటించిన చంద్రబాబు జగన్ అసమర్థ పాలన, అహంకార వైఖరి కారణంగా ఆ రెండింటి విషయంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు వివరించడమే కాకుండా.. ఆ రెండింటి నిర్మాణ పనులను వేగవంతం చేశారు. ఎండిపోతున్న కృష్ణా డెల్టాకు పట్టిసీమద్వారా నీటిని అందించి ఆదుకోవడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అదే సమయంలో జగన్ హయాంలో గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి, రాష్ట్రానికి పరిశ్రమలను ఆహ్వానించడానికి చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలతో బిజీగా ఉన్నారు.   బీపీసీఎల్ సంస్థ ఏపీలో 60 వేల కోట్లతో పెట్టుబడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు బందర్ ఎంపీ బాలశౌరి తెలిపారు. మచిలీపట్నం కేంద్రంలో ఈ సంస్థ ఏర్పాటు కానున్నది.   జగన్ సర్కార్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో కనీసం ఒక్కటంటే ఒక్క కొత్త పెట్రోల్ బంక్ కూడా ఏర్పాటు చేయలేకపోయింది.  సరికదా రాష్ట్రంలో ఉన్న జాకీ, అమర్ రాజా, లూలూ వంటి సంస్థలను తరిమేసింది.   అదే చంద్రబాబు అధికార పగ్గాలు అందుకున్న నెల రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు బాటలు పరిచారు. దీంతో జనం జగన్ జైలు ములాఖత్ లలో బిజీబిటీగా ఉన్నారు. ఆయన ప్రాధాన్యత అది.  చంద్రబాబు  రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తూ, పారిశ్రామిక వేత్తలతో భేటీలతో  క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఈయన దార్శనికత ఇదీ అని నెటిజనులు పోల్చి చూపుతూ జగన్ పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. 

వాతలు పెట్టకుండానే ‘వాలంటరీ’ ఇచ్చేస్తారా?

వైసీపీ ప్రభుత్వంతో అంటకాగి, ఓ సందర్భంలో జగన్ కాళ్ళ దగ్గర కూడా కూర్చుని, జగన్ ప్రభుత్వం చేసిన అవినీతికి అన్నివిధాలా సహకరించిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్‌ పెట్టుకున్న వీఆర్ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ)కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రవీణ్ ప్రకాష్ గత నెల 25న వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులో డిజిటల్ సంతకం వుండటంతో రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. దాంతో ప్రవీణ్ ప్రకాష్ మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్‌కి ఆమోదం తెలపదని, ఆయన చేసిన తప్పులకు శిక్ష విధించే దిశగా చర్యలు తీసుకుంటుందని భావిస్తున్న తరుణంలో, ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా వీఆర్ఎస్‌కి ఆమోదం తెలిపింది. వైసీపీ హయాంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన, కూటమి అధికారంలోకి వస్తే తన ఉద్యోగం వుండదని వ్యాఖ్యానాలు చేసేవారు. తనకు ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం వుంటే సూచించాలని తన సహచరుడికి వాట్సాప్ సందేశం కూడా పంపించారు. ప్రవీణ్ ప్రకాష్ చేసిన తప్పులన్నీ చేసి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పశ్చాత్తాప పడుతూ ఒక వీడియో కూడా విడుదల చేశారు. తన ప్రవర్తన ఎవరికైనా బాధ కలిగించి వుంటే క్షమించాలని రిక్వెస్ట్ చేసుకున్నారు. వైసీపీ రాక్షస పాలన జరిగిన ఐదేళ్ళలో ప్రవీణ్ ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన కొన్ని విషయాలను ప్రస్తావించుకుంటే.... * మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ఏటీఎంగా పనిచేశారని, ఎన్నో అవకతవకాలకు సహకారం అందించారనే ఆరోపణలు వున్నాయి. * ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు, చిక్కీలు, కోడిగుడ్ల సరఫరా టెండర్ల పొడిగింపులో మంత్రి బొత్స చెప్పినట్టే చేశారు. నిబంధనలకు విరుద్ధంగా 150 కోట్ల విలువ చేసే చిక్కీల టెండర్లను మూడేళ్ళపాటు పొడిగింారు. *  2024-25 విద్యాకానుక కొనుగోళ్ళలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఆర్థిక శాఖ అనుమతి లేకపోయినా, అప్పటి సీఎంఓ ఆమోదం తెలుపకపోయినా 772 కోట్ల రూపాయలతో కొనుగోళ్ళు చేయడానికి పాత కాంట్రాకర్లకే ఆర్డర్లు ఇచ్చేశారు. * జగన్ సీఎంగా వున్నప్పుడు ఆయన పేషీలో వుండే ప్రవీణ్ ప్రకాష్ ఎవరినీ లెక్కచేసేవారు కాదు. చివరికి చీఫ్ సెక్రటరీని కూడా లెక్క చేయకుండా ప్రవర్తించారు. * కొంతమంది అధికారుల మీద తెలుగుదేశం ముద్ర వేసి ఇబ్బందిపెట్టారు.  * విశాఖ కలెక్టర్‌గా పనిచేసే సమయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలు పట్టించుకోకపోవడం వల్ల ఈసీ ఆగ్రహానికి గురయ్యారు. * పాఠశాల విద్యా శాఖలో కొండని తవ్వి ఎలుకని పట్టినట్టుగా హడావిడి తనిఖీలు చేశారు. ఉపాధ్యాయులను బెదిరించారు. ఇవి శాంపిలే.. ప్రవీణ్ ప్రకాష్ మీద వైసీపీ అవినీతికి సహకరించారన్న ఎన్నో ఆరోపణలు వున్నాయి. అలాంటి ఆయనకు తగిన శాస్తి చేయకుండా, వీఆర్ఎస్ ఇవ్వడం పట్ల పలువురు నిరాశకు గురవుతున్నారు. 

కృష్ణమ్మ వాకిట్లో గోదారమ్మ సందడి!

గోదావరి జీవ జలాలు ఉప్పునీటి పాలు కాకుండా పట్టిసీమ ద్వారా కృష్ణలోకి మళ్లించిన చంద్రబాబు దార్శనికత  కృష్ణా డెల్టా రైతుల కష్టాలను తీర్చింది. సాగు కష్టాలను పరిష్కరించింది. ఎంతో దార్శనికతో 2014 ఎన్నికలలో విజయం సాధించి విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు సరిగ్గా ఏడాది తిరిగే సరికల్లా పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి, కృష్ణా నదిలో నీటి లభ్యత సన్నగిల్లడం వల్ల ఎడారిగా మారుతున్న కృష్ణా డెల్టాను సస్య శ్యామలేం చేయాలన్న లక్ష్యంతో గోదావరి నీటిని మళ్లించి పట్టి సీమ ద్వారా సాగునీటిని అందించారు. అయితే 2019లో అధకారంలోకి వచ్చిన జగన్ అహంకారం, అవగాహన లేమి, అసమర్థత కారణంగా నాలుగేళ్ల పాటు పట్టిసీమను నిరుపయోగంగా వదిలేసి కృష్ణా డెల్టాను పట్టించుకోలేదు. అయితే 2024 ఎన్నికలలో చరిత్ర ఎరుగని విజయాన్ని తెలుగుదేశం కూటమి సొంతం చేసుకుంది. చంద్రబాబు మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన బాధ్యతలు చేపట్టిన నేల రోజులలోనే పట్టిసీమ మళ్లీ వినియోగంలోకి వచ్చింది. పట్టి సీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణలోకి మళ్లించి ప్రకాశం బ్యారేజీ ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీటిని బుధవారం (జులై 10) విడుదల చేశారు. గోదావరి జలాలలో కృష్ణా డెల్టా భూములను తడిపారు. పోలవరంలో అంతర్భాగంగా నిర్మించిన పట్టిసీమ చంద్రబాబు దార్శనికతకు, రైతులు నష్టపోకూడదన్న సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తుంది. పట్టి సీమ ద్వారా కృష్ణా నదిలోకి చేరిన గోదావరి జలాలలో బుధవారం ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి  మట్టం 11.01 అడుగులకు చేరింది. దీంతో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర కృష్ణా డెల్టా భూములకు నీటిని విడుదల చేశారు.  ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు జగన్ నిర్వాకం వల్ల రాష్ట్రంలో సాగునీటి రంగం రెండు దశాబ్దాలు వెనక్కు వెళ్లిందని విమర్శించారు. రైతును, వ్యవసాయాన్ని కాపాడుకోవడమే తెలుగుదేశం లక్ష్యమని ఉద్ఘాటించారు.  పట్టిసీమను వట్టిసీమన్న జగన్‌ రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. కృష్ణాడెల్టాకు నీటి విడుదలతో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.  

ఎయిమ్స్ మంగళగిరికి జలయోగం!

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్... షార్ట్.కట్‌లో ఎయిమ్స్. పేదలకు ఉత్తమ వైద్యం అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మంగళగిరిలో ఏర్పాటు చేసిన వైద్య సంస్థ. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్.ని 1680 కోట్ల రూపాయలతో నిర్మించింది. ఆ ఆస్పత్రికి అనుబంధంగా మెడికల్ కాలేజీ కూడా వుంది. మంగళగిరి ప్రాంతంతోపాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తూ వుంది ఎయిమ్స్. ఇక్కడ నిపుణులైన వైద్యులు, సిబ్బంది వున్నారు. ఇది పూర్తిస్థాయి కేంద్ర ప్రభుత్వ సంస్థ. నిర్మాణం, నిర్వహణ బాధ్యత కేంద్రానిదే. 2016లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఎయిమ్స్.కి 2019 నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఎయిమ్స్.కి నీటి సరఫరా ఆపేశారు. ఎందుకంటే, ఇది చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మించింది కదా.. అందుకని! నీళ్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదువుతున్నాయి మహాప్రభో అని ఎయిమ్స్ డైరెక్టర్ మధువానందకర్ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. ఎయిమ్స్.కి నీళ్ళు ఇవ్వడం పెద్ద కష్టమైన పని కూడా కాదు. నాలుగైదు కిలోమీటర్ల దగ్గర్లోనే కృష్ణానది కూడా వుంది. అయితే నీరు ఇచ్చే ఉద్దేశమే లేనప్పుడు నది పక్కనే వున్నా నీళ్ళు ఇవ్వరు కదా.. దాంతో చేసేది లేక ఎయిమ్స్ ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేస్తూ నెట్టుకొస్తోంది. అయితే 900 పడకల స్థాయి వున్న ఆ ఆస్పత్రిని నీటి ఎద్దడి కారణంగా 350 పడకల ఆస్పత్రిగా కుదించి సేవలు అందిస్తున్నారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సన్నిహితుడైన విజయసాయిరెడ్డి ఎయిమ్స్ పాలకమండలి సభ్యుడిగా కూడా వున్నారు. ఆయన కూడా నీటి సమస్య గురించి ఎంతమాత్రం పట్టించుకోలేదు. ఎవరు ఎలాగైనా చావండి.. ఇది చంద్రబాబు హయాంలో కట్టింది కాబట్టి మేం పట్టించుకోం... ఇలా సాగింది జగన్ ప్రభుత్వ వైఖరి.  ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస ప్రభుత్వం తొలగిపోయి, పనిచేసే ప్రభుత్వం రావడంతో ఎయిమ్స్ డైరెక్టర్ మధువానందకర్‌లో కొత్త ఆశలు చిగురించాయి. ఆరు రోజుల క్రితం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. ఎయిమ్స్ ఎదుర్కొంటున్న నీటి ఎద్దడి సమస్యని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆరు రోజులు అలా గడిచాయో లేదో.. ఎయిమ్స్.కి కృష్ణానది నుంచి నీటిని సరఫరా చేసే పైపు లైన్ల ఏర్పాటు పనులు ప్రారంభమై, చకచకా జరుగుతున్నాయి. పనికిమాలిన ప్రభుత్వానికి, పనిచేసే ప్రభుత్వానికి మధ్య తేడా ఇదే.