యావద్దేశ ప్రగతి గురించి ఆలోచించే విజనరీ చంద్రబాబు.. పియూష్ గోయెల్
posted on Nov 14, 2025 @ 12:37PM
విశాఖ వేదికగా జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందస్సులో ప్రసంగించిన ఆయన చంద్రబాబును కేవలం రాష్ట్ర అభివృద్ధి గురించి మాత్రమే కాకుండా యావత్ భారతదేశ ప్రగతి గురించి ఆలోచించే విజనరీగా అభివర్ణించారు.
చంద్రబాబు వంటి నాయకుడు ఉన్న ఏపీలో పుట్టిన ప్రతి బిడ్డా అదృష్టవంతుడన్న పియూష్ గోయెల్, స్వర్ణాంధ్ర విజన్ 2047తో ఆంధ్రప్రదేశ్ సాంకేతికంగా, ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖపట్నం గ్లోబల్ ట్రేడ్ గేట్‌వే గా నిలుస్తోందని, స్టీల్ ఉత్పత్తి, ఆక్వా రంగాల్లో ఈ ప్రాంతం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని అన్నారు. వాణిజ్య ప్రదర్శనలు, సదస్సుల కోసం ఢిల్లీలో నిర్మించిన భారత్ మండపం' తరహాలో ఏపీలో ఆంధ్రా మండపం నిర్మించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని
2047 నాటికి భారతదేశాన్ని సుసంపన్న దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నే ఈ ప్రగతిని సాధించగలమన్న పియూష్ గోయెల్.. టెక్నాలజీ డెమొక్రటైజేషన్ విధానంతో సాంకేతికతను అందరికీ చేరువ చేస్తున్నామన్నారు.