అనిత అందానికి ఆకర్షితుడయినా ఒక సర్వర్ మాత్రం అనితను బాగా గుర్తుపెట్టుకున్నాడు. కాని, అతను పిరికి వాళ్ళలో ప్రధముడు.
వాళ్ళెవరూనోరు మెదపకపోవటం గ్రహించాడు ఇన్ స్పెక్టర్. "డెడ్ బాడీని చూసికాని, మా పోలీసు డిపార్ట్ మెంటుని చూసి కాని మీరు ఏమీ భయపడనక్కరలేదు. మీకు తెలిసిన ఏ చిన్న నిజమైనాసరే, నాకు చెబితే మా డిపార్టు మెంటుకి ఎంతో మేలుచేసివారవుతారు. ఒకవేళ మీరు భయపడుతున్నట్టయితే చాటుగా ఆ విషయం నాకు చెప్పండి. మీమీద దోమవాలకుండా చూస్తాను." అని అభయమిచ్చినట్లుగా అన్నాడు.
అంతటితో ఆగకుండా మీలో ఉత్తమ పౌరులు ముందుకు రావచ్చు అన్నాడు.
ఎవరూ నోరుమెదపలేదు కాని గోవిందరావు మటుకు తీవ్రాలోచనలో పడ్డాడు. ఉత్తమ పౌరుడిగా తను నిజం చెప్పటం ధర్మం. పైగా ఇన్ స్పెక్టర్ దోమనుకూడా వాలనివ్వనని అభయమిస్తున్నాడు. అదీ చూడకపోతే నన్ను చీటికి మాటికి భయపెడుతుంటుంది. ప్రతి చిన్న విషయానికి రాక్షసిలా నా మీద పడుతూ వుంటుంది. తాగడం తప్ప నీకేమీ తెలియదు అంటూవుంటుంది. ఈ అమ్మాయి నాకు తెలుసు నేను చూశాను అని ఇన స్పెక్టరుతో చెబితే ఎంత గొప్పగా వుంటుంది. ఇన్ స్పెక్టరు నన్ను ఎంతో మెచ్చుకుంటాడు కదా! ఈ మాట దానితో చెబితే అది ఏమంటుంది? చాదస్తపు మొగుడా వెళ్ళివెళ్ళి పోలీసువాళ్ళతో చేయి కలుపుతావా నిన్ను తీసుకెళ్ళి కుళ్ళబొడుస్తారు అని భయపడనక్కరలేదు. మీకు తెలిసిన ఏ చిన్న నిజమైనాసరే, నాకు చెబితే మా డిపార్టు మెంటుకి ఎంతో మేలుచేసినవారవుతారు. ఒకవేళ మీరు భయపడుతున్నట్టయితే చాటుగా ఆ విషయం నాకు చెప్పండి. మీమీద దోమవాలకుండా చూస్తాను." అని అభయమిచ్చినట్లుగా అన్నాడు.
అంతటితో ఆగకుండా మీలో ఉత్తమ పౌరులు ముందుకు రావచ్చు అన్నాడు.
ఎవరూ నోరుమెదపలేదు కాని గోవిందరావు మటుకు తీవ్రాలోచనలో పడ్డాడు. ఉత్తమ పౌరుడిగా తను నిజం చెప్పటం ధర్మం. పైగా ఇన్ స్పెక్టర్ దోమనుకూడా వాలనివ్వనని అభయమిస్తున్నాడు. అదీ చూడకపోతే నన్ను చీటికి మాటికి భయపెడుతుంటుంది. ప్రతి చిన్న విషయానికి రాక్షసిలా నా మీద పడుతూ వుంటుంది. తాగడం తప్ప నీకేమీ తెలియదు అంటూ వుంటుంది. ఈ అమ్మాయి నాకు తెలుసు నేను చూశాను అని ఇనస్పెక్టరుతో చెబితే ఎంత గొప్పగా వుంటుంది. ఇన్ స్పెక్టరు నన్ను ఎంతో మెచ్చుకుంటాడు కదా! ఈ మాట దానితో చెబితే అది ఏమంటుంది! చాదస్తపు మొగుడా వెళ్ళివెళ్ళి పోలీసువాళ్ళతో చేయి కలుపుతావా నిన్ను తీసుకెళ్ళి కుళ్ళబొడుస్తారు అని భయపెడుతుంది. నిజాయితీగల భారత పౌరుడిగా ఇన్ స్పెక్టరుకి సహకరించాలా! దానిచేత ఎక్కడ తిట్లు తినవలసి వస్తుందో అని భయపడి నోరు మూసుకోవాలా?"
అక్కడ వున్న అందరినీ పరిశీలనగా చూస్తున్న ఇన్ స్పెక్టర్ దృష్టి పధంలోంచి గోవిందరావు తప్పించుకో లేక పోయాడు. గోవిందరావు మొహంలో కదలాడే భావాల్ని పోలీసు బుర్ర అవలీలగా పట్టేసింది.
ఇన్ స్పెక్టరు రెండు అడుగులు ముందుకువేసి గోవిందరావు మొహంలోకి గుచ్చి చూస్తూ "మిష్టర్ నీ పేరేమిటి?" అడిగాడు.
గోవిందరావు బిత్తరపోయాడు "గో...గో...గోవింద..." తరువాత మాట మింగేశాడు గోవిందరావు. ఇన్ స్పెక్టరుకి నవ్వు వచ్చింది "నీ పేరు గోవింద్ అవునా?" అడిగాడు.
"గోవింద్.....గోవింద్....కాదు, కాదు, గోవింద రావు."
"మిష్టర్ గోవిందరావ్, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి. ఇక్కడే వుండు" అని చెప్పి మిగతా వాళ్ళని అక్కడే వుండమని చెప్పి గోవిందరావుని తీసుకుని ఒక ఖాళీగా వున్న రూంలోకి ఒక కానిస్టేబుల్ తో సహా వెళ్ళాడు. గది తలుపులు మూసుకున్నాయ్.
12
"మిస్టర్ గోవిందరావ్! నీకు తెలిసింది అంతా చెప్పు..."
"నాకేం తెలియదు బాబోయ్...." అన్నాడు గోవిందరావు, గోవిందరావు కాళ్ళూ చేతులు వణకడం ఇన్ స్పెక్టరు గమనించాడు.
"నీకేం తెలియదా? ఇటు చూసి చెప్పు" అన్నాడు.
గోవిందరావు తలవంచుకుని చెప్పడం మొదలుపెట్టాడు.
"ఒక అబ్బాయితో కలసి ఆ అమ్మాయి హోటల్ లోకి రావటం నేను అసలు చూడలేదు. అసలు రెండు రోజులక్రితం నేను మా యింట్లోనే లేను. నిజం సార్ నాకేమీ తెలియదు. నేను చాలా అమాయకుడిని కావాలంటే మా ఆవిడని అడగండి. ఆవిడ కూడా ఇదే మాట చెబుతుంది."
"గోవిందరావు చెప్పిన ఈ రెండు ముక్కలలోనే ఇన్ స్పెక్టర్ కి చిన్న క్లూ దొరికింది. అతను బాగా భయపడి నిజం చెప్పటంలేదని గ్రహించాడు, ఇలాంటి వాళ్ళతో నెమ్మదిగా మాట్లాడి, ముందు వారిలో భయాన్ని దూరం చేసి నెమ్మదిగా అసలు విషయం రాబట్టాలి. గట్టిగా గదమా యిస్తే పూర్తిగా భయపడిపోయి, అసలు నిజం చెప్పరు." అనుకున్న ఇన్ స్పెక్టరు సానునయంగా అడిగాడు.
"మిస్టర్ గోవిందరావ్! నువ్వుండేది ఎక్కడ?"
"ఈ హోటల్ వెనుకవైపు అయిదు అంతస్థుల 'కాదంబరి' ఫ్లాట్ లో మూడో అంతస్తులో వుంటున్నాము." వినయంగా చెప్పాడు.
"వుంటున్నాము అంటున్నావు. ఎవరెవరు?"
"నేను, నా భార్య ఎనిమిదేళ్ళు కల మాపాప. మే ముగ్గురమే సార్."
"ఫ్లాట్ నీ సొంతమా?"
"అద్దెకుంటున్నాం సార్. మనకంత యోగం లేదని నా భార్య అంటూ వుంటుంది. సార్."
"ఐ.సి... మీరేం చేస్తుంటారు?"
"సేల్స్ మాన్ ని సార్. ఏదో రెండు మూడు చిన్న కంపెనీలలో సార్. వాళ్ళు ఇచ్చిన వాటిని షాప్స్ లో ఇస్తుంటాను. అంతకంటే పెద్దపని ఏం లేదు సార్." చెప్పాడు సిగ్గు పడుతూ గోవిందరావు.
"చిన్న ఉద్యోగమైనా, పెద్ద ఉద్యోగమైనా, ఉద్యోగము పురుష లక్షణం, నువ్వు చేస్తున్న పని మంచిది గోవింద రావ్. మగాడన్న తరువాత సంపాదించాలి. అలాగే ఉత్తమ భారత పౌరుడు న్యాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అసత్యము పలుకకూడదు. నిజాన్ని నిర్భయంగా చెప్పేటట్లు వుండాలి. నిన్ను చూస్తుంటే మంచి భారత పౌరుడిలాగా అనిపిస్తున్నది. ప్రజలు మాకు ఎక్కడ సహకరిస్తారో అని ఈ దొంగలు హంతకులు మా డిపార్ట్ మెంట్ ని భయంకరముగా చిత్రీకరిస్తూ వుంటారు.
అది విన్న మీలాంటి ఉత్తమ పౌరులుకూడా మమ్మల్ని రాక్షసుల్లాగా తలచి, నిజాలని చెప్పరు. మీరు నన్ను మా డిపార్ట్ మెంట్ ని రాక్షసుల్లా తలుస్తున్నారా?" ఇన్ స్పెక్టరు చిరునవ్వుతో మృదువుగా అడిగాడు.
గోవిందరావు కొద్దిగా సిగ్గుపడుతూ తల వంచుకున్నాడు.
"మిష్టర్ గోవిందరావ్! నిన్ను చూస్తూంటే నాకు చాలా సదభిప్రాయం కల్గుతుంది. నీవు నాతో ఏం చెప్పింది అన్నది. బయటకు తెలియనివ్వను. నీకు ఎంతో కొంత తెలుసని నాకు తెలుసు. దాచి ప్రయోజనం లేదు. పోలీస్ ఇన్ స్పెక్టరు గా నన్ను చూసి నీకు భయమయితే, ఒక మిత్రుడికి చెబుతున్నా ననుకుంటూ చెప్పు. నీ నిజాయితీని నేను గుర్తుంచుకుంటాను. ఊ....క్విక్....నీకు తెలిసిందే చెప్పు. భయమేమిలేదు"
ఇన్ స్పెక్టరు ఉపయోగించిన 'ఉత్తమ పౌరుడు' అన్న మాట గోవిందరావు మనసుకి హత్తుకుంది. నిజం చెప్పేద్దామన్న నిర్ణయానికి వచ్చాడు.
