Next Page 
శంఖారావం పేజి 1


                                                   శంఖారావం

                                                            ---వసుంధర

                                    

    కార్ట్లోంచి ఇద్దరు యువకులు దిగారు.
    ఒకడు గ్రే కలర్ పుల్ సూట్ లో ఉన్నాడు. తెల్లావాడంత తెల్లగా ఉన్నాడు. అతడి పేరు విశ్వనాద్
    రెండవ వాడు జీన్స్ ధరించాడు. స్టోన్ వాష్ ఓవర్ కోటు రంగు చామన చాయే అయినా అందులో మెరువుంది. అతడి పేరు వేదాంతం.
    'రెస్టారెంటుకి వెళ్ళాలంటే ఒకటిన్నర కిలోమీటరు దూరం నడవాలి " అన్నాడు విశ్వనాద్ విసుగ్గా.
    "ఏం చేస్తాం? ఈ న్యూయార్క్ మహానగరంలో కారుండి సుఖం లేదు. పని ఒక చోట పార్కింగ్ వేరొక చోట ---పద!" అన్నాడు వేదాంతం.
    "నాగరికత మనిషికి కాలినడకను నేర్పుతోంది. ఇదీ ఒకందుకు మంచిదే కదా!" అన్నాడు విశ్వనాద్ నవ్వుతూ.
    పార్కింగు స్థలం రెస్టారెంటుకు దగ్గర్లోనే ఉంది. లాని అక్కడ పార్కు చేయబడ్డ కార్లు ఒకటా, రెండా .....వందల్లో ఉన్నాయి. ఖాళీ కోసం ముందుకు వెడితే ఒకటిన్నర కిలోమీటర్లు వెళ్ళాల్సోచ్చింది.
    యువకులిద్దరూ రెస్టారెంటు చేరుకున్నారు.
    పుట్ పాత్ కు పక్కగా షామియానా కింద ఓ పాతిక టేబుల్స్, వాటి చుట్టూ కుర్చీలు ఉన్నాయి. అదే రెస్టారెంటు!
    వాళ్ళిద్దరూ వెళ్ళి ఖాళీగా ఉన్న రెండు కుర్చీల్లో కూర్చున్నారు.
    వెంటనే వెయిటర్ వారి ముందు ప్రత్యక్షమయ్యాడు.
    విశ్వనాద్ అతడికి బీరు ఆర్డరిచ్చాడు.
    'షాపులో కొనుక్కుంటే ఇరవై సెంట్ల విలువ చేసే దానికిక్కడ డాలరు కట్టాలి. మనమిక్కడ కెందుకొచ్చినట్లు ?' అన్నాడు వేదాంతం విసుగ్గా.
    "అన్నీ తెలుస్తాయి. ఒక్క నిమిషం ఓపికపట్టు ' అన్నాడు విశ్వనాద్"

 

            
    వెయిటర్ ట్రేతో వచ్చాడు. బీరు ఖరీదుకు పాతికరెట్లు విలువ చేసే గ్లాసులు వారి ముందుంచి వెళ్ళిపోయాడు.
    "ఖరీదైన దుస్తులు మనిషి విలువను పెంచుతాయి. ఈ గ్లాసు బీరు ధరను పెంచింది." అంటూ వేదాంతం గ్లాసు తీసుకున్నాడు.
    ఇద్దరూ నెమ్మదిగా బీరు చప్పరిస్తున్నారు!
    "బాగుంది కదూ?!" అన్నాడు విశ్వనాద్"
    వేదాంతం తల అడ్డంగా ఊపి---"మాతృదేశంలో అడుగు పెట్టగానే నేను బార్లు, బీర్లె కాదు కాఫీ, టీలు కూడా మానేస్తాను " అన్నాడు.
    "ఎందుకు?"
    "నిషా ఎంతో గొప్పది. జీవితానికి నిషా అవసరం. నిషా కోసం బ్రాందీ, విస్కీ జీన్స్ నీ, నైటు క్లబ్బుల్నీ నమ్ముకున్న వాడికి --- జీవితంలో ఉన్న నిషా ఏమిటో తెలియకుండా పోతుంది" అన్నాడు వేదాంతం.
    "జీవితంలో నిషా అంటే?"
    "ఉదాహరణకు మనదేశంలో పెళ్ళి ఒక నిషా! స్త్రీ వాసన తెలియని ఒక పురుషుడు పురుష స్పర్శ తెలియని ఒక స్త్రీ--- పరస్పరం ఏమాత్రమూ ఎరుగకుండా ఒకరోజున కలుసుకుంటారు -- ఆ నిషా ఎంత గొప్పదంటే అది ఒక జీవిత కాలం పాటు వారిరువురినీ దంపతులుగా బంధించి ఉంచగల్గుతుంది. ఇక్కడ పెళ్ళి రోజుకు పెళ్ళి రోజున్న పేరు తప్ప మరే ప్రత్యేకతా లేదు. అందుకే పెళ్ళయిన మర్నాడే విడాకులు..."
    "ఇప్పుడీ పోలికలెందుకు ?" అన్నాడు విశ్వనాద్"
    "పోలికలు కాదు. ఈ సంస్కృతీలో నిషా జీవితంలోని నిషాను పొగుడుతుంది. కాయకష్టం చేసిన వాడి నిద్రకూ, స్లీపింగ్ టాబ్లెట్ నిద్రకూ తేడా ఉంటుంది. కానీ మన దేశంలో ఈ సంస్కృతీ పట్ల వ్యామోహం పెరుగుతోంది. అదే జాతిని పతనం చేస్తోంది."
    "నేనొప్పుకోను, నీ జాతి పతనానికి సంస్కృతీ కారణం కాదు. ఈ సంస్కృతీలోంచే విజ్ఞానం పుట్టి మానవజాతికి ప్రాణం పోస్తోంది.'
    "మారణాయుధాలు ఈ సంస్కృతీలోంచే పుట్టాయి...."
    "వాటిని నిరోధించే ఉపాయమూ ఈ సంస్కృతీ లోంచే పుడుతుంది...."
    'ఇంపాజిబుల్...."
    "ఇటీజ్ పాజిబుల్....'
    "ఎలా?" అన్నాడు వేదాంతం.
    "మశూచికి మనిషి చావచ్చు. కానీ టీకా వేసుకున్నవాడి దరిదపులక్కూడా రాలేదు మాశూచి...' అన్నాడు విశ్వనాద్.
    "అయితే?"
    "మరనాయుదాలొక మశూచి అనుకో...... అప్పుడు నేను దేశాలకు టీకాలు వేస్తాను " అన్నాడు విశ్వనాద్.
    "నువ్వా?" అన్నాడు వేదాంతం ఆశ్చర్యంగా.
    విశ్వనాద్ నవ్వి, -ఇక్కడ నేను చేస్తున్న పరిశోధనలకూ ఈ సబ్జక్ట్ కూ సంబంధం లేదని కదూ నీ ఆశ్చర్యం ? నా ప్రయోగాలు రసాయనాల మీద! అనే నాకిక్కడ డాక్టరేట్ ను తెచ్చిపెట్టాయి. కాని న్యూక్లియర్ సైన్సు నాకెంతో ప్రియమైనది. ఇక్కడ నేను సమయం వృధా చేసుకోకుండా ఆ సబ్జక్టులో ఎన్నో పుస్తకాలు చదివాను. నా బుర్రలో ఓ మెరుపు మెరిసింది. యాంటీ న్యూక్లియర్ వాక్సినేషన్ స్కీమోకటీ తయారుచేశాను. దేశంలో అడుగు పెట్టగానే నా థియరీ ప్రయోగాత్మక రూపంగా పరీశీలిస్తాను...." అన్నాడు.
    "ఆ పని ఒక్కటే ఎందుకు చేయలేదు?"
    "ముందు నా ప్రొఫెసర్ కు చెప్పాను. అప్పుడాయన నన్ను న్యుక్లీయర్ ఫిజిసిక్టు ప్రొఫెసర్ ఆర్నాల్డ్ కు పరిచయం చేశాడు. అయన నాతొ కాసేపు మాట్లాడి "న్యూక్లియర్ సైన్సులో ప్రాధమిక దశలో ఉన్నావు నువ్వు రీసెర్చికి పనికిరావు" అనేశాడు. ఆయనకు నన్ను ప్రోత్సహించడం ఇష్టం లేదని తెలిసి పోయింది. అప్పుడు నేను పట్టుదలగా యాంటీ న్యూక్లియర్ గన్ తయారుచేశాను. తర్వాత మరోసారి ప్రొఫెసర్ ఆర్నాల్డ్ ను కలుసుకున్నాను. లాబెరేటరీలో అట్టే హానికరం కాని ఒక మినీ న్యూక్లియర్ ఎక్స్ ప్లోజన్ ని నా గన్ తో నిష్ప్రయోజనం చేశాను. ఆర్నాల్డ్ ఆశ్చర్యపడి...." నీ థియరీ తో పనిలేదు. నువ్వు సాధించినది అద్బుతమే. నీకు సాయంగా ఉండడానికి నా జూనియర్ కొలీగ్ నిస్తాను. ఇద్దరూ కలిసి పరిశోధనలు చేయండి" అన్నాడు! ఆ జూనియర్ నాకంటే పన్నెండేళ్ళు సీనియర్. పేరు డాక్టర్ గ్రే....' అని ఆగాడు విశ్వనాద్.
    'అంటే నువ్వు ఆ రకంగా కూడా పరిశోధనలు కొనసాగించావన్న మాట. యూ ఆర్ రియల్లీ గ్రేట్ --- విశ్వనాద్ ' అన్నాడు వేదాంతం.
    "కానీ ఒక ఇబ్బంది వచ్చింది. డాక్టర్ గ్రేకు నేను చెప్పేది ఓ పట్టాన అర్ధం కాలేదు. అన్నీ ఎంతో వివరంగా చెప్పవలసి వచ్చేది. మొదట్లో నేనందుకు చాలా గర్వపడేవాడ్ని. అయితే అసలు విషయం తెలుసుకుందుకు నాకెంతో కాలం పట్టలేదు. గ్రే నేను చెప్పేదంతా తెలుసుకుంటున్నాడు తప్ప నాకేమీ చెప్పడం లేదు. నానుంచి సమాచారం సేకరించడమే అతని ధ్యేయం. ఇది గ్రహించగానే నా గర్వం అణిగి పోయింది. గ్రేకి అంతా చెబుతున్నట్లే నటించి కీలక సమాచారాన్ని నా వద్దనే ఉంచుకున్నాను....." అన్నాడు విశ్వనాద్.
    'చాలా చిత్రంగా వుంది "
    "డాక్టర్ గ్రేకు నా పరిశోధనలు సత్పలితాలిస్తాయన్న నమ్మకం కలిగింది. ఆ ఫలితాలను విశ్వమానవ కళ్యాణానికి కాక సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా ఉపయోగించాలని అతడి ఆశయం. అది తెలియగానే నేనిక్కడ పరిశోధనలకు పుల్ స్టాఫ్ పెట్టాను. నా పరిశోధనలు కొనసాగించాలని గ్రే ఎంతో పట్టుబట్టాడు. వాటిని స్వదేశంలోనే కొనసాగిస్తానని నేనన్నాను. అది సాధ్యపడనివ్వమని గ్రే నన్ను బెదిరించాడు" అన్నాడు విశ్వనాద్"
    "ఏం చంపుతానన్నాడా?"
    "లేదు. అంతా మన దురదృష్టం. మూడు దశాబ్దాలుగా స్వతంత్ర వాయువులు పీల్చుకుంటున్నామన దేశంలో బానిస మనస్తత్వం పోలేదు. నా సబ్జక్టు కెమిస్ట్రీ కావడం వల్ల మన దేశంలో నాకు న్యూక్లియర్ సైన్సులో రీసెర్చి చేసే ఆవకాశం లేదు. నా శక్తి సామర్ధ్యాలు ఋజువు చేసుకుందుకు లాబొరేటరీ సదుపాయాలు కావాలి గదా! అందుకు నాకిక్కడి నుంచి రికమెండేషన్ కావాలి. ఇండో అమెరికన్ లాబరేటరీ రీసెర్చి ప్రాజెక్టుగా నా పరిశోధనలను కొనసాగించే అవకాశం డాక్టర్ గ్రే నాకిస్తానన్నాడు. అందువల్ల ఒక ఇబ్బంది ఉంది. మన పరిశోధనల రహస్యాలు అమెరికాతో పంచుకోవాలి. మరో దేశానికి తెలియనివ్వ కూడదు. ఇది ఎటువంటి విపరీత పరిణామాలకు దారి తీస్తుందో నేనూహించగలను....
    'అయితే ఏం చేస్తావు ?"
    "డాక్టర్ గ్రేని మాయలో పడేసి అతడి లాబరేటరీ సదుపాయాలలో నా పరిశోధనల కవసరమైన కీలక సందేహాలను నివృత్తి చేసుకున్నాను. నా పరిశోధనలై పోయాయి. ఇది ఎవరికీ తెలియని రహస్యం. ఇదేలాంటి రహస్యమేంటే ఆఖరికిప్పుడిలా నీకు చెప్పడం కూడా తప్పే!" అన్నాడు విశ్వనాద్.
    "మరెందుకు చెప్పావ్?"
    "ఇక్కడ తెలుగేవరి కర్ధమవుతుందిలే అని చెప్పాను....?"
    మిత్రులిద్దరూ బీరు తాగడం పూర్తయింది.
    "మరి లేద్దామా?" అన్నాడు వేదాంతం.
    'అప్పుడే కాదు.....ఇంకో బీరు అర్దరిద్దాం..."
    "ఎందుకు ?"
    'డాక్టర్ గ్రే మనిషి నన్నిక్కడే కలుసుకుంటాడు...."
    "ఎందుకు ?"
    "రష్యన్ గూడచారులకు మా ప్రయోగాల గురించి తెలిసిందట. నేను త్వరగా  ఇండియా వెళ్ళిపోవడం మంచిదని అతను నాకు సలహా ఇచ్చాడు. తన మనిషినిక్కడకు ప్రత్యెక సందేశంతో పంపుతానన్నాడు."


Next Page 

WRITERS
PUBLICATIONS