రామ్మూర్తి, "షటప్" అని అన్నాడుగానీ అది గొంతులోనే వుండిపోయి, "సారీ సర్" అనేశాయి పెదాలు.
ఎవరన్నా నిబ్బరంగా పరకాయించి తనని చూస్తుంటే అదోలా బిడియపడి పోతాడు.
నెలరోజులైనా గడవకుండా పెళ్ళి ముహూర్తం తేదీ వుత్తరం వచ్చింది.
ఆఫీసరుకి చెబితే, "అటు పెళ్ళి వేడుక పెట్టుకుని దీనిలో దేనికి చేరావ్?" అని గదమాయించాడు.
"అప్పటికింకా తెలియదు సార్. ఎక్కువ రోజులు సెలవు అవసరం లేదు సార్. మ్యారేజ్ అవగానే వచ్చేస్తాను సార్" అన్నాడు రామ్మూర్తి.
"కొత్తగా వుద్యోగంలో చేరాక__పెళ్ళి. సెలవు యివ్వడమే కష్టం__మళ్ళీ శోభనానికంటే సాధ్యపడదు. ఆ కార్యం వచ్చే యేడాదికి పెట్టుకొనేటట్లయితే సరే లేకపోతే పెళ్ళితోటే యేర్పాటుచేసుకోవాల్సి వుంటుంది" అని తెలిసిన ఒకతను వెడుతూంటే పెళ్ళి బ్రాహ్మడికి కబురుపెట్టాడు.
రామ్మూర్తి ధ్యాస పెళ్ళికంటే శోభనం మీద వుంది. యెందరి పెళ్ళిళ్ళో చూశాడు. పెళ్ళి గురించి తెలిసిందే. మరొకరి శోభనం చూడ వీలుకానిది. రామ్మూర్తి ధ్యాస అంతా శోభనం మీద వుంది. 'అన్నాళ్ళు ఆగరులే. అదీ పెళ్ళితోటే యేర్పాటు చేసేస్తారు' అని అనుకుంటూ, తియ్యగా వూహించుకుంటున్నాడు రకరకాలుగా.
పెళ్ళిరోజు రానూ వచ్చింది. జరగనూ జరిగింది. ఆ తంతు జరుగుతూంటే రామ్మూర్తి ధ్యాసంతా పెళ్ళికూతురిమీదే వుంది. ఆ సందడిలో వీలయినప్పుడల్లా ఆమెని వీలైన చోటల్లా పరిశీలనగా చూస్తున్నాడు. ఆమె పేరు నిర్మల. ఆ రాత్రికే శోభనం. పెళ్ళి తంతు ఎప్పుడు ముగుస్తుందా అని తొందరపడుతున్నాడు.
తొమ్మిదిన్నరకి పెళ్ళి ఘట్టం ముగిసి, పదిన్నరకి శోభనం ప్రకరణంలో పడింది కార్యక్రమం.
గదిలో__రామ్మూర్తి; ధోవతి జుబ్బా వుత్తరీయం. యెదురుచూస్తున్నాడు. చేతికి వాచీ వుంది. కొత్తది. అత్తవారు కొనిచ్చారు. సెకండ్ల ముల్లు మహా వేగంగా పరుగుతియ్యటమైతే కనిపిస్తోంది గానీ ఎంతకీ నిమిషాలు గడుస్తున్నట్టే అనిపించటం లేదు.
"యీ సెకండ్ల ముల్లు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ వుండి వుండాలి' __అనుకున్నాడు.
అంతలో, నిర్మలని గుమ్మం లోపలికి వంపి, తలుపులు మూశారు. తలుపుల అవతల నవ్వులు. రామ్మూర్తికి వుత్సాహంగా అనిపించింది, ఆ నవ్వులకి.
జరీ అంచు తెల్ల చీర. జరీ అంచున్న తెల్ల బ్లౌజు. జడలో బుట్టెడు పువ్వులు. పక్కమీద ముందే చల్లి వుంచారు.
చేతులో పాలగ్లాసుతో గుమ్మంలో నిలుచుని వుంది.
పాలగ్లాసు దేనికో అతనికి అర్ధమవలేదు.
గర్భధారణకి స్తన్యానికి చిహ్నంగా అని సోషియలాజికల్ రీతిలో ఆలోచించాడు.
అక్కడే నుంచుని పోయిందేంరాదేం__అనుకుని విసుక్కున్నాడు లోన.
ఒక నిమిషం తరవాత__సిగ్గుపడుతూండాలి, తను వెళ్ళి తీసుకురావాలి భుజం చుట్టూ చెయ్యి వేసి__అనుకున్నాడు. మంచం మీద కూచుని వున్నవాడల్లా లేచి నిలుచున్నాడు, కాళ్ళు వొణికాయి.
రవ్వంత తడబడుతున్న అడుగులతో వెళ్ళి పక్కన నుంచున్నాడు. భుజం చుట్టూ చెయ్యి వెయ్యాలనుకున్నాడు. "నిర్మలా" అని పిలవాలనుకున్నాడు. కానీ__చెయ్యి లేదనూ లేదు, గొంతు పెగలనూ లేదు.
మరో నిమిషానికి, ఆమె వీపు వెనకగా చెయ్యి వేసి, "నిర్మలా" అన్నాడు.
ఆమె ముందుకు అడుగులు వేసింది.
మంచం అంచుమీద కూచున్నారు యిద్దరూ.
పాలగ్లాసు మంచం పక్కన వున్న స్టూలు మీద పెట్టింది. ఆ స్టూలు మీద ఓ ప్లేటు. దాన్లో పళ్ళు. తాంబూలాలు.
అగరొత్తులు, రామ్మూర్తి గదిలోకి రాకముందే వెలిగించారు.
భుజాలు పట్టుకుని మంచం మీద పడుకోబెట్టాడు.
వొంగి, ఆమె పెదాల మీద పెదాలు అతికించాడు. జివ్వున హాయిగా లోపల యేదో గుంజినట్లుగా అనిపించింది. మళ్ళీ ముద్దెట్టుకున్నాడు. మళ్ళీ ముద్దెట్టుకున్నాడు.
నిర్మల అలా వెల్లకిలా పడుకునే వుంది.
బ్లౌజుకి ముందువైపు కొక్కాలే. అలాగే ఆమె ముఖంలోకి చూస్తూ కొక్కేలు తప్పిస్తున్నాడు. ఆమె చెయ్యి అడ్డం పెట్టింది అమాంతం.
అంతటితో ఆ పని ఆపి పక్కన పడుకుని చెంపలు ముద్దెట్టుకున్నాడు.
రామ్మూర్తికి అలా బాగానేవుందిగానీ__యేది చూడటానికీ వీలవటం లేదు. బొమ్మల్లో తప్ప సాక్షాత్తూ మనిషిని తన కళ్ళతో తాను చూసిన అనుభవం లేదు. మనసు ఆరాటపడుతోంది. వుత్సుకత.
తన ముఖం ఆమె ముఖం పక్కగా వుండిపోయింది. తను యెటు జరగటానికి లేకుండా చేత్తో గట్టిగా అల్లుకుపోయింది.
"కాస్త పక్కకి జరుగు నిర్మలా" అన్నాడు.
ఆమె జరగలేదు.
"జరుగూ" అన్నాడు ప్రేమగా.
మరింత దగ్గిరికి జరిగింది. ఆ ఒత్తిడికి అతని ఒళ్ళంతా కంపించింది.
ఆమె పెదాలు ముద్దెట్టుకున్నాడు, ఒళ్లంతా యేదో జిల్లుమని జివ్వుమనీ పాకినట్లుగా అనిపించింది.
ఆమె మీదికి జరిగాడు.
ఆమె బాధగా చిన్నగా మూలిగినట్లుగా రవ్వంత సవ్వడి. ఆ తరవాత దీర్ఘంగా ఆమె శ్వాస.
ఈ రకం తృప్తి యింతకుముందు ఇంకెందులోనూ కలగలేదు. యిదేదో దీన్లో వుంది అసలు కిటుకు_అనుకున్నాడు.
అంతలో అలసటగా పక్కకి ఒరిగిపోయాడు.
రామ్మూర్తికి పట్టరాని ఆరాటంగా వుంది. ఆ ఆరాటంలో, "చెయ్యి తియ్యి" అని అరిచాడు.
జడుసుకున్నట్లుగా తుళ్ళిపడింది నిర్మల. చెయ్యి చటుక్కున జరిగింది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
నిలువునా చూసేశాడు రామ్మూర్తి తొలిసారిగా.
చేత్తో పక్కకి జరిపినట్లు కదిపాడు. గిరుక్కున తిరిగి బొక్కబోర్లా పడుకుంది.
రెండు నిమిషాలు.
మళ్ళీ యిటు తిప్పబోతే ఆమె అలా పరుపుకి అతుక్కున్నట్లుగా పడుకుంది.
రెండు నిమిషాలు.
కితకితలు పెట్టాడు. పక్కన అటూ యిటూ కదిలి తిరిగింది. దిండుమీద కన్నీటి తడి. తడికి, గుండ్రదనం కోల్పోయిన తిలకం బొట్టు.
ఆశ్చర్యంగా చూసి, "నిర్మలా ఏడుస్తున్నావా? నిన్ను కష్టపెట్టనా? చెప్పు? నీకు కష్టం కలిగే పనేదీ చెయ్యను చెప్పు" అన్నాడు.
ఆమె మౌనంగా వుండిపోయింది.
తను వూహించుకున్నవీ, చదివినవీ, యింకా యెన్నో. తాను చెయ్యటమేకాక ఆమె తానుగా చెయ్యాలని వూహించుకుంటున్న రామ్మూర్తి దిగాలుపడిపోయాడు.
"యెందుకని?" అన్నాడు.
ఆమె మౌనంగా వుండిపోయింది.
"నేనంటే యిష్టం లేదా?" అన్నాడు.
తల అడ్డంగా వూపింది నిర్మల.
రామ్మూర్తి గుండె టక్ మంది.
ఒక నిమిషానికి కాస్త స్థిమితపడి "నేనంటే యిష్టమేనా?" అన్నాడు.
తల యింతకు ముందులాగే అడ్డంగా వూపింది.
అర్థంకాక "నోటితో చెప్పు" అన్నాడు.
"నాకు సిగ్గేస్తుంది. అట్లా చూడొద్దు" అంది.
సిగ్గుపడుతున్నదనే తట్టలేదు అతనికి.
హాయిగా చిన్నగా నవ్వేసి, "ఈ మాత్రానికేముంది!" అని, "యెంతసేపూ నేనేనా నువ్వు నన్ను ముద్దెట్టుకో." అన్నాడు.
ఆమె అలాగే వుండిపోతే, "యిష్టంలేదా నన్ను ముద్దు పెట్టుకోవటం?" అన్నాడు.
ఆమెకి ఏడుపొచ్చింది.
మళ్ళీ ఆమెని దగ్గిరికి తీసుకున్నాడు. నేనిదవడమేగానీ తనేం చెయ్యదేం?"__అనుకున్నాడు.
రెండో రాత్రి__
"నువ్వెందుకట్లా చలిమిడి ముద్దలాగా పడివుంటావ్? రామ్మూర్తి_తను వూహించుకున్న ఎన్నో గుర్తొస్తూంటే.
