తిరుపతి
16-6-03
నిరీక్షణ, సుధిర్ఘ నిరీక్షణ; వొకానొక మరణానంతరం సంగమం కోసం. పాత పాటలలో తేనె చిప్పిలినట్లుగా, స్మృతుల మాధుర్యంతో మనసు నిండిపోతుంది.
మారుమూలకి వుండిపోయిన మంచి సంగిత దర్శకుడు యస్.యన్. త్రిపాఠి లక్ష్మీకాంత్ ప్యారేలాల్, ఆనంద్ బక్షి, ఘోరత్రయం. వాళ్ళతో కలిసినప్పుడు లతా మంగేష్కర్ గొంతు ఘోరం. లతా మంగేష్కర్ గొంతు సితార్ లాగానూ, గితాదాత్ గొంతు బాసురిలాగానూ వుంటాయని అనిపిస్తుంది నాకు.
తెలుగు చానల్స్ దాదాపు పెట్టటం లేదు. వెనక ETV పెడుతుండేవాణ్ని. పొద్దుట సాయంత్రం చాలా సెపు మంచి పాటలు వొచ్చేవి.
సంగీతం వింటూ మరింకేమి చెయ్యలేను. తాదాత్మ్యం (లేక యేక సంతాగ్రాహినేమో!) తియ్యని సంగిత కంఠస్వరానికి మనసు వెన్నెట్లో పుచ్చాపువ్వులా విచ్చుకుంటుంది.
తెలుగు సంగిత భాష. కర్నాటక సంగీతంలోని యెక్కువ కృతులు తెలుగు లోనే వొచ్చాయి.
హిమాజ్వాల మొదటి అధ్యాయం వెలుగుమరకరాసే నాటికి నాకు యిరవ్తే మూడేళ్ళ. అప్పటికే డిజ్తేర్ అన్డ లిబరేషన్ స్పృహలో వుంది. ('వెలుగు మారక' పదబంధం నాది కాదు. బ్తేరాగిది)
తాను నవ్వితే లోకం నవ్వుతుంది. తాను యేడిస్తే లోకం యేడవదు. యెక్కడో వికానోకార్ర్ధమానసం రోదిస్తుంది.
desire and liberation ని తెలుగులో తృష్ణ - విముక్తి అనోచ్చునేమో.
బాలచంద్ వీణ కాస్త పరుషంగా వుంటుంది. యీమని శంకరశాస్త్రి వీణ మరి లలితంగా వుంటుంది. గాయత్రిగారి వీణ సమంగా శ్రవ్వంగా వుంటుంది.
క్రితం వారం DD chennai లో వేకువన వక గంటసేపు గాయత్రిగారి వీణ వింటూ చూశాను, చూస్తూ విన్నాను. చానల్ రెండు నిమిషాలు ముందు పెట్టి కళ్ళు మూసుకుపడుకుంటాను. కార్యక్రమం మొదలవగానే అక్కరలేనిదయితే చానల్ మార్చుతాను. యెంతో సంతోషంగ గాయత్రి గారి వీణ వినిపించింది. ఆమె వీణ సవ్వడి గుర్తించగాలను, వాయించటం గుర్తించగాలను (చూసినాDDchennaiలో టైటిల్సూ రాగాలు వివరాలు తమిళంలో చూపెడతారు కదా)
తెలుగు సిని నేపధ్యాగానంలో అనితరసాధ్యగాయని సుశిలకి విశ్రాంతి నిచ్చి,melody tunes వున్నంత వరకూ నిలిచింది, చిత్ర.
45సంవత్సరాల క్రితం టాగూరు గీతాంజలి నోటికొచ్చు (ఆయనవి మరింకేమి చదవలేరు). హాస్యనటులలో జానివాకర్, రేలంగి యిష్టం.
గొప్ప వాళ్ళలో కొందరు నాకు నచ్చరు. వుదాహరణకి, నటుడు చార్లీ చాప్లిన్, గాయకుడు కె.యల్. స్తెగల్
desire and liberation లో senses are innumerable అన్నాను. యీ అంశం హిమాజ్వలలో సూచితమ్తెంది. హిమజ్వాల చివర్లో "షష్ఠెంద్రియాలు గ్రహణ కోల్పోయాయి. రాసేంద్రియం మాత్రం మిణుకు మిణుకు మంటోంది" -అని. యింద్రియాలు ఆరుకంటే యెక్కువ అని అర్ధం కదా!
కొందరు తెలుగు భాష వాడుకని గమనిచంరు. ప్రయోగంలో తప్ప తెలుగు భాష వాడుకని గమనించాలి. వుదాహరణకి "నోరు తెరవం, పెదవి విప్పం అంటాం నోరువిప్పాడు పెదవి తెరవడు -అనం.
మీ నలుగురికి శుభాకాంక్షలు
-వడ్డెర చండీదాస్.
తిరుపతి
25-6-03
రఘుగారికి నమస్తే,
అసలే తిరుపతి వేడి. యీ యేడు యెండలువిపరీతం.45డిగ్రిలు,40వరకూ.
Aircooler ప్లజంట్ గా వుండదు.
కాగా, వాతావరణం వేడి, గడివేడి, mild typhoid వేడితో గడిచింది యీ వేసవి.(యింకా జ్వరం కాస్త శేషించి వుంది)
ఫిబ్రవరి ప్లజంట్ గా వుంటుంది (మాఘమాసం). చలివేడి లేకండా చమట పట్టకండా చాలా ప్లజంట్ గా వుంటుంది. స్యూయార్క్ లో వేసవి అలా వుంటుంది.
వీణ వింటూ ఆకలిదాహమూ తెలియకండా యెంత సేప్తెనా వుండి పోగలను. అన్ని సమస్తమూ, వీణ తరవాతే. (విణంటే అల్లాటప్పా వీణ కాదు. అద్బుతంగా వుండాలి).
శాస్త్రీయ సంగీతంలో చాలా మందివి (ఆడా మాగ) బర్రె గొంతులు. ఐనా వినక తప్పదు సంగీతం కోసం.
సంగీతంలో పాత జనరేషన్ యిష్టం. కొత్త జనరేషన్ యిష్టంలేదు. వుదాహరణకి -సచిన్ దేవ్ బర్మన్ యిష్టం. రాహుల్ దేవ్ బర్మన్ యిష్టంలేదు. రోషన్ యిష్టం. రాజేష్ రోషన్ యిష్టంలేదు. సర్దార్ మల్లిక్ యిష్టం. అన్నూమల్లిక్ యిష్టం లేదు. 1950-70-Golden Age of Hindi Film Music.
ప్రతి శినివారం పగలు పదిన్నరకి DD హ్తేదరాబాద్ పెడతాను. అరగంట సెపు కూచిపూడి చూస్తుంటే, కూచిపూడి అంటే యింతేనా! అనిపిస్తుంది. అందరూ ప్రావిణ్యం లేని గుంటలు.
యేలిననాటి శిని అన్నట్లుగా ,మన దేశానికి పాకిస్తాన్ వొకటి.బ్రిటిష్ వాడు పెట్టిన పితలాటకం వల్లగాని లేకపోతే పాకిస్తాన్ అంటూ వుండేదికాదు. ఆఖండ భారతం. కాశ్మిరును సమస్య చేశారు. అప్పడే యే పాటలో పాకిస్ధాన్ ని తుడిచి పెడితే బాగుండేది. మూడుసార్లు తోక ఆడించింది గాని దుస్సాహసమే ఐంది. ఐనా మిన్నకుండదు. కెలుకుతూనే వుంటుంది. కాశ్మిరుతో చెలగాటం. యెప్పుడు -వొ చావు దేబ్బతియ్యలన్నా వెధవలు అణుబాంబు తయారు చేసుకు కూచున్నారు. దాని పుటకే వివాదాస్పదం. దాని కదలికలే వివాదాస్పదం. దాని బుర్రంతా దుష్టత్వంతో పుచ్చింది. బుగిలిపోయే వరకూ అంతే. నాకు అనిపిస్తుంది, యిది దేశాప్రారబ్ధం అని. తెలుగు భాష తరవాత.భారతావని నాకిష్టం.
యవ్వనవ్తేభావం ఆశాశ్వితమని నిరాకరించామనరాడు. యేది శాశ్వతం కాదు. ప్రతిది కొంత శాశ్వితంలోకి కొంత అశాశ్వితంలోకి చేరుతుంది. "బధిరమ్తె పోయింది యీ యింద్రియాల త్యజించిన జివజాలానికి" అని గితాదేవి వాపోతుంది.
యింద్రియలలోంచి మహ్తేద్రియనవ్వాలి.
ఐదారేళ్ళ క్రితం వొచ్చిన మనసిచ్చిచూడాలి సినిమాలో "నాలో యేదేదో ఐపోతున్నది" పాటలో నటి రాశిని చూడండి.
యిప్పడోస్తున్న కొత్త సినిమాల పాటలు కంటికి బావుంటున్నాయి - కొన్ని.
పాకిస్తాన్ బెడద లేకపోతే మన దేశ రక్షణ వ్యయం పూర్తిగా తిగ్గించుకో వొచ్చు. కరప్షన్ కూడా పోతే మూడుపువ్వులు ఆరుకాయలుగా వెలుగొందుతుంది దేశం. ప్రపంచంలో కెల్లా అసలు కరప్షన్ లేని దేశం న్యూజిలాండ్ అట. ఆ తరువాత జపాన్ అట. అమెరికాలో- అప్పడప్పడు వొకటి అరా చాలా పెద్ద కుంభకోణాలు తప్ప కరప్షన్ లేదట. ప్రజల ద్తేనందిన జీవితంలో యెదురుపడదట, లేదట.
మీ నలుగురికి శుభాకాంక్షలు
-వడ్డెర చండీదాస్.
