Previous Page Next Page 
ప్రేమతో ....వడ్డెర చండీదాస్ పేజి 17

                                                                                                                          

                                                                                                                తిరుపతి

                                                              5-5-03                                                                                                                                                                                        
                                                                                                                            
    రఘుగారికి నమస్తే,

    తెలుగులో లలిత సంగీతం యెక్కువ. నాకిష్టం లేదు. హిందిలో సుగమ్ సంగీత్  అని  తక్కువే. కానీ నాకిష్టం లేదు. ఖవ్వాలి కూడా యిష్టం లేదు.  హిందిలో వుప్ శాస్త్రియ్ సంగీత్ అని కొద్దిగా వుంది. అది యిష్టంలేదు. శాంతినికేతన్  రబీంద్ర సంగీతం కూడా యిష్టంలేదు. పంజాబీ సంగీతం కూడా యిష్టంలేదు.
    స్వచ్చమ్తెనా  కర్నాటక హిందూస్తాని యిష్టం. గిటార్ మీద  శాక్సోఫోన్ లో  పలికించినా  అభ్యంతరం లేదు. అలా చూస్తే వయొలిన్ మనదిఉ కాదు. కర్నతకకి అద్బుతంగా నప్పింది వయొలిన్ .
    కొన్ని సినిమా పాటలు కూడా యిష్టమే.
    వుస్తాద్ అమీర్  ఖాన్; గొంతు పాడటం యిష్టం.
    ముస్లింలకూ హిందూస్తాని సంగీతానికి యెలాంటి సంబందం? యెప్పటిది? యిస్లాం మతం పెర్షియా అరబ్  దేశాలనుంచి వాళ్ళతో పాటు వొచ్చింది. వుర్దూ యిండియాలో పుట్టింది. వ్యవహారిక  అవసరానికి పుట్టింది. వ్యాకరణం గట్రా అంతా హిందిదే. స్వాతంత్ర్యనంతరం సొంత identity కోసం వుర్దులో  పార్సీ అరబ్బీ పదాలతో నింపారు, ముస్లింలు.
    గల్ప్ దేశాల నుంచి వాళ్ళతో పాటు సంగీతం యెంతమాత్రం  రాలేదు. హిందూస్తానిని  సొంతం చేసుకున్నారు. హిందువులూ ముస్లింలూ కలిసి హిందుస్తానిని  పరిపుష్టం చేశారు. ముస్లింల హిందుస్తాని సంగీతంలో యిస్లామిక్ స్పర్శ యెంత మాత్రం లేదు. హిందుస్తాని పూర్తిగా భారతీయం.
    మీ నలుగురికి శుభాకాంక్షలు
                                                                                                 -వడ్డెర చండీదాస్.

                                                                                                         తిరుపతి 
                                                                                                         6-5-03
    రఘుగారికి నమస్తే,

    నిన్ననే మీకు వొక వుత్తరం రాశాను. మళ్ళా  యివాళ. (మీకు తప్ప మరెవరికి వుత్తరాలు రాయను కదా, అందుకని!)
    సామవేదం హిందూస్తానినా కర్నాటకమా! రెండూ కాదనుకుంటాను. రెంటికి  ఆధ్యదారమది.
    తెలుగు ప్రయివేటు టివిల వాళ్ళు సంగీతకచేరిల  జోలికి నాట్యప్రదర్శనల జిలికి పోరు. ధన్యులు. DD హ్తేదరాబాదులోనూ అంతే.
    DD.హ్తేదరాబాద్ లో నిరుడు వోకామె అద్బుతంగా చేసింది,కూచిపూడి. మళ్ళి రాలేదెందుకో! తరచూ వొస్తుంటాయి. కూచిపూడి కదా అని చూడటం  తప్ప, ప్రావిణ్యం వున్నదోక్కరూ వుండరు.
    మూడేళ్ళ క్రితం పదిపన్నెండేళ్ళ  పాప కూచిపూడి అద్బుతంగా చేసింది. యిప్పుడు  పెద్దద్తే వుంటుంది. వొస్తుందేమోనని చూస్తే రాలేదు.
    శోభానాయుడుగారి వెనకటి ప్రదర్శన వొస్తుందేమోనని సంవత్సరాల నుంచి యెంతో ఆశగా చూస్తున్నాను. నిరాశే మిగిలింది.
    మాచి కూచిపూడి చూసి యెంత కాలమ్తెందో!
    ఆమధ్య DD భారతిలో రాధారెడ్డి రాజారేడ్డిల పుత్రికారత్నం (దేశదేశాలలో ప్రదర్శన  లిచ్చిందట) భారతనాట్యం కూచిపూడి సంలినించట (!) ప్రదర్శనిచ్చింది. అసలు ప్రావిణ్యం  వుండి  యేడిస్తేగా! గోరం.
    మూడు నాలుగు దశాబ్దాల క్రితం non-commercial  'art' films  విరివిగా వొస్తుండేవి.  యెందుకనో యిప్పుడు రావటం లేదు. వాటి గురించి రాస్తే  వొ పుస్తకమే అవుతుంది.
    మీ నలుగురికి శుభాకాంక్షలతో
                                                                                                        -వడ్డెర చండీదాస్.

                                                                                                             తిరుపతి                                                                                                             22-5-03

                                                                                                                                                                                                                                                                                         
    రఘుగారికి నమస్తే,

    గితాదాత్  గొంతు యిష్టం. బతికి వుంటే యింకా యెన్నో పాటలు పాడేది. అర్ధంతరంగా వెళ్ళిపోవటం  తలుచుకుంటే నా మనసు విషాదంతో నిండిపోతుంది. పాడేవాళ్ళు సాదారణంగా బావుండరు. ఆమె బావుంటుంది. నాజియహాసన్-
    హరిప్రసాద్ చౌరాసియాని వింటూ రాస్తున్నాను. సాగటం లేదు వినటం  రాయటం. అది వినటానికి పుల్ అటెంషన్ కావాలి. టేప్ ఆపేస్తాను. రేడియోలో టివిలో పాటలు సంగీతం ఏది లేనప్పుడే టేప్ వింటాను.
    బాసురి యిష్టం. షహ్ నాయ్  యిష్టం. చాలా యిష్టం. చాలా చాలా యిష్టం. విణంత యిష్టం.
    DD channai చానల్ లో అడ్డమ్తెనా  వాళ్ళూ వీణ వాయిస్తున్నారు. గాయత్రిగారు  రావటం లేదు. I  simply adore her.
    యిటీవల  రెండున్నర గంటలు హ్తేదరాబాద్ లో  ఆమె  కచేరికి హాజరయ్యారు. అది మీ అదృష్టం. నా దురదృష్టం.
    సితార్ కి  తాన్ పురా  మోత, వీణకి తంబుర మోత యెక్కువగా లేకపోతే వినటానికి వీలవుతుంది. అసలు పక్క వాద్యాలు లేకపోతే మరి బాగు.
    వీళ్ళు వాయించటంలో  లినమయ్యి ఆ  యెక్కువ మోతని  గమనించరను  కుంటాను.
    మీ నలుగురికి శుభాకాంక్షలతో
                                                                                                              -వడ్డెర చండీదాస్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS