Previous Page Next Page 
ప్రేమతో ....వడ్డెర చండీదాస్ పేజి 19

                                                                                      
                                                                                                            తిరుపతి 
                                                                                                           26-6-03
    రఘుగారికి నమస్తే,
    మీ సహొద్యోగి బాసు వొచ్చి కలిశాడు. మంచివాడులాగా వున్నాడు. desire and liberation అర్ధమవలేదట. మీ పుస్తకం వొచ్చాక చదువుతాడట  అప్పుడు అర్ధమవోచ్చునని  అనుకుంటున్నాడట.
    చాలా మందిలాగా చచ్చు విలేఖరి ప్రశ్నలడిగాడు. వుదాహరణకిdesire and liberaton లో and దేనికి? అని. నా రచనల గురించి నేను మాట్లాడను. నా పాఠకులు మాట్లాడతారు - అన్నాను.
    మీ నలుగురికి శుభాకాంక్షలు
                                                                                                   -వడ్డెర చండీదాస్.
                                                                                           తిరుపతి
                                                                                                        2-7-03
    రఘుగారికి నమస్తే,
    వొ మూడ్ లో desire and liberation నుంచి కొన్ని వాక్యాలు తేనిగించాను. అది యీ కింద యధాతధంగా తిరగ రాస్తున్నాను.
    డ్రియాలిటి(Dreality).
    యీ విశ్వం, యెంత పసిదో అంత ముసిలిడోక్కు యీ విశ్వం, నిరంతర పరిణామ అక్షయ సత్తా.  పరిణామ శిలత, సంస్పందన, మహానందవేదన. యీ మహానంద వేదన వల్లనే ప్రాణి; బాధలున్నా ఆనందిస్తున్నది, సంతోశాలున్నా దుఖస్తున్నది మహానంద వేదన యీ జగన్నాటకానికి జివ సూత్రధారి మహానంద వేదన వ్యంజితమ్తేతే , స్రుజన.స్రుజన, రస్తేకం, రసస్పందన స్రుజన నాడి.
    మహానందవేదనను  ప్రాణి, అంతరాన గతించుకోవటమే రసస్పందన. అంతరాన గతింపులోంచి, ప్రాణి, రసస్పందనను శిల్పిస్తుంది. యీ రసశిల్పం, ప్లావితశిల్పం.
    స్రుజన, డ్రియలిస్టిక్. పునరుక్తి నవతల ఐక్యత. స్రుజన, వాస్తవాన్ని స్వప్లిస్తుంది. స్వప్నాన్ని వాస్తవిస్తుంది.
    (desire and lideration లో వొ రెండు పేజీలలోని కొన్ని వాక్యాలకి సొంత తెనిగింపు)jan,1980.
                                                                                        - వడ్డెర చండీదాస్.                                                                                           
                                                                                            సాలిళ్ళతిరుపతి
                                                                                  8-7-03
    రఘుగారికి నమస్తే,
    మీ మ్తెదానం మిడి పుస్తకం ముద్రణ తుదిమెరుగులు దిద్దుకుంటున్నా దనుకుంటాను. మీ ICPR  పుస్తకం యే దశలో వుంది? మీరు రాసి పంపాల్సిందంత రాసి పంపించారా?
    మీ వుత్తరం అందింది.
    statue of Liderty ప్రతిమ యెక్కడా దొరకదు. New york city లో కూడా దొరకదు. statue of liberty వొడ్డున దానికి సంబందించిన మ్యూజియంలో మాత్రమే దొరుకుతుంది. నా దగ్గిరున్న ప్రతిమ నా తదనంతరం మీరు తీసుకోండి.
    యింత వరకు రాసే సరికి రేడియోలో  కదిరి గోపాలనాద్  గారి శాక్సోఫోన్ వొస్తుంది. ఆపేస్తాను -రాయటం.
    అరగంట సెపు.  బాగా పలికిస్తాడు. కర్నాటక సంగీతంలో శాక్సోఫోన్ జోలికి వెళ్ళిన మరొకరు తెలియదు. లేరనుకుంటాను.శాక్సోఫోన్ నాకిష్టం.
    చాలా మందికి మల్లీశ్వరి పాటలంటే ఐదారుగా  మాత్రమే తెలుసు. మల్లీశ్వరి మొత్తం పాటలు వినటానికి పూర్తిగా వొక గంట సమయం పడుతుంది. తెలుగేతరులకు  తెలుగు సినిమా పాటలు వినిపించాలంటే మల్లీశ్వరి పాటలు వినిపించాలి. అన్ని రకాలగానూ తెలుగు సంప్రదాయపు సినిమా పాటలు. మళ్ళి మళ్ళి అలాంటి పాటలుండవు.
    పువ్వులిష్టం. మోహమోహనంగా  అనిపిస్తాయి. పూలపరిమళం  స్త్రీని  గుర్తుకు తేస్తుందేందుకో. పూలపరిమళం యెక్కువగా స్త్రీ నుంచి రావటం వల్లనేమో  పువ్వులు, కృష్టశాస్త్రి  లాలిత్యమంత లౌల్య లలితంగా అనిపిస్తాయి.
    శ్తెలకుమార్ కి చక్కని సాహిత్యాభిలాష. జయదేవుని అష్టపదులకు చక్కని తెలుగులో భాష్యం రాశాడు. చూడకపోతే వెంటనే కొనండి. దొరక్కపోతే నాకు రాయండి నా కాపి పంపుతాను. చంద్ర బొమ్మలు గీశాడు. చంద్ర గితల్లో లాలిత్యం తక్కువ. బాపులో వుంటుంది. సాయికృష్ణలో వుంటుంది. కర్నాటక సంగీతం యెక్కువగా చెన్నయ్ రేడియోలో వింటాను పొద్దుట రాత్రి. మొన్నొకరోజు పెట్టగానే గాయత్రి గారి  వీణలా అనిపించింది. రెండు నిమిషాలలో అవునని నిర్ధారించుకున్నాను. గంట తరవాత కార్యక్రమం  ముగిస్తూయి. గాయత్రి అని చెప్పారు! నిన్న యం.యస్. గోపాలకృష్ణన్ వయొలిన్ విన్నాను. బావుంటుంది.మీరు వినకపోతే Cassette కొని వినండి.
    యిప్పటి నాన్ -మెలోడి పాటల ముంపుకి  వ్యతిరేకంగా, మొలిచి నిలిచిన రేల్లుపూలు; గంగోత్రి పాటలు (కీరవాణి కదా, అందుకని!)
    యీ వూళ్ళో నాక్కావలసినవాణ్ణి దొరుకుతాయి-క్లాసికల్ మ్యూజిక్ తప్ప.
    మీ నలుగురికి శుభాకాంక్షలు
                                                                                                  -వడ్డెరచండీదాస్.  

                                                                                          తిరుపతి
                                                                                                     23-7-03
    రఘుగారికి నమస్తే ,
    మీ వుత్తరం వొచ్చింది. వొచ్చిన వేళకి వివిధభారతిలో అనితరసాధ్యషహనియుడు  బిస్ మిల్లాఖాన్ -అదయ్యాక మీ వుత్తరం తెరిచాను. సరే సంగతులు తెలిశాయి. నా యీ మిగిలిన కొద్ది జీవిత కాలంలో పునర్ముద్రణ తప్ప ముద్రణ లేదింక. యేదున్న మరణానంతరం  మాత్రమే.
    T series వారి గాయత్రి గారి cassette కొనండి, రు.35 caassette పేరు veena - గాయత్రి  గారి కేసెట్ శ్రీ మాధవ కొనకండి. ఆమె కేసెట్లలో  అదొక్కటే  నాసిరకం. బహుశ ఆరంభ దశది కావొచ్చు. శృతి బాగోలేదు. వాయించటం బాగోలేదు. రికార్డింగ్ బాగోలేదు. మోహన, కళ్యాణి రాగాలు ఆలాపనతో సహా చాలా బావుంటాయి. అవికూడా ఘోరం.
    యెందరో తెలుగు సిని సంగిత దర్శక మహానుభావులు. అందరిలో నేను మొదట చెప్పే పేరు - కె.వి .  మహదేవన్.
    రాత్రుళ్ళు సంగీతం వింటూ చాలాసార్లు ల్తేటు వెలుగువ్తెపు చూస్తుంటాను. సాలీడు, బల్లి కనిపిస్తుంటాయి. సాలిళ్ళ వల్లనే గాని బల్లుల వాళ్ళ మనకి యిబ్బంది వుండదు.
    సాలీడు తన గూట్లోకి వొచ్చిన పురుగును మాత్రమే తినగలదు. బల్లి అలా కాదు. గోడమిదకి యెగురుతున్న పురుగును కూడా అమాంతం చప్పరించేయ్యగలదు. అలా ల్తెటు వున్నన్ని గంటలూ తింటూనే వుంటుంది. బల్లిచూపు  చాలా నిశితం. న్తేపున్యం గొప్పది. పురుగులు వెర్రిబాగులవి. వెలుగులోకి అనవసరంగా వొచ్చి బలి ఐపోతుంతాయి.
    బల్లి చూపులాగే గద్దచూపు. మనం బ్తేనాకులర్  తో చూడగలిగింది గడ్డ కంటిలో  చూడగలదు. యెంత యెత్తు మిదనుంచో నెల మీదకి స్పష్టంగా చూడగలదు.
    ప్రకృతిలో  కొన్నిటికి కొన్ని అసాధారణ శక్తులుంటాయి! వుదాహరణకి పాము చర్మస్పర్శ. వుత్తిగాలి సోకితేనే శబ్దంతో సహా సమస్తమూ గ్రహించగలదు. మనిషి జన్మ వుత్తమ జన్మ అంటారు కదా ప్రకృతిలోని జీవాలకు కొన్నిటికున్న శక్తులు మనిషికి లేవు. యివన్నీ యెందుకోచ్చాయో  వున్నాయో తెలియదు. (Darwin' s  Origin  of  species  చదివినా కూడా) నేనేమి చదవటం లేదు. చదవటం మానేసి ఆరేళ్ళయింది.
    మీ నలుగురికి శుభాకాంక్షలు
                                                                                                            -వడ్డెర చండీదాస్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS