వ్యాయామం చేయకపోతే గుండె నొప్పి..
వ్యాయామం చేయకపోతే గుండె నొప్పి..
ఎవరైతే శరీర వ్యాయామం చేయరో వాళ్ళు గుండె నొప్పితో మరణిస్తున్నారని ఒక అధ్యనంలో తేలింది. ప్రతి రోజు చాలా చురుకుగా ఉంటారో వాళ్ళలో గుండె నొప్పితో చనిపోయే అవకాశం తక్కువే అని వైద్యులు తేల్చిచెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అధ్యయనంలో గుండె సమస్యలతోనే ఎక్కువమంది మరణిస్తున్నారని కనుగొన్నారు. ఈ పరిశోదన పై యురోపియన్ జనరల్ లో ప్రచురించారు . శరీర వ్యాయామం మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని. అది మనకు మేలు చేస్తుందని నిపుణులు తేల్చారు. శరీరవ్యాయామం గుండెకు వచ్చే వ్యాధులను గుండె పోటును నివారిస్తుందని అన్నారు. దీనిపై చేసిన అధ్యయనంలో చైతన్యంగా అంటే యాక్టివ్ గా ఉన్న వారిలో గుండె నొప్పి వచ్చే అవకాసం తక్కువే అని సెడన్ ట్రీ లైఫ్ వల్లే గుండె నొప్పికి ప్రధాన కారణంగా వైద్యులు పేర్కొన్నారు. యూరప్ లోని ఆరోగ్య వంతులు శరీర వ్యాయామం చేసేవారు అప్పటికే గుండె నోప్పి వచ్చిన వారు 2 8 1 4 ౦ మంది వ్యక్తులపై చేసిన అధ్యయనం లో పలు అంశాలు కనుగొన్నారు. ఈ అధ్యయనం లో పాల్గొన్న వారిని వివిధ విభాగాలుగా విభజించి అందులో అనువైన సమయంలో శరీర వ్యాయామం చేసేవారు తక్కువ, మధ్య తరగతి, ఉన్నత వర్గాల జీవన ప్రమాణాలు ఉన్నవారిని వేరువేరుగా విభజించారు. ఇందులో వారంలో ఒక రోజు వారు వచ్చే విధంగా నిర్ణయించారు. శరీర వ్యాయామం గుండె పోటు వల్ల మరణించే శాతం ఎంత ఉండవచ్చు అన్న అంశం పైనా 2 8 రోజుల పాటు అన్ని వర్గాల వారిని కేటగిరీల వారిని పరిశీలించామన్నారు . వచ్చిన వారి వయస్సు స్త్రీ, పురుషులు వేరుగా విభజించి వారిలో డయాబెటిస్ , బి పి. వారి కుటుంబాల చరిత్ర, వారి గుండె సంబందిత సమస్యలు ఉన్నయా లేదా ? వారి పొడవు , ఎత్తు ఇతర అలవాట్లు సిగరెట్లు , మధ్య పానం, కొలస్ట్రాల్ వారి సాంఘిక ఆర్ధిక పరిస్థితుల పై అధ్యనం చేసారు. 4 9 7 6 ( 1 7 .7%) మంది 2 8 రోజుల్లో మరణించినట్లు. కనుగోన్నారు. 3, 1 ౦ 1 ( 6 2 . 3 % ) అప్పటికప్పుడే మరణించారని అధ్యనంలో వెల్లడించారు. ఎక్కువ శాతం శరీర వ్యాయామం చేసిన వారిలో గుండె నొప్పి ఇన్స్ స్టాంట్ హార్ట్ అట్టాక్ వచ్చే అవకాశం తక్కువే అని నిర్ధారించారు. 2 8 రోజులలో 3 6 % ,2 8 % వారిలో ఎక్కువగా మార్పు కనపడలేదని డాక్తర్ కిం వాదేల్ట్ హాన్సెన్ బిస్ పబ్ జేర్గ్ అసుపత్రికి చెందిన సుపెన్ హగ్గెన్ డెన్మార్క్ మాట్లాడుతూ దాదాపు 1 8 % మంది రోగులు గుండె నొప్పితోనే 2 8 రోజుల్లో మరణించారని వారికీ తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు ఉండడం వల్లే మరణించారని తేల్చి చెప్పారు. అయితే వారు శరీర వ్యాయామం కొంత అయినా చేసి ఉంటె బతికి ఉండే అవకాశం ఉండేదని అన్నారు. మా అధ్యయనం ద్వారా తక్కువ సమయంలో నైనా అంటే కొంతసేపు అయినా వ్యాయామం చేస్తే కొంతైనా లాభం పొందవచ్చని వారంలో ఒక్క రోజు అయినా శరీర వ్యాయామం అంటే తక్కువలో తక్కువ 7 5 నిమిషాలు ఏరోబిక్ చేయవచ్చని దీనికోసం పెద్దగా డబ్బు ఖర్చు చేయల్సిన అవసరం ఏమి లేదని కొంత సమయం మాత్రం వ్యాయామం చేయాల్సిందే అని నిపుణులు సూచించారు. కాగా శరీర వ్యాయామం పై మరిన్ని అధ్యనాలు చెయ్యాల్సిన అవసరం ఉందని డాక్టర్ హాన్సెన్ అభిప్రాయ పడ్డారు.