చెమట వాసనకి చెక్ పెట్టండి!     ఎంత అందంగా తయారయితేనేం... చెమటతో బట్టలు తడిచిపోతూ, ఆ తడిచిన బట్టల నుంచి వాసన వస్తూ ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది?! అలాగని ఈ సమస్య గురించి ఎవరికైనా చెప్పుకోవాలంటే సిగ్గు. ఎలా వదిలించుకోవాలో తెలియక విసుగు. చాలామంది పరిస్థితి ఇదే. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్లను కూడా ఇబ్బంది పెట్టే ఈ సమస్య మరీ అంత పెద్దదేం కాదు. ఈ చిట్కాలు పాటించి చూడండి... చిటికెలో సాల్వ్ అయిపోతుంది. - మరీ బిగుతుగా ఉండే బట్టలు వేసుకోకండి. సింథటిక్ వస్త్రాలు కూడా వద్దు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకోండి. లో దుస్తుల్ని ఎప్పటికప్పుడు మార్చేయండి. బట్టలు వేడినీటిలో ఉతికి ఎండలో బాగా ఆరబెట్టుకోండి. - రోజుకు రెండుసార్లు కచ్చితంగా స్నానం చేయండి. బాహుమూలల్ని బాగా శుభ్రం చేసుకోండి. అవాంఛిత రోమాల్ని ఎప్పటికప్పుడు తొలగించుకోండి. అలాగే స్నానానికి యాంటి బయొటిక్ సబ్బుల్ని వాడండి. - తప్పనిసరిగా డియోడరెంట్ వాడండి. ఎప్పటికప్పుడు ఒళ్లంతా చక్కగా టాల్కమ్ పౌడర్ రాసుకోండి. - ఆహారం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మిరియాలు, అల్లం, వెల్లుల్లి, మసాలాల్ని బాగా తగ్గించండి. శరీర ఉష్ట్రోగ్రతను పెంచే ఆహార పదార్థాలు, పానీయాల జోలికి వెళ్లకండి. - వీలైనంత ఎక్కువగా మంచినీళ్లు తగండి. శరీరంలో ఉండే మలినాలను తొలగించడంలో దాన్ని మించిన ఎక్స్ పర్ట్ ఇంకెవరూ లేరు. - స్నానం చేసేముందు నిమ్మచెక్కతో బాహుమూలల్ని చెమల ఎక్కువ పట్టే ఇతర ప్రదేశాలన్నీ రుద్దుకోండి. మంచి ఫలితం ఉంటుంది. - తులసి, వేప ఆకులను కలిపి పేస్ట్ లా చేపి... స్నానం చేసేముందు ఒళ్లంతా బాగా రుద్దుకోండి. ఆపైన గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయండి. కొన్నాళ్ల పాటు ఇలా చేస్తే సమస్య శాశ్వతంగా తీరిపోయే అవకాశం ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్య వెంటాడుతుంటే సిగ్గుపడకుండా ఓసారి స్కిన్ డాక్టర్ ను సంప్రదించండి. తగిన సలహా ఇస్తారు. అవసరమైతే చికిత్స కూడా చేస్తారు. - Sameera

పింపుల్స్ ని సింపుల్ గా  పోగొట్టుకోండి...!       * నువ్వుల్ని రాత్రంతా నీటిలో నాబెట్టి, ఉదయం మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని మొటిమలపై రాసి... ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. రోజూ ఇలా చేయండి... సమస్య మటుమాయమైపోతుంది. * లవంగాలను పాలతో కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ప్రతిరోజూ రాసుకుని, ఆరిన తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటూ ఉంటే మొటిమలు పోతాయి. ఇంతకుముందే మొటిమల వల్ల పడ్డ మచ్చలేవైనా ఉంటే అవీ పోతాయి. * తేనె, నిమ్మరసం సమపాళ్లలో కలుపుకుని రాసుకున్నా ఫలితముంటుంది. * బంగాళాదుంపకి మొటిమల్ని తగ్గించే శక్తి ఉంది. కాబట్టి తరచూ బంగాళాదుంప రసం రాసుకుంటే మంచిది.  * పుదీనా, తులసి, వేప... ఈ మూడు ఆకులూ మొటిమలకు మంచి మందు. కాబట్టి వీటిలో ఏదో ఒక ఆకుని పేస్ట్ చేసి మొటిమలకు రాసుకుంటూ ఉండండి. * పసుపులో నిమ్మరసం కలిపి రాసుకుని, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల మొటిమల బాధ తీరిపోతుంది.   -Sameera

చలికాలంలో పాదాలు జాగ్రత్త సుమా      చలికాలంలో పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో కాలి మడమలపై పగుళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చలికాలంలో పాదాలు, చేతులు రంగుమారిపోయి  పగుళ్లు వచ్చి చూడ్డానికి బాగా వుండవు. అలాగే నొప్పి కూడా వుంటుంది. అంతే కాదు ఈ సీజన్‌లో చర్మం ఎక్కువగా పొడిబారడం జరుగుతుంది. చర్మం అతి త్వరగా పొడిబారి, పగుళ్ళు ఏర్పడి, చారలు కనబడుతుంటాయి. కాబట్టి... ఈ కాలంలో పాదాలను జాగ్రత్తగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  * పాదాలను మాయిశ్చరైజ్ చేయడం చలికాలంలో తప్పనిసరి అనుసరించాల్సిన మార్గం. చలికాలంలో రోజులో మూడు నాలుగుసార్లు పాదాలను మాయిశ్చరైజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ పాదాలు ఫ్రెష్‌గా, ఫిట్‌గా, హెల్తీగా ఉంటాయి. * స్లిప్పర్స్  ధరించడం సౌకర్యంగానే  ఉంటుంది. కానీ, ఈ చలికాలంలో వాటిని వేసుకోకపోవడం మంచిది! చలికాలంలో పాదాలకు రక్షణ కల్పించాలంటే  మందంగా ఉన్న షూస్ వేసుకోవాలి. * పాదాలు అందముగా కనిపించాలంటే పదిహేను రోజులకోసారి పెడిక్యూర్ చేసుకోవాలి. పెడిక్యూర్ కోసం పార్లర్‌కు వెళ్ళనవసరం లేదు. ఇంట్లో ఉండే  వస్తువులతో పెడిక్యూర్ చేసుకోవచ్చు. ముందుగా గోరువెచ్చని నీటిని తీసుకొని దానిలో కొంచెం ఉప్పు, డెట్టాల్, షాంపూ వేయాలి. తరువాత  20 నిమిషాలపాటు కాళ్లను నానబెట్టాలి. బయటకు తీసి బ్రష్‌తో  రుద్దాలి. దీనివల్ల పాదాలపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. తరువాత ఒక నిమ్మకాయ  తీసుకుని దానిపై గ్లిజరిన్ వేసి పాదాలను బాగా రుద్దాలి. అనంతరం ఆలివ్ ఆయిల్‌తో కాలును  మసాజ్ చేయాలి. ఇలా చేయటం వల్ల పాదాలు పొడిబారవు. * వేసవికాలం, చలికాలం అని కాకుండా అన్ని సీజన్స్‌లో నీరు ఎక్కువగా తాగితే  మంచిది. చర్మం, పాదాలు ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటాయి.    * పాదాల చాలామంది సాక్సులు వాడుతుంటారు. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి వేసుకోవాలి . లేదంటే దుమ్ము, మురికి చేరి  చెమట పట్టినప్పుడు పాదాలకు ఇన్‌ఫెక్షన్ వచ్చే  ప్రమాదం ఉంటుంది. అలానే నైలాన్‌ సాక్సుల కంటే కాటన్‌వి సౌకర్యంగా ఉంటాయి. రాత్రిపూట తప్పనిసరిగా గోరువెచ్చటి నీళ్లతో కాళ్లు కడుక్కుని, మాయిశ్చరైజ్ ఇలా చేయటం వల్ల పాదాలు అందంగా కనిపిస్తాయి.

అసలే వర్షాకాలం.. ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు.. అందునా మనం ఎప్పుడైతే గొడుగు తీసుకెళ్లమో అప్పుడే వర్షం పడుతుంది. ఇంకేముంది మొత్తం తడిచిపోతాం. అయితే ఈ వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా తడవడం వల్ల పలు సమస్యలు వస్తాయి. అలాకాకుండా.. ఈ చినుకుల కాలంలో కూడా జుట్టు మెరిసిపోయేలా చేయాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. అవెంటే చూద్దాం.. * ఈ కాలంలో గోరు వెచ్చని నూనెతో తలకు మసాజ్ చేస్తే చాలా మంచిది. అంతేకాదు ఏదో ఒక్క రకం ఆయిల్ మాత్రమే కాకుండా.. కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, బాదం ఇలా రెండు మూడు నూనెలు కలిపి ఓ అరగంట తలకు మర్ధన చేసి... మరుసటి ఉదయం తలస్నానం చేస్తే జట్టుకు మంచిది. * ఈ కాలంలో ముఖ్యంగా వేధించే సమస్య చుండ్రు. తల తేమగా ఉండటంతో చుండ్రు, దురద లాంటివి వస్తుంటాయి. వాటిని నివారించడానికి.. నిమ్మ నూనెలో.. టిట్రీ నూనె కలిపి తలకు పట్టించి ఓ గంట తరువాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య పోతుంది. * ఇంకా రెండు చెంచాల వేపపొడిలో రెండు చెంచాల సెనగపిండి వేసి దానిని పేస్టేలా కలిపి తలకు పట్టించి తరువాత నీటితో కడిగేసుకుంటే చుండ్రు, దురద సమస్యలు పోతాయి. * జుట్టు పొడిబారినట్టు అనిపిస్తే తలస్నానానికి ఓ అరగంట ముందు తలకు పెరుగు పట్టిస్తే జుట్టు మెత్తగా మారుతుంది. * నిర్జీవంగా మారిన జుట్టు నిగనిగలాడలంటే.. ఓ గుడ్డు సొనలో.. రెండు చెంచాల బాదం పొడిని కలిపి.. దానికి జుట్టుకు పట్టించి.. ఓ అరగంట తరువాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

How to Use Turmeric on the Face   For centuries in India, a facial mask made with turmeric was applied to a bride's face before the wedding to make her skin radiant. Turmeric is also used to help cure acne, lighten and brighten the skin and fight age spots. It is fairly simple to make your own turmeric facial mask, using ingredients that are readily available. If it used weekly, this mask should produce positive results. Things You'll Need Coconut oil 1/4 teaspoon turmeric powder Moisturizer Clean towel Instructions 1 Clean your face and neck thoroughly with warm water. Remove all cosmetics, make-up and lotions. If necessary, use a gentle soap. Pat your skin dry when finished. 2 Mix ¼ teaspoon of turmeric powder into a small amount of coconut oil. Stir this until you form a smooth paste. 3 Apply the turmeric paste onto your face and neck. Gently smooth it on, starting at the forehead. Make sure to keep the mixture away from your eyes. 4 Lie down and rest for 20 minutes. Use this time to banish stressful thoughts from your mind and relax. You may wish to listen to music, but either way, try to make this time uninterrupted. 5 Wash off the mask with warm water. Once your face is clean, splash it with cold water to close the pores. Gently dry it with a clean towel. 6 Apply a moisturizer to your face. The moisturizer will help your skin to continue to absorb the turmeric.

గోల్డ్ ఫేషియల్ చేసుకోండిలా.. ఈ మధ్య కాలంలో గోల్డ్ పేషియల్ చేసుకోవడం సర్వ సాధారణమైంది. ఒకప్పుడు బంగారం కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించేది మన పెద్దలు. అలాంటిది, మారుతున్న కాలంతో పాటు, బంగారం వాడకంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. అసలు ఈ గోల్డ్ పేషియల్ వల్ల మనకొచ్చే లాభం ఏంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=V9axDXVERwY

గుడ్డుతో అందానికి మెరుగులు     గుడ్డు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా మంచిదే అంటున్నారు నిపుణులు. ఇంట్లో నే అందానికి గుడ్డుతో మెరుగులు పెట్టుకోవటానికి కొన్ని మార్గాలు.. ఇవి.. *గుడ్డులోని తెల్ల సొనకి అరచెమ్చా నిమ్మరసం, చాలా తక్కువగా తేనె, ( పావు చెమ్చా కి సగం ), కలిపి ముఖానికి పట్టించి ఒక పావు గంట తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా మారుతుంది . చర్మం రంద్రాలు తెరుచుకునేలా చేసే ఈ ప్యాక్ కంటికింది వలయాలు, ముఖం మీది మచ్చలని కూడా దూరం చేస్తుంది.     *  తెల్ల సోనకి ఒక చెంచా పాలు, ఒక చెంచా క్యారట్ తురుము కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకుని పావుగంట వుంచుకోవాలి. యాంటీ ఏజింగ్ ప్యాక్ ఇది. చర్మం నిగనిగ లాడేలా చేస్తుంది. * అలాగే పచ్చ  సోనకి  తేనెతో పాటు రెండు చెంచాల పెరుగు కూడా కలిపి ముఖానికి రాసుకుని ఓ పావుగంట తర్వాత కడుగుకుంటే.. చర్మం బిగుతుగా మారుతుంది . * చర్మం పొడి పొడి గా వుండి, దాని వాల్ల ఇబ్బంది పడేవారు పచ్చ సొనకి చెంచా తేనె కలిపి రాసుకుని.. పావుగంట తర్వాత కడిగితే మంచి ఫలితం వుంటుంది.     * అలాగే పచ్చసోనలో ముల్తాని మిట్టి ని కలిపి రాసుకుంటే జిడ్డు చర్మం బాధ నుంచి తప్పించుకోవచ్చు. * ఒట్టి తెల్ల సొనని  బాగా గిలక్కొట్టి ముఖానికి పట్టించి వుంచి, అది ఆరాకా కడిగి చూడండి. ముఖం లో మంచి కాంతి కనిపిస్తుంది. ఎక్కడికి అయినా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ పాక్ వేసుకుంటే, త్వరగా అయిపోతుంది., మంచి ఫలితం కూడా వుంటుంది.

How To Look Beautiful     Women are 10 useful tips that will make you look young and beautiful. * Beauty starts from within, so eat healthy and nutritious diet and do regular exercises.  * Make sure that you look clean and smell good always. Choose a perfume that suits you and apply it on wrists and neck. * Sleep well and drink lots of water daily, it will clean your body and make your skin look healthy and younger. It will also reduce under eye dark circle.  * Take care of your teeth and brush twice a day. * Keep your hair clean, wash them regularly. Find a good shampoo and conditioner that works well for your hair. Try natural products for better results.  * Try coloring your hair to cover grey hair, look trendy and fashionable. * Selective makeup and try to choose colors that suit your natural appearance and add compliments to it. Apply little mascara, kajal, lip gloss, blush for soft natural look.  * Moisturize your skin well after bathing so that it looks soft and healthy. * Wear a sunscreen lotion whenever you go out in the day to protect your skin from harmful UV radiations.  * Most important is to be confident about yourself because it is the best investment you can do.

మన ముఖానికి శత్రువులు మనం వాడే వస్తువులే...!   అందంగా ఉండటానికి అందరూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్ని కొన్ని అజాగ్రత్తల వల్ల మన ముఖ సౌందర్యం దెబ్బ తింటుంది. శరీరంలోని ఇతర భాగాల అందాన్ని పెంచుకునేందుకు మనం వాడే కొన్ని వస్తువులు మన ముఖానికి శత్రువులు. అవేంటో తెలుసుకోవాలని ఉందా.... పాదాల పగుళ్లకు రకరకాల క్రీములు వాడుతుంటాం. ఇవి పాదాలను బాగు చేస్తయేమో కానీ ముఖానికి తీవ్ర హాని చేస్తాయి. వాటిలో ఉండే కెమికల్ ఎక్స్ ఫాలియెంట్స్ ముఖ చర్మపు సున్నితత్వాన్ని పాడు చేస్తాయి. అలాగే హెయిర్ స్ర్పేలు. వీటిలో అధిక మోతాదులో ఉండే ఫ్రాగ్రెన్స్ లు ముఖంపై పడితే చర్మం డ్యామేజ్ అయ్యి దురద, మంట వంటివి కలుగుతాయి. తలంటుకునేటప్పుడు చాలాసార్లు షాంపూ ముఖానికి కూడా అంటుకుంటూ ఉంటుంది. కానీ తరచుగా ఇలా జరిగితే మాత్రం ముఖం పాడవడం ఖాయం. ఎందుకంటే జుత్తుపై ఉండే జిడ్డు, మురికి వంటివి వదిలించడానికి అనువుగా తయారుచేసే షాంపూలోని రసాయనాల్ని... ముఖ చర్మంలో ఉండే డెలికేట్ మాలెక్యూల్స్ తట్టుకోలేవు. దాంతో చర్మం పొడిబారిపోతుంది. అదే విధంగా డియోడరెంట్స్, హెయిర్ కలర్స్. ఇవి ముఖానికి ఓ పరిమితి దాటి తగిలితే సున్నితమైన ముఖ చర్మానికి ఉండే స్వేదరంధ్రాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. కొంతమంది ఒంటికి రాసుకుంటున్నాం కదా అని బాడీ లోషన్స్ ని ముఖానికి కూడా రాసేసుకుంటూ ఉంటారు. అది మంచిదే అయితే ముఖానికి ప్రత్యేకంగా క్రీములు తయారై ఉండేవి కావు. ముఖంపై ఉండే చర్మం ఎంతో సున్నితంగా ఉంటుంది. అందుకే దానికి అధిక రసాయనాలు పడవు. అందుకే దాని సున్నితత్వం పాడవకుండా ఉండే రసాయనాలతో ఫేస్ క్రీములు తయారవుతాయి. కానీ బాడీ లోషన్స్ అంత సున్నితమైనవి కావు. అందుకే వాటిని ముఖానికి రాసుకోకూడదు. లేదంటే పొడి చర్మం కలవారి ముఖం మరింత పొడిగా... జిడ్డు చర్మం ఉండేవారి ముఖం మరింత జిడ్డుగా అయిపోతుంది. మెల్లమెల్లగా సున్నితత్వం మాయమైపోయి ముఖం రఫ్ గా తయారవుతుంది. ఇవన్నీ మనం తెలియకుండా చేసే పొరపాట్లే. అజాగ్రత్తగా ఉండటం వల్ల వీటన్నిటినీ ముఖానికి పూసేసుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి జాగ్రత్తగా ఉండొచ్చు. ముఖసౌందర్యానికి ముప్పు రాకుండా చూసుకోవచ్చు. ఏమంటారు! - sameeranj  

ఇంట్లో ఇది ఉంటే పార్లర్ అక్కర్లేదు!   ప్రతి సమస్యకీ పరిష్కారం ఉంటుంది. ఒక్కోసారి అది మన చేతిలోనే ఉంటుంది. ఆ విషయం మనకి తెలియక కంగారు పడిపోతుంటాం. ముఖ్యంగా సౌందర్య సమస్యలకి బ్యూటీషియన్ల మీద, డాక్టర్ల మీద ఆధారపడుతుంటాం. నిజానికి చిన్ని చిన్న చిట్కాలతో వాటి నుంచి బయట పడిపోవచ్చు. ఉదాహరణకి... దాల్చినచెక్క ఉంటే చాలు, బోలెడు సమస్యలు తీరిపోతాయి. అదెలా అంటే...   - దాల్చిన చెక్క చర్మాన్ని తేమగా ఉండేలా చేస్తుంది. స్కిన్ పొడిబారడం వల్ల వచ్చే దురదల్ని తగ్గిస్తుంది. దాల్చినచెక్కని మెత్తని పౌడర్ లా చేసి, దానిలో కాస్త తేనె కలిపి, రాత్రి పడుకోబోయే ముందు దురద ఉన్నచోట రాసుకోవాలి. ఉదయాన్న లేచి చల్లని నీటితో కడిగేసుకుంటే చర్మంలో తేమ పెరిగి దురదలు తగ్గిపోతాయి. ఏదైనా కుట్టి ర్యాషెస్ వచ్చినా ఈ చిట్కా చక్కగా పని చేస్తుంది.   - దాల్చిన చెక్క పొడిలో నిమ్మరసం కలిపి మొటిమలు, బ్లాక్ హెడ్స్ మీద పూయాలి. ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. కొన్నాళ్లు ఇలా చేస్తే అవి పూర్తిగా మాయమైపోతాయి. మచ్చలు కూడా మిగలవు. - దాల్చిన చెక్కను పొడి చేసి, కొద్దిగా తేనె, కాసింత ఆలివ్ ఆయిల్ కలిపి పేస్ట్ లా చేయాలి. దీనిలో ఎగ్ వైట్ కలిపి జుత్తుకీ, మాడుకీ పట్టించాలి. పావుగంట సేపు అలా ఉంచి, తర్వాత తలంటుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తే చుండ్రు వదిలిపోతుంది. జుత్తు బలంగా, పొడవుగా పెరుగుతుంది.   - పెట్రోలియం జెల్లీలో దాల్చిన చెక్క పొడి కలిపి పెదవులను బాగా రుద్దుకుంటే పగుళ్లు మానిపోతాయి. డెడ్ స్కిన్ తొలగిపోయి పెదవులు మృదువుగా, అందంగా తయారవుతాయి.   - దాల్చినచెక్క పొడిని నీటిలో వేసి మరిగించాలి. ఈ నీరు కాస్త చల్లారి గోరువెచ్చగా అయ్యాక పుక్కిలిస్తే... నోటి దుర్వాసన వదిలిపోతుంది.   - గోరువెచ్చని నీటిలో దాల్చిన చెక్క పొడి, ఆలివ్ ఆలియ్, నిమ్మరసం, కొద్దిగా పాలు కలిపి... ఇందులో పాదాలు ముంచాలి. పదిహేను నిమిషాలు అలా ఉంచిన తరువాత రుద్ది కడిగేసుకోవాలి. తరచూ ఇలా చేస్తే పాదాలు పగలకుండా స్మూత్ గా ఉంటాయి. ఆల్రెడీ పగుళ్లు ఉంటే మూసుకుపోతాయి. వంటల్లో మాత్రమే పనికొస్తుందనుకునే దాల్చినచెక్క మన అందాన్ని పెంచడానికి ఎలా దోహదపడుతుందో చూశారు కదా! అందుకే ఇంట్లో ఎప్పుడూ దాల్చినచెక్క ఉండేలా చూసుకోండి. అన్ని సమస్యలకీ అదే పరిష్కారం.   - Sameera

గ్లోయింగ్ ఫేస్ పాక్స్       ముఖం అందంగా, కాంతివంతంగా, జిడ్డు లేకుండా ఉండాలంటే కొన్ని ఫేస్ ప్యాక్‌లు తప్పనిసరి. కొంత శ్రద్ధ, సమయాన్ని పెట్టి మీ చర్మం మెరిసేలా మార్చుకోవచ్చు. మరి మీ చర్మతత్వాన్ని బట్టి ఎలాంటి ప్యాక్‌లు వేసుకోవాచ్చో చూడండి.  జిడ్డు చర్మం : బొప్పాయి, వేప, ముల్తాన్ మట్టి, కచ్చుర్ సుగంధీ పౌడర్‌ను రోజువాటర్‌తో మిక్స్ చేసి ముఖానికి అపె్లై చేయాలి. 20నిమిషాల తర్వాత గోరు నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జిడ్డు పోతుంది, మొటిమలు తగ్గుతాయి.  పొడి చర్మం : గులాబి, చందనం, అల్మండ్ పౌడర్‌లు, పాలల్లో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి మెల్లగా మర్దన చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మంలో పొడితనం పోయి, ముఖం కాంతివంతమవుతుంది. బొప్పాయి, కచ్చుర్ సుగంధీ పౌడర్, ముల్తాన్ మట్టి, ఛాయపసుపు, గులాబీ పౌడర్‌లను రోజ్‌వాటర్‌లో వేసి కలపాలి. దీన్ని ముఖానికి రాసి 20నిమిషాల తర్వాత కడిగితే మొటిమల మచ్చలు తగ్గుతాయి. అయితే ఇలా వారానికి మూడు సార్లు తప్పనిసరిగా చేస్తేనే ఫలితం ఉంటుంది. కళ్ల కింద నలుపు: గులాబీరేకులపొడి, బొప్పాయి, పుదీనా పొడుల్లో, రెండు చుక్కల చందనం నూనె, అలోవీరా జెల్‌ని కలిపి కంటి చుట్టూ రాయాలి. ఓ పదినిమిషాల పాటు మెల్లిగా మర్దన చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.. రోజ్‌వాటర్‌లో చందనం, గులాబి, ఛాయపసుపు, దోసకాయ రసం, బొప్పాయి పొడి, ముల్తాన్ మట్టి కలిపి ముఖానికి రాయాలి. అరగంట ఆగి, గోరు నీటితో కడిగేయాలి.

బ్లాక్ హెడ్స్ బాధ వదలాలంటే...!   తెల్లని ముఖ సౌందర్యాన్ని నల్లని బ్లాక్ హెడ్స్ చాలా డిస్టర్బ్ చేస్తుంటాయి కదా! అయితే వీటిని మనం డిస్టర్బ్ చేస్తే మళ్లీ కనిపించకుండా మాయమైపోతాయి. అందుకే ఈ చిట్కాలు చకచకా పాటించేయండి. - బ్లాక్ హెడ్స్ ని డ్రైగా చేసే యాంటీసెప్టిక్ గుణాలు టొమాటోల్లో పుష్కలంగా ఉంటాయి. అందుకే రాత్రి పడుకోబోయే ముందు టొమాటో రసాన్ని ముఖమంతా రాసుకుని, ఉదయాన్నే లేచి కడిగేసుకోవాలి. ఒకట్రెండు వారాల పాటు ఇలా చేస్తే బ్లాక్ హెడ్స్ పొడిబారిపోయి రాలిపోతాయి.  - ఓట్స్ పొడిలో పెరుగు, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ కలిపి ప్యాక్ వేసుకుని... బాగా ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. తరచూ ఇలా చేస్తే మంచి ఫలితముంటుంది. - గ్రీన్ టీ ఆకుల్ని పొడి చేసి, కొంచెం నీళ్లు చేర్చి పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని రాసుకుంటే బ్లాక్ హెడ్స్ రాలిపోతాయి. - బేకింగ్ సోడాలో నిమ్మరసం కలిపి ముఖాన్ని మసాజ్ చేసుకున్నా సమస్య తీరిపోతుంది.  - దాల్చిన చెక్క పొడిలో తేనె కలిపి ముఖానికి పూసుకోవాలి. కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. రోజు విడిచి రోజు ఇలా చేసినా చాలు.. బ్లాక్ హెడ్స్ బెడద తీరిపోతుంది. - గోరువెచ్చని పాలలో తేనె కలిపి బ్లాక్ హెడ్స్ ఉన్నచోట పూయాలి. కాసేపటి తర్వాత పొడి బట్టతో ఆయా ప్రదేశాల్లో గట్టిగా ఒత్తుతూ తుడిస్తే బ్లాక్ హెడ్స్ ఊడిపోతాయి. - కోడిగుడ్డులో తేనె కలిపి వేసుకునే ప్యాక్ కూడా బ్లాక్ హెడ్స్ బాధను వదిలిస్తుంది   -Sameera N

స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే...     డెలివరీ అయ్యాక మహిళలకు పెద్ద తలనొప్పి... స్ట్రెచ్ మార్క్స్. అవి ఓసారి వచ్చాయంటే ఓ పట్టాన పోవు. చర్మం బాగా సాగి మళ్లీ మామూలుగా అయ్యే క్రమంలో పడే ఈ గీతల్ని పోగొట్టుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. డెలివరీ అనే కాదు... బాగా లావయ్యి, తర్వాత సన్నబడిన వారికి కూడా ఈ సమస్య ఉంటుంది. అయితే ఇది పరిష్కరించుకోలేనంత పెద్ద సమస్యేం కాదు. దానికి కొన్ని చిట్కాలున్నాయి.   - స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టడంలో కోడిగుడ్డు మంచి ఎక్స్ పర్ట్. దీనిలో ఉండే విటమిన్ ఎ, ప్రొటీన్స్, అమైనో యాసిడ్స్ చర్మ కణాల ఏర్పాటులో ముఖ్యపాత్ర పోషిస్తాయి. చర్మాన్ని కాంతివంతంగా పని చేస్తాయి. అందుకే మార్క్స్ ఉన్నచోట కోడిగుడ్డు సొనతో తరచుగా రుద్దుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. - అలొవెరా జెల్ లో ఉండే అలోసిన్ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందుకే ఈ జెల్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి రోజూ పడుకోబోయే ముందు రాసుకుంటే... కొన్నాళ్లకు సమస్య తీరిపోతుంది. - నిమ్మచెక్క పెట్టి తరచుగా రుద్దుకుంటూ ఉన్నా మంచిదే. - ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్ మసాజ్ లు కూడా స్ట్రెచ్ మార్క్స్ ని పోగొట్టి, చర్మం ఎప్పటిలాగా అయ్యేందుకు దోహదపడతాయి. - బంగాళాదుంపని బాగా గ్రైండ్ చేసి రసాన్ని తీయాలి. ఈ రసంతో మార్క్స్ ఉన్నచోట బాగా రుద్దాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే అతి తక్కువ సమయంలోనే అవి పోతాయి. - ఆముదం కూడా స్ట్రెచ్ మార్క్స్ కి మంచి మందు. - పంచదారలో కొంచెం నిమ్మరసం కానీ కాస్తంత బాదం నూనె కానీ కలిపి రుద్దినా మంచి ఫలితం ఉంటుంది. ఇన్ని మార్గాలు ఉండగా స్ట్రెచ్ మార్క్స్ గురించి చింత ఎందుకు? వీటిని ఫాలో అవ్వండి... వాటిని వదిలించుకోండి. - Sameera

ముఖంపై ముడుతలు పోవాలంటే...!   వాతావరణంలో మార్పులు, కాలుష్యం వంటివి చర్మానికి చేసే కీడు అంతా ఇంతా కాదు. జీవం కోల్పోయి, ముడుతలు పడిపోయి వృద్ధాప్యం అప్పుడే వచ్చేసిందా అన్న ఫీలింగ్ వస్తుంది. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటించారనుకోండి... ముడుతలు మాయమైపోతాయి. ముఖం మళ్లీ మెరిసిపోతుంది. - పెరుగులో కాసింత కొబ్బరినూనె, ఆలివ్ నూనె కలిపి రోజూ ముఖానికి పట్టించాలి. బాగా ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.  - పైనాపిల్ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఏజింగ్ ఏజెంట్ లా పని చేస్తుంది. కాబట్టి పైనాపిల్ గుజ్జుతో తరచూ ముఖాన్ని రుద్దుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.  - బ్రౌన్ షుగర్ ను గోరువెచ్చని పాలతో కొద్దిగా తడిపి, దానితో ముడుతలు ఉన్నచోట రుద్దుకుంటూ ఉంటే మెల్లగా ముడతలు పోతాయి. - టొమాటో గుజ్జులో ఆలివ్ ఆయిల్ కానీ ఆవనూనె కానీ కలిపి వారానికి రెండు మూడుసార్లు ప్యాక్ వేసుకున్నా మంచిదే.  - దాల్చినచెక్క పొడిలో పెరుగు, నిమ్మరసం కలిపి ప్యాక్ వేసుకోవాలి. ఇరవై నిమిషాలు ఉంచి కడిగేసుకోవాలి.  - గ్రీన్ టీలో పెరుగు కలిపి ముఖానికి రాసి బాగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.  - అరటిపండులో పెరుగు, బాదం నూనె కలిపి ప్యాక్ వేసుకుని, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.  - పసుపులో చెరకురసం కలిపి వేసుకునే ప్యాక్ కూడా మేలు చేస్తుంది.     - కోడిగుడ్డు తెల్లసొనలో అలొవెరా జిగురు కలిపి ముఖానికి పూసుకోవాలి. తర్వాత మునివేళ్లతో ముఖమంతా మెల్లగా మసాజ్ చేయాలి. ఆపైన నీటితో కడిగేసుకోవాలి.    చూశారుగా ఎన్ని చిట్కాలు ఉన్నాయో. మరి ముఖంపై ముడతలు వచ్చినంత మాత్రాన దిగులు పడటం దేనికి? వీటిని ట్రై చేసి చూడండి. -Sameera 

మనం ఆచరిద్దాం.. పిల్లలు అనుసరిస్తారు...!   Must Watch Importance of Parent Child Relations in the General Development ... https://www.youtube.com/watch?time_continue=46&v=U8bvNcltj-8  

6 Ways to Get Rid of Dark Knees!   The skin of your elbows and knees is naturally thicker and loses moisture quickly. This often leads to the accumulation of dead skin cells that produce a darkened appearance. And if you are also one of those who is fond of wearing shorts or dresses that are above the knee, then worry not, because here were present to you some tips to make sure that you look neat and tidy in those wonderful outfits. But before we look at the solutions lets just look into why does this problem occur to so many women. Some of the possible causes of having dark knees are frequent rubbing of knees, dry skin. Sometimes, darkened knees can be passed on from one generation to another. Also there are instances when the excess fat causes some areas of the skin to darken. So make darker knees a thing of the past, make sure you use the following on your skin to make it lighter.   Almonds:  Almond oil is extremely beneficial for your skin because of its skin-nourishing properties. It maintains your skin tone and gives your skin a lovely glow. use warm almond oil to massage your knees for five minutes every night before you go to sleep and you will soon see an improvement.   Aloe Vera:  Aloe Vera is mostly used for hair but it is also known to be good for the skin. In fact, a lot of people use Aloe Vera in order to get rid of different skin problems. In this case, Aloe Vera can also be used for the darkening of the knees.   Lemon:  Lemon has exfoliating and bleaching properties, so its application will help lighten your skin tone. It works effectively on your dark knees and elbows as well. cut a lemon into different sections and rub them on the knees. This can be done in the evening and the lemon juice can be washed off from the knees in the morning. Milk and Baking Soda:  The combination of baking soda and milk will make your skin feel smooth and lighten its tone as well. Mix both ingredients together to form a thick paste. Rub it directly on your knees in circular motions. Keep repeating this for a while to see visible difference in skin tone. You can then store the excess paste inside the refrigerator since this paste is going to be used often. Gram Flour and Yogurt:  Gram flour contains several minerals, vitamins, and proteins that help exfoliate your skin and remove the dead skin cells that make your skin look dark. It works amazingly well to treat skin blemishes, pigmentation, and dark skin tones. Using yogurt is a great idea because it helps keep your skin moisturised.   Coconut Oil:  You may choose to mix in coconut oil and olive oil together or you may do it separately. After taking a bath, place the oil on the affected or darkened area of the skin. This will help keep the skin moisturized. This can be repeated throughout the day. This will lighten the skin eventually.   ...Divya

Beauty benefits of Toothpaste Did you ever think that your dental hygiene caretaker - toothpaste, which is the first thing you use to kick start your day, has in it some amazing beauty benefits too? Indeed it does and quite a few for that matter. From keeping your teeth in sparkling white condition to getting rid of those stubborn acne on your face, this humble toothpaste of yours does it all. Toothpaste used on your skin will help to also improve your tone. The properties present in white toothpaste have the ability to lessen marks and scars. It also lightens the pigmentation on your skin thus giving you a better look and feel. Acne is one of the most irritating skin problem every one faces. Just when you want to attend those special events in life, this issue gets worse. When ever a pimple pops up, dab a little paste over it and let it stay overnight. The next morning the pimple appears to be dry without a scar too. For Blackheads also you could use toothpaste. To remove blackheads, use toothpaste mixed with a portion of walnut scrub. And for whiteheads brush your skin using toothpaste and water. Toothpaste could also rescue you from your bad hair days. Toothpaste contains the same ingredients in part as hair gel. The water soluble polymers are the same so you can actually use toothpaste as hair gel if you should be facing a hair emergency. Toothpaste will not stain or damage your hair and it rinses clean away. Also, the next time you color your own hair, have a bit of white toothpaste on hand for those color stains on your face, ears and neck. If your color runs and leaves a stain, just rub a bit of toothpaste on it and scrub the stain away. You can also use toothpaste to get hair color stains out of clothing. Toothpaste can also make you look young! Don't believe it? then try applying a small quantity of toothpaste on your wrinkles before you hit the bed and leave it overnight and rinse it the next morning. Regular usage of this will help you lightened those wrinkles. Also for your skin emergencies, it could be a saviour. Not always will you have access to medication and specially in case of small burns or bites, using toothpaste on the effected regions could prove to be of great help. Just grab a toothpaste and dab a small amount onto the wound and you’ll be surprised at how soothing it can be.

సమ్మర్ లో చర్మఛాయ చిట్కాలు సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది బయటకు రావడానికి కూడా బయపడతారు ఎక్కడ ముఖం నల్లబడిపోతుందో అని. అలా అని ఎక్కడికీ వెళ్లకుండా ఉండలేము కదా. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు మనం తప్పనిసారిగా పాటించుకోవాలి. పెరుగు... ఈ వేసవిలో పెరుగు తింటే ఎంత చలవ చేస్తుందో మన ముఖారవిందాన్ని కాపాడటంలో కూడా ఉపయోగపడుతుంది. అదెలాగో చూద్దాం. 1. ఈ సమ్మర్ లో ఎండ వల్ల నిరంతరం చెమట వస్తూనే ఉంటుంది. దీని వల్ల ముఖంపై రాషస్ రావడం, ముఖం మండటం జరుగుతుంది. అలాంటప్పుడు పెరుగును పట్టిస్తే చల్లగా ఉండటమే కాకుండా అందులో ఉండే జింక్ ముఖానికి ఉన్న టాన్ కూడా పోగొడుతుంది. 2. సూర్యరశ్మి వల్ల ముఖంలో పోషణ తగ్గిపోతుంది. దీని వల్ల చర్మ పొడిబారినట్టు అయిపోతుంది. అటువంటి సమయంలో పెరుగును ముఖానికి రాసి చల్లటి నీటితో కడిగేసుకోవాలి. 3. పెరుగులో ఆరెంజ్ తొక్కల పౌడర్ ను కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది. 4. పెరుగులో కొంచెం తేనె, నిమ్మరసం కలిపి రాసుకొని ఓ పదినిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. దీనివల్ల మీ చర్మం మృదువుగా తయారవుతుంది. 5. పెరుగులో పెసరపిండి కలిపి ఆ మిశ్రమాన్ని ఫేస్ కు మాస్క్ లా వేసుకుంటే కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది.