ఒక కప్పు కాఫీతో మీ గుండె సేఫ్
ఒక కప్పు కాఫీతో మీ గుండె సేఫ్
ఒక్క కప్పు కాఫీ మీ హార్ట్ ఫెల్యూర్ ను తగ్గిస్తుంది. ఇదేంటి కొందరు కాఫీ తాగితే ప్రమాదం అంటున్నారు. అసలు మీరు చెపుతున్నది నిజమా ? అన్నసందేహం వస్తోందికదు. సహజంగా మన భారతీయులు కాఫీ ప్రియులు పొద్దున్నే మంచం మీద నుంచి లేస్తూనే గొంతులోకి వేడిగా కాస్త కాఫీ పడకపోతే అదోలా ఉంటుంది అంటున్నారు కాఫీ ప్రియులు. ఏమి లేదు అదేదో అన్నట్లు కుదిరితే నాలుగు మాటలు లేదా కప్పు కాఫీ అంటారు. అదే మన జీవితానికి పెద్ద ఉపకారమే చేస్తుందని అంటున్నారు కార్డియో వ్యాస్క్యులర్ డాక్టర్లు. గుండె సంబందిత సమాస్యలలో ఒకటైన హార్ట్ ఫైల్యూర్ చెక్ పెట్టవచ్చు అంటున్నారు. ముఖ్యంగా వివిధ రకాల గుండె జబ్బులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారికీ హార్ట్ ఫైల్యూర్ రాకుండా కాపాడుతుందని వైద్యులు వీటిపైనా చేసిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
కొంచం కాఫీ పొడి, కాస్త చక్కర, వేడిగా పాలు, అంతే కాఫీ రెఢీ .. ఇలా ఒక్క కప్పు కాఫీ తీసుకుంటే చాలు మీ గుండె కు హార్ట్ ఫైల్యూర్ రాదంటే నమ్మండి. అయితే ఒక ప్రమాదం ఉంది సుమా. ఏదైనా మన పెద్దలు చెప్పారుగా, అతి సర్వాత్రా వర్జయేత్ అని అతిగా కాఫీ తీసుకున్నారో ప్రమాదం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసలు కాఫీకి - హార్ట్ ఫైల్యూర్ కు సంబంధం ఏంటి ? అన్నది ప్రశ్న అవునా.. వీటిపై పరిశోధనలు చేస్తున్న డాక్టర్ డేవిడ్ కావు మాట్లాడుతూ సహజంగా కాఫీ చెరుపు చేస్తుందని అందరూ అంటారు. కాఫీ మాత్రం హార్ట్ ఫైల్యూర్ ను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు డాక్తర్ డేవిడ్ కావు. కొలరాడో సెంటర్ పర్సనలైజ్డ్ మెడిసిన్ కొలరాడో యునివర్సిటీ అఫ్ కార్డియో స్కూల్ అఫ్ మెడిసిన్ దీనిని కనుగోన్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 9 న హార్ట్ ఫైల్యూర్ లో ఈ అంశం ప్రచురించినట్లు తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే కాఫీ ప్రత్యామ్నాయంగా పని చేస్తుందని అన్నారు. అయితే దీని పై ఇంకా పూర్తి సాక్ష్యాధారాలు లేవని ఎవరైతే ధూమపానం, బరువు తగ్గడం వ్యాయామం చేయడం వల్ల కూడా హార్ట్ ఫైల్యురే ను నియంత్రించ వచ్చని పేర్కొన్నారు.
డాక్తర్ కావు నేతృత్వంలోని వైద్య బృందం యు.ఎస్ కు చెందిన 21000 మంది అడల్ట్స్ పై జరిపిన పరిశోధనలో హార్ట్ స్టడీ చేసినట్లు కావు చెప్పారు. ఫ్రామింగ్ హం ను హార్ట్ కార్డియో వాస్చ్యులర్ స్టడీస్ లో ఒక కప్పు కాఫీ తో 5 % నంచి 1 2 % తగ్గిందని 30 % కంటే తక్కువ ఉన్నవారు రోజుకు రెండు సార్లు కాఫీ తాగినట్లు కాఫీ కి హార్ట్ ఫైల్యూర్ కు సంబంధం ఉందని నిర్ధారించారు. అయితే డీకేఫ్ మాత్రం హార్ట్ ఫైల్యూర్ కు దారితీస్తుందని హెచ్చరించారు వైద్యులు. కాఫీనే కీలక పాత్ర పోషించిందని అన్నారు. జీవితంలో రోజు వారీ ఆహారంలో కాఫీ ఉండాలని నిర్దారించారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ లైఫ్ స్టైల్ కార్డియో మెటబాలిక్ హెల్త్ కౌన్సిల్ లీడర్ షిప్ కమిటీ చైర్ పెర్సన్ ఎతేర్టన్ మాట్లాడుతూ కాఫీని ఎంజాయ్ చేయండి గుండెకు మంచిదే, అది స్టిమ్యులేట్ చేస్తుందని అయితే కాఫీ ఎక్కువగా సేవిస్తే అనర్ధమే అని, అది నిద్రభంగానికి దారితీస్తుందని హెచ్చరించారు. డాక్టర్ మైఖేల్ గోయిమాన్ క్లినికల్ కార్డియాలజీ లాంగ్ ఐలాండ్ జెవిష్ ఫారెస్ట్ ఇన్ న్యూ యార్క్ పరిశోధనలో కొన్ని లోపాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేసారు. అయితే ఈ పరిశోధన వల్ల ఒక కప్పు కాఫీ అంటే 8 అవున్సులు, అమెరికన్ లకు కాఫీ లేనిదే పొద్దు గడవదు, కాబట్టి వారిని ప్రోతహించేందుకు కాఫీ మంచిదే అని ప్రచారం చేస్తూ ఉండవచ్చని మైఖేల్ అభిప్రాయ పడ్డారు. దానా దీనా కాఫీ మంచిదే, మోతాదు మించితే ప్రమాదమే అని పరోదనలు వెల్లడిస్తున్నారు. ఒక కప్పు కాఫీ తో మీ గుండె సేఫ్.