గర్భిణీ స్త్రీలు ఈ ఆహారాలు తింటే అంతే సంగతులు! ఆడపిల్ల జీవితంలో వివాహం, గర్బం దాల్చడం కీలకమైన మలుపులు. వీటి తరువాత నుండి మహిళల జీవితం చాలా మార్పులకు లోనవుతుంది. పండంటి పాపాయి పుట్టాలంటే మంచి ఆహారం తీసుకోవాలని  వైద్యుల నుండి పెద్దల వరకు చెబుతారు. అయితే ఇప్పటి కాలం అమ్మాయిలు చాలామంది ఉద్యోగాల కారణంగా పెద్దలకు దూరంగా ఉంటున్నారు. మరికొందరికి అసలు తాము తీసుకునే ఆహారాల మీద స్పష్టతే ఉండదు.  ఈ కింది ఆహారాలు గర్బవతులు అస్సలు తీసుకోకూడదని, అలా తింటే మాత్రం చాలా ప్రమాదమని అంటున్నారు.  ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ గర్భవతులు మొలకెత్తిన గింజలకు దూరం ఉండాలి. మొలకెత్తిన గింజలలో బ్యాక్టీరియా  ఎక్కువగా డవలప్ అవుతుంది.  వీటిని తింటే జీర్ణసంబంధ సమస్యలు వస్తాయి. పాలు కూడా ఆరోగ్యానికి మంచివే అయినా పాశ్చరైజేషన్ చేయని పాలు మాత్రం గర్భవతులకు ప్రమాదం. వీటిలో  లిస్టేరియా, ఇకోలి, సాల్మోనెల్లా వంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి కడుపులో పెరుగుతున్న బిడ్డకు హాని కలిగిస్తాయి. ఉడికించిన కోడిగుడ్లు అందరికీ మంచివే.  అయితే కొందరు పచ్చిగుడ్లు కూడా తింటారు. మరికొందరు హాఫ్ బాయిల్ అంటూ సగం ఉడికీ ఉడకని గుడ్లు తింటారు. అయితే గర్భవతులు ఆరోగ్యం బాగుండాలంటే పచ్చిగుడ్లు తినడం అవాయిడ్ చేయాలి. దీవివల్ల వాంతులు, వికారం వంటి ప్రమాదాలు ఎదురవుతాయి. గర్భవతులు మద్యపానం, ధూమపానంకు దూరం ఉండాలి. ఇవి కడుపులో బిడ్డకు హాని కలిగిస్తాయి. సముద్రంలో లభించే క్యాట్ ఫిష్, షార్క్ వంటి చేపలలో పాదరసం ఎక్కువ శాతం ఉంటుంది. ఈ చేపలను తినడం వల్ల కడుపులో బిడ్డ నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. బొప్పాయికి, గర్భిణులకు మద్య ఉండే విషయాలు అందరికీ తెలిసిందే. అయితే పచ్చి బొప్పాయి తినడం వల్ల గర్భిణులకు గర్భస్రావం  అయ్యే కారణం ఉంటుంది. కాఫీ కూడా ఆరోగ్యానికి మంచిదే. ఇందులో కెఫిన్ ఆరోగ్యం చేకూరుస్తుంది. కానీ కాపీ ఎక్కువ తాగితే కెఫిన్ కంటెంట్ కడుపులో బిడ్డపై చెడు ప్రభావం చూపిస్తుంది.  కెఫిన్ తొందరగా జీర్ణం కాకపోవడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు కూడా పెరుగుతాయి.                                               *నిశ్శబ్ద.

బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మహిళలలో ఉన్న అపోహలు.. వాస్తవాలు! ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్ల జీవితంలో అయినా గొప్ప సందర్భం ఏదైనా ఉందంటే అది వారు తల్లికావడమే. నవమాసాలు మోసి బిడ్డను కంటారనే విషయం తెలిసిందే అయినా ఆ తొమ్మిది నెలలు మహిళలు తమ జీవితంలో చాలా సవాళ్లు ఎదుర్కొంటార. ఆహారం దగ్గర నుండి శరీరాకృతి వరకు ప్రతి ఒక్కటీ మారిపోతుంది. అయితే ప్రసపం తరువాత పసిపిల్లలకు తల్లిపాలే ఆహారం. సుమారు 6నెలల వరకు పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలని వైద్యులు కూడా చెబుతారు. అయితే తల్లిపాలు ఇవ్వడం గురించి చాలామంది మహిళలలో అపోహలు ఉన్నాయి. పాలు తక్కువగా ఉత్పత్తి అవుతున్నాయని,  ఎన్ని నెలల వరకు పిల్లలకు పాలు ఇవ్వాలని, తల్లిపాలకు ప్రత్యామ్నాయం ఏమిటని ఇలా చాలా విషయాలలో  అపోహలు, వాస్తవాలు ఏంటో తెలుసుకుంటే అందరికీ ఈ విషయంలో ఒక అవగాహన ఏర్పడుతుంది. పాలివ్వడంలో అసౌకర్యం.. ప్రసవించిన తరువాత పిల్లలకు పాలివ్వడంలో ప్రతి తల్లీ అసౌకర్యానికి గురవుతుంది. పిల్లలు పాలు తాగడం లేదని, పాలు తాగడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటుంటారు. అయితే మొదటిసారి ప్రసవం అయిన మహిళలకు పిల్లలను హ్యాండిల్ చేయడం, రొమ్ములకు దగ్గరగా పిల్లలను పెట్టుకోవడం, పిల్లలకు సౌకర్యంగా ఉండటం వంటి వాటిలో కాస్త విఫలం అవుతారు. ఇది రోజులు గడిచేకొద్ది అలవాటు అవుతుంది. పిల్లలకు పాలిచ్చేటప్పుడు పెద్దల సహాయం తీసుకుంటే ఇందులో ఇబ్బంది చాలా వరకు అధిగమిస్తారు. పాలిచ్చే ముందు శుభ్రత.. చాలామంది పిల్లలకు పాలిచ్చే ముందు రొమ్ములను, చనుమొనలను శుభ్రం చేసుకోవడం గురించి మాట్లాడుతుంటారు. అయితే ఇలా శుభ్రం చేయాల్సిన అవసరమే లేదు. పిల్లలు ప్రసవించిన తరువాత తల్లిని వాసన, స్పర్శ ద్వారా గుర్తిస్తారు. చనుమొనలలో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. దీని వాసన కారణంగా పిల్లలు తమ తల్లులను గుర్తిస్తారు. ఇది  పిల్లలకు  ఉపయోగకరమైనది. కాబట్టి పాలిచ్చే ముందు రొమ్ములను శుభ్రం చెయ్యాల్సిన అవసరం లేదు. పాలిచ్చే తల్లులు మందులు ఉపయోగించకూడదు.. పాలిచ్చే తల్లులు మందులు ఉపయోగిస్తే అవి పిల్లలకు చెడు చేస్తాయని చాలామంది అంటారు. అయితే పాలిచ్చే తల్లులు తమ సమస్యలను వైద్యులతో చెప్పేటప్పుడు పిల్లలకు పాలిస్తున్న విషయాన్ని చెప్పాలి. దీన్ని బట్టి వైద్యులు ప్రత్యేక మందులు సిఫారసు చేస్తారు. వీటి వల్ల తల్లీ బిడ్డలకు ఎటువంటి ప్రమాదం ఉండదు. అయితే వైద్యులు సూచించిన విధంగానే మందులు తీసుకోవాలనే విషయం గుర్తుంచుకోవాలి. సొంతంగా మందులు వాడటం, వైద్యులు చెప్పిన నిర్ణీత కాలం కంటే  ఎక్కువ రోజులు  మందులు పొడిగించి వాడటం చేయకూడదు. అనారోగ్యంతో ఉన్నప్పుడు తల్లిపాలివ్వకూడదు.. తల్లులు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పుడు పిల్లలకు పాలివ్వకూడదని చాలా మంది అంటారు. అయితే ఇది తల్లులకు ఉన్న సమస్య పైన ఆధారపడి ఉంటుంది. తల్లి పాలు తాగడం వల్ల పిల్లలో కూడా కొన్ని వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచే  ఆహారం, పుష్కలంగా ద్రవాలు తీసుకోవడం తల్లులకు ఎంతో ముఖ్యం. అనారోగ్యాన్ని బట్టి వైద్యుల సలహా మీద మాత్రమే పిల్లలకు పాలివ్వడం మంచిది. తల్లులకు పాల కొరత.. చాలామంది మహిళలు తమకు పాలు తక్కువ పడుతున్నాయని, పిల్లలకు సరిపోవడం లేదని ఫర్యాదు చేస్తుంటారు. అయితే ఇది చాలా వరకు అపోహే అని అంటున్నారు. బిడ్డను రొమ్ముపై సౌకర్యవంతంగా ఉంచుకుని పాలివ్వడంలోనే చాలావరకు పొరపాటు జరుగుతుందట. సౌకర్యవంతంగా పిల్లలకు రొమ్ము అందిస్తే పిల్లలు కూడా కడుపు నిండుగా పాలు తాగుతారు. అలాగే పిల్లలు పాలు ఎంత బాగా తాగితే తల్లులలో పాలు అంత బాగా ఉత్పత్తి అవుతాయి. ఆహారం.. పాలిచ్చే తల్లులు ఆహారం విషయంలో ఎలాంటి గందరగోళం చెందాల్సిన పనిలేదు. అందరిలానే పాలిచ్చే తల్లులు కూడా సమతుల్య ఆహారం తీసుకోవాలి. తల్లులు ఆరోగ్యంగా ఉన్నంతకాలం వారిలో పాలు ఉత్పత్తి కావడంలో సమస్యలు ఎదురే కావు. గమనిక: పై విషయాలు పోషకాహార నిపుణులు, మహిళా వైద్యులు పలుచోట్ల ప్రస్తావించిన అంశాల ఆధారంగా పొందపరచబడినవి.                                         *నిశ్శబ్ద. 

ఏం చేసినా హిమోగ్లోబిన్ పెరగట్లేదా? అయితే ఇలా చేయాల్సిందే.. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు అవసరం అవుతాయి. శరీరం మొత్తం ఆరోగ్యాన్ని నిర్దేశించగల సామర్థ్యం రక్తానికి ఉంది. శరీరంలో హిమోగ్లోబిన్ సరిపడినంత లేకపోతే అది రక్తహీనతకు దారితీస్తుంది. ఈ రక్తహీనత ముఖ్యంగా మహిళల్లోనే ఎక్కువగా ఎదురవుతుంటుంది. ఐరన్ స్థాయిలు మెరుగుపరుచుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ ను భర్తీ చేసుకోవచ్చు. దీని కోసం మహిళలు తప్పక తినాల్సిన ఆహారాలేంటో తెలుసుకుంటే.. ఆహారంలో మొక్కల ఆధారిత పదార్థాలు అయిన గింజలు, విత్తనాలు, పండ్లు, కూరగాయలు మొదలైనవి పుష్కలంగా తీసుకోవాలి. వీటిని తీసుకుంటే శరీరంలో ఐరన్ బాగా లభిస్తుంది. పైపెచ్చు ఇవి శరీరంలో ఐరన్ సరఫరాను కూడా ప్రోత్సహిస్తాయి. ఆకుకూరలు, పండ్లు, గింజలే కాకుండా ఆహారంలో లీన్ మాంసం, చికెన్, పాలు, గుడ్లు, బీన్స్, కాయధాన్యాలు, జున్ను, బచ్చలికూర, బ్రోకలీ వంటి వాటిలో ఐరన్ అధికంగా ఉంటుంది. వీటిలో ఏవో కొన్ని అయినా రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటే  తప్పనిసరిగా ఐరన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది. చాలామంది ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకున్నా హిమోగ్లోబిన్ పెరగడం లేదని ఫిర్యాదు చేస్తుంటారు. అయితే విటమిన్-సి పుష్కలంగా తీసుకునేవారికే  ఐరన్ పెరుగుదల ఉంటుంది. ఎందుకంటే ఐరన్ ను శరీరం ఫర్పెక్ట్ గా గ్రహించడానికి విటమిన్-సి సహాయపడుతుంది. శరీరం ఐరన్ గ్రహించడానికి కేవలం విటమిన్-సి మాత్రమే కాదు, విటమిన్  బి12 కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆహారంలో పాలు, మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు మొదలైనవాటిలో విటమిన్-బి12 ఉంటుంది. వీటిని తీసుకుంటే ఐరన్ ను కూడా సులువుగా పొందగలుగుతారు.                                                        *నిశ్శబ్ద.

మహిళలలో మెనోపాజ్.. ముఖ్యవిషయాలు ఇవే.. ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో తప్పనిసరిగా కొన్ని దశలు అదిగమించాలి. వీటిలో  12 నుండి 16ఏళ్లలోపు రజస్వల అయితే అది దాదాపు 30నుండి 40 ఏళ్ళపాటు  కొనసాగుతుంది. ఆ తరువాత ఈ నెలసరి ఆగిపోతుంది. ఇలా నెలసరి ఆగిపోవడాన్ని వైద్యపరిభాషలో మెనోపాజ్ అని అంటారు.  మెనోపాజ్ చెప్పడానికి సులువైన విషయమే అయినా దాన్ని ఎదుర్కొనే మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. హార్మోన్లలో మార్పులు, శారీరక మార్పులు, శరీరంలో వేడి ఆవిర్లు, బరువు మొదలైన సమస్యలు ఎన్నో మహిళలను ఇబ్బంది పెడతాయి.  చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల మెనోపాజ్ చాలా నరకంగా అనిపిస్తుంది. దీని గురించి మహిళలకే కాకుండా వారి భాగస్వాములకు కూడా మెనోపాజ్ విషయంలో అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ప్రతి ఏడాది అక్టోబర్ 18వ తేదీన వరల్డ్ మెనోపాజ్ డే ని నిర్వహిస్తున్నారు. దీని లక్ష్యాలు, దీని చరిత్ర, దీని థీమ్ మొదలైన విషయాలు తెలుసుకుంటే.. ఈ ఏడాది ప్రపంచ మెనోపాజ్ డే థీమ్  కార్డియోవాస్కులర్ డిసీజ్. మహిళల పునరుత్పత్తి ఆరోగ్యం గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మెనోపాజ్  కు చేరువ అవుతున్న మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. చరిత్ర.. ప్రపంచ మెనోపాజ్ డే ను 1984లో ప్రపంచ ఆరోగ్యసంస్థ, ఇంటర్నేషనల్ మెనోపాజ్ సొసైటీ కలిసి స్థాపించాయి. నలభై ఏళ్ళ తరువాత మహిళలు ఈ సమస్యలో ఎదుర్కొనే పరిస్థితుల గురించి అవగాహన కల్పించడం ఈ రోజు ప్రధాన ఉద్దేశ్యం. ఒకప్పుడు  45 నుండి  55 సంవత్సరాల మధ్య మహిళలలో  పునరుత్పత్తి హార్మోన్లు సహజంగా  క్షీణించేవి. ఇది ఇప్పుడు కొందరిలో 40ఏళ్ల తరువాతే మొదలవుతోంది.   మెనోపాజ్ ఎదుర్కొంటున్న మహిళలలో  సాధారణ లక్షణాలైన వేడి ఆవిర్లు, రాత్రి చెమటలు, మానసిక మార్పులు  నిద్ర భంగం వంటివి ఉంటాయి. ప్రతి మహిళ వీటి గురించి  తెలుసుకోవాలి. ముఖ్యంగా పునరుత్పత్తి వ్యవస్థ బలహీన పడటం వల్ల  గుండె జబ్బులు, బోలు ఎముకల వ్యాధి ప్రమాదం పెరగడం,  ఆందోళన, నిరాశకు మొదలైన సమస్యలకు కూడా  కారణమవుతుంది. ప్రపంచ మెనోపాజ్ డే  చాలా  ముఖ్యమైనది, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది  స్త్రీలు ఇప్పటికీ మెనోపాజ్ సమస్య గురించి అవహాహన కలిగి లేరు, అలాగే దీని గురించి అవగాహన ఉన్న కొద్ది మంది కూడా దీని గురించి చర్చించలేకపోతున్నారు, అయినప్పటికీ ఇది మహిళల ఆరోగ్యంలో చాలా ముఖ్యమైన దశ. మెనోపాజ్ చాలా కాలం పాటు కొనసాగుతుంది.  పెరిమెనోపాజ్ పరిస్థితి మెనోపాజ్‌కు ఒక సంవత్సరం ముందు ప్రారంభమవుతుంది,   ఇది మహిళలకు అసౌకర్యాన్నికలిగిస్తుంది. సుమారు ఒక దశాబ్దం పాటు ఉంటుంది.  

బ్రా ధరించే మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా.. ప్రపంచంలో ఎక్కువ మంది ప్రాణాలను బలిగొంటున్న జబ్బు క్యాన్సర్. చాలామందిలో క్యాన్సర్ చివరి స్టేజ్ కు వచ్చాక తప్ప బయటపడదు. క్యాన్సర్ లో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో మహిళలకు ఎక్కువగా ముప్పు కలిగించేది బ్రెస్ట్ క్యాన్సర్. సాధారణంగా నలభై సంవత్సరాలు దాటిన మహిళలలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.  మహిళల రొమ్ములో మామూలుగానే కణజాలంతో ఏర్పడిన గడ్డలు ఉంటాయి. బ్రెస్ట్ ను చేత్తో తాకినప్పుడు ఈ గడ్డల స్పర్శ తెలుస్తుంటుంది. ఇవి ఏ మాత్రం ప్రమాదం లేనివి. పైపెచ్చు నొప్పి కూడా ఉండవు. కానీ రొమ్ము క్యాన్సర్ లో మాత్రం ఇవన్నీ పూర్తీగా వేరు వేరుగా ఉంటాయి. కొన్ని లక్షణాల ద్వారా రొమ్ము క్యాన్సర్ ను గుర్తించవచ్చు. అలాగే బ్రా వేసుకునే మహిళలకు రొమ్ము క్యాన్సర్ వస్తుందా అనే విషయం నిజమా.. అబద్దమా.. పూర్తీగా తెలుసుకుంటే.. మహిళలకు రొమ్ములలో క్యాన్సర్ గడ్డలు పెరగడాన్ని రొమ్ము క్యాన్సర్ అని అంటారు. ఈ క్యాన్సర్ కణాలు పూర్తీగా  రొమ్మును మొత్తం ఆక్రమించాక  మహిళల ప్రాణాలు కాపాడాలంటే మాత్రం పూర్తీగా రొమ్మును తొలగించాల్సి ఉంటుంది. మహిళల శరీరంలో ముఖ్యభాగం అయిన రొమ్మును తొలగించడం అంటే అది ఎంతో ఆత్మన్యూనతకు దారి తీస్తుంది.  రొమ్ములో ఉండే కణాలలో క్యాన్సర్ కారకాలు చేరి అవి క్రమంగా కణజాలాలుగా రూపాంతరం చెంది క్యాన్సర్ గడ్డలుగా మారతాయి. ఈ క్యాన్సర్ గడ్డలు చేత్తో తాకితే నొప్పిగా ఉంటాయి. అంతేకాదు రొమ్ము మీద  ఉండే చనుమొనల నుండి రసి కారుతూ ఉంటుంది. చీము, రక్తం, ద్రవం కారుతూ ఉంటుంది. చనుమొన చుట్టూ దురద ఏర్పడి దాని కారణంగా కురుపులు వస్తాయి. క్యాన్సర్ గడ్డలు క్రమంగా పెరగడం వల్ల రొమ్ము పరిమాణం కూడా పెరుగుతుంది.  అయితే మహిళలలో నెలసరి సమస్యల సమయంలో రొమ్ములో గడ్డలలో మార్పులు, వాటిని తాకితే నొప్పి కలుగుతుంటాయి. కాబట్టి ఇలాంటి సమయాన్నికూడా పరిగణలోకి తీసుకుంటూ రొమ్ములను సాధారణ రోజుల్లో పరీక్షించుకోవాలి. ఇకపోతే బ్రా ధరించే మహిళలకు గొమ్ము క్యాన్సర్ వస్తుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే బ్రా ధరించడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు అస్సలు లేవని వైద్యులు చెబుతున్నారు. కాకపోతే బ్రాను నిర్ణీత సమయంలో మాత్రమే ధరించాలి. చాలావరకు వదులుగా ఉన్న దుస్తులు ధరించడం అన్నివిధాలా సురక్షితం. బ్రా ధరించే అలవాటు ఉన్న మహిళలు బయటకు వెళ్లినప్పుడు మాత్రమే ధరించడం సురక్షితం. ఇంట్లో ఉన్న సమయంలోనూ, రాత్రి నిద్రించేముందు బ్రా తొలగించాలి. బ్రా లకు ఉండే ఎలాస్టిక్ మహిళల రొమ్ము ప్రాంతం నుండి కింద శరీర అవయవాలకు రక్తప్రసరణ జరగడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. దీనివల్ల గుండె మీద ఒత్తిడి పెరుగుతుంది. చాలావరకు సుఖమైన నిద్ర సాధ్యం కాదు. అందుకే ఎల్లవేళలా బ్రా ధరించకూడదని వైద్యులు కూడా చెబుతారు. రొమ్ము క్యాన్సర్ కు బ్రాకు సంబంధం లేదు కానీ బ్రా కారణంగా ఇతర అసౌకర్యాలు అయితే ఉన్నాయి.  రొమ్ము క్యాన్సర్  అవగాహనా నెలగా అక్టోబర్ ను పేర్చొన్నారు. ఈ కారణంగా మహిళలు ప్రమాదకరమైన రొమ్ము క్యాన్సర్ మీద అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం.                                                                      *నిశ్శబ్ద. 

మహిళలు గర్బం దాల్చడంలో మరింత గొప్ప ఫలితాలు పొందాలంటే ఈ టెస్ట్ బెస్ట్..     గర్బం దాల్చడం, తల్లి కావడం ప్రతి ఆడపిల్ల కల. కానీ దురదృష్టవశాత్తూ  ప్రస్తుతకాలంలో 12నుండి 15శాతం జంటలు  పిల్లలను కనడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. భార్యాభర్తల ఇద్దిరలోనూ పిల్లలు పుట్టడంలో తగినంత సామర్థ్యం లేకపోవడం వల్ల  చాలామంది పిల్లల కోసం వైద్యుల చుట్టూ ప్రదక్షణలు చేస్తుంటారు. లోపం ఎవరిలో ఉన్నా అది ప్రత్యక్షంగా మహిళల మీదే  కనిపిస్తుంది. కానీ చాలామంది మహిళలు గర్భం దాల్చడంలో  అవకాశాలు ఉన్నా కూడా విఫలమవుతుంటారు. దీనికి కారణం మహిళలకు గర్బం ధరించే సమయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుందో సరిగా అవగాహన లేకపోవడం. అయితే ఇప్పుడు దీన్ని కనుక్కోవడం సులభం. దీని వల్ల మహిళలు గర్బం ధరించే అవకాశాలు 20 నుండి 25శాతం ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఎలా కనుక్కోవాలి? దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. గర్భం దాల్చడానికి అద్బుతమార్గం.. మహిళలలో గర్బం దాల్చే అవకాశాలు  అండాలు విడుదల అయ్యే సమయంలో ఎక్కువగా ఉంటాయి. మూత్ర పరీక్ష ద్వారా అండోత్సర్గ పరీక్ష చేయించుకోవచ్చు.  ఈ అండోత్సర్గ పరీక్ష కిట్ సాధారణ మెడికల్ స్టోర్స్ లో దొరుకుతుంది. లేదా దీన్ని వైద్యుల పర్యవేక్షణలో కూడా చేసుకోవచ్చు.  సాధారణంగా మహిళలలో ఋతుచక్రం  28రోజులుగా ఉంటుంది. చివరిసారి ఋతుక్రమం ప్రారంభమైన 11వ రోజున ఈ పరీక్షను చేసుకోవాలి. అండాలు విడుదల కావడానికి మూడు నుండి ఐదు రోజుల ముందు ఈ పరీక్షను చేసుకోవాలి.  ఈ పరీక్షలో టెస్ట్ కిట్ రంగు మార్పు కనబడితే మరొక 24నుండి 36గంటలలో అండాలు విడుదల కావడం ప్రారంభమవుతుందని అర్థం. దీన్ని అర్థం చేసుకుని భార్యాభర్తలు సంభోగంలో పాల్గొంటే ఆ సమయంలో మహిళలు గర్బం ధరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండోత్సర్గానికి ఐదు రోజుల ముందు నుండి అండోత్సర్గము తర్వాత చాలా గంటల వరకు గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. ఈ కాలాన్ని ఫెర్టిలిటీ విండో అంటారు.  అండోత్సర్గము కాలం గురించి తెలుసుకోవడానికి  అల్ట్రాసౌండ్ కూడా  చేయవచ్చు లేదా ఋతు చక్రానికి సంబంధించిన హార్మోన్ల స్థాయిలను తెలుసుకోవడానికి మూత్ర పరీక్ష చేయించుకోవచ్చు.  ఇంకొక మార్గం ఏమిటంటే  గర్భాశయ శ్లేష్మం పర్యవేక్షణ సహాయంతో  అండోత్సర్గము కాలాన్ని కూడా తెలుసుకోవచ్చు. అండాలు పర్ఫెక్ట్ గా విడుదల అయ్యే సమయాన్ని తెలుసుకోవడానికి ఈ మార్గాలు  ఉన్నాయి. ఇవే కాకుండా  పీరియడ్ ట్రాకింగ్ యాప్ ద్వారా కూడా దీన్ని తెలుసుకోవచ్చు.  గర్భం దాల్చాలనుకుంటే లేదా చాలా కాలంగా గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్నట్లయితే,  వైద్యుని సలహా,  సహాయంతో ఈ మూత్రం అండోత్సర్గము పరీక్షను చేయవచ్చు. ఈ పరీక్ష సహాయంతో అండోత్సర్గము గురించి సమాచారాన్ని పూర్తీగా అర్థమవుతుంది కూడా.  తద్వారా  తొందరలోనే  గర్భం దాల్చవచ్చు.                                                             *నిశ్శబ్ద. 

రోజుకో గ్లాస్ ఈ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో తెలుసా? మూసాంబి మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.  దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి. విటమిన్ సి, ఎ, ఫాస్పరస్, పొటాషియం, కార్బోహైడ్రేట్, ఫోలేట్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది: మూసాంబి జ్యూస్, సిట్రస్ ఫ్రూట్, మన శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా, వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తుంది. మోసంబి జ్యూస్‌ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది.   ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు దోహదం చేస్తుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు జలుబును నివారిస్తుంది. శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది: మీ శరీరానికి డిటాక్స్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఒత్తిడి, కాలుష్యం యొక్క విష ప్రభావాలను తొలగిస్తుంది, ఇది శరీరం యొక్క సహజ డిటాక్స్ సూపర్ స్టార్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుండి రక్షణ: విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, మొసాంబి మంట, వాపు నుండి రక్షణ, నివారణను అందిస్తుంది. ఈ అద్భుతమైన పండు ఆస్టియో ఆర్థరైటిస్,  రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలను కూడా తగ్గిస్తుంది. బరువు తగ్గడం: మూశంబి రసం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది మీ కోరికలను అణచివేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగడం వల్ల అదనపు కేలరీలు కరిగిపోతాయి. మోసంబి రసం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. చర్మానికి కాంతిని ఇస్తుంది: మెరిసే చర్మం పొందడానికి రోజూ ఒక గ్లాసు మోసాంబి జ్యూస్ తాగండి. ఇది మీ చర్మానికి మెరుపును ఇస్తుంది. మూసాంబిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీబయాటిక్ పవర్‌తో, మీ చర్మం రక్షించబడి కాంతివంతంగా ఉంటుంది. మీ డల్ స్కిన్ కి గ్లో ఇస్తుంది. జీర్ణక్రియకు మంచిది: మోసంబి జ్యూస్ కేవలం దాహాన్ని తీర్చేది కాదు. సమతుల్య జీర్ణవ్యవస్థకు ఇది మంచి పానీయం. మీ జీర్ణ రసాలు శక్తిని పెంచుతాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.  మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం పొందుతాయి. ఇది జీర్ణ రసాలు, ఆమ్లాలు, పిత్త స్రావాన్ని పెంచడం ద్వారా జీర్ణవ్యవస్థను ఉత్తేజపరిచే ఫ్లేవనాయిడ్ల యొక్క అధిక కంటెంట్‌ను కలిగి ఉంటుంది. అందువల్ల, అజీర్ణం, క్రమరహిత ప్రేగు కదలికలు, ఇతర జీర్ణశయాంతర సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు మోసంబి జ్యూస్ చాలా మేలు చేస్తుంది.

పురుషుల కంటే మహిళలలోనే గుండె జబ్బులు అధికమవుతున్నాయి ఎందుకంటే.. గుండె జబ్బులు  ప్రాణాంతకం. గుండె జబ్బులు సాధారణంగా  పురుషులలో సర్వసాధారణం, కానీ గత కొన్ని సంవత్సరాలుగా మహిళల్లో కూడా  గుండె జబ్బుల రేటు వేగంగా పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం హృదయ సంబంధ సమస్యలు (CVD) భారతదేశంలో సుమారు 35 లక్షల మరణాలకు కారణమవుతోంది.  అందులో 16.9% మహిళలు ఉన్నారు.  గుండె ఆరోగ్యాన్ని చాలా విషయాలు ప్రభావితం చేస్తాయి, వాటిలో ఒకటి ఒత్తిడి. ఒత్తిడి గుండె జబ్బులతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది.  పురుషుల కంటే స్త్రీలు ఒత్తిడితో సులభంగా ప్రభావితమవుతారు. ఈ ఒత్తిడి నిద్రలేమితో కలిసి ఉంటుంది. దాదాపు ప్రతి నలుగురిలో ఒకరు నెలసరి తర్వాత క్రమం తప్పిన  హృదయ స్పందనను అనుభవిస్తారు.  ఒత్తిడి శరీరంలో మంటను పెంచుతుంది, ఇది అధిక రక్తపోటు,  తక్కువ 'మంచి'  కొలెస్ట్రాల్‌కు దారితీస్తుంది . ఒక వ్యక్తి ఒత్తిడికి గురైనప్పుడు సరిగా నిద్రపోడు. ఇలాంటి  పరిస్థితిలో వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం లేదా బరువును నియంత్రించడం వంటివి కూడా తగ్గుతాయి. ఈ జీవనశైలి మార్పులు గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.  పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ మరియు డిప్రెషన్ వంటి మానసిక ప్రమాద కారకాలను పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే చిన్నతనంలో ఎదురైన  లైంగిక దాడులు గుర్తుకు రావడం వంటి సంఘటనలు  గుండెపై ఒత్తిడి పెంచుతాయి.  ఇవి మానసిక సమస్యలకు దారితీస్తాయి. ఇలాంటివి మహిళలు పెద్దగా పట్టించుకోరు.  మహిళల జివితంలో  విడాకులు, కుటుంబ సమస్యలు, ఇష్టమైనవారి   మరణం, దీర్ఘకాలిక అనారోగ్యం లేదా ప్రకృతి వైపరీత్యం వంటి జీవిత సంఘటనలు మానసిక ఒత్తిడిని పెంచుతాయి.  ముఖ్యంగా నిర్దిష్ట వయస్సు తర్వాత ఈ సమస్యలను ఎదుర్కోవడం మహిళలకు మరింత కష్టతరం చేస్తుంది. భావోద్వేగ ఒత్తిడి రక్తపోటును పెంచుతుంది , ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది.  కొరోనరీ ధమనులలో ఫలకం ఏర్పడుతుంది. భావోద్వేగ ఒత్తిడి కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను కూడా పెంచుతుంది. ఈ హార్మోన్లు ప్లేట్‌లెట్స్,  అటానమిక్ టోన్‌ను ప్రభావితం చేస్తాయి. ఇవి హృదయ స్పందన రేటు,  రక్తపోటు వంటి సహజ విధులను నియంత్రించడంలో శరీరానికి సహాయపడతాయి. ఇవన్నీ గుండె జబ్బులను పెంచుతాయి. మహిళల్లో హార్మోన్ల మార్పులు, ఒత్తిడి,  గుండె సమస్యలను  పెంచుతాయి . ఋతుస్రావం, గర్భం,  నెలసరి  సమయంలో ఇలా  స్త్రీ జీవితాంతం హార్మోన్ల మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఈ హార్మోన్ల మార్పులు రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు,  సాధారణ హృదయనాళ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. ఒత్తిడి కారణంగా మహిళలకు గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఒత్తిడిని జీవితం నుండి తొలగించలేము, కానీ గుండె ఆరోగ్యంపై దాని ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు, ముఖ్యంగా మహిళలకు వివిద  సందర్భంలో వచ్చే ప్రమాదాలను గుర్తించడం, వాటిని సమయానికి  పరిష్కరించడం ద్వారా మహిళల హృదయ ఆరోగ్యాన్ని రక్షించవచ్చు.                                      *నిశ్శబ్ద.

పిల్లలకు రాత్రి పూట ఈ 5 ఆహారాలు ఎందుకు ఇవ్వాలో తెలుసా...   ఆహారం ఎక్కువగా తిన్న తర్వాత మంచి నిద్రలోకి జారుకుంటాం. కానీ పిల్లల విషయంలో అలా కాదు! వారు ఏమి తినాలి? ఏమి తినకూడదు? అన్న అవగాహన చాలా మంది తల్లిదండ్రులకు ఉండదు. దీని కారణంగా పిల్లలు రాత్రి సమయంలో నిద్ర సమస్యను ఎదుర్కొంటారు. తల్లిదండ్రులు రాత్రిపూట శిశువు బాగా నిద్రపోవడానికి సహాయపడే ఆహారాన్ని ఇవ్వాలి. ఇటువంటి ఆహారాలు వారి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా శరీరానికి విటమిన్లను అందిస్తాయి. కాబట్టి శిశువుకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో ఇక్కడ తెలుసుకోండి. పాలు: రాత్రిపూట పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల వారికి మంచి నిద్ర వస్తుంది. పాలలో ట్రిప్టోఫాన్, కాల్షియం, విటమిన్ డి. మెలటోనిన్ ఉంటాయి. అవి నిద్రను ప్రోత్సహిస్తాయి. నిద్రవేళలో పాలు తాగడం వల్ల ఎక్కువసేపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే మీరు ఇచ్చే పాలు కల్తీ లేకుండా ఉండేలా చూసుకోండి. గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకోవడం మంచిది. పసుపు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బాదం: బాదంపప్పును సాధారణంగా పిల్లలకు ఉదయం పూట ఇస్తారు. ఇది మెదడుకు చాలా మంచిదని భావిస్తారు. కానీ రాత్రి పూట పిల్లలకు బాదంపప్పు తినిపించవచ్చు లేదా బాదంపప్పు కలిపిన పాలు తాగించవచ్చు. బాదం పాలలో మెలటోనిన్ అధిక స్థాయిలో ఉంటుంది. ఇది మీ నిద్ర స్థాయిని పెంచుతుంది. అలాగే, వాల్‌నట్‌లలో మెలటోనిన్, సెరోటోనిన్, మెగ్నీషియం ఉన్నందున అవి కూడా ఒక ఎంపిక. అరటిపండ్లు: అరటిపండ్లు రోజులో ఏ సమయంలోనైనా 24 గంటలూ తినవచ్చు. వీటిని సూపర్ ఫుడ్స్ అంటారు. అయోడిన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి, అరటిలో మెగ్నీషియం, పొటాషియం, ట్రిప్టోఫాన్, విటమిన్ B6, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. రాత్రి పడుకునే ముందు పిల్లలకు అరటిపండు తినిపించండి . ఇది సంపూర్ణత్వం, మలబద్ధకం చికిత్స చేస్తుంది. చెర్రీస్: మంచి రాత్రి నిద్రకు చెర్రీస్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నిజానికి, చెర్రీస్ మీ పిల్లల డిన్నర్‌కు మంచి ఆప్షన్ గా ఉంటాయి. బీన్స్: చిక్కుళ్ళు సాధారణంగా రాత్రిపూట కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. ఎందుకంటే ఇందులో అధిక స్థాయిలో ప్రొటీన్లు, ట్రిప్టోఫాన్ ఉంటాయి. ఇది మంచి నిద్రకు ఉత్తమమైన ఆహారం. ఉదాహరణకు, చిక్‌పీస్‌లో ఐరన్, పొటాషియం, ఫైబర్, విటమిన్లు K, C మరియు B-6 కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది వాటిని గొప్ప, పోషకమైన విందు ఆహారంగా చేస్తుంది. మీ శిశువు ఆహారంలో చేర్చడానికి బీన్స్ ఉడికించి, గుజ్జు చేయడం మంచిది.

 మహిళలలో పిసిఒయస్ సమస్యకు కారణాలు.. పరిష్కార మార్గాలు.. ఒక వయసు వచ్చాక అమ్మాయిలలో ఆరోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి.  అవి మెల్లగా పెరుగుతూ మహిళలను చాలా రకాలుగా ఇబ్బందికి గురిచేస్తాయి. మహిళలలో సాధారణంగా కనిపించే సమస్యలలో పిసిఒఎస్ ఒకటి. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ గా పిలువబడే ఈ సమస్య  మహిళలలో చాలా తీవ్రమైన పరిస్థితులకు కారణం అవుతుంది. ఇది ప్రధానంగా హార్మోన్ సమస్యగా పరిగణింపబడుతుంది.  పునరుత్పత్తి వయస్సు మహిళలలో వస్తుంది. ఈ సమస్య ఉన్న మహిళలలో నెలసరి రావడం నుండి, ఆ సమయంలో జరిగే ఋతుస్రావం వరకు చాలా విషయాలు ప్రభావితం అవుతాయి. ఇది పూర్తిగా మహిళల మానసిక  స్థితిని దెబ్బతీసే సమస్య.  పిసిఒఎస్ సమస్య గురించి మహిళలలో సరైన అవగాహన కలిగించడానికి,  ఈ సమస్యను అధిగమించే విషయంలో మహిళలను ప్రోత్సహించడానికి సెప్టెంబర్ నెలను పిసిఒయస్ అవగాహనా నెలగా కేటాయించారు.  మహిళలలో ఎక్కువగా కనిపించే ఈ సమస్య గురించి వివరంగా తెలుసుకుని, దీనికి పరిష్కార మార్గాలేమిటో విశ్లేషించడం ఎంతో ముఖ్యం. పిసిఒఎస్.. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్యకు ఖచ్చితమైన కారణం అంటూ ఏదీ  ఇప్పటి వరకు తెలియదు. ఆరోగ్య నిపుణులు మహిళలలో కనిపించే  కొన్ని మార్పుల కారణంగా  సమస్యకు మూలాన్ని అంచనా వేసి దానికి తగిన పరిష్కాలు సూచిస్తుంటారు. మహిళలలో  నెలసరి సమస్యలు రావడం, దీర్ఘకాలం రక్తస్రావం జరగడం, లేదా నెలసరిలో తగినంత రక్తస్రావం జరగకపోవడం వంటి సమస్యలు పిసిఒఎస్ సమస్యలున్న మహిళలలో కనిపిస్తుంటాయి.  ఇది చాలా కాలం  కొనసాగడం వల్ల మహిళలలో పిల్లలు పుట్టడంలో అవాంతరాలు ఏర్పడతాయి.  ఈ సమస్యకు అధికబరువు, హార్మోన్ అసమతుల్యత  ముఖ్యకారణాలు కావచ్చునని వైద్యులు చెబుతున్నారు.   నివారణ ఎలాగంటే.. ఆరోగ్యకరమైన జీవనశైలి.. అధిక బరువు ఉన్న మహిళలలో పిసిఒఎస్ సమస్య వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వారు బరువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బరువు తగ్గడానికి ఎంత ప్రయత్నం చేస్తే ఈ సమస్య కూడా అంత తగ్గే అవకాశం ఉంటుంది.  బరువు నియంత్రణలోకి వచ్చే కొద్ది శరీరంలో హార్మోన్లు కూడా మెల్లిగా చక్కబడతాయి.  ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, పోషకాల సహాయంతో బరువు తగ్గడం వల్ల పిసిఒఎస్ సమస్యను తగ్గించుకోవచ్చు. ఆహారం.. పిసిఒయస్ సమస్యను నియంత్రించడానికి సరైన పోషకాహారం ముఖ్యం.  కార్భోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం తగ్గించాలి. ఇది ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు.  పిసిఒయస్ సమస్యను అరికట్టడానికి సింపుల్ గా కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాన్ని తగ్గించి వాటి స్థానంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మొదలైనవి తీసుకోవడం వల్ల చాలావరకు సమస్యను అదుపులో ఉంచవచ్చు. చురుగ్గా ఉండాలి..  ఒకేచోట కూర్చుని పనిచేయడం అధికబరువుకు ప్రధాన కారణం అవుతుంది. నేటికాలంలో బిజీ పేరుతో శారీరక వ్యాయామం చేయకపోడం కూడా అధికబరువుకు కారణమే. ఎన్ని పనులు ఉన్నా, ఎంత బిజీ జీవితం గడుపుతున్నా రోజులో కొద్దసేపు వ్యాయామం, యోగ, ధ్యానం మొదలైనవాటికి కేటాయించడం చాలా ముఖ్యం. ఇది శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది.  బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అధికబరువు ఉన్నా పిసిఒయస్ సమస్య ఉండకూడదు అంటే క్రమం  తప్పకుండా వాకింగ్, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. వీటిని పాటిస్తే శరీరంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. ఫలితంగా పిసిఒయస్ సమస్య తగ్గిపోతుంది.                                                                 *నిశ్శబ్ద.  

 ఈ ఫుడ్స్ మీలో ఒత్తిడిని పెంచుతాయి..!! ఆందోళన అనేది నేడు సాధారణ సమస్య. ఒక వ్యక్తి ఉదయం నుండి సాయంత్రం వరకు రకరకాల పనులు, బాధ్యతల భారంలో చిక్కుకుపోతాడు, అతనికి తన కోసం సమయం దొరకదు. అటువంటి పరిస్థితిలో, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోలేనప్పుడు, చిరాకు, ఒత్తిడి వంటి సమస్యలు తప్పవు. దీని వల్ల మెదడు కూడా సరిగా పనిచేయదు, కానీ మీకు తెలుసా, కొన్ని ఆహార పదార్థాలు కూడా ఆందోళన కలిగిస్తాయి. ఇవి తింటే మీ ఒత్తిడి పెరుగుతుంది. కెఫిన్: మీరు అవసరానికి మించి టీ లేదా కాఫీ తాగితే , అది మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒత్తిడి వచ్చే ప్రమాదం ఉంది. ఇది చిరాకు  భయము భావాలను సృష్టిస్తుంది. కెఫీన్ వల్ల నిద్ర కూడా దెబ్బతింటుంది కాబట్టి దానికి బదులు హెర్బల్ టీ, ఫ్రూట్ జ్యూస్ మొదలైన ఆరోగ్యకరమైన వాటిని తీసుకోవాలి. మద్యం: ఆల్కహాల్ ఆరోగ్యానికి అత్యంత హానికరం. దీన్ని తాగడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. అంతే కాకుండా అధికంగా ఆల్కహాల్ తాగడం వల్ల నిద్రలేమి, విటమిన్ బి లోపం, నిద్రలేమి మొదలైన సమస్యలు వస్తాయి. అధిక కొవ్వు ఆహారాలు:  కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు మెదడుకు రక్త ప్రసరణను తగ్గిస్తాయి. పరిశోధన ప్రకారం, అధిక మొత్తంలో తీపి, కొవ్వు పదార్ధాలను తినడం ఒత్తిడి ప్రమాదాన్ని పెంచుతుంది. ఉప్పు: ఉప్పు కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. దీనివల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అంతే కాకుండా ఉప్పు ఎక్కువగా తింటే రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని వల్ల మీరు అనేక రకాల వ్యాధులకు గురవుతారు. ఫాస్ట్ ఫుడ్స్: ఫాస్ట్ ఫుడ్స్ చాలామంది ఇష్టంగా తింటారు.  కానీ అది మీ మెదడును ప్రభావితం చేస్తుంది. మీరు మీ మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, ఫాస్ట్ ఫుడ్‌లకు దూరంగా ఉండండి. ఈ అనారోగ్యకరమైన వాటిని తినడం వల్ల మధుమేహం, బీపీ, ఊబకాయం వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. వేయించిన ఆహారాలు: చాలామంది తరచుగా వేయించిన ఆహారాన్ని చిరుతిండిగా తింటారు. ఇది రుచిగా ఉంటుంది, కానీ ఇది ఆందోళన సమస్యలను కలిగిస్తుంది. ఈ ఆహారాలు మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి.  

గర్భవతుల్లో పెదవులు, బుగ్గలలోపల బొబ్బలు వస్తే  ఎంత డేంజరో తెలుసా.. పెదవుల మీద, నోటిలో, పెదవుల చుట్టూ, గడ్డం వంటి  ప్రాంతాలలో సాధారణంగా బొబ్బలు, పొక్కులు వస్తుంటాయి. విటమిన్ లోపాల వల్లా, అధిక వేడి కారణంగా ఇవి వస్తుంటాయని పెద్దలు చెబుతుంటారు. కానీ గర్భవతులలో ఇవి ఏర్పడితే మాత్రం  కడుపులో పెరిగే బిడ్డకు పెద్ద హాని ఎదురైనట్టే అంటున్నారు వైద్యులు.  నోటిలోపలా, పెదవుల మీద ఇలా బొబ్బలు, పొక్కులు రావడానికి థ్రష్ హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ ప్రధాన కారణం. ఈ వైరస్  లాలాజలం లేదా జననేంద్రియాలను తాకడం ద్వారా వ్యాపిస్తుంది.  ఒక్కసారి ఈ వైరస్ మనిషిని చేరిందంటే ఇక జీవితాంతం శరీరంలో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణం అనుకునే ఈ బొబ్బలు పొక్కుల వెనుక ఉన్న ఇంత ప్రమాదకర పరిస్థితి గురించి, ఇది కడుపులో ఉన్న బిడ్డకు కలిగించే నష్టం గురించి తెలుసుకుంటే.. HSV, HSV 1 అనే వైరస్ లు సాధారణంగా ముఖం, పెదవులపై, మరికొన్ని సార్లు జననేంద్రియాలపై బొబ్బలు కలిగిస్తాయి. మహిళలలో, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి బొబ్బలు వచ్చినట్టైతే గర్భాధారణం సమయంలో కూడా ఇది ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపులో బిడ్డపై ప్రభావం చూపుతుందా అంటే అసౌకర్యానికి మాత్రం ఖచ్చితంగా గురిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. నార్మల్ డెలివరీ సమయంలో మహిళలకు ఈ ఇన్ఫెక్షన్ ఉంటే అది బిడ్డకు చేరుతుందని అంటున్నారు. అప్పుడే పుట్టిన పిల్లలలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఈ వైరస్ పిల్లలకు ప్రమాదాన్ని తలపెడుతుంది. వైద్యుడిని ఎప్పుడు కలవాలి.. ఈ హెచ్ఎస్వి వైరస్ ఉంటే అది కూడా గర్బం మోస్తున్న సమయంలో ఈ వైరస్ యాక్టివ్ గా ఉంటే వెంటనే డాక్టర్ ను కలవాలి.  లక్షణాల ఆధారంగా డాక్టర్ చికిత్స చేస్తారు. వీటి నివారణకు క్రీమ్స్, యాంటీ వైరల్ క్రీమ్స్, ప్రిస్కిప్షన్ మెడిసిన్స్ ఇస్తారు. వీటిని వాడటం వల్ల వైరస్ ప్రభావాన్ని స్థంభింపజేయవచ్చు. అయితే డెలివరీ తరువాత ఈ యాంటీ వైరల్ మందులను వైద్యుల సలహా లేకుండా వాడకూడదు. ఇవి పిల్లలకు ప్రమాదం కలిగిస్తాయి. తల్లులలో ఉన్న హెచ్ఎస్వి వైరస్ పిల్లలకు కూడా సోకితే వీలైనంత త్వరగా వైద్యుడిని కలవాలి.  ముఖ్యంగా పిల్లలలో జ్వరం, నోటి పూతలు, పెదవుల మీద బొబ్బలు, నోట్లో పొక్కులు వంటి సమస్యలు కనిపిస్తే అసలు ఆలస్యం చేయకూడదు. చాలా చిన్నపిల్లలలో సహజంగానే పోషకాహార లోపం ఉంటుంది. తల్లులు దాన్ని సమర్థవంతగా భర్తీ చేస్తుంటేనే వారు అన్ని ఇన్ఫెక్షన్లను జయించి ఆరోగ్యంగా ఎదుగుతారు.                                                              *నిశ్శబ్ద.  

కొందరికి పొట్ట తగ్గడం పెద్ద సమస్యగా మారుతుంది. బెల్లీ ఫ్యాట్ అనేక కారణాల వల్ల కలుగుతుంది. ఈ సమస్యను ఒక్కసారిగా అదుపు చేయడం కష్టం. ఆహారాలలో కొన్ని మీరు బరువు తగ్గడానికి, బొడ్డు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు.   మనం తీసుకునే అల్పాహారం కొవ్వును అదుపులో ఉంచుతుందని చెబుతున్నారు. బ్రేక్ ఫాస్టులో ఎలాంటి ఆహారం తీసుకుంటే పొట్ట తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అల్పాహారంలో ప్రోటీన్ ప్రాముఖ్యత: కేలరీలు, చక్కెర, శుద్ధి చేసిన పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు మీ ఆరోగ్యానికి హానికలిగిస్తాయి. తక్కువ కేలరీలు, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. అదనంగా, మీరు మీ భోజనం తినే విధానం కూడా చాలా ముఖ్యమైనది. మీ ఉదయం అల్పాహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూడాలని పోషకనిపుణులు చెబుతున్నారు. ఇది పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆకలిని అణచివేస్తుంది: ప్రోటీన్ ఆకలిని అణిచివేస్తుంది. తరచుగా తినాలనే కోరికను తగ్గిస్తుంది. ప్రోటీన్ అధికంగా ఉండే భోజనం జీవక్రియను పెంచుతుంది. మీ కడుపును నిండుగా ఉంచుతుంది. ఇది పొట్టలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.  దీనికి విరుద్ధంగా, అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్న భోజనం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఇన్సులిన్ విడుదలను ప్రేరేపిస్తుంది.  కొవ్వు నిల్వకు దారితీస్తుంది. కాబట్టి, మన అల్పాహారాన్ని "ప్రోటీన్"గా మార్చుకునే ప్రయత్నం చేయాలి. ప్రోటీన్ కంటెంట్‌ను పెంచే సాధారణ బ్రేక్‌ఫాస్ట్‌లు: పోహా: పోహాలో 7 నుండి 8 వేరుశెనగ లేదా బఠానీలను జోడించండి. ఉప్పిట్టు: ఈ ఆరోగ్యకరమైన వంటకంలో బీన్స్ , 7 నుండి 8 వేరుశెనగలను వేయండి. పరాఠాలు: పరాఠాలు చేయడానికి గోధుమ పిండి, చిక్‌పా పిండిని ఉపయోగించండి. సగ్గుబియ్యానికి చిక్‌పీస్, పనీర్ లేదా బఠానీలను జోడించండి. దోస/ఇడ్లీ: త్వరిత, రుచికరమైన ప్రోటీన్ బూస్ట్ కోసం మీ దోస లేదా ఇడ్లీని వేరుశెనగ చట్నీతో జత చేయండి. వేరుశెనగ, బఠానీలు, పనీర్, చిక్‌పీస్‌తో సహా ఈ పదార్ధాలలో ప్రతి ఒక్కటి శాఖాహార ప్రోటీన్ యొక్క మంచి మూలాలు. వాటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వేరుశెనగలో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అరటిపండు: అరటిపండ్లలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి కానీ కేలరీలు తక్కువగా ఉంటాయి. అరటిపండ్లు చక్కెరతో కూడిన అల్పాహార తృణధాన్యాలకు గొప్ప ప్రత్యామ్నాయం.  ఇవి ఉదయం మీ తీపి కోరికలను తీర్చగలవు. పండ్లు,  కూరగాయల నుండి ఫైబర్ తీసుకోవడం బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. అధికబరువు, బెల్లిఫ్యాట్ తో బాధపడుతున్నవారు ఉదయం అల్పాహారంలో పైన పేర్కొన్న ఆహారాలను చేర్చినట్లయితే..కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవచ్చు.

పీసీఓఎస్ సమస్యా? మీ డైట్లో ఈ ఫుడ్స్ చేర్చుకోండి..!! పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్.. దీనిని సాధారణంగా పీసీఓఎస్ అని కూడా పిలుస్తారు. ఇది మహిళల్లో సంభవించే తీవ్రమైన సమస్య. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా పునరుత్పత్తి వయస్సు గల స్త్రీలలో 8-13% మంది పీసీఓఎస్ బారిన పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో, ఈ సమస్య గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో పీసీఓఎస్ అవగాహన మాసాన్ని జరుపుకుంటారు. ఈ క్రమంలో, ఈ రోజు ఈ కథనంలో  పీసీఓఎస్ సమయంలో నివారించాల్సిన  కొన్ని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. చక్కెర ఆహారాలు, పానీయాలు: ఎక్కువ చక్కెర తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది.  ఇది పీసీఓఎస్ ఉన్న మహిళల్లో సాధారణం. అటువంటి పరిస్థితిలో..ఈ సమస్యతో బాధపడుతుంటే... తీపి స్నాక్స్, సోడా, చక్కెర పానీయాల అధిక వినియోగం మానుకోవాలి. రిఫైండ్ కార్బోహైడ్రేట్లు: వైట్ బ్రెడ్, వైట్ రైస్, పాస్తా వంటి శుద్ధి చేసిన ధాన్యాల నుండి తయారైన ఆహార పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. అటువంటి పరిస్థితిలో, ఈ ఆహార పదార్థాలకు బదులుగా, తృణధాన్యాలు ఎంచుకోండి. ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి. అధిక గ్లైసెమిక్  కలిగిన ఆహారాలు: అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. ఇన్సులిన్ నిరోధకతను మరింత దిగజార్చవచ్చు. అటువంటి పరిస్థితిలో, పిసిఒఎస్ ఉన్న మహిళలు తెల్ల బంగాళాదుంపలు, కార్న్‌ఫ్లేక్స్, చక్కెర తృణధాన్యాలు వంటి అధిక గ్లైసెమిక్ సూచిక కలిగిన ఆహారాలకు దూరంగా ఉండాలి. పాల ఉత్పత్తులు: పీసీఓఎస్ ఉన్న కొందరు మహిళలు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.  ఇది హార్మోన్ల అసమతుల్యతను మరింత తీవ్రతరం చేస్తుంది. ఈ సందర్భంలో, మీరు పాల ఉత్పత్తులకు బదులుగా బాదం లేదా సోయా మిల్క్ తీసుకోవడం మంచిది. వేయించిన ఆహార పదార్థాలు: వేయించిన ఆహార పదార్థాలలో తరచుగా అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి మంట, బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. ఇది పీసీఓఎస్ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. రెడ్ మీట్: మీరు పీసీఓఎస్ తో బాధపడుతున్నట్లయితే...రెడ్ మీట్‌కు దూరంగా ఉండటం మంచిది.  ప్రాసెస్ చేసిన కొవ్వు మాంసాలు వాపు, ఇన్సులిన్ నిరోధకతను పెంచుతాయి. అటువంటి పరిస్థితిలో, రెడ్ మీట్‌కు బదులుగా, మీరు పౌల్ట్రీ, చేపలు లేదా మొక్కల ఆధారిత వంటి లీన్ ప్రోటీన్ ఎంపికను ఎంచుకోవచ్చు.

గర్బధారణ సమయంలో ఎలా కూర్చోవాలి...   గర్భధారణ సమయంలో సరిగ్గా కూర్చోవడం, నిలబడటం చాలా ముఖ్యం. అన్నింటికంటే..గర్భిణీలు ఏ భంగిమల్లో కూర్చోవడం ఉత్తమం? పూర్తి సమాచారం తెలుసుకుందాం.   గర్భం చాలా సున్నితమైనది.  ఈ సమయంలో ఎలా కూర్చోవాలి? వంగడం మంచిదేనా? ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి..ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు. ఈ సమయంలో వెన్ను, మెడ, భుజాలలో నొప్పి కనిపించే అవకాశం ఉంటుంది. ఇది వారి కూర్చున్న భంగిమపై ఆధారపడి ఉంటుంది. గర్భధారణ సమయంలో శరీర బరువు పెరుగుతుంది. కాబట్టి సరైన భంగిమలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. స్లూచింగ్ మీ బిడ్డను ప్రభావితం చేస్తుంది.   సరిగ్గా కూర్చోవడం ముఖ్యం: గర్భధారణ సమయంలో  స్త్రీ అనుసరించే మంచి భంగిమ ఆమెను ఆరోగ్యంగా ఉంచుతుంది. తప్పు భంగిమ అసౌకర్యం, నొప్పిని కలిగిస్తుంది. అలాగే, ఇది శిశువుకు హాని కలిగించే ప్రమాదం ఉంటుంది. గర్భం  చివరి దశలలో, హార్మోన్లు కీళ్ళలోని స్నాయువులు, మృదువుగా చేయడం ప్రారంభించినప్పుడు ఈ నొప్పి తీవ్రమవుతుంది. సరైన  భంగిమ ఏమిటి? గర్భిణీలు వారి వెన్నెముకపై ఒత్తిడిని తగ్గించడానికి, అసౌకర్యాన్ని తగ్గించడానికి గర్భధారణ సమయంలో సరైన భంగిమను అభ్యసిస్తారు. ఉదాహరణకు, కూర్చున్నప్పుడు లేదా వెనుకకు వంగి ఉన్నప్పుడు  వీపును నిటారుగా ఉంచండం మంచిది. గర్భిణీలకు నేలపై కూర్చోవడం సరైన భంగిమగా సూచిస్తుంది. ప్రసవానికి ఇది చాలా మంచి భంగిమ అని పెద్దలు అంటుంటారు. మీరు కుర్చీపై కూర్చోవడం అలవాటు చేసుకున్నట్లయితే, మీ వెనుకభాగంలో ఒక మృదువైన దిండు ఉంచుకోవడం మంచిది. ఎక్కువ సేపు కూర్చోవద్దు: గర్భిణీలు ఎక్కువసేపు కూర్చుంటే రక్తప్రసరణ దెబ్బతింటుంది. దీనివల్ల కాళ్లు నొప్పులు వస్తాయి. దీన్ని నివారించడానికి సాధారణ ఫుట్ వ్యాయామం చేయండి. ఆఫీసులో చాలా గంటలు కూర్చుని పని చేయాల్సి వస్తుంది. మీకు సమయం దొరికినప్పుడు కొన్ని నిమిషాలు నిలబడి నడవడం గుర్తుంచుకోండి. అలాంటి భంగిమ ప్రమాదకరం: బ్యాక్ సపోర్టు లేకుండా బీన్ బ్యాగులపై కూర్చోవద్దు. విచక్షణారహితంగా వంగడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. కూర్చోవడం మంచిది కానీ రోజంతా అలా కూర్చోని ఉండటం మంచిది కాదు. ఇది పేలవమైన ప్రసరణకు దారితీస్తుంది, చీలమండలలో వాపు, అనారోగ్య సిరలకు కారణం అవుతుంది. సరైన నిలబడే భంగిమ: కూర్చునే భంగిమ ఎంత ముఖ్యమో నిలబడే భంగిమ కూడా అంతే ముఖ్యం. మీ పాదాలను ఒకే దిశలో ఉంచండి. రెండు పాదాలపై బరువును సమానంగా ఉంచండి. అలాగే, మీరు ధరించే చెప్పులు లేదా బూట్లు సరిపోతాయా? అని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం.  

బరువు తగ్గి మళ్ళీ పెరుగుతున్నారా? అయితే మీరు చేస్తున్న పొరపాట్లు ఇవే..   బరువు తగ్గడం అనేది అతి పెద్ద కష్టాలలో ఒకటి అని మీరు అంగీకరిస్తారు. ఒక పరిశోధన అంచనా ప్రకారం బరువు తగ్గిన వారిలో 80% మంది ఒక సంవత్సరంలోపు బరువును తిరిగి పొందుతారు.  ఎప్పుడైనా బరువు తగ్గి మళ్ళీ  దాన్ని తిరిగి పొందినట్లయితే ఈ సమస్య గురించి  అంతో ఇంతో అనుభవం ఉండి ఉంటుంది. దీర్ఘకాల బరువు తగ్గడంలో 20% మంది వ్యక్తులు మాత్రమే విజయవంతమయ్యారని పరిశోధనలో తేలింది. బరువు తగ్గేవారు తమ బరువును ఎక్కువ కాలం ఎలా మెయింటైన్ చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి అది పెద్ద విషయం కాదు. కానీ అక్కడున్న పొరపాటల్లా తగ్గిన బరువు పెరగకుండా ఏం చెయ్యాలన్నదే.  కొన్ని సులభమైన మార్గాలను అనుసరించడం ద్వారా తగ్గిన  బరువును అలాగే మైంటైన్ చేయవచ్చు.  అవేంటో తెలుసుకుంటే.. మొదటిది, చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే,  ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం. తద్వారా  బరువును తగ్గించుకోవడం. బరువు తగ్గాలనే ఆలోచనతో ఆకలి వేస్తున్నా దాన్ని అణిచిపెట్టుకోవడం చాలా పెద్ద తప్పు.  అలా చేయడం వల్ల  శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. కాబ్టటి  ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునంటూ బరువు తగ్గితే అది  దీర్ఘకాలం నిలిచి ఉంటుంది. బరువు తగ్గగానే ఇక సమస్య ఏమీ లేదులే అనుకుని నచ్చినట్టు తినడం చాలామంది చేసే తప్పు. మరీ ముఖ్యంగా బయటి ఆహారాలు, బేకరీ ఫుడ్స్ వంటివి రెచ్చిపోయి తింటుంటారు. కానీ ఇలా బరువు తగ్గడం మళ్ళీ ఇలాంటి ఆహారాలు తినడం శరీర వ్యవస్థను దారుణంగా దెబ్బతీస్తుంది. ముందున్న బరువు కంటే రెండింతల బరువు పెరిగే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఆహారం ద్వారా హార్మోన్లు అసమతుల్యానికి గురవుతాయి. బరువు తగ్గిన తరువాత మళ్ళీ పెరగకుండా ఉండాలంటే దానికి మంచి మార్గం బరువును ట్రాక్ చేయడం. ఇంట్లో ఒక వెయిట్ మిషన్ ఉంచుకోవాలి. ప్రతివారం బరువును చెక్ చేసుకోవాలి. దీన్ని బట్టి బరువు పెరుగుతూ ఉంటే ఆహారం నుండి విహారం వరకు ఏయే మార్పులు చేసుకోవాలో తమకు తాము అర్థం చేసుకోగలుగుతారు. చాలామంది బరువు తగ్గడానికి వ్యాయామంతో పాటు డైటింగ్ కూడా ఫాలో అయి ఉంటారు. ఇలా ఫాలో అయిన డైటింగ్ ను బరువు తగ్గగానే ఆపేయడం మంచిది కాదు. అప్పుడప్పుడు చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు కానీ పూర్తీగా ఆ డైటింగ్ ను వదిలేయడం అంటే తిరిగి బరువు పెరగడానికి మార్గం ఫిక్స్ చేసుకుంటున్నట్టు.  బరువు తగ్గామనే సంతోషంలో అధిక కేలరీలు కలిగిన ఆహారాన్ని ఇష్టానుసారం తినడం మంచిది కాదు. స్వీట్లు, నూనె పదార్థాలు, శుద్దిచేసిన ఆహారం, ప్యాక్డ్ ఫుడ్స్ మొదలైనవాటికి చాలా దూరం ఉండాలి. పైన చెప్పుకున్న టిప్స్ ఫాలో అయితే బరువు  తగ్గిన తరువాత పొరపాటున కూడా మళ్లీ పెరగడం అనే సమస్య ఉండదు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం   అప్పటివరకు కష్టపడి తగ్గిన బరువు అంతా కొండలా మళ్ళీ పెరగడం మొదలవుతుంది.                                                                     *నిశ్శబ్ద.  

జలుబు త్వరగా తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా? వర్షాకాలం వ్యాధులకు స్వాగతం పలుకుతుంది. ఈ కాలంలో చాలామందిని రకరకాల జబ్బులు, ఇన్ఫెక్షన్లు పలుకరిస్తుంటాయి. వర్షాకాలంలో బ్యాక్టిరియా, వైరల్ వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.  బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి ఇది అనుకూలమైన సీజన్. కాబట్టి ఈ బ్యాక్టీరియా, జెర్మ్స్ నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే వర్షాకాలంలో మన ఇమ్యూనిటీని పెంచుకోవడం చాలా ముఖ్యం. సీజనల్ వ్యాధులు రాకుండా పరిశుభ్రత పాటించాలి. జలుబుకు హోం రెమెడీ: చిన్నపాటి జలుబు, ఫ్లూ వచ్చినా చాలా మంది వైద్యుల వద్దకు వెళ్లడానికి ఇష్టపడరు. జలుబు విషయంలో డాక్టర్ దగ్గరకు వెళ్లే ముందు కొన్ని హోం రెమెడీస్ ప్రయత్నించవచ్చు. ఇది జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఆ హోం రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం. తులసి రసం: తులసి రసంలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వర్షాకాలంలో జలుబు, ఫ్లూని నయం చేయడంలో సహాయపడతాయి. దీన్ని తినడానికి, 8 నుండి 10 ఆకులను కడిగి, రసం తీయడానికి వాటిని చూర్ణం చేయండి. ఆ తర్వాత 1 చెంచా తేనె మిక్స్ చేసిన తర్వాత ఈ జ్యూస్ తాగండి. అల్లం: అల్లంలోని యాంటీ బ్యాక్టీరియల్,  యాంటీవైరల్ లక్షణాలు జలుబు, ఫ్లూ నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. అల్లం పాలలో వేసి మరిగించి తాగవచ్చు, లేకపోతే టీలో కూడా అల్లం వాడవచ్చు. లవంగాలు, తేనె: లవంగాలు, తేనె రెండూ శరీరానికి మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా, దాని ఉపయోగం శరీరాన్ని వేడి చేస్తుంది. వర్షాకాలంలో జలుబు, ఫ్లూతో బాధపడుతుంటే 1 నుంచి 2 లవంగాలను మెత్తగా నూరి 1 చెంచా తేనెలో కలుపుకుని తినండి. ఇలా 1 నుండి 2 రోజులు చేస్తే జలుబు,  ఫ్లూ అలాగే గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ఆవిరి: వర్షాకాలంలో కనిపించే జలుబు,జ్వరాన్ని నయం చేయడానికి వేడి నీటి ఆవిరిని తీసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల గొంతు, ఛాతీ ఇన్ఫెక్షన్లు నయమవుతాయి. బ్లాక్ చేయబడిన ముక్కును కూడా తెరుస్తుంది. మీకు కావాలంటే, మీరు ఆవిరి కోసం వేడి నీటిలో రెండు నుండి నాలుగు చుక్కల లవంగం నూనె లేదా టీ ట్రీ ఆయిల్ జోడించవచ్చు. మౌత్ గార్గ్లింగ్ : వర్షాకాలంలో జలుబు, దగ్గుతో పాటు దగ్గు, గొంతు ఇన్‌ఫెక్షన్‌ సమస్య సర్వసాధారణం. ఈ సమస్యను అధిగమించడానికి, గోరువెచ్చని నీటిలో 1 టేబుల్ స్పూన్ రాతి ఉప్పు కలపండి. ఈ నీటితో పుక్కిలించండి. గార్గ్లింగ్ 5 నిమిషాల పాటు రోజుకు 1 నుండి 2 సార్లు చేయాలి. ఈ నీటిలో యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి.  జలుబు, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి. 

 పెళ్ళైన మహిళల్లో నెలసరి స్కిప్ అయినా ప్రెగ్నెన్సీ రాకపోతే ఏమి జరుగుతుంది..   గర్భం దాల్చడం ప్రతి మహిళ జీవితంలో ఎంతో గొప్ప అనుభూతి. ఇషించల ప్రత్యేకమైన దశ కూడా. చాలామంది పెళ్ళైన మహిళలు నెలసరి స్కిప్ అవ్వగానే ఇక ప్రెగ్నెన్సీ వచ్చిందని అనుకుంటారు. కానీ ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు మాత్రం ఫలితం నెగిటివ్ గా వస్తుంది. అసలిలా ఎందుకు జరుగుతుంది?? పెళ్ళైన మహిళలలో నెలసరి మిస్సైనా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం ఏమిటి?? ఇలా నెలసరి మిస్సయ్యే మహిళలు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం ఎలా?  ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు?? మొదలైన విషయాలు వివరంగా తెలుసుకుంటే.. పెళ్ళైన తరువాత మహిళలు గర్భం ధరించారనడానికి  మొదటి సిగ్నల్ పీరియడ్స్ మిస్ అవ్వడమే. అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ లో కొందరికి నెగిటివ్ వస్తుంది. అప్పటిదాకా ప్రతినెలా సరైన ఋతుచక్రం కొనసాగిన మహిళల్లో అటు నెలసరి రాక, ఇటు గర్భం దాల్చక అయోమయానికి లోనవుతుంటారు. కనీసం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలా వద్దా?? అని సందిగ్ధ పడుతుంటారు.  మహిళలు ఏమాత్రం ఒత్తిడికి లోనైన వారి శరీరంలో హార్మోన్ల స్థాయిలు అసమతుల్యం అవుతాయి. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల ఋతుచక్ర సమస్యలు వస్తాయి.  మహిళలు చాలా ఒత్తిడికి లోనవుతున్నట్లయితే, దీర్ఘకాలిక ఆందోళన కలిగి ఉంటే లేదా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నట్లయితే, చికిత్స తీసుకోవాలి. ఒత్తిడిని నియంత్రించడానికి,  సమతుల్య ఆహారం, శారీరక శ్రమ  కూడా అవసరం అవుతుంది. దీంతో శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సాధారణంగా ప్రతినెలా అండాశయం నుంచి అండాలు విడుదల అవుతాయి. కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఈ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయి, ఇది అనోయులేషన్‌కు దారితీస్తుంది. అనోయులేషన్ అంటే అండాలు  విడుదల కాకపోవడం. దీని కారణంగా, పీరియడ్స్ మిస్ కావచ్చు లేదా ఆలస్యం కావచ్చు.  అంతేకాదు ఇది పిల్లలు పుట్టడంలో  సమస్యలకు కారణం కావచ్చు. PCOD, థైరాయిడ్,  బరువు తగ్గడం, పెరగడం అనోయులేషన్‌కు కారణం అవుతాయి.  గర్భనిరోధక మాత్రలు,  రక్తపోటు,  అలెర్జీ మందులు వంటి కొన్ని మందులు కూడా హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి, ఇది నెలసరి తప్పిపోవడానికి లేదా ఆలస్యం కావడానికి దారితీస్తుంది. ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నా ఋతు చక్రంలో ఆటంకం ఏర్పడవచ్చు. ఇలాంటి సందర్భాలలో, గర్భధారణ కోసం మహిళలు  ఆరోగ్యాన్ని  జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. దీర్ఘకాలిక వ్యాధులు, పోషకాహార లోపాలు,  హార్మోన్ల అసమతుల్యత కారణంగా బరువులో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ఇవి ఋతు చక్రం పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి.  ధ్యానం, యోగ, ప్రాణాయామం వంటివి చేయడం ద్వారా ఒత్తిడిని నియంత్రలోకి తీసుకురావచ్చు. రోజూ చురుగ్గా ఉండటం, ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోవడం, వీలైనంత వరకు అందరితో నవ్వుతూ మాట్లాడటం. ఇవన్నీ మహిళల నెలసరి తిరిగి సాధారణ స్థితిలోకి రావడానికి కారణం అవుతాయి.                                     *నిశ్శబ్ద.