Publish Date:Dec 30, 2015
Publish Date:Dec 24, 2015
Publish Date:Dec 21, 2015

LATEST NEWS
Growing unhappiness among the children is not news now. Increasing role of social media, pressure in education, too much competition, busy parents, meager human support are all the causes for such unhappiness. Delhi government seem to have heard enough of such unhappy children- It has introduced `Happiness curriculum’ in their schools from Nursery to VIII class. It would include lessons on issues such as meditation, morality and mental exercises. This Happiness Syllabus would be launched on July 2nd by none other than the Buddhist guru- Dalai Lama and the Delhi education minister Mr. Sisodia.
According to a probe by The Hindu, 450 villages were missing form Telangana. This means that these villages don’t appear in the books of the government. If you wonder what could be the reason, reorganisation of the villages is the answer. The Telangana government in 2016 has reorganised the state. It has increased the number of districts from 10 to 31. During such process many villages were either renamed or transferred to other districts. However such villages were not entered in the final government records. Steps have been taken to address this issue and more than 350 villages were identified by notifications. Still more than 70 villages are said to be missing!
Governor of Madhya Pradesh, Miss Anandiben was yet again in a controversy. After calling Narendra Modi a bachelor, she was now has a say about breastfeeding. ‘’Even now, women in cities believe that breastfeeding will spoil their figure. That is why they don’t breastfeed their children. They start bottle feeding their children," said Anandiben yesterday. She has even cursed that the fate of breast fed children would be the same of the bottle. Anandiben used to be the chief minister of Gujarat and she was sacked by the high command due to poor performance. Now as the governor of Madhya Pradesh, her performance might be once again a concern for the high command!
ALSO ON TELUGUONE N E W S
  It’s been almost two weeks since the second season of Bigg Boss show was aired on the TV. There isn’t any doubt that Bigg Boss 1 was a huge hit. The dynamism and spontaneity of Jr. NTR has given life to the show. So when the second season got kicked off, many began to suspect the ability of Nani to make the show a hit. Nani’s performance in the show began to receive mixed responses from the critics. There were even rumours that Nani would be removed as a host of the show. However Maa Tv has announced that Bigg Boss is gathering huge ratings. It has also revealed that almost 60 % of viewers in Telugu states has watched the show. So We have to be convinced that Bigg Boss – 2 is a hit!
  'బిగ్ బాస్' రియాలిటీ షోతో బుల్లితెరపై ఎన్టీఆర్ చేసిన సందడి అంతాఇంతా కాదు.. ఎన్టీఆర్ అల్లరికి, టైమింగ్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.. ఎన్టీఆర్ మళ్ళీ బుల్లితెరపై ఎప్పుడు కనిపిస్తాడా అని ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.. ఎన్టీఆర్ త్వరలో మళ్ళీ బుల్లితెరపై సందడి చేయబోతున్నాడు.. అయితే మీరు ఊహించినట్టు హోస్ట్ గా కాదు, గెస్ట్ గా.. ఈటీవీలో ఢీ-10 డాన్స్ షో  గ్రాండ్ ఫినాలేకి ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా వస్తున్నాడు.. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి అయిపోయినట్టు తెలుస్తుంది.. అంటే త్వరలో ఎన్టీఆర్ బుల్లితెర మీద మళ్ళీ సందడి చేయబోతున్నాడన్నమాట.  
ఆడియన్స్ లో పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి రెండు సినిమాలు జల్సా, అత్తారింటికి దారేది ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి.. తరువాత వీరిద్దరూ కలిసి కోబలి అనే సినిమా చేయాలనుకున్నారు.. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా 'అజ్ఞాతవాసి' చేసారు.. తరువాత పవన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్ళాడు.. అయితే పవన్ 2019 ఎన్నికల తరువాత రాజకీయాల్లో ఉంటూనే, సినిమాలు కూడా చేస్తాడట.. బ్రేక్ తరువాత పవన్ చేసే మొదటి సినిమా త్రివిక్రమ్ తోనే ఉంటుందట.. అది కూడా కోబలి అని తెలుస్తుంది.. దీన్ని బట్టి చూస్తుంటే 2020 లో పవన్, త్రివిక్రమ్ ల కోబలి సినిమా వచ్చే అవకాశం ఉందన్నమాట. Trivikram pawan Kalyan next movie Kobali,Pawan Kalyan Trivikram Kobali Movie Confirmed,Pawan Trivikram New Movie Kobali,Trivikram to direct Pawan Kalyan Kobali
  నేచురల్ స్టార్ నాని, ప్రస్తుతం శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ, అలానే ‘మళ్లీ రావా’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ అనే మూవీ చేస్తున్నాడు.. మరోవైపు బిగ్ బాస్-2 హోస్ట్ గా బుల్లితెర మీద సందడి చేస్తున్నాడు.. అయితే ఇప్పుడు నాని మరో మూవీ ఓకే చేసాడట.. దిల్ రాజు నిర్మాణంలో, ఒక కొత్త దర్శకుడు ఈ మూవీ ద్వారా పరిచయం అవబోతున్నట్టు తెలుస్తుంది.. అలానే ఈ మూవీకి 'సభకు నమస్కారం' అనే టైటిల్ పరిశీలనలో ఉందట..ఇప్పటికే నాని, దిల్ రాజు కలయికలో వచ్చిన 'నేను లోకల్‌’ ‘ఎంసిఎ’ సినిమాలు కమర్షియల్‌ విజయాలు సాధించాయి.. మరి 'సభకు నమస్కారం'తో హ్యాట్రిక్ విజయం సాదిస్తారేమో చూడాలి.  
ఎవరన్నా సెలబ్రెటీని చూస్తే.. ‘అబ్బా! ఈ వయసులో కూడా ఎంత అందంగా, ఆరోగ్యంగా ఉన్నారో!’ అనిపిస్తుంది కదా. వాళ్ల దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, రకరకాల ఆపరేషన్లు చేయించుకుని అలా తయారయ్యారు అనుకుంటాం కదా. కానీ యోగా చేస్తే చాలు ఎలాంటివారికైనా అందం, ఆరోగ్యం సొంతమేనని నిరూపిస్తున్నారు చాలామంది సెలట్రెటీలు. వాళ్లెవరో మీరే చూడండి! శిల్పాషెట్టి బాలీవుడ్‌ హీరోయిన్లు యోగా నేర్చుకోవడం కొత్తేమీ కాదు. కానీ దానికి మొట్టమొదటిసారిగా సెలబ్రెటీ స్టేటస్ తెచ్చింది మాత్రం శిల్పాషెట్టీనే. ఒకసారి ఏదో మెడనొప్పి తగ్గడం కోసం శిల్ప యోగా మొదలుపెట్టారు. అంతే! ఇక దాని మాయలో మైమరచిపోయారు. ఇప్పుడ శిల్పా, యోగాలో ఎంత కష్టమైన ఆసనమైనా చిటికెలో వేసేస్తారు. అంతేకాదు! తను నేర్చుకున్న ఆసనాలను పదిమందికీ నేర్పించేందుకు, డీవీడీలు కూడా రిలీజ్‌ చేశారు. ఏళ్లు గడిచినా తరగని తన అందానికి కారణం యోగానే అంటారు శిల్ప. కరీనాకపూర్‌ బాలీవుడ్‌లో ఓ ఎవర్‌గ్రీన్‌ సెన్సేషన్ కరీనా. ఒకప్పుడు కరీనా సైజ్‌ జీరోకి కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు. ఆ క్రెడిట్‌ అంతా కూడా యోగాదేనట. ఎంత బిజీ షెడ్యూల్‌ ఉన్నా కూడా రోజూ ఉదయం కనీసం రెండు గంటలు యోగా చేస్తుందట కరీనా. పండంటి బాబుకి జన్మనిచ్చిన తర్వాత కూడా, తిరిగి తన ఫిజిక్‌ని సొంతం చేసుకోగలిగిందంటే దానికి యోగానే కారణం అంటారు. మలైకా అరోరా ఆడవాళ్లు వయసు చెప్పకూడదని అంటారు కానీ, మలైకా వయసు అక్షరాలా 44 ఏళ్లు. ఇంత వయసులోనూ ఆమె అందాన్ని చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతుంటారు. మరి దీనికి కారణం ఈపాటికే ఊహిచేసి ఉంటారుగా. యోగానేనండీ! రోజూ రెండేసి గంటలు పవర్ యోగా చేయడం వల్ల తన వయసు మీద అదుపు సాధించేసింది మలైకా! అందుకే ఇప్పటికీ ఐటం సాంగ్‌ చేయాలంటే మలైకా తర్వాతే ఎవరైనా. లారాదత్తా శిల్పాషెట్టిలాగే లారాదత్తా కూడా యోగాకి మంచి పాపులారటీ తీసుకువచ్చింది. ఒకమాటలో చెప్పాలంటే ఇప్పుడు లారా వృత్తి యోగా నేర్పించడమే! ఇందుకోసం Heal with Lara పేరుతొ ఒక యూట్యూబ్‌ ఛానల్‌ కూడా ఓపెన్‌ చేశారు. గర్భవతిగా ఉన్నప్పుడు కూడా యోగా ఎలా చేయవచ్చో చూపిస్తూ ఆమె చేసిన Parental Yoga ఒక సెన్సేషన్‌. మగవాళ్లు కూడా! హీరోయిన్స్ సరే! మరి మగవాళ్లకి ఆరోగ్యం అవసరం లేదా? దాని కోసం యోగా చేయక్కర్లేదా? అంటే లేకేం... అందుకు బెస్ట్‌ ఎగ్జాంపుల్ విరాట్‌ కోహ్లీనే. ఇండియాలాంటి టీమ్‌కి కేప్టెన్‌గా ఉండటం అంటే ఎంత ఒత్తిడితో కూడుకున్న పనో చెప్పేదేముంది. అలాంటి ఒత్తిడిని ఎదుర్కొనేందుకు, కాన్ఫిడెంట్‌గా ఉండేందుకు యోగా చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నాడు కోహ్లీ! ఇక అక్షయ్‌కుమార్‌, అనిల్‌కపూర్‌లాంటి హీరోలు కూడా తమ ఆరోగ్యానికీ, ప్రశాంతతకూ యోగానే కారణం అని చెబుతుంటారు. హాలీవుడ్‌లో సైతం యోగా వల్లే తమ శరీరం ఫిట్‌గా ఉందనేవాళ్లు హాలీవుడ్‌లో కూడా కనిపిస్తారు. 60 ఏళ్లలో కూడా యవ్వనంగానే కనిపించే మడోనా; ప్రపంచంలోని అందగత్తెలలో ఒకరిగా పేరుతెచ్చుకున్న జెన్నిఫర్ అనిస్టెన్‌లాంటి హాలీవుడ్‌ తారలు యోగా అంటే మైమరచిపోతారు. మరెందుకాలస్యం. మనం కూడా ఓ నాలుగు ఆసనాలు నేర్చేసుకుని young and fit గా ఉందామా!!! - నిర్జర.  
  యోగా చేయాలని ఎవరికి మాత్రం ఉండదు. టకటకా యోగాసనాలు వేసేసి అందాన్నీ, ఆరోగ్యాన్నీ, మానసిక ప్రశాంతతనీ పొందాలని ఎవరికి అనిపించదు. కానీ యోగా చేయడం ఎలా? అన్న ప్రశ్న దగ్గరే అందరూ ఆగిపోతూ ఉంటారు. కష్టమైన ఆసనాలు వేయడానికి ఎవరో ఒక గురువు దగ్గరకి వెళ్లడం తప్పనిసరే! కానీ అంతవరకు కొన్ని తేలికైనా ఆసనాలు వేసి కావల్సినంత ఆరోగ్యాన్ని పొందవచ్చునంటున్నారు. ఆ ఆసనాలు ఏంటో మీరే చూడండి... వృక్షాసనం ఈ ఆసనంలో ముందుగా రెండు చేతులనీ నమస్కార భంగిమలో పైకి ఎత్తండి. మీ వెన్ను నిటారుగా ఉండేటా గమనిస్తూ, మీ కుడిపాదాన్ని, ఎడమ మోకాలి పైన ఉంచండి. ఇలా చేసే సమయంలో ఊపిరిని లోపలకి పీలుస్తూ ఉండాలి. ఆ తర్వాత ఊపిరిని నిదానంగా వదులుతూ, కాలుని కిందకి దించండి. ఇదే పద్ధతిలో మీ రెండో కాలుని కూడా వృక్షాసనంలో నిలపండి. త్రికోణాసనం ఇది మనం స్కూల్స్‌లో చూసే ఎక్సర్‌సైజ్‌లాగానే ఉంటుంది. దీనికోసం మీ రెండు కాళ్లనూ కాస్త వెడంగా ఉంచాలి. మీ శరీర బరువు మొత్తం మీ రెండు కాళ్ల మీదా సమానంగా ఉండేలా గమనించుకోవాలి. ముందు మీ కుడి చేతిని నేలమీద నిటారుగా తాకించాలి. ఆ సమయంలో మీ చూపు, ఎడమచేయి ఆకాశం వైపు నేరుగా చూస్తుంటాయి. ఆ తర్వాత ఇదే పద్ధతిని ఎడమచేతితోనూ కొనసాగించాలి. తాడాసనం ఈ ఆసనంలో ముందుగా రెండు అరచేతులూ బయటకు కనిపించేలా పెనవేయాలి. ఆపై వాటిని నిదానంగా తలమీదకు తీసుకువెళ్లాలి. చేతులని పైకి ఉంచాక, మునివేళ్లతో కాళ్లని పైకి ఎత్తాలి. ఈ ఆసనం వేసేటప్పుడు వెన్ను, కాళ్లు నిటారుగా ఉండాలి; ఏకాగ్రత తొడ కండరాల మీద ఉండాలి; చూపు కూడా నేరుగా ఉంచాలి. నౌకాసనం ఒక పడవలాంటి ఆకారంలో ఉండటమే ఈ నౌకాసనం. దీనికోసం నేల మీద వెల్లికిలా పడుకోవాలి. ఆపై నిదానంగా ఇటు చేతులనీ, అటు కాళ్లనీ కూడా కాస్త దగ్గరకి తీసుకురావాలి. అంటే మీ నడుము బేస్‌గా చేసుకుని, శరీరం ఒక V షేప్‌లోకి రావాలన్నమాట. పొట్ట కరగాలన్నా, డైజషన్‌కి సంబంధించిన సమస్యలు తీరిపోవాలన్నా, ఆడవాళ్లకి సంబంధించిన ఇబ్బందులు పోవాలన్నా... ఈ నౌకాసనం గొప్ప ప్రభావం చూపుతుంది. భుజంగాసనం ఇది నౌకాసనానికి పూర్తిగా వ్యతిరేకం అనుకోవచ్చు. ఇందులో బొక్కబోర్లా నేల మీద పడుకుని, తల నుంచి నడుము వరకు వీలైనంతవరకు పైకి ఎత్తే ప్రయత్నం చేయాలి. ఈ ఆసనం వల్ల ఛాతీకి, పొట్టకి సంబంధించి ఎలాంటి సమస్యలైనా ఇట్టే తీరిపోతాయి. వెన్నెముకకి మంచి flexibility వస్తుంది. యోగా చేసే ఓపిక, సంకల్పం ఉండాలే కానీ... ఇలాంటి తేలికైనా ఆసనాలు చాలానే కనిపిస్తాయి. మరెందుకాలస్యం... యోగా మన వల్ల కాని పని అన్న నమ్మకాన్ని పక్కన పెట్టేసి, ముందు ఇలాంటి చిన్నచిన్న ఆసనాలతో మీకు కావల్సినంత ఆరోగ్యాన్ని సంపాదించేయండి.   International Yoga Day 2018 Special Videos
అంతా ఊహించినట్లే జరిగింది. కశ్మీర్‌లో మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీ ముందుకు రాకపోవడంతో గవర్నరు పాలననే కొనసాగించనున్నారు. ఇంతకీ బీజేపీ అకస్మాత్తుగా ప్రభుత్వాన్ని ఎందుకు కూలదోసింది. దాని వల్ల ఎవరికి లాభం అన్న ప్రశ్నలు చాలా ఆసక్తికరమైన జవాబులకి దారితీస్తున్నాయి. నిజానికి పీడీపీ, బీజేపీ పార్టీలు ఉప్పునిప్పులాంటి సిద్ధాంతాలతో నడుస్తున్నాయి. పీడీపీ వేర్పాటువాదం పట్ల కాస్త సానుకూలంగా ఉంటే, బీజేపీ పూర్తిగా జాతీయవాదం వైపే మొగ్గుచూపుతుంటుంది. కానీ 2014లో ఎన్నికలు జరిగిన తర్వాత అధికారం కోసం ఆ రెండు పార్టీలు కలవక తప్పలేదు. అధికారం కోసం సిద్ధాంతాన్ని పక్కనపెట్టేశాయి. ఫలితం! దాదాపు 30 ఏళ్ల తర్వాత ఆ రాష్ట్రంలో ఓ సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. సహజంగానే పీడీపీ, బీజేపీల మధ్య ఈ మూడేళ్లలో ఏవో ఒక విబేధాలు పొడచూపుతూనే వచ్చాయి. కానీ ఇరు పార్టీలు కాస్త ఓర్చుకున్నాయి. అయితే కటువా ఉదంతంతో రెండు పార్టీల మధ్యా దూరం ఒక్కసారిగా పెరిగిపోయింది. కటువాలో ఓ ముస్లిం బాలిక మీద అత్యాచారం జరిగింది. దానికి దేశవ్యాప్తంగా నిరసనలు తలెత్తుతుంటే, కశ్మీర్‌ ప్రభుత్వంలోని బీజేపీ మంత్రులు మాత్రం నిందితుల పక్షాన ర్యాలీ నిర్వహించారు. వాళ్ల పట్ల ముఖ్యమంత్రి కటువుతో ప్రవర్తించడంతో, బీజేపీ మొహం ఎర్రబడింది. ఇహ ఇంచుమించుగా అప్పటినుంచే బయటకి రావడం కోసం కాచుకుని కూర్చుంది. రంజాన్‌ సందర్భంలో ముఖ్యమంత్రి కశ్మీర్‌లోయలో కాల్పుల విరమణను ప్రకటించారు. దీని వల్ల శాంతి నెలకొనలేదు సరికదా... ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. రైజింగ్‌ కశ్మీర్‌ పత్రిక ఎడిటర్ బుఖారీని, ఔరంగజేబు అనే సైనికుడినీ కాల్చి చంపారు. ఈ సంఘటనలని బీజేపీ గొప్ప అవకాశంగా భావించింది. ముఫ్తీ సర్కారులో శాంతిభద్రతలు విఫలం అయ్యాయని ఆరోపిస్తూ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసింది. దీని వల్ల రెండు ప్రయోజనాలు సాదించింది. ఒకటి- ప్రభుత్వం నుంచి బయటకి వచ్చేసి, తను చెప్పినట్లు సాగే గవర్నరు పాలనని విదించడం; రెండు- కశ్మీరులో అశాంతికి కారణం ముఫ్తీ వైఫల్యమే అని ఆరోపించడం. కశ్మీరు ప్రభుత్వం నుంచి బయటకు రావడం వచ్చేందుకు బీజేపీ మనసులో మరో ఎత్తుగడ కూడా ఉందని భావిస్తున్నారు. సర్జికల్‌ స్ట్రైక్స్ తర్వాత ఒక్కసారిగా వెలిగిన మోదీ ప్రభ ఇప్పుడు కొడిగడుతోంది. దాన్ని మళ్లీ ఎగదోయాలంటే ఉగ్రవాదుల మీదో, పాకిస్థాన్‌ మీదో దాడులు చేసి... దేశభక్తిని రాజేయాలి. ఇలాంటి చర్యలకు ముఫ్తీ అడ్డు తగుల్తుంది కాబట్టి తనకు అనుకూలమైన గవర్నరు పాలనని విధించాలి. ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం ఉంది కాబట్టి, ‘ఉగ్రవాదుల అణచివేత’ కార్యక్రమాన్ని ప్రశాంతంగా సాగించవచ్చు. వాటిని ఓట్ల రూపంలోకి మార్చుకోనూవచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో ముఫ్తీ బలిపశువుగా కనిపించవచ్చు. కానీ అధికారం కోసం తనకు విరుద్ధమైన బీజేపీతో చేతులు కలిపి ఆ పార్టీ భస్మాసుర హస్తాన్నే వరించింది. అందుకని ఇప్పుడు ప్రజలకు కానీ విపక్షాలకు కానీ ఆమె మీద పెద్దగా జాలి కూడా లేదు. పీడీపీని శుభ్రంగా వాడేసుకున్న బీజేపీ... తాను ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నానని కూడా ఆమెకి చెప్పలేదంటే, అక్కడ సంకీర్ణాల సంస్కారం ఎంత ఉన్నతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పార్టీలన్నింటి మధ్యా కశ్మీర్‌ పౌరుడి బతుకు ఎలా ఉంటుందా అని అడక్కండి! అలాంటి విషయాల గురించి ఆలోచించేదెవరు.
  భారతదేశంలో తెలుగు పరిశ్రమ ప్రత్యేకత గురించి మళ్లీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ అదేంటో, ఎన్ని వందల సినిమాలు తీసినా తెలుగు చిత్రాన్ని ‘సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌’గానే చూసేవారు. తమిళ, మలయాళ సినిమాలకి ఉన్నంత గుర్తింపు తెలుగు చిత్రాలకి వచ్చేది కాదు. బాహుబలి పుణ్యమా అని ఒక్కసారిగా టాలీవుడ్‌ వైపు దేశం చూపు తిప్పింది. జక్కన్న ప్రతిభ ప్రపంచాన్నే తలతిప్పేలా చేసింది. మరి ఆ దిష్టి తగిలిందో ఏమో కానీ... గత కొద్ది నెలలుగా టాలీవుడ్‌ లేనిపోని అపవాదులతో తలంటుకుంటోంది. ముందు శ్రీరెడ్డి రూపంలో తెలుగు పరిశ్రమకి భారీ షాక్‌ తగిలింది. నిజమో, అబద్ధమో... తెలుగునాట క్యాస్టింగ్ కౌచ్‌ ఉందంటూ శ్రీరెడ్డి చిన్నచిన్న ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టింది. అవకాశాలిస్తామని తనని వాడుకున్నారంటూ దుమ్మెత్తిపోసింది. తాను మోసపోయానన్న భావనలో ఉన్న శ్రీరెడ్డి ఎలాగైనా పరిశ్రమ మీద పగ తీర్చుకోవాలనే తలపుతో ఉన్నట్లు అర్థమైపోయింది. ఇలాంటి సమయంలో పరిశ్రమ పెద్దలు ఎవ్వరూ ఆమె మాటల్ని పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. పైగా ఇలాంటివి అసలు జరగనేలేదంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించడం మానేసి... ఆమెతో నటించేవాళ్లని సైతం వెలి వేస్తాం అంటూ ఓ చిత్రమైన నిబంధన పెట్టారు. శ్రీరెడ్డి నడిరోడ్డు మీద నగ్నంగా నిలబడేందుకు, ఈ నిర్ణయం ఎగదోసినట్లయ్యింది. శ్రీరెడ్డి చర్యతో ఏకంగా టాలీవుడ్ పరువే నగ్నంగా నిలబడిపోయింది. న్యూస్‌ కోసం నోరు తెరుచుకుని ఉండే మీడియాకు శ్రీరెడ్డి వార్త విందు భోజనంలా మారిపోయింది. దాన్ని వడ్డించి, వర్ణించి వాళ్లు టాలీవుడ్‌ మొఖానికే మసిపూసే ప్రయత్నం చేశారు. ఏకంగా మెగా కుటుంబమే ఫిల్మ్‌ ఛాంబర్ల దగ్గర గొల్లుమనేలా చేశారు. ఇప్పటికీ శ్రీరెడ్డి వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. ఒకరి తర్వాత ఒకరిని ఆమె టార్గెట్‌ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఎవరి పేరు చెబుతుందోనని గింజుకోవడం తప్ప, టాలీవుడ్‌ పెద్దలు చేస్తోందేమీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీరెడ్డి విషయంలో ఎలా వ్యవహరించాలో ‘మా’ అసోసియేషన్ దగ్గర ఒక ప్రణాళికే లేదు. ఆ తుపాను తగ్గిపోయేదాకా తలవంచుకుని ఉండాలనే వాళ్లు నిర్ణయించుకున్నట్లున్నారు. అలాంటప్పుడు ఇక అసోసియేషన్ ఎందుకో! శ్రీరెడ్డి వ్యవహారంలో తలమునకలైన టాలీవుడ్‌కి ఈసారి ఏకంగా అమెరికాలోనే అవమానం ఎదురుచూసింది. కిషన్ మోదుగుమూడి అనే మహాశయుడు సతీసమేతంగా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తూ పట్టుబడ్డాడు. అవకాశాలు రాని, లేని తారలకు వలవేసి అమెరికాకి రప్పించి వాళ్లకి నామమాత్రపు రుసుములు ఇప్పించి వ్యభిచార దందాని నిర్వహిస్తున్నట్లు బయటపడ్డాడు. ఈ వార్త వెలుగులోకి రాగానే మీడియా పులుల మరోసారి విజృంభించాయి. అక్కడి పోలీసులు ఐదుగురు హీరోయిన్ల పేర్లను ఛార్జిషీటులో పేర్కొన్నారని గాండ్రించి మరీ చెప్పాయి. వాళ్లలో కన్నడ హీరోయిన్‌ ఒకరు, పెద్ద హీరో సరసన నటించిన హీరోయిన్‌ ఒకరు, మూడు అక్షరాల పేరు ఉన్న హీరోయిన్‌ ఒకరు, ప్రముఖ యాంకర్‌ ఒకరు... అంటూ రకరకాల క్లూస్‌ ఇచ్చి జనాలని ఊరించాయి. ఒక పత్రికతో మాట్లాడుతూ ‘కిషన్ మోదుగుమూడి’ మీద తమకి మొదటి నుంచే అనుమానం ఉన్నట్లు అసోసియేషన్ అధ్యక్షులవారు పేర్కొన్నారు. మరి అనుమానం ఉంటే ఇన్నాళ్ల నుంచి ఏం చేస్తున్నట్లు? పైగా ఇక మీదట విదేశాలకి వెళ్లేవారు జాగ్రత్తగా వ్యవహరించాలనీ సూచిస్తున్నారు. మరోవైపు కిషన్ మోదుగుమూడి తమని కూడా అప్రోచ్‌ అయినట్లు కొందరు నటీమణులు చెప్పుకొచ్చారు. మరి వాళ్లు ఇప్పటిదాకా ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు. ఇదంతా చూస్తుంటే కిషన్ లీలలు అందరికీ తెలిసే జరుగుతున్నాయని అర్థమవుతోంది. కాకపోతే దీన్ని వ్యక్తిగత విషయంగా భావిస్తూ వచ్చి ఉంటారు. మన పరువు ఏకంగా అమెరికాలో పోయాక కానీ భుజాలు తడుముకుంటూ బయటకి రావడం లేదు. చివరగా చెప్పుకొనేదేంటయ్యా అంటే... టాలీవుడ్‌లో ఎదురయ్యే సమస్యలను నిర్భయంగా ఎదుర్కొనే స్థైర్యం కానీ, వాటికి పరిష్కరించే పరిణతి కానీ కనిపించడం లేదు. దాసరివంటి వారు లేని లోటు కనిపిస్తోందని పదిమందీ పదేపదే బాధపడుతున్న కారణం ఇదే! కుర్రవాడైనా కూడా తమిళనాట ఎలాంటి సమస్యనయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న విశాల్‌ని చూసైనా మన పెద్దలు ఏమన్నా నేర్చుకుంటారేమో చూడాలి!
  ఎన్నికలు ఏవైనా ఈమధ్య సర్వే చేయడం కామన్ అయిపోయింది.. ప్రజలు కూడా సర్వేల మీద ఆసక్తి కనబరుస్తున్నారు.. అసలే ఏపీ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి.. ఒకవైపు అధికార పక్షం టీడీపీ, ప్రతిపక్షం వైసీపీలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడుతున్నాయి.. మరోవైపు జనసేన ఒంటరిగా బరిలోకి దిగుతా అంటుంది.. బీజేపీ ఏపీ లో పాగా వేస్తాం అంటుంది.. మరి ఇలాంటి సమయంలో ఏపీలో సర్వే చేస్తే ఎలా ఉంటుంది?.. అందునా లగడపాటి టీంతో..సర్వేల్లో లగడపాటి & టీంకి మంచి పేరుంది.. వీరి సర్వే ఫలితాలు, ఎన్నికల ఫలితాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి.. అందుకే లగడపాటిని ఆంధ్ర ఆక్టోపస్ అంటారు.. అలాంటి లగడపాటి టీంతో ఒక తెలుగు న్యూస్ ఛానల్ సర్వే చేయించింది.. అందుకే ఈ సర్వే మీద అందరూ అంత ఆసక్తి కనబరుస్తున్నారు.. మరి ఈ సర్వే ఏం తేల్చింది?.. అధికారం పక్షం టీడీపీకి మరోసారి అధికారం దక్కనుందా? లేక విపక్షాల ఆశ నెరవేరనుందా?.. కచ్చితంగా టీడీపీదే మళ్ళీ అధికారమని ఈ సర్వే తేల్చేసింది.. టీడీపీ 44 శాతం ఓట్లతో 110 స్థానాలు గెలుచుకుంటుందట.. ఇక ప్రతిపక్షం వైసీపీ 37 శాతం ఓట్లతో 60 స్థానాలు గెలుచుకొని మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితం అవుతుందట.. అలానే జనసేన సుమారు 9 శాతం ఓట్లతో అక్కడక్కడా ప్రభావం చూపినా, చాలా తక్కువ స్థానాలే గెలుచుకునే అవకాశం ఉందట.. ఇక ఏపీలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ, ఒక్క శాతం ఓట్లకే పరిమితం అవుతుందట.. మొత్తానికి ఈ సర్వేతో ఏపీలో మళ్ళీ టీడీపీదే అధికారమని తేలిపోయింది.  
మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని ప్రతిరోజూ పెద్దలని తల్చుకునే సంప్రదాయంలో... వాళ్ల కోసం ప్రత్యేకమైన రోజులు పెట్టడం మూర్ఖత్వం అని తిట్టేవారు లేకపోలేదు. ఫాదర్స్ డే, మదర్స్‌డే వంటి సంప్రదాయాలు పాశ్చాత్య వ్యాపార ధోరణులకు మాత్రమే ఉపయోగపడతాయని విమర్శించేవాళ్లూ లేకపోలేదు. నిజమే! కానీ మనిషికీ మనిషికీ మధ్య దూరం పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఒక్క రోజైనా ఆగి బంధాల విలువల గురించి ఆలోచించడంలో తప్పులేదుగా! సమాజం దృష్టిలో తల్లికి ఉన్నంత విలువ, గౌరవం తండ్రికి లభించదు. సాంస్కృతికంగా, సాహిత్యపరంగాను తల్లి ప్రేమ, త్యాగాల గురించే కనిపించే పొగడ్తలు, వర్ణనలు తండ్రికి మీద కనిపించవు. నిజానికి పిల్లల పెంపకంలో తండ్రి ఎవరికీ ఏమాత్రం తీసిపోడు. పిల్లల సుఖం కోసం తన కనీస అవసరాలను చంపుకునేందుకు వెనకాడడు. వాళ్ల వ్యక్తిత్వాలని తీర్చిదిద్దడంలో దుర్మార్గుడు అన్న పేరుని సొంతం చేసుకునేందుకు జంకడు. కొన్ని పరిశోధనల ప్రకారం పసిపిల్లల మీద తల్లికంటే తండ్రి చూపించే అనురాగమే ఎక్కువ ప్రభావం చూపుతుంది. యూనిసెఫ్‌ అంచనా ప్రకారమైతే తండ్రితో సరైన అనుబంధం కలిగిన పిల్లల్లో ఆత్మ విశ్వాసం, పరిణతి, జీవితం పట్ల సంతృప్తి పుష్కలంగా మెరుగ్గా ఉంటాయట. కానీ ఇంటిని నడిపే బాధ్యత తండ్రిది, పిల్లల్ని సాకే బాధ్యత తల్లిది అని భావించే సమాజంలో, తండ్రి పాత్రను ఎప్పుడూ తక్కువగానే అంచనా వేస్తుంటారు. అందుకనే బిడ్డ పుట్టిన తర్వాత తండ్రికి ఆఫీసులో ఎలాంటి వెసులుబాట్లూ ఉండవు. పిల్లవాడి దగ్గర తనివితీరా ఓ వారం రోజులు గడిపేందుకు సిక్‌లీవ్‌ పెట్టుకోవాల్సిన దౌర్భాగ్యం మన దేశపు తండ్రులది. కానీ పరిస్థితులు ఇప్పుడిప్పుడే మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇంట్లో పిల్లల మీద తండ్రుల ప్రభావం గురించి రోజు తర్వాత రోజు వస్తున్న నివేదికలు, వినిపిస్తున్న పరిశోధనల తర్వాత... తండ్రి పాత్రకి కొత్త గుర్తింపు వస్తున్నట్లు కనిపిస్తోంది. బిడ్డ పుట్టిన తర్వాత తండ్రికి కూడా కొన్ని రోజుల పాటు ‘పెటర్నటీ లీవ్‌’ ఇవ్వాలన్న డిమాండ్‌కు మద్దతు పెరుగుతోంది. పెటర్నటీ లీవ్‌ ఉండని 92 దేశాలలో భారతదేశం కూడా ఒకటంటూ యూనిసెఫ్‌ తరచూ గుర్తుచేస్తోంది. అందుకేనేమో ఇప్పుడు పెటర్నటీ లీవ్‌ని చట్టబద్ధం చేసేందుకు పార్లమెంటు కూడా సిద్ధమవుతోంది. అప్పుడే బిడ్డ పుట్టిన తండ్రులకు కనీసం మూడు నెలల సెలవు ప్రకటించేలా ఓ చట్టాన్ని రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వచ్చే పార్లమెంట సెషన్‌లో ఆ చట్టాన్ని సభ్యుల ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారట. ఇదే కనుక జరిగితే తండ్రులకి మూడు నెలల పాటు ‘ఫాదర్స్ డే’నే!
  ఖైదీ నెంబర్‌ 150లో నీటి గురించి ఆ పాట గుర్తుండే ఉంటుంది. భూగర్భజలాలను రక్షించుకోవడానికి ఓ నాయకుడు చేసే పోరాటం ఆ సినిమాకి బాక్సాఫీసు దగ్గర కాసులు కురిపించింది. కానీ రోజువారీ జీవితంలో భూగర్భజలాలను రక్షించుకునేందుకు ఏ నాయకుడూ సిద్ధంగా ఉన్నట్లు లేదు. ఫలితంగా మన జీవితాలే అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నమ్మడం లేదు కదూ! నమ్మక తప్పదు మరి!!! జాతీయ ప్రణాళికా సంస్థ నీతి ఆయోగ్‌ ‘కాంపోజిట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఇండెక్స్‌’ పేరుతో ఓ నివేదికను రూపొందించింది. పలు సంస్థలు చేసిన సర్వేల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. పైకి సాధారణంగా కనిపించే ఈ నివేదిక తెరిచి చూసిన వాళ్లకి దిమ్మతిరిగిపోయే వాస్తవాలు కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని... - హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ సహా దేశంలోని 21 నగరాలలో 2020 నాటికి తీవ్ర మంచినీటి ఎద్దడి రానుంది. - దేశవ్యాప్తంగా దాదాపు 70 శాతం నీరు కలుషితం అయిపోయింది. 122 దేశాలలోని నీటి నాణ్యతని పరిశీలిస్తే... అందులో మన దేశానికి 120వ ర్యాంకు వచ్చింది. - దేశంలో దాదాపు 60 కోట్ల మంది ప్రజలు, తాగేందుకు సురక్షితమైన నీరు లేక అల్లల్లాడిపోతున్నారు. - 2030 నాటికి మన దగ్గర దొరికే నీరు కంటే కొనుక్కోవల్సిన నీరే అధికంగా ఉండే ప్రమాదం ఉంది. దీని వల్ల జీడీపీకి 6 శాతం నష్టం వాటిల్లుతుంది. - సురక్షితమైన మంచినీరు దొరకక ఏటా రెండు లక్షల మంది వేర్వేరు వ్యాధుల బారిన పడి చనిపోతున్నారు. భూగర్భజలాలు ఎండిపోతున్నాయో అని ఏటా ఎవరో ఒక నిపుణుడు మొత్తుకుంటూనే ఉన్నారు. వాటిని పరిరక్షిస్తున్నాం అంటూ రాష్ట్రాలు కబుర్లు చెబుతూనే ఉన్నాయి. కానీ వాస్తవాలు ఇవిగో పైన చెప్పుకొన్నట్లే ఉన్నాయి. అందుకే దాదాపు 60 శాతం రాష్ట్రాలు భూగర్భ జాలాలని పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని నీతిఆయోగ్‌ నివేదిక ఎత్తిచూపించింది. వీటిలో తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలు ఉండటం గమనార్హం. దీనిబట్టి మిషన్‌ కాకతీయ వంటి ప్రతిష్ట్రత్మక ప్రాజెక్టులు ఇంకా సత్ఫలితాలు ఇవ్వలేదని అర్థమవుతోంది. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌, బీహార్‌, హర్యాణా, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లో అయితే భూగర్భ జలాల పరిరక్షణ మరీ దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నట్లు నివేదిక చెబుతోంది. అందుబాటులో ఉన్న నీటి వనరులను సరిగా వినియోగించుకోకపోవడం; నీళ్ల రీసైక్లింగ్‌ మీద ప్రజలకు కానీ, ప్రభుత్వానికి కానీ తగిన శ్రద్ధ లేకపోవడం; వందల అడుగుల లోతుకి వేసే బోర్ల మీద కూడా ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణా లేకపోవడం; వరద నీటిని సక్రమంగా వినియోగించుకోకపోవడం... వినేందుకు కాస్త బోర్‌ కొడుతుందే కానీ, భూగర్భజలాలను పరిరక్షించుకునేందుకు చాలా మార్గాలే ఉన్నాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు వీటి మీద పూర్తి అవగాహన ఉండి ఉండాలి. కానీ ప్రస్తుత నివేదిక చూస్తే మాత్రం అందుకు విరుద్ధమైన అభిప్రాయం కలుగుతోంది. ఫలితం! నివేదికలో పేర్కొన్న భయాలు 2030 నాటికి నిజమయ్యే ప్రమాదం ఉంది.
  కాలచక్రం గిర్రున తిరిగి మళ్లీ మొదటికి వచ్చేసింది. ఒకప్పుడు మూఢనమ్మకంగా భావించే యోగాసనాలు వెనక అద్భుతమైన సైన్స్ ఉందంటూ ప్రపంచమంతా ఒప్పుకోక తప్పటట్లు లేదు. నిన్నమొన్నటి వరకూ పతజంలి అందించిన సూచనలకు అనుగుణంగానే యోగా సాగేది. కానీ పాశ్చాత్యులను ఆకర్షించడానికో, మారుతున్న జీవనశైలికి అనుగుణంగానో రకరకాల యోగాలు వస్తున్నాయి. వాటిలో కొన్ని ఇవిగో...   ACRO YOGA     ఏక్రోబయాటిక్స్నీ యోగానూ జతచేసి తయారుచేసిన యోగా ఇది. ఈ యోగాను చేయడానికి ఇద్దరు వ్యక్తులు ఉండాలి. అందులో ఒకరు స్థిరంగా ఉంటే, మరొకరు నేల మీద ఉన్న వ్యక్తిని పట్టుకుని విన్యాసాలు (acrobatics) చేస్తుంటారు. ఎప్పుడో తిరుమలై కృష్ణమాచార్యులవారు సరదాగా ఓ చిన్నపిల్లవాడితో చేసిన ప్రయోగమే ఈ ఏక్రోయోగాకి ఆరంభం అని చెబుతారు. కానీ ఈ ఏక్రోయోగా చాలా కష్టమైంది. ముందుగా శరీరాన్ని ఏక్రోబయాటిక్స్ని అనువుగా మార్చిన తర్వాతే ఇది సాధ్యమవుతుంది. పైగా ఇందులో పట్టుతప్పే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.   BIKRAM YOGA     పశ్చిమబెంగాల్కు చెందిన విక్రమ్ చౌదరి తెలివైనవాడు. పాశ్చాత్య ప్రపంచం ఎప్పుడైతే యోగా వైపు చూస్తోందని గ్రహించాడో... ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. దానికి తనదైన ముద్రని జోడించాడు. బిక్రమ్ యోగాలో 90 నిమిషాల పాటు ఓ 26 యోగాసనాలను వేయవలసి ఉంటుంది. అయితే- ఆ సమయంలో గదిలోని వాతావరణం 35-42 డిగ్రీల వరకూ ఉండేలా చూస్తారు. భారతీయ వాతావరణాన్ని అనుసరించేందుకే ఈ ఏర్పాటు అంటాడు విక్రమ్ చౌదరి. అతని చేత సర్టిఫై చేయబడిన యోగా గురువులు మాత్రమే ఈ యోగాను నేర్పేందుకు అర్హులు. అయితే అత్యాచారం దగ్గర నుంచీ దాడి చేయడం దాకా ఈ గురువుగారి మీద చాలా కేసులు ఉండటం కొసమెరుపు.   FORREST YOGA       అమెరికాకు చెందిన ‘అన్నా ఫారెస్ట్’ ఓ ముప్ఫై ఏళ్ల క్రితం రూపొందించిన యోగా ఇది. పాశ్చాత్య యోగానీ, యోగా గురువులైన శివానంద వంటి వారి మార్పులనీ కలబోసి తనదైన శైలిలో ఈ యోగాను రూపొందించారు. ఆధునిక జీవన సమస్యలకు అనుగుణంగా ఈ యోగాకు మరికొన్ని విధానాలను జోడించారు. ఉదాహరణకు కంప్యూటర్ దగ్గర ఎక్కువగా పనిచేయడం వల్ల మణికట్టు, మెడ, భుజాల మీద అధిక భారం పడుతూ ఉంటుంది. ఈ సమస్యలను నివారించేందుకు ఆయా శరీర భాగాలకు సంబంధించి సరికొత్త ఆసనాలను రూపొందించారు.   CHAIR YOGA     యోగా చేయాలంటే శరీరం ఎంతోకొంత సహకరించాలి. దానికోసం నిర్దుష్టమైన సమయం, సందర్భం ఉండాలి. కానీ ఎవరైనా ఎక్కడైనా యోగా చేయలనుకుంటే సాధ్యం కాదా! అనే ప్రశ్నకు సమాధానమే కుర్చీ యోగా! లక్ష్మీ ఓల్కర్ అనే అమెరికన్ రూపొందించిన యోగా ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. పండుముసలివారు సైతం యోగా చేసేలా, ఆఫీసులోని ఖాళీ సమయంలోనూ కాసిని ఆసనాలు వేసేలా ప్రేరేపిస్తోంది. ఇందులో ఇటు భారతీయ యోగశాస్త్రంతో పాటుగా అటు చైనా ధ్యాన భంగిమలూ కనిపిస్తాయి. ఈ కుర్చీ ఆసనాలు అన్నింటి మీదా లక్ష్మీగారికి పేటెంటు హక్కులని సాధించడం ఓ కొసమెరుపు- - నిర్జర.   International Yoga Day 2018 Special Videos
  ఒక వ్యక్తి స్థిరంగా ఒకే భంగిమలో ఉంటే, దానిని ఆసనం అంటారు. ఒక ఆసనం వేసేటప్పుడు శరీరంలోని ఏ భాగమైతే నిశ్చలంగా ఉండిపోతుందో... ఆ అవయవానికి రక్తప్రసరణ మెరుగుపడుతుందనీ, తద్వారా ఆరోగ్యం చేకూరుతుందనీ చెబుతారు. ఈ ఆసనాలలో కొన్ని సులువుగా ఉంటే, మరికొన్ని మాత్రం అసాధ్యంగా తోస్తాయి. యోగాలో ఎంతో నిష్ణత, శరీరంలో పటుత్వం ఉంటేగానీ ఇవి సాధ్యం కావు. అలాంటి కొన్ని ఆసనాలు ఇవిగో... మన యోగా ఎంత లోతైనదో చెప్పుకొనేందుకే ఈ ఉదాహరణలు!     అష్టవక్రాసనం: పూర్వం అష్టావక్రుడనే ఓ రుషి ఉండేవాడు. తండ్రిలో తప్పుని ఎత్తి చూపిన కారణంగా ఆయన అష్టవంకర్లతో జన్మించమన్న శాపం దక్కుతుంది. అలా అష్టవంకర్లతో జన్మించినా కూడా గొప్ప జ్ఞానిగా ఆ రుషి చరిత్రలో నిలిచిపోయాడు. ఈ అష్టవక్రాసనం ఆయన పేరు మీదుగానే వచ్చిందని అంటారు. రెండుకాళ్లనీ ముడివేసి, ఒక చేతిని వాటిలోంచి చొప్పించి... కేవలం అరచేతుల మీదుగా నేల మీద ఉండటం ఈ ఆసనంలో ప్రత్యేకత. ఈ ఆసనంతో వెన్నులో రక్తప్రసారం మెరుగుపడుతుంది.   శీర్ష పాదాసనం: శీర్షాసనం వేసి, పాదాలను తల మీదుగా వచ్చేలా ఉండే భంగిమే శీర్షపాదాసనం. ఇందులో మెడ, చేతులు, హృదయం, కాళ్లు, వెన్ను... అన్నింటి మీదా ఒత్తిడి పడుతుంది. ఈ ఆసనంతో మెదడు మీద కూడా గొప్ప ప్రభావం ఉంటుందట. ఏకాగ్రత పెరగటానికీ, వెన్ను బలపడటానికీ ఈ ఆసనాన్ని తప్పక సూచిస్తారు. ఈ ఆసనమే కష్టం అనుకుంటే ఇందులో పాదశీర్ష బకాసన, పాదశీర్ష ప్రపాదాసన వంటి ఆసనాలూ ఉన్నాయి. కాకపోతే వాటిజోలికి పోయేవారు తక్కువ.     గండభేరుండ ఆసనం: శీర్షాసనంలో కేవలం కాళ్లు తలవరకు రావడమే కష్టం. ఇక ఆ కాళ్లు మొఖానికి అటూ ఇటూ ఉండేలా నేల మీదకి ఆన్చడం ఇంకెంత కష్టమో కదా! అదే గండభేరుండ ఆసనం. ఈ ఆసనంతో శరీరం స్ప్రింగులాగా ఎటుతిరిగితే అటు తిరిగిపోయే దశకు చేరుకుంటుందని నమ్ముతారు. ప్రముఖ యోగా గురువులు B. K. S. Iyengar కూడా ఈ ఆసనం మహా కష్టమైన ఆసనాలలో ఒకటిగా పేర్కొన్నారు.       యోగనిద్రాసనం: చెట్టంత మనిషి చిన్న మూటలాగా చుట్టుకుపోయే ఈ ఆసనం ఫొటోలలో చూడాల్సిందే తప్ప ఎవరికి పడితే వారు వేయడం అసాధ్యం. చేతులు రెండింటినీ నడుము దగ్గర పెనవేసి, కాళ్లని తల కింద ముడివేసి కనిపించే ఈ ఆసనంతో శరీరం యావత్తూ శక్తిమంతమైపోతుందట! స్త్రీలలో రుతుపరమైన సమస్యలని నివారించడంలో ఈ ఆసనం దివ్యంగా పనిచేస్తుందట.   కాలభైరవాసనం: ఈ భంగిమ కాలబైరవుడైన శివుని తలపిస్తుంది కాబట్టి ఆ పేరు. పైన చెప్పుకొన్న ఆసనాలంత కష్టతరం కాకపోయినా... ఇప్పటి తరానికి ఇది అసాధ్యంగానే తోచవచ్చు. ఒక చేతిని, ఒక కాలిని నేల మీద ఆన్చి... ఒక కాలిని, ఒక చేతిని ఆకాశం దిశగా నిలపడమే ఈ ఆసనంలోని ప్రత్యేకత. ఈ ఆసనం వల్ల కాలికండరాలు బలిష్టంగా తయారవుతాయని యోగనిపుణులు హామీ ఇస్తున్నారు.   ఏదో కొన్ని ఆసనాల గురించి చెప్పుకొనే వీలు మాత్రమే ఉంది కాబట్టి ఐదు ఆసనాల గురించి మాత్రమే చెప్పుకొన్నాం. కానీ ఎన్నో రోజుల కఠోర శ్రమ, గురువుల పర్యవేక్షణ లేకుండా వేయడం అసాధ్యంగా తోచే ఆసనాలు చాలానే ఉన్నాయి. ఈ రోజుల్లో గర్వంగా చెప్పుకొనే ఏరోబక్స్కు ఏమాత్రం తీసిపోని భంగిమలు మన యోగాలో ఉన్నాయి. ఇంత లోతైన శాస్త్రం మన దగ్గర ఉండగా ఆరోగ్యం కోసం, ప్రశాంతత కోసం పాశ్చత్య విధానాల వైపు పరుగుతీయడం ఎంత హాస్యాస్పదమో కదా! - నిర్జర.      
  ఈ రోజుల్లో చాలామందిది ఒకటే బాధ! ఖర్చుపెట్టుకోవడానికి కావల్సినంత డబ్బు ఉంది. కానీ గడపడానికి సమయమే ఉండటం లేదు. ఈ మాటలు వింటున్న కొందరు పరిశోధకులకి ఓ అనుమానం వచ్చింది. మనిషి దేనివల్ల సంతోషంగా ఉంటాడు? డబ్బు వల్లా! కాలం వల్లా! ఈ విషయాన్ని తేల్చుకునేందుకు వారు ఒక ఆరు పరిశోధనలు చేశారు. ఇందులో భాగంగా 4,600 మంది అభ్యర్థుల ఆలోచనా తీరుని గమనించారు.   లక్షలకొద్దీ జీతంతో ఎక్కువసేపు ఉద్యోగం చేయడం కంటే, కాస్త తక్కువ జీతంతో తక్కువ పనిగంటలు చేస్తేనే సుఖంగా ఉన్నట్లు ఈ పరిశోధనలో వెల్లడయ్యింది. కుర్రవాళ్లు కాస్త అటూఇటూగా మొగ్గుచూపారు కానీ, వయసు మీరుతూ జీవితం తెలిసొస్తున్న కొద్దీ.... డబ్బుకంటే సమయమే ముఖ్యం అనేవారి సంఖ్యే ఎక్కువగా ఉందట. అంతేకాదు! ఇంటిపని, పెరడు పని చేసేందుకు పనివాళ్లని పెట్టుకున్నప్పుడు కూడా ఇదే తరహా సంతోషం కనిపించింది. ఆ సంతోషం తన పని వేరొకరు చేయడం వల్ల కాదు, జీవితాన్ని ఆస్వాదించే సమయం దక్కినందువల్లే అని తేల్చారు!   పైన చెప్పుకొన్న పరిశోధన జరిగి ఏడాది గడిచిపోయింది. ఇప్పుడు శాస్త్రవేత్తలకి మరో సందేహం వచ్చింది. మన డబ్బుతో వస్తువులు కొనుక్కుంటే ఎంతో కొంత తృప్తి ఉంటుంది. అదే సమయాన్ని కొనుక్కుంటే! అదేనండీ... ఆ డబ్బుతో మన పనిభారం తగ్గించుకుంటే మరింత తృప్తి ఉంటుందా! అన్న ఆలోచన వచ్చింది. వెంటనే కొంతమందికి తలా 40 డాలర్లు ఇచ్చి చూశారు. ఈ డబ్బుని మీకు తోచిన రీతిలో ఏదన్నా కొనుక్కోమని చెప్పారు. సహజంగానే చాలామంది తమకి ఇష్టమైన వస్తువులని కొనేసుకున్నారు. అతికొద్ది మంది మాత్రమే... తమకి కాలం కలిసొచ్చేలా వేరొకరి సేవల కోసం ఈ డబ్బుని వినియోగించుకున్నారు. వస్తువులని కొన్నవారితో పోలిస్తే సమయాన్ని కొనుక్కున్నవారే ఎక్కువ తృప్తి పడినట్లు తేలింది.   ఈ పరిశోధనలతో రెండు విషయాలు స్పష్టం అయిపోతున్నాయి. ఒకటి- జీవితంలో డబ్బు ఎంత అవసరమో, సమయం అంతే అవసరం. ఈ రెండింటి మధ్యా సమన్వయం లేకపోతే మనసుకి లోటు తోచడం ఖాయం. రెండు- ప్రతి పైసా కూడపెట్టాలన్న తపనకి పోకుండా, అవసరం అయినప్పుడు సేవల కోసం కూడా కాస్త డబ్బుని ఉపయోగించుకోవడం మంచిది. అలా కలిసొచ్చే కాలం మనం వదులుకునే డబ్బుకంటే విలువైనది! - నిర్జర.  
రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.. అయితే దేశ వ్యాప్తంగా మళ్ళీ పుంజుకుంటున్న కాంగ్రెస్, ఇప్పుడు ఏపీ మీద కూడా దృష్టి పెడుతుంది.. ఇప్పుడిప్పుడే ఏపీలో ఉనికిని చాటుకుంటున్న కాంగ్రెస్, మళ్ళీ బలమైన పార్టీగా అవతరించాలని చూస్తుంది.. దానిలో భాగంగానే రాహుల్ గాంధీ, ఏపీ కాంగ్రెస్ నేతలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి ఊమెన్ చాందీ, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు కొందరు ముఖ్యనేతలతో సమావేశమైన రాహుల్, జగన్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది.. 'వైఎస్ రాజశేఖరరెడ్డి వేరు, జగన్ వేరు.. రాజశేఖరరెడ్డి నిరుపేదల గురించి ఆలోచించేవారు, కానీ జగన్ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆలోచిస్తాడు.. కాంగ్రెస్ ఎప్పుడూ నిరుపేదలకు అండగా ఉంటుంది.. జగన్ స్వభావం ఇందుకు విరుద్ధం.. అందుకే మనం జగన్ ని కూడా టార్గెట్ చేయాలి.. జగన్ పార్టీలో ఉన్న కీలక నేతలంతా కాంగ్రెస్ భావజాలం ఉన్నవాళ్లే, వాళ్ళని తిరిగి కాంగ్రెస్ లోకి ఆహ్వానించాలి' అని రాహుల్ అన్నారట.. మొత్తానికి రాహుల్ ఏపీ మీద బాగానే దృష్టి పెట్టారుగా.
  ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ మధ్య దూకుడు బాగా పెంచారు.. ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు, మరోవైపు విపక్షాలకు చురకలు వేస్తున్నారు.. తాజాగా లోకేష్ విపక్ష నేత జగన్ మీద విమర్శలు చేసారు..ఏపీకి అన్యాయం చేసిన మోడీని జగన్ ఒక్కమాట కూడా అనరని, ఒకవేళ మోడీని విమర్శిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని జగన్‌కు భయం పట్టుకుందని లోకేష్ విమర్శించారు.. జగన్, మోడీతో కలిసిపోయి తనపేరుని జగన్ మోడీ రెడ్డిగా మార్చుకున్నారని చురక వేశారు.. అలానే టీడీపీ వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలు గెలిచి రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధిస్తామని అన్నారు.  
  రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఒకరికొకరు అండగా ఉంటూ అన్ని విధాలా సహకరించుకోవాలని అనుకున్నాయి.. ఇప్పుడిదే విషయాన్నీ గుర్తు చేస్తూ ఏపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, ఏపీ ప్రత్యేకహోదా పోరాటానికి కేసీఆర్ కలిసి రావాలని కోరుతున్నారు.. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి అన్ని విధాలా సహకరిస్తా అని కేసీఆర్ మాట ఇచ్చారు.. ఆ మాట ప్రకారం, ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు చేస్తున్న పోరాటంలో కేసీఆర్‌ చేతులు కలపాలని కోరారు.. ఒకవేళ కేసీఆర్‌ కలిసి రాకపోతే కర్ణాటక తరహాలోనే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓటేయాలని ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల ఓటర్లకు పిలుపునివ్వాల్సి వస్తుందని టీజీ హెచ్చరించారు.. నీతి ఆయోగ్‌ సమావేశానికి ముందే కేసీఆర్‌ మోడీని కలవడం, నీతి ఆయోగ్‌లో ఏపీ సమస్యలపై కేసీఆర్‌ మాట్లాడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.. కేసీఆర్ మోడీ వలలో పడకూడదన్న టీజీ, వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలలోని ప్రజలంతా ఒక తాటి మీద ఉంటేనే కేంద్రం నుండి ఏపీకి న్యాయం జరుగుతుందని అన్నారు.  
  యోగా గొప్పతనం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రతి ఆరోగ్య సమస్యకీ యోగా కూడా తగిన పరిష్కారం చూపగలదని నమ్ముతున్నారు. కానీ అంతరిక్షంలో సంచరించే వ్యోమగాములకి కూడా యోగా ఉపయోగపడుతుందని తేలడం మాత్రం ఆశ్చర్యమే!   వ్యోమగాములకీ కష్టాలు హాయిగా రెక్కల్లేని పక్షుల్లాగా శూన్యంలో విహరించే వ్యోమగాములకీ అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతరిక్షంలో ఉండే రేడియేషన్‌ వల్లా, గురుత్వాకర్షణ శక్తిలో మార్పుల వల్లా రకరకాల ఆరోగ్య సమస్యలు వారిని చుట్టుముడతాయి. ఇక ఒంటరితనం వల్ల, ఒకే పెట్టెలో బందీగా ఉండటం వల్ల మానసిక సమస్యలూ తలెత్తుతాయి. వీటన్నింటినీ తట్టుకొనేందుకు వారికి రకరకాల సౌకర్యాలను అందిస్తూ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉంటారు. కానీ ఇంచుమించుగా ప్రతి అంతరిక్ష వ్యోమగామికీ వస్తున్న నడుం నొప్పికి మాత్రం ఇప్పటివరకూ సరైన కారణం కానీ, చికిత్సను కానీ కనుగొనలేకపోయారు.   కారణం తేలింది ఇంతవరకూ వ్యోమగాల వెన్నుపూసలో ఉండే డిస్కులు వాయడం వల్లే వారికి నడుంనొప్పి వస్తుందని భావించేవారు. భూమ్మీదకు తిరిగి వచ్చిన తరువాత కూడా వ్యోమగాములు వారాల తరబడి నడుంనొప్పితో బాధపడాల్సి వచ్చేది. కానీ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు దీనికి తగిన కారణాన్ని కనుగొనేందుకు ఒక ఆరుగురు నాసా వ్యోమగాములను పరిశీలించారు. వారు అంతరిక్షంలోకి బయల్దేరక ముందు, అంతరిక్షంలో కొన్ని నెలలు గడిపి తిరిగి వచ్చిన తరువాత వారికి MRI పరీక్షలు నిర్వహించారు. వీటిలో నడుంనొప్పికి డిస్క్‌ వాపు కారణం కాదని తేలింది. వెన్ను చుట్టూ ఉండే కండరాలు దాదాపు 20 శాతం కుంచించుకుపోవడం వల్ల ఈ నొప్పి ఏర్పడుతోందని బయటపడింది. ఇలా దెబ్బతిన్న కండరాలు కొన్ని నెలలు గడిచిన తరువాత కానీ తిరిగి సాధారణ స్థితికి చేరుకోలేదట.   యోగాతో బాగు వ్యోమగాములు నడుముకి సంబంధించిన సమస్యలకు దూరం కావాలంటే యోగా మంచి మార్గం అని తేలుస్తున్నారు పరిశోధకులు. అంతరిక్షంలో సరైన కదలికలు లేకపోవడం, వెన్ను మీద అధిక ఒత్తిడి పడటం వంటి ఇబ్బందుల కారణంగా తలెత్తే సమస్యలన్నింటికీ యోగా తగిన ఉపశమనాన్ని కలిగించగలదని సూచిస్తున్నారు. వ్యోమగాములు అంతరిక్షంలో గడిపేటప్పుడు వారి దినచర్యలో భాగంగా యోగాను చేర్చమంటున్నారు. ఏదో ఒకటి రెండు నెలలు అంతరిక్షంలో గడిపేసి వచ్చే రోజులు పోయాయి. ఇక ముందు ఏళ్లతరబడి వారు అంతరిక్షంలో ప్రయాణించాల్సిన సందర్భాలు రానున్నాయి. అలాంటి కలలు ఎలాంటి ఉపద్రావాలూ లేకుండా నిజం అయ్యేందుకు యోగా కూడా వారికి సాయపడేట్లే ఉంది.   - నిర్జర.   International Yoga Day 2018 Special Videos
రథసప్తమి వస్తోందంటే చాలు... ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుడే గుర్తుకువస్తాడు. జీవానికి ఆలంబనగా, కర్మలకు సాక్షిగా ఉండే ఆ భగవానుని కొలిస్తే ఆయురారోగ్యాలలో లోటు ఉండదని పెద్దల నమ్మకం. అది ఒట్టి నమ్మకం మాత్రమే కాదనేందుకు ఆయన ఎదుట నిలబడి చేసే సూర్యనమస్కారాలే సాక్ష్యం. పైకి యాంత్రికంగా కనిపించే ఈ సూర్యనమస్కారాల వెనుక యోగశాస్త్రంలోని సారాంశం దాగి ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో రోజుకి ఒక్క పదిహేను నిమిషాల పాటు సూర్యనమస్కారాలు చేస్తే చాలు అంతులేని ఆరోగ్యం, చురుకుదనం మీ సొంతం.     కొన్ని సూచనలు... ఉదయాన్నే నిద్రలేచి, ధారాలంగా గాలి వెలుతురు లభించే చోట ఈ ఆసనాలు వేయాలి. కాలకృత్యాలను తీర్చుకుని ఖాళీకడుపుతో వీటిని ఆచరించాలి. దుస్తులు మరీ బిగుతుగా కాకుండా కాస్త వదులుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సూర్యనమస్కారాలను చేసే సమయంలో ఒకో నమస్కారానికీ ఒకో మంత్రం ఉంది. ఆ మంత్రాలన్నీ సూర్యుని వివిధ నామాలను ప్రతిఫలిస్తాయి. అంతమాత్రాన తప్పకుండా మంత్రాలను చదువుతూ చేయాలన్న నియమం ఏదీ లేదు. కాబట్టి వీటిని కులమతాలకు అతీతంగా ఎవరైనా ఆచరించవచ్చు.     01) ఓం మిత్రాయనమః సూర్యునికి అభిముఖంగా నిటారుగా నిలబడాలి. చేతులను నమస్కార భంగిమలో ఉంచి, బొటనవేళ్లు రెండూ ఛాతీకి తగిలేలా ఉంచాలి. నిదానంగా శ్వాసని తీసుకుంటూ మనసుని ఆ శ్వాస మీద కేంద్రీకరించాలి.     02) ఓం రవయేనమః చేతులను పైకెత్తి నిదానంగా వెనక్కి వంచాలి. ఆ సమయంలో నడుమూ, చేతులూ విల్లులాంటి ఆకారాన్ని తలపిస్తాయి. మన చూపులు కూడా పైకెత్తిన చేతులను అనుసరించాలి. దీనిని అర్ధచంద్రాసనం అని అంటారు.     03) ఓం సూర్యాయనమః రెండో ఆసనంలో పైకెత్తిన చేతులను, కాళ్లకు తగిలేలా పూర్తిగా కిందికి వంచాలి. వీలైతే ఈ సమయంలో ఊపిరి బిగపట్టమని చెబుతూ ఉంటారు. ఇలా చేతులను కిందకి వంచే సమయంలో తల కూడా మోకాళ్లకు తగిలేలా ఉంటే మరీ మంచిది. దీనికి పాదహస్తాసనం అని పేరు.     04) ఓం భానవేనమః పరుగుల పోటీకి సిద్ధపడినవారిలా కుడి పాదాన్ని వీలైనంత వెనక్కిలాగి, ఎడమ పాదాన్ని మాత్రం ముందుకు ఉరుకుతున్నట్లుగా సిద్ధంగా ఉంచాలి. ఈ సమయంలో తలను మాత్రం పైకెత్తి చూడాలి. దీనిని అశ్వసంచలనాసనం అంటారు.     05) ఓం ఖగాయనమః ఇప్పుడు ఎడమ పాదాన్ని కూడా వెనక్కి పెట్టి నడుము భాగాన్ని ఏటవాలుగా పైకి లేపాలి. ఈ సమయంలో మన శరీరం ఓ పర్వతాన్ని తలపిస్తుంది. అందుకే దీనికి పర్వతాసనం అని పేరు.     06) ఓం పూష్ణేనమః పర్వతాసనంలో ఉన్న శరీరాన్ని నిదానంగా నేలకు ఆన్చాలి. ఈ సమయంలో పొట్టభాగం మాత్రం నేలకు ఆన్చకుండా రెండు అరచేతులూ, కాళ్లూ, గడ్డం, ఛాతీ నేలకు ఆనేలా జాగ్రత్త తీసుకోవాలి.     07) ఓం హిరణ్యగర్భాయనమః వెల్లికిలా నేల మీద ఉన్న శరీరాన్ని శిరసు నుంచి నాభిదాకా పైకి లేపాలి. ఈ సమయంలో మన భంగిమ పడగ ఎత్తిన పాముని తలపిస్తుంది. అందుకే ఈ ఆసనానికి భుజంగాసనం అని పేరు.     08) ఓం మరీచయేనమః ఐదో ఆసనం (పర్వతాసనం) ఇప్పుడు పునరావృతం అవుతుంది. శ్వాసను వదిలిన తరువాతే ఈ ఆసనం చేయడం మంచిది.     09) ఓం ఆదిత్యాయనమః ఈసారి నాలుగో ఆసనం (అశ్వసంచలనాసనం) పునరావృతం అవుతుంది. కాకపోతే ఈసారి కుడిపాదం బదులు ఎడమపాదాన్ని వెనక్కి వంచి, కుడి పాదాన్ని ముందుకు ఉంచాలి.     10) ఓం సవిత్రేనమః ఈ భంగిమలో మూడో ఆసనం (అశ్వసంచలనాసనం) పునరావృతం అవుతుంది.      11) ఓం అర్కాయనమః ఈ దఫా రెండో ఆసనాన్ని (అర్ధచంద్రాసనం) తిరిగి వేయాలి.     12) ఓం భాస్కరాయనమః మొదటి ఆసనంలో ఉన్నట్లుగా నమస్కార భంగిమకు తిరిగిరావాలి.  ఈ ప్రకారంలో చేసే సూర్యనమస్కారాల పరిక్రమతో శరీరంలోని ప్రతి అవయవమూ బలాన్నీ, స్వస్థతనూ పొందుతుందన్నది పెద్దల మాట. ఆ మాట నూటికి నూరు పాళ్లూ నిజమన్నది వాటిని ఆచరిస్తున్న వారి అనుభవం.     - నిర్జర.
  అంతా మాయ! ఈ జగమంతా మాయ! ఏంటీ… ఇదేదో వేదాంతం అనుకుంటున్నారా? అస్సలు కాదు! ప్రాక్టికల్ సైన్స్! ఇంతకీ… విషయం ఏంటంటే… మనం ప్రపంచంలో వుంటాం. కాని, నిజంగా జరిగేది ఏంటంటే… ప్రపంచం మన మనస్సులో వుంటుంది! మన మనస్సు లేదా మెదడు ఎలా భావిస్తే ప్రపంచం కూడా అలాగే వుంటుంది! అందుకే మన పెద్దలు అంతా మిథ్యా అనేశారు! మనం ఎలా భావిస్తే మన చుట్టూ పరిస్థితులు కూడా అలానే వుంటాయి! ఇందుకు వైన్ కూడా మినహాయింపు కాదు!   వైనుకు , వేదాంతానికి లింకేంటి అనుకుంటున్నారా? జర్మనీలో తాజాగా కొందరు రీసెర్చర్స్ చేసిన అధ్యయనం ప్రకారం సంబంధం వుంది! జర్మనీలోని ఓ యూనివర్సిటీలో కొందరు శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేశారు. దానిలో భాగంగా కొందరు వ్యక్తుల్ని ఎమ్ఆర్ఐ స్కానింగ్ చేసే మిషన్ లో ప్రవేశపెట్టారు. తరువాత వారికి సాధారణ వైన్ తాగించారు. కాని, ఒక చిన్న ట్రిక్ ప్లే చేశారు! మార్కెట్లో కేవలం 12యూరోలు వుండే ఆ వైన్ ని 18 నుంచి 36యూరోల దాకా వెల వున్నట్టు బాటిల్స్ పై అచ్చు వేయించారు! ఆ రేట్ చూస్తూ వైన్ పుచ్చుకున్న సదరు వ్యక్తులు తమ మెదళ్లలో టేస్ట్ అదిరిపోయినట్టుగా ఫీలయ్యారట! కాని, నిజంగా వారు ప్రతీసారీ తాగింది 12యూరోలు విలువ చేసే మామూలు వైనే!   బాటిల్ పై వున్న రేటు చూసి ఒకే రకమైన వైన్ని రకరకాలుగా ఎందుకు ఫీలయ్యారు? ఎంత ఎక్కువ రేటు వుంటే అంత టేస్టీగా వున్నట్టు ఎందుకు అనిపించింది? ఎమ్ఆర్ఐ స్కాన్ లో తేలింది ఏంటంటే… వైన్ తీసుకున్న వారి మెదళ్లలో కొన్ని ప్రత్యేక భాగాల్లో అదిక ధర కారణంగా చలనం వచ్చిందట! తాము తాగుతున్నది కాస్ట్ లీ వైన్ అనే ఫీలింగ్ కారణంగా వారికి టేస్ట్ కూడా బావున్నట్టు అనిపించిందట! ఈ కారణంగానే కొన్ని కంపెనీలు కావాలని అదిరిపోయే లేబుల్స్ పెట్టి, గొప్ప గొప్ప బ్రాండ్ నేమ్స్ చూపించి అధిక ధర వసూలు చేస్తాయని రీసెర్చర్స్ అంటున్నారు!   మనిషి సుఖం, దుఃఖం, కష్టం, నష్టం అన్నీ మనసులోనే వుంటాయని మన పూర్వులు ఎప్పుడో చెప్పారు. పాశ్చాత్యులు కూడా అన్ని ఫీలింగ్స్ బ్రెయిన్లోనే వుంటాయని ఒప్పుకుంటారు! కానీ, ఈ తాజా పరిశోధనతో మరో కొత్త విషయం తేలింది! అదేంటంటే… మత్తు వైన్ లో కాదు నిజంగా మెదళ్లలో వుంటుంది! దానికి ఒక్కసారి అధిక ధర వల్ల అద్భుతమైన టేస్ట్ లభిస్తుంది అన్న మత్తు ఎక్కించామంటే… ఇక మంచి నీళ్లు తాగినా మందు తాగినట్టే అనిపిస్తుంది! ఇదే మనసు చేసే మాయ అంటే!