మీరు షాపింగ్ ఎందుకు చేస్తున్నారో తెలుసా?

తెల్లారిలేస్తే ఎదో ఒకటి కొనాలనిపిస్తుందా? కనిపించిందల్లా కొనకుండా ఉండలేకపోతున్నారా? అయితే.."కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్" ఉందేమో చూసుకోండి అని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.

ఆ మధ్య ప్రజల షాపింగ్ అలవాట్లు ఎలా ఉన్నాయో చూద్దామని... స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ "స్కూల్ ఆఫ్ మెడిసిన్" పరిశోధకులు ఓ అధ్యయనం చేశారు. అందులో తేలిన విషయం... ప్రతి 20మందిలో ఒకరికైనా ఈ "కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్" ఉందని... ఏమంత అవసరం లేని వస్తువులని కూడా కొనెయ్యటం, తరుచూ షాపింగ్ మాల్స్ కి వెళ్ళటం, తెల్లారి లేచి ఎదో ఒకటి కొనాలనే తాపత్రయం... ఇదో రుగ్మత స్థాయికి చేరి, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా... ఎన్నో ఇబ్బందులు ఎదుర్కునే స్థాయికి చేరటం గమనించారు. ఆ అధ్యయనంలో ముఖ్యంగా ఆడవారిలో, అలాగే టీనేజ్ వారిలో ఈ డిజార్డర్ ఎక్కువగా ఉందట. మరి మీరు కూడా అవసరానికి షాపింగ్ చేస్తున్నారా లేక అనవసరంగా కేవలం సరదా కోసం షాపింగ్ చేస్తున్నారో తెలుసుకొని జాగ్రత్తపడితే మంచిది.