జగన్ ఈ పేరున్నోళ్లు..ఎందుకిలా ఉంటారు?

 

ఏపీలో మాజీ సీఎం జగన్ పేరు తరచూ వినిపిస్తూనే ఉంటుంది. తన తండ్రి మరణించినప్పటి నుంచీ ఆయన ఏదో ఒక రూపంలో రాజకీయం చేస్తూ జనం నోళ్లలో నానుతూనే వస్తున్నారు. ఓదార్పు యాత్రలు, పాదయాత్రలు, ఇలా రకరకాలుగా హల్ చల్ చేస్తూనే వచ్చారు. అధికారంలోకి వచ్చాక అయ్యగారి అసలు స్వరూపం బయట పడింది. ప్రజావేదిక కూల్చివేతతో మొదలు పెట్టిన జ.. గన్ తర్వాత రాష్ట్ర రాజధాని నిర్మాణం నుంచి మొదలు పెడితే ఆర్ధిక పరిస్థితి చిందర వందర గందరగోళం చేయడం వరకూ ఆ రూటే సపరేటు. 

క్విడ్ ప్రో కో అనే కొత్త విధానం ద్వారా ఏకంగా లక్ష కోట్ల అవినీతికి తెరలేపిన జగన్ తర్వాతి కాలంలో ఇవే కేసులతో జైలుకెళ్లి 16 నెలలు ఉన్నారు. బయటకొచ్చాక.. ఏపీ లో అనేకరకాల రాజకీయం చేసి.. అధికారం చేపట్టారు. ఆపై కొన్ని వందల కోట్ల రూపాయల మేర అవినీతి కార్యకలాపాలకు పాల్పడి.. భారీ ఎత్తున వెనకేసినట్టు చెబుతారు. శాండ్ వైన్ మైన్ అంటూ రంగమేదైనా రాబడి చూసుకోవడమే మెయిన్ కాన్సెప్ట్. ఆ మాటకొస్తే తాను అధికారులతో నిర్వహించే మీటింగులు కూడా ఓట్లా నోట్లా ఇవేవీ రాకుంటే నో అనేస్తారని టాకు. జగన్ ఒక్కడే కాదు ఆయనతో పాటు ఆయన మంత్రి వర్గంలో పని చేసిన వారు కూడా ఏదో ఒక రకంగా అవినీతిలో భాగమయ్యి తలా పాపం తిలాపిడికెడుగా బిహేవ్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో వీరంతా కలసి వరుస పెట్టున జైళ్లకెళ్తున్న దృశ్యాలు మనకు దర్శనమిస్తూనే ఉన్నాయి. 

ఇక్కడ తెలంగాణలో ఆ కొరత తీర్చడానికా? అన్నట్టు మరో జగన్ తయారయ్యాడు. అయితే ఆయన రాజకీయాల్లో లేరు కానీ వారికన్నా మించి అన్నట్టుగా చెలరేగిపోయినట్టు తెలుస్తోంది. కేవలం HCA అనే ఒక క్రికెట్ అసోసియేషన్ నుంచే ఆయన ఏకంగా 800 కోట్ల రూపాయల బీసీసీఐ నిధులను దుర్వినియోగం చేసినట్టు తెలుస్తోంది. ఇటు SRH నుంచి అదనపు టికెట్లను ఆశించడం నుంచి మొదలు పెడితే.. టీవీల కొనుగోళ్ల వరకూ అంతా అవినీతి మయంగా తెలుస్తోంది. 

ఆ మాటకొస్తే తనకున్న రాజకీయ పలుకుబడి అండదండలను అడ్డు పెట్టుకుని అదిపనిగా.. ఈ జగన్మోహనుడు HCAలోకి రాంగ్ ఎంట్రీ ఇవ్వడం మాత్రమే కాదు.. పరి పరి విధాలా ఈ క్రికెట్ అసోసియేషన్ ని కంపు కంపు చేసినట్టు ఆరోపిస్తోంది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. ఈ తెలంగాణ జగన్ కేవలం HCAలో ఉన్నందుకే ఇంత పెద్ద మొత్తంలో మేస్తే.. ఆయనే గనక రాజకీయాల్లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తే పరిస్థితేంటన్న ప్రశ్న వినిపిస్తోంది. అసలా పేరే అలాంటిది.. ఎటు నుంచి ఎటు చూసినా.. అవినీతిలో అందనంత ఎత్తుకు ఎదగాల్సిందే అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి సర్వత్రా.