పాలమూరు ప్రజలు అన్నం పెడితే..కేసీఆర్ సున్నం పెట్టారు : సీఎం రేవంత్‌రెడ్డి
posted on Jul 18, 2025 6:42PM
.webp)
పాలమూరు జిల్లా అంటే మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి చిన్నచూపని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం జటప్రోలు లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కరీంనగర్ ప్రజలు ఓడించడానికి సిద్దమైతే కేసీఆర్ మహబూబ్‌నగర్‌కు వలస వచ్చారని సైటైర్లు వేశారు. కేసీఆర్‌ను కడుపులో పెట్టుకొని చూస్తే జిల్లాకు ఆయన చేసిందంటని ప్రశ్నించారు. పదేళ్లు సీఎంగా ఉన్నా పైసా పనికూడా చేయలేదన్నారు.
2023లో కాంగ్రెస్ పాలమూరు జిల్లాలో 12 సీట్లు ఇచ్చారని, మరో రెండు గెలిచి ఉంటే ఇంకొక మంత్రి పదవి అదనంగా వచ్చేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్న.. మా పాలమూరు ప్రాజెక్టులకు అడ్డం పడొద్దు. మీరు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సమానంగా అభివృద్ధి చేందాలనే ఆలోచనతో ఉన్నది నిజమే అయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేసి మా ప్రాజెక్టులు పూర్తయ్యేలా ఉదారంగా ముందుకు వచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్న. మీరు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కల్వకుర్తి ప్రాజెక్టు మొదలుపెట్టారు. మీరు సీఎంగా ఉన్నప్పుడే బీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టులు వచ్చాయిని రేవంత్‌రెడ్డి తెలిపారు.
మా పాలమూరు బిడ్డలు కృతజ్ఞత ఉన్నవారు. మీ మేలు ఎప్పటికి మర్చిపోమన్నారు. మా విజ్ఞప్తులు మీరు వినకపోతే పోరాటాలు ఎలా చేయాలో పాలమూరుకు తెలుసు. మాకు పౌరుషం ఉంది. పోరాడి సాధించుకునే శక్తి ఉంది. ఈ పోరాటానికి నాయకత్వం నేను వహిస్తాను’ అన్నారు. అక్కడి సూర్యుడి ఇక్కడ ఉదయించినా, ఇక్కడి సూర్యుడు అక్కడ ఉదయించినా పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు