పవన్ కళ్యాణ్ ఈవెంట్ కి కాంగ్రెస్ మంత్రులు!
on Jul 18, 2025
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నుంచి వస్తున్న మొదటి సినిమా 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu). జూలై 24న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ పీరియాడిక్ ఫిల్మ్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. జూలై 21న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అయితే ఈ ఈవెంట్ కి రానున్న గెస్ట్ ల లిస్ట్ హాట్ టాపిక్ గా మారింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం తరపున పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అలాంటి పవన్ సినిమా వేడుకకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు హాజరు కానున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది. 'హరి హర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, కర్ణాటకకు చెందిన పలువురు మంత్రులు రానున్నారని తెలుస్తోంది. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరవుతున్నట్లు సమాచారం. అలాగే కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రేను స్వయంగా నిర్మాత ఎ.ఎం. రత్నం వెళ్ళి అహ్వాహించారు. వీరితో పాటు ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ హాజరవుతారట.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినీ పరిశ్రమ నుంచి తక్కువమందే పాల్గొంటారని వినికిడి. దర్శకులు త్రివిక్రమ్, సుజీత్, హరీష్ శంకర్ వంటి వారు హాజరయ్యే అవకాశముంది అంటున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
