సెటప్ బాక్స్‌ల గడువు పై కేంద్రానికి సీఎం లేఖ

 

kiran seeks extension of set top box deadline, cm kiran seeks extension of set top box

 

 

డిజిటలైజేషన్‌పై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం కేంద్రానికి లేఖ రాశారు. హైదరాబాద్, విశాఖలలో కేబుల్ వినియోగదారులు ఇంకా సెటప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకోలేదని, గడువును మరో నెల రోజుల పాటు పొడిగించాలని కోరుతూ ఆయన లేఖ రాశారు. కేంద్రప్రభుత్వం కేబుల్ ప్రసారాలను డిజిటలైజేషన్ చేయాలని జీవో జారీచేస్తూ ఈనెల 31 వరకు గడువు విధించిన విషయం తెలిసిందే.

 

సీఎం కిరణ్ కేంద్రానికి రాసిన లేఖపై ఈ సాయంత్రం గడువు పెంచేదీ, లేనిదీ తెలియనుంది. హైదరాబాద్‌లో కేబుల్ వినియోగదారులు 100శాతం సెటప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకున్నట్లు కేంద్రం అభిప్రాయపడింది. ఇంకా గడువు పెంచేది లేదన్నట్లు సమాచారం. ఇదే వంకతో సెటప్ బాక్స్‌ల ధరలను విపరీతంగా పెంచివేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu