పార్లమెంటరీ బోర్డులో నరేంద్ర మోడీకి చోటు

 

 

Narendra Modi  BJP parliamentary board, Narendra Modi  BJP, Narendra Modi PM

 

 

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ కొత్త పార్లమెంటరీ బోర్డును ప్రకటించారు. ఇందులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి పదవి కీలక లభించింది. పార్టీలో అత్యున్నత నిర్ణాయక కమిటీ అయిన పార్లమెంటరీ బోర్డులో మోడీకి చోటు దక్కింది. పదకొండు మంది సభ్యుల ఈ కమిటీలో ఆరేళ్ల అనంతరం నరేంద్ర మోడీకి చోటు కల్పించారు.

 

బీజేపీ ప్రధాన కార్యదర్శులుగా పార్లమెంటు సభ్యుడు వరుణ్ గాంధీతో పాటు మోడీ సలహాదారుడు అమిత్ షా, మురళీధర రావులను నియమించారు. అలాగే స్మృతి ఇరానీ, ముక్తార్ అబ్బాస్ నక్వీ, ప్రభాత్ ఝా, ఉమా భారతిలకు బీజేపీ ఉపాధ్యాక్షులుగా స్థానం కల్పించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఇందులో చోటు లభించలేదు.

 

మహిళా మోర్చా అధ్యక్షురాలుగా సరోజ్ పాండే ఎంపికయ్యారు. పార్లమెంటరీ సెంట్రల్ బోర్డులో వెంకయ్య నాయుడుకు చోటు లభించింది. కాగా, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మురళీధర రావు స్వంత జిల్లా కరీంనగర్. క్రమశిక్షణ కమిటీలో విశాఖకు చెందిన హరిబాబుకు చోటు దక్కింది.