ఆ కోడిపుంజు నిలువెల్లా బంగారమే!

వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి అన్నది సామెత. ఇప్పుడా సామెతకు చూస్తే భీమవరం కోడిపుంజునే చూడాలి అని చేర్చుకోవాలి. ఎందుకంటే భీమవరంలో ఓ కోడి పుంజుకు దాని యజమాని పులిగోరు సహా బంగారు నగలు చేయించారు. ఇప్పుడు అక్కడంతా బంగారు కోడి పుంజు వచ్చెనండీ అంటూ పాడుకుంటున్నారు.  

ఔను ఆ కోడి పుంజు బంగారు ఆభరణాలు,   పులి గోరుతో దర్జా ఒలకపోస్తోంది .భీమవరం దుర్గాపురంలో జరిగిన కోడిపందాలలో నిలువెల్లా బంగారం ధరించిన  కోడిపుంజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ పుంజు యజమాని తన  కోడిపుంజును 15 కాసుల బంగారు గొలుసు, పులిగోరుతో ప్రత్యేకంగా అలంకరించాడు.

ఆ కోడి పుంజుపై ఉన్న నగల విలువ 50 లక్షల రూపాయకు పైనే ఉంటుందని అంచనా.   జీడిపప్పు బాదం, పిస్తా వంటి శక్తివంతమైన ఆహారంతో మేపి మరీ పందేలకు సిద్దమైన ఆ కోడి పుంజు  కాలికి కోడికత్తి కట్టుకొని పందెంలో దిగి ఘనవిజయాన్ని సాధించింది. ఈ ప్రత్యేక బంగారు పులిగోరు కోడిని చూచేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోడి పందేల కు మించి ఈ కోడి పుంజే సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu