మేడారం అభివృద్ధి పనుల పైలాన్ ను ఆవిష్కరించిన సీఎం రేవంత్

మేడారం మహాజాతర ఏర్పాట్లు శరవేగంతో జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే మేడారంలో  ఆధునీకరించిన గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం (జనవరి 19) ప్రారంభించారు.  అలాగే మేడారం అభివృద్ధి పనుల పైలాన్ ను ఆవిష్కరించి, అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి వన దేవతలు సమ్మక్క,  సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన మనవడితో కలిసి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కు తీర్చకున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏడాది మేడారం మహాజాతర కోసం ప్రభుత్వం 251 కోట్ల రూపాయలతో ఆలయ ప్రాంగణం అభివృద్ధి పనులను చేపట్టిన సంగతి తెలిసిందే.  

ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతర ఈ నెల 28 నుంచి నాలుగు రోజుల పాటు అంటే జనవరి 31 వరకూ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా మహాజాతర ప్రాంగణం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణ కుంభమేళాగా చెప్పబడే మేడారం జాతర కోసం  భారీ నిధులతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ పనులను అధికారులు అత్యంత వేగంగా పూర్తి చేశారు.  

 గిరిజన సంప్రదాయాలకు , ఆచారాలకు ఎటువంటి భంగం కలగకుండా, వనదేవతల పూజారుల సూచనల మేరకు  ప్రధాన గద్దెల ప్రాంగణాన్ని భారీగా విస్తరించారు.  గ్రానైట్ రాళ్లతో అద్భుతమైన ప్రాకారాన్ని నిర్మించారు.  ప్రతి గద్దెకు ఎనిమిది పిల్లర్ల చొప్పున మొత్తం 32 రాతి పిల్లర్లతో గద్దెల ఆధు నీకీకరణ చేశారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu