గర్భిణీలకు సాయం.. 'కేసీఆర్ కిట్' ప్రారంభం..
posted on Jun 3, 2017 1:08PM
.jpg)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గర్భిణీలకు సాయం అందించే నేపథ్యంలో 'కేసీఆర్ కిట్' కు శ్రీకారం చుట్టారు. పాతబస్తీలోని పేట్లబుర్జు ఆస్పత్రిలో ఈ పథకాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఈ కిట్ లో మొత్తం 16 వస్తువులు ఉంటాయి. ఇంకా వాటిలో పాటు.. మగ శిశవు పుడితే 12 వేల రూపాయిలు.. ఆడపిల్ల పుడితే రూ. 13 వేల రూపాయిలు ఆర్థిక సాయాన్ని అందజేస్తారు. కాగా మూడు విడుతల్లో ఆర్థిక సాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని ఆయన అన్నారు. ఆయన వెంట కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతదితరులు ఉన్నారు.
కేసీఆర్ కిట్..
కిట్ లో తల్లికి రెండు చీరలు, చిన్నపిల్లలకు రెండు డ్రెస్‌లు, డైపర్లు, బేబీ ఆయిల్, బేబీ షాంపూ, తల్లీపిల్లకు వేరువేరుగా సబ్బులు, చిన్న పరుపు, దోమతెర తదితర వస్తువులను కిట్‌లో పొందుపర్చారు. కాగా కెసిఆర్ కిట్ విలువ రూ.2వేలు.