పేట్రేగిన ఉగ్రవాదులు.. ఆర్మీ కాన్వాయ్ పై దాడి...


జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో ఇప్పటికే పాక్ దాడులు జరుపుతుంటే ఇప్పుడు ఉగ్రవాదులు కూడా రెచ్చిపోతున్నారు. భారత సైన్యాన్ని టార్గెట్‌ చేసుకుని దాడికి పాల్పడ్డారు. జమ్మూ కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని ఖాజీగండ్ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఆర్మీ కాన్వాయ్ ఉగ్రదాడి జరిపారు. ఈ దాడిలో ఆరుగురు జవాన్లు గాయపడినట్టు సమాచారం. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ముష్కరులపైకి ఎదురుకాల్పులు జరిపినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని, దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియజేస్తామని అధికారులు చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu