బట్ట తలకి మంచి రోజులు....

 

 

 

నెత్తిమీద వెంట్రుకలకీ నడకలోని ఆత్మవిశ్వాసానికి లింకేంటి అనేది తెలియాలంటే బట్టతల బాధితులను మాత్రమే అడగాలి. అయితే ఇప్పుడు వారికీ సంతోషం కలిగించే వార్తను దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మోసుకొచ్చారు. అదేమిటంటే కారణమయ్యే జన్యువుల ఆచూకిని తాము కనిపెట్టామని,దానిలోని మార్పులను కూడా గుర్తించామని వీరు చెబుతున్నారు. డబ్ల్యూఎన్టీ 7 బి అనే జన్యువు వెంట్రుకలు పెరిగేందుకు ప్రధానంగా దోహదపడుతుందటున్న ఈ పరిశోధకులు... ఏఎ జన్యువులలోని మార్పుల్ని కనుక అడ్డుకుంటే వెంట్రుకలకి పునర్జన్మ ఇవ్వోచ్చంటున్నారు. పోన్లెండి ఈ పరిశోధకుల పుణ్యమాని నెత్తి మీది మైదానాలు మాయమై ఆత్మవిశ్వాసం సొంతమైతే అంతకన్నా కావల్సిందేముంది ?